
జబర్దస్త్ కమెడియన్ ‘పంచ్’ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా కిడ్నీ ఫెయిల్యుర్ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. అతడి వెన్ను భాగం నుంచి కాళ్లకు చీము రావడంతో ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నాడు. పంచ్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల కమెడియన్ నూకరాజు వ్లాగ్ చేసి పంచ్ ప్రసాద్ యూట్యూబ్‌లో చానల్లో పోస్ట్ చేశాడు. దీంతో పంచ్ ప్రసాద్ కోలుకోవాలని బుల్లితెర ప్రేక్షకులు, అతడి ఫాలోవర్స్ కోరుకున్నారు.
చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్‌మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
తాజాగా నూకరాజు మరో వీడియో షేర్ చేశాడు. ఇందులో పంచ్ ప్రసాద్ కొద్ది కొద్దిగా రికవరి అవుతున్నట్లు చెప్పాడు. ఇప్పటి వరకు కనీసం సొంతంగా లేవలేని స్థితిలో ఉన్న ప్రసాద్ ఇప్పుడు కర్ర, ఒకరి సాయంతో నడవగలుగుతున్నట్లు తెలిపాడు. కాగా గత నాలుగు రోజులుగా ఆయనకు చికిత్స జరుగుతుందని, అప్పటి నుంచి రోజంత సైలెన్స్ ఎక్కుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు ప్రత్యేకంగా ఓ నర్స్ ఇంట్లోనే ఉండి 24 గంటలు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు నూకరాజు పేర్కొన్నాడు.
మరో నాలుగు రోజుల వరకు ఇలాటే చేయాల్సి ఉంటుందన్నాడు. సైలెన్స్ ద్వారా పంచ్ ప్రసాద్‌కి యాంటిబయోటిక్స్ ఇస్తున్నారని నూకరాజు తెలిపాడు. ఇక హాస్పిటల్‌కు వెళ్లి పంచ్ ప్రసాద్ స్కానింగ్ కూడా చేయించుకున్నాడు. మరో వారం గడిచిన తర్వాతే ప్రసాద్ నడవగలడా? లేదా? అనే విషయం చెబుతామని డాక్టర్స్ చెప్పినట్లు విషయం చెబుతామని ఈ వీడియోలో డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వీడియోపై పంచ్ ప్రసాద్ ఫ్యాన్స్, ఫాలోవర్స్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి:
ఆందోళనకరంగా జబర్దస్త్ కమెడియన్ ఆరోగ్యం, నడవలేని స్థితిలో..
పంచ్ ప్రసాద్ భార్య నిజంగా గ్రేట్, పెళ్లికి ముందే ప్రాబ్లమ్ తెలిసినా..
Comments
Please login to add a commentAdd a comment