శ్రీసత్యను నమ్మని శ్రీహాన్‌, ఇనయ పరువు మొత్తం పాయే! | Bigg Boss Telugu 6: Inaya, Sri Satya Fully Scared in Ghost Task | Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: దెయ్యానికే దడ పుట్టించిన రేవంత్‌! శ్రీసత్య, ఇనయ పరువు పాయే..

Published Thu, Dec 8 2022 11:18 PM | Last Updated on Fri, Dec 9 2022 7:05 AM

Bigg Boss Telugu 6: Inaya, Sri Satya Fully Scared in Ghost Task - Sakshi

Bigg Boss 6 Telugu, Episode 96: టాస్కుల్లో, నామినేషన్స్‌లో కయ్యానికి కాలు దువ్వే కంటెస్టెంట్లు దెయ్యం పేరెత్తితే చాలు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆదిరెడ్డి, శ్రీహాన్‌ ఎంత ఘోరంగా వణికిపోయారో నిన్ననే చూశాం. నేడు మిగతా ఇంటిసభ్యుల వంతు వచ్చింది. మరి వారు భయపడ్డారా? భయపడినా సరే గెలిచారా? అనేది నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చూద్దాం..

కన్ఫెషన్‌ రూమ్‌లోకి రమ్మని శ్రీసత్యకు పిలుపు వచ్చింది. అప్పటిదాకా మిగతావాళ్ల భయాన్ని చూసిన నవ్విన ఆమె తన వంతురాగానే ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. తలుపు దాటి లోపలకు వెళ్లడానికి తెగ భయపడిపోయింది. కన్ఫెషన్‌ రూమ్‌లోకి రాకపోతే డబ్బులు కట్‌ అవుతాయని బిగ్‌బాస్‌ హెచ్చరించినా ఆమెకు ఒక్క అడుగు ముందుకు వేయడానికి కూడా ధైర్యం చాల్లేదు. ఎంతసేపటికీ అలా డోర్‌ దగ్గరే తచ్చాడుతూ ఉండటంతో లక్ష రూపాయలు కోల్పోయారని చెప్పాడు బిగ్‌బాస్‌. అనవసరంగా డబ్బులు పోయాయని తెగ ఫీలైన రేవంత్‌ శ్రీసత్యపై అరిచాడు.

బిగ్‌బాస్‌ ఇంటిసభ్యులకు బిగ్‌ బాంబ్‌ అనే మరో ఛాలెంజ్‌ ఇచ్చాడు. ఇందులో కీర్తి, శ్రీసత్య, రేవంత్‌ పోటీపడ్డారు. మిగతా హౌస్‌మేట్స్‌ ఏకాభిప్రాయంతో ఇనయ గెలుస్తుందని భావించారు, కానీ అక్కడ శ్రీసత్య విజయం సాధించింది. ఇంటిసభ్యుల అంచనా బోల్తా కొట్టడంతో రూ.64,900 గెలుచుకునే ఛాన్స్‌ కోల్పోయారని ప్రకటించాడు బిగ్‌బాస్‌. నేను గెలుస్తానని నా ఫ్రెండ్‌వైన నువ్వెందుకు నమ్మలేదంటూ శ్రీహాన్‌ను నిలదీసింది శ్రీసత్య. మూడు ఛాలెంజ్‌లు నేనే గెలిచినా కూడా నన్ను నమ్మాలనిపించలేదా? అని సూటిగా ప్రశ్నించింది. ఆ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నీళ్లు నమిలాడు శ్రీహాన్‌.

తర్వాత ఇంటిసభ్యులందరికీ మనీ టవర్‌ ఛాలెంజ్‌ ఇవ్వగా ఇందులో రూ.41,500 గెలుచుకున్నారు. అనంతరం వెలిగించు - విజయం సాధించు గేమ్‌లో శ్రీహాన్‌, శ్రీసత్య పోటీపడ్డారు. హౌస్‌మేట్స్‌ ఊహించినట్లుగా శ్రీహాన్‌ గెలవడంతో రూ.1,23,400 కైవసం చేసుకున్నారు. ఇప్పటిదాకా గెలిచిన ఛాలెంజ్‌ల మొత్తాన్ని కలపగా ప్రైజ్‌మనీ రూ.46,00,000కి చేరింది. దీంతో హౌస్‌మేట్స్‌ మరీ ముఖ్యంగా రేవంత్‌ పండగ చేసుకున్నాడు. తర్వాత దెయ్యం టాస్కులో ఎంతో ధైర్యంగా చీకటి గదిలో అడుగు పెట్టిన ఇనయ అరుపులు, కేకలతో కన్ఫెషన్‌ రూమ్‌ను దద్దరిల్లేలా చేసింది.

అంత భయంలోనూ ఎలాగోలా బిగ్‌బాస్‌ చెప్పిన షూ తీసుకుని బయటకు రావడం విశేషం. ఈ టాస్క్‌ గెలవడంతో రూ.12,000 లభించాయి. నెక్స్ట్‌ కన్ఫెషన్‌ రూమ్‌లో అడుగుపెట్టిన రేవంత్‌ భయపడ్డాడో, భయపడ్డట్లు నటించాడో తెలీదు కానీ దెయ్యం గొంతునే ఇమిటేట్‌ చేసి అవలీలగా సూర్య కప్పు తీసుకుని వచ్చేశాడు. ఈసారి రూ.10,000 లభించాయి. ఇక దెయ్యం టాస్కులో కీర్తి మాత్రమే మిగిలింది. మరి తనకేమైనా మినహాయింపు ఉందా? లేదంటే రేపటి ఎపిసోడ్‌లో తనకు కూడా టాస్క్‌లో వెల్‌కమ్‌ చెప్తారా? చూడాలి!

చదవండి: నాన్న చనిపోయాక ఆఫీస్‌ బాయ్‌గా మారాను: రాజశేఖర్‌
నా ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కు టికెట్లు కావాలి.. హీరో ఆన్సరేంటో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement