Jabardasth Comedian Komaram Open About His Life Struggles In Career - Sakshi
Sakshi News home page

Komaram: కోఠిలో వస్తువులు అమ్మేవాణ్ని.. నా లైఫ్ ఇంతే అన్నారు: జబర్దస్త్ కొమరం

Published Sat, Apr 1 2023 8:15 PM | Last Updated on Sat, Apr 1 2023 8:56 PM

Jabardasth Comedian Komaram Open About His Life Struggles In Career - Sakshi

ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ కొమరం. కామెడీ పంచులతో అదరగొట్టే కొమరం అంటే ఇండస్ట్రీలో ఎవరూ గుర్తు పట్టలేరేమో. ఎందుకంటే తన పాత్ర కొమరక్కతోనే అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు. తన యాస, భాష, కట్టు బొట్టుతో అందరిని మెప్పించారు. పలు టీవీ ఛానెల్స్‌లో నటించిన కొమరం.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయారు. ప్రస్తుతం నాని నటించిన దసరా చిత్రంలో కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కొమరం తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో అన్ని కష్టాలు చూశానని ఎమోషనల్ అయ్యారు. 

కొమరక్క అని పిలిస్తేనే సంతోషం

కొమరం మాట్లాడుతూ.. 'నాపేరు కొమరం కదా.. అందుకే కొమరక్క అని పేరును నా క్యారెక్టర్‌ పెట్టుకున్నా. కొమరక్క అంటే ఎవరినీ లెక్క చేయదు. అయితే ఈ క్యారెక్టర్‌ మామూలుగా సక్సెస్ కాలేదు. చాలామందికి కొమరక్క అంటే ఒక మహిళ అని తెలుసు. నన్ను బయట ఎవరైనా చూస్తే కొమరక్క అనే అంటారు. ఆ పేరుతోనే అందరూ ఫిక్సయిపోయారు. కానీ నాకు ఆ పేరుతో పిలిస్తేనే ఇష్టం. నేను పనిచేసే ఛానెల్‌లో షో ఆపేయడంతో కొమరక్క టీవీ అనే యూట్యూబ్‌ ఛానల్ ప్రారంభించా.' అని అన్నారు. 

అన్ని రకాల పనులు చేశా 

ఇండస్ట్రీలోకి రాకముందు అన్ని రకాల పనులు చేశానని కొమరం తెలిపారు. ఆయన మాట్లాడుతూ..' హైదరాబాద్‌లో సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు, గొడుగులు అమ్మేవాడినని..  కోఠిలో నిలబడి వస్తువులు అమ్మేవాడిని. అవన్నీ చాలా హ్యాపీగా ఇష్టంతోనే అన్నీ పనులు చేశా. హోటల్‌లో కూడా పని చేశా. క్యాటరింగ్‌లో కూడా చేశా. పాత్రలు కడిగేవాడిని.  ఇండస్ట్రీలోకి రాకముందు ఇవన్నీ చేశా. ఈ ఫీల్డ్‌లోకి వచ్చాక కూడా ఇబ్బందులు పడ్డా. కానీ సక్సెస్ అయ్యాను.  నా జీవితంలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదు.  నేను చదివింది పదో తరగతి మాత్రమే. ఇంత పేరు వస్తుందని నా లైఫ్‌లో అనుకోలేదు.  ప్రస్తుతం మూవీస్‌తో బిజీ అవ్వడం వల్ల కామెడీ షో నుంచి బయటకొచ్చేశా. ' అని అన్నారు. 

ఆ ఐదేళ్లు నా లైఫ్‌లో మళ్లీ రాకూడదని కోరుకుంటా

కొమరం మాట్లాడుతూ.. 'ఐదేళ్లు లైఫ్‌లో ఇబ్బందులు పడ్డా. అలాంటి పరిస్థితులు మళ్లీ రావొద్దని కోరుకుంటా. అవీ తలుచుకుంటే ఏడుపొచ్చేది. మా నానమ్మ చనిపోయినప్పుడు బాధేసింది. మా అమ్మ కూడా సినిమాల్లోకి పోమ్మని చెప్పేది. మా చెల్లెలు అంటే నాకు పిచ్చి. ' అని అన్నారు. ప్రస్తుతం నాని, కీర్తి సురేశ్ నటించిన దసరా చిత్రంలో నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement