Raja Sekhar
-
కోర్టు ధిక్కరణ కేసు.. సాయంత్రం వరకు కోర్టులో నిలబడండి: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కారం కేసులో హైకోర్టులో బుధవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు పాఠశాల విద్యాశాఖ గత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఇంటర్మీడియెట్ విద్య గత కమిషనర్ వి.రామకృష్ణకు సింగిల్ జడ్జి జైలు శిక్ష విధించడం, వారు క్షమాపణలు కోరడంతో జైలుశిక్ష ఉత్తర్వులను సవరించి కోర్టు పని గంటలు ముగిసే వరకు కోర్టులోనే ఉండాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలను ధర్మాసనం నిలుపుదల చేయడం చకచకా జరిగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా వీఈసీ జూనియర్ కాలేజీలో పార్ట్‌టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న సాంబశివరావు సర్వీసును క్రమబద్ధీకరించాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ 2020లో ఆదేశాలు జారీ చేయగా.. అప్పటి విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, అప్పటి ఇంటర్మీడియెట్ విద్య కమిషనర్ రామకృష్ణ అమలు చేయలేదు. దీంతో వారిద్దరిపైనా సాంబశివరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ దేవానంద్ ఇరువురు అధికారులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాల అమలులో జాప్యం చేశారని ప్రాథమికంగా తేల్చారు. శిక్ష విధించేందుకు వీలుగా వారిద్దరినీ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణ, రాజశేఖర్ బుధవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని న్యాయమూర్తి ప్రశ్నించగా.. వారు క్షమాపణలు తెలిపారు. ఈ క్షమాపణలు సదుద్దేశంతో చెప్పడం లేదంటూ.. ఇరువురికీ నెల రోజుల చొప్పున జైలుశిక్ష, చెరో రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ స్పందిస్తూ.. జైలు శిక్ష ఆదేశాల అమలును రెండు రోజులపాటు నిలుపుదల చేయాలని అభ్యర్థించగా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోర్టు హాలులోనే ఉన్న ఇరువురు అధికారులు మరోసారి బేషరతు క్షమాపణలు తెలపడంతో వారి వయసు, ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దేవానంద్ వారికి విధించిన జైలు శిక్షను సవరించారు. కోర్టు పనివేళలు ముగిసేంత వరకు కోర్టు హాలులో ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానా మాత్రం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, సింగిల్ జడ్జి జస్టిస్ దేవానంద్ ఇచ్చిన ఆదేశాలపై ఇరువురు అధికారులు ధర్మాసనం ముందు వేర్వేరుగా కోర్టు ధిక్కార అప్పీళ్లు దాఖలు చేయగా.. న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ధర్మాసనం అత్యవసర విచారణకు అంగీకరించింది. ఇరుపక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (రెవెన్యూశాఖలో కలకలం.. ముగ్గురు తహసీల్దార్ల సస్పెన్షన్) -
ముద్దు పెట్టుకోబోయిన నాగ్, మెలికలు తిరిగిన ఫైమా
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేలో అవార్డుల కార్యక్రమం జరిగింది. ఓ ఐదు అవార్డులను ప్రవేశపెట్టిన నాగ్ వాటికి ఎవరు అర్హులో చెప్పాలని ఫైనలిస్టులను ఆదేశించాడు. మొదటగా బెస్ట్ చెఫ్ అవార్డును ప్రవేశపెట్టాడు. ఇది మెరీనాకు సరిగ్గా సూటవుతుందన్నాడు రేవంత్. అందరికీ వంట చేసి పెడుతూనే తను గేమ్ ఆడేదని చెప్పాడు. దీంతో ఆ అవార్డును మెరీనాకు అందించాడు హోస్ట్. తర్వాత బెస్ట్ డ్యాన్సర్ అవార్డును ఫైమాకు ఇవ్వాలన్నాడు ఆదిరెడ్డి. ఆమె స్టేజీపైకి రాగానే చేతికి ముద్దు పెడతానంటూ ఆటపట్టించాడు నాగ్. దెబ్బకు హడలిపోయిన ఫైమా.. మీరు ముద్దులు ఇస్తే నాకు నిద్ర పట్టడం లేదంటూ దూరం జరిగింది. అనంతరం కీర్తి.. స్లీపింగ్ స్టార్ అవార్డును శ్రీసత్యకు ఇవ్వాలనడంతో నాగ్ దాన్ని ఆమెకు బహుకరించాడు. రోహిత్.. రాజ్ బెస్ట్ గేమర్ అని చెప్పడంతో అతడికి పురస్కారం ఇచ్చాడు నాగ్. శ్రీహాన్.. లవర్ బాయ్ అవార్డుకు అర్జున్ కల్యాణ్ పేరును సూచించాడు. దీంతో అతడు స్టేజీపైకి వెళ్లి అవార్డు అందుకున్నాడు. చదవండి: పెళ్లికూతురి గెటప్‌లోనే గ్రాండ్ ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి బిగ్‌బాస్ 6 గ్రాండ్ ఫినాలే.. లైవ్ అప్డేట్స్ -
చెల్లిని చదివించడం కోసం ఆఫీస్ బాయ్ అవతారమెత్తా
బిగ్‌బాస్ 6 తెలుగు సీజన్లో నెగెటివిటీని కాకుండా గ్రాఫ్‌ను పెంచుకుంటూ పోయిన వ్యక్తి రాజశేఖర్. జనాల ఓట్లు పడ్డప్పటికీ లక్ కలిసిరాకపోవడంతో ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అతడు ఆఫీస్ బాయ్ నుంచి మోడల్‌గా ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శనీయం. మరి ఈ జర్నీ ఎలా సాధ్యమైందో అతడి మాటల్లోనే చదివేయండి.. 'నాది హైదరాబాద్. 2009లో మా నాన్న చనిపోయాడు. నా చెల్లిని చదివించడం కోసం ఆఫీస్ బాయ్‌గా పని చేశాను. కానీ మంచి ఉద్యోగం రావాలంటే చదువు అవసరమని అర్థమైంది. దీంతో ఓపక్క చదువుతూనే మరోపక్క పని చేసేవాడిని. అలా ఆఫీస్ బాయ్‌గా పని చేసిన అదే కార్యాలయంలో రిలేషన్షిప్ మేనేజర్‌గా, సేల్స్ టీమ్ లీడర్‌గా ఎదిగాను. తర్వాత ఏం చేయాలని అనుకున్నప్పుడు మోడలింగ్ ఆలోచన వచ్చింది. 2015లో మోడలింగ్ మొదలుపెట్టాను. 2018లో మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా నిలిచాను. ఎన్నో బ్రాండ్స్‌కు పని చేశాను. కెరియర్ బిల్డ్ చేసుకునే సమయంలో కరోనా దెబ్బ కొట్టింది. టీవీ ప్రాజెక్ట్స్ చేశాను. అప్పుడు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. టాప్ 5లో ఉంటాననుకున్నాను. కానీ కుదరలేదు ' అని చెప్పుకొచ్చాడు రాజ్. చదవండి: ఆ నటుడు నన్ను మోసం చేశాడు: నిర్మాత సంచలన ఆరోపణలు -
బిగ్‌బాస్ ద్వారా రాజ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో అడుగుపెట్టిన 21 మందిలో రాజ్ ఒకరు. మొదట్లో అతడు మాట్లాడటానికి కూడా భయపడటాన్ని చూసి ఎక్కువకాలం ఉండడని అనుకున్నారంతా! కానీ రోజులు గడిచేకొద్దీ తనను తాను మలుచుకుని ధైర్యంగా నిలబడ్డాడు. ఆదిరెడ్డిలాంటివారిని కూడా కరెక్ట్ పాయింట్ చెప్పి నోరు మూయించేంత మాటకారిగా ఎదిగాడు. గీతూతో ఫైట్ చేసిన విధానం కూడా అతడికి ప్లస్ పాయింట్‌గా మారింది. ఇక ఆటలో అయితే ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఆడాడు. దీంతో మొదటి నాలుగు వారాల్లోనే వెళ్తాడనుకున్న రాజ్ పన్నెండు వారాలు ఉండగలిగాడు. నిజానికి ఈ వారం కూడా ఉండేవాడే.. కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను అడ్డుపెట్టుకుని రాజ్‌ను బయటకు పంపించేశారు. నిజానికి గత నాలుగో సీజన్లో ఓట్లతో చివరి స్థానంలో ఉన్న అవినాష్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో ఆ వారం ఎలిమినేషన్ రద్దయింది. అంతేతప్ప చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న అరియానాను పంపించలేదు. కానీ ఈ సీజన్లో మాత్రం అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఫైమా ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడి సేవ్ అవడంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు. ఇంతకీ రాజ్ పన్నెండు వారాల్లో ఎంత సంపాదించాడని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం రాజ్.. వారానికి రూ.25 వేల నుంచి 30 వేల రూపాయలు అందుకున్నాడట. అంటే మొత్తం 12 వారాలకుగానూ అతడు మూడు లక్షల పైచిలుకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: నరాలు కట్టయ్యాయా? పిచ్చిపిచ్చిగా వాగుతున్నావ్ రేవంత్ మీద నిప్పులు చెరిగిన ఫైమా -
నరాలు కట్టయ్యాయా శివ? నోటికొచ్చింది వాగుతున్నావ్!
హోస్టింగ్ అదిరింది అన్నవారితోనే ఇదేం హోస్టింగ్రా బాబూ అనిపించేలా చేస్తున్నాడు యాంకర్ శివ. బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిబి కెఫెలో ఇంటర్వ్యూ చేస్తాడు శివ. మొదట్లో ఇంటర్వ్యూలను రఫ్ఫాడించిన అతడు రానురానూ వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. అందులోనూ కటువుగా మాట్లాడటం రాని సాఫ్ట్ కంటెస్టెంట్లపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో యాంకర్ శివపై జనాలు మండిపడుతున్నారు. అమాయకపు కంటెస్టెంట్లను ఎందుకంత అవమానపరుస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ శివ బిబి కెఫెలో రాజ్‌తో ఏం మాట్లాడాడు? ఎలాంటి ప్రశ్నలు అడిగాడో చూద్దాం.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలంటే ఆడాలి, మాట్లాడాలి.. ఈ రెండూ జరగకుండానే ఇన్నివారాలదాకా వచ్చావు. అంటే నువ్వు నక్క తోక తొక్కి వచ్చావు అని రాజ్‌ను కించపరిచినట్లుగా మాట్లాడాడు శివ. బిబి కెఫెకు వచ్చిన ఓ వ్యక్తి నువ్వు కెమెరాల నుంచి తప్పించుకుని భలే ఆడావన్నాడంటూ పడీపడీ నవ్వాడు. దీనికి ఏమని సమాధానమివ్వాలో అర్థం కాని రాజ్.. అదే నా గేమ్ అని ఒప్పుకుంటున్నాననగానే శివ మరోసారి నవ్వాడు. ఏమీ ఆడకుండా 12 వారాలు ఉన్నందుకు హ్యాపీగా ఉన్నట్లున్నావంటూ వెటకారంగా మాట్లాడాడు. దీనికి రాజ్.. ఏం మాట్లాడుతున్నావ్ బ్రో, నీకేమైనా నరాలు కట్ అయ్యాయా? అని ప్రశ్నించాడు. అయినా తగ్గని శివ కేవలం లక్ వల్లే ఇన్నివారాలు ఉండగలిగావన్నట్లుగా తనను పదేపదే అవమానించడం గమనార్హం. ఇది చూసిన నెటిజన్లు యాంకర్ శివకేమైనా పిచ్చిపట్టిందా? అని కామెంట్లు చేస్తున్నారు. తనలో ఉన్న మంచి లక్షణాల గురించి మాట్లాడకుండా పదేపదే తనను మానసికంగా దెబ్బ తీయాలని చూడటమెందుకోనని అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రేవంత్ మీద నిప్పులు చెరిగిన ఫైమా అదే అసలైన మైనస్, అందువల్లే రాజ్ ఎలిమినేట్ అయ్యాడా! -
ఆ కంటెస్టెంట్ పరువు తీసిన రాజ్, అతడే విన్నర్ అని వెల్లడి
Bigg Boss Telugu 6, Episode 85: ఎవరు తప్పు చేశారో నిలబెట్టి క్లాసు పీకే నాగార్జున ఈసారి మాత్రం డిఫరెంట్‌గా వారి తప్పొప్పులను వారితోనే చెప్పించాడు. హౌస్‌మేట్స్‌లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో చెప్పమని ఆదేశించాడు నాగ్. ముందుగా రోహిత్ మాట్లాడుతూ.. 'కీర్తి ఎక్కువ బాధపడుతుంది, ఫైమా, శ్రీసత్యలో వెటకారం ఎక్కువ. ఇనయ ఎవరికీ అవకాశమివ్వకుండా మాట్లాడుతుంది, రాజ్ పాయింట్ లేకున్నా అరుస్తాడు, రేవంత్‌కు కోపమెక్కు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు' అంటూ వారిలోని లోపాలను ఏకరువు పెట్టాడు. ఇలా అందరి గురించి చెప్పుకుంటూ పోతే ఎపిసోడ్ సాగదీయాల్సి వస్తుందనుకున్నాడో ఏమోకానీ నలుగురి కంటెస్టెంట్లలోని చెడు లక్షణాలు చెప్తే సరిపోతుందన్నాడు నాగ్. దీంతో ఇనయ మాట్లాడుతూ.. 'శ్రీసత్య గేమ్‌ను లైట్‌గా తీసుకుంటుంది. రేవంత్ ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతున్నాడు. రాజ్ నేనున్నానని చూపించుకోవడానికి అరుస్తాడు. ఆదిరెడ్డి ఆడకుండా కూర్చోవడం కరెక్ట్ కాదు' అని చెప్పింది. కీర్తి వంతు రాగా రేవంత్ అన్న ఓవర్ అగ్రెసివ్, శ్రీసత్య, శ్రీహాన్ వెటకారం, రోహిత్ ఎక్కువ కలవకపోవడం మైనస్ అని చెప్పింది. ఆదిరెడ్డి మాట్లాడుతూ.. 'రేవంత్ బాగా ఆడతాడు, కానీ తాను బాగా ఆడతానని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇనయ చాలా మాటలు వదిలేస్తుంది. శ్రీసత్యకు కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. రోహిత్ గట్టిగా స్పందించరు' అని చెప్పాడు. ఫైమా.. సరేవంత్ కోపం నచ్చదు. ఇనయ మాటతీరు మార్చుకోవాలి. రోహిత్ గేమ్‌లో పెద్దగా పర్ఫామెన్స్ కనిపించట్లేదు. కీర్తి ఎక్కువ ఎమోషనల్ అవుతుందిస అని చెప్పింది. శ్రీసత్య.. రోహిత్ సరైన టైమ్‌కు రియాక్ట్ అవడు. కీర్తి ఏం చెప్పినా వినిపించుకోదు. ఇనయ ఎదుటివాళ్లకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వదు. శ్రీహాన్ గేమ్ కన్నా ఫ్రెండ్షిప్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు అని చెప్పింది. రాజ్ మాట్లాడుతూ.. రోహిత్ గట్టిగా మాట్లాడడు. ఇనయ ప్రతిదానిలో దూరుతుంది. శ్రీహాన్ గేమ్ కన్నా స్నేహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. శ్రీసత్య నామినేషన్లో తను చెప్పాలనుకుంది చెప్పి వెళ్లిపోతుందన్నాడు. ఇక శ్రీహాన్ వంతురాగా రాజ్‌కు కాన్ఫిడెన్స్ తక్కువ. రోహిత్ మంచితనం కొన్నిసార్లు సేఫ్‌గా కనిపిస్తుంది. రేవంత్ కొన్ని స్టేట్మెంట్లు వదిలేస్తాడు. సరదాగా అయినా సరే వద్దని వారించినా అర్థం చేసుకోడు. శ్రీసత్య వేరేవాళ్ల మాట నమ్మి ఫ్రెండ్‌ను దూరం పెట్టొద్దు అని సూచనలిచ్చాడు. రేవంత్.. ఫైమా వెటకారం తగ్గించుకోలేదని, ఆదిరెడ్డి మానిప్యులేటర్ అని, ఇనయ, కీర్తి కావాలని రెచ్చగొడుతారని మనసులో ఉన్న కోపాన్నంతా కక్కేశాడు. అందరూ మాట్లాడింది విన్న నాగ్.. మీలోని చెడు లక్షణాలను సరిచేసుకున్నవారు గెలుపుకు దగ్గరవుతారని సూచించాడు. తర్వాత వంట రాదన్న కీర్తితో ఆలూ ఫ్రై చేయించుకుని మరీ తిన్నాడు నాగ్. అనంతరం ఇంటిసభ్యులతో ఫన్ గేమ్స్ ఆడించాడు. ఇకపోతే నామినేషన్స్‌లో అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు ఫైమా, రాజ్ ఇద్దరే మిగిలారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాజ్ కోసం వాడతానంది ఫైమా. అయితే రాజ్ మాత్రం నువ్వు ఆడి సంపాదించింది నీ కోసమే వాడుకో అని చెప్పాడు. దీంతో ఫైమా దాన్ని వాడకుండా వదిలేద్దామనకుంది. కానీ నాగార్జున మాత్రం.. ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో మీ ఇద్దరే ఉన్నారని, మీలో ఒకరికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడితే మిగతా ఒకరు ఎలిమినేట్ అవుతారని స్పష్టం చేశాడు. అంటే ఓటింగ్‌తో సంబంధం లేకుండా పాస్‌తో గండం గట్టెక్కొచ్చని నొక్కి చెప్పాడు. దీంతో ఫైమా మనసు మార్చుకుని తనకోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడింది. ఫలితంగా ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది. అయితే ఆడియన్స్ ఓట్ల ప్రకారం చివరి స్థానంలో ఉన్న ఫైమా ఎలిమినేట్ అవ్వాలని, కానీ పాస్ సాయంతో ఆమె సేవ్ అయి రాజ్ ఎలిమినేట్ అయ్యాడని ప్రకటించాడు నాగ్. దీంతో ఫైమా, ఇనయ ఎమోషనలయ్యారు. స్టేజీ మీదకు వచ్చిన రాజ్‌తో పంచ్, హగ్స్ గేమ్ ఆడించాడు నాగ్. ఫైమా, ఆది, రోహిత్, రేవంత్‌కు హగ్స్ ఇస్తానని, మిగతా నలుగురికి పంచ్ ఇచ్చాడు. వెళ్లేముందు కంటెస్టెంట్లకు విలువైన సూచనలిచ్చాడు రాజ్. ఫైమా దగ్గర కొంత ఫన్ తక్కువైందని, ఆదిరెడ్డి తను మాట్లాడిందే కరెక్ట్ అనుకుంటాడని, రోహిత్ కొన్ని సందర్భాల్లో మాట్లాడితే బాగుండన్నాడు. రేవంత్‌ది చిన్నపిల్లాడి మెంటాలిటీ అని, అతడు కచ్చితంగా టైటిల్ కొడతాడని ఫిక్సైపోమన్నాడు. శ్రీహాన్ అందరితో గట్టిగా మాట్లాడతాడు, కానీ ఫ్రెండ్స్ తప్పులను గట్టిగా చెప్తే బాగుండన్నాడు. శ్రీసత్యను నామినేషన్లో సరైన పాయింట్లు చెప్పమన్నాడు. ఇనయను టాప్ 5లో చూడాలనుకుంటున్నానని, ఆలోచించి మాట్లాడమని సూచించాడు. హౌస్‌లో కీర్తి తనకెప్పుడూ కనిపించలేదంటూ ఆమె పరువు తీశాడు. ఫైనల్‌గా రాజు ఎక్కడైనా రాజే అంటూ అతడిని పంపించేశాడు నాగ్. చదవండి: రాజశేఖర్ ఎలిమినేషన్‌కు కారణాలివే! నిజానికైతే ఫైమా ఎలిమినేట్ కావాల్సింది! -
అదే అసలైన మైనస్, అందువల్లే రాజ్ ఎలిమినేట్ అయ్యాడా!
మరో మూడు వారాల్లో బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌కు శుభం కార్డు పడనుంది. ఎవరు ఫినాలేకు చేరుకుంటారు? ఎవరు కప్పు కొడతారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో 12 వారం ఎలిమినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వారం రేవంత్, కీర్తి మినహా మిగతా ఏడుగురు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఫైమా, రాజశేఖర్ ఇద్దరూ చివరి రెండు స్థానాల్లో ఉండగా ఫైనల్‌గా రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. అతడి గేమ్ చూసి రాజ్ కచ్చితంగా టాప్ 5లో ఉంటాడనుకున్నారు, కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రాజ్ బయటకు వచ్చేశాడు. ఇంతకీ రాజ్ ఎలిమినేషన్‌కు కారణాలేంటో చూద్దాం.. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లో అడుగుపెట్టిన వ్యక్తి రాజ్. మాటల్లో తడబాటు, ఆటలో వెనకబడటం చూసి అతడు త్వరలోనే ఎలిమినేట్ అవుతాడనుకున్నారంతా! కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తన గ్రాఫ్‌ను నెమ్మదిగా పెంచుకుంటూ వచ్చాడు. మాటల్లో, ఆటల్లో టఫ్ కాంపిటీషన్ ఇస్తూ ముందుకు సాగాడు. తనను చూసి నవ్వినవారితోనే చప్పట్లు కొట్టించుకున్నాడు. అయితే మొదటినుంచీ తనకంటూ ఫ్యాన్ బేస్ లేకపోవడం రాజ్‌కు పెద్ద మైనస్‌గా మారింది. వారాలు గడిచేకొద్దీ కంటెస్టెంట్ల మధ్య పోటీ ఎక్కువవుతూ వస్తుంది. అలాంటి సమయంలో హౌస్మేట్స్ గేమ్ కంటే కూడా బయట వారి అభిమానులు వేసే ఓట్లే కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడున్నవారిలో అందరికంటే తక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రాజ్‌కే! పైగా తనకెలాంటి పీఆర్‌టీమ్ కూడా లేకపోవడంతో ఓట్లు పెద్దగా పడలేదు. మూడు వారాలుగా రాజ్ నామినేషన్లోకి రాలేదు. ఇది కూడా ఓట్లు పడకపోవడానికి ఒక ప్రధాన కారణం. మొదటి నుంచీ సోలో ప్లేయర్‌గా ఆడకుండా ఎవరో ఒకరి పక్కన నీడలా ఉండటం కూడా జనాలకు పెద్దగా నచ్చలేదు. హౌస్‌లో ఉన్న మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే రాజ్ కన్నింగ్, చీటింగ్ ప్లేయర్ కాదు కానీ కొంత సేఫ్‌గా ఆడేవాడు. అప్పుడప్పుడూ స్మార్ట్‌గా కూడా ఆడేవాడు. కరెక్ట్ పాయింట్ మాట్లాడుతూ ఆదిరెడ్డి నోటికే తాళం వేసేవాడు. కాకపోతే చాలావరకు మాటల్లో కాన్ఫిడెన్స్, క్లారిటీ తక్కువగా ఉండేది. దీనివల్ల అతడు మిగతావారికంటే వీక్ అన్నట్లుగా కనిపించింది. చివరగా ఈవారం ఫైమాకు తక్కువ ఓట్లు పడ్డాయి. కానీ ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను ఎలిమినేట్ చేశారు. అంటే ప్రేక్షకుల ఓట్లతో కాకుండా బిగ్‌బాస్ నిర్ణయంతోనే అతడకు బయటకు వచ్చేశాడన్నమాట! చదవండి: మరోసారి తాతైన బ్రహ్మానందం ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్ అయ్యేది! -
ఆ పని చేసుండకపోతే ఫైమా ఎలిమినేట్ అయ్యేది!
బిగ్‌బాస్ ఆడే ఆటలో కంటెస్టెంట్లు పావులు మాత్రమే. వారు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే వారిని కచ్చితంగా చేసి తీరతారు. అందుకు నేటి ఎపిసోడ్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్లో తొమ్మిది మంది ఉండగా వారిలో కొందరిని నిన్ననే సేవ్ చేశాడు నాగ్. మిగిలినవారిని ఒక్కొక్కరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరకు రాజ్, ఫైమా ఇద్దరే మిగిలారు. తను సేవ్ అయిపోతానని బలంగా నమ్మిన ఫైమా మొదటగా తన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను రాజ్ కోసం వాడేందుకు సిద్ధమైంది. కానీ నాగార్జున ఆలోచించుకోమని, మీ అమ్మ చెప్పిన మాట గుర్తు తెచ్చుకో అంటూ ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె భయపడిపోయి చివరి నిమిషంలో తనకోసమే వాడుతున్నట్లు ప్రకటించింది. తీరా ఓటింగ్‌లో ఫైమానే చివరి స్థానంలో ఉండగా ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కింది. ఒకవేళ ఆ పాస్ వాడకపోయుంటే మాత్రం ఫైమా ఈ వారం బయటకు వచ్చేదే! ఫైమా సేవ్ అయిపోవడంతో ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందనుకునేరు, కానే కాదు! ఓటింగ్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్న రాజ్‌ను అన్యాయంగా బయటకు పంపించేశారట. అంటే బిగ్‌బాస్ ఆడే ఆటలో రాజ్ బలైపోయాడన్న మాట. చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు: రేవంత్ ఓటీటీలో లవ్ టుడే, ఎప్పటినుంచంటే -
రాజ్ ఎలిమినేట్, అంధురాలి పెన్షన్‌తో ఐదేళ్లు బతికామన్న ఆది!
Bigg Boss 6 Telugu, Episode 84: ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ఫుల్ జోష్ మీదున్నారు. వారి జోష్ రెట్టింపు చేయడానికి మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను రప్పించారు. అయితే వారి గొంతు గుర్తుపడితనే వారితో మాట్లాడే అవకాశం కల్పిస్తానని మెలిక పెట్టాడు నాగ్. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గొంతును గుర్తుపట్టడం డెడ్ ఈజీ కాబట్టి అందరూ ఎంచక్కా ఫ్యామిలీస్‌తో కబుర్లాడారు. మొదటగా ఇనయ కోసం ఆమె తమ్ముడితోపాటు మాజీ కంటెస్టెంట్ సోహైల్ వచ్చారు. ఇనయను, ఆమె తల్లిని కలిపినందుకు బిగ్స్కు కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఫినాలేలో డబ్బు ఆఫర్ చేస్తే తనలా సూట్‌కేస్ తీసుకోమని సలహా ఇచ్చాడు. తనకోసం వచ్చిన సోహైల్‌కు థ్యాంక్స్ చెప్పిన ఇనయ బయటకు వచ్చాక ఫోన్ నెంబర్ తీసుకుంటానంటూ మెలికలు తిరిగింది. సోహైల్ కోసం ఆమె మణికొండకు వచ్చిందని, తన జిమ్ సెంటర్లో జాయిన్ అయిందంటూ ఆమె గుట్టంతా బయటపెట్టాడు సోహైల్. ఇనయకు హౌస్‌లో రేవంత్ టఫ్ కాంపిటీషనర్ అని, ఆదిరెడ్డి అసలు పోటీ ఇవ్వడని ఇనయ తమ్ముడు అభిప్రాయపడ్డాడు. తర్వాత శ్రీహాన్ కోసం అతడి తండ్రి, శివబాలాజీ వచ్చారు. ఈ సందర్భంగా శివబాలాజీ.. నేను షో గెలిచి బయటకు వచ్చినప్పుడు రేవంత్ హౌస్‌లో జరిగేదంతా నిజమేనా? అడిగాడు. అవునని చెప్పినప్పుడు చచ్చినా బిగ్‌బాస్‌కు వెళ్లనన్నాడు. మరి ఇప్పుడేంటి? అంటూ ఆటపట్టించాడు. తర్వాత శ్రీహాన్‌కు రేవంత్ కాంపిటీషన్ అయితే, ఫైమా పోటీనే కాదని చెప్పాడు. ఈ 12 వారాల ఆటకు శ్రీహాన్‌కు 9 మార్కులిచ్చాడు. ఫైమా తన అక్క సల్మాను, బుల్లెట్ భాస్కర్‌ను చూడగానే ఏడ్చేసింది. భాస్కర్ అయితే పంచులతో అందరినీ నవ్వించాడు. ఇనయను ఎలా భరిస్తున్నారో అర్థం కావట్లేదన్నాడు. ఫైమాకు ఇనయ గట్టి పోటీ ఇస్తుందని, శ్రీసత్య పోటీనే కాదని చెప్పాడు. ఫైమా మాట్లాడుతూ.. అమ్మవాళ్లకు సొంతిల్లు కట్టించి, బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేశాకే తాను పెళ్లి చేసుకుంటానంది. అనంతరం రేవంత్ అన్నయ్య సంతోష్, స్నేహితుడు రోల్ రైడా స్టేజీపైకి వచ్చారు. తన తమ్ముడికి శ్రీహాన్ పోటీ అని, రోహిత్ అసలు పోటీనే కాదన్నాడు. తర్వాత రోహిత్ కోసం అతడి తమ్ముడు డింప్, నటుడు ప్రభాకర్ వచ్చి పలకరించారు. రోహిత్‌కు రేవంత్ పోటీ అని, రాజ్ పోటీయే కాదని చెప్పాడు ప్రభాకర్. రేవంత్‌ను గెలిస్తే టైటిల్ గెలవడం ఈజీ అని ఉన్నమాట చెప్పి అందరికీ హింటిచ్చాడు. తర్వాత ఆదిరెడ్డి కోసం చెల్లెలు నాగలక్ష్మి, మాజీ కంటెస్టెంట్ లహరి వచ్చారు. నువ్వు కనిపించనందుకు బాధగా ఉందన్నా అంటూ అంధురాలైన నాగలక్ష్మి బాధపడింది. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ.. ఐదేళ్లు నేను ఖాళీగా ఉన్నసమయంలో మా కుటుంబమంతా చెల్లెలు పెన్షన్‌తో బతికాం అని చెప్పాడు. ఆదికి రేవంత్ కాంపిటీషన్ అని, శ్రీసత్య పోటీయే కాదని చెప్పింది నాగలక్ష్మి. కళ్లు లేని పిల్ల అని నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేయరు. ఇప్పుడు లహరి నాతో ఫ్రెండ్షిప్ చేస్తానంది అని మురిసిపోయింది. శ్రీసత్య కోసం తన బెస్ట్‌ఫ్రెండ్ హారిక, నటి విష్ణుప్రియ స్టేజీపైకి వచ్చారు. ఆమెకు రేవంత్ పోటీ అని, కీర్తి పోటీయే కాదని చెప్పారు. శ్రీసత్యను తన తల్లి కోసం టెన్షన్ పడొద్దని సూచించారు. అమ్మకు రెగ్యులర్‌గా ఫిజియోథెరపీ జరుగుతోందని, తన ఆరోగ్యం గురించిఆందోళన పడొద్దని చెప్పారు. తర్వాత రాజ్ ఫ్రెండ్ వెంకీ, హీరో సాయిరోనక్ వచ్చి రాజ్‌కు ఆటలో రేవంత్ కాంపిటీషన్ అయితే, ఇనయ పోటీయే కాదని స్పష్టం చేశారు. కీర్తి కోసం ప్రియాంక, వితికాషెరు వచ్చారు. ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నావు, కానీ బయట చాలామంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటున్నారు అని కీర్తిలో ధ:ర్యం నింపింది వితికా. కీర్తికి హౌస్‌లో శ్రీహాన్ పోటీ అని, శ్రీసత్య పోటీయే కాదని కుండ బద్ధలు కొట్టారు ప్రియాంక, వితికా. ఇకపోతే సండే షూటింగ్ ఆల్రెడీ పూర్తవగా రాజ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. చదవండి: నటించినందుకు నా భార్య ఇప్పటికీ ఏదోలా ఫీలవుతుంది: విష్ణు విశాల్ ఆ హీరోకు అమ్మాయిల పిచ్చి?: స్పందించిన కూతురు -
Bigg Boss: ఫైమా చేతిలో ఎలిమినేషన్, అతడే ఎలిమినేట్!
బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈవారం ఏడుగురు కంటెస్టెంట్లు రాజ్, ఫైమా, రోహిత్, శ్రీసత్య, శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ నామినేషన్లో ఉన్నారు. వీరిలో శ్రీహాన్, ఆదిరెడ్డి, ఇనయ అత్యధిక ఓట్లతో టాప్ పొజిషన్లో ఉన్నారు. రోహిత్‌కు స్క్రీన్ స్పేస్ తగ్గించడంతో అతడిని ఎలిమినేట్ చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ లాస్ట్ డే అతడికి భారీగా ఓట్లు పడి సేవ్ అయినట్లు తెలుస్తోంది. మిగిలిందల్లా శ్రీసత్య, రాజ్, ఫైమా.. ఎలాగో ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. కాబట్టి తను డేంజర్ జోన్లో ఉంటే తనకోసమే వాడుకుంటుంది. ఒకవేళ నాగార్జున ఫైమాను ముందే సేవ్ చేసేస్తే మాత్రం చివరగా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కాపాడేందుకు ఆ పాస్ వాడే ఆస్కారం ఉంది. అంటే ఈవారం ఎలిమినేషన్ ఫైమా చేతిలో ఉందన్నమాట! ఆమె ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను తనకోసం వాడుకుంటుందా? రాజ్, శ్రీసత్యలలో ఎవరికైనా ఉపయోగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు రాజ్‌ను ఎలిమినేట్ చేసేందుకు బిగ్‌బాస్ టీమ్ రెడీ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే! చదవండి: కెప్టెన్‌గా ఇనయ కొత్త రూల్, ఫైమాకు మట్టి తినే అలవాటు ఆమెకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్ అయిపోతుందనుకున్నా: హమీదా -
బిగ్‌బాస్: రోహిత్ కోసం ఎవరు వచ్చారో తెలుసా?
ఇంటిసభ్యుల రాకతో హౌస్మేట్స్ ముఖాలు మతాబుల్లా వెలిగిపోతున్నాయి. ఇప్పటికే ఆదిరెడ్డి తన కూతురి బర్త్‌డేను హౌస్‌లో సెలబ్రేట్ చేసినందుకు ఎగిరి గంతేస్తుండగా నెక్స్ట్ మా కోసం ఎవరు రాబోతున్నారా? అని ఇతర కంటెస్టెంట్లు గేటు వంక ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్ప్రైజ్ చేయాలని వెనక నుంచి వచ్చి కళ్లు మూసింది అతడి తల్లి. ఆమె స్పర్శ తగలగానే రోహిత్ ఎమోషనలయ్యాడు. అమ్మ చేతిని ఆప్యాయంగా ముద్దాడుతూ తనపై ప్రేమను గుమ్మరించాడు. మరోపక్క మ్యూజిక్ క్లాస్‌లో టీచర్ రాజ్‌ను ఆడేసుకున్నారు విద్యార్థులు. వీరెక్కడ దొరికార్రా బాబూ అనుకున్న రాజ్ వారినేం చేయలేక తల పట్టుకున్నాడు. మొత్తానికి గొడవలు పక్కన పెట్టేసి సంతోషంలో మునిగి తేలుతున్నారు హౌస్మేట్స్. మరి ఈ ఫ్యామిలీ సందడిని చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: ఆదిరెడ్డి కలను నిజం చేసిన బిగ్‌బాస్ -
శ్రీసత్య వెన్నుపోటు పొడుస్తోంది.. రేవంత్‌కు హింటిచ్చిన ఆడియన్స్!
Bigg Boss 6 Telugu, Episode 79: రేవంత్ కెప్టెన్సీలో కంటెస్టెంట్లు కడుపు మాడ్చుకునే పరిస్థితి వచ్చింది. అతడు రేషన్ మేనేజర్ అవడమేంటో కానీ పాలు, అన్నం.. ఇలా అన్నింటికీ కొలతలు పెడుతూ ఇంటిసభ్యులకు సరిగా తిండి పెట్టడం లేదు. గత వారం కెప్టెన్‌గా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎన్ని కప్పుల బియ్యం వండేదానివని ఫైమాను అడిగాడు ఆదిరెడ్డి. అందుకామె ఐదు కప్పులని చెప్పింది. కానీ రేవంత్ నాలుగు కప్పులు మాత్రమే చాలంటున్నాడు. అరకప్పు బియ్యం ఎక్కువ వేయమని శ్రీహాన్ చెప్పినా వినట్లేదని చికాకు పడ్డాడు ఆది. బియ్యం అయిపోయినప్పుడు అడిగితే ఇస్తున్నారని చెప్పింది ఫైమా. ఇదే విషయంపై రేవంత్‌ను నిలదీసింది. అతడు మాత్రం సరిపోతుందా? సరిపోదా? అనవసరం అని, రేషన్ ఎంతుందో దాన్ని బట్టే వండుతానని వితండవాదం చేశాడు. అలాగైతే ఎవరికీ ఆకలి తీరదన్నాడు శ్రీహాన్. నీ కెప్టెన్సీలో పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ అందరి కడుపు నింపడానికి ఆలోచించట్లేదన్నాడు. మరోపక్క సమయానికి వచ్చి పాలు తాగకపోతే ఆ పూట పాలు మళ్లీ ఇచ్చేదే లేదని రూల్ పెట్టడమేంటని అసహనం వ్యక్తం చేసింది ఇనయ. ఇలా ఎప్పటిలాగే రేవంత్ రేషన్ మేనేజర్‌గా ఉన్నప్పుడు ఫుడ్ గొడవలు జరిగాయి. అనంతరం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి ఇద్దరు సభ్యుల ఫొటోలను షెడ్డర్లో వేయాల్సి ఉంటుంది. ► రోహిత్.. శ్రీహాన్, ఫైమా ► శ్రీసత్య.. రాజ్, రోహిత్ ► రాజ్.. శ్రీహాన్, శ్రీసత్య ► కీర్తి.. శ్రీహాన్, శ్రీసత్య ► ఫైమా.. రోహిత్, ఇనయ ► శ్రీహాన్.. రోహిత్, ఆదిరెడ్డి ► ఇనయ.. ఫైమా, రాజ్ ► ఆదిరెడ్డి.. ఇనయ, శ్రీహాన్ ► రేవంత్.. ఫైమా, ఆది రెడ్డి రాజ్ మూడు వారాలుగా సేవ్ అవుతున్నందున అతడిని నామినేట్ చేస్తున్నానంది శ్రీసత్య. ఇందుకు ఒప్పుకోని బిగ్‌బాస్ సరైన కారణం చెప్పమని గద్దించాడు. దీంతో శ్రీసత్య అతడి గేమ్ కనిపించలేదని జవాబు చెప్పి జారుకుంది. ఇక ఇనయ.. తనను గేమ్‌లో పర్సనల్‌గా అటాక్ చేసి తన గేమ్ కనిపించకుండా చేసిన ఫైమాను నామినేట్ చేస్తున్నాననంది. రాజ్ నామీద పగ పెంచుకుని నన్ను నామినేట్ చేస్తున్నాడనిపిస్తోందని చెప్పింది. వీరిద్దరూ తన ఫ్రెండ్స్ అని, వీళ్లను నామినేట్ చేయాల్సి వచ్చేంత దూరం పెరుగుతుందని ఊహించలేదంటూ ఏడ్చింది. వాళ్లు తనను ఫ్రెండ్ అనుకోలేదంటూ బాధపడింది. ఫైనల్‌గా ఈ వారం శ్రీహాన్, ఫైమా,రోహిత్, రాజ్, ఆదిరెడ్డి, శ్రీసత్య, ఇనయ నామినేషన్లో ఉన్నట్లు ప్రకటించాడు బిగ్‌బాస్. అనంతరం కిచెన్‌లో మళ్లీ ఫైట్ జరిగింది. రేవంత్‌ను ఆలూ, ఉల్లిగడ్డ ఇవ్వమని కొందరు అడగ్గా కుదరదని తేల్చి చెప్పేశాడు కెప్టెన్. మీరేమనుకున్నా నేనేం చేయలేనని చేతులెత్తేశాడు. తర్వాత ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పే టైం వచ్చింది. హౌస్ అంతా నీకు సపోర్ట్ చేసి కెప్టెన్‌గా గెలిపించినప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఒక్కోసారి సపోర్ట్ చేయకపోతే సోలో ప్లేయర్, ఫేవరిటిజం అని పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేస్తారు. మీరు ఆడియన్స్ నుంచి సింపతీ కోరుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఒకటీరెండు రోజుల వరకే సింపతీ ఉంటుంది. కానీ జీవితాంతం ఉండదు. కళ్ల ముందే ఫేవరిటిజం కనిపించినప్పుడు కచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంట్లో మీ రియల్ ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడరని ఎవరిని నమ్ముతున్నారు? రాజ్.. నాగురించి చెడుగా ఎవరూ మాట్లాడరు. మొదట్లో నా రియల్ ఫ్రెండ్స్ సూర్య, ఫైమా, ఇనయ. కానీ ఇనయ నా వెనక గోతులు తవ్వుతుందేమోనని అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు. స్నేహితుడిగా ఫీలైన రాజ్ అలా అనడంతో ఇనయ ఏడ్చేసింది. సూర్య వెళ్లిపోయాక వాళ్లిద్దరే మాట్లాడకుండా దూరం పెట్టి నన్ను శత్రువులా చూస్తున్నారు అని కంటతడి పెట్టుకుంది. ప్రశ్న: మీరు ఎప్పుడు ఏం చేస్తారనేది తోటి ఇంటిసభ్యులకే అర్థం కావట్లేదు. దీనికి మీ స్పందన ఏంటి? ఇనయ: మై లైఫ్, మై రూల్స్.. నాకు నచ్చినట్లే ఉంటా, అందుకే అన్‌ప్రిడిక్టబుల్‌గా అనిపిస్తాను. ప్రశ్న: మీ క్లోజ్ ఫ్రెండ్ మీ గురించి బ్యాక్‌స్టాబింగ్, బిచింగ్ చేస్తుంది. మీకు తెలిస్తే ఏం చేస్తారు? శ్రీసత్య: ముందు బాధపడతాను. నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత క్లోజ్ అనుకుంటున్నారనేది ముఖ్యం. బహుశా వాళ్లకు నేనంత క్లోజ్ కాదేమో! నమ్మినవాళ్లు నా వెనకాల మాట్లాడితే నెక్స్ట్ టైం నా దగ్గరకు రానివ్వను. ఇక నాగార్జున చెప్పిన టాస్క్‌ను అమలు చేసే పనిలో పడ్డారు శ్రీసత్య, ఫైమా. అర్ధరాత్రి మేకప్ వేసుకుని రాజ్, శ్రీహాన్‌ను భయపెట్టి మిషన్ కంప్లీట్ చేశారు. చదవండి: మెరీనా పారితోషికం ఎంతో తెలుసా? నీ నుంచి కంటెంటే రాదు, కోపం ఎలా వస్తుంది: యాంకర్ -
ఆ ఒక్క ప్రశ్నతో దొరికిపోయిన కీర్తి, రాజ్ నిందతో ఏడ్చిన ఇనయ
జనాలు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు.. బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతీ కంటెస్టెంటూ చెప్పే మాట ఇది. అలా అని ఇక్కడ ఇలా మాట్లాడకూడదు, అక్కడ అలా ప్రవర్తించకూడదు అని ఎవరూ నోరూ, కాళ్లు చేతులు కట్టేసుకుని కూర్చోలేదు. పైగా తామేం చేసినా రైటే అని, అది జనాలు అంగీకరిస్తారని ఎవరికి వారు ఊహల్లో తేలిపోమారు. ఇప్పుడిప్పుడే వారి కళ్ల ముందు ఏర్పడుకున్న మబ్బులు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ఆడియన్స్ అడిగే ప్రశ్నలతో ఉలిక్కిపడుతున్నారు హౌస్మేట్స్. ఈ మధ్యే శ్రీసత్య, శ్రీహాన్‌లను వాయించిన ప్రేక్షకులు నేడు రాజ్, కీర్తి, ఇనయల గురించి అడిగేశారు. ఈ క్రమంలో కీర్తికి.. 'ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్ చేయలేదు, సోలో ప్లేయర్ అని ఎందుకంటారు? సింపతీ ట్రై చేస్తున్నారా?' అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి కీర్తి.. సింపతీ ఒకటీరెండు రోజులు ఉంటుందే తప్ప జీవితాంతం ఉండదని చెప్పింది. తర్వాత హౌస్‌లో మీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? మీ వెనకాల ఎవరు మాట్లాడరని అనుకుంటున్నారని రాజ్‌ను అడిగాడో ఆడియన్. దీనికతడు ఇనయ నా వెనకాల మాట్లాడుతుందనిపిస్తుందన్నాడు. ఒకప్పుడు స్నేహితుడుగా ఉన్న రాజ్ ప్రతిదానికీ తననే తప్పుపడుతుండటంతో తట్టుకోలేక ఏడ్చేసింది ఇనయ. చదవండి: 12వ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే? -
రాజ్‌ను భయపెట్టమన్న నాగ్, మెరీనాకు ఆ ఛాన్స్ లేదే!
శనివారం కోటింగ్‌లు.. సండే ఫన్ టాస్కులూ తెలిసిన విషయమే.. ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే నిన్నటి ఎపిసోడ్లో ఆదిరెడ్డికి మరీ ఓ రేంజ్లో క్లాస్ పీకాడు నాగార్జున. ఈరోజు అవన్నీ పక్కనపెట్టేసి హౌస్‌మేట్స్‌తో చిన్నపిల్లల ఆటలు ఆడించాడు. ఏ ఆటైతే ఏంటి? ఆడేందుకు రెడీ అన్న హౌస్మేట్స్ రెండు టీములుగా విడిపోయి ఆడారు. ఇకపోతే రాజ్‌కు దెయ్యాలంటే భయమన్న విషయాన్ని బయటపెట్టాడు నాగ్. ఈరోజు మెరీనా, శ్రీసత్య, ఫైమా. దెయ్యాల వేషం వేసుకుని రాజ్‌ను భయపెట్టాలన్నాడు. ఫైమా వేషం వేసుకోనక్కర్లేదు, ఇప్పటికే ఆమెకు భయపడుతున్నాడని శ్రీసత్య మధ్యలో అందుకుంది. అంటే ఫైమా దెయ్యంలా ఉందంటున్నావా? అని కౌంటర్ వేశాడు నాగ్. ఎలాగో మెరీనా అవుట్ కాబట్టి తను భయపెట్టలేదు. చదవండి: ఇనయ టాప్ 5లో కాదు, చివరి స్థానంలో ఉందట ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరంటే? -
టాప్ 10 కంటెస్టెంట్లలో అట్టడుగు స్థానంలో ఇనయ..
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం టాప్ 10 కంటెస్టెంట్లు మిగిలారు. వీరిలో ఒకరైన మెరీనా నేడు ఎలిమినేట్ కానుంది. దీంతో మిగిలిన తొమ్మిది మందైన రోహిత్, రాజ్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయ, కీర్తి, రేవంత్, ఆదిరెడ్డి,ఫైమా టైటిల్ కోసం పోటీపడనున్నారు. మరి వీరిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో హౌస్మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు ఒక్కో కంటస్టెంట్ పేరు చెప్పారు. ► ఆదిరెడ్డి.. మెరీనా ► ఇనయ, శ్రీసత్య.. రాజ్ ► రాజ్, ఫైమా.. ఇనయ ► కీర్తి.. ఆదిరెడ్డి ► మెరీనా.. శ్రీహాన్ ► శ్రీహాన్, రోహిత్.. కీర్తి ► రేవంత్.. రోహిత్‌ల పేర్లు చెప్పారు. మెజారిటీ ఇంటిసభ్యులు ఇనయ, రాజ్‌లు ఫినాలే చేరుకోలేరని తేల్చి చెప్పారట. కానీ అనధికారిక పోలింగ్స్ చూస్తే మాత్రం ఇనయ టాప్ 3లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయం తెలిస్తే శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి ఏమైపోతారో చూడాలి! చదవండి: పూర్తిగా గీతూలా మారిన ఆదిరెడ్డి యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ -
నేనే విన్నర్, నా ప్రైజ్‌మనీలో నుంచి డబ్బులు కట్ చేస్తారా?: ఆది
Bigg Boss Telugu 6, Episode 73: నామినేషన్స్‌లో జరిగిన గొడవను పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు కీర్తి, సత్య. కానీ గొడవ సద్దుమణగడం కాదు కదా అది మరింత అగ్గి రాజుకుంది. శ్రీసత్య వైఖరితో ఏడ్చేసిన కీర్తి.. శ్రీసత్యకు రెచ్చగొట్టే అలవాటుందని నాకు బిగ్‌బాస్‌కు రాకముందే తెలుసు. తన క్యారెక్టరే అంత అని ఊరుకున్నా.. కానీ ఈరోజు నన్ను ఇమిటేట్ చేసి మాట్లాడటం నచ్చలేదని మిగతా వాళ్ల దగ్గర బాధపడింది. తను చేసింది తప్పని ఫీలైందో మరేంటో కానీ అర్ధరాత్రి శ్రీసత్య.. కీర్తి దగ్గరకు వెళ్లి సారీ చెప్పింది. నెక్స్ట్ డే ఏదో చిన్న విషయంలో శ్రీహాన్‌కు, రేవంత్‌కు మధ్య గొడవైంది. ఈ ఫ్రస్టేషన్లో తన మనసులో ఉన్న కోపాన్నంతా శ్రీసత్య ముందు కక్కేశాడు శ్రీహాన్. 'రేవంత్ నన్ను నామినేట్ చేసి నా తప్పు చెప్పాలనుకున్నాడట.. అలాగైతే వాడిదగ్గర వంద తప్పులు కనిపిస్తున్నాయి. కానీ నేను నా ఫ్రెండ్‌ను బయటకు పంపించి నువ్వు తప్పు చేశావని చెప్పాలనుకోను, పక్కకు పిలిచి అతడి తప్పేంటో చెప్తా. పదిమందిలో వాడిని లోకువ చేయను. కానీ వాడు మాత్రం అందరి ముందు నా తప్పు చెప్పాలనుకున్నాడు' అంటూ రగిలిపోయాడు. అనంతరం బిగ్‌బాస్.. నామినేషన్స్‌లో ఉన్నవారు తమను సేవ్ చేసుకుని ఇమ్యూనిటీ దక్కించుకునేందుకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ ఆ ఇమ్యూనిటీకి ఒక ధర ఉందని, ఆ మొత్తం విన్నర్ ప్రైజ్‌మనీ నుంచి తగ్గిస్తామని చెప్పాడు. నామినేట్ అయిన సభ్యులు చేయాల్సిందల్లా.. వారు ఏ ధరకు ఇమ్యూనిటీని కొనుక్కుంటారో చెక్‌లో రాయాల్సి ఉంటుంది. ఏ సభ్యుడు ఎక్కువ ధర రాస్తాడో వారు సేవ్ అవుతారని ట్విస్ట్ ఇచ్చాడు. అది కూడా లక్ష నుంచి రూ.5 లక్షల మధ్యే రాయాల్సి ఉంటుందన్నాడు. దీంతో శ్రీహాన్ లక్ష రాయగా ఆదిరెడ్డి తానసలు ఇమ్యూనిటీయే కోరుకోవట్లేదని చెప్పాడు. 'ఒక సామాన్యుడిగా అడుగుపెట్టాను. జనాలకు నా ఆట నచ్చి వారి సపోర్ట్‌తో 11 వారాలు హౌస్‌లో ఉన్నాను. ఇలాంటి ఇమ్యూనిటీ కోరుకుని ఇక్కడిదాకా రాలేదు. ఈ సీజన్ గెలుస్తానని నాకు గట్టిగా నమ్మకముంది. అంటే నా ప్రైజ్‌మనీలో నుంచి రూ.5 లక్షలు కట్ అవుతాయన్నమాట! నా దాంట్లో నుంచి కట్ అవుతాయని తెలిసినా ఆ ఇమ్యూనిటీతో ముందుకు వెళ్లాలని లేదు. జనాల ఓట్లతో ముందుకు వెళ్తాను. ఇకపోతే ఇమ్యూనిటీ కోసం ఎక్కువ అమౌంట్ రాసేవారికి ఇంట్లో ఉండే అర్హతే లేదు' అంటూ గాల్లో మేడలు కట్టేశాడు ఆది. అనంతరం అతడు లక్ష రూపాయలు రాశాడు. శ్రీసత్య, కీర్తి, రేవంత్.. రూ.4,99,999, రోహిత్.. రూ.2,51,001, రాజ్.. రూ.4,99,700, మెరీనా, ఇనయ.. రూ.4,99,998 రాశారు. చెక్‌పై రాసే మొత్తాన్ని ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పినా శ్రీసత్య.. శ్రీహాన్‌తో కోడ్ భాషలో చెప్పిందంటూ ఆమెపై అనర్హత వేటు వేశాడు బిగ్‌బాస్. అలాగే ఒకే అమౌంట్ ఇద్దరూ రాస్తే వారిని రిజెక్ట్ చేశాడు. దీంతో చివరగా రోహిత్, రాజ్ మిగిలారు. వీరిలో రాజ్ రాసిన చెక్ ధర ఎక్కువగా ఉండటంతో అతడు ఇమ్యునిటీ పొందినట్లు ప్రకటించాడు. అతడు రాసిన రూ.4,99,700 విన్నర్ ప్రైజ్‌మనీలో కోత పెట్టగా రూ.45,00,300 మిగిలింది. తర్వాత ఈ ప్రైజ్‌మనీని కాపాడుకోమంటూ సమయానుసారంగా ఛాలెంజ్‌లు ఇస్తానన్నాడు బిగ్‌బాస్. మొదటి ఛాలెంజ్‌లో భాగంగా కేవలం రన్స్ తీస్తూనే సెంచరీ పూర్తి చేయమన్నాడు. ఇందులో రోహిత్, రేవంత్ పాల్గొని 82 పరుగులు తీశారు. సెంచరీ పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ మరో లక్ష ప్రైజ్‌మనీ కట్ చేశాడు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీ రూ.44,00,300కు వచ్చింది. ఇక ఈ వారం కెప్టెన్ ఫైమా, రాజ్ మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు. చదవండి: భలే ట్విస్ట్, ప్రైజ్‌మనీ కట్ -
భలే ట్విస్ట్.. ప్రైజ్‌మనీ కట్ చేసేందుకు పూనుకున్న బిగ్‌బాస్!
బిగ్‌బాస్ షో మొదలై పదివారాలు పూర్తయినా నామినేషన్స్ మాత్రం ఇంకా చప్పగానే సాగుతున్నాయి. నిన్నటి నామినేషన్స్ చెత్తగా ఉన్నాయని సోషల్ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే నామినేషన్స్ నుంచి కాపాడుకునేందుకు హౌస్‌మేట్స్‌కు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఒక చెక్ ఇచ్చి దాని మీద యునిక్‌గా అనిపించే అమౌంట్ రాయమన్నాడు. ఏ సభ్యులైతే చెక్‌పై ఎక్కువ మనీ రాస్తారో వారు నామినేషన్ నుంచి సేవ్ అవుతారని చెప్పాడు. అయితే ఈ మొత్తం బిగ్‌బాస్ ప్రైజ్‌మనీలో నుంచి తగ్గిస్తామని ట్విస్ట్ ఇచ్చాడు. చెక్‌పై ఎంత రాస్తున్నామన్నది ఎవరితో చర్చించడానికి వీల్లేదని బిగ్‌బాస్ మరీమరీ చెప్పాడు. ఈ నియమాన్ని ఉల్లంఘించడంతో శ్రీసత్య ఈ పోటీలో అనర్హురాలిగా నిలిచింది. ఇక సేవ్ అవడం కోసం కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు రాస్తే మాత్రం వారికి ఈ ఇంట్లో ఉండే అర్హతే లేదన్నాడు ఆదిరెడ్డి. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఎవరెంత అమౌంట్ రాశారంటే... ► ఆదిరెడ్డి - లక్ష రూపాయలు ► శ్రీహాన్ - లక్ష రూపాయలు ► రోహిత్ - రూ. 2.51,001 ► రాజ్ - రూ.4,99,700 ► మెరీనా - రూ.4,99,998 ► ఇనయ - రూ.4,99,998 ► కీర్తి - రూ. 4,99,999 ► రేవంత్ - రూ.4,99,999 ► సత్య - రూ.4,99,999 లక్షలు రాశారు. అదేంటో గానీ అత్యధిక నంబర్ రాసినవారు కాకుండా రాజ్‌ను సేవ్ చేశాడట బిగ్‌బాస్. అంతేకాదు, ప్రైజ్ మనీలో నుంచి రూ. 5 లక్షలు కట్ అయ్యాయట. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా? మరి అదెలా జరిగిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే! చదవండి: చెత్త రీజన్స్, చెత్త నామినేషన్స్.. కాకపోతే ఓ ట్విస్ట్ -
వైరల్‌గా శివాత్మిక రాజశేఖర్ లేటెస్ట్ ఫొటోలు
యాగ్రీ మ్యాన్, హీరో రాజశేఖర్, జీవితల తనయగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది శివాత్మిక రాజశేఖర్. దొరసాని మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్న శివాత్మికకు ప్రస్తుతం వరస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ, బ్రహ్మనందం, కలర్స్ స్వాతి పంచతంత్రం చిత్రాల్లో నటిస్తుంది. ఇవేకాక శివాత్మక చేతిలో మరో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. గతేడాది ‘ఆనందం విలయాడుమ్ వీడు’ సినిమాతో కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. గౌతమ్ కార్తిక్‌కి జోడిగా నటించిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాపడింది. ఇదిలా ఉంటే హీరోయిన్గా బిజీ ఉంటునే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతి పొగొడుతోంది ఈ యంగ్ హీరోయిన్. ఈనేపథ్యంలో తాజాగా చూడిదారుతో దిగిన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఎల్లో కలర్ చుడిదార్‌లో క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ శివాత్మిక మరోసారి కుర్రకారు కవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
శేఖర్ : జీవితా రాజశేఖర్ దర్శకత్వం.. శివానీ కీలక పాత్ర
Shekar: Shivani Shares Screen Space With Her Father Rajasekhar: రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించారు. ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజశేఖర్, శివానీల స్టిల్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది. జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘రాజశేఖర్ హీరోగా నటించిన 91వ సినిమా ‘శేఖర్’. ఇందులో రాజశేఖర్ కుమార్తె పాత్రలో నటించింది శివాని. తండ్రి, కుమార్తె వెండితెరపై కలిసి కనిపించనున్న తొలి చిత్రం ఇదే. వారి మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా విడుదల తేదీ వెల్లడిస్తాం’’ అన్నారు. -
ఒక చేత్తో స్కూటీ.. మరో చేత్తో ఆమెను అసభ్యంగా
ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా సరే అమ్మాయిలు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పే సంఘటనలు దేశంలో అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. మహిళలకు ధైర్యమిచ్చే ఘటన ఇటీవల గౌహతిలో జరిగింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో ఉంటున్న భావనా కశ్యప్ పని పూర్తిచేసుకొని రుక్మణి నగర్లో ఉంటున్న తన ఇంటికి బయల్దేరింది. అదేదో చీకటి పడ్డాక కాదు మధ్యాహ్నం 4 గంటల 30 నిమిషాల సమయం. రోడ్ సైడ్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఆమె వెనకాల ఓ స్కూటీ వచ్చి ఆగింది. ‘సినాకి పథ్’కి ఎలా వెళ్లాలి? అడిగాడు ఆ స్కూటీ వ్యక్తి. ఆ స్థలం గురించి తనకు తెలియదని మరొకరిని అడిగి తెలుసుకోమని, ఆమె మళ్లీ నడక మొదలుపెట్టింది. అతను మాత్రం స్కూటీని అతి నెమ్మదిగా నడుపుతూ ఆమెనే అనుసరించడం మొదలుపెట్టాడు. మరొకసారి అతనికి చెప్పింది ఇంకెవరినైనా ఆ అడ్రస్ గురించి అడగమని. కానీ, అతను అదేమీ పట్టించుకోలేదు. మురికి మనిషి అతను ఆమె వెనకాల స్కూటీని నడుపుతూ ఉన్నాడు. భావన తన నడకలోని వేగం పెంచింది. అంతటితో ఊరుకోకుండా ఒక చేత్తో స్కూటీ నడుపుతూ, మరో చేత్తో ఆమెను అసభ్యంగా తాకి, వెళుతున్నాడు. ‘ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు. పిచ్చి కోపం వచ్చేసింది. అంత కోపంలోనూ నా రెండవ ఆలోచనను విడిచిపెట్టలేదు. నా బలమంతా ఉపయోగించి పరిగెట్టి, అతని స్కూటీని పట్టుకున్నాను. వెనుక టైర్‌ను ఎత్తి, అంతే బలంతో పక్కనే ఉన్న మురికి కాలువలోకి తోసేసాను. అతను కూడా ఆ కాలువలో పడేవాడే. కానీ, మిస్సయింది’ అని సోషల్ మీడియా వేదికగా ఆమెకు కలిగిన బాధ తీవ్రతను పంచుకుంది. నిందితుడు రాజశేఖర్ తగిన శాస్తి అతను తప్పించుకునే వీలు తను కల్పించినట్లయితే మరికొందరి మహిళలను టార్గెట్ చేసేవాడు. ఇదేవిధంగా బాధించేవాడు. భావన అరుపులు, స్కూటీని డ్రైనేజీలోకి నెట్టేయడం చూసిన చుట్టుపక్కల వాళ్లు అక్కడ గుమిగూడారు. విషయం తెలుసుకున్నారు. ఆ వ్యక్తి భయపడి కాలువ నుండి స్కూటీని బయటకు తీయడానికి సహాయం చేయమని అక్కడ చేరినవారిని ప్రాధేయపడ్డారు. కానీ, అందరూ ఛీత్కరించుకున్నారు. ద్విచక్రవాహనం మీద వెళుతూ భావనను వేధించిన ఆ వ్యక్తి పేరు మధుసనా రాజ్‌కుమార్. అస్సామ్‌లోని పంజాబరిలో ఉంటున్నాడు. అతనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భావనా కశ్యప్ ఈ వివరాలను రాస్తూ ‘మహిళలు వీధుల్లో ఒంటరిగా తిరగరాదని, రక్షణ అవసరమని సమాజంలో పాతుకుపోయిన భావజాలం ఎంత మాత్రం సరైనది కాదు. ఈ మగవారి మానసిక అనారోగ్య జాడ్యాన్ని వదిలించే బాధ్యత స్త్రీయే తీసుకోవాలి. ఒంటరిగా ఉన్న మహిళ బలహీనంగా ఉండాల్సిన పనిలేదు. రక్షణా అవసరం లేదు’ అని చేసిన సోషల్‌మీడియా పోస్ట్‌కు ప్రశంసలు అందుతున్నాయి. -
లక్షద్వీప్ విపరిణామాలకు బాధ్యులెవరు?
లక్షద్వీప్ ప్రాంత అడ్మినిస్ట్రేటర్‌గా వచ్చిన ప్రఫుల్ పటేల్ ప్రారంభంలో తీసుకున్న చర్యలు పలువురిలో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లోకూడా ప్రపుల్ ప్రభుత్వ సిబ్బందిపై వేటువేశారు. పైగా పాఠశాల మధ్యాహ్న భోజన పథకాలపై తనదైన సాంస్కృతిక విలువలను రుద్దేశారు. అపఖ్యాతి పొందిన గూండా చట్టాలను విధించారు. ఈ ద్వీపాల్లో అతిపెద్ద రోడ్, హైవే, ఇతర సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. డామన్ డయ్యూ ప్రాంతంలో అడుగుపెట్టగానే స్థానిక ఎంపీలనుంచి, ఇతర ప్రజా ప్రతినిధులనుంచి అధికారాన్ని అమాంతంగా లాగేసుకున్నారు. అదే సమయంలో పాలనా యంత్రాంగంలో తన సలహాదారులను నియమించుకున్నారు. లక్షద్వీప్ ప్రాంతంలో ప్రస్తుతం అనేక కాంట్రాక్టులను కొన్ని కంపెనీల చేతుల్లో పెట్టేశారు. అయితే ఇవన్నీ గుజరాత్‌కి చెందిన కంపెనీలు మాత్రమే. ద్వీపప్రాంతంలో ప్రపుల్ నిర్వాకానికి పర్యవసానాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్‌గా ప్రఫుల్ పటేల్ బాధ్యతలు స్వీకరించిన అయిదు నెలల తర్వాత బంగ్రామ్ ప్రాంతంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పర్యావరణ టూరిజాన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలపై తలెత్తుతున్న ప్రశ్నలకు అక్కడి పాలనాయంత్రాంగం సమాధానమివ్వాల్సి వచ్చింది. అయిదు ప్రైవేట్ కంపెనీలు ఇప్పటికే దీనిపై ఆసక్తి చూపుతున్నాయి. అయితే ఒక వారం రోజుల తర్వాత రెండో సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని లక్షద్వీప్ యంత్రాంగం వాగ్దానం చేయడంతో తొలి సమావేశం రద్దయిపోయింది. మే 24న సాయంత్రం 5 గంట లకు ప్రతిపాదిత రెండో సమావేశం కూడా నిర్వహించారు. దీనికి చాలామందే హాజరయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఒక హోటల్ పరిశ్రమకు చెందిన వ్యక్తి ప్రకారం, ఈ భేటీకి 16 పార్టీలు హాజరయ్యారని చైర్మన్ హోదాలో లక్షద్వీప్ కలెక్టర్ అక్సర్ ఆలీ పేర్కొన్నారు. అయితే బిడ్ డిజైన్‌పై పాలనాయంత్రాంగంతో భేటీలో పాల్గొన్నవారు విభేదించడంతో ఫలితం లేకుండానే ముగిసిపోయింది. ఈ బేటీపై అనేకమంది అసమ్మతి వ్యక్తచేశారు. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవాలంటే ఒక్కొక్క సంస్థ 70 కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉండాలని షరతుపెట్టారు. అయితే 30 గదుల రిసార్టును నిర్వహించడానికి 70 కోట్ల టర్నోవర్‌ను చూపించవలసిన అవసరం నాకేంటి అంటూ భేటీలో పాల్గొన్నవారిలో ఇద్దరు ప్రశ్నించారు. పైగా బిడ్ డాక్యుమెంట్లలో సైన్ చేసిన ఒప్పందం ముసాయిదా ప్రతిని చేర్చలేదు. ఇలాంటి స్థితిలో మాకు ఎవరు భద్రత కల్పిస్తారనేది మనస్సును తొలుస్తోందని మరొక హోటల్ యజమాని ప్రశ్నించారు. మేం పర్యావరణపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలేమిటి? స్థానికులకు ఉద్యోగాల కల్పన మాటేంటి? మేం ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు.. ఇలాంటి అంశాలను పొందుపర్చకపోతే బిడ్స్‌ని ఎలా సరిపోల్చగలం అని మరొకరు ప్రశ్నించారు. అయితే కథ ఇంతటితో ముగియలేదు. బిడ్ దాఖలు చేయడానికి కన్సార్టియంలకు అనుమతిస్తూ పొందుపర్చిన నిబంధనను తొలి, రెండో సమావేశాల మధ్యకాలంలో తొలగించారు. ఈ మొత్తం అంశంలో పాలనాయంత్రాంగం ప్రదర్శించిన ఆత్రుత హోటల్ పరిశ్రమదారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ముందుగా లక్షద్వీప్ లోని రిసార్టును తాము చూడాలని కోరుకుంటున్నట్లు బిడ్డర్లు అడిగితే మరో మూడు, నాలుగు రోజుల్లో చూపిస్తామని పాలనా యంత్రాంగం అలసత్వం ప్రదర్శించడం మరీ విశేషం. అయితే కోవిడ్–19 సెకండ్ వేవ్ కాలంలో పాలనా యంత్రాంగం ఆహ్వానం మేరకు హోటల్ పరిశ్రమదారులు రాలేకపోయారు. తమ సందర్శనను కాస్త పొడిగించాలని కోరారు. కానీ పాలనాయంత్రాంగం తిరస్కరించింది. బంగ్రమ్ దీవి కోవిడ్ బారిన పడలేదని, అతిథులు ఎలాంటి సమస్యలు లేకుండా దాన్ని సందర్శిస్తున్నారని అధికారులు ఒక బిడ్డర్‌కు ఈమెయిల్ సందేశం పంపారు. అదే సమయంలో బంగ్రమ్ రిసార్టును గతంలో నిర్వహించి ఉన్న సీజీహెచ్ ఎర్త్ ఎక్స్పీరియన్స్ హోటల్స్ యజమాని ఒకరు రిసార్టును తాను సందర్శిస్తానని కోరితే, అధికారుల నుంచి కనీస స్పందన కూడా లేదు. ఆ రిసార్ట్ పరిస్థితి ఏమిటో, ఎలా ఉందో తెలీకుండానే మేం బిడ్‌లో ఎలా పాల్గొనగలం అని అమృతర చెయిన్ ప్రీమియం రిసార్టులను నిర్వహిస్తున్న గుర్మీత్ సింగ్ ఓబెరాయ్ ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మేం ప్రస్తావించాం. ఇప్పుడు కరోనా మహమ్మారి విస్తృతంగా ఉంది. మేం ఆ ప్రాంతాన్ని సందర్శించలేం. మీరు మమ్మల్ని ఎందుకు ఇంత తొందర పెడుతున్నారు అనడిగాం. కానీ మా పర్యటనను వాయిదా వేయడాన్ని వారు పట్టించుకోలేదు. పైగా ముంబై ప్రాంత హోటల్ యజమాని ఒకరు ఆ రిసార్టును ఇప్పటికే ఎవరికైనా ప్రత్యేకించారా అని ప్రశ్నించడంతో వాతావరణం వేడెక్కింది. లక్షద్వీప్‌లో ప్రఫుల్ పటేల్ ప్రారంభంలో తీసుకున్న చర్యలు కానీ, రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లో ఆయన ప్రారంభించిన రెండు ఇన్నింగ్స్‌లు కానీ పలువురిలో సందేహాలను రేకెత్తిస్తున్నాయి. డామన్ డయ్యూ, దాద్రా నాగర్ హవేలిల్లోకూడా ప్రపుల్ ప్రభుత్వ సిబ్బందిపై వేటువేశారు. పైగా పాఠశాల మధ్యాహ్న భోజన పథకాలపై తనదైన సాంస్కృతిక విలువలను రుద్దేశారు. తన కార్యాలయంలోనే సమస్త అధికారాన్నీ కేంద్రీకరించుకున్నారు. అపఖ్యాతి పొందిన గూండా చట్టాలను విధించారు. ఈ ద్వీపాల్లో అతిపెద్ద రోడ్, హైవై, ఇతర సివిల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇకపోతే డామన్ డయ్యూలో ప్రఫుల్ పటేల్ నిర్వాకంపై గుణపాఠాలు మరింత ప్రబలంగా ఉన్నాయి. అసలుకు ప్రఫుల్‌ను ఈ ప్రాంతానికి ఎందుకు పంపించారు అనే అంశంపై పూర్తి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అతడిని అక్కడికి పంపించారని కొన్ని మీడియా రిపోర్టులు తెలుపుతున్నాయి. అదే సమయంలో రాష్ట్ర కేబినెట్లో కనీసం ఒక సీటును కూడా అతడు ఎన్నడూ నిర్వహించలేదన్న వాస్తవాన్ని కొన్ని పత్రికలు బయటపెట్టాయి. దీంతో కేంద్రప్రభుత్వ వర్గాలలో అతనంటే చిన్నచూపు ఏర్పడిపోయిందని, లేకా అతడు చాలా స్వార్థపరుడని, దురాశా జీవి అని, చాలామంది అధికారులు అతడికి దూరంగా జరిగారని గుజరాత్ కేంద్రంగా పనిచేసే ఒక సామాజిక శాస్త్రవేత్త పేర్కొనడం గమనార్హం. డామన్ డయ్యూ ప్రాంతాన్ని చేరీ చేరగానే ఏం జరిగిందన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అడుగుపెట్టగానే స్థానిక ఎంపీలనుంచి, ఇతర ప్రజా ప్రతినిధులనుంచి అధికారాన్ని అమాం తంగా లాగేసుకున్నారు. అదే సమయంలో పాలనా యంత్రాంగంలో తన సలహాదారులను నియమించుకున్నారు. పటేల్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డీఏ సత్య, శివస్సా ప్రాంతంలో వినోబా భావే ఆసుపత్రికి అధిపతిగా ఉన్న వీకే దాస్, స్థానిక అవినీతి వ్యతిరేక బ్యూరోను నిర్వహిస్తున్న ఏయూ జడేజా, సివిల్ కన్స్ట్రక్షన్ పనులను పరిశీలించే బీసీ వర్లి, తదితరులు తన చెంత చేరిపోయారు. చివరకు ఉన్నతాధికారులు సైతం ప్రపుల్ ఆదేశానుసారం వ్యవహరించాల్సి వస్తోందని స్థానిక వ్యాపారవేత్త ఒకరు చెప్పారు. కేంద్రపాలిత ప్రాంత అధికారులతో పనిచేయడానికి బదులుగా తన సొంత వ్యక్తులతో ఎలా పని చేయించుకుంటున్నారని ప్రముఖ మీడియా సంస్థలు ప్రఫుల్ పటేల్‌ని ప్రశ్నించాయి కానీ ఆయన స్పందించలేదు. మరోవైపున హోటళ్లు, సివిల్ కన్స్ట్రక్షన్ వంటి రంగాలకు టెండర్లను కూడా ఆహ్వానించారు. సివిల్ కన్స్ట్రక్షన్ రంగాన్ని పరిశీలించినప్పుడు స్థానిక అధికారులు, కార్యకర్తలు అనేక ఆరోపణలు చేశారు. మొదటగా ఈ వ్యవహారాలతో సంబంధమున్న కొందరు వ్యక్తులు ప్రఫుల్ చేపట్టిన ప్రాజెక్టుల హేతుబద్ధతను ప్రశ్నించారు. కనీసం సైకిల్ తిరగడానికి కూడా తావు లేని చోట నాలుగు లేన్ల ప్రధాన రహదారిని నిర్మించాలని ప్రఫుల్ ప్రతిపాదించారని ఒక ఉన్నతాధికారి ఆరోపించారు. ఈ విషయాన్ని ఎత్తిచూపినప్పటికీ ప్రఫుల్ కనీసం స్పందించలేదు. రెండో విషయం ఏమిటంటే, లక్షద్వీప్ ప్రాంతంలో ప్రస్తుతం అనేక కాంట్రాక్టులను కొన్ని కంపెనీల చేతుల్లో పెట్టేశారు. అయితే ఇవన్నీ గుజరాత్‌కి చెందిన కంపెనీలు మాత్రమే. ఉదాహరణకు ఆర్కేసీ ఇన్ఫ్రా బిల్ట్ అనే కంపెనీకి అతి పెద్ద భాగస్వామి ఎవరంటే గోద్రాకు చెందిన కమలేశ్ కుమార్ నవీన్ చంద్ర షా. అనేక పెద్ద సివిల్ కన్స్ట్రక్షన్ పనులు ఈ కంపెనీకి వెళ్లిపోయాయని స్థానిక వ్యాపారవేత్త చెప్పారు. ఈయన అభిప్రాయంతో కేంద్రపాలిత ప్రాంత ఉన్నతాధికారి కూడా ఏకీభవించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. టెండర్లలో అంచనా వేసిన వ్యయానికి 41.87 శాతం, 33 శాతం అధికంగా కోట్ చేసినప్పటికీ ఇదే కంపెనీకి కాంట్రాక్టులు దక్కాయి. వాస్తవానికి 30 శాతం కంటే అధికంగా అంచనా వేసిన టెండర్లను రద్దు చేసి మళ్లీ ఆహ్వానించాల్సి ఉంది. ఇదీ ప్రఫుల్ నేతృత్వంలో లక్షద్వీప్‌లో ప్రస్తుతం సాగుతున్న వ్యవహారం. ఎమ్. రాజశేఖర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు (ది వైర్ సౌజన్యంతో) -
భారత ఏకీకరణకు అంబేడ్కర్ పునాది
స్వతంత్ర భారత ఏకీకరణ కర్తగా చరిత్రకెక్కిన సర్దార్ పటేల్ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్.. దేశమంతటా విస్తరించి ఉన్న సంస్థానాలు విలీనం కావడం ద్వారా భారత ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత్‌ను వదిలి వెళుతున్నందున దేశంపై తన సార్వభౌమాధికారం ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946వో బ్రిటిష్ కేబినెట్ మిషన్ చేసిన ప్రకటన డొల్లతనాన్ని న్యాయకోవిదుడిగా అంబేడ్కర్ విప్పి చెప్పారు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయంటూ వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్ పేర్కొన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా సంస్థానాల ఉనికిని భారత్ గుర్తించదని అంబేడ్కర్ తేల్చిచెప్పారు. సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు. వైవిధ్యపూరితమైన భారతదేశం కోసం హక్కుల ప్రాతిపదికన రాజ్యాంగ రూపకర్తగా సుపరిచితులైన బీఆర్ అంబేడ్కర్ భారత ఏకీకరణలో కూడా అద్వితీయ పాత్ర నిర్వహిం చారు. భారత్ తొలి హోంమంత్రిగా, స్వతంత్ర భారత్‌ని ఏకీకరణ చేసిన వాడిగా కీర్తిపొందిన సర్దార్ పటేల్ కంటే చాలా కాలం క్రితమే అంటే 1931లోనే అంబేడ్కర్.. చెల్లాచెదురుగా విస్తరించి ఉన్న సంస్థానాలు భారత్‌లో విలీనమైపోవడం ద్వారా భారత్ ఏకీకరణ అనివార్యమని చెప్పి ఉన్నారు. భారత యూనియన్‌లో చేరబోమని, కొత్తగా ఏర్పడిన ఐక్యరాజ్య సమితికి అప్పీల్ చేస్తామన్న హైదరాబాద్ నిజాం, ట్రావెన్కోర్ సంస్థానాల తలంపును 1947 జూన్‌లో న్యాయపరంగానే చెల్లకుండా చేసిన ఘనత కూడా అంబేడ్కర్‌దే. భారత ప్రభుత్వం 1935 చట్టం నిర్దేశకత్వంలో నిర్వహించిన మూడు రౌండ్ టేబుల్ సదస్సులకూ హాజరైన అతికొద్దిమంది వ్యక్తుల్లో అంబేడ్కర్ ఒకరు. గాంధీ రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరయ్యారు. 1930లలో లండన్‌లో జరిగిన ఈ సదస్సులలో దురదృష్టవశాత్తూ సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూలకు ప్రతినిధులుగా పాత్ర లేకపోయింది. వారు హాజరై ఉంటే లండన్ సదస్సుల్లో అంబేడ్కర్ న్యాయ సూక్ష్మత, పటిమను వారు ప్రత్యక్షం గా చూడగలిగేవారు. సంస్థానాల ఉనికిని తోసిపుచ్చిన అంబేడ్కర్ ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో భాగంగానే ఫెడరల్/స్ట్రక్చర్ కమిటీలో చాంబర్ ఆప్ ప్రిన్సెస్‌కు ప్రాతినిధ్యం వహించిన బికనీర్ మహారాజుతో 1931 సెప్టెంబర్ 16న అంబేడ్కర్ ఘర్షించారు. 1935 తర్వాత బ్రిటిష్ ఇండియా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోసం సంస్థానాధిపతులు చేసిన ప్రయత్నాన్ని అంబేడ్కర్ ఈ సమావేశంలోనే తోసిపుచ్చారు. బ్రిటిష్ ఇండియాలో ఒక జిల్లా సగటున నాలుగు వేల చదరపు మైళ్ల విస్తీర్ణం, 8 లక్షల జనాభాతో కూడి ఉండగా, దేశంలోని 562 సంస్థానాల్లో 454 సంస్థానాలు వెయ్యికంటే తక్కువ చదరపు మైళ్ల విస్తీర్ణం, లక్షకంటే తక్కువ జనాభాను మాత్రమే కలిగి ఉన్నాయని, వీటిలో 374 సంస్థానాలు లక్షరూపాయలకంటే తక్కువ వార్షికాదాయాన్ని కలిగి ఉన్నాయని అంబేడ్కర్ పేర్కొన్నారు. వీటిలో కొన్ని సంస్థానాలు ఎంత చిన్నవంటే వాటికి దక్కిన గౌరవం పట్ల ఎవరూ కనీస సానుభూతి కూడా చూపేవారు కాదు. 15 సంస్థానాలయితే ఒక చదరపు మైలు కంటే తక్కువ విస్తీర్ణంలో ఉండేవి. 27 సంస్థానాలు సరిగ్గా చదరపు మైలు విస్తీర్ణంలో ఉండేవి. 14 సంస్థానాలు ఒక్క సూరత్ జిల్లాలోనే ఉండేవి. వీటి వార్షికాదాయం సంవత్సరానికి 3 వేల రూపాయలకు పైబడి ఉండేది. వీటిలో మూడు రాష్ట్రాల్లో ఒక్కో దాని జనాభా నూరుకంటే తక్కువే. అయిదు సంస్థానాలకైతే వార్షికాదాయం వంద రూపాయలలోపే ఉండేదని అంబేడ్కర్ వివరించారు. సంస్థానాన్ని ప్రత్యేకంగా, స్వతంత్రంగా ఉంచడం ద్వారా ఆ సంస్థానాధిపతిని రాజాధిరాజుగా సంబోధిస్తూ నిత్యం సంతోషపెట్టడానికి ప్రయత్నించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఉపయోగమూ లేదని అంబేడ్కర్ ఆ సమావేశంలో తేల్చి చెప్పారు. సంస్థానాల పరిస్థితి ఇలా ఉండగా, స్వావలంబన లేకుండా, కుహనా దర్పంతో, గర్వంతో జీవిస్తున్న ఇలాంటి సంస్థానాధిపతులకు భారత యూనియన్‌లో చేరడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. కానీ రెండే రెండు సంస్థానాలు మాత్రం 1947 ఆగస్టు 17న స్వాతంత్య్రం ప్రకటించుకున్నాయి. తాను భారత్‌ను వదిలి వెళుతున్నందున సార్వభౌమాధికారం అనేది ఇక చెల్లదని, తమ తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో సంస్థానాలు చేరవచ్చు లేక స్వతంత్రంగా ఉండవచ్చు అంటూ 1946లో బ్రిటిష్ కేబినెట్ మిషన్ చేసిన ప్రకటనతో ఈ గందరగోళం ఏర్పడింది. ఇదే విషయాన్ని 1947 జూన్ 3న మౌంట్‌బాటన్ మళ్లీ చెప్పారు. సార్వభౌమాధికారంపై న్యాయపరమైన స్పష్టత బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిని అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. 1947 జూన్ 17న ఒక ప్రకటన చేస్తూ సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని అనుమతించిన బ్రిటిష్ పాలకులపై అంబేడ్కర్ విరుచుకుపడ్డారు. అంబేడ్కర్ ప్రకటన నాటి పత్రికల్లో విస్తృతంగా ప్రచురితమైంది. సార్వభౌమాధికార సిద్ధాంతం ద్వారానే బ్రిటిష్ పాలకులు స్థానిక రాజ్యాలను నియంత్రించేవారు. సంస్థానాలపై సార్వభౌమాధికారం చలామణి అవుతూ వచ్చేది. అంబేడ్కర్ దీనిపైనే వాదిస్తూ, 1947 జూన్ 17 నాటికి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధినివేశ ప్రతిపత్తికిందే ఉంటూ వస్తోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా, ఐర్లండ్ దేశాల్లాగే 1950 జనవరి 26 వరకు భారతదేశం బ్రిటిష్ వారి అధినివేశ ప్రతిపత్తి కిందే ఉండేది. భారత ప్రభుత్వం (నెహ్రూ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం) స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నందున దానికి స్థిరమైన విశేష అధికారంతో చక్రవర్తికి సూచించగల ప్రత్యేక హక్కు ఉందని, ఆ సూచనను బ్రిటిష్ చక్రవర్తి తిరస్కరించలేరని అంబేడ్కర్ రాజ్యాంగ చట్టాన్ని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సార్వభౌమాధికారాన్ని వదులుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వం సంస్థానాలకు స్వాతంత్య్రాన్ని మంజూరు చేయడం పట్ల అంబేడ్కర్ తప్పు పట్టారు. చక్రవర్తి తన ప్రత్యేకాధికార హక్కులను వదులుకోవడం లేక మరొకరికి అప్పగించడం చేయలేరని, చక్రవర్తి సార్వభౌమాధికారాన్ని మరొకరికి (భారత ప్రభుత్వానికి) అప్పగించలేనట్లయితే, దాన్ని చక్రవర్తి వదులుకోలేరని కూడా అంబేడ్కర్ వాదించారు. ఈ ప్రాతిపదికన కేబినెట్ మిషన్, మౌంట్ బాటన్ ప్రకటనలు రద్దు చేయదగినవని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు. కొత్తగా అధికారంలోకి వస్తున్న ప్రభుత్వానికి అంతకు ముందటి ప్రభుత్వం చలాయించిన కొన్ని హక్కులు వారసత్వంగా సంక్రమిస్తాయని వారసత్వానికి సంబంధించిన అంతర్జాతీయ చట్టం చెబుతోందని అంబేడ్కర్ పేర్కొన్నారు. సార్వభౌమాధికారం నుంచి భారతీయ సంస్థానాలు తమను తాము విముక్తి చెందించుకోగల ఏకైక మార్గం ఏదంటే, సౌర్వభౌమాధికారాన్ని, రాజ్యాధికారాన్ని విలీనం చేయడమేనని అంబేడ్కర్ స్పష్టం చేశారు. స్వతంత్ర భారతదేశం సంస్థానాల స్వతంత్రతను గుర్తించదని, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన విదేశీ ప్రభుత్వాలుగా వాటి ఉనికిని భారత్ గుర్తించదని అంబేడ్కర్ హెచ్చరించారు. సంస్థానాల వక్రమార్గంపై అంబేడ్కర్ తీవ్ర హెచ్చరిక ఐక్యరాజ్యసమితి గుర్తింపును, రక్షణను పొందుతామని సంస్థానాలు ఆశించడం అంటే పిచ్చివాళ్ల స్వర్గంలో నివసించినట్లే కాగలదని అంబేడ్కర్ హెచ్చరించారు. సంస్థానాలపై తన అధికారాన్ని భారత్ చాటుకోవడాన్ని పక్కనపెట్టి ఐక్యరాజ్యసమితి సంస్థానాలను గుర్తిస్తుందా అని అంబేడ్కర్ సందేహం వ్యక్తపరిచారు. తమ పరిధిలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పర్చకుంటే విదేశీ దాడి నుంచి లేక అంతర్గత తిరుగుబాటు నుంచి భారతీయ సంస్థాన ప్రభుత్వాలకు ఐక్యరాజ్యసమితి ఎన్నటికీ సహకారం అందించదని, కాబట్టి వక్రమార్గం పడుతున్న భారతీయ సంస్థానాలు.. ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకుంటుదని ఆశలు పెట్టుకోలేవని అంబేడ్కర్ స్పష్టం చేశారు. సంస్థానాలకు మినహాయింపునిస్తూ 1946లో కేబినెట్ మిషన్ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మౌనం పాటించిన సమయంలో అంబేడ్కర్ అందించిన న్యాయపరమైన స్పష్టత సంస్థానాలకు తలుపులు మూసివేసి భారత సంపూర్ణ ఏకీకరణకు దారి కల్పించింది. ఈ క్రమంలోనే ఊగిసలాటకు గురవుతూ వచ్చిన ట్రావెన్కోర్, జోధ్‌పూర్, బికనీర్, జైసల్మీర్, రాంపూర్, భోపాల్ సంస్థానాలు భారత్‌లో విలీనం కాగా, జునాగఢ్ సంస్థానం మాత్రం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లింది. 1947 జూన్ 17న తాను ప్రకటన చేసిన కొన్ని వారాల తర్వాత అంబేడ్కర్ భారత న్యాయశాఖ మంత్రిగా నెహ్రూ ప్రభుత్వంలో చేరడమే కాకుండా సంపూర్ణ ఏకీకరణ పూర్తి చేసుకున్న స్థిరమైన జాతిగా భారత్‌ను ముందుకు నడిపించారు. హైదరాబాద్ ఏకీకరణ ఆపరేషన్ని పోలీస్ యాక్షన్ అని పిలవాలని, దాన్ని భారత సైనిక చర్యగా పిలవవద్దని నెహ్రూకు సలహా ఇచ్చిన ఘనత కూడా అంబేడ్కర్‌కే దక్కుతుంది. తన రాజ్యాంగ పదవి ఆధారంగా, హైదరాబాద్‌ని భారత్‌లో విలీనం చేయడం ప్రభుత్వాధికారానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని గుర్తించబట్టే అంబేడ్కర్ హైదరాబాద్ విలీన చర్యను పోలీస్ యాక్షన్‌గానే పేర్కొన్నారు. వ్యాసకర్త: రాజశేఖర్ ఉండ్రు ,సీనియర్ ఐఏఎస్ అధికారి, రచయిత -
రాజశేఖర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై సిటీ న్యూరో సెంటర్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని, ప్లాస్మా థెరపీ కూడా చేశామని తెలిపారు. అలాగే సైటో సోర్బ్ అనే పరికరం ద్వారా కూడా చికిత్స చేస్తున్నామని వారు వెల్లడించారు. చదవండి: నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం గతంతో పోల్చితే ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని డాక్టర్ రత్న కిషోర్ తెలిపారు. కాగా అక్టోబర్ 17న ఇద్దరు కూతుళ్లు, భార్య జీవితతో సహా రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ కోలుకోగా రాజశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: ఐసీయూలో హీరో రాజశేఖర్ -
కరోనా: వాయిదా పడిన ‘అర్జున’ విడుదల
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన అర్జున చిత్రాన్నివాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది. సినిమాను ముందుగా ఈ నెల 6న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా 13న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు నట్టి కరుణ, నట్టి క్రాంతి వెల్లడించారు. కరోనా ప్రభావం కారణంగానే చిత్రం విడుదలను వారం రోజుల పాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. రాజశేఖర్ సరసన అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై రూపొందుతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్ ట్రెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇందులో రాజశేఖర్ తండ్రీ కొడుకులుగా అద్భుతమైన నటనను కనబరిచారని అన్నారు. సమకాలీన రాజకీయ నేపథ్య పరిస్థితులకు అద్దంపట్టే చిత్రమని, యదార్థ సంఘటనలను ప్రేరణగా తీసుకుని సహజత్వానికి దగ్గరగా దీనిని మలచడం జరిగిందని చెప్పారు. కాస్త వయసు మళ్ళిన సూర్యనారాయణ అనే రైతు పాత్రలోనూ... అలాగే ఆయన తనయుడిగా అర్జున పాత్రలోనూ రాజశేఖర్ ఒదిగిపోయారని అన్నారు. తండ్రీకొడుకుల మధ్యన వచ్చే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు మరో హైలైట్ గా నిలుస్తాయి అని అన్నారు. -
సూపర్ హిట్ రీమేక్‌పై క్లారిటీ
కోలీవుడ్‌లో ఘన విజయం సాధించిన విక్రమ్ వేదా సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఈ రీమేక్ ఓకె అయినట్టుగా వార్తలు వినిపించాయి. తమిళ్లో మాదవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించగా తెలుగు వర్షన్లో బాలకృష్ణ, రాజశేఖర్ నటిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై విక్రమ్ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య, రాజశేఖర్ విక్రమ్ వేదా రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ పుకార్లని కొట్టిపారేశారు. అంతేకాదు ఇప్పటి వరకు విక్రమ్ వేదా రీమేక్ రైట్స్‌ను ఎవరికీ ఇవ్వలేదన్న వై నాట్ స్టూడియోస్ ప్రతినిధులు, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని కోరారు. -
ఎనిమిదేళ్ల తరువాత ‘అర్జున’ విడుదల
గరుడవేగ సినిమా యాంగ్రీ హీరో రాజశేఖర్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అందుకే ఈ సినిమా తరువాత రాజశేఖర్ కెరీర్ మళ్లీ ఊపందుకుంది. అంతేకాదు గతంలో రాజశేఖర్ హీరోగా ప్రారంభమై ఆగిపోయిన సినిమాలకు కూడా ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. 2011లొ రాజశేఖర్ హీరోగా అర్జున సినిమాను ప్రారంభించారు. తరువాత ఏమైందో కాని ఈ సినిమా ఊసే లేదు. ఏళ్లు గడిచిపోయాయి. రాజశేఖర్ ఇతర చిత్రాలతో బిజీ అయ్యాడు. సడన్‌గా ఇప్పుడు అర్జున తెర మీదకు వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసి ఈ నెల 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇదే జోరులో రామ్ గోపాల్ వర్మ, రాజశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన పట్టపగలు సినిమా కూడా రిలీజ్ అవుతుందేమో చూడాలి. కన్మణి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అర్జున’ సినిమాలో మర్యం జకారియా, సాక్షి గులాటీలు హీరోయిన్లుగా నటించగా వందేమాతరం శ్రీనివాస్ సంగీతమందించారు. రాజశేఖర్ ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. -
రాజమౌళి ఆ ‘ఆర్’ పై క్లారిటీ
బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత రాజమౌళి ఓ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ అనే టీజర్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్లో తానో మల్టీ స్టారర్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు రాజమౌళి. అధికారిక ప్రకటనకు ముందు నుంచే ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపించాయి. సినిమా నటీనటుల నుంచి పాత్రల వరకు చాలా రూమర్స్ టాలీవుడ్ లో చక్కర్లు కొట్టాయి. అదే బాటలో ఈ సినిమాలో విలన్‌గా యాంగ్రీ హీరో రాజశేఖర్ నటించనున్నాట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై రాజశేఖర్ భార్య జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘తమ కూతురు శివానీ హీరోయిన్ గా తెరకెక్కుతున్న 2 స్టేట్స్ సినిమా ప్రారంభోత్స కార్యక్రమానికి ఆహ్వానించేందుకు మాత్రమే రాజమౌళిని కలిసాం. మల్టీ స్టారర్‌కు సంబంధించి రాజమౌళి గారు తమను సంప్రదించలేదన్నారు’ దీంతో రాజమౌళి మల్టీ స్టారర్లో రాజశేఖర్ విలన్ అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది. అంతేకాదు సినిమాలో నటీనటుల ఎంపికకు రాజమౌళి ఆర్ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారన్న వార్తలు నిజంగా కాదని తేలిపోయింది. -
అది నరబలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సంచలనం సృష్టించిన నరబలి కేసులో చిక్కుముడి వీడింది. ఉప్పల్‌లోని చిలుకానగర్ ఇంటి యజమాని రాజశేఖర్, అతని భార్య శ్రీలత క్షుద్రపూజల పేరిట ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారని రాచకొండ పోలీసులు తేల్చారు. నరబలి ఇస్తే శ్రీలత ఆరోగ్యం మెరుగు పడుతుందని ఓ కోయ దొర చెప్పిన మాటలతో వీరు ఈ దారుణానికి పాల్పడ్డారని వెల్లడించారు. క్షుద్రపూజలు చేసిన గదిలో లభించిన రక్తపు మరకలు, శిశువు తల భాగం నుంచి సేకరించిన డీఎన్ఏ నమూనాలతో సరిపోలడంతో ఈ కేసులో స్పష్టతకు వచ్చిన పోలీసులు.. రాజశేఖర్, అతని భార్య శ్రీలతను గురువారం అరెస్టు చేశారు. కేసు వివరాలను ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ మీడియాకు తెలిపారు. కోయదొర చెప్పిన మాటలతో.. ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో తేరుకొండ రాజశేఖర్, శ్రీలత నివాసం ఉంటున్నారు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ భార్య శ్రీలత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఎందరు వైద్యులను సంప్రదించినా మార్పురాలేదు. రెండేళ్ల క్రితం సమ్మక్క–సారక్క జాతరకు వెళ్లిన రాజశేఖర్ దంపతులు అక్కడి ఓ కోయదొరను ఆశ్రయించారు. నరబలి ఇస్తే ఆమె ఆరోగ్యం కుదుటపడుతుందని అతడు తెలిపాడు. ఆ తర్వాత కూడా శ్రీలత ఆరోగ్యం కుదుటపడాలనే ఉద్దేశంతో పలువురు మంత్రగాళ్లను ఆశ్రయించినా.. పరిస్థితి మెరుగు పడకపోవడంతో నరబలికి సిద్ధమయ్యారు. బోయిగూడలో శిశువు అపహరణ.. జనవరి 31న రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో బోయగూడలో రెక్కీ చేసిన రాజశేఖర్ మూడు నుంచి ఆరు నెలల వయసున్న ఆడ శిశువు విచక్షణాజ్ఞానం లేని తల్లిదండ్రుల వద్ద ఉన్నట్టు గుర్తించాడు. చంద్రగ్రహణం రోజున నరబలి ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి ఒకటో తేదీన అర్ధరాత్రి 12.45 గంటలకు ఇంటి నుంచి కత్తి, పాలిథిన్ బ్యాగ్‌లను తీసుకుని ఏపీ20టీవీ1646 కారులో బయలుదేరి 1.30 గంటలకు బోయిగూడ చేరుకున్నాడు. ఫుట్‌పాత్‌పై ఆదమరిచి నిద్రిస్తున్న చిన్నారిని అపహరించి పీర్జాదిగూడ ప్రతాపసింగారం మూసీ కాలువ వద్దకు రెండు గంటలకు తీసుకెళ్లి శిశువు గొంతు, మొండెంను కత్తితో నరికి వేరుచేశాడు. శిశువు మొండెం, కత్తిని మూసీలో పడేసి పాలిథిన్ కవర్లో తలను తీసుకుని తెల్లవారుజామున మూడు గంటలకు ఇంటికి చేరుకున్నాడు. నగ్నంగా భార్యాభర్తల క్షుద్రపూజలు తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు గంటల మధ్య శిశువు తలను పెట్టి భార్యాభర్తలిద్దరూ నగ్నంగా క్షుద్రపూజలు చేశారు. అనంతరం శిశువు తలకు సూర్యకిరణాలు పడేలా ఇంటిపై తలను ఉంచి కిందికి వచ్చారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రాజశేఖర్ క్యాబ్‌ను తీసుకుని మాదాపూర్‌కు బయలుదేరాడు. 10.20కి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. రాజశేఖర్ అత్తమ్మ వీరకొండ బాలలక్ష్మి ఉదయం 11 గంటలకు బట్టలు ఆరేసేందుకు భవనంపైకి వెళ్లి శిశువు తలను చూసి కేకలు వేసింది. ఈ మేరకు అందిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శిశువు తలను గాంధీ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. రాజశేఖర్ ఇంట్లో దొరికిన రక్తనమూనాలు శిశువు డీఎన్ఏతో సరిపోలాయని ఫోరెన్సిక్ ల్యాబ్ ఇచ్చిన నివేదికతో రాజశేఖర్, శ్రీలతను పోలీసులు అరెస్టు చేశా రు. క్షుద్రపూజలకు రాజశేఖర్ వాడిన వస్త్రాలను, దాచిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు నరబలి జరిగిన పౌర్ణమి నుంచి అమావాస్య వరకు అంటే 2 వారాల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. 45 మందిని విచారించామని, ఆధారాల కోసం 112 ఫోన్‌కాల్స్, 54 సెల్ టవర్ల డేటాను సేకరించామని, 40 మంది సాక్షులను, వందకుపైగా సీసీ కెమెరా పుటే జీలను పరిశీలించామని, డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా నరబలికి గురైంది ఆడ శిశువుగా గుర్తించామని, డీఎన్ఏ ఫలితాలతో నిందితులు దొరికిపోయారని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. వీరిని విచారిస్తే ఈ కేసుపై పూర్తి స్పష్టత వస్తుందని తెలిపారు. -
చిన్నారి నరబలి కేసులో షాకింగ్ నిజాలు!
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను కలిశారు. ఆరోగ్యం బాగుపడాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగి పోవాలంటే నరబలి ఇవ్వడమే మార్గమని ఆ కోయదొర, మాంత్రికుడు ఈ దంపతులకు చెప్పాడు. ఇక అప్పటినుంచీ నరబలి గురించి ఎంతో ఆలోచిస్తున్న రాజశేఖర్, శ్రీలతలు బలి ఇచ్చేందుకు పిల్లలు ఎక్కడ దొరుకుతారని తీవ్రంగా యత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గత జనవరి 31న రాజశేఖర్ సోదరుడు గణేశ్ బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను నిందితులు పడేశారు. పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండేళ్ల నుంచి నరబలి ఇవ్వడానికి నిందితులు యత్నిస్తున్నట్లు తెలియడంతో పోలీసులే షాకయ్యారు. సెక్షన్ 124 , 302, 366, 201, 120 B కింద కేస్ నమోదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నరబలి జరిగినట్లు గుర్తించాం: మహేష్ భగవత్ నరబలి కేసుపై రాచకొండ సీపీ మహేష్ భగవత్ పలు విషయాలు వెల్లడించారు. ఇటీవల జరిగిన నరబలి కేసును చేధించాం. చిన్నారి నరబలి కేసులో మొత్తం 122 ఫోన్లు, 54 సెల్ టవర్ ల డేటాను అనలైజ్ చేశాం. మొత్తం 40 మంది సాక్షులను, 45 మంది అనుమానితులను విచారించాం. 100 సీసీ కెమెరాల డేటాను పరిశీలించాం. ప్రధాన నిందితుడు రాజశేఖర్‌తో పాటు భార్య శ్రీలత, ఓ మాంత్రికుడు సహా పాపను తీసుకు వచ్చిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశాం. మొత్తం ఇప్పటి వరకు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశాం. భిన్నకోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత నరబలి జరిగినట్లు గుర్తించాం. క్యాబ్ డ్రైవర్, ఇంటి యజమాని రాజశేఖర్ కోయదొర, మాంత్రికుడి సలహా మేరకు పాపను నరబలి ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది. ఘటనా స్థలంలో లభ్యం అయిన నమూనాలతో ఫొరెన్సిక్ నివేదిక సమర్పిచింది. డీఎన్ఏ రిపోర్ట్ ద్వారా బలిచ్చింది ఆడ శిశువునే అని నిర్ధారణకు వచ్చినట్లు సీపీ మహేష్ భగవత్ వివరించారు. -
గుట్టు విప్పిన డీఎన్ఏ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకా నగర్‌లోని చిన్నారి నరబలి కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించిన తల, అతడి ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడ శిశువువిగా ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. మూఢ నమ్మకాల నెపంతో చిన్నారిని బలి ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. బలి ఇచ్చిన చిన్నారిని బోయగూడలోని ఫుట్‌పాత్ వద్ద నిద్రిస్తున్న వారి దగ్గర నుంచి చిన్నారిని ఎత్తుకొచ్చినట్లు సమాచారం. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, అతని భార్య శ్రీలత, బంధువులు లచ్చక్క, బుచ్చమ్మ, నలుగురు మాంత్రికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రాజశేఖర్ తన భార్య శ్రీలత ఆరోగ్యం కోసం నరబలి చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్న విషయం తెలిసిందే. నిందితులను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నరబలి తర్వాత పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నరబలి కేసులో మరొ కొత్త ట్విస్ట్.. నరబలి కేసులో బోయగూడకు చెందిన రాజశేఖర్ సోదరుడు గణేశ్ కీలకంగా వ్యవహారించాడు. గణేశ్ చార్మినార్‌లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందు జాగ్రత్త పడ్డారు. వీరిద్దరికి కన్నతల్లి అన్ని విధాలా సహకరించింది. తనకు ఏమి తెలియనట్లు రాజశేఖర్ తల్లి పోలీసుల దగ్గర నమించే ప్రయత్నం చేసింది. కేసు దర్యాప్తులో మృతి చెందిన చిన్నారిని తల్లి గుర్తించడమే కాకుండా గణేశ్ అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల దృష్టి మరల్చేందుకు అర్ధరాత్రి సమయంలో గణేశ్ నరహరి ఇంటిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. -
నవంబర్ 3న గరుడ వేగ
సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో గరుడ వేగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. శ్రద్దా దాస్, పూజ కుమార్, కిశోర్, ఆదిత్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఇటీవల విడుదలైన గరుడవేగ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజశేఖర్ కౌంటర్ టెర్రరిజం ఫైటర్ గా నటిస్తున్న ఈ సినిమాను స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. ఎక్కువగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న గరుడవేగ, నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జర్నలిస్ట్ పాత్రలో శ్రద్ధాదాస్
హీరోయిన్ శ్రద్ధాదాస్ 'పిఎస్వి గరుడవేగ 126.18ఎం' సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేస్తుంది. యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరోగా, చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పి.ఎస్.వి గరుడ వేగ 126.18 ఎం . ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ పాత బస్తీలో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రాజశేఖర్ ఎన్ఐఎ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. రాజశేఖర్ కెరీర్లోనే పాతిక కోట్లకు పైగా బడ్జెట్‌తో తొలిసారిగా ఈ సినిమా రూపొందుతుంది. మెయిన్ విలన్ జార్జ్ పాత్రలో కిషోర్ నటిస్తున్నాడు. హీరోయిన్ పూజా కుమార్, రాజశేఖర్ భార్య పాత్రలో నటిస్తుంది. గుంటూరు టాకీస్ చిత్రంలో హిలేరియస్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించిన శ్రద్ధాదాస్ ఈ సినిమాలో కాంటెంపరరీ జర్నలిస్ట్ పాత్రలో కనపడనుంది. ప్రముఖ పాత్రికేయుడు అర్నాబ్ గోస్వామి స్థాయికి రావాలని కలలు కనే ఓ యంగ్ జర్నలిస్ట్ మనాలిగా బెంగాలీ బ్యూటీ శ్రద్ధాదాస్ అలరించనుంది. శ్రద్ధాదాస్ రియల్ లైఫ్ లోనూ జర్నలిజం స్టూడెంట్ కావడంతో మనాలి పాత్రలో ఒదిగిపోయింది. అదిత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా మరో కీలకపాత్రలో నటిస్తున్నాడు. సన్నిలియోన్ స్పెషల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. నాజర్, చరణ్ దీప్ తదితరులు రాజశేఖర్ ఎన్ఐఎ టీం సభ్యులుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. -
గరుడ వేగం
పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రాజశేఖర్. ‘అంకుశం’, ‘మగాడు’, ‘ఆగ్రహం’ తదితర చిత్రాల్లో పోలీస్‌గా అద్భుతమైన నటన కనబరిచి, ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొంత విరామం తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ పోలీస్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘పీఎస్వీ గరుడ వేగ 126.18ఎం’ టైటిల్ ఖరారు చేశారు. నేడు రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసి, టైటిల్ ప్రకటించారు. శివాని శివాత్మిక మూవీస్ సంస్థ సమర్పణలో జ్యో స్టార్ ఎంటర్ప్రైజెస్ పతాకంపై ఎం. కోటేశ్వరరాజు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం బ్యాంకాక్‌లో జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ – ‘‘ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో రాజశేఖర్‌ని దర్శకుడు ప్రవీణ్ సత్తారు స్టయిలిష్ లుక్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. బ్యాంకాక్‌లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నాం. ఫిబ్రవరి 15తో బ్యాంకాక్ షెడ్యూల్ ముగుస్తుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అన్నారు. -
'గరుడ వేగ'గా సీనియర్ హీరో
కొంత కాలంగా సరైన హిట్స్ లేక కష్టాల్లో పడ్డ సీనియర్ హీరో, మరోసారి తన ట్రేడ్ మార్క్ సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో వరుసగా యాంగ్రీ రోల్స్ లో సక్సెస్ లు సాధించిన రాజశేఖర్ లాంగ్ గ్యాప్ తరువాత అదే తరహా పాత్రలోకనిపించనున్నాడు. ఇటీవల విలన్ రోల్స్ కూడా సై అన్న రాజశేఖర్ హీరోగా ఫాంలోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. గుంటూరు టాకీస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, రాజశేఖర్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రోజు(శుక్రవారం) రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 'పిఎస్వి గరుడ వేగ 128.18ఎమ్' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎమ్ కోటేశ్వర రాజు నిర్మిస్తున్నారు. -
కామెడీ ట్రెండ్ సెట్టర్స్ ...
వారు కూర్చోరు, ప్రేక్షకుల్ని తిన్నగా కూర్చోనివ్వరు. స్టాండప్ అని ఎవరో ఆదేశించినట్టు నిలుచునే ఉంటారు. పంచ్‌లు పేలుస్తూ పకపకలు, జోకులతో నవ్వులు కురిపిస్తారు. వాళ్ల పేరే స్టాండప్ కమెడియన్స్. పని ఒత్తిడికి చెక్ చెప్పే ‘రెమెడి’యన్స్. నవ్వు నాలుగు కాలాలు ‘నిలిచే’ ఉంటుందంటూ.. ఇప్పుడు సిటీలో సరికొత్త హాస్య విందుకు తెరతీస్తున్న కామెడీ ట్రెండ్ సెట్టర్స్ వీరు. ..:: ఎస్.సత్యబాబు టీవీ ప్రోగ్రామ్స్ చూసేవారికి బాగా పరిచయమున్న అంశమే ఇది. ముఖ్యంగా హిందీ చానల్స్ చూసేవారికైతే కొట్టిన పిండి. ఆడియన్స్‌తో ప్రత్యక్షంగా సంభాషిస్తూ వేదిక మీద లేదా ఆడియన్స్ మధ్యలో నిలబడి నవ్వించే పద్ధతినే స్టాండప్ కామెడీగా, అలాంటి కామెడీని పండించేవారిని కామిక్లుగా పిలుస్తారు. కథలు అల్లడం, జోక్స్ గుప్పించడం, సింగిల్ లైన్ పంచ్‌లు విసరడం, మేజిక్ ట్రిక్స్ ప్లే చేయడం.. ఒకటనేమిటి ? ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఈ కామిక్స్ చేయనిదంటూ ఉండదు. ఇప్పుడు సిటీలో కాఫీ షాప్ నుంచి కార్పొరేట్ ఆఫీసుల దాకా, గ్యాలరీల నుంచి క్యాంపస్‌ల దాకా కాదేదీ కామెడీకి అనర్హం అంటూ వారు సందడి సృష్టిస్తున్నారు. వార్ టు హుషార్.. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ సైనికులు విరామ సమయంలో పంచుకున్న వినోదమే ఈ హాస్య వల్లరికి మూలం. యుద్ధం నుంచి వచ్చాక కూడా బ్రిటన్‌లోని మ్యూజిక్ హాల్స్‌లో వీరు ఈ స్టాండప్ కామెడీని పండించారని, అలా అలా అది ప్రపంచవ్యాప్తం అయిందని అంటారు. ఏమైతేనేం.. ఇప్పుడు ఈ తరహా స్టాండప్ కామిక్‌లు విశ్వవ్యాప్తంగా ఉన్నారు. హాలీవుడ్ యాక్టర్ జిమ్‌క్యారీ సైతం తన కెరీర్‌ను స్టాండప్ కామెడీతోనే స్టార్ట్ చేశాడు. కెనడాకు చెందిన రస్సెల్ పీటర్స్ వంటివారు ఈ తరహా కామెడీ షోస్‌తో బాగా పాపులర్ అయ్యారు. మన ఇండియాలో వీర్‌దాస్, నితిన్ గుప్తా వంటివారు బాగా ఫేమస్ కాగా దాదాపు 50 మంది ప్రొఫెషనల్ కమెడియన్లుగా ఉన్నారు. నగరంలో పుంజుకుంటున్న ఈ సోలో ‘షో’ను హాబీగా 15 మంది, ఫుల్‌టైమ్ కెరీర్‌గా మలచుకున్నవారు అరడజను మంది వరకూ ఉన్నారు. క్లాప్.. స్టార్టప్.. సిటీలో ఈ స్టాండప్ కామెడీ షోస్‌కి క్లాప్ కొట్టింది రాజశేఖర్. గతంలో ప్రైవేట్ ఉద్యోగి. ఓ పబ్లిక్ స్పీకింగ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన ఆయన.. అదే ఆత్మవిశ్వాసంతో కామెడీ షోలకు శ్రీకారం చుట్టారు. ‘అప్పట్లో మేం పేరుపేరునా పిలిచినా మా షోలకు 10 మంది రావడం గగనమయ్యేది. ఇప్పుడు టిక్కెట్లు కొనుక్కుని మరీ వస్తున్నారు’ అంటూ స్టాండప్ కామెడీకి పెరుగుతున్న ఆదరణను వివరించారు రాజశేఖర్. ఆద్యంతం.. నవ్వించే పంతం.. ‘రిటైర్ అవుతున్నానని నాన్నగారు విచారంగా ఉంటే అమ్మ ఆనందంగా ఉంది. ఏమ్మా నాన్న ఇక ఇంటిపట్టునే ఉంటారనా నీ ఆనందం? అని అడిగిన కొడుక్కి.. వంట బాధ తప్పుతుందనంటూ సమాధానం ఇచ్చింది’ ఓ అధికారి పదవి విరమణ సభలో స్టాండప్ కామెడీ పేల్చిన బుల్లి టపాసు ఇది. ఇలాంటి మతాబులెన్నో ఉంటాయి. ‘చాలా వరకూ రోజువారీ జీవితంలో అనుభవాలనే అంశాలుగా ఎంచుకుంటాం. అవయితేనే ఆడియన్స్ కనెక్ట్ అవుతార’ని అంటారు రాజశేఖర్. సినిమాలో హాస్యనటులకు ఉన్నట్టు కంటెంట్, ప్రిపరేషన్స్, కట్స్, టేక్స్ వంటివేమీ ఉండవు. అరగంట, గంటపాటు జరిగే షోలో ఫస్ట్ సెకన్ నుంచే నవ్వించాల్సి ఉంటుంది. కంటిన్యూగా జోక్స్ పేలుస్తుండాలి. ఒక జోక్ తుస్సుమందనుకో ప్రెజర్ పెరుగుతుంది. వరుసగా రెండు మూడు జోకులు తేలిపోయాయంటే దాన్ని అధిగమించి ప్రేక్షకుల్ని తిరిగి లాఫింగ్ లైన్లోకి తీసుకురావడం అంత ఈజీ కాదు. ఆడిటోరియాల్లో నవ్వించడం కన్నా కార్పొరేట్ కార్యాలయాల్లో నవ్వించడం కష్టం అంటారు రాజశేఖర్. ఎందుకంటే అక్కడంతా డ్యూటీ ఎట్మాస్పియర్ ఉంటుంది. మేనేజర్ నవ్వితేనే నవ్వుతారు. లేకపోతే ఇదీ జోకేనా అన్నట్టు చూస్తారు’ అని చెప్పారాయన నవ్వుతూ. కెరీర్.. సూపర్.. గంటకు రూ.25వేల దగ్గర్నుంచి నుంచి రూ.5 లక్షల దాకా చెల్లిస్తూ ప్రస్తుతం పలు సంస్థలు, హోటల్స్ ఎక్కడెక్కడి నుంచో స్టాండప్ కమెడియన్స్‌ని హైదరాబాద్ తీసుకొచ్చి షో ఇప్పిస్తున్నాయి ‘నేనీ కెరీర్ ఎంచుకున్నప్పుడు అందరూ విచిత్రంగా చూశారు. అయితే ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. మన సిటీతో పాటు బెంగళూరు, ముంబై, చెన్నైలో కూడా షోస్ ఇస్తున్నాను. ఈ ప్రొఫెషన్లోకి మరింతగా యూత్‌ని ఆకర్షించడానికి ఫన్సీ సైడ్ అప్ సంస్థను స్టార్ట్ చేశాను. ఇప్పుడు మా గ్రూప్‌లో ఐదుగురున్నారు. టీసీఎస్‌లో జాబ్ చేస్తున్న రోహిత్స్వైన్, నేషనల్ లెవల్లో పబ్లిక్ స్పీకింగ్ చాంపియన్ అవినాష్ అగర్వాల్, డెలాయిట్ ఉద్యోగి ఉమేష్ సోమాని, సాయికిరణ్‌లతో గ్రూప్‌గా, ఎవరికి వారు ఇండివిడ్యువల్‌గా కూడా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాం’ అంటూ వివరించారు రాజశేఖర్. ఈ గ్రూప్ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైనార్ట్స్‌లో నెలకొక భారీ షో, మాదాపూర్‌లో రెడ్ పాయింట్ కెఫేలో ప్రతి గురువారం ‘స్టాండప్ కామెడీ ఓపెన్ మైక్’ షో నిర్వహిస్తున్నారు. ‘ప్రతి గురువారం కామెడీ చేయడానికి కొత్త వారికి చాన్సిస్తున్నాం. వీక్లీ షోస్ టిక్కెట్ ద్వారా, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, లామకాన్ వంటి చోట్ల చేసే షోస్‌కి ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాం’అని రాజశేఖర్ చెప్పారు. -
పెద్దసారు లేక పరేషాన్!
ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ రాకపోవడంతో జిల్లా నలుమూలల నుంచి వ చ్చిన ఫిర్యాదుదారులు అసహనానికి గురయ్యారు. తమ సమస్యకు పరిష్కారం పెద్దసా రు ద్వారానే లభిస్తుందని పలువురు పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 130 వినతులు రాగా, డీఆర్వో రాజశేఖర్,కలెక్టరేట్ పరిపాలనాధికారి గంగాధర్ స్వీకరించారు. సమస్యలు పరిష్కరించండి.. తమ సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్య మిత్రలు డీఆర్వోను కలిసి కోరారు. ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమకు వేతనాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఇరాక్ బాధితులను ఆదుకోండి.. బతుకుదెరువు కోసం ఇరాక్‌కు వెళ్ళిఅరచేతిలో ప్రాణాలు పెట్టుకొని స్వదేశానికి ఉట్టి చేతులతో వచ్చిన బాధితులను ఆదుకోవాలని స్వదేశీ జాగరణ మంచ్ అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయ న బాధితులతో కలిసి డీఆర్వోకు వినతిపత్రం సమర్పించారు. ఇరాక్ బాధితులను గుర్తించి, ప్రభుత్వం నష్టపరిహారం లేదా ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. వికలాంగుల సమస్యలు పరిష్కరించండి.. జిల్లాలోని వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని మైత్రి వికలాంగుల సేవ సంస్థ ఆధ్వర్యంలో డీఆర్వోను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మైత్రి కార్యదర్శి రాణి మాట్లాడుతూ జిల్లాలో ఇంత వరకు సదరంలో 22వేల మంది వరకు వికలాంగత్వాన్ని ధ్రువీకరించుకున్నారని, కానీ అధికారులు మా త్రం కేవలం నాలుగు వేల సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారన్నారు. వికలాంగులు ఇటు కుటుంబాలకు, అటు సమాజానికి భారమై నర కయాతన అనుభవిస్తున్నారన్నారు. ప్రభుత్వం వికలాంగులందరికి సదరం సర్టిఫికెట్లు,అంత్యోదయం కార్డులు,గృహవసతి ,ఇళ్లు, ఇళ్ల స్థలాలు, ఉపాధి అవకాశాలు, వివాహ ప్రోత్సాహాక బహుమతులు ఇవ్వాలని ఆమె కోరారు. పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయండి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వెంకటి మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులతో వెట్టి చాకిరి చేయిం చుకుంటూ తక్కువ వేతనాలు అందిస్తున్నారన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకనుగుణంగా వేతనాలు అందించాలన్నా రు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారని, వెంటనే అమలుచేయాలని కోరారు. -
ఊరించి..ఉసూరుమనిపించారు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జెడ్పీ పీఠంపై లేనిపోని ఆశలు కల్పించారు. ‘మద్దతు ఇస్తే నువ్వే జెడ్పీ చైర్పర్సన్’ అని ఆ ముగ్గురు మహిళా జెడ్పీటీసీ సభ్యులకు హామీ ఇచ్చారు. తీరా డబ్బు, ఆధిపత్యం కోసం వారిని కాదని ఓర్వకల్లు జెడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌కు కట్టబెట్టారు. కొందరు నేతలు కలిసి పక్కా పథకంతో వెన్నుపోటు రాజకీయాలకు తెరలేపి ఇలా చేసినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆలూరు అసెంబ్లీ టికెట్ ఆశించిన కప్పట్రాళ్ల బొజ్జమ్మకు జెడ్పీ పీఠం కట్టబెడతామని టీడీపీ అధినేత చంద్రబాబానాయుడే హామీ ఇచ్చారు. అందుకే ఆమె ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేశారు. జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసి చిప్పగిరి స్థానం నుంచి బొజ్జమ్మ గెలవడంతో జెడ్పీ చైర్పర్సన్ ఆమెకే నంటూ టీడీపీకి చెందిన ముఖ్యనాయకులు ప్రచారం చేశారు. ఆమెను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. అయితే పదవి చేతికొచ్చే సమయంలో బొజ్జమ్మకు ఇచ్చిన హామీ అటకెక్కింది. కపట్రాళ్ల కుటుంబానికి వచ్చినట్లే వచ్చి చేజారటం ఇది రెండో సారి. గతంలో కపపట్రాళ్ల వెంకటప్పనాయుడుని జడ్పీ చైర్మన్ చేస్తామని చెప్పారు. అయితే అనూహ్యంగా బత్తిన వెంకట్రాముడుకి కట్టబెట్టారు. ఇలా ప్రతిసారీ కపపట్రాళ్ల కుటుంబానికి టీడీపీలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ పార్టీకి చెందిన కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోన్, పత్తికొండ, ఆలూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతానికి ఆ కుటుంబం కృషి చేసింది. అయితే కొందరు టీడీపీ నా యకులకు ఆ కుటుంబానికి అండగా నిల బడ్డారు. అయితే నేటికీ ఆ కుటుంబానికి టీడీపీలో పదవులు అందని ద్రాక్ష లా మారాయని కపట్రాళ్ల వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఠం దక్కించుకునేందుకు మహిళలకు అన్యాయం... జిల్లా పరిషత్ పీఠానికి అసరమైన బలం టీడీపీకి లేకపోయినా అధికార బలంతో అడ్డదారిలో దక్కించుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శివానందరెడ్డి, మాజీ ఎంపీపీ విష్ణువర్థన్‌రెడ్డిని టీడీపీ నేతలు ఉపయోగించుకున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన జెడ్పీటీసీ సభ్యులను ఈ నాయకులు బలవంతంగా టీడీపీలో చేర్పించారు. ఇష్టం లేకున్నా మభ్యపెట్టి క్యాంపులకు తీసుకెళ్లారు. అందులో నందికొట్కూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి పేరు తెరపైకి తెచ్చారు. నందికొట్కూరు నియోజక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులంతా టీడీపీకి మద్దతు తెలిపితే లక్ష్మీదేవికి జెడ్పీ పీఠాన్ని కట్టబెడతామని హామీ ఇచ్చారు. అయితే పరిణామాలు అమెకు అనుకూలంగా లేవని తెలియటంతో తిరిగి వైఎస్సార్సీపీలోకి రావటానికి ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆమెను తిరిగి పార్టీలోకి రాకుండా స్థానిక నాయకుడొకరు అడ్డుకున్నట్లు తెలిసింది. అదే విధంగా పత్తికొండ టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలు సుకన్యకు టీడీపీ నేతలు మాటిచ్చారు. దాదాపు సుకన్యనే జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి అని టీడీపీ నేతలు నిర్ణయించారని ప్రచారం జరిగింది. లేనిపోని ఆశలు చూపి ఈ ఇద్దరు మహిళలకూ టీడీపీ నేతలు అన్యాయం చేశారని మహిళా లోకం మండిపడుతోంది. అదే విధంగా టీడీపీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేస్తున్న నాయకులను కాదని కేవలం పదవి కోసం టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి జెడ్పీ పీఠాన్ని ఎలా కట్టబెడుతారని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెడ్పీ పీఠం చిచ్చు టీడీపీలో చాపకింద నీరులా అసంతృప్తి జ్వాలలు అంటుకున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. -
అంగన్‌వేడి
కలెక్టరేట్ : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే పోలీసులు ముందుజాగ్రత్తగా ప్రధాన ద్వారం ముందు ముళ్ల కంచెలు వేసి, అంగన్వాడీ కార్యకర్తలను నిలువరించారు. పది మంది మాత్రమే లోపలకు వెళ్లి తమ సమస్యలను అధికారులకు చెప్పుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో పది మంది అంగన్వాడీ కార్య కర్తలు డీఆర్వో రాజశేఖర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా సీఐటీయూ నాయకులు రమేష్‌బాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఎంతోకాలంగా సమస్యలు పరిష్కరించాలని పోరాటం చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పట్టణ ,గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు, బాలింతలకు, ఆరేళ్లలోపు పిల్లలకు సేవలందించడంలోనూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోనూ అంగన్వాడీల పాత్ర కీలకమన్నారు.దళిత,గిరిజన,బడుగు,బలహీన వర్గా లు అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగుల సేవలు ప్రాధాన్యతను ప్రభుత్వం గుర్తించాలన్నారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం సమస్యలను పరిష్కరిస్తామని గవర్నర్, సీఎం హామీ ఇచ్చారని, కానీ ఫలితంలేదన్నారు. అంగన్వాడీలను నాల్గో తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, నెలకు 15 వేల రూపాయల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కరువైందని, రిటైర్మంట్ బెనిపిట్స్ కల్పించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సెంటర్ అద్దెలు, బిల్లులు, టీఏ, డీఏలు ఇవ్వాలన్నారు. అమృత హస్తం బిల్లులను అంగన్వాడీల అకౌంట్లో జమ చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు నూర్జహన్, గోవర్ధన్, గంగాధర్, భారతి , రాజలింగం,సువర్ణ, దేవగంగుతో పాటు సుమారు రెండు వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఓట్ల లెక్కింపునకు సిద్ధంకండి
కలెక్టరేట్,న్యూస్‌లైన్: ఈ నెల 16వ తేదీన చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారులను, రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నివేదికలు జాప్యం లేకుం డా వెంటనే పంపించాలని సూచించారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి విడత జరిగిన ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన సమాచారాన్ని ఆయా పట్టికలలో పూర్తి వివరాలతో సమర్పించాలని సూచిం చారు. మొదటి విడతగా పది జిల్లాల్లో జరిగిన పోలిం గ్‌కు సంబంధించి అన్ని వివరాల సమాచారాన్ని త్వర గా సమర్పించాలని అధికారులకు తెలియజేశారు. ఆ యా జిల్లాలో వినియోగించిన వెబ్ కెమెరాలను ఈనెల 7వ తేదీన జరగనున్న పోలింగ్ కోసం వెబ్ కెమెరాలను వారికి కేటాయించిన జిల్లాలకు పంపించాలని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ఎస్.ప్రద్యుమ్న మా ట్లాడుతూ అన్ని నివేదికలు పంపిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ అధికారి, డీఆర్వో రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ కాలేబ్, ఎంసీఎంసీ నోడల్ అధికారి పవన్‌కుమార్, కలెక్టరేట్ పరిపాలనాధికారి రాజేశ్వర్ పాల్గొన్నారు. -
మోడీతోనే తెలంగాణ అభివృద్ధి
దౌల్తాబాద్, న్యూస్‌లైన్: బీజేపీ అధికారంలోకి వచ్చి నరేంద్రమోడి ప్రధాని అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీనటులు రాజశేఖర్, జీవిత అన్నారు. ఆదివారం వారు దౌల్తాబాద్‌లో దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా సినీనటులు మాట్లాడుతూ టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు వస్తాయని, అంతేగాక డబ్బుసంచులు కూడా బెట్టుకుంటారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డికి ఓటేసినా ఫలితముండదని చెప్పారు. ఈ ప్రాంతంలో చేనేత కార్మికులతోపాటు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాటికి ప్రభుత్వానిదే బాధ్యత అని వారు పేర్కొన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ఓటేసి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. కమలం గుర్తుకు ఓటేసి రఘునందన్‌రావును గెలిపించాలని వారు కోరారు. ప్రచారంలో బీజేపీ నాయకులు రాజుగౌడ్, కుమ్మరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు. -
బళ్లారిలో హైటెక్ చోరీ
ప్రగతి కృష్ణ గ్రామీణ బ్యాంకుకు చెందిన రూ.30 లక్షలు లూటీ దుండగుల కోసం పోలీసుల నాకాబందీ సాక్షి, బళ్లారి : బళ్లారిలో సోమవారం రెప్పపాటులో రూ.30 లక్షల చోరీ జరిగింది. బళ్లారి తాలూకా కొర్లగుంది ప్రగతి కృష్ణా గ్రామీణ బ్యాంకుకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్, సిబ్బంది గాదిలింగ, అరుణ బళ్లారి గాంధీనగర్‌లోని ఐడీబీఐ బ్యాంకు నుంచి రూ.30 లక్షల నగదు తీసుకుని కేఏ-34 ఎన్-6890 నంబరుగల కారులో పెట్టుకుని బయలు దేరారు. కొంతదూరం వెళ్లగానే కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో మాజీ ఎంపీ ఎన్వై హనుమంతప్ప ఇంటి సమీపంలో ఓ షాపులో కారు టైరుకు పంక్చర్ వేయించడానికి ఆగారు. పం క్చర్ వేస్తుండగా బ్యాంకు సిబ్బంది కారు డోరు వేసి కిందకు దిగారు. బ్యాంకు నుంచి వచ్చిన కారును గమనించిన ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంలో వచ్చి కారు వద్ద ఆపి అందులోని రూ.30 లక్షల నగదును క్షణాల్లో ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు సిబ్బంది దొంగ.. దొంగ అంటూ అరిచేలోపు మాయమయ్యారు. వెంటనే స్థానిక గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ మురుగణ్ణ నేతృత్వంలో నగరంలో నాకాబందీ నిర్వహిస్తూ ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నేటి నుంచి గ్యాస్ బంద్
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో మంగళవారం నుంచి వినియోగదారులకు వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపేసి సమ్మె చేస్తున్నట్లు జిల్లా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్, కిషోర్‌రెడ్డి తెలిపారు. చిత్తూరులోని ఓ హోటల్లో ఫెడరేషన్ సమావేశం సోమవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ఆలిండియా సంఘం పిలుపులో భాగంగా తాము సమ్మెలోకి వెళుతున్నామన్నారు. డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ దీర్ఘకాలంగా పరిష్కరించడం లేదన్నారు. పలుమార్లు చర్చించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లోనే సమ్మెలోకి వెళుతున్నట్లు వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్స్పై ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్ పేరుతో డిస్ట్రిబ్యూటర్సపై ఒత్తిడి తెస్తోందని ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కిషోర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ గైడ్లైన్స 2001లో రూపొందించారన్నారు. మార్కెటింగ్‌లో జరిగే చిన్నచిన్న పొరపాట్లకు లక్షల కొద్దీ అపరాధం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గైడ్లైన్స సరళతరం చేసే వరకు గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకూడదని నిర్ణయించామన్నారు. అంతేగాక ఆధార్ సీడింగ్ వల్ల తమపై అదనపు భారం పడిందని, సబ్సిడీ రాకపోయినా వినియోగదారులు తమను బాధ్యులుగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ కోశాధికారి భాస్కరయ్య, జిల్లాలోని అన్ని కంపెనీల గ్యాస్ డీలర్లు పాల్గొన్నారు. -
నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా!
అనూప్‌తేజ్, యశ్వంత్, ప్రణమ్య ముఖ్యతారలుగా రాజశేఖర్ ఎ.ఎం. దర్శకత్వంలో టి.విజయవాసుదేవరెడ్డి నిర్మించిన ‘నిన్ను చూసి వెన్నెలే అనుకున్నా’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ‘అల్లరి’ నరేష్ ఆవిష్కరించి, తొలి ప్రతిని రఘు మాస్టర్‌కి అందించారు. ఈ సందర్భంగా ‘అల్లరి’ నరేష్ మాట్లాడుతూ -‘‘టైటిల్ అందరికీ నచ్చేలా ఉంది. సినిమా కూడా అదే రీతిలో ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘టైటిల్ అందరికీ నచ్చేలా ఉంది. సినిమా కూడా అదే రీతిలో ఆహ్లాదకరంగా ఉంటుందనుకుంటున్నా’’ అన్నారు. లవ్, రొమాన్స్ యాక్షన్, ఫిక్షన్, థ్రిల్లర్ అన్నీ ఉన్న సినిమా ఇదని దర్శకుడు పేర్కొన్నారు’’ అని చెప్పారు. అనూప్‌తేజ్ మాట్లాడుతూ -‘‘నా తొలి సినిమా ‘కేక’. ఇది నాకు మంచి బ్రేక్ ఇస్తుంది’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల విశ్వనాథ్, సుభాష్ నారాయణ్, జీవన్ కిషోర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. -
‘పట్టపగలు’ పూర్తి కాలేదు
నిత్యం వివాదాలతో సావాసం చేసే రామ్‌గోపాల్‌వర్మ, క్రమశిక్షణకు మారుపేరైన మోహన్‌బాబు కలిసి సినిమా చేస్తున్నారనే వార్త సినీ వర్గాలనే కాక, సగటు ప్రేక్షకుణ్ణి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోంచి తేరుకునేలోపే... మరోసారి అందరికీ షాకిచ్చారు రామ్‌గోపాల్‌వర్మ. అతి రహస్యంగా... డా.రాజశేఖర్‌తో ఆయన సినిమా కూడా తీసేస్తున్నారు. షూటింగ్ మొత్తం పూర్తయిందని బయట ప్రచారం జరుగుతోంది. అయితే అది కరెక్ట్ కాదని తెలిసింది. కొంత షూటింగే జరిగిందట. ఇంతకూ ఆ సినిమా పేరు ఏంటంటే... ‘పట్టపగలు’. హారర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పెళ్లికావాల్సిన కూతురున్న తండ్రిగా రాజశేఖర్ నటిస్తున్నారట. ఈ పాత్ర కోసం మేకప్ లేకుండా, రియల్ గెటప్‌లోనే ఆయన నటిస్తున్నారట. బాలీవుడ్ సినిమా ‘బ్రేకప్’లో రణధీర్‌కి జోడీగా నటించిన స్వాతి దీక్షిత్ ఇందులో రాజశేఖర్ కూతురి పాత్రను పోషిస్తున్నారట. -
తవ్వారు పల్లె టు ఫిలిం నగర్
పల్లెటూరులో పుట్టాడు.. సినిమా డెరైక్టర్ కావాలని కలలుగన్నాడు.. స్కూల్ ఎగ్గొట్టి హైదరాబాదుకు వెళ్లాడు. కాళ్లరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఫలితం లేదు. అయినా అలసిపోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. ఈ సారి డెరైక్ట్‌గా కథే రాసుకుని పోయాడు. చివరికి దర్శకుడిగా మారి కల సాకారం చేసుకున్నాడు. కృషి ఉంటే సాధించలేనిదేదీ లేదని యువతకు స్ఫూర్తినిస్తున్నాడు. ఆయనే ‘ప్రేమ ప్రయాణం’ సినిమా దర్శకులు, ఖాజీపేట మండలం తవ్వారుపల్లెకు చెందిన ఎస్.ఎస్. రవికుమార్. ఆదివారం తన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ పలకరించింది. తన సినిమా ప్రయాణ విశేషాలు ఆయన మాటల్లోనే..- న్యూస్‌లైన్, మైదుకూరు(చాపాడు) పదో తరగతి నుంచే.. మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. నేను కూడా సినిమాలకు కథలు రాయగలను.. సినిమాలు తీయగలనని అప్పుడే అనుకున్నా. దీంతో ఎన్నోసార్లు తరగతులు ఎగ్గొటి హైదరాబాదుకు వెళ్లాను. స్టూడియోల చుట్టూ తిరగటం.. ఉండేందుకు డబ్బుల్లేక తిరిగి ఇంటికి రావటం జరిగేది. దీంతో ‘ముందు బాగా చదువుకో తర్వాత సినిమాలు చేద్దువుగానీ’ అంటూ నాన్న మందలించారు. ఎలాగోలాగా ఇంటర్ వరకు చదివా. ఆ తర్వాత ఇంట్లో చెప్పకుండానే హైదారాబాదుకు వెళ్లాను. రాజశేఖర్, జీవితల ప్రేరణతో.. ముందుగా ఒక కథ రాసుకుని రాజశేఖర్, జీవితలకు విన్పించా. అనంతరం వారి సూచనలు, సలహాల మేరకు హైదరాబాదులోని ఫిల్మ్ ఇన్స్ట్యూట్లో చేరి శిక్షణ పొందాను. ఆ తర్వాత మామూలే. సినిమా అవకాశాల కోసం వేట మొదలెట్టా. ఎనిమిదేళ్లు అసిస్టెంట్ డెరైక్టరుగా... 2004లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన అనంతరం కొంతకాలానికి రోశిరాజు అనే దర్శకుడు వద్ద అసిస్టెంటుగా అవకాశం సంపాదించాను. అక్కడి నుంచి సభాపతి, నరేంద్ర, దేవిప్రసాద్, సముద్రలతో పాటు ఇంకా పలువరి దగ్గర 2012 వరకు పని చేశాను. హ్యపీ జర్నీ, బ్లేడ్‌బాబ్జీ, ఏకవీర, ఇంకా పలు చిత్రాలకు అసిస్టెంటు డెరైక్టరుగా పని చేశా. ప్రముఖ ఆర్టిస్టులతో.. ఇటీవలే ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టులు గా ఉన్న పోసాని కృష్ణమురళి, నాగీనీడులతో పాటు హీరోగా మనోజ్ నందం, హీరోయిన్గా నీతూ అగర్వాల్, ఆర్టీస్టులుగా బస్టాఫ్ కోటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్, పొట్టిరాంబాబు, యాం కర్ ఫన్నీ, భానుశ్రీ, రమ్య చౌదరి ఇలా పలువురితో ప్రేమ ప్రయాణం చిత్రాన్ని తీశాను. మరికొన్ని కథలు రాస్తున్నాను. వరుణ్ సందేశ్‌తో సినిమా.. యూత్ ఫాలోయింగ్ హీరో అయిన వరుణ్ సందేశ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు రవికుమార్ తెలిపారు. దీంతో పాటు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యువహీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు తెలిపారు. -
అభిమాన స్వాగతం
సాక్షి, గుంటూరు :ప్రకాశం జిల్లా యద్దనపూడి వెళ్తూ ఆదివారం ఉదయం చిలకలూరిపేట ధనలక్ష్మి గెస్ట్‌హౌస్‌కు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా పార్టీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున ఘనస్వాగతం పలికారు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ జిల్లాకు వచ్చిన ఆయన్ని చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా గెస్ట్‌హౌస్ ప్రాంగణంతో పాటు అక్కడి పరిసరాలు పార్టీ నాయకులతో కిటకిటలాడాయి. ఆదివారం ఉదయం 4.45 గంటలకు సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో తెనాలి చేరుకున్న వైఎస్ జగన్ రోడ్డు మార్గాన ప్రయాణించి ఆరు గంటలకు చిలకలూరిపేట చేరుకున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఏర్పాటు చేసిన అతిథి గృహంలో గంటన్నరసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి తిరిగి ప్రకాశం జిల్లా యద్దనపూడికి బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్‌ను కలిసేందుకు వచ్చిన వివిధ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలందరూ యువనేతకు ఎదురేగి అభివాదం చేసి స్వాగతం పలికారు. వారందరినీ పేరుపేరునా పలకరించిన వైఎస్ జగన్ కొద్దిసేపు పార్టీ ముఖ్య నాయకులతో మాట్లాడారు. పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాంతో కార్యక్రమ షెడ్యూలుపై చర్చించారు. అనంతరం చిలకలూరిపేట, బాపట్ల, తెనాలి, నర్సరావుపేట, వేమూరు, గుంటూరు, తాడికొండ నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి, కోన రఘుపతి, గుదిబండి చినవెంటకరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, ఈపూరి అనూప్, షేక్ షౌకత్, నసీర్‌లతో పాటు పార్టీ ప్రముఖులు గజ్జల నాగభూషణరెడ్డి, దాది లక్ష్మీరాజ్యం, కావటి మనోహర్, కొడాలి నాని, బాలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జోగి రమేష్‌లతో కొద్దిసేపు మాట్లాడారు. పార్టీ నాయకులు మందపాటి శేషగిరిరావు, కావటి మనోహర్‌నాయుడు, సయ్యద్‌మాబు, దేవళ్ల రేవతి, నూతలపాటి హనుమయ్య, అన్నాబత్తుని శివకుమార్ తదితరులు జగన్‌ను కలిసి కరచాలనం చేశారు. వీరందరినీ బాగున్నారా? అంటూ వైఎస్ జగన్ పలకరించారు. అతిథి గృహం నుంచి బయటకు వచ్చిన ఆయన్ని చుట్టుముట్టిన వందలాది మంది అభిమానులు పూల వర్షంతో ముంచెత్తారు. ‘జైజగన్’ అన్న నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త గుదిబండి చిన వెంకటరెడ్డి అందించిన ప్రత్యేక పోస్టర్‌ను జగన్ ఆవిష్కరించారు. జనసంద్రమైన అంకిరెడ్డిపాలెం చౌరస్తా... ప్రకాశం జిల్లా నుంచి జాతీయ రహదారి మీదుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న యువనేత జగన్మోహన్రెడ్డికి ఘనస్వాగత పలికేందుకు గుంటూరు శివారు అంకిరెడ్డిపాలెం చౌరస్తా వద్ద వేలాది మంది యువకులు, మహిళలు బారులు తీరారు. పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి, పెదకూరపాడు పార్టీ సమన్వయకర్త రాతంశెట్టి రామాంజనేయులు ఆధ్వర్యంలో మోటార్‌బైక్‌లపై తరలి వచ్చిన వందలాది ముంది యువకులు జాతీయ రహదారిపై నిలబడి నినాదాలతో హోరెత్తించారు. వీరందరినీ ఆప్యాయంగా పలకరించిన జగన్ పార్టీ కోసం పనిచేయండంటూ సూచించారు. పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు ముందుకెళ్లి జగన్‌కు శాలువా కప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, నసీర్ అహ్మద్, షౌకత్, గులాం రసూల్, చాంద్‌బాషా, మహ్మద్ ముస్తఫా, నూనె ఉమామహేశ్వరరెడ్డి, కొల్లిపర రాజేంద్రప్రసాద్, అంగడి శ్రీనివాసరావు, నర్సిరెడ్డి, మహమూద్, విజయ్‌కుమార్, జగన్‌కోటి, దాసరి శ్రీనివాసరావులతో పాటు పలువురు మహిళా నాయకురాండ్రు కానూరి నాగేశ్వరి, ఝాన్సీ, మేరీ, కొత్తా చిన్నపరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు వైఖరి రైతులకు చేటు
సాక్షి, గుంటూరు :టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరితోనే కృష్ణా, గోదావరి మిగులు జలాల విషయంలో రైతులు నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి ఏనాడూ ఆలోచన చేయలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై ఏమాత్రం అవగాహన లేని టీడీపీ నేతలు వైఎస్సార్ గురించి, ఆయన చేపట్టిన జలయజ్ఞంపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్ట్‌లకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరపకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించారు. 2004 కన్నా ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు అప్పుడే ప్రాజెక్ట్‌లు నిర్మించి ఉంటే, ఇప్పుడు ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగేవని పేర్కొన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి గొడ్డలిపెట్టన్నారు. బాబును ప్రజలు క్షమించరు.. మిగులు జలాల సద్వినియోగం విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన గడువును ఉపయోగించుకోకుండా.. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్ట్‌ను నిర్మించకపోవడంతోనే కృష్ణామిగుల జలాలపై తీరని అన్యాయం జరిగింద ని రాజశేఖర్ ఆరోపించారు. పేదలు, రైతులకు మేలు తలపెట్టిన మహానేత వైఎస్ఆర్పై బురదజల్లుడు వ్యాఖ్యలకు పాల్పడటం టీడీపీ నేతల కుసంస్కారానికి నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల చుట్టూ పొర్లుదండాలు పెట్టి చంద్రబాబు క్షమాపణలు కోరినా, ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించరన్నారు. రైతులకు టీడీపీ చేసిన తీరని అన్యాయాన్ని కడవరకు ప్రజలు మరిచిపోరన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించగలిగామని చంకలు కొట్టుకుంటున్న టీడీపీ.. అప్పట్లో అధికారంలో ఉంది తామేనని మరిచిపోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ఇచ్చిన లేఖ కారణంగానే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందని టీడీపీ నేతలు ఎలా మాట్లాడగలుగుదుందని ప్రశ్నించారు..? చంద్రబాబు తాబేదారులుగా మాట్లాడుతున్న వారికి రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. జలయజ్ఞంతో వైఎస్‌ను దేవుడిగా కొలుస్తున్నారు.. వృధాగా పోయే ప్రతీ నీటి చుక్క రైతులకు మేలుచేయాలనే తలంపుతో జలయజ్ఞం చేపట్టి సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఘనత మహానేత వైఎస్‌దేనని పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు రావి వెంకటరమణ అన్నారు. వెలిగొండ, పులిచింతల, నాగార్జునసాగర్, గోదావరి ఆయక ట్టు ఆధునికీకరణ పనులు వైఎస్ చలవేనన్నారు. ఆయన ఆప్పట్లో కేంద్రానికి రాసిన లేఖలను వక్రీకరించి రాజకీయాల్లో లాభం పొందాలనే టీడీపీ ఎత్తుగడను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. టీడీపీ హయాం లో డెల్టాలో 20లక్షల ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితిని గుర్తుచేశారు. కడ వరకు పోరాడతాం.. మిగులు జలాల విషయంలో న్యాయం కోసం తమ పార్టీ కడవరకు పోరాడుతుందని పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారనే భయంతో టీడీపీ నేతలకు మతిభ్రమించి వైఎస్ఆర్పై బురదజల్లుతున్నారని, ప్రజలు ఆపార్టీకి తగిన సమయంలో బుద్ధిచెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం నేతలు కావటి మనోహర్‌నాయుడు, బాలవజ్రబాబు (డైమండ్), పెదకూరపాడు సమన్వయకర్తలు నూతలపాటి హనుమయ్య, రాతంశెట్టి రామాంజనేయులు, పార్టీనేతలు మార్కెట్‌బాబు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.