Yuki Bhambri
-
పోరాడి ఓడిన యూకీ–ఒలివెట్టి జోడీ
బాసెల్: స్విస్ ఇండోర్స్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి ద్వయం 6–4, 5–7, 6–10తో జేమీ ముర్రే (బ్రిటన్)–జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. యూకీ–ఒలివెట్టి జోడీకి 19,765 యూరోల (రూ. 18 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తొలి రౌండ్లో మొత్తం ఏడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–జో సాలిస్బరీ (బ్రిటన్) జంటను బోల్తా కొట్టించిన యూకీ–ఒలివెట్టి ద్వయం క్వార్టర్ ఫైనల్లో మరో సంచలనం సృష్టించే అవకాశాన్ని చేజార్చుకుంది. 93 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి 14 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. రెండు జోడీలు తమ సర్వీస్‌లను ఒక్కోసారి కోల్పోయాయి. నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో మాత్రం అపార అనుభవజు్ఞలైన జేమీ ముర్రే–జాన్ పీర్స్ పైచేయి సాధించి విజయాన్ని ఖరారు చేసుకున్నారు. డబుల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన 38 ఏళ్ల జేమీ ముర్రే మొత్తం 32 టైటిల్స్ సాధించాడు. ఇందులో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్) కూడా ఉన్నాయి. 36 ఏళ్ల జాన్ పీర్స్ ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో సహచరుడు మాథ్యూ ఎబ్డెన్తో కలిసి డబుల్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. కెరీర్ మొత్తంలో 28 డబుల్స్ టైటిల్స్ నెగ్గిన జాన్ పీర్స్ 2017లో ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో డబుల్స్ చాంపియన్‌గా నిలిచాడు. -
సెమీ ఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
న్యూఢిల్లీ: భారత డబుల్స్ ఆటగాడు యూకీ బాంబ్రీ ఏటీపీ టోర్నీ చెంగ్డూ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. యూకీ బాంబ్రీ – ఫ్రాన్స్ ప్లేయర్ అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడి చక్కని పోరాట పటిమతో తమకన్నా మెరుగైనా ర్యాంకింగ్ ప్లేయర్లను కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ బాంబ్రీ–ఒలివెట్టి జంట 5–7, 6–3, 12–10తో ఈక్వెడార్‌కు చెందిన గాంజాలొ ఎస్కోబార్–డీగో హిదాల్గొ జోడీపై చెటడోడ్చి గెలిచింది. ఆరంభ సెట్లో వెనుకబడిన భారత్–ఫ్రాన్స్ ద్వయం రెండో సెట్లో అసాధారణ ఆటతీరుతో ఈక్వెడార్ జంటకు ఏమాత్రం అవకాశమివ్వకుండా సెట్‌ను కైవసం చేసుకొంది. కీలకమైన ఆఖరి సెట్ ఊహించని విధంగా సాగింది. ఇరు జోడీలు ధీటుగా ఆడటంతో ప్రతి పాయింట్ కోసం పెద్ద పోరాటం తప్పలేదు. చివరకు 12–10తో యూకీ బాంబ్రి జోడీ సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచింది. ఆదివారం జరిగే సెమీఫైనల్లో భారత్–ఫ్రాన్స్ జోడీ... రెండో సీడ్ ఇవాండ్ డొడిగ్ (క్రొయేషియా)–రాఫెల్ మాటోస్ (బ్రెజిల్) జంటను ఎదర్కొంటుంది. -
Wimbledon: బాంబ్రీ జోడీ ముందంజ.. తొలి రౌండ్లో ఘన విజయం
వింబుల్డన్ టోర్నీ-2024లో భారత టెన్నిస్ స్టార్ యుకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. మెన్స్ డబుల్స్‌లో బాంబ్రీ, అల్బనే ఒలివెట్టి జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన తొలి రౌండ్లో డెన్మార్క్ జంట అలెగ్జాండర్ బుబ్లిక్ అలెగ్జాండర్ షెవ్చెంకోలను 6-4, 6-4 వరుస సెట్లలో బాంబ్రీ, ఒలివెట్టి జోడీ జోడించింది.‘బర్త్ డే బాయ్’ బాంబ్రీ గ్రాస్ కోర్టులో సంచలన ప్రదర్శన చేశాడు. అద్భుతమైన షాట్లతో బాంబ్రీ ప్రత్యర్ధులను ఉక్కిరి బిక్కిరి చేశాడు. భంబ్రీ, ఒలివెట్టి తమ రెండో రౌండీలో జర్మన్ జోడీ కెవిన్ క్రావిట్జ్ టిమ్ పుయెట్జ్‌తో తలపడనున్నారు.మరో భారత టెన్నిస్ ఆటగాడు ఎన్ శ్రీరామ్ బాలాజీ తొలి రౌండ్లోనే ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. శ్రీరామ్ బాలాజీ, ల్యూక్ జాన్సన్ జోడీ.. డబుల్స్ మొదటి రౌండ్లో నాల్గవ సీడ్ మార్సెలో అరెవాలో , మేట్ పావిక్ చేతిలో 4-6, 5-7 తేడాతో ఓటమి పాలయ్యారు. -
యూకీ బాంబ్రీ జోడీ ఓటమి
బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లో ఓడిపోయింది. స్టుట్‌గార్ట్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 5–7, 4–6తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–రాబర్ట్ గాలోవే (అమెరికా) జంట చేతిలో ఓడిపోయింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం 12 ఏస్‌లు సంధించింది. తమ సరీ్వస్‌ను రెండుసార్లు కోల్పోయింది. -
సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ జోడీ
బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. స్టుట్గార్ట్లోబుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–2తో థియో అరిబెజ్–సాదియో (ఫ్రాన్స్) జంటపై గెలిచింది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
యూకీ–ఒలివెట్టి జోడీ సంచలనం
స్టుట్‌గార్ట్‌లో జరుగుతున్న బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ 6–4, 6–2తో రెండో సీడ్ నీల్ స్కప్‌స్కీ (బ్రిటన్)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జోడీని బోల్తా కొట్టించింది. 63 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఐదు ఏస్‌లు సంధించి, మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. -
టైటిల్‌కు గెలుపు దూరంలో యూకీ బాంబ్రీ జోడీ..!
భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడో ఏటీపీ డబుల్స్ టైటిల్‌కు విజయం దూరంలో ఉన్నాడు. పారిస్‌లో జరుగుతున్న ఓపెన్ పార్క్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది.శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) జంటను బోల్తా కొట్టించింది. ఒక గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ ద్వయం ఏడు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది.నేడు జరిగే ఫైనల్లో హెలియోవారా (ఫిన్లాండ్)–హెన్రీ ప్యాటెన్ (బ్రిటన్)లతో యూకీ–ఒలివెట్టి పోటీపడతారు. యూకీ ఈ ఏడాది ఒలివెట్టితో కలిసి మ్యూనిక్ ఓపెన్‌లో, గత ఏడాది లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా)తో కలిసి మలోర్కా ఓపెన్‌లో డబుల్స్ టైటిల్స్ గెలిచాడు.సచిన్ శుభారంభం బ్యాంకాక్: ఒలింపిక్ వరల్డ్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ సచిన్ సివాచ్ శుభారంభం చేశాడు. శుక్రవారం జరిగిన 57 కేజీల విభాగం తొలి రౌండ్ బౌట్లో సచిన్ 5–0తో అలెక్స్ ముకుకా (న్యూజిలాండ్)పై గెలుపొందాడు. పారిస్ ఒలింపిక్స్‌కు ఇదే చివరి అర్హత టోర్నమెంట్. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న బాక్సర్లు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు. భారత్ నుంచి పురుషుల విభాగంలో ఏడుగురు, మహిళల విభాగంలో ముగ్గురు బాక్సర్లు ఈ టోరీ్నలో పాల్గొంటున్నారు. భారత్ పరాజయం అంట్వెర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు 1–4తో ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం చేతిలో పరాజయం ఎదురైంది. ఈ మ్యాచ్‌లో రక్షణ పంక్తి వైఫల్యాలతో భారత్ మూల్యం చెల్లించుకుంది. అందివచి్చన పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలోనూ విఫలమైంది. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను అభిషేక్ (55వ ని.లో) ఆఖరి క్వార్టర్లో నమోదు చేశాడు. బెల్జియం బృందంలో హెండ్రిక్స్ అలెగ్జాండర్ (34వ, 60వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా, ఫెలిక్స్ (22వ ని.), చార్లియెర్ సెడ్రిక్ (49వ ని.) చెరో గోల్ చేశారు. నేడు భారత్ మళ్లీ బెల్జియంతోనే తలపడుతుంది. మిక్స్డ్ టీమ్ ఫైనల్లో జ్యోతి సురేఖ జోడీయెచోన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోరీ్నలో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ రెండో స్వర్ణంపై గురి పెట్టింది. ఇప్పటికే మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన జ్యోతి సురేఖ... మిక్స్డ్ టీమ్ కేటగిరీలో ప్రియాంశ్‌తో కలిసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ రెండు ఫైనల్స్ నేడు జరుగుతాయి. శుక్రవారం జరిగిన మిక్స్డ్ టీమ్ ఈవెంట్ సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ (భారత్) ద్వయం 158–157తో హాన్ సెంగ్యోన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. నేడు జరిగే ఫైనల్లో ఒలివియా డీన్–సాయెర్ (అమెరికా)లతో జ్యోతి సురేఖ–ప్రియాంశ్ తలపడతారు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ దీపిక కుమారి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో ఎలిఫ్ బెరా గొకిర్ (టరీ్క)పై గెలిచింది. ఇవి చదవండి: SRH: ఆ నిర్ణయం నాది కాదు.. అతడొక సర్ప్రైజ్: కమిన్స్ -
టైటిల్ పోరుకు యూకీ–అల్బానో జోడీ
మ్యూనిక్: భారత టెన్నిస్ అగ్రశ్రేణి క్రీడాకారుడు యూకీ బాంబ్రీ తన కెరీర్లో మూడోసారి ఏటీపీ –250 టోర్నీలో డబుల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–ఒలివెట్టి జంట 6–1, 6–7 (5/7), 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో ఎర్లెర్–మెడ్లెర్ (ఆ్రస్టియా) ద్వయంపై గెలిచింది. 92 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఈ ఇండో–ఫ్రెంచ్ జోడీ ఏడు ఏస్‌లు సంధించి నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
సెమీస్‌లో యూకీ జోడీ
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–3తో రాబర్ట్ గాలోవే–ఇవాన్ కింగ్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. 97 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
యూకీ జోడీ సంచలనం
మ్యూనిక్: బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్) జోడీ సంచలనం సృష్టించింది. తొలి రౌండ్లో ఇండో–ఫ్రెంచ్ ద్వయం మూడో సీడ్ సాండర్ జిలె–జొరాన్ వ్లీజెన్ (బెల్జియం) జంటను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 95 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ–ఒలివెట్టి జోడీ 4–6, 7–6 (7/5), 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో విజయాన్ని అందుకుంది. 11 ఏస్‌లతో అదరగొట్టిన యూకీ–ఒలివెట్టి నిర్ణాయక టైబ్రేక్‌లో పైచేయి సాధించింది. క్వార్టర్ ఫైనల్లో రాబర్ట్ గాలోవే–ఇవాన్ కింగ్ (అమెరికా)లతో యూకీ, ఒలివెట్టి తలపడతారు. -
యూకీ జోడీ ఓటమి
న్యూఢిల్లీ: దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) ద్వయం 3–6, 6–7 (2/7)తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)–డోడిగ్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం పాలైంది. యూకీ–హాస్‌లకు 48,760 డాలర్ల (రూ. 40 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. -
యూకీ బాంబ్రీ జోడీకి చేదు అనుభవం.. సెమీస్‌లోనే నిష్క్రమణ
Brisbane International Semifinals: బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో యూకీ బాంబ్రీ (భారత్)–రాబిన్ హాస్ (నెదర్లాండ్స్) జోడీ ప్రయాణం ముగిసింది. శనివారం నాటి పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్లో లాయిడ్ గ్లాస్‌పూల్(ఇంగ్లండ్)- జీన్ జులెన్ రోజర్(నెదర్లాండ్స్) ద్వయంలో చేతిలో ఈ జంట ఓటమి పాలైంది. ఎనిమిదో సీడ్ యూకీ- రాబిన్ జోడీ... సెకండ్ సీడ్ అయిన ప్రత్యర్థి చేతిలో 3-6, 7-6, 9-11 పరాజయం చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. గంటా నలభై నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏ దశలోనూ లాయిడ్- జీన్ జంటపై యూకీ- రాబిన్ పైచేయి సాధించలేకపోయారు. దీంతో.. సెమీస్‌లోనే వీరు ఇంటిబాట పట్టారు. క్వార్టర్ ఫైనల్లో అలా గెలుపొంది ఇదిలా ఉంటే.. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ –రాబిన్ ద్వయం 7–6 (7/5), 7–6 (7/5)తో నథానియల్ లామోన్స్–జేక్సన్ విత్రో (అమెరికా) జంటపై విజయం సాధించింది. 96 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు జోడీలు తమ సర్వీస్‌లను కాపాడుకున్నాయి. ఈ క్రమంలో టైబ్రేక్‌లలో యూకీ ద్వయం పైచేయి సాధించి విజయాన్ని అందుకుంది. తద్వారా సెమీస్‌లో ప్రవేశించింది. కాగా ఢిల్లీకి చెందిన 31 ఏళ్ల యూకీ బాంబ్రీ.. గతేడాది మలోర్కా చాంపియన్‌షిప్స్ డబుల్స్ కాంపిటీషన్లో పాల్గొని తొలి ఏటీపీ టైటిల్ గెలిచాడు. సౌతాఫ్రికాకు చెందిన లాయిడ్ హ్యారిస్‌తో కలిసి విజేతగా నిలిచాడు. చదవండి: Ind vs Afg: టీమిండియాతో సిరీస్‌కు అఫ్గన్ జట్టు ప్రకటన: ప్లేయర్‌గా రషీద్.. కెప్టెన్? -
బోపన్న... విజయంతో వీడ్కోలు
లక్నో: భారత డబుల్స్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన డేవిస్ కప్ కెరీర్‌ను విజయంతో ముగించాడు. మొరాకోతో ఆదివారం ముగిసిన వరల్డ్ గ్రూప్–2 పోటీలో భాగంగా జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో బోపన్న–యూకీ బాంబ్రీ (భారత్) ద్వయం 6–2, 6–1తో బెన్చెట్రిట్–యూనెస్ లారూసి జంటపై గెలిచింది. 2002లో డేవిస్ కప్‌లో అరంగేట్రం చేసిన 43 ఏళ్ల బోపన్న భారత్ తరఫున మొత్తం 50 మ్యాచ్‌లు ఆడాడు. డబుల్స్‌లో 13 మ్యాచ్‌ల్లో నెగ్గి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. సింగిల్స్‌లో 10 మ్యాచ్‌ల్లో గెలిచి, 17 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశాడు. డేవిస్ కప్ నుంచి రిటైరయిన్పటికీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో బోపన్న టెన్నిస్ కెరీర్‌ను కొనసాగిస్తాడు. డబుల్స్ మ్యాచ్ తర్వాత జరిగిన సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–3, 6–3తో యాసిన్ దిల్మీపై నెగ్గడంతో భారత్ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో మ్యాచ్‌లో దిగ్విజయ్ ప్రతాప్ సింగ్ 6–1, 5–7, 10–6తో వాలిద్‌ను ఓడించడంతో భారత్ 4–1తో విజయాన్ని దక్కించుకుంది. ఈ గెలుపుతో భారత జట్టు మళ్లీ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో జరిగిన ఈ టోరీ్నలో సాకేత్–యూకీ ద్వయం పురుషుల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లో పోరాడి ఓడింది. గంటా 59 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో మూడో సీడ్ సాకేత్–యూకీ జంట 7–6 (7/2), 6–7 (2/7), 9–11తో టాప్ సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. సాకేత్–యూకీలకు 10,660 డాలర్ల (రూ. 8 లక్షల 74 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 3–6, 6–1, 10–8తో టామీ పాల్–స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. అనిరుధ్–ప్రశాంత్ 6–4, 6–3తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–మాక్సిమి క్రెసీ (అమెరికా)లపై గెలిచారు. -
యూకీ బాంబ్రీకి తొలి ఏటీపీ టైటిల్
మలోర్కా (స్పెయిన్): భారత అగ్రశ్రేణి టెన్నిస్ ప్లేయర్ యూకీ బాంబ్రీ తన కెరీర్లో తొలి ఏటీపీ టోర్నీ డబుల్స్ టైటిల్ సాధించాడు. మలోర్కా చాంపియన్‌షిప్ ఏటీపీ–250 టోర్నీ లో యూకీ బాంబ్రీ (భారత్) –లాయిడ్ హారిస్ (దక్షిణాఫ్రికా) ద్వయం విజేతగా నిలి చింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో యూకీ–హారిస్ జోడీ 6–3, 6–4తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటను ఓడించింది. విజేతగా నిలిచిన యూకీ–హారిస్ జోడీకి 48,380 యూరోల (రూ. 43 లక్షల 31 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్.. చాంపియన్ సమీర్ వర్మ
Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చివరిసారి సమీర్ వర్మ 2018లో సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీలో టైటిల్ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో రజతం సాధించారు. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. మాజీ టాప్ ర్యాంక్ జోడీకి సాకేత్–యూకీ షాక్ పారిస్: లియోన్ –250 ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ ర్యాంకింగ్ ఆధారంగా వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు. -
రన్నరప్ అనిరుధ్ జోడీ; మూడో సీడ్‌పై సాకేత్ జోడీ విజయం
సాక్షి, హైదరాబాద్: స్ల్పిట్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–75 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ పురుషుల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచాడు. క్రొయేషియాలో జరిగిన ఈ టోర్నీలో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జోడీ ఫైనల్లో ఓడిపోయింది. 70 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో అనిరుధ్–విజయ్ సుందర్ ప్రశాంత్ 4–6, 4–6తో సాదియో డుంబియా–ఫాబ్లెన్ రెబూల్ (ఫ్రాన్స్) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. తొలి రౌండ్లో భారత జోడీ 6–2, 6–1తో అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్)–కైచి ఉచిడా (జపాన్) జంటను ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో, సెమీఫైనల్లో అనిరుధ్–విజయ్‌లకు తమ ప్రత్యర్థుల నుంచి వాకోవర్ లభించడంతో నేరుగా ఫైనల్ ఆడారు. అనిరుధ్–విజయ్‌లకు 2,450 యూరోల (రూ. 2 లక్షల 20 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మూడో సీడ్‌పై సాకేత్ జోడీ విజయం బీఎండబ్ల్యూ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. జర్మనీలోని మ్యూనిక్‌లో సోమవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–3, 7–6 (7/4)తో మూడో సీడ్ నథానియల్ లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) జోడిని ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరింది. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ జోడి ఆరు ఏస్‌లు సంధించింది. తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
పోరాడి ఓడిన సాకేత్–యూకీ జోడీ
యూఎస్ పురుషుల క్లే కోర్టు టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత డబుల్స్ జోడీ సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ జోడీ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అమెరికాలోని హ్యూస్టన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (6/8), 6–2, 5–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ గాలోవే (అమెరికా)–మిగేల్ ఎంజెల్ రేయస్ వరేలా (మెక్సికో) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. గంటా 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న సాకేత్, యూకీ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశారు. అయితే నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో మాత్రం గాలోవే–వరేలా ద్వయం పైచేయి సాధించింది. తొలి రౌండ్లో నిష్క్రమించిన సాకేత్, యూకీలకు 3,510 డాలర్ల (రూ. 2 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
క్వార్టర్స్‌లో సాకేత్–యూకీ జోడీ ఓటమి
దుబాయ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ చాంపియన్‌షిలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 2–6, 2–6తో లాయిడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్)–హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. నాలుగుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోయిన భారత జోడీ ప్రత్యర్థి జంట సర్విస్‌లో మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వదులుకుంది. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సాకేత్–యూకీ బాంబ్రీలకు 23,660 డాలర్ల (రూ. 19 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. ఇదే టోర్నీలో రామ్‌కుమార్ (భారత్)–ఐజామ్ ఖురేషీ (పాకిస్తాన్) జోడీ తొలి రౌండ్లో 4–6, 6–3, 5–10తో సాండెర్ జిలె–విలెజిన్ (బెల్జియం) ద్వయం చేతిలో ఓడిపోయింది. -
Myneni Saketh: సెమీస్‌లో పోరాడి ఓడిన సాకేత్ జోడీ
ATP 250 Dallas Open: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సెమీఫైనల్లో ఓటమి పాలైంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాకేత్–యూకీ ద్వయం 6–7 (11/13), 5–7తో లామోన్స్–విత్రో (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడుసార్లు బ్రేక్ పాయింట్ అవకాశాలను వృథా చేసుకున్నారు. సాకేత్–యూకీలకు 12,230 డాలర్ల (రూ. 10 లక్షలు) ప్రైజ్‌మనీ, 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: రంజీ ట్రోఫీ ఫైనల్లో సౌరాష్ట్ర, బెంగాల్ -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
Saketh Myneni- Yuki Bhambri: డాలస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 5–7, 7–6 (7/3), 10–3తో క్రిస్టోఫర్ యుబ్యాంక్స్–మార్కస్ జిరోన్ (అమెరికా) జోడీపై గెలిచింది. గంటా 46 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్–యూకీ మూడు ఏస్‌లు సంధించారు. క్వార్టర్ ఫైనల్లో జూలియన్ క్యాష్–హెన్రీ ప్యాటర్న్ (బ్రిటన్)లతో సాకేత్–యూకీ ఆడతారు. చదవండి: Zim Vs WI 1st Test: జింబాబ్వే- వెస్టిండీస్‌టెస్టు ‘డ్రా’.. విండీస్ ఓపెనర్ల అరుదైన ఘనత T20 WC 2023: సిక్సర్ల మోత మోగించిన రిచా.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం -
Davis Cup 2023: తొలి సింగిల్స్‌లో యూకీ బాంబ్రీ ఓటమి
హిలెరాడ్ (డెన్మార్క్): భారత్‌తో జరుగుతున్న డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్–1 ప్లే ఆఫ్స్ తొలి రౌండ్ పోటీలో డెన్మార్క్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ హోల్గర్ రూన్ 6–2, 6–2తో యూకీ బాంబ్రీని ఓడించాడు. కేవలం 58 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో 19 ఏళ్ల రూన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. ఏటీపీ ప్రొఫెషనల్ సర్క్యూట్లో సింగిల్స్ మ్యాచ్‌లు ఆడటం మానేసిన యూకీ ఈ మ్యాచ్‌లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయాడు. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ ఒక్కసారి కూడా ప్రత్యర్థి సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ అవకాశం సంపాదించలేకపోయాడు. -
బ్యాంకాక్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సాకేత్-బాంబ్రీ జోడీ
నొంతాబురి (థాయ్‌లాండ్): గత ఏడాది ఏకంగా ఆరు ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్స్ సాధించి అదరగొట్టిన సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ కొత్త ఏడాదిలో ఆడిన రెండో టోర్నీలోనే టైటిల్ సొంతం చేసుకుంది. శనివారం ముగిసిన బ్యాంకాక్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ ఢిల్లీకి చెందిన తన సహచరుడు యూకీ బాంబ్రీతో కలిసి విజేతగా నిలిచాడు. గంటా 50 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్–యూకీ జోడీ 2–6, 7–6 (9/7), 14–12తో ‘సూపర్ టైబ్రేక్’లో క్రిస్టోఫర్ రుంగ్‌కాట్ (ఇండోనేసియా)–అకీరా సాంటిలాన్ (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచింది. చాంపియన్‌గా నిలిచిన సాకేత్–యూకీ జోడీకి 4,645 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 77 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా టైటిల్‌తో ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సాకేత్ తొమ్మిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 74వ ర్యాంక్‌కు, యూకీ ఐదు స్థానాలు పురోగతి సాధించి 90వ ర్యాంక్‌కు చేరుకుంటారు. తదుపరి సాకేత్–యూకీ జోడీ సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలోకి దిగనుంది. -
Tata Open Maharashtra: రామ్‌కుమార్ శుభారంభం
టాటా ఓపెన్ మహారాష్ట్ర ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్లు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్ రామనాథన్‌లు మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందడానికి విజయం దూరంలో నిలిచారు. పుణేలో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో యూకీ 6–2, 6–2తో డీగో హిడాల్గో (ఈక్వెడార్)పై గెలుపొందగా... రామ్‌కుమార్ 2–6, 7–5, 6–2తో ప్రపంచ 175వ ర్యాంకర్ ఒటో విర్టానెన్ (ఫిన్లాండ్)పై సంచలన విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.