
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై సిటీ న్యూరో సెంటర్ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని, ప్లాస్మా థెరపీ కూడా చేశామని తెలిపారు. అలాగే సైటో సోర్బ్ అనే పరికరం ద్వారా కూడా చికిత్స చేస్తున్నామని వారు వెల్లడించారు. చదవండి: నిలకడగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం
గతంతో పోల్చితే ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని, నిరంతరం వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని డాక్టర్ రత్న కిషోర్ తెలిపారు. కాగా అక్టోబర్ 17న ఇద్దరు కూతుళ్లు, భార్య జీవితతో సహా రాజశేఖర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీవిత, కూతుళ్లు శివానీ, శివాత్మిక ఇద్దరూ కోలుకోగా రాజశేఖర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చదవండి: ఐసీయూలో హీరో రాజశేఖర్
Comments
Please login to add a commentAdd a comment