Jabardasth Comedian
-
కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్‌కు యాక్సిడెంట్
సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ రామ్‌ప్రసాద్ రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. గురువారం (డిసెంబర్ 5) షూటింగ్‌కు వెళ్తుండగా తుక్కుగూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎప్పటిలాగే షూటింగ్‌కు వెళ్తుండగా కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి మరో వాహనం ఢీ కొట్టింది. దాంతో రామ్ ప్రసాద్ కారు ముందున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసమవగా, రామ్‌ప్రసాద్‌కు స్వల్ప గాయాలయ్యాయి.‘పుష్ప 2’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
కెవ్వు కార్తీక్ ఇంట విషాదం.. 'నువ్వు లేకుండా ఎలా బతకాలమ్మా..'
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కార్తీక్ తల్లి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూసింది. ఈ విషాద వార్తను కమెడియన్ గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనలయ్యాడు. 'అమ్మా.. గత ఐదు సంవత్సరాల 2 నెలలుగా క్యాన్సరే భయపడే విధంగా దానిపై అలుపెరగని పోరాటం చేశావు. నీ జీవితమంతా యుద్ధమే! కంటికి రెప్పలామమ్మల్ని కన్నావు.. నాన్నకు తోడుగా కుటుంబాన్ని కష్టపరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు. ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు. నీ ఆత్మస్థైర్యం నాలో ధైర్యాన్ని నింపింది. అన్నీ నేర్పావు కానీ, నువ్వు లేకుండా ఎలా బతకాలో నేర్పలేదు.. ఎందుకమ్మా..? వారికి పాదాభివందనాలుమా అమ్మ కోసం ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే తనకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాభివందనాలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లి ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kevvu Kartheek (@kevvukartheek) -
జబర్దస్త్ కమెడియన్ల బ్రేకప్? గొడవలు నిజమేనన్న నూకరాజు
పటాస్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యాడు నూకరాజు. తర్వాత జబర్దస్త్ షోలో భాగమయ్యాడు. టీమ్‌లో ఒకరి కింద పని చేసే స్థాయినుంచి టీమ్ లీడర్‌గా ఎదిగాడు. అతడి ప్రేయసి ఆసియాతో కలిసి కామెడీ షోలో పంచులు పేలుస్తూ ఉంటాడు. చాలాకాలంగా ప్రేమలో ఉన్న నూకరాజు, ఆసియా కొంతకాలంగా కలిసి కనిపించడం లేదు. దీంతో ఈ లవ్ బర్డ్స్‌కు ఏమైంది? వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారా? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఆసియాకు, నాకు గొడవలు తాజాగా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తూ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు నూకరాజు. అతడు మాట్లాడుతూ.. 'ప్రేమలో గొడవలు, అలకలు, బుజ్జగింపులు సహజమే! అలా ఆసియాకు, నాకు మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయి. తను నాపై అలిగింది. వంద శాతం తప్పు నాదే! మేమిద్దరం మాట్లాడుకోలేదు. అయితే తప్పు ఎవరిదైనా ఆసియానే స్వయంగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటుంది. నాపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఇగో వల్ల.. మొన్న నేను దుబాయ్ వెళ్లాను. ఐదురోజుల తర్వాత తిరిగొచ్చాను. అలా మా మధ్య మాట్లాడుకునే తీరిక కూడా లేకుండా పోయింది. తను ఫస్ట్ మాట్లాడాలని ఎదురుచూశాను. నాకు కాల్ చేసి ఉండొచ్చేమో కానీ దుబాయ్‌లో ఉండటం వల్ల నా లైన్ కలిసి ఉండకపోవచ్చు. ఇగోతో ఆమెకు బర్త్‌డే విషెస్ కూడా చెప్పలేదు. అయినా తనే తర్వాత మెసేజ్ చేసింది. తనే ఫస్ట మెసేజ్ విషెస్ చెప్పనందుకు నా మీద కోపం లేదా? అంటే బాధ మాత్రమే ఉందని చెప్పింది. చిన్న చిన్న ఇగోతో ప్రేమను దూరం చేసుకోకండి. తప్పు ఎవరు చేసినా ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్తుంది. తనను ఎంత బాధపెట్టానో అంతే హ్యాపీగా ఉంచాలని నిర్ణయించుకున్నాను. తనకు ఆలస్యంగానైనా సరే బర్త్‌డే సర్ప్రైజ్ ఇస్తాను' అని నూకరాజు చెప్పుకొచ్చాడు. తమ బంధం ముక్కలు కాలేదని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: ఓటింగ్ కేంద్రంలో ఆమె కాళ్లకు నమస్కరించి సెల్ఫీ దిగిన విజయ్ సేతుపతి -
గ్రాండ్‌గా టాలీవుడ్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌లో ఆడియన్స్‌ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్‌లో అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యారు.తాజాగా మోహన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను జబర్దస్ కమెడియన్ నవీన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
గ్రాండ్‌గా టాలీవుడ్ కమెడియన్ పెళ్లి.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కామెడీ షో జబర్దస్త్. ఈ షో ద్వారా ఎంతోమంది ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా లేడీ గెటప్స్‌లో ఆడియన్స్‌ను అలరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో వినోద్, కొమరం, శాంతి స్వరూప్, మోహన్, తన్మయ్, సాయితేజ, పవన్, అప్పారావు చాలామందే ఉన్నారు. ప్రస్తుతం ఈ కామెడీ షో లేడీ గెటప్స్‌లో అలరిస్తున్న మోహన్ ఓ ఇంటివాడయ్యారు. తాజాగా మోహన్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఈ వేడుకలో జబర్దస్త్ నటులు రాకెట్ రాఘవ, అధిరే అభి, గడ్డం నవీన్, అప్పారావు సహా పలువురు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోను జబర్దస్ కమెడియన్ నవీన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం మోహన్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by jabardasth naveen (@gaddamnaveenofficial) View this post on Instagram A post shared by Harikrishna Jabardasth ❤️ (@harikrishna_jabardasth) -
వాలెంటైన్స్ డే.. ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బుల్లితెర నటి
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా వాలెంటైన్స్ డే రోజునే తన ప్రియుడికి బ్రేకప్ చెప్పేసి అందరికీ షాకిచ్చింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అధికారికంగా తెలిపింది. తాను ప్రేమించిన సంతోష్‌తో పవిత్ర ఉంగరాలు కూడా మార్చుకుంది. ఓ రకంగా ఎంగేజ్మెంట్ జరిగినట్లే అని త్వరలో పెళ్లితో ఒకటి అవుతారని అందరూ అనుకున్నారు. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల సంతోష్‌తో విడిపోతున్నట్లు వాలెంటైన్స్ డే సమయంలోనే పవిత్ర ఇలా తెలిపింది. 'మా శ్రేయోభిలాషులందరికీ మా ఇద్దరి పరస్పర అంగీకారం ద్వారా ఈ విషయం చెబుతున్నాను. సంతోష్, నేను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం. జీవితంలో మా వ్యక్తిగత ప్రయాణాలలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు గోప్యత ఇవ్వాలని మా శ్రేయోభిలాషులను అభ్యర్థిస్తున్నాము, మేము ముందుకు సాగేందుకు మీ ప్రేమ, మద్దతు ఉంటుంది అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.' అంటూ ఇన్‌స్టాలో పవిత్ర తెలిపింది. గతంలో సంతోష్ గురించి పవిత్ర చెప్పిన మాటలు సంతోష్‌తో ప్రేమలో ఉన్నానంటూ గతంలో పవిత్ర ఇలా తెలిపింది. 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని పవిత్ర చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సంతోష్,పవిత్ర ఇద్దరూ విడిపోవడంతో వారిని అభిమానించే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ.. ఇలాంటి సమయంలో ఇద్దరూ మరింత బలంగా ఉండాలని ఆశిస్తున్నారు. గతాన్ని వదిలేసి జీవితంలో కొత్త అడుగులు వేయాలని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa) -
బిడ్డను కోల్పోవడంపై తొలిసారి పెదవి విప్పిన అవినాష్
గర్భం దాల్చింది మొదలు.. పొట్టలో ఉన్న బుజ్జాయి ఎప్పుడు బయటకు వస్తుందా? ఆ బిడ్డను ఎప్పుడు ఎత్తుకుందామా? అని ఆ మహిళ తెగ ఆరాటపడుతూ ఉంటుంది. ఇక తండ్రి కాబోతున్నానోచ్ అని గాల్లో తేలే భర్త పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ ముందస్తుగానే సిద్దం చేసి పెడతాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారికి తల్లిదండ్రులుగా ప్రమోషన్ లభించినట్లే! జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్- అనూజ కూడా త్వరలోనే అమ్మానాన్న కాబోతున్నామని సంతోషించారు. సీమంతం చేశారు. మెటర్నటీ షూట్ చేశారు. బాధను భరిస్తూ నవ్వించాడు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. పురిటిలోనే బిడ్డ మరణించింది. ఈ విషాద వార్తను జనవరి 7న సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు అవినాష్. అంతటి బాధను పంటి కిందే భరిస్తూ సినిమాలు, ఈవెంట్లు చేస్తున్నాడు. అందరినీ నవ్విస్తున్నాడు. తాజాగా తొలిసారి ఆ బాధాకర ఘటన గురించి మాట్లాడాడు. 'నా బిడ్డ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలామంది కాల్స్ చేశారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. దేవుడు మాకలా రాసిపెట్టాడు పైగా నేను మాట్లాడే స్థితిలో లేకపోవడం వల్ల ఎవరి ఫోనూ లిఫ్ట్ చేయలేదు. దీని గురించి అడగొద్దు అని చెప్పినప్పటికీ మానవత్వంతో ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. చాలా ఫోన్లు చేశారు, మెసేజ్‌లు చేశారు. మా మీద అంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా జీవితంలో అదొక కరిగిపోయిన మేఘంలాంటిది. దేవుడు మాకు అలా రాసిపెట్టాడు. భవిష్యత్తులో ఏదైనా ఇంకా బెస్ట్ రాబోతుందేమో చూడాలి! అని చెప్పుకొచ్చాడు. కాగా అవినాష్-అనూజ 2021వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Mukku Avinash (@jabardasth_avinash) చదవండి: ప్రజలకు రుణపడి ఉంటా.. చేతనైనంతలో సాయం చేయాలనుకున్నా.. పుష్ప 3 ఉందని రూమర్స్.. అలా చేస్తే చిక్కులు గ్యారంటీ! -
Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పెళ్లిపీటలెక్కాడు. ప్రేయసి లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు. బుధవారం (నవంబర్ 29న) నాడు విశాఖపట్నంలో ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు ఆర్పీ. రహస్యంగా పెళ్లి చేసుకోవడం గురించి ఆర్పీ మాట్లాడుతూ.. 'అమ్మాయిది వైజాగ్. గతేడాది మా నిశ్చితార్థం జరిగింది. మేము ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నాం. ఎంగేజ్మెంట్, తదితర కార్యక్రమాలకు సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు వచ్చారు. ఈసారి కేవలం బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని వైజాగ్ ఎంచుకున్నాం. అందుకే పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచాం' అని చెప్పుకొచ్చాడు. కాగా కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది మేలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ధనరాజ్ సహా తదితరులు హాజరయ్యారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పెళ్లి చేసుకున్నారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన ఆర్పీ- లక్ష్మీ ప్రసన్నల జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్పీ ఏం చేస్తున్నాడు? జబర్దస్త్ కామెడీ షోలో వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఆర్పీ. ఆ షో నుంచి తప్పుకున్న తర్వాత అతడు మరే ఇతర షోలలోనూ పెద్దగా కనిపించలేదు. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించాడు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. చదవండి: ఫినాలే అస్త్ర గెలుపుకు దగ్గర్లో ఉంది ఈ నలుగురే! -
ఏడాదిగా వెయిటింగ్.. ఎస్ చెప్పిన పవిత్ర.. నిశ్చితార్థం ఫోటో వైరల్
బుల్లితెరపై ప్రసారం అవుతున్న కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. అందులో లేడీ కమెడియన్‌గా అందరినీ నవ్వించే పవిత్ర త్వరలో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుంది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అయితే ఆమె ఇప్పటికే తన పెళ్లి విషయంలో రెండుసార్లు ఫ్రాంక్ వీడియోలు చేసింది. కానీ మూడోసారి మాత్రం అలాంటిది ఏమీ లేకుండా నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రియుడు సంతోష్‌తో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలు షేర్ చేసింది. సంతోష్‌కు ఓకే చెప్పిన పవిత్ర 'నా జీవితంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం. నా ప్రేమ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఓకే చెప్పాను. అతడిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాను. అనుకోకుండా జరిగే కొన్ని పరిచయాలు జీవితంలో ప్రత్యేకంగా నిలిచిపోతాయి, మన మనసులోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటాయి. సంతోష్.. నాపై లెక్కలేనంత ప్రేమ చూపించాడు.. నా కోసం ఒక సంవత్సరం నుంచి వేచి ఉన్నాడు.. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి చిరునవ్వుతో ఎదుర్కొందాం. నా జీవితంలో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు. నువ్వు నన్ను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటావు, నన్నొక మహారాణిలా చూసుకున్నావు. నాకు అండగా నిలబడ్డావు. ఇక మీదట మనం కలిసి ప్రయాణిద్దాం..' అని తన పోస్ట్‌కు క్యాప్షన్ జోడించింది పవిత్ర. ఏడాది నుంచి ఎదురుచూస్తున్న సంతోష్ అలాగే వారి ప్రేమను అంగీకరించిన కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అయితే పవిత్ర అభిమానులకు సంతోష్ కుమార్ ఇదివరకే తెలుసు. గతంలో ఇతడు స్టేజిమీద అందరి ముందే పవిత్రకు లవ్ ప్రపోజ్ చేశాడు. కానీ అప్పుడు ఏ సమాధానమూ చెప్పని పవిత్ర.. తర్వాత సంతోష్ కుమార్‌తో కలిసి వాలంటైన్స్ డే సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలోనే యాంకర్ వారిని లవ్ ప్రపోజ్ చేసుకోవాలని కోరగా ఆమె తెగ సిగ్గుపడింది. ఎట్టకేలకు అతడితోనే ఏడడుగులు వేసేందుకు రెడీ అవడంతో అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. View this post on Instagram A post shared by Jabardasth_pavithraa (@jabardasth_pavithraa) చదవండి: గిన్నిస్ రికార్డు.. ఆయనే నా సూపర్ హీరో అంటున్న సుమ -
ఈ జబర్దస్త్ కమెడియన్ల జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా?
కమెడియన్‌గా నిలదొక్కుకున్న ఎంతోమంది జీవితంలో కష్టాలను దాటుకుని ముందుకువచ్చినవారే! బుల్లితెర కమెడియన్స్ పృథ్వీరాజ్, రిషి కుమార్ ఈ కోవలోకే వస్తారు. ఈ చైల్డ్ ఆర్టిస్టులిద్దరూ జబర్దస్త్ షోలో నవ్వులు పూయిస్తున్నారు. అయితే తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయంటోంది పృథ్వీ, రిషిల తల్లి శ్రీలత. తాజాగా ఆమె తన కుమారులతో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'దేవుడు నా ఇద్దరు పిల్లల్ని మరుగుజ్జులుగా పుట్టించాడు. మూడోసారి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మళ్లీ వీరిలాగే పుడతారేమోనని ఆపరేషన్ చేసి తీయించేసుకున్నాను. మా ఆయన ఆటో డ్రైవర్. రోజుకు రూ.400 వస్తాయి. మా అమ్మకు యాక్సిడెంట్లో చేయి పోయింది. తనను నేనే చూసుకోవాలి. అటు ఇద్దరు పిలల్ల్ని చూసుకోవాలి. వీళ్లకు జబర్దస్త్ షోలో ఇచ్చే డబ్బులు రానుపోను చార్జీలకే సరిపోతున్నాయి. హైదరాబాద్‌కు వచ్చిపోవడానికే ఏడువేల రూపాయలు అవుతాయి. రిషికి గుండెలో హోల్ ఉంది.. ఆపరేషన్ చేయించాం. కానీ మూడు నెలలకోసారి చెకప్‌కు తీసుకెళ్లాలి. అప్పుడో రూ.10 వేలు అవుతాయి. తనకు ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలన్నారు. కానీ మాకున్న స్థోమతకు మంచి ఆహారాన్ని సమకూర్చలేము. నేను కూడా గతంలో జూనియర్ ఆర్టిస్టుగా ఐదేళ్లు కష్టపడ్డాను. ఇప్పుడు నా పిల్లలు కష్టపడుతున్నారు. అయినా అందరూ హేళన చేస్తున్నారు. ఇద్దరు పిల్లల ఆరోగ్యం బాలేకపోవడంతో రూ.5 లక్షల అప్పు చేశాం. వడ్డీ కడుతున్నాం కానీ అప్పు తీర్చేంత డబ్బు మా చేతిలో ఉండట్లేదు. అప్పులవాళ్లేమో తిడుతున్నారు' అంటూ ఏడ్చేసింది శ్రీలత. చదవండి: ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి కారణమిదే! పెళ్లి చేసుకోవాలనుంది.. త్వరలోనే జరుగుతుంది -
అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా?.. అదిరే అభి వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అభినయ కృష్ణ. అభిమానులను ఆయనను అదిరే అభి అని పిలుస్తుంటారు. తన కామెడీ పంచ్‌లతో కామెడీ షోతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన ప్రభాస్ మూవీ ఈశ్వర్లో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించారు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సీ, ఈగ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా అదిరే అభి ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!) అదిరే అభి వీడియోలో మాట్లాడుతూ..'మొన్ననే పక్కన టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతున్నా. అప్పుడే టీ కొట్టు అతను మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ బాల్‌ను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ వెళ్లేది అన్నాడు. మిస్ చేశాడు కోహ్లీ అన్నాడు. నేను షాకయ్యా. విరాట్ కోహ్లీకి సిక్స్ ఎలా కొట్టాలో అతను చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంకో పక్కనున్న వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో ఇలా చేసి ఉంటే వీళ్ల పార్టీ గెలిచేది అని అన్నాడు. అదోక షాక్. ఇంకొంతమంది సినిమాల గురించి చెప్పారు. ఈ సీన్ అలా కాకుండా ఇలా తీసి ఉంటే బాగుండేది అన్నారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ టీ షాపు దగ్గర మాట్లాడాల్సిన అవసరమేంటి? అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా? పాలిటిక్స్‌లో చేరి అధికారంలోకి రావొచ్చు కదా? సినిమాల్లో చేరి డైరెక్షన్ చేయొచ్చు కదా? బేసిక్‌గా ఏంటంటే మనం మనపని తప్పా అందరి పనులు చేసేస్తాం. అందరికంటే ఎక్కువ మనకే తెలుసనుకుంటాం. ఈరోజు కోహ్లీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు.. మనం టీ షాపు దగ్గర ఎందుకు ఉన్నామనేది రియలైజ్ చేసుకోవాలి. మనం మనపనిని ఫర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఎవరితో అవసరం లేదు. మన పని పక్కనపెట్టి.. అతను అలా ఆడితే బాగుండేది.. వాళ్లు ఇలా చేస్తే బాగుండేది.. అంటే మనల్ని నాశనం చేసుకున్నట్టే. అవతలి వాళ్లు అడిగితే చెప్పండి.. అంతేకానీ అడగకున్నా కూడా మనం మాట్లాడుతున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు' అని అన్నారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అదిరే అభి మాటలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అలాంటి వాళ్లతో మీకెందుకు అన్నా అని పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది మేధావులకు టైం కలిసిరాక అలా రోడ్లమీద తిరుగుతూ ఉంటారు అన్నా అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అదిరే అభి చెప్పిన మాటలు మనం కూడా ఎక్కడో ఒకచోట అలా మాట్లాడి ఉంటాం అని అనిపిస్తోంది. View this post on Instagram A post shared by Adhire Abhi (@abbhinav_actor) -
జూనియర్ ఎన్టీఆర్‌తో చిన్నారి.. తెగ ఆరా తీస్తోన్న ఫ్యాన్స్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే దుబాయ్‌లో సైమా అవార్డ్స్ వేడుకలకు హాజరైన జూనియన్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పని చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ పాపను ఎంతో అప్యాయంగా తన ఒళ్లో కూర్చోబెట్టుకున్నారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తున్నారు. యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఆ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోలో ఎన్టీఆర్‌తో ఉన్న పాప జబర్దస్త్ కమెడియన్ రాం ప్రసాద్ మేనకోడలు అని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తారక్ అన్నతో నా మేనకోడలు అంటూ రామ్ ప్రసాద్ పోస్ట్ చేశారు. కాగా.. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర మూవీ గ్లింప్స్, పోస్టర్స్ ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. Naa Menakodalu & @tarak9999 anna ❤️ pic.twitter.com/Xh7hsN7JOA — Auto RamPrasad (@RamPrasadAuto) September 30, 2023 -
చనిపోయేవరకు నన్ను వదలవేమో.. ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్
జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే తన లైఫ్‌లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. బుల్లితెరపై కమెడియన్‌గా క్లిక్ అయిన సమయంలో అనారోగ్యానికి గురై షో నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. చాలాకాలం తర్వాత తాజాగా ఓ షోలో హాజరై తన కన్నీటి కష్టాలను వివరించాడు. ఆటోకు డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లేవాళ్లం 'ఒక పేరు వచ్చాక కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ 'మహాత్మ' సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది మేమే.. కానీ పాడింది మేమేనని ఎక్కడా పేరు వేయలేదు. అలా అక్కడ స్ట్రక్ అయిపోయాను. తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడు. అభి అన్న ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక.. హైపర్ ఆది అన్న, నేను కృష్ణా నగర్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ షేర్ ఆటోలో వెళ్లేవాళ్లం. ఆ దేవుడు నాపై కరుణ చూపలేదు జబర్దస్త్ షోలో మంచి పేరొచ్చింది. టీం లీడర్ స్థాయికి వెళ్లాను. కానీ ఎందుకో నామీద దేవుడు కరుణ చూపలేదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి కష్టాలే.. నేను చనిపోయేవరకు ఈ కష్టాలు నన్ను వదిలిపోవేమో అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్. అక్కడే ఉన్న ఫణి సైతం తాను పడ్డ బాధలను చెప్పుకొచ్చాడు. సినిమాలు చేద్దామని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. కానీ అక్కడ సినిమాల్లేవు. షోలు చేద్దామంటే అవి కూడా లేవు. ఆ సమయంలోనే నాన్నకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
సర్జరీ కోసం ఇంటిని అమ్మేసింది.. అప్పుడే సొంతింటికి!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తన కామెడీతో అభిమానులను అలరించిన శాంతిస్వరూప్‌కు ఇండస్ట్రీలో జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. ఇటీవలే తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కల సాకారం కాబోతోంది అంటూ కొత్త వీడియోను పోస్ట్ చేసింది. తన సొంతింటి కల త్వరలోనే నిజం కానుందని వెల్లడించింది. (ఇది చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!) వీడియోలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ..' సొంతింటి కల అనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇటీవల అమ్మ సర్జరీ కోసం పాత ఇంటిని అమ్మేశా. చాలా ఏళ్లుగా హైదరాబాద్‌లో అద్దె ఇంట్లోనే ఉంటున్నా. కొందరు నా మంచి కోరేవారు కూడా ఉన్నారు. వారి సహకారంతోనే ఇంటిని నిర్మిస్తున్నా. కూకట్‌పల్లిలోని భూదేవిహిల్స్‌లో ఇల్లు ఉంటుంది. త్వరలోనే పూర్తి కానుంది. ' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. -
నిర్మాత కావాలన్నదే లక్ష్యం
‘‘కృష్ణ, చిరంజీవిగార్ల సినిమాలు చూసి హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీగార్ల స్ఫూర్తితో హాస్య నటుడిగా నాకంటూ గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. నిర్మాత కావాలన్నదే నా లక్ష్యం.. అలాగే ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్ నిర్మించాలన్నది నా కల’’ అని నటుడు గడ్డం నవీన్ అన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’, వెంకటేష్ ‘సైంధవ్’ చిత్రాలతో పాటు ‘భైరవ కోన’, ‘మిస్టరీ, ‘వృషభ’, ‘చూ మంతర్’, ‘భూతద్దం భాస్కర్’ వంటి పలు సినిమాల్లో నటిస్తున్న ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ 150 సినిమాలు చేస్తే, వాటిలో 90 చిత్రాల్లో మంచి పాత్రలొచ్చాయి. ఈ ఏడాది సంతృప్తికరమైన ప్రయాణం సాగుతోంది’’ అన్నారు. -
అమ్మాయిగా మారేందుకు సర్జరీ చేయించుకున్న జబర్దస్త్ సాయి?
కమెడియన్స్ తెర వెనుక పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. కెమెరా ముందు నవ్వుతూ నవ్వించే ప్రయత్నం చేస్తున్నా నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా లేడీ గెటప్‌లు వేసి నవ్వించేవారి బాధలు అన్నీఇన్నీ కావు. అమ్మాయిలా చీర కట్టుకున్నందుకు వారిని సూటిపోటి మాటలతో వేధిస్తుంటారు. కొందరు మాత్రం తమలో ఉన్న ఆడతనాన్ని అర్థం చేసుకుని అచ్చమైన మహిళగా మారిపోతారు. ఆ జాబితాలోకే వస్తుంది ప్రియాంక సింగ్. మెడిసిన్‌లో సీటు వదిలేసి సాయితేజగా పరిచయమైన ఆమె తర్వాతి కాలంలో సర్జరీ చేయించుకుని ప్రియాంకగా మారిపోయింది. ఆ మధ్య బిగ్‌బాస్ షోలోనూ పాల్గొంది. ఇదిలా ఉంటే జబర్దస్త్‌లోని మరో లేడీ కంటెస్టెంట్ సాయిలేఖ కూడా ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయిందంటూ చాలాకాలంగా ఓ వార్త వైరలవుతోంది. తాజాగా ఈ పుకారుపై సాయి స్పందించాడు. అలాగే తన వ్యక్తిగత విషయాలను ఓ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. సాయి మాట్లాడుతూ.. 'నా అసలు పేరు వెంకటసాయిప్రసన్న కుమార్. ఇంటర్ అయిపోయాక మెడిసిన్‌లో ర్యాంక్ వచ్చింది. ఓసారి ఈవెంట్‌కు వచ్చినప్పుడు హైపర్ ఆది అన్నవాళ్లు నువ్వు కూడా యాక్టింగ్ చేయొచ్చు కదా.. సెలబ్రిటీ అయిపోతే నీతో కూడా ఫోటోలు దిగుతారు అని చెప్పాడు. నాన్న చాలా బాధపడ్డాడు అప్పుడు నేను హైదరాబాద్‌కు వచ్చి రెండు, మూడు ఎపిసోడ్లు చేసి తిరిగి కాలేజీకి వెళ్లిపోయాను. కానీ అక్కడున్నవాళ్లు అప్పుడే అయిపోయిందా? అని హేళన చేశారు. ఆ మాటలు తట్టుకోలేకపోయాను. కష్టమైనా, ఏదైనా సరే అని కామెడీ షోలో రీఎంట్రీ ఇచ్చి అక్కడే కొనసాగుతున్నాను. మొదట్లో మా నాన్న చాలా బాధపడ్డాడు. డాక్టర్ చదవాల్సినవాడు చీర కట్టుకుని మేకప్ వేసుకుని జబర్దస్త్‌లో చేస్తున్నాడు, మీకేం అనిపించట్లేదా? అని ఇరుగుపొరుగువారు మా నాన్నను సూటిపోటి మాటలనేవారు. అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో నాకు తర్వాత అర్థమైంది. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయా? నేను సర్జరీ చేసుకున్నానా? అని అడుగుతున్నారు. సర్జరీ చేయించుకుంటేనే అమ్మాయిలాగా ఉంటారు, లేదంటే ఉండరు అని కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ చీర నేను కట్టుకుంటేనే అందంగా కనిపిస్తాను అనిపించేది. ఇలాంటి ఆలోచనలు నాకు ఊహ తెలిసినప్పటినుంచే మొదలయ్యాయి. ఎదుటివాళ్లు ఎలా అనుకుంటారన్నది నాకు అనవసరం. నేను ఎలా ఉంటే వాళ్లకేంటి? సర్జరీ చేయించుకోవాలని కాదు. కానీ నాకు నచ్చినట్లు బతుకుతున్నాను. డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు ఇంటర్మీడియెట్ చదివేటప్పుడు నాకు వంశీ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఓ రోజు నాకు రాత్రి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయాను. అప్పుడు వంశీయే ఆస్పత్రిలో జాయిన్ చేశాడు. నేను బతుకుతానో, లేదో కష్టమని..ముందు సంతకం పెట్టాకే చికిత్స ప్రారంభిస్తామన్నాడు డాక్టర్. అతడు మా ఇంటికి ఫోన్ చేసి మా వాళ్లకు ఒకమాట చెప్పి సంతకం చేసి డాక్టర్ కాళ్లు పట్టుకున్నాడు. అతడి దగ్గర ఉన్న రూ.2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాకే ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆరోజు ఆయన అలా సాయం చేయకపోయుంటే ఈరోజు సాయిలేఖ ఉండేదే కాదు. తనంటే నాకు నిజంగానే చాలా ఇష్టం' అని అని చెప్తూ ఎమోషనలయ్యాడు సాయి. చదవండి: జవాన్ సినిమా ఓటీటీ రైట్స్‌కు రికార్డు ధర.. ఆ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు ఛాన్స్! మిస్ శెట్టి కూడా అక్కడే.. -
హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్‌గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్
జబర్దస్త్ నవీన్.. బుల్లితెరపై, వెండితెరపై నవ్వుల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపులర్ అయ్యాడు. వరుస సినిమాలతో, విభిన్న పాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా వెలుగొందుతున్న జబర్దస్త్ గడ్డం నవీన్ బర్త్‌డే నేడు (సెప్టెంబర్ 1). ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ► ఇది 47వ పుట్టిన రోజు.. 1995లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ సంవత్సరం చాలా సంతృప్తికరమైన జర్నీ సాగుతోంది. గేమ్ చేంజర్, సైంధవ్ సహా 10 సినిమాలు చేస్తున్నాను. మా పెద్దబాబు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ► పుట్టిపెరిగింది సికింద్రాబాద్. మా తల్లిదండ్రులు కృష్ణ, సక్కుబాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయినా ఆర్థిక కష్టాలు మా కుటుంబాన్ని వెంటాడేవి. చదువుకుంటూనే మెకానిక్ షాపు, బట్టల షాపు, చిరు వ్యాపారాలు చేశాను. ఒకానొక సమయంలో ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేశాను. ఆ క్రమంలోనే 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అప్పుడే పెళ్లిచేసుకున్నాను. నా భార్య పేరు బబితా. ఇద్దరు కొడుకులు పవన్ దినేష్, అక్షయ్ కుమార్. లోకల్ కాబట్టి సినీఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ.. మిగతా ఇబ్బందులు ఫేస్ చేశాను. ► సినిమాలకు వెళ్ళానుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. 'ప్రేమించేది ఎందుకమ్మా' సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండేది. సురేందర్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను.. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్‌కి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు.. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. కమెడియన్‌గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 150 సినిమాలు చేశాను. నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలన్న కల కూడా ఉంది. ► జబర్దస్త్, సినిమాలు, ఈవెంట్స్ చేస్తున్నాను కానీ.. ఆ పేమెంట్ నా కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అయితే ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇప్పుడు వెళ్లడం లేదు. మా కంపెనీ యాజమానీ దినేష్ గారు.. ఎప్పుడు వెళ్లినా నాకు ఉద్యోగం ఇస్తారు. అందుకే ఆ కంపెనీకి ఇంకా రాజీనామా చేయలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంది. అప్పటి వరకు మీ సహకారంతో కష్టపడుతూనే ఉంటాను. చదవండి: ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..? -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్‌కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్‌కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్‌లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇల్లు చూశారా? ఎంత బాగుందో!
ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి.. కొందరికి రాయడం ఇష్టం.. కొందరికేమో పాడటం ఇష్టం.. పెయింటింగ్స్ వేయడం.. డ్యాన్స్ చేయడం, నటించడం.. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కోటి నచ్చుతుంది. చాలామంది దాన్ని టైంపాస్‌గా భావిస్తారు. కానీ కళాకారులు మాత్రం వాటినే నమ్ముకుని అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. అలా హాస్యాన్ని నమ్ముకుని, అందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నవాళ్లు ఎంతోమంది ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నారు. వారిలో ఒకరే జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్. తన పంచులతో, స్కిట్లతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కెవ్వు కార్తీక్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఏడాది క్రితం కొత్త ఇల్లు కొనుక్కున్న కార్తీక్ తాజాగా హోం టూర్ వీడియో చేశాడు. తన ఇంటి గేటు దగ్గరి నుంచి ప్రతీది ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్లు తెలిపాడు. 'గతంలో అద్దె ఇంట్లో ఉన్నప్పుడు హోంటూర్ చేశాను. నేను సొంతంగా ఓ ఇల్లు కొనుకున్నాక మళ్లీ హోంటూర్ వీడియో చేయాలనుకున్నాను. ఏడాది క్రితమే ఈ ఇల్లు కొన్నప్పటికీ ఇంటీరియర్, వస్తువులు అన్నీ సమకూర్చుకునేసరికి ఇంత సమయం పట్టింది. ఇన్నాళ్లకు ఇల్లు పూర్తిగా రెడీ అవడంతో వీడియో చేశాను. గతంలో నేను కింద పడుకునేవాడిని. సోఫా కూడా ఉండేది కాదు. నాకంటూ సొంతిల్లు ఉన్నాకే అవన్నీ కొనుక్కోవాలనుకున్నాను. ఇప్పుడు అన్నీ మంచి క్వాలిటీతో ఉన్నవి కొనుక్కున్నాను' అంటూ ప్రతి గదిని క్షుణ్ణంగా చూపించాడు కార్తీక్. హాల్, పూజ గది, డైనింగ్ టేబుల్, కిచెన్, మూడు బెడ్రూమ్స్, బాల్కనీ అన్నింటినీ తనకు నచ్చినట్లుగా ఆర్గనైజ్ చేయించుకున్నాడు. తన అవార్డులు, గృహప్రవేశానికి వచ్చిన బహుమతులను సైతం చూపిస్తూ పోయాడు. తన బాల్కనీని మొత్తం గ్రీనరీతో నింపేశాడు. ఈ ఇంట్లో నెమళ్ల శబ్ధాలు కూడా వినిపిస్తుండటం విశేషం. కాంక్రీట్ జంగిల్లో కాకుండా కాస్త ప్రశాంత వాతావరణం ఉన్న ప్రదేశంలో కార్తీక్ తన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అభిమానులు సైతం ఇల్లు చాలా బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: రాజకీయాల్లోకి ఎంట్రీ.. ఎమ్మెల్యేగా పోటీ? స్పందించిన రాహుల్ -
ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్
జబర్దస్త్ కమెడియన్ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమపేరుతో యువతిని మోసం చేశాడన్న ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్ చేశారు. కాగా ఇటీవల ఓ యువతి.. తనను నవసందీప్ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు నటుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జబర్దస్త్ నటుడు నవసందీప్ 2018లో ఓ యువతికి ప్రేమకబుర్లు చెప్పి దగ్గరయ్యాడు. నిత్యం వాట్సాప్ చాటింగ్ చేసేవాడు. ఆమెను ఊరి నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు. షేక్‌పేటలోని ఓ హాస్టల్లో ఆ యువతి నాలుగేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో త్వరలో పెండ్లి చేసుకుంటానని నమ్మించి తన కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేశాడు. తాను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవసందీప్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: ‘బెదురులంక 2012’మూవీ రివ్యూ 2022లో విడుదలైన సినిమాలకు 2021 అవార్డులా.. అదెలా? -
కుడికాలి వేలు తీసేశారు.. తొడపై చర్మాన్ని తీసి..: యాదమ్మరాజు
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మ రాజు కొద్దిరోజులుగా కాలికి కట్టుతో కనిపిస్తున్నాడు. తాజాగా స్లమ్‌డాగ్ హజ్బెండ్ ఈవెంట్లో కూడా అతడు చేతికర్ర సాయంతో నడుస్తూ కనిపించాడు. తనకు అంత పెద్ద గాయం ఎలా అయింది? ఏం జరిగిందనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు కమెడియన్. యాదమ్మరాజు మాట్లాడుతూ.. 'చాయ్ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడే అటుగా వచ్చిన వ్యక్తి బైక్ స్కిడ్ అవడంతో నన్ను గుద్దేశాడు. కుడికాలి వేలు తీసేశారు. తొడ భాగం నుంచి చర్మం తీసేసి వేలు దగ్గర అతికించారు. ప్రాణం పోయినట్లనిపించింది. ఇప్పటికీ చాలా నొప్పిగా ఉంది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి కదా అని ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాను' అని చెప్పుకొచ్చాడు. ఇంత జరిగినా ప్రమోషన్స్‌కు వచ్చిన యాదమ్మరాజుపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మునుపటిలా పరుగులు పెట్టకుండా ఇంట్లో ఉండి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. ఇకపోతే పటాస్ కామెడీ షోతో పాపులరయ్యాడు యాదమ్మ రాజు. తన పంచులు, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల పెదవులపై నవ్వులు పూయించాడు. జబర్దస్త్ షోతో మరింత మందికి చేరువైన ఈ కమెడియన్ ప్రియురాలి స్టెల్లా రాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ యూట్యూబ్ వీడియోలతో అభిమానులను అలరిస్తూ ఉంటారు. ప్రస్తుతం బుల్లితెర షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు యాదమ్మ రాజు. చదవండి: బిగ్‌బాస్ 7 ప్రారంభమయ్యేది అప్పుడే! -
ఒకానొక సమయంలో చనిపోదామనుకున్న వర్ష, త్వరలో బిగ్‌బాస్‌లోకి!
జబర్దస్త్ కామెడీషోతో పేరుప్రఖ్యాతలు సంపాదించింది వర్ష. అందంతో అలరిస్తూనే కామెడీ స్కిట్లతో నవ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్ 7వ సీజన్లో అడుగుపెట్టనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా బిగ్‌బాస్ షోలో తన ఎంట్రీపై స్పందించింది వర్ష. 'నాకు సినిమా ఛాన్సులు వచ్చాయి. ఒక స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కూడా వచ్చింది. కానీ బుల్లితెరను వదలడం ఇష్టం లేక అక్కడికి వెళ్లలేదు. త్వరలో పెద్ద షోలో ఎంట్రీ ఇవ్వబోతున్నా అయితే ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్నాను. కానీ హీరోయిన్గా చేయాలన్న ఆశ లేదు. అక్క, వదిన, ఫ్రెండ్.. ఇలాంటి రోల్స్ మాత్రమే చేస్తాను. ఇకపోతే త్వరలో నేను ఓ పెద్ద షోకి వెళ్తున్నాను.. ఏం చదువుకున్నాను? వంటి విషయాలను అక్కడే రివీల్ చేస్తాను. ఇప్పటికే నాకు చెక్కులు కూడా పంపించేశారు' అంటూ పరోక్షంగా బిగ్‌బాస్ ఎంట్రీ గురించి హింట్లు వదిలింది వర్ష. అన్నయ్యను స్కూటీతో ఢీ కొట్టారు తన జీవితంలో ఎంతగానో బాధపడ్డ సందర్భం గురించి చెప్తూ.. 'నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. రెండేళ్లక్రితం నేను సంక్రాంతికి ఊరెళ్లాను. అప్పుడు అమ్మ ఫోన్ చేసి మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని, త్వరగా రా అని చెప్పింది. మా అన్నయ్యను స్కూటీతో గుద్దారు. అది చాలా చిన్న యాక్సిడెంట్ అనుకున్నాను. తీరా ఆస్పత్రికి వెళ్లాక తన బ్రెయిన్లో రక్తం గడ్డకట్టింది.. బతకడం కష్టం అన్నారు. డాక్టర్ కాలు పట్టుకుని ఏడ్చాను. ఎంత ఖర్చయినా సరే బతికించండి అని బతిమాలాను. రెండు రోజులు వాష్‌రూమ్ బయటే నిద్ర అన్నయ్య కండీషన్ నాకు మాత్రమే తెలుసు. ఇంట్లో ఎవరికి చెప్పినా వాళ్లు తట్టుకోలేరు. అందుకే ఆ టెన్షన్ అంతా నేనే భరించాను. రెండు రోజులు వాష్‌రూమ్ బయట పడుకున్నాను. ఆ తర్వాత రోజు అన్నయ్య మెదడులో రక్తం లీక్ అవుతుందని చెప్పడంతో భరించలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. ఇంతలో అంబులెన్స్‌లో సొమ్మసిల్లి పడిపోవడంతో సెలైన్స్ పెట్టి నాకు ట్రీట్మెంట్ చేశారు. ఆ తర్వాత అన్నయ్యకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఎందుకంటే అన్నయ్య నా పంచప్రాణాలు' అని చెప్పుకొచ్చింది వర్ష. చదవండి: బిగ్‌బాస్ షో ఫేక్.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు -
డైరెక్టర్‌గా జబర్దస్త్ కమెడియన్.. 'ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది'!
సాయికుమార్, ఆదిత్యా ఓం, ఐశ్వర్య, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ సాయి, దీపాలి రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నాతో నేను’. శాంతి కుమార్ తూర్లపాటి (జబర్దస్ట్ ఫేం) దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మించారు. ఈ నెల 21న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నటుడు సాయి కుమార్ హాజరయ్యారు. (ఇది చదవండి: స్టార్ డైరెక్టర్ కొత్త వెబ్ సిరీస్.. ఈసారి ఇంకెన్ని వివాదాలో?) సాయికుమార్ మాట్లాడుతూ.. 'నాన్న అమ్మ ఇచ్చిన స్వరం, సంస్కారంతో నేను ఈ స్థాయిలో ఉన్నా. చక్కని కథలతో వైవిధ్యమైన పాత్రలతో నటుడిగా నిలబడ్డా. మనసును కదిలించే కథతో సినిమా రూపొందించారు. ఈ చిత్రంలో ప్రతి సీన్ మనసును కదిలిస్తుంది.' అని అన్నారు. శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ..' చక్కని కథాంశంతో ఎమోషన్స్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీమ్ అంతా కష్టపడ్డాం. చిన్న సినిమానే కావచ్చు కానీ మంచి ప్రయత్నం.' అని అన్నారు. శాంతికుమార్ మాట్లాడుతూ.. 'జబర్దస్త్ కమెడియన్‌గా ప్రేక్షకుల ఆదరణ పొందా. నేను దర్శకత్వం వహించే వరకూ వచ్చానంటే నిర్మాతలే కారణం. కథ అన్ని ఓకే అయ్యాక సీనియర్ ఆర్టిస్ట్ సాయికుమార్ సరే అనగానే నేను సక్సెస్ అయ్యాననిపించింది. అన్ని రకాలుగా సహకరించిన నిర్మాతకు కృతజ్ఞతలు.' అని అన్నారు. కరోనా వల్ల కాస్త ఆలస్యమైనా మంచి సమయంలో విడుదల చేస్తున్నామని ఈ చిత్ర నిర్మాత అన్నారు. ఈ చిత్రంలో సమీర్, సీవీఎల్ నరసింహారావు, గౌతమ్ రాజు, ఎమ్మెస్ చౌదరి, భద్రం, సుమన్ శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. (ఇది చదవండి: బిగ్‌బాస్‌లోకి ఇండియన్ స్టార్ క్రికెటర్ .. స్టార్ మా ప్లాన్ ఇదేనా?) -
జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ తల్లి మల్లమ్మ అస్వస్థతకు లోనైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. గుండెలో బ్లాక్స్ ఉండటంతో వైద్యులు స్టంట్స్ వేశారు. ఈమేరకు ఓ వీడియోను ముక్కు అవినాశ్ తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశాడు. 'ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఇలా ఇబ్బందిపడటం చూడలేకపోతున్నా. తను ముందు నుంచే షుగర్ వ్యాధితో బాదపడుతోంది. ఈ షుగర్ వల్ల నచ్చిన ఫుడ్ కూడా తినలేకపోతోంది. ఈ మధ్యే అమ్మకు గుండెపోటు(హార్ట్ స్ట్రోక్) వచ్చింది. తనను ఊరిలో ఆస్పత్రికి తీసుకెళ్తే అమ్మ గుండె వీక్ ఉందన్నారు. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే ఒక ఆస్పత్రిలో చూపించాను. గుండెలో రెండు పెద్ద బ్లాక్స్ ఏర్పడ్డాయి. ఆంజియోగ్రామ్ చేయించాం, రెండు స్టంట్స్ వేయించాం. తననిప్పుడు ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి' అని చెప్పుకొచ్చాడు. తనకు వచ్చిన పరిస్థితిని తలుచుకుని అవినాశ్ తల్లి కన్నీటిపర్యంతమైంది. 'నా కొడుకులు బతికించారు, అందుకే బతికినా. జరగబోయేది నాకు తెల్వదు. మీ దయ వల్ల మంచిగుండి డ్యాన్స్ చేశిన, అన్నీ చేశిన. నాకిప్పుడు ఈ కష్టం వచ్చింది. మీరు లేకుంటే బతకలేను, నా పెద్ద కొడుకు లేకపోయుంటే ఊరిలోనే నా ప్రాణం పోయేది. వాడు తొందరగా నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించడం వల్లే బతికి ఉన్నాను' అంటూ ఏడ్చేసింది. కొద్దిరోజులపాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ముక్కు అవినాశ్ తల్లిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్లాడు. చదవండి: శామీర్‌పేట్ ఘటన.. నాకు సంబంధమే లేదంటున్న నటుడు మనోజ్