Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న క‌మెడియ‌న్‌ కిర్రాక్ ఆర్పీ.. | Kiraak RP Ties Knot With His Girlfriend Lakshmi Prasanna, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Kiraak RP Marriage: ఎంగేజ్‌మెంట్ అయి ఏడాదిన్న‌ర‌.. గ‌ప్‌చుప్‌గా పెళ్లి చేసుకున్న జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్‌

Nov 29 2023 4:31 PM | Updated on Nov 29 2023 5:06 PM

Kiraak RP Ties Knot with Girlfriend Lakshmi Prasanna - Sakshi

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో వంద‌ల స్కిట్లు చేసి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు ఆర్పీ. త‌ర్వాత ఆ షో నుంచి త‌ప్పుకున్న అత‌డు మ‌రే ఇత‌ర షోల‌లోనూ పెద్ద‌గా క‌నిపించ‌లేదు. చాలా కాలం

కమెడియ‌న్ కిర్రాక్ ఆర్పీ పెళ్లిపీట‌లెక్కాడు. ప్రేయ‌సి ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. బుధ‌వారం (న‌వంబ‌ర్ 29న‌) నాడు విశాఖ‌ప‌ట్నంలో ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ముంద‌స్తు హ‌డావుడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు ఆర్పీ. ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకోవ‌డం గురించి ఆర్పీ మాట్లాడుతూ.. 'అమ్మాయిది వైజాగ్‌. గ‌తేడాది మా నిశ్చితార్థం జ‌రిగింది. మేము ప్రేమించుకుని, పెద్ద‌ల‌ను ఒప్పించి మ‌రీ పెళ్లి చేసుకుంటున్నాం. ఎంగేజ్‌మెంట్‌, త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌కు సెల‌బ్రిటీలు, ఇత‌ర వీఐపీలు వ‌చ్చారు. ఈసారి కేవ‌లం బంధుమిత్రుల స‌మ‌క్షంలోనే పెళ్లి చేసుకోవాల‌ని వైజాగ్ ఎంచుకున్నాం. అందుకే పెళ్లి విష‌యాన్ని గోప్యంగా ఉంచాం' అని చెప్పుకొచ్చాడు.

కాగా కిర్రాక్ ఆర్పీ, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గ‌తేడాది మేలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుక‌కు ధ‌న‌రాజ్ స‌హా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. దాదాపు ఏడాదిన్న‌ర త‌ర్వాత పెళ్లి చేసుకున్నారు. జీవితంలో నూత‌న అధ్యాయాన్ని ప్రారంభించిన‌ ఆర్పీ- ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌ల జంట‌కు అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఆర్పీ ఏం చేస్తున్నాడు?
జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో వంద‌ల స్కిట్లు చేసి ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించాడు ఆర్పీ. ఆ షో నుంచి త‌ప్పుకున్న త‌ర్వాత అత‌డు మ‌రే ఇత‌ర షోల‌లోనూ పెద్ద‌గా క‌నిపించ‌లేదు. చాలా కాలం త‌ర్వాత హైద‌రాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు పేరిట క‌ర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించాడు. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ వ్యాపారం విజ‌య‌వంతం కావ‌డంతో ఆర్పీ ముంద‌డుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేప‌ల పులుసు పేరిట‌ ప‌లు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు.

చ‌ద‌వండి: ఫినాలే అస్త్ర గెలుపుకు ద‌గ్గ‌ర్లో ఉంది ఈ న‌లుగురే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement