
'ఇనయ.. యూ ఆర్ ఎలిమినేటెడ్..' నాగార్జున ఈ మాట అనడాన్ని కలలో కూడా ఊహించుకోలేకపోతున్నారా? కానీ జరిగేది ఇదేనని తెలుస్తోంది. టాప్ 2లో ఉంటుందనుకున్న ఇనయను అర్ధాంతరంగా ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనక జరిగితే ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.
బిగ్‌బాస్‌కు వచ్చాక అభిమానులను సంపాదించుకున్నవారిలో ఇనయ ఒకరు. 'మై లైఫ్ మై రూల్స్' అనే ఆమె 'మై గేమ్ మై స్ట్రాటజీస్' అన్నట్లుగా ఆడింది. తన ఆటతీరుకు, ఎవరినైనా ఎదురించే ధైర్యానికి ఎంతోమంది ఫిదా అయ్యారు. తనలో ఉన్న ఫైర్‌ను అలాగే కంటిన్యూ చేస్తే టాప్ 3లో చోటు దక్కించుకోవడం ఖాయం అనుకున్నారంతా.
అన్నట్లుగానే నామినేషన్స్‌లో ఉన్న ప్రతిసారి ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు. ఈ వారం కూడా ఆమె నామినేషన్‌లోకి వచ్చింది. ఎప్పటిలాగే అనధికారిక పోల్స్‌లో మంచి ఓట్ల శాతంతో రెండు, మూడు స్థానాల్లో తచ్చాడుతోంది. శ్రీసత్య, కీర్తి చివరి ప్లేస్ నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బిగ్‌బాస్ ఈ ఇద్దరిలో ఒకరిని పంపిచేస్తాడనుకుంటే ఎవరూ ఊహించని కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశాడట. అమ్మాయిల్లో ఫిజికల్ టాస్క్‌లలో తోపు పర్ఫామెన్స్ ఇచ్చిన ఇనయను ఎలిమినేట్ చేసినట్లు ఓ వార్త లీకైంది. రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఇనయను సడన్‌గా ఎలిమినేట్ చేయడమేంటని అప్పుడే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఒకవేళ బిగ్‌బాస్ కావాలని తప్పుడు సమాచారాన్ని లీక్ చేశాడా? అసలు ఈవారం శ్రీసత్య, కీర్తి, ఇనయలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment