
కమెడియన్, నటుడు చలాకీ చంటి గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే! ఈ నెల 21న చంటికి తీవ్రమైన ఛాతీనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.
రక్తనాళాల్లో పూడికలు ఉన్నట్లు తేలడంతో డాక్టర్లు స్టంట్ వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది. చంటి ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఇంతవరకు ఎక్కడా స్పందించనేలేదు.
కాగా జబర్దస్త్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు చలాకీ చంటి. తనదైన కామెడీ టైమింగ్‌తో, కడుపుబ్బా నవ్వించే స్కిట్లతో ప్రేక్షకులను అలరించాడు. బిగ్‌బాస్ ఆరో సీజన్‌లోనూ పాల్గొన్న అతడు సినిమాల్లోనూ నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు. కొంతకాలంగా మాత్రం అతడు అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కనిపించడం లేదు.
చదవండి: విరూపాక్ష సినిమా వేయలేదని థియేటర్‌పై తేజ్ ఫ్యాన్స్ దాడి
Comments
Please login to add a commentAdd a comment