jeevan
-
‘కేరాఫ్ రవీంద్రభారతి ’ హిట్ కావాలి: మామిడి హరికృష్ణ
‘తెలంగాణలోనే కాకుండా భారతదేశంలోని ప్రతి కళాకారుడి యొక్క డ్రీమ్ డెస్టినేషన్ రవీంద్ర భారతి. గత 64 ఏళ్ల నుంచి ఓ సాహిత్య కేంద్రంగా విలసిల్లుతూ.. ఒక ప్రామాణిక ఆడిటోరియంగా ఉంది. అందుకనే ప్రతి కళాకారుడు తన జీవితంలో ఒక్కసారైనా ఇక్కడ కళా ప్రదర్శన చేయాలని తపన పడతాడు. లక్షలాది కళాకారులకి వేదికగా నిలిచిన రవీంద్ర భారతి నేపథ్యంలో ‘కేరాఫ్ రవీంద్రభారతి ’సినిమా తెరకెక్కడం సంతోషంగా ఉంది’ అన్నారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ. అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై టి.గణపతి రెడ్డి నిర్మాత గా , గట్టు నవీన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కేరాఫ్ రవీంద్రభారతి’.జబర్దస్త్ జీవన్, గట్టు నవీన్, నవీన,మాస్టర్ రత్నాకర్ సాయి, ప్రణీత తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలు ఆదివారం నాడు రవీంద్రభారతి లో జరిగింది.తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు,మామిడి హరికృష్ణ ముఖ్య అదితి గా విచ్చేసి డైరెక్టర్ కి కథ ని అందించి, ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేయగా, యువ డైరెక్టర్ నటుడు తల్లాడ సాయి కృష్ణ క్లాప్ కొట్టి టీం కి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ.. నవీన్ నాకు చాలా కాలంగా తెలుసు, చాలా కష్టపడే వ్యక్తి. తన మొదటి సినీమా శరపంజరం ఎలా కష్టపడి తీసారో ఆ శ్రమ నాకు తెలుసు. ఇప్పుడు ఓ మంచి కథతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.డైరెక్టర్ గట్టు నవీన్ మాట్లాడుతూ..మామిడి హరికృష్ణగారి చేతుల మీదుగా కేరాఫ్ రవీంద్ర భారతి సినిమా ప్రారంభోత్సవం జరగడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా ను నిర్మిస్తున్న టి. గణపతిరెడ్డిగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓ మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా ఉంటుంది’ అన్నారు. ‘మంచి కథ తో మీ ముందుకు వస్తున్నాం. అందరూ ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు జీవన్. ‘ఓ మంచి కథలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అని హీరోయిన్ నవీన అన్నారు. -
నిరీక్షణ ముగిసె...
హాంగ్జౌ (చైనా): భారత టెన్నిస్ ప్లేయర్ విజయ్ సుందర్ ప్రశాంత్ తన కెరీర్లో గొప్ప విజయాన్ని అందుకున్నాడు. 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ తన కెరీర్లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల విజయ్ మంగళవారం ముగిసిన హాంగ్జౌ ఓపెన్ టోరీ్నలో భారత్‌కే చెందిన తమిళనాడు ప్లేయర్ జీవన్ నెడుంజెళియన్‌తో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్‌ను దక్కించుకున్నాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో విజయ్–జీవన్ ద్వయం 4–6, 7–6 (7/5), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్‌స్టన్‌టిన్ ఫ్రాంట్జెన్–హెండ్రిక్ జెబెన్స్ (జర్మనీ) జోడీని ఓడించింది. విజయ్–జీవన్‌లకు 52,880 డాలర్ల (రూ. 44 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో రెండో సీడ్, మూడో సీడ్ జోడీలను విజయ్–జీవన్ ఓడించడం విశేషం. 35 ఏళ్ల జీవన్కిది రెండో ఏటీపీ డబుల్స్ టైటిల్. 2017లో రోహన్ బోపన్నతో కలిసి జీవన్ చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించాడు. -
జీవన్–అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్
మొరెలోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో భారత్‌కు చెందిన జీవన్ నెడున్‌జెళియన్–అర్జున్ ఖడే జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్–అర్జున్ ద్వయం 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్)–రోమియోస్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. జీవన్–అర్జున్ జోడీకి 4,665 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ,75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
చనిపోయేవరకు నన్ను వదలవేమో.. ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్
జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే తన లైఫ్‌లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. బుల్లితెరపై కమెడియన్‌గా క్లిక్ అయిన సమయంలో అనారోగ్యానికి గురై షో నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. చాలాకాలం తర్వాత తాజాగా ఓ షోలో హాజరై తన కన్నీటి కష్టాలను వివరించాడు. ఆటోకు డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లేవాళ్లం 'ఒక పేరు వచ్చాక కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ 'మహాత్మ' సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది మేమే.. కానీ పాడింది మేమేనని ఎక్కడా పేరు వేయలేదు. అలా అక్కడ స్ట్రక్ అయిపోయాను. తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడు. అభి అన్న ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక.. హైపర్ ఆది అన్న, నేను కృష్ణా నగర్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ షేర్ ఆటోలో వెళ్లేవాళ్లం. ఆ దేవుడు నాపై కరుణ చూపలేదు జబర్దస్త్ షోలో మంచి పేరొచ్చింది. టీం లీడర్ స్థాయికి వెళ్లాను. కానీ ఎందుకో నామీద దేవుడు కరుణ చూపలేదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి కష్టాలే.. నేను చనిపోయేవరకు ఈ కష్టాలు నన్ను వదిలిపోవేమో అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్. అక్కడే ఉన్న ఫణి సైతం తాను పడ్డ బాధలను చెప్పుకొచ్చాడు. సినిమాలు చేద్దామని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. కానీ అక్కడ సినిమాల్లేవు. షోలు చేద్దామంటే అవి కూడా లేవు. ఆ సమయంలోనే నాన్నకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
ఎమోషనల్ వృషభ
జీవన్, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘వృషభ’. అశ్విన్ కామరాజ్ కొప్పల దర్శకత్వంలో యుజిఓస్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘‘ఈ చిత్రంలో మంచి ఎమోషన్ ఉన్నట్లనిపిస్తోంది’’ అని ఫస్ట్ లుక్, ట్రైలర్ లాంచ్ వేడుకలో పాల్గొన్న నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. ‘‘1966–1990 నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆధ్యాత్మికంగా వెళుతూనే మనుషులకు, పశువులకు మధ్య ఉండే బాండింగ్‌ని చూపించాం’’ అన్నారు అశ్విన్. ‘‘ఓ పల్లె లోని చిన్న గుడిలో ఈ కథ నా మదిలో మెదిలింది’’ అన్నారు ఉమాశంకర్. -
రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో...
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్. ఎ నిర్మిస్తున్నారు. లాక్‌డౌన్‌కి ముందే కొంతభాగం షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా శంకర్.ఎ మాట్లాడుతూ– ‘‘విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా విడుదల చేసిన మా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మధుశోభ మేకింగ్ చాలా బాగుంది. మణిశర్మగారి సంగీతం, కాసర్ల శ్యామ్, భాష్యశ్రీల సాహిత్యం మా సినిమాకు ప్లస్ అవుతాయి’’ అన్నారు. -
జర్నలిస్ట్ ఏం చేశాడు?
‘‘అమెరికా నుంచి ఏడాది తర్వాత తిరిగి వచ్చాక విన్న కథల్లో ‘దాడి’ నచ్చింది. గోకుల్ చాట్ బాంబు దాడిలో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి పాత్రలో కనిపిస్తా. ఆ తర్వాత వరుసగా జరుగుతున్న అలాంటి పరిణామాల వెనక అసలు నిజాన్ని రాబట్టడానికి జర్నలిస్ట్‌గా మారి ఏం చేశానన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమా తర్వాత చంద్రమహేశ్‌గారి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా’’ అని వరుణ్ సందేశ్ అన్నారు. జీవన్, చెరిష్మా శ్రీకర్, కారుణ్య చౌదరి ముఖ్య తారలుగా వరుణ్ సందేశ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ.టి దర్శకత్వంలో శంకర్ ఆరా, జయరాజు.టి నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఏడిద శ్రీరామ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, శివాజీ రాజా క్లాప్ ఇచ్చారు. మధు శోభ.టి మాట్లాడుతూ– ‘‘యూత్‌కు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. సమాజంలో జరుగుతున్న పరిణామాల వెనకున్న చీకటి కోణాలను వెలికి తీసే జర్నలిస్ట్ కథ ఇది’’ అన్నారు. ‘‘మధు చెప్పిన కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం’’ అని శంకర్ ఆరా అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: ప్రసాద్ ఈదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్. -
జీవన్ జంటకు టైటిల్
న్యూఢిల్లీ: గత వారమే చెంగ్డూ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న భారత టెన్నిస్ ప్లేయర్ జీవన్ నెడున్‌జెళియన్ అదే జోరులో మరో ఏటీపీ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. తన కొత్త భాగస్వామి మార్సెలో అరెవలో (మెక్సికో)తో కలిసి మాంటెరీ ఏటీపీ చాలెంజర్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్ చాలెంజర్ సర్క్యూట్లో జీవన్కిది నాలుగో టైటిల్. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్ నెడున్‌జెళియన్ (భారత్)– మార్సెలో అరెవలో (మెక్సికో) ద్వయం 6–1, 6–4తో లియాండర్ పేస్ (భారత్)– మిగెల్ ఏంజెల్ రయీస్ జంటపై గెలుపొందింది. -
ఫైనల్లో జీవన్ జంట
న్యూఢిల్లీ: చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు జీవన్ నెడుంజెళియన్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం 7–5, 6–1తో గిడో పెల్లా (అర్జెంటీనా)–జావో సౌసా (పోర్చుగల్) జోడీపై గెలిచింది. జీవన్ కెరీర్లో ఇది రెండో ఏటీపీ డబుల్స్ ఫైనల్. 2017లో అతను రోహన్ బోపన్నతో కలిసి చెన్నై ఓపెన్‌లో టైటిల్ గెలిచాడు. -
ఆర్చరీ కోచ్ మినహా...
న్యూఢిల్లీ: ‘ద్రోణాచార్య’ అవార్డుకు నామినేట్ అయిన భారత కాంపౌండ్ విభాగం ఆర్చరీ జట్టు కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ తేజ మినహా... నామినేట్ చేసిన మిగతా అందరికీ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణా చార్య, ధ్యాన్‌చంద్ అవార్డులు అధికారికంగా ఖాయ మయ్యాయి. ఈ మేరకు అవార్డుల సెలెక్షన్ కమిటీ పంపించిన జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కొరియాలో 2015లో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా జీవన్‌జ్యోత్ నిర్లక్ష్యం కారణంగా భారత యూనివర్సిటీ పురుషుల జట్టు ఇటలీ జట్టుతో జరగాల్సిన కాంస్య పతక పోరుకు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు చేరుకోలేకపోయింది. దాంతో నిర్వాహకులు ఇటలీకి కాంస్య పతకం ఖాయం చేశారు. ఈ ఉదంతంపై విచారణ చేసిన ఆలిండియా యూనివర్సిటీల సంఘం జీవన్‌జ్యోత్‌పై మూడేళ్లపాటు, భారత ఆర్చరీ సంఘం ఏడాది పాటు నిషేధం విధించింది. కోర్టుకు వెళ్తా: జీవన్‌జ్యోత్ తన పేరును ద్రోణాచార్య అవార్డుల జాబితా నుంచి తొలగించడంపై జీవన్‌జ్యోత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘చివరి నిమిషంలో నా పేరు తొలగించడం అన్యాయం. ఈ విషయాన్ని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా. న్యాయం కోసం కోర్టులో క్రీడా శాఖపై కేసు వేస్తా’ అని జీవన్‌జ్యోత్ తెలిపాడు. ‘2015 ప్రపంచ యూనివర్సిటీ ఉదంతం విషయంలో నా తప్పిదం లేకపోయినా శిక్ష అనుభవించాను. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించానని అనుకుంటే జకార్తా ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు కోచ్‌గా నన్ను ఎందుకు పంపించారు. నన్ను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేయకూడదని క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయంతో తీవ్రంగా కలత చెందాను’ అని జీవన్‌జ్యోత్ తెలిపాడు. 2018 జాతీయ క్రీడా పురస్కారాల విషయానికొస్తే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానులకు ‘ఖేల్‌రత్న దక్కనుంది. ‘అర్జున’ అవార్డుల కోసం ఎంపిక చేసిన 20 మంది క్రీడాకారుల జాబితాలో తెలంగాణ నుంచి డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి కూడా ఉంది. ఈనెల 25న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. -
రన్నరప్ జీవన్ జంట
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ యువ ఆటగాడు జీవన్ నెదున్‌చెజియాన్ వరుసగా రెండో అంతర్జాతీయ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచాడు. అమెరికాలో జరిగిన సవన్నా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో జీవన్–ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) జంట ఫైనల్లో ఓడిపోయింది. లూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్)–అకీరా సాంటిలన్ (ఆస్ట్రేలియా) ద్వయంతో జరిగిన ఫైనల్లో జీవన్–ఎన్రిక్ జోడీ 2–6, 2–6తో పరాజయం పాలైంది. రన్నరప్‌గా నిలిచిన జీవన్–ఎన్రిక్లకు 2,700 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. లక్షా 81 వేలు)తోపాటు 48 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతవారం తలాసీ ఓపెన్ టోర్నీలోనూ జీవన్–ఎన్రిక్ జోడీ ఫైనల్లో ఓడిపోయింది. -
డిసెంబర్ 2న తిరుట్టుపయలే–2
తమిళసినిమా: బాబిసింహా, ప్రసన్నా, అమలాపాల్ నటించిన చిత్రం తిరుట్టుపయలే–2. తిరుట్టుపయలే మొదటి భాగాన్ని నిర్మించిన ఏజీఎస్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ కల్పాత్తి అగోరమే తిరుట్టుపయలే–2కు కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. జీవన్, అబ్బాస్, సోనియా అగర్వాల్ కలిసి నటించిన తిరుట్టుపయలే చిత్రం తొలి భాగం 2006 ఏప్రిల్‌లో విడుదలైంది. సాధారణంగా ఒక చిత్రం మొదటి భాగం విడుదలైన ఒకటి రెండు సంవత్సరాల్లోనే రెండో భాగం కూడా విడుదల చేస్తారు. అయితే తిరుట్టుపయలే చిత్రం 11 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం విడుదలకు సిద్ధమవుతుండడం విశేషం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్ణయించినట్టు చిత్ర యూనిట్ తెలిపింది. -
గుడికి వెళ్తూ టీవీ నటులు దుర్మరణం
సాక్షి, బెంగుళూరు: బుల్లి తెర నటులు రచన, జీవన్‌లు గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. రచన స్నేహితురాలి పుట్టిన రోజు కావడంతో పార్టీ చేసుకున్న అనంతరం కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకునేందుకు తన ఆరుగురు స్నేహితులతో కారులో బయల్దేరారు. వీరిలో జీవన్ కూడా ఉన్నారు. కారు మాగడి వద్దకు చేరుకున్న తర్వాత వేగంగా వెళ్తున్న బస్సును తప్పించబోయిన డ్రైవర్.. రోడ్డుకు ఎడమ వైపున ఆగివున్న ట్యాంకర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో రచన, జీవన్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడిన మిగతా వారిని స్థానికులు నీలమంగళలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఓ సీరియల్ షూటింగ్ కోసం గురువారం రాత్రి రచన హైదరాబాద్‌కు రావాల్సివుండగా ఈ దుర్ఘటన జరిగిందని ఆమె తండ్రి గోపాల్ కన్నీరుమున్నీరయ్యారు. రచన, జీవన్‌లు నటించిన 'మహానంది' సీరియల్ కన్నడంలో మంచి ఆదరణ పొందింది. రచన తన కెరియర్ను 'మధుబాల' సీరియల్‌తో ప్రారంభించారు. జీవన్ కన్నడంలో ఇప్పుడిప్పుడే కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. -
రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటులు మృతి
కన్నడ టీవీ సీరియల్స్ మహానది, త్రివేణి సంగమ, మధుబాల లాంటి సీరియల్స్ లో నటించిన యువ నటి రచన, నటుడు జీవన్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. మిత్రులతో కలిసి బెంగుళూరు దగ్గరలోని సుబ్రమణ్య స్వామి పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న ట్యాంకర్ ను డీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో జీవన్ డ్రైవింగ్ సీట్లో ఉండగా రచన అతని పక్క సీట్లో కూర్చోని ఉంది. వీరితో పాటు ప్రయాణిస్తున్న మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బుధవారం రచన, జీవన్ ల స్నేహితుడు కార్తీక్ బర్త్‌డే సందర్భంగా పూజలు నిర్వహించి అక్కడే బర్త్‌డే పార్టీ చేసుకుని గురువారం తెల్లవారు జామున సఫారీ కారులో బయలుదేరారు. తిరిగి వస్తుండగా కర్నాటకలోని మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన రచన, జీవన్ ల మిత్రులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. -
జీవన్ జంట సంచలనం
ఈస్ట్‌బోర్న్ (ఇంగ్లండ్): ఎగాన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత ఆటగాడు జీవన్ నెదున్‌చెజియాన్ డబుల్స్‌లో సంచలన విజయంతో ముందడుగు వేశాడు. మ్యాట్ రీడ్ (ఆస్ట్రేలియా)తో కలిసి అన్‌సీడెడ్ జోడీగా బరిలోకి దిగిన జీవన్ తొలి రౌండ్లో ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ చాంపియన్స్‌ను కంగుతినిపించాడు. సోమవారం జరిగిన తొలిరౌండ్లో భారత్–ఆసీస్ ద్వయం 6–3, 3–6, 10–7తో మూడో సీడ్ రియాన్ హరిసన్ (అమెరికా)–మైకేల్ వీనస్ (కివీస్) జంటపై విజయం సాధించింది. మరోవైపు ప్రతిష్టాత్మక ‘వింబుల్డన్’ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’లో జీవన్‌కు చోటు దక్కింది. డబుల్స్‌లో 95వ ర్యాంకర్ జీవన్‌కు తనకన్నా మెరుగైన ర్యాంకర్ డొనాల్డ్సన్ (65వ ర్యాంకు) జతయ్యాడు. వింబుల్డన్ నిబంధనల ప్రకారం ఇద్దరు భాగస్వాముల ర్యాంకులు కలిపితే 160కి మించరాదు. సరిగ్గా కటాఫ్ ర్యాంకు (95+65=160)తో భారత ఆటగాడు గట్టెక్కాడు. -
జీవన్
తెలుగు నటుల్లో జీవన్‌ను సిఎస్సార్తో పోల్చవచ్చా? ఆ రూపం, మాట విరుపు, చూపులో విషం... ప్రేక్షకులకు భయం కలిగించిన హిందీ విలన్లలో జీవన్ ఒకడు. పుట్టుకతోనే తల్లిని కోల్పోయాడు. మూడేళ్ల వయసుకే తండ్రిని కోల్పోయాడు. మొత్తం 24 మంది సంతానంలో ఇతను 24వ వాడట. పాకిస్తాన్లో వీళ్లది కలిగిన కుటుంబం. కాని సినిమాల పిచ్చితో చేతిలో 26 రూపాయలు పట్టుకుని 18 ఏళ్ల వయసులో లాహోర్ నుంచి బొంబైకి పారిపోయి వచ్చాడు. షోలేకు కెమెరామేన్‌గా పని చేసిన ద్వారకా ద్వివేచాతో కలిసి స్టూడియోల్లో రిఫ్లెక్టర్లు మోసేవాడు. తర్వాత యాక్టర్ అయ్యాడు. హిందీ సినిమాల్లో ఆ మాటకొస్తే భారతీయ సినిమాల్లో 60సార్లు నారదముని పాత్ర పోషించిన నటుడు జీవన్లా మరొకడు లేడు. ‘మేలా’ ,‘కానూన్’, ‘నయాదౌర్’, ‘వక్త్’ వంటి సినిమాలు జీవన్‌కు చాలా పేరు తెచ్చాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, నసీబ్ వంటి సినిమాల్లో కూడా కనిపించాడు. బాలీవుడ్లో క్రమశిక్షణ కలిగిన నటుడిగా పేరు. మరో విలన్ కిరణ్ కుమార్ ఇతని కుమారుడే. -
చదువు‘కొనలేని’ సరస్వతీ పుత్రుడు
నాగోలు: అనాథ విద్యార్థి గృహంలో ఉంటూ.. పుస్తకాలే నేస్తంగా.. చదువే దైవంగా.. ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా.. పట్టుదలతో కష్టపడి చదివిన అతనికి విజయం దాసోహమైంది.. అందరిలోనూ తనను సరస్వతీ పుత్రుడిగా నిలబెట్టింది. కానీ.. నా అనే వారే లేని ఈ అనాథ విద్యార్థికి లక్ష్మీ కటాక్షం కరువై.. చదువు ‘కొనలేని’ పరిస్థితి తలెత్తింది. దీంతో అతని కళ్లు మనసున్న మారాజుల చేయూత కోసం ఎదురుచూస్తున్నాయి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఎల్బీనగర్లోని అనాథ గృహంలో చేరాడు జీవన్. టెన్త్ క్లాస్‌లో మంచి మార్కులు సాధించి.. వనస్థలిపురంలోని నారాయణ కాలేజీలో ఉచితంగా సీటు పొందాడు. 974 మార్కులతో ఇంటర్ ఫలితాల్లోనూ సత్తా చాటి జేఈఈఈ మెయిన్స్ (ఎన్ఐటీ)లో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో సీటు పొందాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఎన్ఐటీలో నాలుగేళ్ల కోర్సు, పుస్తకాలకు గాను రూ.4 లక్షల వరకు అవసరమవుతున్నాయి. ఇంత ఖర్చు పెట్టి చదువుకునే పరిస్థితి లేకపోవడంతో దాతల సాయాన్ని అర్థిస్తున్నాడు. ఈ నెల 12వ తేదీ లోపు రూ.20 వేలు చెల్లిస్తేనే జీవన్‌కు సీటు దక్కుతుందని అనాథ విద్యార్థి గృహం నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మానాన్న లేని తనకు విద్యాదానం చేసి ఆదుకోవాలని జీవన్ కోరుతున్నాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి తనలాంటి అనాథలు, నిరుపేదలకు సాయం చేయాలన్నదే ఆశయమని చెబుతున్నాడు. వివరాలకు సెల్: 9490792576. -
అధిపర్గా జీవన్
నటుడు జీవన్ అధిపర్గా మారారు. పెణ్ కన్సోర్డియం స్టూడియోస్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై నవ నిర్మాత టీ శివకుమార్ నిర్మిస్తున్న చిత్రం అధిపర్. పీబీ శరవణన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో జీవన్ హీరోగాను, నటి విద్య హీరోయిన్‌గానూ నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో దర్శకుడు సముద్రఖని, రంజిత్, రిచర్డ్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో తంబి రామయ్య, సింగముత్తు, రాజ్ కపూర్, శరవణ సుబ్బయ్య, భారతీ కణ్ణన్, సంగిలి మురుగన్, పావా లక్ష్మణన్, మదన్ బాబు, వయ్యాపురి, సంపత్ రాం, రేణుకా, కోవై సరళ, అలగు తదితరులు నటిస్తున్నారు. దీనికి కథ, కథనం దర్శకత్వ బాధ్యతలను సూర్య ప్రకాష్ నిర్వహిస్తున్నారు. ఈయన గతంలో మాయి, దీవాన్, మాణిక్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన విషయం గమనార్హం. అధిపర్ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, జీవితంలో సచ్చినా ఇతరులకు ద్రోహం చేయననే పాత్రలో నటుడు జీవన్ నటిస్తుండగా, నమ్మక ద్రోహమే జీవితంగా గడిపే పాత్రలో రంజిత్ నటిస్తున్నట్టు తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథగా పేర్కొన్నారు. చిత్రం అధిక భాగం చెన్నై, పాండిచ్చేరి, మలేషియా ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగినట్టు వివరించారు. దీనికి విక్రమ్ సెల్వ సంగీతాన్ని, పిలిప్ విజయకుమార్ ఛాయగ్రహణం అందిస్తున్నారన్నారు. -
పాక్ పటాస్
ఈమధ్య టీవీలో మీరు ఈ టీజర్ చూసే ఉంటారు. 1992- 2011 మధ్య ఇండియా-పాక్‌లు తలపడిన ఐదు సందర్భాల్లోనూ గెలుపుపై ఆశలుపెట్టుకొని సంబరాలకు పటాసులు రెడీ చేసుకొన్న ఓ పాక్ అభిమాని... తీరా తమ జట్టు ఓడిపోయే సరికి వాటిని అటకెక్కించేస్తుంటాడు. సగటు పాక్ జట్టు అభిమానిని ఉడికిస్తున్నట్టుగా ఉన్న ఆ తొలి టీజర్ ఇండియన్ ఫ్యాన్స్‌ను మాత్రం బాగా అలరించింది. అయితే ముందుగానే టీజర్లను డిజైన్ చేసుకున్నారో ఏమో కానీ స్టార్ టీవీ వాళ్లు పాక్‌తో మ్యాచ్ అనంతరం ఇండియన్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ అతడి చేతిలో పటాస్‌లు ఉంచారు. ప్రపంచకప్‌లో అంతవరకూ దక్షిణాఫ్రికాపై గెలిచిన చరిత్రే లేని ఇండియన్ టీమ్‌కు అది దెప్పిపొడుపులా అనిపించింది. తీరా దక్షిణాఫ్రికాపై ఇండియన్ టీమ్ నెగ్గేసరిగి తిరిగి ఆ టీజర్‌ను పాక్ వైపు మళ్లించారు. తమ జట్టు ఇండియాపై గెలవకపోవడంతో పటాసులను పేల్చే అవకాశం రాని బాధలో ఉన్న పాకిస్తాన్ అభిమాని దక్షిణాఫ్రికా అయినా ఇండియాని ఓడిస్తుందనే ఆశలు పెట్టుకున్నట్టుగా మూడో టీజర్లో చూపారు. అందులో దక్షిణాఫ్రికా జెర్సీని ధరించిన పాక్ అభిమాని ఆ జట్టుకు మద్దతునిస్తాడు. అయితే ఈసారి కూడా ఆశాభంగమే! ఈ అసహనంతో ఉడికిపోతున్న అతడికి యూఈఏ ఫ్యాన్ తమ దేశ జెర్సీని అందిస్తాడు. ప్రస్తుతం స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతున్న ఈ టీజర్లో ఇండియాను యూఏఈ ఓడిస్తుందన్న ఆశతో ఆ దేశపు జెర్సీతో రెడీగా ఉంటాడు పాక్ అభిమాని. యూఏఈ ఒక అనామక జట్టు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలను చిత్తు చేసిన ఇండియన్ టీమ్‌ను ఓడించి పాక్ అభిమానిచేత పటాసులు కాల్పించేంత సీన్ ఆ జట్టుకు ఉంటుందా? ఏదేమైనా ఈ పటాసులు మోగనంత వరకే మనకు ఆనందం. కాబట్టి అవి శాశ్వతంగా పాక్ అభిమాని చేతిలోనే పదిలంగా ఉండాలని... ఈ ప్రపంచకప్ ముగిశాక కూడా అతడు వాటిని అటకెక్కించాలని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆశ! - జీవన్ -
భయానికీ, ఆశకూ మధ్య...
ఇంటర్నెట్ మూవీ డేటా బేస్(ఐఎమ్‌డీబీ)ని ప్రతి రోజూ విశ్వవ్యాప్తంగా 1.6 కోట్లమంది సందర్శిస్తారు. రివ్యూలు, ఫోటో గ్యాలరీలు, డౌన్లోడ్ లింకులతో సహా దాదాపు ఇరవై లక్షల సినిమాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది ఇందులో! ఇలాంటి నేపథ్యమున్న సైట్లో గత పదిహేను సంవత్సరాలుగా ఒకే చిత్రం ‘ద బెస్ట్’ గా నిలుస్తోంది! వేలాది చిత్రాల మధ్య అది టాపర్‌గా నిలుస్తోంది. హాలీవుడ్ సినిమాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయమైన సమాచార వాహినిగా ఉన్న ఈ సైట్లో ఆ సినిమా ఆధిపత్యాన్ని అందుకునే చిత్రాలు రావడం లేదు.నెటిజన్లే ఓటర్లుగా ఐఎండీబీ ఎంపిక చేసిన అత్యుత్తమ 250 హాలీవుడ్ సినిమాల్లో తొలిస్థానంలో నిలుస్తున్న ఆ చిత్రమే ‘ద షాషాంక్ రెడెంషన్’. 1994 లో విడుదలైన ఈ సినిమా 1998 నుంచి ఇప్పటి వరకూ టాప్ రేటింగ్‌తో తొలిస్థానంలో నిలిచి, కొనసాగుతోంది. 1990ల ప్రారంభంలో కేవలం ఒక డాలర్ చెల్లించి తను రాసిన కథలను, నవలలను సినిమాగా తీసుకోవచ్చుననే బ్రహ్మాండమైన ఆఫర్‌ను ఇచ్చాడు అమెరికన్ రచయిత స్టీఫెన్ కింగ్. ఆయనేమీ అప్పటికింకా ఔత్సాహిక యువ రచయిత కాదు, ఆయన రాసిన అనేక కథాంశాలు అప్పటికే సినిమాలుగా రూపొంది కోట్లాది డాలర్ల కలెక్షన్లను సాధించాయి! అప్పటికే రెండు దశాబ్దాలుగా రచయితగా ప్రస్థానం సాగించిన కింగ్ నుంచి వచ్చిన ఆశ్చర్యకరమైన ప్రకటన అది. ఆ ప్రకటన చాలా మంది హాలీవుడ్ నిర్మాతలకు, దర్శకులకు బంపర్ ఆఫర్ అయ్యింది. అంత వరకూ కింగ్ నవలలను మూస పద్ధతిలో అనేక మంది దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తూ వస్తున్న నేపథ్యంలో... తన అక్షరాలను తెరపై సృజించదగిన వారి కోసం కింగ్ ఈ ప్రయత్నం చేశాడనుకోవాలి. అద్భుతమైన సినిమాకు తగిన ముడిసరుకు ఉంటుంది కింగ్ రచనల్లో. జీవితానికి పాజిటివ్ కోట్ వేసి పాత్రచిత్రణ చేస్తారు కింగ్. చాలా వరకూ హారర్ నవలలే రాసిన స్టీఫెన్కింగ్ భిన్నమైన షార్ట్ స్టోరీల్లో ఒకటి ‘రీటా హేవర్త్ అండ్ షాషాంక్ రెడెంషన్’. కింగ్ అభిమాని అయిన దర్శకుడు ఫ్రాంక్ డరబోంట్ ఆ ఒక్క డాలర్ ఆఫర్ కింద ఈ షార్ట్స్టోరీని ఎంచుకొని సినిమాగా రూపొందించాడు. రెండు దశాబ్దాల పాటు జైలు జీవితం గడిపిన ఒక వ్యక్తి కథే ఈ సినిమా. భార్య హత్య గురించి చేయని నేరానికి హీరో ‘రెండు జీవితాల ఖైదు’ అనుభవించాలని శిక్ష విధిస్తుంది కోర్టు. అతడిని ‘షాషాంక్’ అనే జైలుకు తరలిస్తారు. అక్కడి పరిస్థితుల మధ్య జైలును సంస్కరించడానికి, అక్కడ జరుగుతున్న అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అతడు చేసే ప్రయత్నాల కథే మిగతా సినిమా. హీరో పాత్రద్వారా ఎక్కడా నిరుత్సాహం, నిస్తేజం ఆవరించకుండా పరిస్థితులకు తగ్గట్టుగా జీవితాన్ని మలుచుకోవడాన్ని పాఠంగా చూపిస్తారు. ‘ఫియర్ కెన్ హోల్డ్ యూ ప్రిజనర్, హోప్ కెన్ సెట్ యూ ఫ్రీ’ అనే ట్యాగ్‌లైన్ ఈ చిత్రం జీవితానికి అద్దే పాజిటివ్ నెస్‌ను ప్రతిబింబిస్తుంది. ఆశావాహ దృక్పథం గురించి అద్భుత స్థాయిలో ఆవిష్కరించిన ఈ సినిమా గాడ్‌ఫాదర్, గాడ్‌ఫాదర్-2 తదితర చిత్రాలన్నింటినీ దాటుకుని ఐఎండీబీలో ఫస్ట్‌ప్లేస్‌కు చేరుకుంది. సినిమా రూపంలో కూడా ప్రపంచం ఆశావాహ దృక్పథాన్నే ఆదరిస్తుందనేదానికి నిరూపణే ‘ద షాషాంక్ రిడెంషన్’ - జీవన్ -
సృజనాత్మక వ్యాపారి..!
ప్రణాళిక ప్రకారం జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవడం ఒక కళ. తీసుకొన్న నిర్ణయంలో నేర్పు, వేసిన ఎత్తులో వ్యూహం, పడిన శ్రమకు ప్రతిఫలం.. కొన్ని జీవితాల్లోని సక్సెస్ పాఠం అది. అయితే మరికొన్ని జీవితాల్లో భిన్నమైన పరిస్థితులుంటాయి. శ్రమ, పోరాటం, ఓటమి, నిరుత్సాహం. అంతటితో ఆగిపోయే వ్యక్తులు కొందరు అయితే... ఆ అపజయాలనే విజయానికి సోపానాలుగా చేసుకొనే వారు మరికొందరు. ఎదురుదెబ్బలను, పరాజయాలను, అవమానాలను తృణప్రాయంగా తీసుకొని జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకొనే స్థితప్రజ్ఞత మరికొందరిలో ఉంటుంది. జీవితానికి, విజయానికి కొత్త నిర్వచనం ఇవ్వగల శక్తిమంతులు వాళ్లు. అలాంటి వారిలో ఒకరు సందీప్ మహేశ్వరి. ఇమేజెస్ బజార్‌తో అద్భుతాలు సాధిస్తున్న యువకుడు. అతడు ఒక మధ్య తరగతి కుటుంబంలోని వాడు. దేశరాజధాని ఢిల్లీలో నివాసం. మనసులో ఎన్నో ఆలోచనలు, మరెన్నో కలలు... అయితే లక్ష్యదిశగా దూసుకెళ్లడానికి తగిన వ్యూహమేలేదు. తండ్రిది అల్యూమినియం వ్యాపారం. బాగానే నడుస్తున్న ఆ వ్యాపారం అనుకోకుండా దెబ్బతిన్నది. ఫలితంగా ఆ కుటుంబంలో ఒక్కసారిగా కుదుపులు. ఆర్థికంగా తీవ్రమైన కష్టాలు. ఏం చేయాలో అర్థం కానిస్థితి. దీంతో చదువుమీద కూడా దృష్టి నిలపలేకపోయాడు, బీకాం చదువును ఫైనలియర్‌లోనే వదిలేశాడు. ఏం చేద్దామనుకొంటున్నావు? అని విధి ప్రశ్నిస్తే... చదుకొంటాను అని సమాధానం ఇచ్చాడు! జీవితాన్ని చదువుతానన్నాడు. అబ్బాయిలు అందంగా ఉంటారా..?! అబ్బాయిల్లో అందమేముంది! అది అమ్మాయిల సొత్తు కదా! అబ్బాయిలు అంతిమంగా ‘హ్యాండ్సమ్’గా ఉంటారు. తను కూడా అలాగే ఉన్నానని అనిపించింది సందీప్‌కు. స్నేహితుల ద్వారా ఉన్న పరిచయాలతో మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అదృష్టాన్ని వెదుక్కొన్నాడు. అవకాశాలు లభించాయి. అయితే అప్పుడు అర్థం కాలేదు.. పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నానని! వేధింపులు! పోటీతత్వం ఎక్కువగా ఉంది. కలర్ఫుల్గా, జోష్‌గా కనిపించే ఆ రంగంలో సెటిల్ కావడానికి ప్రయత్నించే అనేకమంది మేల్ మోడల్స్ మధ్య తీవ్రమైన పోటీతో.. సీనియర్ మోడల్స్ తమలాంటి జూనియర్లను తొక్కిపెట్టడానికి ప్రయత్నించేవారట! సందీప్ గ్లామర్ కోసం ఆ ఫీల్డ్‌లోకి రాలేదు. పొట్టకూటి కోసం వచ్చాడు. అక్కడ తనలాగే ‘స్ట్రగులింగ్’ దశలో ఉన్న అనేకమంది యువకులను గమనించాడు. వారందరినీ చూశాక అతడికి ఒక ఐడియా వచ్చింది. చేతికి కెమెరా వచ్చింది. రెండు నెలల్లోనే ఫొటోగ్రఫీ విద్య అబ్బింది. మోడల్‌గా కాదు, కెమెరామెన్‌గా మోడలింగ్ ప్రపంచాన్ని మార్చేస్తానని అన్నాడు! అయితే ఆ ప్రయత్నం ఆరు నెలల్లో అతడి అడ్రస్‌ను మార్చేసింది. ముగ్గురు స్నేహితులతో కలిసి నెలకొల్పిన మాష్ ఆడియో విజువల్స్ అనే సంస్థ దిగ్విజయంగా మూతపడింది. ఉద్యోగం చేస్తానని వెళితే ఒత్తిళ్లు, వ్యాపారం చేద్దామని అనుకొంటే కలిసి రాలేదు. కుటుంబ కష్టాలు కామన్. అన్ని అనుభవాలు సంపాదించినప్పటికీ అతడి వయసు 21 యేళ్లు. ఈ క్షణం వరకూ నువ్వు సంపాదించుకొంది మొత్తం పోయినా.. నీ చేతిలో భవిష్యత్తు ఉంటుంది. సందీప్‌కు అదే అనిపించింది. తన బ్రెయిన్ ఇంకా ఫ్రెష్‌గానే ఉంది. అదే తన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. అయితే తనకంటూ ఒక గుర్తింపు రావాలి. ఆ గుర్తింపే తన జీవితాన్ని మార్చగలదన్నాడు. అందుకోసం కొత్త వ్యూహాన్ని రచించాడు. పది గంటలా నలభై ఐదు నిమిషాలు... 122 మంది మోడల్స్.. మొత్తం పదివేల ఫొటోలు! ప్రపంచంలోని ఏ ఫొటోగ్రాఫర్కూ సాధ్యం కాని ఫీట్ అది. అలాంటి దాన్ని సాధించి రికార్డు సృష్టించాడు. దేశరాజధానిలోని మెట్రో పేజీల్లో పతాక శీర్షికలకు ఎక్కాడు. మోడలింగ్‌లో ఉన్న రోజుల్లో అక్కడ తనలాగే ఇబ్బంది పడుతున్న యువతీయువకులను అందరినీ కలుపుకొని, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సందీప్ ఆ ఫీట్‌ను సాధించాడు. అది అతడికి గుర్తింపును ఇచ్చింది. ఆ ఫొటోలే అతడికి అస్త్రాలుగా మారాయి. అలాంటి స్టఫ్‌తో ‘ఇమేజెస్బజార్డాట్కామ్’ను స్థాపించాడు. భిన్నమైన హావభావాలతో ఉన్న మోడల్ ఫొటోలకు వేదిక అది అనే ప్రచారాన్ని కల్పించాడు. ప్రపంచ రికార్డు హోల్డర్ కాబట్టి మీడియా కూడా ఇతడి గురించి రాస్తూ ఆ సైట్ గురించి మంచి ప్రచారం కల్పించింది. ప్రతీకాత్మక చిత్రాల అవసరం ఉన్న అనేక సంస్థలు, మీడియా ఈ సైట్ మీద ఆధారపడ్డాయి. ఇంకేముంది ప్రతి ఫొటో అమ్మకమే! పదేళ్లు గడిచి ప్రస్తుతానికి వస్తే విశ్వవ్యాప్తంగా అక్షరాలా ఏడువేల సంస్థలు ఫొటోల కోసం ఇమేజెస్బజార్పై ఆధారపడ్డాయి... ఈ సంస్థతో కాంట్రాక్టులు కుదుర్చుకొని ఫోటోలను వాడుకుంటున్నాయి. మొత్తం 45 దేశాల్లో ఈ నెట్వర్క్ ఉంది. సందీప్ సైట్ కోట్ల రూపాయల టర్నోవర్‌ను సాధించింది. ఇలా అతడు మోడలింగ్ ప్రపంచాన్ని మార్చివేశాడు! ఇప్పుడు సందీప్ జీవితం అనేక జీవితాలకు ఒక పాఠం. అతడు పడ్డ కష్టాలు, వాటిని ఎదుర్కొని ఎదిగిన తీరు.. సాధించిన విజయం... స్ఫూర్తిదాయకం. వ్యాపారవేత్తగా అతడు లెక్కకు మించి అవార్డులు అందుకొన్నాడు. సృజనాత్మక వ్యాపారిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. - జీవన్ -
నకిలీ బంగారం విక్రయించే ముఠా అరెస్టు
కొండపాక, న్యూస్‌లైన్ : నకిలీ బంగారాన్ని అసలైన బంగారంగా చూపుతూ నమ్మించి మోసం చేస్తున్న ముఠా గుట్టు రట్టయ్యింది. ఒకే కుటుంబానికి చెందిన మహిళతో సహా ముగ్గురిని కుకునూర్‌పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం విలేకరులకు వివరించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ దగ్గరున్న బెహరాగడ్ గ్రామానికి చెందిన శాంతాబాయి, తమ్ముడు జీవన్, కుమారుడు ప్రజల్ని బురుడీ కొట్టించి నకిలీ బంగారాన్ని అంటగట్టేవారు. అంతేగాకుండా గంజాయిని కూడా విక్రయించేవారు. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం కుకునూర్‌పల్లిలో నకిలీ బంగారాన్ని అసలైందిగా చూపుతూ మోసం చేసే యత్నంలో ఉండగా.. తమకు సమాచారం అందిందన్నారు. దీంతో గ్రామానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామన్నారు. వారి నుంచి 1.650 కి లోల నకిలీ బంగారంతో తయారైన ఆభరణాలు, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. విలేకరుల సమావేశంలో ఇద్దరు ట్రైనీ ఎస్ఐలు అశోక్, జయశంకర్, ఏఎస్ఐ మొగిలయ్య, కానిస్టేబుళ్లు సుభాష్, గణేష్, కనకారెడ్డిలు ఉన్నారు. -
నవయువం: ఆట అపూర్వం ఆలోచన ఆదర్శం
ఫుట్‌బాల్ వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అనిపించుకోవడం కన్నా నా చిన్ని ప్రపంచంలో బెస్ట్మ్యాన్ అనిపించుకోవడమే గొప్ప అనిపిస్తుంటుంది. కెరీర్ అంతా అయిపోయాక... నేను మిగుల్చుకునేది ఏమిటి అని ఆలోచించినప్పుడు... ‘మెస్సీ ఒక డీసెంట్ గై’ అనిపించుకుంటే చాలనిపిస్తుంది’. అతడి ఆట అపూర్వం... అతడికున్న ఆదరణ అద్వితీయం... అతడి సంపాదన, పేరు, ఫేమ్... అన్నీ అఖండమైనవే. వీటన్నిటితో పాటు అతడి ఆలోచన ఆదర్శప్రాయం. ఎదిగినకొద్దీ ఒదిగి ఉంటూ, నిండుకుండలాంటి వ్యక్తిత్వంతో వ్యవహరిస్తూ, మంచి ఆటగాడిగానే కాకుండా ఆలోచనాపరుడిగా కూడా పేరు తెచ్చుకున్న యువకుడు లయనల్ మెస్సీ. అర్జెంటీనాకు చెందిన ఈ ఫుట్‌బాల్ క్రీడాకారుడి ఆటతీరు గురించి ఫుట్‌బాల్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. కానీ ఇతడి ఆలోచన తీరు గురించి ఎంతైనా చెప్పవచ్చు. మెస్సీ ఆట తీరే కాదు.. అతడి ఆటిట్యూడ్ కూడా ఆదర్శప్రాయమే! ఫుట్‌బాల్ అంటే ఆసక్తిలేకపోయినా, మెస్సీ ఆలోచన తీరు మాత్రం ఆసక్తిదాయకమైనదే. ‘అన్బిలీవబుల్ టాలెంట్.. ఇన్ క్రెడిబుల్ హంబుల్..’ ప్రఖ్యాత టైమ్ మ్యాగజిన్ మెస్సీకి ఇచ్చినకితాబు ఇది. 2012లో ప్రపంచంలో అత్యంత ప్రభావాత్మకమైన వందమంది వ్యక్తుల జాబితాలో 24 ఏళ్ల మెస్సీకి స్థానం ఇచ్చింది టైమ్స్ మ్యాగజీన్. ఈ జాబితాలో అత్యంత పిన్నవయసులో స్థానం సంపాదించిన వ్యక్తిగా, ఇందులో స్థానం దక్కిన ఏకైక ఫుట్‌బాల్ ప్లేయర్‌గా మెస్సీ అరుదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఫుట్‌బాల్ ప్లేయర్‌గా తన నైపుణ్యంతో ప్రభావమంతమైన వ్యక్తిగా ఎదగడం ఒక ఎత్తయితే.. ‘హంబుల్’ (విధేయత) విషయంలో మెస్సీకి గుర్తింపు ఎలా దక్కింది? ప్రత్యేకించి పాతికేళ్ల లోపు వయసులోనే అద్భుతమైన క్రేజ్, లెక్కలేనంత డబ్బు చేతికి వచ్చినా.. వాటన్నింటికీ మించి అతడి ‘విధేయత’ కు గుర్తింపు రావడం అంటే.. అది మెస్సీ వ్యక్తిత్వంలోని గొప్పదనమే! మరి గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తున్న అతడి నియమాలు ఏమిటి? అతడి ఆలోచనలు ఏమిటి? అనే విషయాల గురించి పరిశీలిస్తే.. ఎంత పేరున్న ఆటగాడయినా.. మెస్సీ మాటల్లో బిడియం, చేష్టల్లో సౌమ్యం కనిపిస్తుంది. వివిధ సందర్భాల్లో మెస్సీ వ్యవహరించిన తీరే దీనికి రుజువు. డబ్బు స్ఫూర్తి కాలేదు.. ప్రస్తుతం సాకర్ ప్లేయర్లలో అత్యంత ఎక్కువ డబ్బు సంపాదిస్తున్న వారిలో మెస్సీ ముఖ్యుడు. కానీ... ‘మనీ నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ కాదు. డబ్బు సంపాదించుకోవడంలో చాలా సౌలభ్యాలు ఉంటాయని అర్థమైంది. కానీ సంతోషం మాత్రం ఫుట్‌బాల్‌తోనే ముడిపడి ఉంది. ఫుట్‌బాల్‌పై నాకున్న ఇష్టమే కావల్సినంత స్ఫూర్తిని ఇస్తోంది. ఒక ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్‌గా సంపాదన లేకపోయినా... ఫుట్‌బాల్‌పై ప్రేమ ఇసుమంతైనా తగ్గేది కాదు...’ అంటూ డబ్బు గురించి పట్టింపులేదని అంటాడు మెస్సీ. టీమ్ స్పిరిట్.. ‘వ్యక్తిగత రికార్డులు, రివార్డుల కన్నా.. టీమ్ పరమైన సక్సెస్ నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఎన్ని గోల్స్ చేశాను అనేదానికన్నా.. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న టీమ్ ఎన్ని గోల్స్ తేడాతో గెలిచిందనే లెక్కనే పరిశీలిస్తుంటాను...’ అంటాడు మెస్సీ. హోమ్‌సిక్ ఉంది.. ‘నా మాతృదేశంలో తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఉండటాన్ని ఆటకోసం త్యాగం చేస్తున్నాను! నా ఇష్టాన్ని త్యాగం చేస్తున్నాను. మరో లక్ష్యం కోసం ఈ త్యాగాన్ని చేస్తున్నాను. ఏది చేసినా నా కల సాకారం చేసుకోవడం కోసమే!’ అంటూ హోమ్‌సిక్ గురించి చిన్నపిల్లాడిలా చెబుతూ తర్వాత తనను తానే ఊరడించుకుంటాడు. హ్యాపియెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్.. మెస్సీకు ఉన్న స్టార్ హోదాను చూసి అందరూ ఇలా అనుకుంటుండవచ్చు. మెస్సీ కూడా అప్పుడప్పుడు ఇలాగే ఫీలవుతాడట. ‘నాకు మరీ ఆనందం కలిగిన సందర్భాల్లో ‘ఐ యామ్ ది హ్యాపియెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్’ అనుకుంటాను. ఇలా అనుకోవడంతో ఆ సంతోషం రెట్టింపు అవుతుంది...’ అంటూ సంతోషానికి ఒక సీక్రెట్ చెబుతాడు మెస్సీ. - జీవన్