Bigg Boss 6 Telugu, Episode 79: రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లు కడుపు మాడ్చుకునే పరిస్థితి వచ్చింది. అతడు రేషన్ మేనేజర్ అవడమేంటో కానీ పాలు, అన్నం.. ఇలా అన్నింటికీ కొలతలు పెడుతూ ఇంటిసభ్యులకు సరిగా తిండి పెట్టడం లేదు. గత వారం కెప్టెన్‌గా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎన్ని కప్పుల బియ్యం వండేదానివని ఫైమాను అడిగాడు ఆదిరెడ్డి. అందుకామె ఐదు కప్పులని చెప్పింది. కానీ రేవంత్ నాలుగు కప్పులు మాత్రమే చాలంటున్నాడు. అరకప్పు బియ్యం ఎక్కువ వేయమని శ్రీహాన్ చెప్పినా వినట్లేదని చికాకు పడ్డాడు ఆది. బియ్యం అయిపోయినప్పుడు అడిగితే ఇస్తున్నారని చెప్పింది ఫైమా. ఇదే విషయంపై రేవంత్‌ను నిలదీసింది.
అతడు మాత్రం సరిపోతుందా? సరిపోదా? అనవసరం అని, రేషన్ ఎంతుందో దాన్ని బట్టే వండుతానని వితండవాదం చేశాడు. అలాగైతే ఎవరికీ ఆకలి తీరదన్నాడు శ్రీహాన్. నీ కెప్టెన్సీలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అందరి కడుపు నింపడానికి ఆలోచించట్లేదన్నాడు. మరోపక్క సమయానికి వచ్చి పాలు తాగకపోతే ఆ పూట పాలు మళ్లీ ఇచ్చేదే లేదని రూల్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది ఇనయ. ఇలా ఎప్పటిలాగే రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఫుడ్ గొడవలు జరిగాయి.
అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు సభ్యుల ఫొటోలను షెడ్డర్‌లో వేయాల్సి ఉంటుంది.
► రోహిత్.. శ్రీహాన్, ఫైమా
► శ్రీసత్య.. రాజ్, రోహిత్
► రాజ్.. శ్రీహాన్, శ్రీసత్య
► కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్య
► ఫైమా.. రోహిత్, ఇనయ
► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి
► ఇనయ.. ఫైమా, రాజ్
► ఆదిరెడ్డి.. ఇనయ, శ్రీహాన్
► రేవంత్.. ఫైమా, ఆది రెడ్డి
రాజ్ మూడు వారాలుగా సేవ్ అవుతున్నందున అతడిని నామినేట్ చేస్తున్నానంది శ్రీసత్య. ఇందుకు ఒప్పుకోని బిగ్‌బాస్ సరైన కారణం చెప్పమని గద్దించాడు. దీంతో శ్రీసత్య అతడి గేమ్ కనిపించలేదని జవాబు చెప్పి జారుకుంది. ఇక ఇనయ.. తనను గేమ్‌లో పర్సనల్‌గా అటాక్ చేసి తన గేమ్ కనిపించకుండా చేసిన ఫైమాను నామినేట్ చేస్తున్నాననంది. రాజ్ నామీద పగ పెంచుకుని నన్ను నామినేట్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. వీరిద్దరూ తన ఫ్రెండ్స్ అని, వీళ్లను నామినేట్ చేయాల్సి వచ్చేంత దూరం పెరుగుతుందని ఊహించలేదంటూ ఏడ్చింది. వాళ్లు తనను ఫ్రెండ్ అనుకోలేదంటూ బాధపడింది.
ఫైనల్‌గా ఈ వారం శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయ నామినేషన్‌లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం కిచెన్‌లో మళ్లీ ఫైట్ జరిగింది. రేవంత్‌ను ఆలూ, ఉల్లిగడ్డ ఇవ్వమని కొందరు అడగ్గా కుదరదని తేల్చి చెప్పేశాడు కెప్టెన్. మీరేమనుకున్నా నేనేం చేయలేనని చేతులెత్తేశాడు. తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టైం వచ్చింది.
హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసి కెప్టెన్‌గా గెలిపించినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేయకపోతే సోలో ప్లేయర్, ఫేవరిటిజం అని పెద్ద స్టేట్‌మెంట్స్ పాస్ చేస్తారు. మీరు ఆడియన్స్ నుంచి సింపతీ కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?
ఒకటీరెండు రోజుల వరకే సింపతీ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు. కళ్ల ముందే ఫేవరిటిజం కనిపించినప్పుడు కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది.
ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడరని ఎవరిని నమ్ముతున్నారు?
రాజ్.. నాగురించి చెడుగా ఎవరూ మాట్లాడరు. మొదట్లో నా రియల్ ఫ్రెండ్స్ సూర్య, ఫైమా, ఇనయ. కానీ ఇనయ నా వెనక గోతులు తవ్వుతుందేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. స్నేహితుడిగా ఫీలైన రాజ్ అలా అనడంతో ఇనయ ఏడ్చేసింది. సూర్య వెళ్లిపోయాక వాళ్లిద్దరే మాట్లాడకుండా దూరం పెట్టి నన్ను శత్రువులా చూస్తున్నారు అని కంటతడి పెట్టుకుంది.
ప్రశ్న: మీరు ఎప్పుడు ఏం చేస్తారనేది తోటి ఇంటిసభ్యులకే అర్థం కావట్లేదు. దీనికి మీ స్పందన ఏంటి?
ఇనయ: మై లైఫ్, మై రూల్స్.. నాకు నచ్చినట్లే ఉంటా, అందుకే అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాను.
ప్రశ్న: మీ క్లోజ్ ఫ్రెండ్ మీ గురించి బ్యాక్‌స్టాబింగ్, బిచింగ్ చేస్తుంది. మీకు తెలిస్తే ఏం చేస్తారు?
శ్రీసత్య: ముందు బాధపడతాను. నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత క్లోజ్ అనుకుంటున్నారనేది ముఖ్యం. బహుశా వాళ్లకు నేనంత క్లోజ్ కాదేమో! నమ్మినవాళ్లు నా వెనకాల మాట్లాడితే నెక్స్ట్ టైం నా దగ్గరకు రానివ్వను.
ఇక నాగార్జున చెప్పిన టాస్క్‌ను అమలు చేసే పనిలో పడ్డారు శ్రీసత్య, ఫైమా. అర్ధరాత్రి మేకప్ వేసుకుని రాజ్, శ్రీహాన్‌ను భయపెట్టి మిషన్ కంప్లీట్ చేశారు.
చదవండి: మెరీనా పారితోషికం ఎంతో తెలుసా?
నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్
Comments
Please login to add a commentAdd a comment