
న్యూఢిల్లీ: చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు జీవన్ నెడుంజెళియన్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో జీవన్–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) ద్వయం 7–5, 6–1తో గిడో పెల్లా (అర్జెంటీనా)–జావో సౌసా (పోర్చుగల్) జోడీపై గెలిచింది. జీవన్ కెరీర్‌లో ఇది రెండో ఏటీపీ డబుల్స్ ఫైనల్. 2017లో అతను రోహన్ బోపన్నతో కలిసి చెన్నై ఓపెన్‌లో టైటిల్ గెలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment