
ఎదుటివాళ్ల బలహీనత మీద కొట్టడమే గేమ్.. ఇప్పుడిదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు. మిషన్ పాజిబుల్ గేమ్‌లో శారీరక బలంతో పాటు బుద్ధి బలం కూడా వాడమన్నాడు బిగ్‌బాస్. ఇంకేముంది రెడ్ టీమ్ రెండో పాయింట్ మాత్రమే పట్టుకుని వేలాడింది. ఇప్పటికే ఒకటీరెండుసార్లు సిగరెట్ల విషయంలో బాలాదిత్యను టార్చర్ పెట్టిన గీతూ మరోసారి ఈ గేమ్‌లో అతడిని చెడుగుడు ఆడుకుంది. అటు శ్రీహాన్, శ్రీసత్య.. ఇనయను రెచ్చగొడుతూ ఆమెను వెక్కిరిస్తూ మరీ వింతగా ప్రవర్తిస్తున్నారు. ఓటమిని సహించలేని రేవంత్ ఎదుటివాళ్లను చులకన చేసి మాట్లాడుతూ తన నోటిదురుసు ప్రదర్శించాడు.
ఇక తమ మీద నిందలు వేసిన ఇనయను ఎమోషనల్‌గా హింసించింది శ్రీసత్య. ప్లేటు మీద సూర్య పేరును చెరిపేసింది. సూర్య ప్లేటు ఎవరైనా చూశారా? అని ఇనయ అడగ్గా.. నువ్వు వాడుతున్నావనే ఆ పేరు చెరిపేశారు అని బాలాదిత్య ఉన్నమాట చెప్పాడు. దీంతో హర్టయిన ఇనయ తినాలని లేదు అంటూ ఓ మూలన ఏడ్చుకుంటూ కూర్చుంది. మెరీనా, కీర్తి ఆమెకు సూర్య పేరు చెప్పి తినిపించారు. అయితే శ్రీసత్య మాత్రం.. అంత ప్రేముంటే మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యి సూర్య వాళ్ల ఇంట్లో కూర్చోమను అని చిరాకుపడింది. ఇకపోతే బ్లూ టీమ్ తమ సీక్రెట్ టాస్క్‌ను విజయవంతం చేసే పనిలో పడింది.
చదవండి: బాలాదిత్య చేతులెత్తి మొక్కినా కనికరించని గీతూ
కాంతార మూవీ ఫస్ట్ హీరో నేను కాదు: రిషబ్ శెట్టి
Comments
Please login to add a commentAdd a comment