
జబర్ధస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స తీసుకుంటున్నా ఆయన ఆరోగ్యం పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. ఇటీవల రోజు రోజుకు కొత్త అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముడుతున్నాయి. అయితే ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది ఆయన భార్య. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా.. ఒక కిడ్నీ దొరికిందని ఆమె తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించింది.
పంచ్ ప్రసాద్ భార్య మాట్లాడుతూ.. 'ఫస్ట్ నేనే కిడ్నీ ఇద్దామనుకున్నా. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు నాకు అన్ని టెస్టులు చేశారు. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయనది వయసు చిన్నది కావడంతో డాక్టర్లు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అన్నారు. ప్రస్తుతమైతే ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్తున్నాం. మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే.. ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా టెస్టులు జరిగాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశా. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకుంటూ ఉంటా. ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు ఏం అనుకోవద్దు. ఇది కేవలం మా ఛానెల్ ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాదంతోనే ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్నా' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment