Final
-
నేడు అండర్–19 మహిళల ఆసియాకప్ ఫైనల్ – బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
ఆసియాకప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్లో యువ భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో అజేయంగా నిలిచిన భారత జట్టు ఆదివారం కౌలాలంపూర్‌లో జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. నిక్కీ ప్రసాద్ సారథ్యంలోని భారత జట్టు ‘సూపర్ ఫోర్’ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఫైనల్‌కు అర్హత సాధించగా... మరోవైపు బంగ్లాదేశ్ ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి తుది పోరుకు చేరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో సమష్టిగా రాణిస్తున్న యువ భారత జట్టు... ఆఖరి సమరంలోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తొలిసారి నిర్వహిస్తున్న ఈ టోర్నీ కి మలేసియా ఆతిథ్యమిస్తోంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష ఫుల్ ఫామ్‌లో ఉండగా... కెపె్టన్ నిక్కీ ప్రసాద్, కమలిని, మిథిల, ఐశ్వరి కూడా మంచి టచ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఆయుషి శుక్లా, షబ్నమ్, పరుణిక, ధ్రుతి కీలకం కానున్నారు. -
టైటిల్ వేటలో ముంబై, మధ్యప్రదేశ్
బెంగళూరు: దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న తుది పోరులో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. గ్రూప్ దశలో తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన ముంబై జట్టు టైటిల్ సాధించాలని పట్టుదలతో ఉంటే... 13 ఏళ్ల తర్వాత తుదిపోరుకు అర్హత సాధించిన మధ్యప్రదేశ్ జట్టు ఇదే జోష్‌లో ట్రోఫీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ముంబై జట్టు స్టార్ ఆటగాళ్లతో కళకళలాడుతుండగా... మధ్యప్రదేశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై జట్టులో అజింక్య రహానే, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి టీమిండియా ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ జట్టుకు రజత్ పటిదార్ సారథ్యం వహిస్తుండగా... ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర (రూ. 23.75 కోట్లు) దక్కించుకున్న పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కీలకం కానున్నాడు. భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే తన మెరుపులతో అదరగొడుతున్నాడు. సంప్రదాయ ఆటతీరుకు చిరునామా అయిన రహానే... భారీ హిట్టింగ్తో విరుచుకుపడుతూ ముంబై జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించాడు. తాజా టోర్నీలో 8 మ్యాచ్‌లాడిన రహానే 170కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో 432 పరుగులు సాధించాడంటే అతడి జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇక మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతున్న శ్రేయస్ అయ్యర్ 189 స్ట్రయిక్ రేట్‌తో 329 పరుగులు సాధించాడు. పృథ్వీ షా అడపాదడపా మెరుగైన ప్రదర్శన చేస్తుండగా... సూర్యకుమార్ రాణించాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో శివమ్ దూబేతో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ సూర్యాన్‡్ష షెగ్డే భారీ షాట్లు ఆడగల సమర్థులే. బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్థి, తనుష్ కోటియాన్, సూర్యాన్‡్ష, అథర్వ కీలకం కానున్నారు.మరోవైపు సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఫైనల్ చేరిన మధ్యప్రదేశ్ జట్టు... తుది పోరులోనూ అదే కొనసాగించాలని భావిస్తోంది. ‘మా జట్టు సామర్థ్యంపై నమ్మకముంది. ఎవరితో తలపడుతున్నామనే విషయాన్ని పెద్దగా ఆలోచించడం లేదు. దీన్ని కూడా మరో మ్యాచ్‌లాగే చూస్తున్నాం. మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ చేజిక్కించుకోవడమే మా లక్ష్యం’ అని మధ్యప్రదేశ్ కెపె్టన్ రజత్ పటిదార్ అన్నాడు. ఈ టోర్నీలో పటిదార్ 183 స్ట్రయిక్ రేట్‌తో 347 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నాడు. మిడిలార్డర్లో వెంకటేశ్ అయ్యర్ హిట్టింగ్ జట్టుకు బలం కానుంది. ఈ టోర్నీలో అతడు 162 స్ట్రయిక్ రేట్‌తో 210 పరుగులు సాధించడంతో పాటు... ఉపయుక్తకరమైన మీడియం పేస్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్, త్రిపురేశ్ సింగ్, కుమార్ కార్తికేయ మధ్యప్రదేశ్ బౌలింగ్ భారం మోయనున్నారు. -
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్లో భారత్
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్‌చాంపియన్ భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మస్కట్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 3–1 తేడాతో జపాన్ను చిత్తు చేసి ముందంజ వేసింది. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ ని.లో), దీపిక (13వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున నికో మరుయమా (23వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు రెండో నిమిషంలోనే గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నా... మరో 2 నిమిషాల తర్వాత ముంతాజ్ ఖాన్ గోల్‌తో ఖాతా తెరిచింది. అదే ఊపులో తొలి క్వార్టర్‌లోనే మరో రెండు గోల్స్ చేసిన భారత్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. దీపికకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
మధ్యప్రదేశ్ X ముంబై
దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై, మధ్యప్రదేశ్ జట్లు తుదిపోరుకు దూసుకెళ్లాయి. సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే దంచి కొట్టడంతో బరోడాపై ముంబై జట్టు ఘనవిజయం సాధిస్తే.... కెప్టెన్ రజత్ పాటిదార్ మెరుపులతో ఢిల్లీపై మధ్యప్రదేశ్ పైచేయి సాధించింది. బెంగళూరులో ఆదివారం జరగనున్న ఫైనల్లో మధ్యప్రదేశ్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. బెంగళూరు: సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే (56 బంతుల్లో 98; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో ముంబై జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్లో అడుగు పెట్టింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో బరోడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. శివాలిక్ శర్మ (24 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెపె్టన్ కృనాల్ పాండ్యా (30; 4 ఫోర్లు), శాశ్వత్ రావత్ (33; 4 ఫోర్లు) రాణించారు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (5) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ముంబై బౌలర్లలో సుర్యాంశ్ షెగ్డే 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 17.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానే త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ఈ టోర్నీలో ఫుల్ ఫామ్ కనబర్చిన రహానే... బరోడా బౌలర్లను కుదురుకోనివ్వకుండా మైదానం నలువైపులా షాట్లతో అలరించాడు. ఓపెనర్ పృథ్వీ షా (8), సూర్యకుమార్ యాదవ్ (1) విఫలమైనా... లక్ష్యం పెద్దది కాకపోవడంతో ముంబై జట్టుకు పెద్దగా ఇబ్బందులు ఎదురవలేదు. బరోడా బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అతిత్ సేత్, అభిమన్యు సింగ్, శాశ్వత్ రావత్ తలా ఒక వికెట్ తీశారు. రహానేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 13 ఏళ్ల తర్వాత... ఢిల్లీతో జరిగిన రెండో సెమీఫైనల్లో మధ్యప్రదేశ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. 7 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ ఢిల్లీని చిత్తుచేసిన మధ్యప్రదేశ్ జట్టు 13 ఏళ్ల తర్వాత ముస్తాక్ అలీ ట్రోఫీ ఫైనల్‌కు చేరింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ (33 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్‡్ష ఆర్య (29; 3 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ రావత్ (24; 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకోవడంతో... ఢిల్లీ జట్టు పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఢిల్లీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. మధ్యప్రదేశ్ బౌలర్లలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ 2 వికెట్లు పడగొట్టగా... త్రిపురేశ్ సింగ్, అవేశ్ ఖాన్, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో మధ్యప్రదేశ్ జట్టు 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 152 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ (29 బంతుల్లో 66 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... హర్‌ప్రీత్ సింగ్ (38 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్‡్ష (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ముఖ్యంగా రజత్ పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీ బౌలింగ్‌ను ఏమాత్రం లెక్కచేయని రజత్ భారీ షాట్లతో విజృంభించాడు. హర్‌ప్రీత్‌తో కలిసి రజత్ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 57 బంతుల్లోనే 106 పరుగులు జోడించడంతో... మధ్యప్రదేశ్ జట్టు మరో 26 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 2 వికెట్లు, హిమాన్షు చౌహాన్ ఒక వికెట్ తీశారు. రజత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
భారత్ X బంగ్లాదేశ్
దుబాయ్: అండర్–19 ఆసియా కప్ టోర్నమెంట్ చరిత్రలో యువ భారత్ హాట్ ఫేవరెట్. ఇప్పటివరకు 8 టైటిల్స్ గెలిచింది. గత ఏడాదీ గెలిచే దారిలో బంగ్లాదేశ్ అడ్డుకుంది. దీంతో 2023 టోర్నీలో భారత అండర్–19 టీమ్ సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇప్పుడు ఆ సెమీస్ పరాభవానికి బదులు తీర్చుకునే అవకాశం వచ్చి0ది. డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌ను అమీతుమీలో కంగు తినిపించి తొమ్మిదోసారి విజేతగా నిలిచేందుకు యువ భారత్ తహతహలాడుతోంది. ఆదివారం జరిగే ఫైనల్లో బంగ్లాపై విజయమే లక్ష్యంగా భారత కుర్రాళ్ల జట్టు బరిలోకి దిగుతోంది. టోర్నీలో పాక్‌తో తొలి మ్యాచ్ ఓడాక భారత్ వరుస విజయాలు సాధించింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న యువ జట్టు వరుసగా జపాన్‌పై ఏకంగా 211 పరుగుల తేడాతో, యూఏఈపై పది వికెట్ల తేడాతో, సెమీఫైనల్లో లంకపై 7 వికెట్ల తేడాతో ఇలా ప్రతీజట్టుపై భారీ విజయాలనే నమోదు చేసింది. 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్‌లో అదరగొడుతున్నాడు. ఆయుశ్ మాత్రేతో కలిసి చక్కని శుభారంభాలు ఇస్తున్నాడు. ఈ టోర్నీలో ఆయుశ్ 175 పరుగులు చేయగా, వైభవ్ 167 పరుగులతో నిలకడను ప్రదర్శించారు. నేడు జరిగే తుది పోరులోనూ వీళ్లిద్దరు మరో శుభారంభం ఇస్తే భారత్ ట్రోఫీ గెలిచేందుకు సులువవుతుంది. మరోవైపు బంగ్లాదేశ్ బౌలింగ్ అస్త్రాలతో ప్రత్యర్థుల్ని కట్టిపడేస్తోంది. సెమీఫైనల్లో పాక్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్లు ఫహాద్, ఇక్బాల్ హసన్ ఎమన్ ఇద్దరు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. ఇద్దరు చెరో 10 వికెట్లతో జోరు మీదున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్ అజీజుల్ హకీమ్, కలామ్ సిద్ధిఖీ, అబ్రార్ ఫామ్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే టైటిల్ పోరు భారత్ బ్యాటింగ్, బంగ్లా బౌలింగ్ మధ్య రసవత్తరంగా జరగనుంది. -
ఫైనల్లో అశ్విని పొన్నప్ప జోడీ
గువాహటి: భారత సీనియర్ డబుల్స్ షట్లర్ అశ్విని పొన్నప్ప తన భాగస్వామితో కలిసి మహిళల డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. గువాహటి మాస్టర్స్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో అన్మోల్ ఖర్బ్, పురుషుల సింగిల్స్‌లో సతీశ్ కుమార్ కరుణాకర్ తుదిపోరుకు అర్హత సంపాదించారు. శనివారం జరిగిన సెమీఫైనల్లో అన్‌సీడెడ్ సతీశ్ 13–31, 21–14, 21–16తో ఆరో సీడ్ వాంగ్ జెంగ్ జింగ్ (చైనా)ను కంగు తినిపించాడు. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అన్మోల్ 21–19, 21–17తో మాన్సి సింగ్‌పై గెలుపొందగా, మహిళల డబుల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జంట 21–14, 21–14తో షు లియంగ్ కెంగ్–వాంగ్ టింగ్ జె జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిలతో జోడీకట్టిన తనిషా క్రాస్టోకు సెమీస్‌లో నిరాశ ఎదురైంది.సెమీస్‌లో ఐదో సీడ్ ధ్రువ్–తనిషా ద్వయం 22–24, 11–21తో చైనాకు చెందిన జంగ్ హన్ యూ–లి జింగ్ బావో జంట చేతిలో ఓడింది. నేడు జరిగే ఫైనల్లో సతీశ్ కుమార్... చైనా క్వాలిఫయర్ జువన్ చెన్ జుతో, అన్మోల్ కూడా క్వాలిఫయర్ యన్ యన్ (చైనా)తో తలపడతారు. టాప్‌సీడ్ అశి్వని–తనిషా జోడీ... లి హు జో– వాంగ్ జి మెంగ్ (జంట)తో పోటీ పడనుంది. -
ఫైనల్లో పీవీ సింధు
లక్నో: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆడిన టోర్నీల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించని సింధు ఈ టోర్నీలో నిలకడైన ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శనివారం సింధు 21–12, 21–9తో భారత్‌కే చెందిన 17 ఏళ్ల ఉన్నతి హుడాపై విజయం సాధించింది. 36 నిమిషాల్లో ముగిసిన పోరులో సింధు పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ ప్రత్యర్థిని వరుస గేమ్‌ల్లో చిత్తు చేసింది. సింధు పవర్ ముందు నిలవలేకపోయిన ఉన్నతి పదే పదే తప్పులు చేస్తూ మ్యాచ్‌ను కోల్పోయింది. ‘ఈ ప్రదర్శనతో ఆనందంగా ఉన్నా. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిక్యం కనబర్చా. పూర్తి ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడా. దానికి ఫలితం దక్కింది. ఉన్నతి శాయశక్తులా ప్రయత్నించింది. కానీ నేను ఆమెకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తను వర్ధమాన షట్లర్. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆశిస్తున్నా’అని సింధు పేర్కొంది. ఆదివారం జరగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో చైనా షట్లర్ వు లువో యుతో సింధు తలపడనుంది. లక్ష్యసేన్ ముందంజ.. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ లక్ష్య సేన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో లక్ష్యసేన్ 21–8, 21–14తో షొగో ఒగావా (జపాన్)పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించాడు. ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన లక్ష్యసేన్ సులువుగా మ్యాచ్‌ను ముగించాడు. మరో సెమీఫైనల్లో ప్రియాన్షు రజావత్ 13–21, 19–21తో జియా హెంగ్ జాసో (ఇండోనేíÙయా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ తుది పోరులో జియా హెంగ్‌తో లక్ష్యసేన్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట ఫైనల్‌కు చేరగా... అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ సెమీస్‌లో ఓడింది. గాయత్రి–ట్రెసా 18–21, 21–18, 21–10తో బెనీపా – నున్తకర్న్ (థాయిలాండ్)పై గెలుపొందగా...టాప్ సీడ్ అశ్విని – తనీషా 21–14, 16–21, 13–21 తేడాతో లి జింగ్ – లి ఖియాన్ చేతిలో ఓడారు. మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జోడీ కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఐదో సీడ్ తనీషా–ధ్రువ్ జంట 21–16, 21–15తో జీ హాంగ్ జూ–జియా యీ యాంగ్ (చైనా) ద్వయంపై గెలిచింది. -
ఫైనల్లో సాకేత్–రామ్ జోడీ
సాక్షి, హైదరాబాద్: సియోల్ ఓపెన్ ఏటీపీ–100 చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో సాకేత్–రామ్‌కుమార్ జంట 7–6 (9/7), 6–4తో జాషువ పారిస్ (ఇంగ్లండ్)–నామ్ జి సంగ్ (జపాన్) ద్వయంపై గెలిచింది. ఒక గంట 36 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను ‘టై బ్రేక్’లో దక్కించుకున్న సాకేత్–రామ్‌కుమార్ ద్వయం... రెండో సెట్లో అదే జోరు కొనసాగిస్తూ విజయం సాధించింది. సాకేత్–రామ్‌కుమార్ జంట 6 ఏస్‌లు సంధించి ఆధిక్యం ప్రదర్శించగా... ప్రత్యర్థి జోడీ రెండు ఏస్‌లకు పరిమితమై... రెండు డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఒక టై బ్రేక్ నెగ్గిన సాకెత్–రామ్‌కుమార్ ద్వయం... ఓవరాల్‌గా 77 పాయింట్లు సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్లో వాసిల్ కిర్కోవ్ (అమెరికా)–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) జంటతో సాకేత్–రామ్‌కుమార్ జోడీ తపలడనుంది. -
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో మాళవిక
సార్‌బ్రుకెన్ (జర్మనీ): భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ మాళవిక 23–21, 21–18తో జూలియా జాకబ్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన మాళవిక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందంజ వేసింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఏడో సీడ్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో మాళవిక తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ షెట్టి పరాజయం పాలయ్యాడు. అన్‌సీడెడ్ ఆయుశ్ షెట్టి 17–21, 13–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 28వ స్థానంలో ఉన్న పొపొవ్‌పై 51వ ర్యాంకర్ ఆయుశ్ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాడు. 49 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో చక్కటి ప్రదర్శనతో ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చిన ఆయుశ్... రెండో గేమ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. -
ఫైనల్లో హుమేరా జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) డబ్ల్యూ15 టోర్నీలో తెలంగాణ అమ్మాయి హుమేరా బహార్మస్ డబుల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం బెంగళూరులో జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో హుమేరా–పూజా ఇంగాలె (భారత్) ద్వయం 7–6 (7/2), 6–4తో దివ భాటియా–సాయి సంహిత చామర్తి (భారత్) పై విజయం సాధించింది.హోరాహోరీగా సాగిన తొలి పోరులో పోరాడి గెలిచిన హుమేరా బహర్మస్ జంట... రెండో సెట్లో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ చెలరేగింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆకాంక్ష దిలీప్, తనీషా కశ్యప్ విజయాలు సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఆక్షాంక్ష 7–5, 3–6, 6–2తో వైష్ణవి ఆడ్కర్ (భారత్)పైనే విజయం సాధించగా... తనీషా 6–1, 7–5తో కరోలాన్ డెలానూ (న్యూ కాలెడోనియా) పై గెలిచింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఆకాంక్షతో తనీషా అమీతుమీ తేల్చుకోనుంది. -
నేడే ఫైనల్: దక్షిణాఫ్రికా Vs న్యూజిలాండ్
దుబాయ్: ఒక వైపు న్యూజిలాండ్ 14 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది... మరో వైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో సారి తుది పోరుకు అర్హత సాధించి ఈ సారైనా కప్‌ను ఒడిసి పట్టుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మహిళల టి20 వరల్డ్ కప్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే పోరులో సఫారీ టీమ్‌తో కివీస్ తలపడనుంది. ఈ వరల్డ్ కప్ లీగ్ దశలో రెండు జట్ల ప్రస్థానం దాదాపు ఒకే తరహాలో సాగింది. ఇరు జట్లు చెరో 3 విజయాలు సాధించి లీగ్ దశలో తమ గ్రూప్‌నుంచి రెండో స్థానంలోనే నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఆరు సార్లు చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించి దక్షిణాఫ్రికా ముందంజ వేయగా...మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై పైచేయి సాధించి కివీస్ ఫైనల్ చేరింది. సుదీర్ఘ కాలంగా మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తున్న ఆ్రస్టేలియా, తమదైన రీతిలో క్రికెట్‌కు చిరునామాగా ఉన్న ఇంగ్లండ్లను దాటి రెండు కొత్త జట్లు ఇప్పుడు ఆటపై కొత్త ముద్ర వేసేందుకు ఈ ఫైనల్ సరైన వేదిక కానుంది. ఎవరు గెలిచినా కొత్త చాంపియన్ అవుతారనే విషయమే మహిళల క్రికెట్లో ఆసక్తిని రేపుతోంది. సమ ఉజ్జీల్లాంటి రెండు టీమ్‌ల మధ్య ఫైనల్ ఎంత హోరాహోరీగా సాగుతుందనేది చూడాలి. ఇరు జట్లనుంచి అగ్రశ్రేణి క్రికెటర్లుగా ఎదిగిన సోఫీ డివైన్, సుజీ బేట్స్, మరిజాన్ కాప్లలో ఎవరికి వరల్డ్ కప్ చిరస్మరణీయంగా మారుతుందనేది ఆసక్తికరం. 2010లో ఫైనల్ ఆడిన కివీస్ జట్టులో డివైన్ సభ్యురాలిగా ఉంది. ఆమెతో పాటు అమేలియా కెర్, ప్లిమ్మర్, తహుహు, కార్సన్, రోజ్మేరీలపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. దక్షిణాఫ్రికా టీమ్‌లో బేట్స్, కాప్‌లతో పాటు కెపె్టన్ లారా వోల్వార్ట్, తజ్మీన్, ఎమ్‌లాబా కీలకం కానున్నారు. ఈ మ్యాచ్‌లోకి బరిలోకి దిగడం ద్వారా మహిళల క్రికెట్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ (333) రికార్డును బేట్స్ సవరించనుంది. సెమీస్‌లో అర్ధసెంచరీతో ఆసీస్ పని పట్టిన అనెక్ బాష్ మరో మంచి ఇన్నింగ్స్ ఆడాలని పట్టుదలగా ఉంది. తుది జట్లలో ఎలాంటి మార్పు చేయకుండా సెమీస్ ఆడిన టీమ్‌లనే కొనసాగించే అవకాశం ఉంది. దుబాయ్‌లో వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. టోర్నీలో ఒక్కసారి కూడా వాన వల్ల మ్యాచ్‌లకు అంతరాయం కలగలేదు. మంచు సమస్య కూడా లేదు కాబట్టి స్పిన్నర్లు మంచి ప్రభావం చూపగలరు. -
ఫైనల్లో న్యూజిలాండ్
షార్జా: మహిళల టి20 ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది. తద్వారా ఈసారి మహిళల టి20 ప్రపంచకప్‌లో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. విండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో మొదట న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. జార్జియా ప్లిమర్ (33; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. విండీస్ బౌలర్ డాటిన్ నాలుగు వికెట్లు తీసింది. అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి ఓడిపోయింది. -
ఓడినా.. ఆ విషయంలో సత్తా చాటిన హర్యానా కాంగ్రెస్
చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల ఓట్ల శాతం దాదాపు సమానంగా ఉంది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ తగిన మెజారిటీ సాధించింది.హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 39.94 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెండు పార్టీలకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే కాంగ్రెస్‌కు ఈసారి 11 శాతం ఓటింగ్ పెరిగింది. గతంతో పోలిస్తే బీజేపీకి ఓట్ల శాతంలో తగ్గుదల కనిపించింది. దీనిని గమనిస్తే ఓట్ల శాతం విషయంలో కాంగ్రెస్ మరింత మెరుగుపడింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గాను 40 స్థానాలను బీజేపీ గెలుచుకోగా, ఆ పార్టీ ఓట్ల శాతం 36.49 శాతంగా ఉంది. అదే సమయంలో 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌కు 28.08 శాతం ఓట్లు వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యింది. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డి) రెండు స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రెండూ ఎన్నికల్లో విజయానికి దూరమయ్యాయి. రెండు సీట్లు గెలుచుకున్న ఐఎన్ఎల్డీ 2019తో పోలిస్తే ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంది. ఇది కూడా చదవండి: 32 ఓట్లతో దక్కిన విజయం -
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
చెంగ్డూ (చైనా): భారత డబుల్స్ స్టార్ ప్లేయర్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది మూడో టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. చెంగ్డూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (11/9)తో రెండో సీడ్ ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో సాడియో డుంబియా–ఫాబియన్ రెబూల్ (ఫ్రాన్స్)లతో యూకీ–ఒలివెట్టి తలపడతారు. ఈ ఏడాది యూకీ తన భాగస్వామి ఒలివెట్టితో కలిసి జిస్టాడ్ ఓపెన్, మ్యూనిక్ ఓపెన్ టోరీ్నల్లో టైటిల్స్ సాధించాడు. -
ఫైనల్లో జెస్సికా, సబలెంకా
న్యూయార్క్: అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. గ్రాండ్‌స్లామ్ కెరీర్లో తొలిసారి సెమీస్ చేరిన ఆమె తన ప్రదర్శనను మరింత మెరుగుపర్చుకుంటూ ఈ సారి సొంతగడ్డపై యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ జెస్సికా 1–6, 6–4, 6–2తో కరోలినా ముచొవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. అయితే మరో అమెరికన్ ఎమ్మా నవారో ఆట సెమీస్‌తోనే ముగిసింది.రష్యన్ స్టార్, గత యూఎస్ ఓపెన్ రన్నరప్ అరినా సబలెంక 6–3, 7–6 (7/2)తో 13వ సీడ్ ఎమ్మా నవారోను వరుస సెట్లలో ఇంటిదారి పట్టించింది. నేడు జరిగే ఫైనల్లో పెగూలా తన తొలి గ్రాండ్‌స్లామ్ కోసం, సబలెంక తన మూడో గ్రాండ్‌స్లామ్ కోసం తలపడతారు. సబలెంకా 2023, 2024లలో వరుసగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గింది. తొలి సెట్ కోల్పోయినా... క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్‌ను ఓడించిన జెస్సికాకు సెమీస్ పోరు అంత సులువుగా సాగలేదు. మ్యాచ్ ఆరంభంలో ఫ్రెంచ్ ఓపెన్ 2023 రన్నరప్, చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ముచొవా చెలరేగి ఆడింది. తొలి 12 విన్నర్లలో పది విన్నర్లను ఆమె కొట్టింది. తొలి సెట్లో పెగూలా అదేపనిగా చేసిన తప్పిదాలు, పేలవమైన సర్విస్తో వెనుకబడింది. ఇదే అదనుగా పట్టు బిగించిన ముచొవా 28 నిమిషాల్లోనే తొలి సెట్‌ను వశం చేసుకుంది. రెండో సెట్లోనూ తొలి 9 గేముల్లో ఎనిమిదింట గెలిచి ఒక దశలో 3–0తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఇక్కడి నుంచి సీన్ మారిపోయింది. జెస్సికా జోరు మొదలైంది. ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఆటలో వేగం పెంచింది. మూడు బ్రేక్ పాయింట్లతో రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో చెక్ ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశమివ్వకుండా జెస్సికా మెరుపుషాట్లతో విరుచుకుపడింది. సబలెంక జోరు మరో సెమీఫైనల్లో రష్యన్ స్టార్ సబలెంక జోరుకు ఎమ్మా నవారో ఎదురు నిలువలేకపోయింది. ప్రత్యేకించి యూఎస్ ఓపెన్‌లో తొలిరౌండే దాటని అమెరికన్ ప్లేయర్ ఎమ్మా నిరుటి రన్నరప్ సబలెంక ధాటికి తొలిసెట్లో చతికిలబడింది. తొలిసెట్‌ను 6–3తో గెలుచుకున్న రెండో సీడ్ సబలెంకకు రెండో సెట్లో కాస్తా పోటీ ఇవ్వడంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. అయితే టై బ్రేక్‌లో అనుభవజ్ఞురాలైన రష్యన్ అలవోకగా పాయింట్లు సాధించడంతో కేవలం గంటన్నరలోనే మ్యాచ్ ముగిసింది. సబలెంక 8 ఏస్‌లతో చెలరేగింది. 34 విన్నర్లు కొట్టింది. ఒకే ఒక ఏస్ సంధించిన నవారో 13 విన్నర్లే కొట్టగలిగింది. -
‘పసిడి’ వేటలో భారత షట్లర్లు
పారిస్: పారాలింపిక్స్‌లో ఆదివారం భారత షట్లర్లు మెరిపించారు. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్–4 కేటగిరీలో సుహాస్ యతిరాజ్... ఎస్ఎల్–3 కేటగిరీలో నితేశ్ కుమార్ ఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం రజత పతకాలను ఖరారు చేసుకున్నారు. 2007 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన సుహాస్ గత టోక్యో పారాలింపిక్స్‌లోనూ ఫైనల్‌కు చేరి రజత పతకం దక్కించుకున్నాడు. ఈసారి సెమీఫైనల్లో సుహాస్ 21–17, 21–12తో భారత్‌కే చెందిన సుకాంత్ కదమ్‌ను ఓడించాడు. మరో విభాగం సెమీఫైనల్లో నితేశ్ 21–16, 21–12తో దైసుకె ఫుజిహారా (జపాన్)పై గెలిచి తొలిసారి పారాలింపిక్స్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నేడు జరిగే ఫైనల్స్‌లో టోక్యో పారాలింపిక్స్ చాంపియన్ లుకాస్ మజుర్ (ఫ్రాన్స్)తో సుహాస్; డేనియల్ బెథెలి (బ్రిటన్)తో నితేశ్ తలపడతారు. మహిళల సింగిల్స్ ఎస్యు5 కేటగిరీలో ఇద్దరు భారత క్రీడాకారిణులు తులసిమతి మురుగేశన్, మనీషా రామదాస్ సెమీఫైనల్లో పోటీపడనున్నారు. ఇద్దరిలో ఒకరు ఫైనల్‌కు చేరుకోనుండటంతో ఈ విభాగంలోనూ భారత్‌కు కనీసం రజతం లభించనుంది. ఈరోజు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫ్రెడీ సెతియావాన్ (ఇండోనేసియా)తో సుకాంత్ తలపడతాడు. ప్రీతికి రెండో పతకం మహిళల అథ్లెటిక్స్ టి35 200 మీటర్ల విభాగంలో భారత అథ్లెట్ ప్రీతి పాల్ కాంస్య పతకాన్ని సాధించింది. ప్రీతి 200 మీటర్ల దూరాన్ని 30.01 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. టి35 100 మీటర్ల విభాగంలోనూ ప్రీతికి కాంస్య పతకం లభించిన సంగతి తెలిసిందే. రాకేశ్‌కు దక్కని కాంస్యం పురుషుల ఆర్చరీ కాంపౌండ్ ఓపెన్ విభాగంలో భారత ప్లేయర్ రాకేశ్ కుమార్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయాడు. హి జిహావో (చైనా)తో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో రాకేశ్ 146–147 స్కోరుతో పరాజయం పాలయ్యాడు. రవికి ఐదో స్థానం పురుషుల షాట్‌పుట్ ఎఫ్40 కేటగిరీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు రవి రొంగలి ఐదో స్థానంలో నిలిచాడు. ఇనుప గుండును రవి 10.63 మీటర్ల దూరం విసిరి ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఏడాది ఆసియా పారా గేమ్స్‌లో రజతం గెలిచిన రవి ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినా ఫలితం లేకపోయింది. మిగెల్ మోంటెరో (పోర్చుగల్; 11.21 మీటర్లు) స్వర్ణం సాధించాడు. మరోవైపు మహిళల 1500 మీటర్ల టి11 విభాగం తొలి రౌండ్లో భారత అథ్లెట్ రక్షిత రాజు 5 నిమిషాల 29.92 సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు అర్హత పొందలేకపోయింది. షూటర్ల గురి కుదరలేదు భారత షూటర్లకు ఆదివారం అచి్చరాలేదు. ఆదివారం లక్ష్యంపై గురి పెట్టిన ఏ షూటర్ కూడా పోడియంపై నిలువలేకపోయాడు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్1) ఈవెంట్లో అవని లేఖరా 11వ స్థానంలో నిలువగా, సిద్ధార్థ బాబు 28వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఇదే విభాగం వ్యక్తిగత ఈవెంట్లో స్వర్ణంతో చరిత్ర సృష్టించిన అవని గురి ‘మిక్స్డ్’లో మాత్రం కుదర్లేదు. ఆమె 632.8 స్కోరు చేయగా, సిద్ధార్థ 628.3 స్కోరు చేశాడు. ఈ ఈవెంట్ల్లో టాప్–8 స్థానాల్లో నిలిచిన వారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు. మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ప్రోన్ (ఎస్‌హెచ్2) ఈవెంట్లోనూ శ్రీహర్ష రామకృష్ణకు క్వాలిఫయింగ్‌లోనే చుక్కెదురైంది. అతను 630.2 స్కోరుతో 26వ స్థానంలో నిలిచాడు. రోయింగ్‌లో నిరాశ భారత రోయింగ్ జోడీ కొంగనపల్లి నారాయణ–అనితకు పారాలింపిక్స్‌లో నిరాశ ఎదురైంది. ఆసియా పారా క్రీడల్లో రజత పతకం నెగ్గుకొచి్చన ఈ జంట పారిస్ నుంచి రిక్తహస్తాలతో రానుంది. ఆదివారం జరిగిన పీఆర్3 మిక్స్డ్ డబుల్ స్కల్స్ రోయింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నారాయణ–అనిత జోడీ ఓవరాల్‌గా ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశపరిచింది. 7 నుంచి 12వ స్థానాల కోసం నిర్వహించిన వర్గీకరణ పోటీల్లో భారత ద్వయానికి 8వ స్థానం దక్కింది. ఈ జంట పోటీని 8 నిమిషాల 16.96 సెకన్లలో పూర్తి చేసింది. ఆర్మీ సిపాయి అయిన కొంగనపల్లి నారాయణ 2015లో జమ్మూ కశీ్మర్లోని సరిహద్దు విధుల్లో ఉండగా ల్యాండ్‌మైన్ పేలి ఎడమ కాలిని మోకాలు నుంచి పాదం వరకు పూర్తిగా కోల్పోయాడు. అనిత రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయింది. -
టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? పాపం ఓ మహిళ..!
మెల్బోర్న్ నివాసి ఎమిలీ లాహే అనే మహిళ అత్యంత అరుదైన టెర్మినల్ కేన్సర్‌తో బాధపడుతోంది. ఇక బతికే క్షణాలు తక్కువ. నిమిషాలు కరిగిపోతున్నాయంటూ బాధపడుతోంది. అంతేగాదు తనతో గడిపే కొత్త వ్యక్తులు ఉంటే రండి అంటూ తనతో స్పెండ్ చేసే సమయాన్ని వేలం పాట వేస్తుంది. ఏంటిదీ అనుకుంటున్నారా..?. నయం చేయలేని ఈ వ్యాధి తనను మింగేసేలోపే జీవితాన్ని అందంగా ఆస్వాదించేలా వ్యక్తులతో గడపాలని కోరుకుంటోంది. ఆమె ఆవేదన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది..!అసలేం జరిగిందంటే..32 ఏళ్ల ఎమిలీ లాహే అత్యంత అరుదైన నట్ కార్సినోమాతో బాధపడుతోంది. ఈ కేన్సర్ శరీరంలో మెడ, తల, ఊపరితిత్తుల్లో ఎక్కడైన రావొచ్చు. ఇది చికిత్సకు లొంగని కేన్సర్. అందువల్లే దీన్ని టెర్మినల్ కేన్సర్ అంటారు. అంటే తగినంతగా చికిత్స చేయలేని వ్యాధి అని అర్థం. ఆయుర్దాయం లేదని లేదా ఎక్కువ రోజుల మనుగడ సాధించని పరిస్థితి టెర్మినల్ కేన్సర్ అంటారు. దీంతో తనకు ప్రతి క్షణం విలువైనవి అంటోంది లాహే. మనిషి సాధారణంగా వర్తమానం తప్పించి భూత, భవిష్యత్తుల గురించి ఆలోచింస్తుంటాడు. కానీ ఈ వ్యాధి సదా వర్తమానంలో ఉండకపోతే క్షణాలు ఆవిరిపోతాయనే ఒక పాఠాన్నినేర్పిందని చెబుతోంది. అందుకే తన చివరి క్షణాలను కూడా ఆనందంగా జీవించాలని భావిస్తోంది. అందుకే ఆ క్షణాలను కొత్త వ్యక్తులతో గడిపేందుకు ఎదురుచూస్తోంది. ప్రతి క్షణం తనకు అత్యంత అమూల్యమైనదని చెబుతోంది. కన్నీళ్ల తెప్పిస్తున్న లాహే మాటలన్ని అక్షర సత్యం. జీవితం క్షణభంగురం అని చెప్పకనే చెబుతోంది. అందుకు ఇప్పుడే చనిపోతాం అనుకుని జీవిస్తే ప్రతి ఒక్కరూ మంచిగానే ప్రవర్తిస్తారేమో!. నిజానికి లాహే ఈ వ్యాధి నిర్ధారణ కాకమునుపు వరకు ప్రతి రోజు ఐదు నుంచి 10 కిలోమీటర్లు పరిగెత్తేది. మంచి జీవనశైలిని అనుసరించేది. అసలు తను ఇలాంటి వ్యాధి బారిన పడతానని భావించలేదు కూడా. తాను మొదట్లో దీర్ఘకాలిక సైనసైటిస్, తలనొప్పిని అనుభవించింది. ఆ తర్వాత చూపుని కోల్పోవడం వంటి లక్షణాలు తలెత్తడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఈ అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్థారణ అయ్యిందని చెప్పుకొచ్చింది. ఇది కీమోథెరపీ వంటి ప్రామాణిక చికిత్సలకు స్పందించదు. దీంతో జన్యు సంబంధిత ప్రయోగాత్మక చికిత్స చేయాలనుకున్నారు వైద్యులు. అందుకు ప్రభుత్వ మద్దతు లభించడంలో ఎదురైనా అలసత్వం ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయేలా చేసింది. అయినప్పటికీ ప్రతిరోజు బతికే ఉన్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటానంటోంది. ఇక్కడ కేన్సర్ తమ ప్రియమైన వారిని ఎన్నటికీ దూరం చేయలేదు. ఎందుకంటే..? వారితో గడిపే అమూల్యమైన క్షణాలు గొప్ప జ్ఞాపకాలని అందిస్తాయని భావోద్వేగంగా చెబుతోంది లాహే. . ఇక్కడ లాహే ఉద్వేగభరితమైన అనుభవం కేన్సర్ వ్యాధులపై మరింతగా పరిశోధనలు చేసే ప్రాముఖ్యతను హైలెట్ చేస్తుంది. కాగా, ఆస్ట్రేలియా ఆరోగ్య సంస్థ ప్రకారం కేన్సర్ మనుగడ రేటు కేవలం 50% మాత్రేమ కానీ 2010కి వచ్చేటప్పటికీ 70%గా ఉంది. చెప్పాలంటే రోగ నిర్థారణ తర్వాత బాధితులు ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. అంతేగాదు ఆస్ట్రేలియన్ కేన్సర్ రీసెర్చ్ ఫౌండేషన్ అరుదైన కేన్సర్లని నయం చేసేలా కొంగొత్త పరిశోధనలకు మద్దతు ఇస్తుండటం గమనార్హం. (చదవండి: దొంగను పట్టించిన పుస్తకం..పాపం చోరికి వచ్చి..!) -
మనూ చరిత్ర లిఖించేనా!
మూడేళ్ల క్రితం ఎన్నో అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన భారత యువ షూటర్ మనూ భాకర్ తడబడి నిరాశపరిచింది. అయితే ఈసారి ‘పారిస్’లో మాత్రం మనూ తుపాకీ గర్జించింది. ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా క్వాలిఫయింగ్‌లో పూర్తి విశ్వాసంతో లక్ష్యంవైపు గురి పెట్టిన మనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో నేడు జరిగే ఫైనల్లో మనూ అదే జోరు కొనసాగిస్తే పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల బోణీ కొడుతుంది. పారిస్: విశ్వ క్రీడల్లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ నుంచి రెండు జోడీలు బరిలోకి దిగినా పతకానికి దూరంగా నిలిచాయి. అయితే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో 22 ఏళ్ల మనూ భాకర్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి ప్రవేశించి పతకంపై ఆశలు రేకెత్తించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్ చేరే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్‌లో అర్జున్ బబూతా–రమితా జిందాల్ (భారత్) ద్వయం 628.7 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన సందీప్ సింగ్–ఇలవేనిల్ వలారివన్ జోడీ 626.3 పాయింట్లు సాధించి 12వ స్థానంతో సరిపెట్టుకుంది. మొత్తం 28 జోడీలు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డాయి. టాప్–4లో నిలిచిన జోడీలు ఫైనల్ చేరుకుంటాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో సరబ్జోత్ సింగ్ త్రుటిలో ఫైనల్‌కు దూరమయ్యాడు. 33 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత సాధించారు. సరబ్జోత్, జర్మనీ షూటర్ రాబిన్ వాల్టర్ 577 పాయింట్లతో సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. అయితే సరబ్జోత్ (16) కంటే 10 పాయింట్ల షాట్లు ఎక్కువ కొట్టిన రాబిన్ వాల్టర్ (17) ఎనిమిదో స్థానంతో ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్ అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచాడు. నిలకడగా... మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫయింగ్‌లో భారత్ నుంచి మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ బరిలో నిలిచారు. మొత్తం 44 మంది షూటర్లు క్వాలిఫయింగ్‌లో పోటీపడ్డారు. మనూ 580 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. రిథమ్ మాత్రం 573 పాయింట్లతో 15వ స్థానాన్ని దక్కించుకొని ఫైనల్‌కు దూరమైంది. టాప్–8లో నిలిచిన వారు ఫైనల్‌కు అర్హత పొందారు. క్వాలిఫయింగ్‌లో ఒక్కో షూటర్‌కు 10 షాట్లతో ఆరు సిరీస్‌లు అవకాశం ఇచ్చారు. మనూ వరుసగా ఆరు సిరీస్‌లలో 97, 97, 98, 96, 96, 96 పాయింట్లు సాధించింది. నేడు జరిగే ఫైనల్లో వెరోనికా (హంగేరి), జిన్ ఓ యె (దక్షిణ కొరియా), విన్ తు ట్రిన్ (వియత్నాం), కిమ్ యెజి (దక్షిణ కొరియా), జుయ్ లీ (చైనా), తర్హాన్ సెవల్ (టరీ్క), రాన్‌జిన్ జియాంగ్ (చైనా)లతో కలిసి మనూ పోటీపడుతుంది. ఫైనల్లో ముందుగా 8 మంది షూటర్లు 10 షాట్లు సంధిస్తారు. 10 షాట్ల తర్వాత తక్కువ స్కోరు ఉన్న చివరి షూటర్ ని్రష్కమిస్తుంది. ఆ తర్వాత ప్రతి రెండు షాట్ల తర్వాత ఒక్కో షూటర్ అవుట్ అవుతారు. చివరకు 24 షాట్లు ముగిశాక టాప్–3లో నిలిచిన వారికి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు లభిస్తాయి. -
ప్యారిస్ ఒలింపిక్స్: ఫైనల్ చేరుకున్న మనూ భాకర్ (ఫొటోలు)
-
భారీ విజయంతో ఫైనల్లోకి భారత్
దంబుల్లా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో... భారత మహిళల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశలో సంపూర్ణ ఆధిపత్యంతో నాకౌట్‌కు చేరిన టీమిండియా... శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో 10 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. మహిళల ఆసియాకప్‌లో భారత జట్టు తుదిపోరుకు చేరడం ఇది తొమ్మిదోసారి కాగా.. టి20 ఫార్మాట్లో నిర్వహించిన ఐదుసార్లూ ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. కెపె్టన్ నిగార్ సుల్తానా (32), షోర్ణా అక్తర్ (19 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రేణుక, రాధ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 55 నాటౌట్; 9 ఫోర్లు, ఒక సిక్సర్), షఫాలీ వర్మ (26 నాటౌట్) రాణించారు. ఆదివారం జరిగే ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టుతో భారత్ తలపడుతుంది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. రేణుక అదుర్స్ మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఏదీ కలిసిరాలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ దిలారా అక్తర్ (6)ను అవుట్ చేసిన రేణుక, తన తదుపరి ఓవర్లో ఇస్మా (8)ను పెవిలియన్‌కు పంపించింది. ఆరో ఓవర్లో ముర్షిదా ఖాతూన్ (4) కూడా వెనుదిరిగింది. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా 25/3తో నిలిచింది. ఈ మూడు వికెట్లు రేణుక ఖాతాలోకే వెళ్లాయి. ఇక అక్కడి నుంచి బంగ్లా మహిళల జట్టు కోలుకోలేకపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోరే చేసింది. ఇద్దరే కొట్టేశారు స్వల్ప లక్ష్యఛేదనలో భారత ఓపెనర్లు చెలరేగిపోయారు. స్మృతి, షఫాలీ విజృంభణతో 11 ఓవర్లలోనే భారత జట్టు విజయం సాధించింది. భారత అమ్మాయిలు అదరగొట్టిన చోట బంగ్లా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీంతో స్మృతి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న మంధాన .. నాకౌట్ మ్యాచ్‌ల్లో నాలుగో హాఫ్ సెంచరీ తన పేరిట లిఖించుకుంది. అలాగే పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగుల జాబితాలో రెండోస్థానానికి చేరింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: దిలారా అక్తర్ (సి) ఉమ (బి) రేణుక 6; ముర్షిదా ఖాతూన్ (సి) షఫాలీ (బి) రేణుక 4; ఇస్మా తన్జీమ్ (సి) తనూజ (బి) రేణుక 8; నిగార్ సుల్తానా (సి) దీప్తి (బి) రాధ 32; రుమానా (బి) రాధ 1; రాబియా ఖాన్ (సి) షఫాలీ (బి) పూజ 1; రీతు మోనీ (స్టంప్డ్) రిచా (బి) దీప్తి 5; షోర్ణా (నాటౌట్) 19; నహిద (బి) రాధ 0; మారుఫా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 80. వికెట్ల పతనం: 1–7, 2–17, 3–21, 4–30, 5–33, 6–44, 7–80, 8–80. బౌలింగ్: రేణుక 4–1–10–3, పూజ 4–0–25–1, తనూజ 4–0–16–0, దీప్తి 4–0–14–1, రాధ 4–1–14–3. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (నాటౌట్) 26; స్మృతి (నాటౌట్) 55; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 83. బౌలింగ్: మారుఫా 2–0– 17–0, నహిద 3–0–34–0, జహనారా ఆలమ్ 3–0–17–0, రాబియా ఖాన్ 2–0–10–0, రుమానా అహ్మద్ 1–0–5–0.9 మహిళల ఆసియాకప్‌లో (వన్డే, టి20 ఫార్మాట్ కలిపి) భారత జట్టు ఫైనల్ చేరడం ఇది తొమ్మిదోసారి. ఇందులో ఏడుసార్లు ట్రోఫీ గెలుచుకుంది. 2018లో రన్నరప్‌గా నిలిచింది.1 టి20 క్రికెట్లో రెండుసార్లు 20వ ఓవర్ మెయిడెన్ వేసిన తొలి బౌలర్‌గా రాధ యాదవ్ రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా పురుషుల క్రికెట్లో ఎనిమిది మంది, మహిళల క్రికెట్లో తొమ్మిది మంది బౌలర్లు ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను మెయిడెన్ చేశారు.3 టి20ల్లో భారత మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం ఇది మూడోసారి. ఇటీవల దక్షిణాఫ్రికాపై 85 పరుగుల లక్ష్యాన్ని అజేయంగా ఛేదించిన భారత్.. 2019లో వెస్టిండీస్‌పై 104 పరుగుల టార్గెట్‌ను వికెట్ కోల్పోకుండా అధిగమించింది.2 మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధాన (3433) రెండోస్థానానికి దూసుకెళ్లింది. సూజీ బేట్స్ (4348; న్యూజిలాండ్) టాప్ ర్యాంక్‌లో ఉంది. -
ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
స్టాడ్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి చేరింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 7–6 (7/4)తో ఐదో సీడ్ అరెండ్స్–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జంటను ఓడించింది. మరోవైపు జర్మనీలో జరుగుతున్న హాంబర్గ్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న–శ్రీరామ్ బాలాజీ (భారత్) జోడీ తొలి రౌండ్లో 1–6, 4–6తో జేకబ్ ష్నయిటర్–మార్క్ వాల్నర్ (జర్మనీ) జంట చేతిలో ఓటమి పాలైంది. -
క్రిచికోవా X జాస్మిన్... నేడు వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్
ఈ ఏడాది వింబుల్డన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త విజేత అవతరించనుంది. లండన్ లో ఈరోజు జరిగే ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ పావోలిని (ఇటలీ)తో ప్రపంచ 32వ ర్యాంకర్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తలపడుతుంది. వీరిద్దరు తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నారు. 28 ఏళ్ల క్రిచికోవా 2021లో ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ నెగ్గగా... 28 ఏళ్ల జాస్మిన్ గత నెలలో ఫ్రెంచ్ ఓపెన్ లో రన్నరప్‌గా నిలిచింది. ఈ ఏడాది వింబుల్డన్ సింగిల్స్ చాంపియన్‌కు 27 లక్షల పౌండ్లు (రూ. 29 కోట్ల 23 లక్షలు)... రన్నరప్‌కు 14 లక్షల పౌండ్లు (రూ. 15 కోట్ల 15 లక్షలు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఫైనల్ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
జాస్మిన్ జయహో
లండన్: గత మూడేళ్లు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన ఇటలీ క్రీడాకారిణి జాస్మిన్ పావోలిని... ఈసారి మాత్రం విన్నర్స్ ట్రోఫీని ఇంటికి తీసుకెళ్లేందుకు విజయం దూరంలో ఉంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన ప్రపంచ ఏడో ర్యాంకర్ జాస్మిన్ వింబుల్డన్ టోర్నీలోనూ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో 28 ఏళ్ల జాస్మిన్ 2 గంటల 51 నిమిషాల్లో 2–6, 6–4, 7–6 (10/8)తో ప్రపంచ 37వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై గెలిచింది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ 32వ ర్యాంకర్, 2021 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ బర్బొరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 2 గంటల 7 నిమిషాల్లో 3–6, 6–3, 6–4తో 2022 విజేత, ప్రపంచ నాలుగో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై విజయం సాధించింది. తన కెరీర్లో తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. రేపు జరిగే తుది పోరులో జాస్మిన్‌తో క్రిచికోవా తలపడుతుంది. ఎవరు నెగ్గినా వారికి తొలి వింబుల్డన్ టైటిల్ అవుతుంది. వెకిచ్‌తో జరిగిన సెమీఫైనల్లో తొలి సెట్‌ను కోల్పోయిన జాస్మిన్ రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 4–5 వద్ద... టైబ్రేక్‌లో 5–6 వద్ద జాస్మిన్ రెండుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి ఇటలీ క్రీడాకారిణిగా జాస్మిన్ రికార్డు నెలకొల్పింది. 2 గంటల 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్ వింబుల్డన్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మహిళల సెమీఫైనల్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. 2009లో సెరెనా విలియమ్స్ (అమెరికా), ఎలీనా దెమెంతియెవా (రష్యా) మధ్య సెమీఫైనల్ 2 గంటల 49 నిమిషాలు సాగింది. కెరీర్లో తొలిసారి సెమీఫైనల్ ఆడిన వెకిచ్ అందివచ్చిన అవకాశాలను చేజార్చుకొని మూల్యం చెల్లించుకుంది. జాస్మిన్ సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు వెకిచ్కు 14 సార్లు అవకాశం లభించగా ఆమె నాలుగుసార్లు మాత్రమే సద్వినియోగం చేసుకుంది. 42 విన్నర్స్ కొట్టిన వెకిచ్ ఏకంగా 57 అనవసర తప్పిదాలు చేసింది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్)తో మెద్వెదెవ్ (రష్యా); ముసెట్టి (ఇటలీ)తో జొకోవిచ్ (సెర్బియా) ఆడతారు. సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
23 ఏళ్ల తర్వాత...
చార్లోటి (నార్త్ కరోలినా): రెండోసారి కోపా అమెరికా కప్ చాంపి యన్‌గా నిలిచేందుకు కొలంబియా జట్టు విజయం దూరంలో నిలిచింది. గతంలో 15 సార్లు చాంపియన్‌గా నిలిచిన ఉరుగ్వే జట్టుతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో కొలంబియా 1–0 గోల్ తేడాతో గెలిచింది. 39వ నిమిషంలో జెఫర్సన్ లెర్మా సొలిస్ గోల్ చేసి కొలంబియాకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొలంబియా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి అర్ధభాగం చివర్లో కొలంబియా ప్లేయర్ మునోజ్ రెడ్ కార్డుకు గురై మైదా నం వీడాడు. దాంతో రెండో అర్ధభాగం మొత్తం కొలంబియా పది మంది ఆటగాళ్లతోనే ఆడాల్సి వచ్చింది. మ్యాచ్ మొత్తంలో ఉరుగ్వే 62 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకున్నా కొలంబియా రక్షణ శ్రేణిని ఛేదించి గోల్ చేయడంలో విఫలమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాతో కొలంబియా ఆడుతుంది. 1975లో తొలిసారి ఈ టోరీ్నలో ఫైనల్ చేరిన కొలంబియా రన్నరప్‌గా నిలువగా ... 2001లో రెండోసారి ఫైనల్ ఆడి తొలి టైటిల్ సొంతం చేసుకుంది. -
ఇంగ్లండ్ ఫినిషింగ్ టచ్
డార్ట్మండ్: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 58 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెర దించేందుకు ఇంగ్లండ్ జట్టుకు మరో అవకాశం లభించింది. ప్రతిష్టాత్మక ‘యూరో’ టోర్నీలో ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్ 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఇంగ్లండ్ తరఫున కెపె్టన్ హ్యారీ కేన్ (18వ ని.లో), ఓలీ వాట్కిన్స్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు సిమోన్స్ (7వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగే ఫైనల్లో స్పెయిన్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. 1966లో ఏకైక ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన ఇంగ్లండ్ ఆ తర్వాత అంతర్జాతీయ వేదికపై మరో టైటిల్ గెలవలేకపోయింది. 2020 యూరో టోర్నీలో ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరినా ఇటలీ జట్టు చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. నెదర్లాండ్స్‌తో సెమీఫైనల్ మ్యాచ్ అదనపు సమయానికి దారి తీయడం ఖాయమనిపించిన దశలో... స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్‌లో (90+1వ నిమిషంలో) సబ్‌స్టిట్యూట్ ఓలీ వాట్కిన్స్ గోల్ సాధించి ఇంగ్లండ్‌ను 2–1తో ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత మరో మూడు నిమిషాలు నెదర్లాండ్స్‌ను నిలువరించిన ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేసుకుంది. నిర్ణీత సమయంలో పలు కారణాలతో రిఫరీ ఆటను నిలిపివేయాల్సి వచ్చినపుడు అలా వృథా అయిన సమయాన్ని 90 నిమిషాల తర్వాత స్టాపేజ్ ఇంజ్యూరీ టైమ్‌గా జత చేస్తారు. ఇంగ్లండ్, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు అద నంగా నాలుగు నిమిషాలు జోడించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ హెడ్ కోచ్ గ్యారెత్ సౌత్‌గేట్ తీసుకున్న సమయోచిత నిర్ణయం విజయవంతమైంది. తొలి గోల్ చేసిన ఇంగ్లండ్ కెపె్టన్ హ్యారీ కేన్‌ను 81వ నిమిషంలో వెనక్కి రప్పించి అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా ఓలీ వాట్కిన్స్‌ను... మిడ్‌ఫీల్డర్ ఫిల్ ఫోడెన్ స్థానంలో కోల్ పాల్మెర్‌ను సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. పది నిమిషాల తర్వాత సౌత్‌గేట్ నిర్ణయం సరైనదేనని తేలింది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన పాల్మెర్, వాట్కిన్స్ అద్భుత సమన్వయంతో రెండో గోల్ సాధించి పెట్టారు. కుడి వైపు నుంచి పాల్మెర్ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో వాట్కిన్స్ అందుకొని కళ్లు చెదిరే కిక్‌తో నెదర్లాండ్స్ గోల్కీపర్ను బోల్తా కొట్టించి బంతిని లక్ష్యానికి చేర్చడంతో ఇంగ్లండ్ శిబిరం సంబరాలు చేసుకుంది.