జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే తన లైఫ్‌లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. బుల్లితెరపై కమెడియన్‌గా క్లిక్ అయిన సమయంలో అనారోగ్యానికి గురై షో నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. చాలాకాలం తర్వాత తాజాగా ఓ షోలో హాజరై తన కన్నీటి కష్టాలను వివరించాడు.
ఆటోకు డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లేవాళ్లం
'ఒక పేరు వచ్చాక కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ 'మహాత్మ' సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది మేమే.. కానీ పాడింది మేమేనని ఎక్కడా పేరు వేయలేదు. అలా అక్కడ స్ట్రక్ అయిపోయాను. తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడు. అభి అన్న ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక.. హైపర్ ఆది అన్న, నేను కృష్ణా నగర్ నుంచి బోయిన్‌పల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ షేర్ ఆటోలో వెళ్లేవాళ్లం.
ఆ దేవుడు నాపై కరుణ చూపలేదు
జబర్దస్త్ షోలో మంచి పేరొచ్చింది. టీం లీడర్ స్థాయికి వెళ్లాను. కానీ ఎందుకో నామీద దేవుడు కరుణ చూపలేదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి కష్టాలే.. నేను చనిపోయేవరకు ఈ కష్టాలు నన్ను వదిలిపోవేమో అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్. అక్కడే ఉన్న ఫణి సైతం తాను పడ్డ బాధలను చెప్పుకొచ్చాడు. సినిమాలు చేద్దామని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. కానీ అక్కడ సినిమాల్లేవు. షోలు చేద్దామంటే అవి కూడా లేవు. ఆ సమయంలోనే నాన్నకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి
Comments
Please login to add a commentAdd a comment