
దుబాయ్: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ యూకీ బాంబ్రీ ఈ ఏడాది తొలి టైటిల్ సాధించేందుకు విజయం దూరంలో నిలిచాడు. దుబాయ్ చాంపియన్‌షిప్ ఏటీపీ–500 టో ర్నీలో అలెక్సీ పాపిరిన్ (ఆ్రస్టేలియా)తో కలిసి యూకీ బాంబ్రీ పురుషుల డబుల్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యూకీ–పాపిరిన్ ద్వయం 6–2, 4–6, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది.
82 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండో–ఆసీస్ జోడీ రెండు ఏస్‌లు సంధించి, ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. తమ సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసింది. ఈ గెలుపుతో 32 ఏళ్ల యూకీ తన కెరీర్‌లో తొలిసారి ఏటీపీ–500 స్థాయి టో ర్నీలో ఫైనల్‌కు చేరాడు. అసోసియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టూర్‌లో యూకీ మూడు డబుల్స్ టైటిల్స్ సాధించి, మరో మూడు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచాడు.