Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మ తన కెరీర్‌లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది.
చివరిసారి సమీర్ వర్మ 2018లో సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీలో టైటిల్ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ జోడీ మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం సాధించారు.
అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’
షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.
ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు.
మాజీ టాప్ ర్యాంక్ జోడీకి సాకేత్–యూకీ షాక్
పారిస్: లియోన్ –250 ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్‌లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ ర్యాంకింగ్ ఆధారంగా వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు.
Comments
Please login to add a commentAdd a comment