Badminton Tournament
-
రుత్విక–రోహన్ జోడీ శుభారంభం
పారిస్: ఓర్లియాన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 20–22, 24–22, 21–16తో యె హాంగ్ వె–నికోల్ గొంజాలెజ్ చాన్ (చైనీస్ తైపీ) జోడీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి గేమ్ కోల్పోయిన రుత్విక–రోహన్ రెండో గేమ్‌లో రెండుసార్లు మ్యాచ్ పాయింట్లు కాపాడుకొని గట్టెక్కారు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలోనే 5–1తో ఆధిక్యంలోకి వెళ్లిన రుత్విక–రోహన్ చివరివరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నారు. పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, ఆయుశ్ షెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... కిరణ్ జార్జి, ప్రియాన్షు రజావత్, సతీశ్ కుమార్ కరుణాకరన్ తొలి రౌండ్లో ఓడిపోయారు. శ్రీకాంత్ 21–19, 21–14తో కూ తకహాషి (జపాన్)పై, ప్రణయ్ 21–11, 20–22, 21–9తో జు వె వాంగ్ (చైనీస్ తైపీ)పై, ఆయుశ్ 21–17, 21–9తో ప్రపంచ మాజీ చాంపియన్ కీ యె లో (సింగపూర్)పై గెలిచారు. కిరణ్ జార్జి 21–15, 16–21, 10–21తో జియా హెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో, ప్రియాన్షు 17–21, 7–21తో అలెక్స్ లేనియర్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో భారత ప్లేయర్లు ఉన్నతి హుడా 9–21, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చేతిలో... ఇషారాణి బారువా 13–21, 13–21తో అసుక తకహాషి (జపాన్) చేతిలో ఓడిపోయారు. -
కాన్సస్‌లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. కాన్సస్‌లో తాజాగా బాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్ కి విశేష స్పందన లభించింది. స్ప్రింట్ ఇండోర్ జిమ్నాసియం ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో 100 మందికి పైగా తెలుగు బాడ్మింటన్ ప్లేయర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు. యూత్ సింగిల్స్, యూత్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, సినీయర్ మెన్స్ డబుల్స్, ఉమెన్స్ డబుల్స్, మిక్సుడ్ డబుల్స్ విభాగాల్లో బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. యువతను భాగస్వామ్యం చేస్తూ నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంత్యం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ టోర్నమెంట్ కి ప్రేక్షకులు కూడా భారీగా విచ్చేసి క్రీడాకారులను ఉత్తేజ పరిచారు. పోటాపోటీగా జరిగిన ఈ టోర్నమెంట్స్‌లో గెలిచిన విజేతలకు నాట్స్ మెడల్స్, ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందజేసింది.కాన్సస్ నగరంలో నాట్స్ కాన్సస్ కోఆర్డినటర్ ప్రసాద్ ఇసుకపల్లి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మదన్ సానె, సందీప్ మందుల నేతృత్వంలో ఈ పోటీలు దిగ్విజయంగా నిర్వహించారు. శ్రీనివాస్ దామ, సాయిరాం గండ్రోతుల, నాగార్జున మాచగారి, విజయ్ రంగిణి తదితరులు ఈ టోర్నమెంట్ నిర్వహణలో విశేషంగా కృషి చేశారు. ప్రముఖ రియల్టర్స్ భారతి రెడ్డి, కృష్ణ చిన్నం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సేవలు అందిస్తున్న మంత్రి ఇంక్, స్టాఫింగ్ ట్రీ, పక్షీ ఇంక్ తదితర సంస్థలు స్పాన్సర్స్ గా తమ సహకారం అందించారు.కేసీ దేశీ డాట్కాం మీడియా పరంగా మద్దతు ఇచ్చింది.. ప్రశాంత్ కోడూరు, జగన్ బొబ్బర్ల, మనశ్విని కోడూరు, మూర్తి కాశి, తిరుమలేశ్ , కార్తీక్ అయ్యర్, శ్రీకాంత్ కుప్పిరెడ్డి, మధు జిల్లాల, సురేందర్ చిన్నం, నాట్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ వెబ్ రవి కిరణ్ తుమ్మల, నాట్స్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మీడియా మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ సెక్రటరీ రాజేష్ కాండ్రు, నాట్స్ నేషనల్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ కిరణ్ మందాడి తదితరులు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ తమ వంతు సహకారాన్ని అందించారు.నాట్స్ బోర్డు సభ్యులు రవి గుమ్మడిపూడి, నాట్స్ (ఇండియా లైసోన్) నేషనల్ కోఆర్డినేటర్ వెంకట్ మంత్రి నాట్స్ కాన్సస్ కోఆర్డినటర్ ప్రసాద్ ఇసుకపల్లి తదితరులు ఈ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగింపు సభలో నాట్స్ తెలుగు వారి కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రముఖ సైంటిస్ట్, సంఘ సేవకులు యువతకు క్రీడా డాక్టర్ ఆనంద్ వొడ్నాల, ఆంధ్రాబ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ మల్లవరపు నరసింహారావు (తిరుపతి) ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపేలా మాట్లాడారు. నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కాన్సస్ బ్యాడ్మింటన్ విజేతల వివరాలు:యూత్ సింగిల్స్దేవ్ దర్శన్ ఆర్బి (విన్నర్స్ 1st), అంకిత అరుణ్ శౌరి (2nd), లాస్య రాపోలు (3rd)యూత్ డబుల్స్:దేవ్ దర్శన్ ఆర్బీ & జస్వంత్ ఆర్బీ (విన్నర్స్ 1st), నిత్య వి & అవంతిక అరున్ష (2nd)ఉమన్ డబుల్స్:భవాని రామచంద్రన్ & ప్రదీప ప్రవీణ్ (విన్నర్స్ 1st), అనురాధా పురుషోత్తం & విద్య (2nd),మెన్స్ సింగిల్స్:స్టాన్లీ (విన్నర్స్ 1st), దివాకర్ చెన్నారెడ్డి (2nd), సతీష్ మీసా (3rd)మెన్స్ డబుల్స్:యశ్ & నందు(విన్నర్స్ 1st), సందీప్ మందుల & మనోజ్సినీయర్ మెన్స్ డబుల్స్:దివాకర్ చెన్నారెడ్డి & సతీష్ మీసా (విన్నర్స్ 1st), మనోజ్ & కార్తీక్ అయ్యర్ (2nd), సిరాజ్ & సందీప్ మందుల (3rd). -
ప్రిక్వార్టర్స్‌లో అన్మోల్
బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ అన్మోల్ ఖర్బ్, గతేడాది రన్నరప్ తన్వీ శర్మ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మాజీ చాంపియన్లు మిథున్ మంజునాథ్, సౌరభ్ వర్మలు అలవోక విజయాలతో మూడో రౌండ్‌కు చేరారు. కానీ పురుషుల డిఫెండింగ్ చాంపియన్ చిరాగ్ సేన్‌కు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అన్మోల్ 21–14, 21–14తో కృషిక మహాజన్‌పై గెలుపొందగా, తన్వీ శర్మ 21–12, 21–8తో స్వాతి సోలంకిపై సునాయాస విజయం సాధించింది. రుజుల రాము 21–19, 19–21, 21–17తో పదో సీడ్ సూర్యచరిష్మ తమిరిపై, జియా రావత్ 25–27, 21–14, 21–10తో తొమ్మిదో సీడ్ శ్రుతి ముందాడపై గెలుపొందారు. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో చిరాగ్ సెన్ను తమిళనాడు షట్లర్ రిత్విక్ కంగుతినిపించాడు. తొలి గేమ్‌ను సులువుగా గెలుచుకున్న చిరాగ్‌కు తర్వాతి గేముల్లో రితి్వక్ నుంచి ఊహించని పోటీ ఎదురవడంతో చేతులెత్తేశాడు. చివరకు రిత్విక్ 12–21, 21–19, 21–15తో చిరాగ్ సేన్‌పై విజయం సాధించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రిత్విక్... ఎమ్. రఘుతో తలపడనున్నాడు. మిథున్ మంజునాథ్ 21–9, 21–18తో మూడో సీడ్ భరత్ రాఘవ్‌ను, సౌరభ్ వర్మ 21–17, 21–17తో అభినవ్ గార్గ్‌ను ఓడించారు. రోహన్ గుర్బాని 21–15, 21–1తో 11వ సీడ్ లోకేశ్ రెడ్డిపై, రఘు 21–19, 21–16తో కార్తీక్ జిందాల్‌పై గెలిచారు. -
రుత్విక–రోహన్ జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్ సాధించింది. గచ్చిబౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్ ట్రోఫీలు దక్కడం విశేషం. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జంట 21–17, 21–19తో హరిహరన్–తనీషా క్రాస్టో (భారత్) జోడీని ఓడించింది. మహిళల సింగిల్స్ టైటిల్ ఇషారాణి బారువా (భారత్)కు లభించింది. ఫైనల్లో ఇషారాణి 21–15, 9–21, 21–17తో రక్షిత శ్రీ (భారత్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో తరుణ్ రెడ్డి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రిత్విక్ సంజీవి చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–ఎంఆర్ అర్జున్ (భారత్) జోడీ 19–21, 17–21తో పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్ (భారత్) జంట చేతిలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్ ఫైనల్లో ప్రియా కొంజెంగ్‌బమ్–శ్రుతి మిశ్రా (భారత్) ద్వయం 21–18, 21–13తో ఆరతి సారా సునీల్–వర్షిణి (భారత్) జోడీపై గెలిచింది. -
రుత్విక–రోహన్ జోడీ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గచి్చ»ౌలిలోని కొటక్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో ఈ టోర్నీ జరుగుతోంది.శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 21–14, 14–21, 21–17తో భారత్‌కే చెందిన ధ్రువ్ రావత్–రాధిక శర్మ జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణకు చెందిన కాటం తరుణ్ రెడ్డి, రుషీంద్ర తిరుపతి సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్‌లో రుషీంద్ర 21–9, 21–10తో సంస్కార్ సరస్వత్ (భారత్)పై, తరుణ్ రెడ్డి 22–20, 22–24, 21–15తో రవి (భారత్)పై గెలిచారు.మహిళల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి తామిరి సూర్య చరిష్మా పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. సూర్య చరిష్మా 21–18, 16–21, 21–23తో రక్షిత శ్రీ (భారత్) చేతిలో పోరాడి ఓడిపోయింది. భారత నంబర్‌వన్ అన్మోల్ ఖరబ్, అనుపమా, ఇషారాణి కూడా సెమీఫైనల్లోకి ప్రవేశించారు.క్వార్టర్ ఫైనల్స్‌లో అన్మోల్ 16–21, 21–14, 21–19తో దేవిక (భారత్)పై, అనుపమ 21–18, 27–25తో శ్రేయా (భారత్)పై, ఇషారాణి 21–18, 17–21, 21–18తో మాన్సి (భారత్)లపై నెగ్గారు. పురుషుల డబుల్స్‌లో తెలంగాణకు చెందిన పంజాల విష్ణువర్ధన్ గౌడ్ తన భాగస్వామి ఎం.ఆర్.అర్జున్‌తో కలిసి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–అర్జున్ ద్వయం 21–11, 21–8తో గణేశ్ కుమార్–అర్జున్ (భారత్) జోడీపై గెలిచింది. -
సెమీస్‌లో కిరణ్ జార్జి
ఇక్సాన్ సిటీ: కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ కిరణ్ జార్జి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 44వ ర్యాంకర్ కిరణ్ జార్జి 21–14, 21–16తో ప్రపంచ 34వ ర్యాంకర్, ఐదో సీడ్ టకుమా ఒబయాషి (జపాన్)పై గెలుపొందాడు. తద్వారా ఈ ఏడాది తొలిసారి ఓ అంతర్జాతీయ టోర్నీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.ఒబయాషిపై కిరణ్కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ మాజీ చాంపియన్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)తో కిరణ్ తలపడతాడు. -
హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో మాళవిక
సార్‌బ్రుకెన్ (జర్మనీ): భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ఆరో సీడ్ మాళవిక 23–21, 21–18తో జూలియా జాకబ్సన్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. 44 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన మాళవిక ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముందంజ వేసింది. ఆదివారం జరగనున్న టైటిల్ పోరులో ఏడో సీడ్ మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)తో మాళవిక తలపడనుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆయుశ్ షెట్టి పరాజయం పాలయ్యాడు. అన్‌సీడెడ్ ఆయుశ్ షెట్టి 17–21, 13–21తో క్రిస్టో పొపొవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 28వ స్థానంలో ఉన్న పొపొవ్‌పై 51వ ర్యాంకర్ ఆయుశ్ ఆధిక్యం ప్రదర్శించలేకపోయాడు. 49 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌లో చక్కటి ప్రదర్శనతో ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చిన ఆయుశ్... రెండో గేమ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయాడు. -
కిరణ్ జార్జి సంచలన విజయం
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి సంచలనం సృష్టించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 23–21, 21–18తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో వాంగ్ జు వెతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కిరణ్ ఈసారి విజయం రుచి చూశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో కిరణ్ జార్జి తలపడతాడు. మరోవైపు భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్‌తో ఆడాల్సిన డెన్మార్క్ ప్లేయర్ రస్ముస్ గెమ్కే గాయం కారణంగా వైదొలగడంతో భారత ప్లేయర్ కోర్టులో అడుగుపెట్టకుండానే విజయాన్ని అందుకున్నాడు. -
చైనా ఓపెన్‌లో భారత షట్లర్లకు నిరాశ
చాంగ్జౌ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మాళవిక బన్సోద్ మినహా మిగతా భారత క్రీడాకారులంతా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి... మహిళల సింగిల్స్‌లో హైదరాబాద్ అమ్మాయి సామియా ఇమాద్ ఫారూఖి, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.మహిళల డబుల్స్లోఇక మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రుతూపర్ణ–శ్వేతాపర్ణ జోడీలు... మిక్స్డ్ డబుల్స్లోసిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి, సతీశ్ కుమార్–ఆద్యా జంటలకు నిరాశ ఎదురైంది. ప్రపంచ 40వ ర్యాంకర్ కిరణ్ జార్జి సంచలన విజయాన్ని సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ప్రపంచ 13వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 21–4, 10–21, 21–23తో ఓడిపోయాడు.నిర్ణాయక మూడో గేమ్‌లో కిరణ్ రెండు మ్యాచ్ పాయింట్లను వృథా చేసుకోవడం గమనార్హం. సామియా 9–21, 7–21తో క్రిస్టీ గిల్మోర్ (స్కాట్లాండ్) చేతిలో... ఆకర్షి 15–21, 19–21తో చియు పిన్ చెయిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు.మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా జాలీ 21–16, 15–21, 17–21తో సెయి పె షాన్–హంగ్ ఎన్ జు (చైనీస్ తైపీ) చేతిలో... రుతూపర్ణ–శ్వేతాపర్ణ 11–21, 21–16, 11–21తో టెంగ్ చున్ సున్–యాంగ్ చున్ యున్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డికీ ఓటమేమిక్స్డ్ డబుల్స్‌లో భారత నంబర్‌వన్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి 10–21, 16–21తో టాన్ కియాన్ మెంగ్–లాయ్ పె జింగ్ (మలేసియా) జంట చేతిలో... సతీశ్–ఆద్యా ద్వయం 14–21, 11–21తో చెన్ టాంగ్ జె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
భారత షట్లర్లకు నిరాశ
సియోల్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. బరిలోకి దిగిన యువ షట్లర్లు అష్మిత చాలిహా, మాళవిక, ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ 53వ ర్యాంకర్ అష్మిత 8–21, 13–21తో 17వ ర్యాంకర్ పోన్‌పావీ చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మరో మ్యాచ్‌లో ప్రపంచ 41వ ర్యాంకర్ మాళవిక 21–18, 15–21, 17–21తో 18వ ర్యాంకర్ లిన్ హోజ్మార్క్ (డెన్మార్క్) చేతిలో పోరాడి ఓడిపోయింది. ఆకర్షి 15–21, 15–21తో లిన్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ఆయుశ్ రాజ్ గుప్తా–శ్రుతి జంట 7–21, 12–21తో కో సంగ్ హ్యాన్–ఇయోమ్ హ్యూ వోన్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది. -
మలేషియా మాస్టర్స్ ఫైనల్లో పీవీ సింధు..
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్, తెలుగు తేజం పీవీ సింధు తన జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీ టైటిల్‌కు అడుగు దూరంలో సింధు నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్‌పై 13-21, 21-16, 21-12 పాయింట్ల తేడాతో సింధు ఘన విజయం సాధించింది. తొలి రౌండ్ నుంచే బుసానన్‌పై సింధూ ఆధిపత్యం చెలాయించింది. మొత్తంగా ప్రత్యర్ధిని ఓడించడానికి సింధూకు 2 గంటల 28 నిమిషాల సమయం పట్టింది. ఈ ఏడాది మాస్టర్స్ టోర్నీలో సింధూ ఫైనల్ అర్హత సాధించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. సింధూ చివరగా గత ఏడాది మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ ఫైనల్‌కు చేరింది. కాగా 2019లో హాంకాంగ్ ఓపెన్‌లో సింధూను బుసానన్ ఓడించి టైటిల్ సాధించింది. తాజా విజయంతో సింధూ తన ఓటమికి బదులు తీర్చుకుంది. ఇక ఆదివారం జరగనున్న ఫైనల్లో చైనా ప్లేయర్ వాంగ్ ఝీయితోస సింధూ తలపడనుంది. Sindhu makes it to her 1️⃣st final this year & 4️⃣th in #Super500 events after an exceptional comeback win 13-21, 21-16, 21-12 🥳🚀Well done Sindhu 🫶📸: @badmintonphoto@himantabiswa | @sanjay091968 | @Arunlakhanioffi #MalaysiaMasters2024#IndiaontheRise#Badminton pic.twitter.com/XtqcCaLOnv— BAI Media (@BAI_Media) May 25, 2024 -
Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు, రైజింగ్ స్టార్ అషి్మత చాలిహా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–13, 12–21, 21–14తో ప్రపంచ 34వ ర్యాంకర్ సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)పై కష్టపడి గెలుపొందగా... ప్రపంచ 53వ ర్యాంకర్ అషి్మత 21–19, 16–21, 21–12తో ప్రపంచ 10వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 2022 ఇండియా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన అష్మిత మళ్లీ రెండేళ్ల తర్వాత సూపర్–500 టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ చేరడం విశేషం. సిమ్‌తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు నిలకడలేమితో ఇబ్బంది పడింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. రెండుసార్లు వరుసగా ఐదు పాయింట్ల చొప్పున ప్రత్యరి్థకి కోల్పోయింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో గాడిలో పడిన సింధు స్కోరు 16–14 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిరణ్ జార్జి (భారత్) 13–21, 18–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 70 నిమిషాల్లో 18–21, 22–20, 14–21తో సుంగ్ షువో యున్–యు చెయున్ హుయ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోగా... రితిక–సిమ్రన్ జంట 17–21, 11–21తో పియర్లీ టాన్–థినా మురళీధరన్ (మలేసియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జంట 9–21, 15–21తో టాప్ సీడ్ చెన్ టాంగ్ జి–టో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్–సాయిప్రతీక్ ద్వయం 11–21, 9–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ హాన్ యువె (చైనా)తో సింధు; ఆరో సీడ్ జాంగ్ యి మాన్ (చైనా)తో అషి్మత తలపడతారు. -
థాయ్‌లాండ్ ఓపెన్ విజేతగా సాత్విక్-చిరాగ్ జోడీ
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ విజేతగా భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన చెన్ బో యాంగ్, లియు యిపై 21-15 21-15 తేడాతో విజయం సాధించిన ఈ భారత ద్వయం.. తొమ్మిదవ వరల్డ్ టూర్ టైటిల్ తమ ఖాతాలో వేసుకున్నారు.వరుస గేమ్‌లలో ప్రత్యర్ధి జోడీని ప్రపంచ నం.3 సాత్విక్ ద్వయం చిత్తు చేసింది. ఏ దశలోనూ ప్రత్యర్ధికి కోలుకునే అవకాశం సాత్విక్, చిరాగ్ జంట ఇవ్వలేదు. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు టైటిల్‌ను సొంతం చేసుకోవడం ఈ జోడికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇక ప్రస్తుత బీడబ్ల్యూఎఫ్ సీజన్లో ఈ జోడికి ఇది రెండువ టైటిల్ కావడం విశేషం. అంతకుముందు మార్చిలో ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 టోర్నీ టైటిల్‌ను ఈ జోడీ సొంతం చేసుకుంది. అదేవిధంగా మలేషియా సూపర్ 1000,ఇండియా సూపర్ 750 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచారు. -
గాయత్రి జోడీకి చుక్కెదురు
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ విభాగంలో ఐదో సీడ్ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జోడీ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గాయత్రి–ట్రెసా ద్వయం 18–21, 22–20, 18–21తో ఆనీ జు–కెర్రీ జు (అమెరికా) జంట చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. మరోవైపు అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జంటకు తొలి రౌండ్లో వాకోవర్ లభించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ నుంచి మిథున్ మంజునాథ్ (భారత్) మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించగా... సమీర్ వర్మకు నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో మిథున్ 15–21, 24–22, 21–18తో శంకర్ ముత్తుస్వామి (భారత్)పై, రెండో మ్యాచ్‌లో 21–16, 21–12తో లియావో జు ఫు (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. -
శరత్ కమల్ ఓటమి
సింగపూర్: సంచలన విజయాలతో సింగపూర్ స్మాష్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో అదరగొట్టిన భారత స్టార్ ఆచంట శరత్ కమల్ జోరుకు బ్రేక్ పడింది. క్వాలిఫయింగ్ ద్వారా మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన ప్రపంచ 88వ ర్యాంకర్ శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శరత్ కమల్ 9–11, 2–11, 7–11, 11–9, 8–11తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఫెలిక్స్ లెబ్రున్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శరత్ మొత్తం 37 పాయింట్లు సాధించాడు. ఇందులో 24 పాయింట్లు తన సర్వీస్‌లో నెగ్గగా... తన సరీ్వస్‌లో మరో 22 పాయింట్లు ప్రత్యర్థికి కోల్పోయాడు. క్వార్టర్ ఫైనల్లో ఓడిన శరత్ కమల్‌కు 14,000 డాలర్ల (రూ. 11 లక్షల 60 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సాత్విక్–చిరాగ్ జోడీకి షాక్ బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీకి చుక్కెదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్–చిరాగ్ ద్వయం 16–21, 15–21తో 2022 డబుల్స్ చాంపియన్ షోహిబుల్ ఫిక్రీ–మౌలానా బగస్ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. గతంలో ఫిక్రీ–మౌలానా ద్వయంపై నాలుగుసార్లు గెలిచిన సాతి్వక్–చిరాగ్ ఈసారి ఒత్తిడికి లోనై అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో తరుణ్ వాటరింజెన్ (నెదర్లాండ్స్): డచ్ ఇంటర్నేషనల్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయర్‌గా అడుగుపెట్టిన తరుణ్ సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–16, 23–21తో భారత్‌కే చెందిన శుభాంకర్ డేపై గెలుపొందాడు. తొలి రౌండ్లో తరుణ్ 18–21, 21–10, 23–21తో ఆరో సీడ్ మథియాస్ కిక్లిట్జ్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించాడు. -
రుత్విక శివాని ఖాతాలో మిక్స్డ్ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలంగాణ అమ్మాయి రుత్విక శివాని మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. బెంగళూరులో మంగళవారం ముగిసిన ఈ టోర్నీలో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగుపెట్టిన రుత్విక (తెలంగాణ)–రోహన్ కపూర్ (ఢిల్లీ) జోడీ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో రుత్విక–రోహన్ ద్వయం 21–12, 21–16తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)–త్రిషా హెగ్డే (కర్ణాటక) జోడీపై నెగ్గింది. టైటిల్ గెలిచే క్రమంలో రుతి్వక–రోహన్ తమ ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. -
India Open 2024: ప్రణయ్, ప్రియాన్షు శుభారంభం
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రోజు భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ప్రపంచ 9వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్, 30వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లగా... 19వ ర్యాంకర్ లక్ష్య సేన్, 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–6, 21–19తో ప్రపంచ 13వ ర్యాంకర్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను బోల్తా కొట్టించగా... ప్రియాన్షు 16–21, 21–16, 21–13తో లక్ష్య సేన్‌కు షాక్ ఇచ్చాడు. మరో మ్యాచ్‌లో కిరణ్ జార్జి 12–21, 15–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ, రితూపర్ణ–శ్వేతపర్ణ (భారత్) జోడీ లు తొలి రౌండ్‌ను దాటలేకపోయాయి. గాయత్రి–ట్రెసా ద్వయం 21–18, 14–21, 13–21తో నాలుగో ర్యాంక్ జోడీ నమి మత్సుయామ–íÙడా చిహారు (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. టింగ్ యెంగ్–పుయ్ లామ్ యెంగ్ (హాంకాంగ్) జంట 21–6, 21–7తో రితూపర్ణ–శ్వేతపర్ణ జోడీపై గెలిచింది. -
సెమీస్‌లో మాళవిక
గువాహటి: గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మాళవిక 21–12, 21–16తో కరుపతెవన్ లెట్షానా (మలేసియా)పై గెలుపొందింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 22–20, 21–16తో జెసితా పుత్రి మియాన్‌తొరో–ఫెబి సెతియనిన్‌గ్రమ్ (ఇండోనేసియా) జంటను ఓడించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో దొడ్డవరపు అచ్యుతాదిత్య రావు–వెంకట హర్షవర్ధన్ (భారత్) ద్వయం 9–21, 14–21తో చూంగ్ హోన్ జియాన్–హైకాల్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
PV Sindhu-Carolina: బాక్సింగ్ కోర్టు కాదు.. బ్యాడ్మింటన్ కోర్టు
డెన్మార్క్ ఓపెన్ సూపర్ 750 సెమీఫైనల్.. ఒకవైపు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరోవైపు స్పెయిన్ స్టార్ కరోలినా మారిన్. తొలి సెట్ నుంచే హొరా హోరీ పోటీ. వీరిద్దరూ మధ్య ఫైట్ బాక్సింగ్ కోర్టును తలపించింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి సింధు ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ మాత్రం బ్యాడ్మింటన్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అస్సలు ఏమి జరిగిందో ఓ లూక్కేద్దం. తొలిసెట్ ఓ రణరంగం.. తొలిసెట్లో మొదటి పాయింట్ మారిన్ ఖాతాలో చేరింది. దీంతో మారిన్ అనందానికి హద్దులు లేవు. మారిన్ పాయింట్ సాధించిన ప్రతీసారి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ జరుపుకుంది. సిందూ కూడా ప్రత్యర్ధికి తగ్గట్టే సంబరాలు జరుపుకుంది. సింధు కూడా పాయింట్ సాధించినా ప్రతీసారి బిగ్గరగా అరిచింది. మొదటి వార్నింగ్.. వీరిద్దరూ సెలబ్రేషన్స్ శృతిమించడంతో మొదటి సెట్లోనే అంపైర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇద్దరిని దగ్గరకి పిలిచి గట్టిగా అరవద్దూ అంటూ అంపైర్ హెచ్చరించాడు. దీంతో సింధు సైలెంట్ అయినప్పటికీ.. కరోలినాలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. తన పంథాను కొనసాగించింది. తొలి సెట్లో ఓటమి.. మొదటి సెట్లో పీవీ సింధు చివరవరకు పోరాడినప్పటికీ కరోలినా ముందు తలవంచకతప్పలేదు. సింధు 18-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండో సెట్లో విజయం.. రెండో సెట్లో సింధు దెబ్బతిన్న పులిలా పంజా విసిరింది. ఈ సెట్ మొదటి నుంచే ప్రత్యర్ధిని సింధు ముప్పు తిప్పలు పెట్టింది. అయితే అనూహ్యంగా ప్రత్యర్ధి పుంజుకున్నప్పటికీ 21-19 తేడాతో సింధు విజయం సాధించింది. మూడో సెట్లో వాగ్వాదం.. నిర్ణయాత్మమైన మూడో సెట్లో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరోలినా పదే పదే గట్టిగా అరుస్తుండడంతో సింధు అంపైర్‌కు ఫిర్యాదు చేసింది. మరోసారి కరోలినాకు అంపైర్ వార్నింగ్ ఇచ్చాడు. అయినప్పటికీ కరోనా తీరు మారలేదు. చివరి గేమ్‌లో మొదటి నుంచే సింధుపై కరోలినా పై చేయి సాధించింది. మారిన్ 9-2తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. సింధు సిద్ధంగా ఉండటానికి తగినంత సమయం ఇవ్వకుండా మారిన్ గేమ్‌ను వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా సింధు కోర్టులో ఉన్న షటిల్‌ను తనవైపు తీసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో సింధుకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా వాదించుకున్నారు. ఈ క్రమంలో అంపైర్ జోక్యం ఇద్దరికి ఎల్లో కార్డు చూపించాడు. అదే విధంగా మూడో సెట్ ఆఖరిలో షటిల్‌ను సింధు ముఖంపై కొట్టింది. వెంటనే కరోలినా తన బ్యాట్‌ను పైకెత్తి సారీ చెప్పినప్పటికీ.. సింధు వైపు మాత్రం చూడలేదు. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అనవసర తప్పిదాలతో గేమ్‌తోపాటు మ్యాచ్‌నూ ప్రత్యర్థికి సమర్పించుకుంది. 7-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. క్షమాపణలు చెప్పిన కరోలినా.. ఇక ఈ మ్యాచ్ అనంతరం సింధుకు కరోలినా క్షమాపణలు చెప్పింది. మ్యాచ్ ముగిసిన తర్వాత పీవీ సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. అందులో "మ్యాచ్ ఓడిపోవడం బాధగా ఉంది. అయితే ఈ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. కానీ బ్యాక్-టు-బ్యాక్ సెమీ-ఫైనల్‌కు క్వాలిఫై కావడం సాధించడం చాలా సంతోషంగా ఉంది. నా ఫిట్నెస్ కూడా మరింత మెరుగుపడింది. ప్రతీ ఒక్కరికి భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఎదుటివారిని ద్వేషించడం సరికాదు " అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ పోస్టుకు కరోలినా స్పందిస్తూ.. "మ్యాచ్‌లో మంచి ఫైట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనమద్దిరం ఆ గేమ్‌లో గెలవాలని పోరాడాం. కానీ నేను వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకోలేదు. ఏదైమైనప్పటికీ అందరి ముందు నేను ఈ విధమైన ప్రవర్తన చూపినందుకు క్షమించండి. త్వరలో మళ్లీ కలుద్దాం మిత్రమా అంటూ రిప్లే ఇచ్చింది. -
సాత్విక్–చిరాగ్ జోడీ ఓటమి.. ముగిసిన పోరాటం
చాంగ్జౌ: చైనా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 17–21, 21–11, 17–21తో షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ జంట 15–21, 16–21తో చెన్ టాంగ్ జియె–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. Asia TT Championship 2023: Indian Mens Team Won Bronze Medal: భారత జట్టుకు కాంస్యం ప్యాంగ్‌చాంగ్ (దక్షిణ కొరియా): ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు మరోసారి కాంస్య పతకంతో సంతృప్తి పడింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 0–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయింది. ఆచంట శరత్ కమల్, సత్యన్ జ్ఞానశేఖరన్ , హర్మీత్ దేశాయ్ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓడిపోయారు. 2021 ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకం దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో అర్జున్ టాటా స్టీల్ ఇండియా చెస్ ఓపెన్ ర్యాపిడ్ టోర్నీలో ఆరు రౌండ్లు ముగిశాక తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 2.5 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. కోల్‌కతాలో 10 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం 3 రౌండ్లు జరిగాయి. నాలుగో గేమ్‌లో గ్రిష్చుక్ (రష్యా) చేతిలో 55 ఎత్తుల్లో ఓడిన అర్జున్... ఐదో గేమ్‌లో 67 ఎత్తుల్లో విదిత్ (భారత్)పై గెలిచాడు. గుకేశ్ (భారత్)తో జరిగిన ఆరో గేమ్‌ను అర్జున్ 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ప్రజ్ఞానంద, గుకేశ్ 3 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. -
అదరగొట్టిన పీవీ సింధు, లక్ష్య సేన్
కాల్గరీ: కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్... మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–11తో వైగోర్ కొల్హో (బ్రెజిల్)పై నెగ్గగా... సింధుకు ఆమె ప్రత్యర్థి నత్సుకి నిదైరా (జపాన్) నుంచి వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం 9–21, 11–21తో రెండో సీడ్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడింది. బ్రిజ్‌భూషణ్‌కు కోర్టు సమన్లు న్యూఢిల్లీ: రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో అరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించిన ఢిల్లీ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఈ కేసులో విచారించేందుకు తగిన సాక్ష్యాధారాలున్నాయని తెలిపారు. ఈ నెల 18న కోర్టు ముందు హాజరు కావాలని బ్రిజ్‌భూషణ్‌కు సమన్లు జారీ చేశారు. -
పారుపల్లి కశ్యప్ అవుట్.. క్వార్టర్స్‌లో ప్రణయ్
Taipei Open 2023- తైపీ: ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత నంబర్‌వన్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ తైపీ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–9, 21–17తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్ కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. కశ్యప్ 16–21, 17–21తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) ద్వయం 13–21, 18–21తో చియు సియా సియె–లిన్ జియావో మిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓటమి చవిచూసింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తాన్యా హేమంత్ (భారత్) 11–21, 6–21తో తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. పోరాడి ఓడిన శ్రీజ న్యూఢిల్లీ: వరల్డ్ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలో భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఆకుల శ్రీజ, దియా చిటాలె తొలి రౌండ్లోనే నిష్క్రమించగా... అహిక ముఖర్జీ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీజ 6–11, 11–4, 5–11, 11–2, 7–11తో హువాంగ్ యిహువా (చైనీస్ తైపీ) చేతిలో, దియా 11–9, 7–11, 2–11, 1–11తో మియు కిహారా (జపాన్) చేతిలో ఓడిపోయారు. అహిక 11–8, 11–3, 11–2తో జియోటాంగ్ వాంగ్ (చైనా)పై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సత్యన్–మనిక బత్రా (భారత్) ద్వయం 11–3, 11–3, 11–6తో అబ్దుల్ బాసిత్ చైచి–మలీసా నస్రి (అల్జీరియా) జంటను ఓడించిం -
సెమీస్‌లోనే నిష్క్రమించిన ప్రణయ్.. టైటిల్‌కు అడుగుదూరంలో సాత్విక్- చిరాగ్
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో... ఆసియా చాంపియన్‌షిప్‌లో... కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో అతి గొప్ప టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ టూర్ సూపర్–1000 స్థాయి టోర్నీలో ఈ జంట టైటిల్ పోరుకు అర్హత సాధించడం ఇదే తొలిసారి. జకార్తా: అంచనాలకు మించి రాణిస్తూ భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ఇండోనేసియా ఓపెన్ టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 67 నిమిషాల్లో 17–21, 21–19, 21–18తో మిన్ హిక్ కాంగ్–సియో సెంగ్ జె (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. నేడు జరిగే ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంక్ ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జోడీతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఆరోన్ చియా–సో వుయ్ యిక్‌లతో ఎనిమిదిసార్లు తలపడిన సాత్విక్–చిరాగ్ జంట ఒక్కసారి కూడా గెలవలేదు. తొమ్మిదో ప్రయత్నంలోనైనా సాత్విక్–చిరాగ్ విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి. భారత కాలమానం ప్రకారం సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలయ్యే అవకాశముంది. ఫైనల్ మ్యాచ్‌లన్నీ స్పోర్ట్స్–18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముగిసిన ప్రణయ్ పోరాటం మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్ 15–21, 15–21తో ఓడిపోయాడు. సెమీఫైనల్లో నిష్క్రమించిన ప్రణయ్‌కు 17,500 డాలర్ల (రూ. 14 లక్షల 33 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 8400 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సీజన్లో గొప్ప ఫామ్‌లో ఉన్న సాత్విక్–చిరాగ్ మరోసారి మెరిశారు. కొరియా జోడీపై గతంలో రెండుసార్లు నెగ్గిన సాత్విక్–చిరాగ్‌కు ఈసారి గట్టిపోటీ లభించింది. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత జంట రెండో గేమ్‌లో నెమ్మదిగా తేరుకుంది. ఆరంభంలోనే 4–0తో ముందంజ వేసి ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో ఆరంభంలో రెండు జోడీలు ప్రతి పాయింట్‌కు హోరాహోరీగా పోరాడాయి. స్కోరు 5–5తో సమంగా ఉన్నపుడు సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 12–5తో ఆధిక్యంలోకి వచ్చింది. అయితే కొరియా జంట పట్టుదలతో ఆడి స్కోరును 16–16 వద్ద సమం చేసింది. ఈ దశలో సాత్విక్–చిరాగ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 19–16తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత రెండు పాయింట్లు కోల్పో యిన భారత జోడీ వెంటనే రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఎనిమిదోసారి కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్ టోర్నీలలో సాత్విక్–చిరాగ్ జోడీ ఫైనల్ చేరడం ఇది ఎనిమిదోసారి. ఐదు టోర్నీలలో నెగ్గిన సాత్విక్–చిరాగ్, రెండు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచారు. చదవండి: Ashes 1st Test: తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేసిందా..? -
ఐదేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్.. చాంపియన్ సమీర్ వర్మ
Slovenia Open- 2023: ఐదేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సమీర్ వర్మ తన కెరీర్లో మరో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సమీర్ వర్మ 21–18, 21–14తో సు లి యాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన సమీర్‌కు 1200 డాలర్ల (రూ. 99 వేలు) ప్రైజ్‌మనీ దక్కింది. చివరిసారి సమీర్ వర్మ 2018లో సయ్యద్ మోదీ సూపర్–300 టోర్నీలో టైటిల్ సాధించాడు. ఇక టోర్నీలో సిక్కి రెడ్డి- రోహన్ కపూర్ జోడీ మిక్స్డ్ డబుల్స్‌లో రజతం సాధించారు. అర్జున్ ఖాతాలో మూడో ‘డ్రా’ షార్జా మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. షాంట్ సర్గ్‌సియాన్ (అర్మేనియా)తో సోమవారం జరిగిన ఆరో రౌండ్ గేమ్‌ను అర్జున్ 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. ఈ టోర్నీలో రెండు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిన అర్జున్ 3.5 పాయింట్లతో 18వ ర్యాంక్‌లో ఉన్నాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్, ఆర్యన్ చోప్రా నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా రెండో ర్యాంక్‌లో ఉన్నారు. మాజీ టాప్ ర్యాంక్ జోడీకి సాకేత్–యూకీ షాక్ పారిస్: లియోన్ –250 ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 7–6 (7/4), 3–6, 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ జోడీ సెబాస్టియన్ కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 53 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాకేత్, యూకీ రెండు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశారు. తమ ర్యాంకింగ్ ఆధారంగా వచ్చే వారం పారిస్‌లో మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల డబుల్స్ మెయిన్ ‘డ్రా’కు సాకేత్, యూకీ అర్హత పొందారు. -
రన్నరప్ సిక్కి రెడ్డి జోడీ
Sikki Reddy: స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ 12–21, 13–21తో మూడో సీడ్ జెస్పర్ టాఫ్ట్–క్లారా గావర్సన్ (డెన్మార్క్) ద్వయం చేతిలో ఓడిపోయింది. సెమీఫైనల్లో సిక్కి–రోహన్ 21–15, 21–19తో మాడ్స్ వెస్టర్‌గార్డ్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్)లపై గెలిచారు. ఇది కూడా చదవండి: ‘డ్రా’తో గట్టెక్కిన భారత్ అడిలైడ్: ఆస్ట్రేలియా మహిళల జట్టుతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ను భారత జట్టు ‘డ్రా’తో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి సిరీస్‌ను కోల్పోయిన భార త్ ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. మాడిసన్ బ్రూక్స్ (25వ ని. లో) చేసిన గోల్‌తో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా... దీప్ గ్రేస్ ఎక్కా (42వ ని.లో) గోల్‌తో భారత్ స్కోరును సమంచేసింది. ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ సవితా పూనియా, డిఫెండర్ నిక్కీ ప్రధాన్ తమ కెరీర్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నారు. -
Sudirman Cup 2023: విజయంతో ముగింపు... భారత్‌కు తప్పని నిరాశ
సుజౌ (చైనా): సుదిర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని భారత జట్టు విజయంతో ముగించింది. గ్రూప్ ‘సి’లో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలుపొందింది. చైనీస్ తైపీ, మలేసియా జట్లతో జరిగిన తొలి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోవడంతో నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. తొలి మ్యాచ్‌లో సాయిప్రతీక్–తనీషా క్రాస్టో 21– 17, 14–21, 18–21తో కెనెత్ చూ–గ్రోన్యా సోమర్‌విలె చేతిలో ఓడిపోయారు. అనంతరం రెండో మ్యాచ్‌లో ప్రణయ్ 21–8, 21–8తో జాక్ యుపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో అనుపమ 21–16, 21–18తో టిఫానీ హోపై, నాలుగో మ్యాచ్‌లో అర్జున్–ధ్రువ్ 21–11, 21–12తో టాంగ్–రేన్ వాంగ్‌లపై, ఐదో మ్యాచ్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 21–19, 21–13తో కైట్లిన్–ఎంజెలా యులపై విజయం సాధించారు. -
ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీ విజేత ప్రియాన్షు
భారత బ్యాడ్మింటన్ యువతార, ప్రపంచ 58వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్ తన కెరీర్లోనే గొప్ప విజయం సాధించాడు. ఫ్రాన్స్‌లో ఆదివారం ముగిసిన ఓర్లియాన్ మాస్టర్స్ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల ప్రియాన్షు 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 21–15, 19–21, 21–16తో ప్రపంచ 49వ ర్యాంకర్ మాగ్నుస్ జొహాన్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు. ప్రియాన్షుకు 18,000 డాలర్ల (రూ. 14 లక్షల 73 వేలు) ప్రైజ్‌మనీ, 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: #KavyaMaran: 'చల్ హట్ రే'.. నీకు నేనే దొరికానా! 5 బంతుల్లో 5 సిక్సర్లు.. గుజరాత్‌కు ఊహించని షాక్! ఎవరీ రింకూ సింగ్? 𝐀 𝐒𝐭𝐚𝐫 𝐢𝐬 𝐁𝐨𝐫𝐧 ⭐️🫶 Priyanshu is the men’s singles champion of #OrleansMasters2023, his first BWF World Tour Super 300 title 🏆😍 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndiaontheRise#Badminton pic.twitter.com/Mm3lOQMtwU — BAI Media (@BAI_Media) April 9, 2023 𝐀 𝐒𝐭𝐚𝐫 𝐢𝐬 𝐁𝐨𝐫𝐧 ⭐️🫶 Priyanshu is the men’s singles champion of #OrleansMasters2023, his first BWF World Tour Super 300 title 🏆😍 📸: @badmintonphoto @himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndiaontheRise#Badminton pic.twitter.com/Mm3lOQMtwU — BAI Media (@BAI_Media) April 9, 2023 -
PV Sindhu: అదరగొట్టిన సింధు.. సెమీస్‌లో! శ్రీకాంత్ మాత్రం..
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–14, 21–17తో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. ఈ క్రమంలో శనివారం జరిగే సెమీ ఫైనల్లో యో జియా మిన్ (సింగపూర్)తో సింధు ఆడుతుంది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం ముగిసింది. టాప్ సీడ్ కెంటా నిషిమోటో (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 18–21, 15–21తో ఓడిపోయాడు. చదవండి: IPL 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. -
German Open 2023: లక్ష్య సేన్‌కు షాక్
జర్మన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు, ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 41వ ర్యాంకర్ క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్) 21–19, 21–16తో ఆరో సీడ్ లక్ష్య సేన్‌ను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టాడు. పొపోవ్‌పై గతంలో నాలుగుసార్లు నెగ్గిన లక్ష్య సేన్ రెండోసారి ఓటమి చవిచూశాడు. -
German Open 2023: నేటినుంచి జర్మన్ ఓపెన్
ముల్హీమ్: భారత యువ షట్లర్, గత ఏడాది రన్నరప్ లక్ష్య సేన్ ఈ సారి జర్మన్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. నేటినుంచి జరిగే ఈ టోర్నీలో అతను ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. తొలి రౌండ్లో లక్ష్య ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపోవ్‌తో తలపడతాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యతో పాటు మిథున్ మంజునాథ్ బరిలో ఉన్నాడు. అయితే మరో భారత టాప్ ఆటగాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిడాంబి శ్రీకాంత్ అనూహ్యంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. సరైన సమయంలో అతనికి వీసా లభించకపోవడంతో శ్రీకాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, మాళవిక బన్సోద్, తస్నీమ్ మీర్ బరిలో నిలిచారు. పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్‌లలో భారత్‌నుంచి ఒక్క ఎంట్రీ కూడా లేకపోగా...మిక్స్డ్ డబుల్స్‌లో సుమీత్ రెడ్డి – అశ్విన్ పొన్నప్ప ద్వయం పోటీ పడుతోంది. -
బీఎస్ఎన్ఎల్ ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ పోటీలు ఆరంభం
సాక్షి, హైదరాబాద్: ఫోన్ నెట్వర్క్ ఒక్కటే కాదు.. క్రీడల్లోనూ రాణిస్తామని నిరూపించుకునేందుకు బ్యాడ్మింటన్ కోర్టులో దిగారు బీఎస్ఎన్ఎల్(BSNL) ఉద్యోగులు. ఏటా జరిగే ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈసారి సికింద్రాబాద్ రైల్వే నిలయం స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా మూడు రోజుల పాటు జరుగనున్నాయి. ఈ పోటీలను అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రారంభించారు. ఈ సందర్భంగా... ఉద్యోగం ఒత్తిడితో కూడుకున్నదని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, అలాగే శారీరకంగా ధృడంగా ఉంచుతాయన్నారు జ్వాల. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్(BSNL) సీజీఎం చాగంటి శ్రీనివాస్, హెచ్ఆర్ జనరల్ మేనేజర్ మహేంద్ర భాస్కర్, పీజీఎంఎస్ కేవీకే ప్రసాద్ రావు, ఎన్ మురళి, శ్రీమతి సుజాత, డీజీఎం చంద్రశేఖర్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: PC Vs PR: ఆదుకున్న బట్లర్.. ఓడినా సెమీస్‌కు దూసుకెళ్లిన రాయల్స్! టాప్-4లో సన్‌రైజర్స్ కూడా.. Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో -
Thailand Open: పోరాడి ఓడిన సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ 49వ ర్యాంకర్ సాయిప్రణీత్ 17–21, 23–21, 18–21తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఆరో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు తడబడి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకోవడం టర్నింగ్ పాయింట్ అయింది. సాయిప్రణీత్‌కు 1,260 డాలర్ల (రూ. 1 లక్ష 3 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సైనాకు చేదు అనుభవం
జకార్తా: ఈ ఏడాది ఆడుతున్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మలేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లో, ఇండియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా... తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సైనా 15–21, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ హాన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏ దశలోనై చైనా ప్లేయర్‌కు పోటీనివ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనైతే సైనా ఆరంభంలోనే వరుసగా 10 పాయింట్లు కోల్పోయి 0–10తో వెనుకబడిపోయింది. క్వార్టర్స్‌లో లక్ష్య సేన్ ఇక రెండో గేమ్‌లో సైనా తొలుత వరుసగా మూడు పాయింట్లు, అనంతరం వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–8, 21–17తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. చదవండి: పోటీకి సిద్ధమైన రెజ్లర్లు ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టోర్నీ జాగ్రెబ్ ఓపెన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగేందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు క్రొయేషియాలో జరిగే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్, రవి కుమార్, దీపక్ పూనియాలు పోటీపడనున్నారు. వీరితోపాటు మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షు మలిక్ బరిలోకి దిగనున్నారు. ఒకవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు కాగా.. మరోవైపు ఈ మేరకు రెజ్లర్లు టోర్నికి సిద్ధం కావడం విశేషం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? -
Malaysia Open 2023: క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ప్రణయ్ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్‌లో మాత్రం భారత్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
HS Prannoy: ప్రణయ్ తొలిసారి... మొదటి మ్యాచ్‌లో నరోకాతో ‘ఢీ’
BWF World Tour Finals 2022: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ మొదటిసారి అర్హత సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలో ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ప్రపంచ 14వ ర్యాంకర్ కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రణయ్ ఆడనున్నాడు. బ్యాంకాక్‌లో బుధవారం నుంచి జరిగే ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘ఎ’లో ప్రణయ్‌తోపాటు ఒలింపిక్ చాంపియన్ అక్సెల్సన్ (డెన్మార్క్), లూ గ్వాంగ్ జు (చైనా), నరోకా ఉన్నారు. నరోకాతో ఈ ఏడాది సింగపూర్ ఓపెన్‌లో ఆడిన ప్రణయ్ మూడు గేముల్లో ఓడిపోయాడు. చదవండి: IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? Virender Sehwags son: క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక -
సెమీస్‌లో రుత్విక శివాని
ఇండియా ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బెంగళూరులో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ రుత్విక 21–19, 21–9తో టాప్ సీడ్ ఐరా శర్మను ఓడించింది. నేడు జరిగే సెమీఫైనల్లో భారత్‌కే చెందిన మాన్సి సింగ్‌తో రుత్విక ఆడుతుంది. క్వార్టర్ ఫైనల్లో మాన్సి 21–13, 21–15తో హైదరాబాద్ ప్లేయర్ మేఘన రెడ్డిపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్; షేక్ గౌస్–మనీషా జోడీలు సెమీఫైనల్‌కు చేరాయి. క్వార్టర్ ఫైనల్స్‌లో సిక్కి–రోహన్ ద్వయం 21–13, 21–17తో నితిన్–పూర్వీషా రామ్ జోడీపై... షేక్ గౌస్–మనీషా జంట 21–7, 21–17తో నజీర్ ఖాన్–నీలా వలువన్ జోడీపై విజయం సాధించాయి. -
Vietnam Open: భారత్‌కు నిరాశ.. సిక్కిరెడ్డి- రోహన్ కపూర్ జోడీకి తప్పని ఓటమి
Vietnam Open 2022- హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ బరిలో మిగిలిన ఏకైక జోడీ సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) సెమీఫైనల్లో వెనుదిరిగింది. 37 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో టాప్ సీడ్ రెహాన్ నౌఫల్–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం 21–16, 21–14తో సిక్కి రెడ్డి–రోహన్ జోడీపై గెలిచి ఫైనల్ చేరింది. సెమీస్‌లో ఓడిన భారత జంటకు 1,050 డాలర్ల (రూ. 85 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
Vietnam Open: పోరాడి ఓడిన రుత్విక.. అదరగొట్టిన సిక్కిరెడ్డి- రోహన్ జోడీ
Vietnam Open 2022- హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి సిక్కిరెడ్డి మిక్స్డ్ డబుల్స్‌లో దూసుకెళుతోంది. రోహన్ కపూర్‌తో జతకట్టిన ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి– రోహన్ జోడీ 21–10, 19–21, 21–18తో ఎనిమిదో సీడ్ యుంగ్ షింగ్ చొయ్–ఫాన్ క యాన్ (హాంకాంగ్) జంటను కంగు తినిపించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత ద్వయం మలేసియాకు చెందిన మూడో సీడ్ చాన్ పెంగ్ సున్–చి యి సి జోడీతో తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో తెలంగాణ షట్లర్ మేకల కిరణ్ కుమార్ ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాడు. వరుస విజయాలతో ప్రిక్వార్టర్స్ చేరిన కిరణ్ ఇక్కడ మాత్రం వరుస గేముల్లో 15–21, 10–21తో చిమ్ జున్ వి (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లోనూ భారత ప్లేయర్లకు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. హైదరాబాద్ షట్లర్ గద్దె రుత్విక శివాని 21–15, 18–21, 17–21తో స్థానిక ప్లేయర్ తి త్రంగ్ వు చేతిలో పోరాడి ఓడింది. మిగతా మ్యాచ్‌ల్లో రీతుపర్ణ దాస్ 15–21, 16–21తో తి ఫుంగ్తుయ్ ట్రాన్ (వియత్నాం) చేతిలో ఓడిపోగా... నీలూరి ప్రేరణ 3–21, 7–21తో టాప్‌సీడ్ అయ ఒహొరి (జపాన్) ధాటికి నిలువలేకపోయింది. -
Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ ద్వయం 14–21, 21–9, 21–12తో హరిహరన్–లక్ష్మి ప్రియాంక (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, 40వ ర్యాంకర్ సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన రెండో సీడ్ సాయిప్రణీత్ 21–17, 18–21, 13–21తో 225వ ర్యాంకర్ సతీశ్ కుమార్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ప్లేయర్ మేకల కిరణ్ కుమార్ వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో కిరణ్ 21–10, 15–21, 21–10తో ప్రపంచ 68వ ర్యాంకర్ శుభాంకర్ డే (భారత్)పై నెగ్గి...రెండో రౌండ్లో 16–21, 21–14, 21–19తో ఫోన్ ప్యా నైంగ్ (మయాన్మార్)ను ఓడించాడు. -
BWF World Championships: చిరాగ్- సాత్విక్ జోడీ సంచలన విజయం.. సరికొత్త చరిత్ర
Chirag Shetty and Satwiksairaj Rankireddy: భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు చేసుకుని ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ జంటగా నిలిచింది. టోక్యో వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో జపాన్ బ్యాడ్మింటన్ జోడీతో తలపడి ఈ రికార్డు సాధించింది. కాగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా చిరాగ్ శెట్టి- సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి ద్వయం.. రెండో సీడ్ టకురో హోకి- యుగో కొబయాషి(జపాన్)తో క్వార్టర్ ఫైనల్లో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ తొలి గేమ్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురైనా భారత జోడీ 24-22తో పైచేయి సాధించింది. అయితే, రెండో గేమ్‌లో మాత్రం జపాన్ షట్లర్ల ద్వయం.. చిరాగ్- సాత్విక్‌లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. 21-15తో ఓడించింది. తిరిగి పుంజుకున్న భారత జంట 21-14తో టకురో హోకి- యుగో కొబయాషిలను మట్టికరిపించి విజయం సాధించింది. తద్వారా సెమీస్ చేరి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. ఇక చిరాగ్- సాత్విక్ జోడీ కామన్వెల్త్ గేమ్స్-2022లో స్వర్ణ పతకం గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Virat Kohli: ధోనితో ఉన్న ఫొటో షేర్ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్ ఆందోళన! ✅ First 🇮🇳 MD pair to secure a #BWFWorldChampionships medal ✅ Only 2nd #WorldChampionships medal from 🇮🇳 doubles pair ✅ 13th medal for 🇮🇳 at World's@satwiksairaj & @Shettychirag04 script history yet again 😍#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise pic.twitter.com/POW0uYt7KC — BAI Media (@BAI_Media) August 26, 2022 -
BWF World Badmintonship: చరిత్ర సృష్టించిన ధ్రువ్- అర్జున్ జోడీ.. తొలిసారిగా
MR Arjun- Dhruv Kapila: భారత షట్లర్లు ధ్రువ్ కపిల- ఎం.ఆర్ అర్జున్ అద్బుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల డబుల్స్‌లో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. టోక్యో వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్-2022లో భాగంగా ఈ ద్వయం గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింగపూర్ జోడీతో తలపడింది. ఈ మ్యాచ్‌లో హీ యోంగ్ కాయ్ టెరీ–లో కీన్ హీన్ జంటను ఓడించింది. మొదటి గేమ్‌లో (18-21) కాస్త వెనుకబడినా.. వరుసగా రెండు గేమ్‌లలో 21-15, 21-16తో సత్తా చాటి విజయం అందుకుంది. తద్వారా ధ్రువ్ కపిల- ఎం. ఆర్ అర్జున్ జంట క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఇక అంతకు ముందు రెండో రౌండ్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్(అన్‌సీడెడ్) ప్రపంచ ఎనిమిదో ర్యాంక్ జోడీ కిమ్ ఆస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్)పై గెలుపొంది సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 21–17, 21–16తో విజయం నమోదు చేసి ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. క్వార్టర్ ఫైనల్లో ధ్రువ్- అర్జున్.. మూడో సీడ్ ఇండోనేషియా ద్వయం మహ్మద్ అహ్సాన్, హెండ్రా సెటీవాన్తో తలపడనున్నారు. చదవండి: Asia Cup 2022: ఆసియాకప్‌కు ముందు పాకిస్తాన్ కీలక నిర్ణయం! Asia Cup 2022 Ind Vs Pak: బాబర్ ఆజంను పలకరించిన కోహ్లి.. వీడియో వైరల్! రషీద్‌తోనూ ముచ్చట! Big task ahead for @arjunmr & @dhruvkapilaa in their maiden #BWFWorldChampionships quarterfinals and they are up for it 👊🔥#BWFWorldChampionships2022#BWC2022#Tokyo2022#IndiaontheRise#Badminton pic.twitter.com/idvcF3rX2V — BAI Media (@BAI_Media) August 25, 2022 -
Taipei Open: పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్
తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 40వ ర్యాంకర్ కశ్యప్ 12–21, 21–12, 17–21తో 59వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. కశ్యప్‌నకు 3 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 39 వేలు), 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–ఇషాన్ (భారత్) జంట 19–21, 12–21తో హూ పాంగ్ రోన్–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–శ్రుతి (భారత్) ద్వయం 16–21, 22–20, 18–21తో ఎన్జీ సాజ్ యా– సాంగ్ హి యాన్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
51 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్.. క్వార్టర్‌కు కశ్యప్
తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్‌లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్ చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన లి చియా హోతో తలపడిన కశ్యప్.. అతడిని ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్ లో కశ్యప్.. 21-10, 21-19 తేడాతో లి చియా ను ఓడించాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కశ్యప్.. క్వార్టర్స్ కు చేరాడు. కశ్యప్ మినహా మిగతా భారత బృందం రెండో రౌండ్ లో తడబడింది. మిథున్ మంజునాథన్, ప్రియాన్షు రజవత్, కిరణ్ జార్జ్ లు రెండో రౌండ్ గండాన్ని దాటలేకపోయారు. ఇక మహిళల సింగిల్స్ లో ఏకైక ఆశాకిరణం సమియా ఫరూఖీ కూడా ఓడింది. మహిళల సింగిల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భారత ఏకైక క్రీడాకారిణి సమియా ఫరూఖీ.. తైవాన్ కే చెందిన వెన్ చి చేతిలో 18-21, 13-21 తో ఓటమిపాలైంది. మెన్స్ డబుల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భట్నాగర్-ప్రతీక్ జోడీ తైవాన్ కే చెందిన యాంగ్-చి లిన్ చేతిలో ఓడింది. మిక్సడ్ డబుల్స్ లో భట్నాగర్-తనీషా క్రాస్టోల జోడీ రెండో రౌండ్ లో 21-14, 21-17 తేడాతో కై వెన్-యు కియా జోడీని మట్టికరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. -
Singapore Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు.. సైనాకు తప్పని భంగపాటు
సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సత్తా చాటింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ హాన్ యుయేపై విజయం సాధించింది. ప్రత్యర్థిని 17-21, 21-11, 21-19 తేడాతో ఓడించి తెలుగు తేజం సింధు సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. మరో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు భంగపాటు తప్పలేదు. జపాన్ ప్లేయర్ ఒహరి చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం నాటి క్వార్టర్ ఫైనల్స్‌లో 13-21, 21-15, 20-22 తేడాతో సైనా ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. దీంతో ఆమె టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సైతం బీడబ్ల్యూఎఫ్ 500 టోర్నీ క్వార్టర్స్‌లో జపాన్ షట్లర్ కొడాయి నరోకా చేతిలో ఓడి ఇంటిబాటపట్టాడు. చదవండి: Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. నన్ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం అదే! కనీసం ఒక్కరైనా.. -
Malaysia Masters: అదరగొట్టిన సింధు, ప్రణయ్
మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళ సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్ ఓటమి పాలయ్యారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–12, 21–10తో ప్రపంచ 32వ ర్యాంకర్ జంగ్ యి మన్ (చైనా)పై అలవోక విజయం సాధించింది. కేవలం 28 నిమిషాల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. పురుషుల ఈవెంట్లో ప్రణయ్ 21–19, 21–16తో వాంగ్ జు వి (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు. సాయిప్రణీత్ 14–21, 17–21తో లి షె ఫెంగ్ (చైనా) చేతిలో, కశ్యప్ 10–21, 15–21తో ఆరో సీడ్ ఆంథోని సినిసుక (ఇండోనేసియా) చేతిలో వరుస గేముల్లో కంగుతిన్నారు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో సింధు... రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో, ప్రణయ్... జపాన్‌కు చెందిన సునెయామతో తలపడతారు. చదవండి: IND vs ENG 1st T20: హార్దిక్ ఆల్‌రౌండ్ షో.. టీమిండియా ఘన విజయం -
Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో ర్యాంకర్ పీవీ సింధు 21–13, 17–21, 21–15తో తొమ్మిదో ర్యాంకర్ హి బింగ్ జియావో (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ గెలుపుతో ఇటీవల ఇండోనేసియా ఓపెన్–1000 టోర్నీలో హి బింగ్ జియావో చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. మరో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ 21–16, 17–21, 14–21తో కిమ్ గా యున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. గతవారం మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీలోనూ సైనా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. సాయిప్రణీత్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరగా... సమీర్ వర్మ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–8, 21–9తో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)పై, కశ్యప్ 16–21, 21–16, 21–16తో టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్ 21–19, 21–14తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. సమీర్ వర్మ 21–10, 12–21, 14–21తో నాలుగో సీడ్ చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 19–21, 21–18, 16–21తో ఫాబ్రియానా కుసుమ– అమాలియా ప్రాతవి (ఇండోనేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
Indonesia Masters 2022: సింధు నిష్క్రమణ
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల కథ ముగిసింది. పీవీ సింధు, లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటలేకపోయారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 12–21, 10–21తో ఎనిమిదో ర్యాంకర్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి పాలైంది. 33 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏదశలోనూ సింధు ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. రచనోక్ చేతిలో సింధుకిది తొమ్మిదో ఓటమి. 2018 వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో చివరిసారి రచనోక్‌పై నెగ్గిన సింధు ఆ తర్వాత ఈ థాయ్ ప్లేయర్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 62 నిమిషాల్లో 16–21, 21–12, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు, లక్ష్య సేన్‌లకు 2,160 డాలర్ల (రూ. లక్షా 68 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
Indonesia Masters: క్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సింధు 23–21, 20–22, 21–11 స్కోరుతో గ్రెగొరియా మరిస్కా (ఇండోనేసియా)పై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా సొంత ప్రేక్షకుల మధ్య సింధుకు తొలి రెండు గేమ్‌లలో గట్టి పోటీనిచ్చింది. 71 నిమిషాల పాటు ఈ పోరు సాగడం విశేషం. చివరి గేమ్‌లో మాత్రం సింధు ఏకపక్షంగా ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ లక్ష్య సేన్ 21–18, 21–15తో రస్మస్ గెమ్కె (డెన్మార్క్)ను ఓడించి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టాడు. మిక్స్డ్ డబుల్స్‌లో మాత్రం సుమీత్ రెడ్డి– అశ్విని పొన్నప్ప జోడి పరాజయంతో వెనుదిరిగింది. రెండో సీడ్ చైనా ద్వయం జెంగ్ సీ వీ– హువాంగ్ కియాంగ్ 21–18, 21–13తో భారత జంటను ఓడించారు. -
Thomas Cup 2022: భళా భారత్...
బ్యాంకాక్‌లో భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు అద్భుతాన్ని ఆవిష్కరించింది. 73 ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ప్రతిష్టాత్మక థామస్ కప్ టీమ్ టోర్నీలో భారత జట్టు తొలిసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2016 చాంపియన్ డెన్మార్క్‌తో హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో భారత్ 3–2తో గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో 14 సార్లు చాంపియన్ ఇండోనేసియాతో భారత్ అమీతుమీ తేల్చుకుంటుంది. బ్యాంకాక్: థామస్ కప్ బ్యాడ్మింటన్ టీమ్ టోర్నమెంట్లో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 1949లో మొదలైన ఈ మెగా ఈవెంట్లో టీమిండియా తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. మాజీ చాంపియన్ డెన్మార్క్ జట్టుతో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–2తో విజయం సాధించింది. మరో సెమీఫైనల్లో 14 సార్లు విజేత ఇండోనేసియా 3–2తో మాజీ విజేత జపాన్ను ఓడించి ఆదివారం జరిగే టైటిల్ పోరులో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది. సాత్విక్–చిరాగ్ చెలరేగి... డెన్మార్క్‌తో పోటీని భారత్ ఓటమితో మొదలుపెట్టింది. భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 49 నిమిషాల్లో 13–21, 13–21తో ప్రపంచ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం అద్భుత ఆటతీరు కనబరిచింది. 78 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–18, 21–23, 22–20తో కిమ్ ఆస్ట్రప్–మథియాస్ క్రిస్టియాన్సన్ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు సాత్విక్–మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి కీలకదశలో పాయింట్లు రాబట్టి పైచేయి సాధించారు. మూడో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ తన శక్తినంతా ధారపోసి ఆడాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 80 నిమిషాల్లో 21–18, 12–21, 21–15తో గెలుపొంది భారత్‌కు 2–1 ఆధిక్యాన్ని అందించాడు. పోటీలో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన నాలుగో మ్యాచ్‌లో డెన్మార్క్ జట్టు రాణించింది. ఆండెర్స్ రస్ముసెన్–ఫ్రెడెరిక్ ద్వయం 21–14, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంటను ఓడించి స్కోరును 2–2తో సమం చేసింది. ప్రణయ్ ప్రతాపం స్కోరు 2–2తో సమం కావడంతో భారత ఆశలన్నీ ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగిన హెచ్ఎస్ ప్రణయ్‌పై ఆధారపడ్డాయి. మలేసియాతో క్వార్టర్ ఫైనల్లో చివరి మ్యాచ్‌లో గెలిచి భారత్‌ను సెమీస్‌కు చేర్చిన ప్రణయ్ ఈసారీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. ప్రపంచ 13వ ర్యాంకర్ రస్ముస్ జెమ్కెతో జరిగిన మ్యాచ్‌లో 23వ ర్యాంకర్ ప్రణయ్ 73 నిమిషాల్లో 13–21, 21–9, 21–12తో గెలుపొంది భారత్‌ను తొలిసారి థామస్ కప్‌లో ఫైనల్‌కు చేర్చాడు. మ్యాచ్ మధ్యలో ప్రణయ్ చీలమండకు గాయమైనా ఆ బాధను ఓర్చుకుంటూ పట్టువదలకుండా పోరాడిన అతను భారత్‌కు మరో చిరస్మరణీయ విజయం కట్టబెట్టాడు. -
సింధు, శ్రీకాంత్‌లకు కాంస్యం.. వ్రిత్తికి రజతం.. ఇంకా...
కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 14–21, 17–21తో ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 19–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. సెమీఫైనల్లో ఓడిన సింధు, శ్రీకాంత్‌లకు 5,220 డాలర్ల (రూ. 3 లక్షల 96 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. ఇతర క్రీడా వార్తలు.. వ్రిత్తి అగర్వాల్‌కు రజతం సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ రజతం పతకం సాధించింది. అండర్–16 బాలికల ఫ్రీస్టయిల్ 1500 మీటర్ల విభాగం ఫైనల్ రేసును వ్రిత్తి 18 నిమిషాల 06.40 సెకన్లలో ముగించి రెండో స్థానంలో నిలిచింది. ‘షూటౌట్’లో భారత్ ఓటమి భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య మహిళల ప్రొ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సవిత కెప్టెన్సీలోని భారత జట్టు ‘షూటౌట్’లో 1–3తో ఓడిపోయింది. ఆట తొలి నిమిషంలో రజ్విందర్ కౌర్ గోల్‌తో భారత్ ఖాతా తెరువగా... 53వ నిమిషంలో కెప్టెన్ జాన్సెన్ యిబ్బి గోల్‌తో నెదర్లాండ్స్ స్కోరును 1–1తో సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున నవనీత్ కౌర్ మాత్రమే సఫలంకాగా రజ్విందర్, నేహా, జ్యోతి విఫలమయ్యారు. నెదర్లాండ్స్ జట్టు తరఫున మరాంటె, ఫోర్టిన్ కిరా, జాన్సెన్ సఫలంకాగా... ఫియోనా విఫలమైంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్ అయినా గెలవండిరా బాబూ! సిగ్గుతో చచ్చిపోతున్నాం! -
పీవీ సింధుకు నిరాశ.. టోర్నీ నుంచి అవుట్!
Korea Open 2022: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. దక్షిణా కొరియాకు చెందిన అన్ సియోంగ్ చేతిలో సింధు సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. పామా స్టేడియం వేదికగా శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సియోంగ్ ఆది నుంచి దూకుడైన ఆటతో ముందుకు సాగింది. తొలి గేమ్‌లో అయితే సింధుకు అస్సలు అవకాశం ఇవ్వలేదు. ఇక వరుస గేమ్‌లలో ఆధిపత్యం కనబరిచిన సియోంగ్ 21-14, 21-17తో సింధును ఓడించింది. దీంతో తెలుగు తేజం సింధు నిరాశగా టోర్నీ నుంచి నిష్క్రమించగా.. 20 ఏళ్ల సియోంగ్ ఫైనల్‌కు చేరి సత్తా చాటింది. కాగా అంతకుముందు.. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించిన సంగతి తెలిసిందే. బుసానన్‌పై 17వ సారి విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. కానీ.. సెమీ ఫైనల్లో మాత్రం విజయయాత్రను కొనసాగించలేకపోయింది. ఆరంభం నుంచే వెనుకబడ్డ సింధు చివరికి ఓటమి పాలైంది. An Seyoung goes to the Korea Open 2022 finals by defeating Pusarla V. Sindhu!!!!! What a game!🔥🔥😭#KoreaOpen2022 pic.twitter.com/fwluApklwQ — willie (@willeyhhfixeu) April 9, 2022 -
Korea Open: సింధు, శ్రీకాంత్ జోరు
సన్‌చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–10, 21–16తో బుసానన్ (థాయ్‌లాండ్)ను ఓడించింది. బుసానన్‌పై సింధుకిది 17వ విజయం కావడం విశేషం. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ 21–12, 18–21, 21–12తో సన్ వాన్ హో (కొరియా) పై గెలిచాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి జోడీ 20–22, 21–18, 20–22తో కాంగ్ మిన్‌హుక్–సియో సెయుంగ్‌జె (కొరియా) జంట చేతిలో... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జోడీ 19–21, 17–21తో ఎమ్ హై వన్–బో రియోంగ్ కిమ్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయాయి. -
సింధు, శ్రీకాంత్ సులువుగా...
సన్‌చెయోన్: కొరియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 40 నిమిషాల్లో 21–15, 21–14తో లౌరెన్ లామ్ (అమెరికా)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 40 నిమిషాల్లో 22–20, 21–11తో డారెన్ లూ (మలేసియా)ను ఓడించాడు. గతంలో డారెన్‌తో ఆడిన మూడుసార్లూ ఓడిన శ్రీకాంత్ నాలుగో ప్రయత్నంలో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు. మహిళల సింగిల్స్ మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ 5–21, 13–21తో రెండో సీడ్ ఆన్ సెయంగ్ (కొరియా) చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–16, 21–15తో తె యాంగ్ షిన్–వాంగ్ చాన్ (దక్షిణ కొరియా) జంటను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 21–19, 21–18తో జున్ లియాంగ్ ఆండీ క్వెక్–యుజియా జిన్ (సింగపూర్) జంటపై నెగ్గింది. -
ప్రిక్వార్టర్స్‌లో లక్ష్య సేన్, మాళవిక
సన్‌చెయోన్ (దక్షిణ కొరియా): భారత నంబర్‌వన్ ర్యాంకర్ లక్ష్య సేన్ కొరియా ఓపెన్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశాడు. చోయ్ జీ హూన్ (దక్షిణ కొరియా)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 21–16, 21–18తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 72వ ర్యాంకర్ చీమ్ జూన్ వె (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 7–21తో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక బన్సోద్ (భారత్) 20–22, 22–20, 21–10తో ప్రపంచ 24వ ర్యాంకర్ హాన్ వయి (చైనా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కృష్ణప్రసాద్ గారగ–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (భారత్) జోడీ 14–21, 19–21తో ప్రమ్యుద–రామ్బితాన్ (ఇండోనేసియా) జంట చేతిలో... సుమీత్ రెడ్డి–బొక్కా నవనీత్ (భారత్) ద్వయం 14–21, 12–21తో ఒంగ్ యె సిన్–తియో ఇ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
Swiss Open: ఫైనల్లో సింధు
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు వరుసగా రెండో ఏడాది ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 79 నిమిషాల్లో 21–18, 15–21, 21–19తో సుపనిద కటెథోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. గత ఏడాది ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడి సింధు రన్నరప్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ (భారత్) ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి సెమీఫైనల్లో ప్రణయ్ 21–19, 19–21, 21–18తో ఐదో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై గెలిచాడు. రెండో సెమీఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–18, 7–21, 13–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
బాసెల్: భారత అగ్రశ్రేణి షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు స్విస్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్‌లు కూడా క్వార్టర్స్ చేరగా... వెటరన్ స్టార్ సైన నెహ్వాల్‌కు ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సింధు 21–19, 21–14తో నెస్లిహన్ యిగిట్ (టర్కీ)పై గెలుపొందగా, సైనా నెహ్వాల్ 21–17, 13–21, 13–21తో మలేసియా షట్లర్ కిసొన సెల్వదురై చేతిలో పరాజయం చవిచూసింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 13–21, 25–23, 21–11తో ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టో పొపొవ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. మరో మ్యాచ్‌లో సీనియర్ షట్లర్ కశ్యప్‌కు అదృష్టం కలిసొచ్చి వాకోవర్‌తో ముందంజ వేశాడు. ప్రపంచ నంబర్‌వన్, డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సన్తో తలపడాల్సిన పోరులో ప్రత్యర్థి బరిలోకి దిగలేదు. దీంతో ఎట్టకేలకు చాన్నాళ్ల తర్వాత కశ్యప్ ఒక టోర్నీలో క్వార్టర్స్ చేరాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 19–21, 21–13, 21–9తో కలే కోల్జొనెన్‌పై నెగ్గాడు. పురుషుల డబుల్స్‌లో మూడో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జంట 19–21, 20–22తో ప్రముద్య కుసుమవర్దన–యెరెమియా రంబితన్ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడింది. -
ప్రణయ్‌పై గెలుపుతో సెమీఫైనల్లో లక్ష్య సేన్
జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువస్టార్ లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–15, 21–16తో భారత్‌కే చెందిన హెచ్ఎస్ ప్రణయ్‌పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ 10–21, 21–23తో టాప్ సీడ్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. అక్సెల్సన్ చేతిలో శ్రీకాంత్‌కిది వరుసగా ఆరో ఓటమి. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ జోడీ 11–21, 21–23తో హి జి టింగ్–హావో డాంగ్ జౌ (చైనా) జంట చేతిలో ఓడింది. -
German Open: సింధుకు ఊహించని షాక్.. సైనా కూడా అవుట్!
మ్యుహెమ్ అండరుహ్ (జర్మనీ): భారత స్టార్ షట్లర్లకు జర్మన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ఏడో సీడ్ పీవీ సింధు, సైనా నెహ్వాల్ కంగుతినగా, పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ ప్రపంచ నంబర్‌వన్, ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21–16, 21–23, 21–18తో చైనాకు చెందిన లుగ్వాంగ్ జుపై గెలిచాడు. గంటా 7 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో చైనా ప్రత్యర్థి గట్టి పోటీ ఇచ్చాడు. హోరాహోరీగా జరిగిన రెండో గేమ్‌లో శ్రీకాంత్‌కు చివరకు నిరాశే ఎదురైంది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో జాగ్రత్తగా ఆడు తూ పైచేయి సాధించాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 21–19, 24–22తో లీ చిక్ యూ (హాంకాంగ్)పై గెలిచాడు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌కు సిసలైన సవాలు ఎదురు కానుంది. ఒలింపిక్ చాంపియన్, టాప్‌సీడ్ విక్టర్ అక్సెసెన్ (డెన్మార్క్)తో భారత స్టార్ తలపడనున్నాడు. సింధు, సైనా అవుట్! మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సింధు 14–21, 21–15, 14–21తో జాంగ్ యిమన్ (చైనా) చేతిలో కంగుతింది. వచ్చే వారం ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ కోసం కఠోరంగా శ్రమిస్తోన్న సింధుకు ఇది ఊహించని షాక్. అన్‌సీడెడ్ ప్రత్యర్థిపై ఒక గేమ్ గెలిచినా, మిగతా రెండు గేముల్లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. సుదీర్ఘకాలంగా ఫిట్నెస్ సమస్యలెదుర్కొంటూ కెరీర్ కొనసాగిస్తున్న సైనా తన ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. థాయ్‌లాండ్ స్టార్, ఎనిమిదో సీడ్ రత్చనోక్ ఇంతనొన్ 21–10, 21–15తో సైనాపై అవలీలగా గెలిచింది. 31 నిమిషాల్లోనే సైనాతో మ్యాచ్‌ను ముగించింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జోడీ 23–21, 16–21, 21–14తో భారత్‌కే చెందిన ఇషాన్ భట్నాగర్–సాయిప్రతీక్ జంటపై గెలిచింది. చదవండి: Novak Djokovic: నంబర్ 1 ర్యాంకు కోల్పోయావు.. అయినా నువ్వు మారవా! -
పీవీ సింధుకు ఘోర పరాభవం..
జర్మన్ ఓపెన్ 2022లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఘోర పరాభావం ఎదురైంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన సింధు సూపర్ 300 టోర్నీ రెండో రౌండ్లోనే నిష్క్రమించి అభిమానులను నిరాశపరిచింది. తనకంటే తక్కువ ర్యాంక్ క్రీడాకారిణి అయిన జాంగ్ ఈ మాన్ (చైనా) చేతిలో 14-21 21-15 14-21తో సింధు ఓటమిపాలైంది. ఈ గేమ్ తొలి సెట్ కోల్పోయిన సింధు రెండో సెట్లో పుంజుకుని విజయం సాధించినప్పటికీ.. నిర్ణయాత్మక మూడో సెట్లో ప్రత్యర్ధికి తలవంచింది. దీంతో వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్న ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్కు ముందు ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధుకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఇదిలా ఉంటే, ఇదే టోర్నీలో భారత షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్, లక్ష్యసేన్‌లు తొలి రౌండ్లో ప్రత్యర్ధులపై సునాయాస విజయాలు సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. శ్రీకాంత్.. ఫ్రాన్స్ షట్లర్ బ్రిస్ లెవర్డెజ్‌ను 21-10, 13-21, 21-7 తేడాతో ఓడించగా, మహిళల సింగిల్స్‌లో నెహ్వాల్.. క్లారా అజుర్మెండిపై 21-15, 17-21, 21-14తో, లక్ష్యసేన్.. వాంగ్ చారోయెన్‌పై 21-6, 22-20 తేడాతో విజయం సాధించారు. చదవండి: Gautam Gambhir: రోహిత్ శర్మ కారణంగా నిద్రలేని రాత్రులు గడిపాను.. ! -
రష్యా, బెలారస్లను వెలివేయండి: ఐఓసీ
లూసానే: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్‌పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ‘ఇరు దేశాల్లో ఏ టోర్నీ నిర్వహించకుండా రద్దు చేయాలి. అథ్లెట్లు, అధికారులు ఇతర దేశాల్లో జరిగే ఈవెంట్లలో పాల్గొనకుండా నిషేధించాలి’ అని ఐఓసీ తెలిపింది. పోలాండ్ ఫుట్‌బాల్ జట్టు ఇదివరకే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య రష్యా, బెలారస్‌లకు కేటాయించిన బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్ సమాఖ్య ఈ ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌ను రద్దు చేసింది. -
సాత్విక్–చిరాగ్ జంట సంచలనం.. టైటిల్ సొంతం.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
India Open 2022: బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్లో ... అదీ సొంతగడ్డపై భారత షట్లర్లు అద్భుతం చేశారు. ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నమెంట్లో భారత్‌కు రెండు టైటిల్స్ అందించారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టి ద్వయం ప్రపంచ రెండో ర్యాంక్, మూడుసార్లు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచిన మొహమ్మద్ ఎహ్సాన్–హెంద్రా సెతియవాన్ (ఇండోనేసియా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకోగా... పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లో కీన్ యు (సింగపూర్)ను కంగుతినిపించి భారత యువస్టార్ లక్ష్య సేన్ విజేతగా అవతరించాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో ప్రపంచ పదో ర్యాంక్ జంట సాత్విక్–చిరాగ్ శెట్టి 21–16, 26–24తో టాప్ సీడ్ ఎహ్సాన్–సెతియవాన్ జోడీ ని ఓడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టికిది రెండో సూపర్ –500 స్థాయి టైటిల్ కావడం విశేషం. 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో విజేతగా నిలిచిన ఈ జోడీ అదే ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఎహ్సాన్–సెతియవాన్ జంటతో 43 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం కీలకదశలో పట్టు కోల్పోకుండా ఓర్పుతో ఆడింది. తొలి గేమ్‌లో స్కోరు 13–13తో సమంగా ఉన్న దశలో సాత్విక్–చిరాగ్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 18–13తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని నిలబెట్టుకొని తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో రెండు జోడీలు ప్రతి పాయింట్ కోసం తీవ్రంగా పోరాడాయి. చివరకు భారత జోడీనే పైచేయి సాధించింది. విజేతగా నిలిచిన సాత్విక్–చిరాగ్ జోడీకి 31,600 డాలర్లు (రూ. 23 లక్షల 43 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత నెలలో కొత్త ప్రపంచ చాంపియన్‌గా అవతరించిన లో కీన్ యుతో 54 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్ 24–22, 21–17తో గెలుపొంది కెరీర్లో తొలి సూపర్–500 టైటిల్ సాధించాడు. గత నెలలో ప్రపంచ చాంపియన్ షిప్లో కాంస్యం నెగ్గిన 20 ఏళ్ల లక్ష్య సేన్ ఫైనల్లో ఆద్యంతం నిలకడగా ఆడాడు. తొలి గేమ్‌లో 19–20, 21–22 వద్ద రెండుసార్లు గేమ్ పాయింట్లను కాచుకొని గట్టెక్కిన లక్ష్య సేన్ రెండో గేమ్‌లో మాత్రం లో కీన్ యుపై పూర్తి ఆధిపత్యం చలాయించాడు. విజేతగా నిలిచిన లక్ష సేన్‌కు 30 వేల డాలర్లు (రూ. 22 లక్షల 24 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత స్టార్ పీవీ సింధు 14–21, 21–13, 10–21 తో సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. చదవండి: IPL 2022: ధోని ‘గుడ్ బై’.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!? How Lakshya Sen won his first World Tour 500 title on his debut at the India Open 🥇 (via @bwfmedia) pic.twitter.com/02od3Arg73 — ESPN India (@ESPNIndia) January 16, 2022 -
సింధుకు నిరాశ
బాలి (ఇండోనేసియా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇండో నేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ లో ప్రపంచ చాంపియన్ సింధు కథ సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 26 ఏళ్ల సింధు 21–15, 9–21, 14–21తో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌ను దక్కించుకున్నా ఆ తర్వాత తడబడి మూల్యం చెల్లించుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెల్చుకున్నాక సింధు ఆడిన నాలుగు టోర్నీల్లో సెమీఫైనల్ దశను దాటి ముందుకెళ్లలేదు. వరుసగా పదోసారి... మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట కూడా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్–కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ 16–21, 18–21తో ఓటమి పాలైంది. గిడియోన్–కెవిన్ ద్వయం చేతిలో సాత్విక్–చిరాగ్‌లకిది వరుసగా పదో పరాజయం కావడం గమనార్హం. -
సెమీస్‌లో సింధు
బాలి: ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 66 నిమిషాల్లో 14–21, 21–19, 21–14తో సిమ్ యుజిన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 12–21, 8–21తో అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–19, 21–19తో గో జె ఫె–నూరూజుద్దీన్ (మలేసియా) జంటపై నెగ్గి సెమీఫైనల్‌కు చేరింది. వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీకి సిక్కి–అశ్విని జంట అర్హత బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు భారత మహిళల డబుల్స్ జంట సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) అర్హత సాధించింది. తద్వారా ఈ మెగా టోర్నీ చరిత్రలో బరిలోకి దిగనున్న తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా సిక్కి–అశ్విని గుర్తింపు పొందింది. డిసెంబర్ 1 నుంచి 5 వరకు బాలిలో జరిగే ఈ టోర్నీకి మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా అర్హత సాధించడం దాదాపుగా ఖాయమైంది. -
Indonesia Masters Super-750: సింధు, శ్రీకాంత్ ఓటమి
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లో ఓడిపోయారు. ప్రపంచ మూడో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ సింధు కేవలం 32 నిమిషాల్లో 13–21, 9–21తో ఓటమి చవిచూసింది. యామగుచి చేతిలో సింధు ఓడటం ఇది ఎనిమిదోసారి కావడం గమనార్హం. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత సింధు ఆడిన మూడో టోర్నీలోనూ సెమీఫైనల్ దశ దాటలేదు. మరోవైపు ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 41 నిమిషాలపాటు జరిగిన జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్ శ్రీకాంత్ 14–21, 9–21తో పరాజయం పాలయ్యాడు. సెమీస్‌లో ఓడిన సింధు, శ్రీకాంత్‌లకు 8,400 డాలర్ల (రూ. 6 లక్షల 23 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
సెమీస్‌లో సింధు
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 21–13, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో టాప్ సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సింధు తలపడుతుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్‌కే చెందిన శ్రీకాంత్ కూడా సెమీఫైనల్ చేరాడు. శ్రీకాంత్ 21–7, 21–18తో సహచరుడు ప్రణయ్‌ను ఓడించాడు. -
క్వార్టర్స్‌లో సింధు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–9తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలి గేమ్‌లో 0–5తో వెనుకబడిన సింధు అనంతరం తేరుకొని ఆ గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ (భారత్) 21–17, 21–13తో లో కీన్ య్యూ (సింగపూర్)పై నెగ్గాడు. హిరెన్ రుస్తావిటో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్ నుంచి సమీర్ వర్మ (భారత్) గాయంతో మధ్యలోనే వైదొలిగాడు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో భారత ద్వయం అశ్విని పొన్నప్ప–సాత్విక సాయిరాజ్ 21–15, 17–21, 19–21తో రెండో సీడ్ మెలాటి ఒక్తవియాంటి–ప్రవీణ్ జొర్డాన్ (ఇండోనేసియా) జంట చేతిలో పోరాడి ఓడింది. -
సింధు శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేయగా... మాజీ నంబర్‌వన్ సైనా నెహ్వాల్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగింది. పురుషుల సింగిల్స్‌లో సౌరభ్ వర్మ, లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్, ప్రణయ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 21–18తో జూలీ దవాల్ జాకబ్సన్ (డెన్మార్క్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. సయాకా తకహాషి (జపాన్)తో మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌ను 11–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 2–9తో వెనుకబడిన దశలో గాయంతో వైదొలిగింది. ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటో (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 22–20, 19–21తో పోరాడి ఓడిపోయాడు. మొమోటో చేతిలో శ్రీకాంత్‌కిది 14వ పరాజయం కావడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ 17–21, 21–17, 11–21తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్) చేతిలో... ప్రణయ్ 11–21, 14–21తో చౌ తియెన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయారు. లక్ష్య సేన్ 21–10, 21–16తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై, సౌరభ్ వర్మ 22–20, 21–19తో వైగోర్ కొహెలో (బ్రెజిల్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–19, 21–15తో మథియాస్ థైరి–మై సురో (డెన్మార్క్) జోడీపై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో టాప్ సీడ్ లీ సోహీ–షిన్ సెయుంగ్‌చన్ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 21–17, 21–13తో లీ హుయ్–యాంగ్ సువాన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించింది. -
సింధు శుభారంభం
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు (భారత్) 21–12, 21–10తో నెస్లిహాన్ యిగిట్ (టర్కీ)పై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–14, 21–11తో భారత్‌కే చెందిన సాయిప్రణీత్‌పై నెగ్గగా... సమీర్ వర్మ 21–17, 21–14తో కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–ధ్రువ్ ద్వయం 14–21, 21–17, 21–18తో ప్రపంచ 25వ ర్యాంక్ జోడీ హూ పాంగ్ రోన్–చె యి సీ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 23–21, 21–15తో హెమింగ్ –స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్)లపై, అర్జున్–ధ్రువ్ 21–19, 21–15తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్)లపై నెగ్గగా... సుమీత్ రెడ్డి–మనూ అత్రి 18–21, 11–21తో గోసెఫె –నూరు జుద్దీన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. -
రన్నరప్ తరుణ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సైప్రస్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ ప్లేయర్ కాటం తరుణ్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. నికోసియాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 20 ఏళ్ల తరుణ్ రెడ్డి 20–22, 21–9, 11–21తో నాలుగో సీడ్ దిమిత్రీ పనారిన్ (కజకిస్తాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. అంతకుముందు తొలి రౌండ్లో అన్‌సీడెడ్ తరుణ్ రెడ్డి 21–17, 21–10తో ఎనిమిదో సీడ్ ఒస్వాల్డ్ ఫంగ్ (ఇంగ్లండ్)పై, సెమీఫైనల్లో 21–14, 21–15తో రెండో సీడ్ జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై సంచలన విజయాలు సాధించాడు. -
Sudirman Cup: విజయంతో ముగింపు
వాంటా (ఫిన్లాండ్): సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను భారత జట్టు విజయంతో ముగించింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0తో ఫిన్లాండ్ను ఓడించింది. థాయ్‌లాండ్, చైనాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఫిన్లాండ్తో మ్యాచ్ లో భారత ఆటగాళ్లు పైచేయి సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 16–21, 21–14, 21–11తో కాలీ కొల్జోనన్‌ను ఓడించాడు. మిక్స్డ్ డబుల్స్ లో అశ్విని–అర్జున్; పురుషుల డబుల్స్‌లో అర్జున్–ధ్రువ్ కపిల; మహిళల డబుల్స్‌లో తనీషా–రితూపర్ణ జోడీలు, మహిళల సింగిల్స్‌లో మాళవిక విజయాలు నమోదు చేశారు. -
Sudirman Cup: చైనా చేతిలో ఓటమి.. లీగ్ దశలోనే అవుట్
వాంటా (ఫిన్లాండ్): వరుసగా రెండో పరాజయంతో సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ నుంచి భారత్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. క్వార్టర్ ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ చైనాపై కచ్చితంగా గెలవాల్సిన భారత జట్టు 0–5తో దారుణంగా ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌మ్యాచ్‌లో అర్జున్ –ధ్రువ్ కపిల జంట 20–22, 17–21తో లియు చెంగ్–జౌ హావో డాంగ్ జోడీ చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో అదితి భట్ 9–21, 8–21తో చెన్ యు ఫె చేతిలో... పురుషుల సింగిల్స్‌లో 15వ ర్యాంకర్ సాయి ప్రణీత్ 10–21, 10–21తో షి యుకీ చేతిలో... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 16–21, 13–21తో జెంగ్ యు–లి వెన్ మె చేతిలో... మిక్స్డ్ డబుల్స్‌లో కిడాంబి శ్రీకాంత్–రితూపర్ణ 9–21, 9–21తో డు యు–ఫెంగ్ యాన్ జె చేతిలో ఓడిపోయారు. చదవండి: Formula 1: హామిల్టన్ ‘విక్టరీల సెంచరీ’.... -
భారత జట్లకు సులువైన డ్రా
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్ టోర్నీ థామస్, ఉబెర్ కప్‌లలో భారత జట్లకు సులువైన డ్రా ఎదురైంది. డెన్మార్క్‌లోని అర్హస్‌లో అక్టోబర్ 9 నుంచి 17 వరకు ఈ టోర్నీలు జరుగనున్నాయి. పురుషుల టోర్నీ థామస్ కప్‌లో భారత జట్టు గ్రూప్‘సి’లో డిఫెండింగ్ చైనా, నెదర్లాండ్స్, తాహిటిలతో తలపడనుంది. ఈ గ్రూప్‌లో చైనా మింగుడుపడని ప్రత్యర్థి అయినప్పటికీ మిగతా జట్టు నెదర్లాండ్, తాహిటిలపై గెలవడం ద్వారా నాకౌట్‌కు అర్హత సంపాదించవచ్చు. మహిళల టోర్నీ ఉబెర్ కప్‌లో భారత్ గ్రూప్ ‘బి’లో ఉంది. థాయ్‌లాండ్, స్పెయిన్, స్కాట్లాండ్ ప్రత్యర్థులు కాగా, ఇందులో ముందంజ వేయడం అంత కష్టమైన పనే కాదు. ఉబెర్ కప్‌లో భారత మహిళల జట్టు 2014, 2016లో సెమీస్ చేరింది. గతేడాది మేలో జరగాల్సిన ఈ టోర్నీ కరోనాతో వాయిదా పడింది. -
టైటిల్ పోరుకు విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ జంట
పారిస్: తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ ఓర్లియాన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గారగ కృష్ణప్రసాద్ జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ గౌడ్–కృష్ణప్రసాద్ ద్వయం 21–17, 21–17తో కాలమ్ హెమ్మింగ్–స్టీవెన్ స్టాల్‌వుడ్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో బెన్ లేన్–సీన్ క్యాండీ (ఇంగ్లండ్) జంటతో విష్ణువర్ధన్–కృష్ణప్రసాద్ ద్వయం ఆడుతుంది. మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. సెమీఫైనల్లో సైనా 17–21, 17–21తో లైన్ క్రిస్టోఫర్సన్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 18–21, 9–21తో టాప్ సీడ్ జాంగ్‌కోల్ఫాన్–రవింద ప్రజోగ్‌జాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో అశ్విని పొన్నప్ప–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 9–21, 23–21, 7–21తో నోర్ నిక్లాస్–అమేలియా (డెన్మార్క్) జోడి చేతిలో పరాజయం పాలైంది. -
ఓర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ: క్వార్టర్స్‌లో సైనా
పారిస్: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన 65వ సీడ్ మేరీ బాటోమెన్ను 18-21, 21-15, 21-10తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 51 నిమిషాల పాటు సాగిన గేమ్‌లో సైనా అద్భుత ప్రదర్శన చేసి,తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. నాలుగోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా.. ర్యాంకింగ్ పాయింట్లు దక్కించుకొని ఒలింపిక్ రేసులో నిలవాలని భావిస్తుంది. కాగా, గాయం కారణంగా గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ నుంచి వైదొలిగిన సైనా.. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన యాయెల్ హోయాక్స్ లేదా మలేషియాకు చెందిన ఐరిస్ వాంగ్‌తో తలపడనుంది. ఇదే టోర్నీలో మరో భారత షట్లర్ ఇరా శర్మ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఐరా.. బల్గేరియాకు చెందిన మరియా మిట్సోవాను 21-18, 21-13 తో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ గేమ్‌లో ఐరా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇరా తన తదుపరి గేమ్‌లో డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫెర్సన్‌తో పోటీపడే అవకాశం ఉంది. కాగా, బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలు అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట.. డెన్మార్క్ జంట అమాలీ మాగెలుండ్, ఫ్రీజా రావ్న్పై 21-9, 17-21, 21-19తో విజయం సాధించారు. -
సెమీస్‌లో సింధు
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం 75 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 21–16, 21–19తో అకానె యామగుచి (జపాన్)పై విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో చోచువోంగ్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడుతుంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ (భారత్) 17–21, 21–16, 17–21తో మార్క్ కాలివు (నెదర్లాండ్స్) చేతిలో... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) 22–24, 12–21తో సెలానీ–చెరిల్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. -
క్వార్టర్స్‌లో సింధు, సైనా నిష్క్రమణ
బర్మింగ్‌హామ్: 20 ఏళ్లుగా భారత షట్లర్లను అందని ద్రాక్షలా ఊరిస్తోన్న ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న పీవీ సింధు ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఈ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–8, 21–8తో క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)పై సునాయస విజయాన్ని నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చిన సింధు... ప్రత్యర్థిని ఏ దశలోనూ పుంజుకోనివ్వకుండా వరుస గేముల్లో మ్యాచ్‌ను ముగించేసింది. అయితే మరో టాప్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో సైనా గాయంతో మధ్యలోనే వైదొలిగింది. మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)తో జరిగిన ఈ పోరులో సైనా 8–21, 4–10తో వెనుకబడి ఉన్న తరుణంలో తప్పుకుంది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్ 21–18, 21–17తో థామస్ రౌక్సెల్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. అయితే ఇతర భారత షట్లర్లు భమిడిపాటి సాయిప్రణీత్, హెచ్ఎస్ ప్రణయ్‌లకు మాత్రం ప్రిక్వార్టర్స్‌లో నిరాశే ఎదురైంది. సాయిప్రణీత్ 21–15, 12–21, 12–21తో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) చేతిలో... ప్రణయ్ 15–21, 14–21తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 21–17, 21–10తో గాబ్రియెల్ స్టోయేవా– స్టెఫాని స్టోయేవా (బల్గేరియా) జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్ పోరుల్లో సాత్విక్ సాయిరాజ్– అశ్విని పొన్నప్ప (భారత్) జోడీ 19–21, 9–21తో యుకీ కనెకొ– మిసాకి మత్సుటోటోమో (జపాన్) ద్వయం చేతిలో, ప్రణవ్ చోప్రా–సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 15–21, 17–21తో రాస్మస్ స్పెర్సెన్–క్రిస్టిన్ బుష్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడి ఇంటిదారి పట్టాయి. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 16–21, 21–11, 17–21తో కిమ్ అస్త్రుప్–ఆండ్రెస్ స్కరుప్ రస్ముస్సెన్ (డెన్మార్క్) జంట చేతిలో ఓడింది. మరో వైపు టోర్నీ నుంచి ఇండోనేసియా జట్టు తప్పుకుంది. ఆ జట్టు ప్రయాణించిన విమానంలోనే ఉన్న ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో... టీమ్‌ను 10 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలంటూ టోర్నీ నిర్వాహకులు ఆదేశించారు. -
రన్నరప్ సింధు
బాసెల్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 12–21, 5–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. కేవలం 35 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో మారిన్‌కు కాస్త పోటీనిచ్చిన సింధు రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. రన్నరప్‌గా నిలిచిన సింధుకు 5,320 డాలర్ల (రూ. 3 లక్షల 89 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సింధు ముందంజ
బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–16, 21–19తో నెస్లిహాన్ యిజిట్ (టర్కీ)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిడాంబి శ్రీకాంత్ 18–21, 21–18, 21–11తో సమీర్ వర్మ (భారత్)పై, సౌరభ్ వర్మ 21–19, 21–18తో కిర్చ్మెర్ (స్విట్జర్లాండ్)పై, అజయ్ జయరామ్ 21–12, 21–13తో థమాసిన్ (థాయ్‌లాండ్)పై నెగ్గారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 21–18, 19–21, 21–16తో క్రిస్టోఫర్–మాథ్యూ గ్రిమ్లె (స్కాట్లాండ్)లపై... మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–5, 21–19తో అనాబెల్లా –స్టిన్ కుస్పెర్ట్ (జర్మనీ)లపై గెలిచారు. -
విజయంతో ముగింపు
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధుకు ఊరట విజయం లభించింది. వరుసగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయిన ఈ స్టార్ షట్లర్... శుక్రవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో 21–18, 21–15తో ప్రపంచ 13వ ర్యాంకర్ పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. శుక్రవారంతో లీగ్ మ్యాచ్‌లన్నీ పూర్తయ్యాయి. గ్రూప్ ‘బి’లో రెండేసి విజయాలు సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచిన పోర్న్‌పవీ, ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్), సింధు ఒక్కో విజయం సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించారు. ఓవరాల్‌గా పాయింట్ల ఆధారంగా గ్రూప్ ‘బి’లో రచనోక్ మూడో స్థానంలో, సింధు చివరిదైన నాలుగో స్థానంలో నిలిచారు. గ్రూప్ ‘ఎ’ నుంచి యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), కరోలినా మారిన్ (స్పెయిన్) సెమీఫైనల్ చేరుకున్నారు. పోర్న్‌పవీతో గతంలో నాలుగుసార్లు ఆడి మూడుసార్లు నెగ్గిన సింధుకు ఈసారీ అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో కీలకదశలో పాయింట్లు నెగ్గిన సింధు రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. ‘ఈ టోర్నీలో నాకు మంచి ముగింపు లభించింది. తై జు యింగ్ చేతిలో ఓడిపోవడంతో నా సెమీఫైనల్ అవకాశాలు దెబ్బతిన్నాయి. గత మ్యాచ్‌ల ఫలితాలతో గుణపాఠాలు నేర్చుకొని ప్రతి రోజును కొత్తగా మొదలుపెట్టాలి. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కోర్టులో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటా. మళ్లీ తాజాగా కోర్టులో అడుగుపెడతా’ అని సింధు వ్యాఖ్యానించింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్‌కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్)తో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 21–12, 18–21, 19–21తో పోరాడి ఓడిపోయాడు. గ్రూప్ ‘బి’ నుంచి జు వె వాంగ్ (చైనీస్ తైపీ), ఆంటోన్సెన్ (డెన్మార్క్) సెమీఫైనల్ చేరుకోగా... అంగుస్ మూడో స్థానంలో, శ్రీకాంత్ నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గ్రూప్ ‘ఎ’ నుంచి అక్సెల్సన్ (డెన్మార్క్), తియెన్ చెన్ చౌ (చైనీస్ తైపీ) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. -
మళ్లీ ఓడిన సింధు, శ్రీకాంత్
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్లు పూసర్ల వెంకట సింధు, కిడాంబి శ్రీకాంత్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నిరాశ పరిచారు. సీజన్‌కు సంబంధించిన ఈ ముగింపు టోర్నీలో లీగ్ దశతోనే సరిపెట్టుకున్నారు. ప్రపంచ చాంపియన్ సింధు, మాజీ ప్రపంచ నంబర్‌వన్ శ్రీకాంత్ వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో వీరిద్దరు సెమీస్ చేరుకునే అవకాశాలు గల్లంతయ్యాయి. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో గురువారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో తెలుగమ్మాయి సింధు 18–21, 13–21తో మాజీ ప్రపంచ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. గత వారం ఇదే ప్రత్యర్థి చేతిలో థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఓడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు ఈ మ్యాచ్‌లోనూ తన ఆటతీరును, ఫలితాన్ని మార్చుకోలేకపోయింది. ప్రపంచ చాంపియన్‌పై మూడో సీడ్ రచనోక్‌కు ఇది ఆరో విజయం. వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పటివరకు పది సార్లు తలపడితే సింధు 4 సార్లు మాత్రమే గెలిచింది. తొలి గేమ్‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభంలో అయితే సింధు దూకుడుగా ఆడటంతో 4–2తో మొదలైన ఆమె ఆధిక్యం 14–11 దాకా కొనసాగింది. ఈ దశలో రచనోక్ వరుసగా మూడు పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. క్రమంగా సింధుపై తన ఆధిపత్యం చలాయిస్తూ 21–18తో గేమ్ నెగ్గింది. తర్వాత రెండో గేమ్‌లో సింధు పట్టు కోల్పోయింది. ఇదే అదనుగా రచనోక్ 9–8 స్కోరు వద్ద వరుసగా మూడు పాయింట్లు గెలుచుకుంది. వెంటనే సింధు కూడా మూడు పాయింట్లు చేసినప్పటికీ తర్వాత థాయ్‌లాండ్ స్టార్... సింధుకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా చెలరేగి ఆడింది. దీంతో ఈ గేమ్, మ్యాచ్ గెలిచేందుకు ఆమెకు ఎంతోసేపు పట్టలేదు. 43 నిమిషాల్లో ఈ మ్యాచ్ ముగిసింది. పరాజయంపై సింధు మాట్లాడుతూ ‘ఈ రోజు నాది కాదు. నాకేం కలిసిరాలేదు. తొలి గేమ్ ఓడిపోవడం... తర్వాత నేను వెనుకబడటంతో మ్యాచ్‌లో నిరాశ తప్పలేదు’ అని పేర్కొంది. పురుషుల ఈవెంట్ గ్రూప్ ‘బి’లో భారత స్టార్ శ్రీకాంత్ 21–19, 9–21, 19–21తో నాలుగో సీడ్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి ఓడాడు. వాంగ్ జుపై శ్రీకాంత్‌కు 3–0తో మంచి రికార్డే ఉంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్ తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. కానీ రెండో గేమ్‌ను చిత్తుగా కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో మళ్లీ పోరాటం చేసినప్పటికీ వాంగ్ జు ఆ అవకాశం ఇవ్వలేదు. గంటా 18 నిమిషాల పాటు సాగిన సుదీర్ఘ పోరులో శ్రీకాంత్‌కు పరాజయం తప్పలేదు. నేటి నామ మాత్రమైన మ్యాచ్‌లో సింధు... పోర్న్‌పవి (థాయ్‌లాండ్)తో, శ్రీకాంత్... క లంగ్ అంగుస్ (హాంకాంగ్)తో తలపడతారు. -
ఓటమితో మొదలు...
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లకు శుభారంభం లభించలేదు. బుధవారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో మహిళల, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ఇద్దరికీ ఓటమి ఎదురైంది. మహిళల సింగిల్స్ గ్రూప్ ‘బి’లో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్, ప్రస్తుత వరల్డ్ చాంపియన్ సింధు 21–19, 12–21, 17–21తో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 21–15, 16–21, 18–21తో 77 నిమిషాల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశాడు. తై జు యింగ్ చేతిలో సింధుకిది 13వ ఓటమికాగా... ఆంటోన్సెన్ చేతిలో శ్రీకాంత్‌కు రెండో పరాజయం. నేడు జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ మాజీ చాంపియన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)తో సింధు... వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ ఆడతారు. సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌ల్లో సింధు, శ్రీకాంత్ గెలవాల్సి ఉంటుంది. తై జు యింగ్‌తో జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్ లో గెలిచినా ఆ తర్వాత అదే జోరు కనబర్చలేకపోయింది. రెండో గేమ్‌లో వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి 0–5 తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలో ఇద్దరు ప్రతి పాయింట్ కోసం పోరాడటంతో ఆట హోరాహోరీగా సాగింది. ఒకదశలో సింధు 13–14తో తై జు యింగ్ ఆధిక్యాన్ని ఒక పాయింట్‌కు తగ్గించింది. ఈ దశలోనే తై జు వరుసగా మూడు పాయింట్లు సాధించి 17–13తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న తై జు యింగ్ విజయాన్ని ఖాయం చేసుకుంది. ‘మ్యాచ్ బాగా జరిగింది. ఏ పాయింట్ కూడా సులువుగా రాలేదు. మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య పాయింట్ల అంతరం ఒక పాయింట్‌కు చేరుకుంది కూడా. అయితే ర్యాలీల సందర్భంగా రెండుసార్లు నా రాకెట్ స్ట్రింగ్స్ దెబ్బతినడం తుది ఫలితంపై ప్రభావం చూపింది’ అని సింధు వ్యాఖ్యానించింది. ఆంటోన్సెన్తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ కీలకదశలో తప్పిదాలు చేశాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 17–16తో ఆధిక్యంలోకి వెళ్లిన శ్రీకాంత్ ఈ దశలో వరుసగా నాలుగు పాయింట్లు సమర్పించుకొని తేరుకోలేకపోయాడు. -
వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు శ్రీకాంత్, సింధు అర్హత
బ్యాంకాక్: ప్రతిష్టాత్మక వరల్డ్ టూర్ ఫైనల్స్ సీజన్ ముగింపు బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు భారత స్టార్ షట్లర్లు, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ అర్హత సాధించారు. బ్యాంకాక్ వేదికగా ఈనెల 27 నుంచి 31 వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. కరోనా కారణంగా గతేడాది ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీలు నిలిచిపోయాయి. రెండు వారాల క్రితం థాయ్‌లాండ్ ఓపెన్ రెండు సూపర్–1000 టోర్నీలతో అంతర్జాతీయ సీజన్ పునః ప్రారంభమైంది. ఈ రెండు టోర్నీల్లో భాగంగా రెండోది ఆదివారం ముగిసింది. అనంతరం వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన క్రీడాకారుల వివరాలను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. భారత్ తరఫున మహిళల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ అర్హత పొందారు. థాయ్‌లాండ్ ఓపెన్ రెండు టోర్నీల్లో బరిలోకి దిగిన ఆటగాళ్లనే వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు పరిగణిస్తామని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. ఈ టోర్నీలకు బయలుదేరేముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో జపాన్, చైనా ఆటగాళ్లకు పాజిటివ్ రావడంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి వైదొలిగారు. దాంతో ఈ రెండు దేశాల ఆటగాళ్లు వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఆడే అవకాశం కోల్పోయారు. వరల్డ్ టూర్ ఫైనల్స్ ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉన్నవారే ఈ టోర్నీలో ఆడతారు. అయితే ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ ర్యాంకింగ్స్‌లో సింధు 11వ ర్యాంక్‌లో నిలిచింది. టాప్–8లో ముగ్గురు థాయ్‌లాండ్ క్రీడాకారిణులు ఉండటం, జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహారా కూడా గైర్హాజరు కావడం పీవీ సింధుకు కలిసొచ్చింది. దాంతో ఎనిమిదో ర్యాంకర్‌గా సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏడో ర్యాంకర్‌గా అర్హత పొందాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందిన ఆటగాళ్లందరికీ సోమవారం మళ్లీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్ట్ నెగెటివ్ వస్తేనే టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తారు. మంగళవారం ‘డ్రా’ వివరాలు వెల్లడిస్తారు. అర్హత పొందిన క్రీడాకారులు... మహిళల సింగిల్స్: కరోలినా మారిన్ (స్పెయిన్), తై జు యింగ్ (చైనీస్ తైపీ), రచనోక్, పోర్న్‌పవీ (థాయ్‌లాండ్), యాన్ సె యంగ్ (దక్షిణ కొరియా), మిచెల్లి లీ (కెనడా), ఎవగెనియా కొసెత్‌స్కాయ (రష్యా), సింధు (భారత్). పురుషుల సింగిల్స్: అక్సెల్సన్, ఆంటోన్సెన్ (డెన్మార్క్), చౌ తియెన్ చెన్, వాంగ్ జు వె (చైనీస్ తైపీ), ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్), శ్రీకాంత్ (భారత్), లీ జి జియా (మలేసియా), ఆంథోనీ జిన్‌టింగ్ (ఇండోనేసియా) -
సరిపోని పోరాటం
బ్యాంకాక్: సరైన సన్నాహాలు లేకుండానే థాయ్‌లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బరిలోకి దిగిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాత్విక్, కర్ణాటక క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ద్వయం 20–22, 21–18, 12–21తో ప్రపంచ మూడో ర్యాంక్ జంట, టాప్ సీడ్ దెచాపోల్ పువరన్‌క్రో–సప్సిరి తెరాతనచయ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు గేమ్‌లు హోరాహోరీగా సాగాయి. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో థాయ్‌లాండ్ జంట పైచేయి సాధించి విజయాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 18–21, 18–21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ జంట ఆరోన్ చియా–సో వుయ్ యిక్ (మలేసియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. ‘మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తొలి రెండు గేమ్‌ల్లో అద్భుతంగా ఆడాం. మా కెరీర్లో ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో ఇదొకటి. పూర్తిస్థాయిలో సన్నాహాలు లేకున్నా ఎలాగైనా ఆడాలనే లక్ష్యంతో ఇక్కడికి వచ్చాం. మా వంతుగా అత్యుత్తమ ఆటతీరు కనబరిచాం. కీలకదశలో చేసిన తప్పిదాలు ఫలితాన్ని శాసించాయి’ అని సాత్విక్–అశ్విని జంట తెలిపింది. గతేడాది కరోనా కారణంగా సాత్విక్, అశ్విని వేర్వేరు చోట ఉన్నారు. కలిసి ప్రాక్టీస్ చేసే వీలు లేకుండా పోయింది. సెమీఫైనల్లో ఓడిన సాత్విక్–చిరాగ్, సాత్విక్–అశ్విని జోడీలకు 14 వేల డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
సూపర్ సాత్విక్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత డబుల్స్ స్టార్, ఆంధ్రప్రదేశ్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ మెరిశాడు. అశ్విని పొన్నప్పతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో... చిరాగ్ శెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని ద్వయం 18–21, 22–20, 24–22తో ప్రపంచ ఏడో ర్యాంక్, ఐదో సీడ్ జోడీ చాన్ పెంగ్ సూన్–గో లియు యింగ్ (మలేసియా)పై సంచలన విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో గేమ్‌లో సాత్విక్ జంట ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీ 21–18, 24–22తో ఒంగ్ యెవ్ సిన్–తియోఈ యి (మలేసియా) జంటపై గెలిచింది. మహిళల, పురుషుల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 13–21, 9–21తో ప్రపంచ మాజీ చాంపియన్, నాలుగో సీడ్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ సింధు తన ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో 81 నిమిషాలపాటు హోరాహోరీ పోరులో సమీర్ వర్మ 13–21, 21–19, 20–22తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో సమీర్ 20–19తో విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే పట్టువదలని ఆంటోన్సెన్ వరుస గా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. -
ప్రణయ్ సంచలనం
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 28వ ర్యాంకర్ ప్రణయ్ 75 నిమిషాల్లో 18–21, 21–16, 23–21తో ఆసియా క్రీడల చాంపియన్, ప్రపంచ ఏడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రణయ్ నిర్ణాయక మూడో గేమ్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకొని గెలుపొందడం విశేషం. మరోవైపు కిడాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్ టోర్నీ నుంచి వైదొలిగారు. సాయిప్రణీత్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అతను బుధవారం ఆడాల్సిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తన ప్రత్యర్థి డారెన్ లీకి వాకోవర్ ఇచ్చాడు. సాయిప్రణీత్‌తో కలిసి హోటల్ గదిలో ఉన్నందుకు శ్రీకాంత్ కూడా టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–సిక్కి రెడ్డి (భారత్) 14–21, 21–18, 13–21తో హూ పాంగ్ రోన్–చెయి యి సీ (మలేసియా) చేతిలో... మహిళల డబుల్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి 11–21, 19–21తో లిండా ఎఫ్లెర్–ఇసాబెల్ (జర్మనీ) చేతిలో ఓడిపోయారు. -
సారథులుగా శ్రీకాంత్, సింధు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక థామస్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనే 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. పురుషుల జట్టును ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ నడిపించనున్నాడు. డెన్మార్క్‌లోని అర్హస్ వేదికగా అక్టోబర్ 3నుంచి 11వరకు జరుగనున్న ఈ టోర్నీలో కశ్యప్, లక్ష్యసేన్, శుభాంకర్, సిరిల్ వర్మ, మను అత్రి, సుమీత్ రెడ్డి, అర్జున్, ధ్రువ్ కపిల, కృష్ణ ప్రసాద్ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. మోకాలి గాయం కారణంగా ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ప్రపంచ చాంపియన్ పీవీ సింధుతో పాటు సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డిలతో పాటు మాల్విక బన్సోద్, ఆకర్షి కశ్యప్, పూజ, సంజన సంతోష్, పూర్వీషా రామ్, జక్కంపూడి మేఘన జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో సన్నాహక శిబిరాన్ని ఏర్పాటు చేసి జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మేరకు సెప్టెంబర్ 3–27 వరకు శిబిరం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో అకాడమీలోనే ఉంటూ ప్రాక్టీస్ చేసేందుకు కొందరు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. పైగా క్యాంప్ ప్రారంభానికి ముందు నిబంధనల ప్రకారం వారం రోజుల క్వారంటీన్ తప్పనిసరి కావడంతో అంత సమయం లేదని భావించిన ‘బాయ్’ మొత్తం శిబిరాన్నే రద్దు చేసింది. థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ అనంతరం జరుగనున్న డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 13–18), డెన్మార్క్ మాస్టర్స్ (అక్టోబర్ 20–25) టోర్నీల్లోనూ శ్రీకాంత్, లక్ష్యసేన్, సింధు, సైనా, అశ్విని, సిక్కిరెడ్డి ఆడనున్నారు. -
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ రద్దు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా సవరించిన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక క్యాలెండర్లో భారత్‌లో జరగాల్సిన ఇండియా ఓపెన్ సూపర్–500 టోర్నీ, సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్–300 టోర్నీలకు స్థానం లేకుండా పోయింది. ఈ ఏడాదికి ఈ రెండు టోర్నీలను రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. పాత షెడ్యూల్ ప్రకారం ఇండియా ఓపెన్ మార్చిలో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా ఈ టోర్నీని డిసెంబర్‌కు వాయిదా వేశారు. సయ్యద్ మోదీ ఓపెన్‌ను నవంబర్‌లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ తాజాగా సవరించిన క్యాలెండర్లో ఈ రెండు టోర్నీలను తొలగించారు. అయితే అక్టోబర్ 3 నుంచి 11 వరకు డెన్మార్క్‌లో జరగాల్సిన థామస్ కప్, ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను యధావిధిగా నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. -
హైదరాబాద్ ఓపెన్‌తో బీడబ్ల్యూఎఫ్ సీజన్ పునః ప్రారంభం
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూలకు పడిన టోర్నమెంట్లను నిర్వహించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సిద్ధమైంది. ఈ మేరకు పలు టోర్నీల సవరించిన షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్ ఓపెన్‌తో మళ్లీ బ్యాడ్మింటన్ సందడి మొదలు కానుంది. హైదరాబాద్ ఓపెన్ కాకుండా... సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ (నవంబర్ 17–22), ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (డిసెంబర్ 8–13) కూడా భారత్‌లో జరుగనున్నాయి. నిజానికి ఇండియా ఓపెన్ మార్చి 24–29 వరకు జరగాల్సి ఉండగా కరోనా ధాటికి వాయిదా పడింది. సవరించిన క్యాలెండర్ ప్రకారం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ స్థాయి టోర్నీలు తైపీ ఓపెన్ సూపర్ 300 (సెప్టెంబర్ 1–6)తో ప్రారంభం కాను న్నాయి. అనంతరం డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 3–11) జరుగనుంది. వీటితో పాటు 8 ప్రముఖ అంతర్జాతీయ టోర్నీలను రీషెడ్యూల్ చేశారు. అయితే బీడబ్ల్యూఎఫ్ సవరించిన షెడ్యూల్‌పై భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల కాలంలో ఏకంగా 22 అంతర్జాతీయ టోర్నీలు ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆటగాళ్లు ఇంకా ప్రాక్టీసే ప్రారంభించలేదని... ప్రాక్టీస్ మొదలుపెట్టాక మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని సాయిప్రణీత్ అన్నాడు. -
జూలై వరకు బ్యాడ్మింటన్ టోర్నీల్లేవు: బీడబ్ల్యూఎఫ్
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉత్పాతం కొనసాగుతుండటంతో... జూలై వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. టోర్నీ ఆతిథ్య సంఘాలతో, ఆయా దేశాల సమాఖ్యలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. రద్దయిన టోర్నీల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), థాయ్‌లాండ్ ఓపెన్ (జూన్ 9–14), ఇండోనేసియా ఓపెన్ (జూన్ 16–21), రష్యా ఓపెన్ (జూలై 7–12) ఉన్నాయి. షూటింగ్ వరల్డ్‌కప్‌లు కూడా... మరోవైపు మే నెలలో భారత్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను... మ్యూనిచ్, బాకు నగరాల్లో జూన్‌లో జరగాల్సిన రెండు ప్రపంచకప్ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్లు అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య తెలిపింది. -
ప్రణవ్–కృష్ణ ప్రసాద్ జంట పరాజయం
బార్సిలోనా (స్పెయిన్): బార్సిలోనా స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్ విభాగంలో ప్రణవ్ చోప్రా–గారగ కృష్ణ ప్రసాద్ (భారత్) జంట తొలి రౌండ్లోనే ఓటమి చవిచూసింది. మంగళవారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో ప్రణవ్–కృష్ణ ప్రసాద్ ద్వయం 21–19, 16–21, 7–21తో బెన్ లేన్–సీన్ వెండీ (ఇంగ్లండ్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో డారెన్ లియు (మలేసియా)తో హెచ్ఎస్ ప్రణయ్; వైగోర్ కోల్హో (బ్రెజిల్)తో పారుపల్లి కశ్యప్; క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో అజయ్ జయరామ్; శుభాంకర్ డేతో కిడాంబి శ్రీకాంత్; లుకాస్ క్లియర్‌బౌట్ (ఫ్రాన్స్)తో సమీర్ వర్మ తలపడతారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వైవోని లీ (జర్మనీ)తో సైనా నెహ్వాల్ ఆడుతుంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో మథియాస్ క్రిస్టియాన్సెన్–అలెగ్జాండ్రా బోయె (డెన్మార్క్) జోడీని సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంట ‘ఢీ’కొంటుంది. -
సింధు, సైనా నిష్క్రమణ
కౌలాలంపూర్: బ్యాడ్మింటన్ సీజన్ తొలి టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఆకట్టుకోలేకపోయారు. మలేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్–500 టోర్నమెంట్లో వీరిద్దరి పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ పీవీ సింధు 16–21, 16–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... ప్రపంచ పదో ర్యాంకర్ సైనా 8–21, 7–21తో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యారు. తై జు యింగ్ చేతిలో సింధుకిది 12వ ఓటమికాగా... మారిన్ చేతిలో సైనా ఓడటం ఇది ఏడోసారి. క్వార్టర్స్‌లో ని్రష్కమించిన సింధు, సైనాలకు 2,400 డాలర్ల (రూ. లక్షా 70 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. -
శ్రీకాంత్ శుభారంభం
గ్వాంగ్జు (కొరియా): భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 21–18, 21–17తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై విజయం సాధించాడు. భారత్‌కే చెందిన ‘వర్మ బ్రదర్స్’ సమీర్, సౌరభ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సకాయ్ కజుమసా (జపాన్)తో జరిగిన మ్యాచ్‌లో సమీర్ వర్మ తొలి గేమ్‌లో 11–8తో ఆధిక్యంలో ఉన్న దశలో కజుమసా గాయంతో వైదొలిగాడు. జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ 21–13, 12–21, 13–21తో కిమ్ డాంగ్‌హున్ (కొరియా) చేతిలో ఓడిపోయాడు. -
విజేత రుత్విక శివాని
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో క్వాలిఫయర్ రుత్విక 21–10, 21–17తో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక ఈ టోర్నీలో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాలబారిన పడ్డ రుత్విక ఇటీవలే కోలుకొని పునరాగమనం చేసింది. మహిళల డబుల్స్‌లో బండి సాహితి (తెలంగాణ)–నీల (తమిళనాడు) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో సాహితి–నీల జోడీ 12–21, 17–21తో టాప్ సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా)–అశ్విని భట్ (కర్ణాటక) జంట చేతిలో ఓడిపోయింది. -
సుమీత్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: నేపాల్ ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ సాధించాడు. కఠ్మాండూలో ఆదివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సుమీత్ రెడ్డి–మనూ అత్రి (భారత్) ద్వయం 21–19, 21–15తో భారత్‌కే చెందిన ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌లో కె.మనీషా–రుతుపర్ణ (భారత్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో మనీషా–రుతుపర్ణ జంట 10–21, 21–18, 11–21తో టాప్ సీడ్ సెత్యానా మపాసా–గ్రోన్యా సోమర్‌విలె (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ కాంస్య పతకం గెలిచాడు. సెమీఫైనల్లో సిరిల్ వర్మ 11–21, 16–21తో కావో క్వాంగ్ ఫామ్ (వియత్నాం) చేతిలో పరాజయం పాలయ్యాడు. -
ఫైనల్లో రుత్విక
పుణే: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి గద్దె రుత్విక శివాని ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో రుత్విక శివాని 16–21, 21–14, 21–12తో తెలంగాణకే చెందిన సామియా ఇమాద్ ఫారూఖిపై విజ యం సాధించింది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్ తర్వాత గాయాల బారిన పడిన రుతి్వక ఇటీవలే కోలుకొని మళ్లీ రాకెట్ పట్టింది. ఈ టోర్నీ క్వాలిఫయింగ్‌లో పాల్గొన్న ఆమె విజేతగా నిలిచి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. నేడు జరిగే ఫైనల్లో శ్రుతి ముందాడ (మహారాష్ట్ర)తో రుత్విక తలపడుతుంది. -
కావలిలో రాష్ట్రాస్థాయి ఓపెన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటిలు ఫ్రారంభం
-
రన్నరప్ సిరిల్ వర్మ
మాల్దీవ్స్ చాలెంజర్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ షట్లర్ సిరిల్ వర్మ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో అతను 13–21, 18–21తో భారత్‌కే చెందిన కౌశల్ ధర్మామర్ చేతిలో వరుస గేముల్లో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. డబుల్స్ అన్ని విభాగాల్లో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్లు... చివరి అడ్డంకిని మాత్రం దాటలేకపోయారు. మహిళల డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి జోడి 10–21, 21–17, 12–21 సయక హొబర– నత్సుకి సోనె (జపాన్) జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో అరుణ్ జార్జ్– సన్యం శుక్లా జంట 9–21, 20–22తో కిచిరో ముత్సుయ్– యొషినోరి తకెచి (జపాన్) ద్వయం చేతిలో, మిక్స్డ్ డబుల్స్‌లో సాయి ప్రతీక్ కృష్ణ ప్రసాద్– అశ్విని భట్ జోడీ 11–21, 15–21తో చరోంకితమరోన్– చసినీ కొరెపాప్ (తైవాన్) జంట జోతిలో ఓడి రన్నరప్‌గా నిలిచారు. -
సాయిప్రణీత్ పరాజయం
చాంగ్జూ: చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ కథ ముగిసింది. టోర్నీలో మిగిలిన ఏకైక భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్ శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యాడు. ఇండోనేసియాకు చెందిన ఏడో సీడ్ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్ 16–21, 21–6, 21–16తో సాయిప్రణీత్‌ను ఓడించాడు. నెల రోజుల క్రితం ఇదే జిన్‌టింగ్‌ను వరల్డ్ చాంపియన్‌షిప్‌లో చిత్తు చేసిన ప్రణీత్‌కు ఈసారి ప్రతికూల ఫలితం వచ్చింది. ఆరంభంలో ఆధిక్యం కనబర్చిన ప్రణీత్ తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా... రెండో గేమ్‌లో పూర్తిగా చేతులెత్తేశాడు. మూడో గేమ్‌లో 11–7తో భారత ఆటగాడు ముందంజలో నిలిచి కూడా తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయాడు. -
సింధు ముందుకు... సైనా ఇంటికి
చాంగ్జౌ (చైనా): మరో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్, ప్రపంచ చాంపియన్ పీవీ సింధు చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. అయితే మరో భారత స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఐదో సీడ్ సింధు కేవలం 34 నిమిషాల్లో 21–18, 21–12తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)పై అలవోకగా గెలిచింది. ఎనిమిదో సీడ్ సైనా 10–21, 17–21తో ప్రపంచ 19వ ర్యాంకర్ బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్íÙప్ కాంస్య పతక విజేత సాయిప్రణీత్ 72 నిమిషాల్లో 21–12, 21–23, 21–14తో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)పై శ్రమించి నెగ్గగా... పారుపల్లి కశ్యప్ 21–12, 21–15తో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)పై సునాయాసంగా గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. -
సాత్విక్–అశ్విని జోడీ సంచలనం
చాంగ్జౌ (చైనా): భారత మిక్స్డ్ జోడీ సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప సంచలన ప్రదర్శనతో చైనా ఓపెన్‌లో శుభారంభం చేసింది. ఈ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ 26వ ర్యాంకులో ఉన్న సాత్విక్–అశ్విని ద్వయం... ప్రపంచ ఏడో ర్యాంక్, ఆరో సీడ్ ప్రవీణ్ జోర్డాన్–మెలతి దేవా ఒక్తవియంతి (ఇండోనేసియా) జంటకు షాక్ ఇచి్చంది. మంగళవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ తొలిరౌండ్లో భారత జోడీ 22–20, 17–21, 21–17తో ప్రవీణ్–మెలతి జంటను ఇంటిదారి పట్టించింది. 50 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను చెమటోడ్చి దక్కించుకున్న భారత జంటకు రెండో గేమ్‌లో పరాజయం ఎదురైంది. వెంటనే పుంజుకున్న సాతి్వక్ జంట నిర్ణాయక గేమ్‌ను ఎలాంటి పొరపాటు చేయకుండా దక్కించుకోవడంతో విజయం సాధించింది. గతేడాది ఇండియా ఓపెన్ సహా ఐదు టోరీ్నల్లో ఫైనల్ చేరిన ఇండోనేసియా జోడీ... ఇక్కడ సాతి్వక్–అశ్వినిల జోరుకు తొలిరౌండ్లోనే ని్రష్కమించడం విశేషం. పురుషుల డబుల్స్ తొలిరౌండ్లో చిరాగ్ షెట్టితో జతకట్టిన సాతి్వక్ 21–7, 21–18తో జాసన్ ఆంథోని–నైల్ యకుర (కెనడా) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. నేడు జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో బుసానన్ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్ (థాయ్‌లాండ్)తో ఎనిమిదో సీడ్ సైనా నెహా్వల్; ప్రపంచ మాజీ నంబర్‌వన్ లీ జురుయ్ (చైనా)తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సుపన్యు అవింగ్‌సనోన్ (థాయ్‌లాండ్)తో సాయిప్రణీత్; బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో పారుపల్లి కశ్యప్ తలపడతారు. -
వియత్నాం ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
హో చి మిన్ సిటీ: అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్న భారత షట్లర్ సౌరభ్ వర్మ ఈ ఏడాది తన ఖాతాలో మూడో టైటిల్‌ను జమ చేసుకున్నాడు. వియత్నాం ఓపెన్ వరల్డ్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో తొలి రౌండ్ నుంచి సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఫైనల్ చేరిన సౌరభ్ వర్మ... తుది పోరులో కీలక దశలో పైచేయి సాధించి టైటిల్‌ను కొల్లగొట్టేశాడు. 72 నిమిషాల మారథాన్ ఫైనల్లో రెండో సీడ్ సౌరభ్ 21–12, 17–21, 21–14తో సున్ ఫె జియాంగ్ (చైనా)పై నెగ్గాడు. మధ్యలో తడబడినా... పూర్తి ఆత్మవిశ్వాసంతో మ్యాచ్‌ను ఆరంభించిన సౌరభ్ వర్మ ప్రత్యర్థి పేలవమైన రిటర్న్ షాట్లను ఆసరాగా చేసుకొని చెలరేగాడు. తొలి గేమ్‌లో మొదటి నాలుగు పాయింట్లు సాధించి 4–0 ఆధిక్యంలోకెళ్లాడు. మళ్లీ అదే దూకుడును కొనసాగించి 11–4తో విరామానికి వెళ్లాడు. అనంతరం మరోసారి వరుసగా నాలుగు పాయింట్లు సాధించి 15–4తో గేమ్ విజయానికి చేరువయ్యాడు. ఈ దశలో కాస్త ప్రతిఘటించిన సున్ కొన్ని పాయింట్లు సాధించినా అంతరం భారీగా ఉండటంతో తొలి గేమ్‌ను 21–12తో సౌరభ్ సొంతం చేసుకున్నాడు. అయితే రెండో గేమ్‌లో పుంజుకున్న సున్ వరుస పాయింట్లు సాధిస్తూ సౌరభ్‌కు అందకుండా వెళ్లాడు. తొలుత 8–0తో అనంతరం 11–5తో ఆధిపత్యం ప్రదర్శించిన సున్ రెండో గేమ్‌ను చేజిక్కించుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో 4–2తో వెనుకబడ్డ సౌరభ్ సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో చెలరేగి 17–14తో ముందంజ వేశాడు. తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించి గేమ్‌తో పాటు టైటిల్‌ను ఖాయం చేసుకున్నాడు. -
సెమీస్‌లో సౌరభ్ వర్మ
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సౌరభ్ 21–13, 21–18తో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 112వ ర్యాంకర్ మినోరు కొగా (జపాన్)తో సౌరభ్ తలపడతాడు. -
టైటిల్ పోరులో సిక్కి–అశ్విని జంట
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ డబుల్స్ టైటిల్ సాధించేందుకు నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి–అశ్విని జంట 21–12, 21–12తో ఫాన్ కా యాన్–వు యి టింగ్ (హాంకాంగ్) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో బేక్ హా నా–జుంగ్ క్యుంగ్ యున్ (దక్షిణ కొరియా) జోడీతో సిక్కి–అశ్విని జంట తలపడుతుంది. ఫైనల్లో సౌరభ్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్ సౌరభ్ 23–21, 21–16తో ఇస్కందర్ జుల్కర్నైన్ (మలేసియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో లో కీన్ యె (సింగపూర్)తో సౌరభ్ తలపడతాడు. -
భారత స్టార్స్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సమీర్ వర్మ 18–21, 11–21తో హియో క్వాంగ్ హీ (కొరియా) చేతిలో... రెండో సీడ్ సాయిప్రణీత్ 17–21, 23–21, 15–21తో లియోనార్డో రుంబే (ఇండోనేసియా) చేతిలో... మూడో సీడ్ ప్రణయ్ 17–21, 10–21తో జియా వె తాన్ (మలేసియా) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, శుభాంకర్ డే ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ కశ్యప్ 23–21, 19–21, 21–17తో క్వాలిఫయర్ కిమ్ డాంగ్‌హున్ (కొరియా)పై, శుభాంకర్ 19–21, 21–13, 21–16తో సెంగ్ జో యో (మలేసియా)పై గెలిచారు. హైదరాబాద్ ఆటగాడు, క్వాలిఫయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ తొలి రౌండ్లో 21–16, 21–23, 15–21తో మరో క్వాలిఫయర్ బాయ్ యు పెంగ్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో చుక్కా సాయి ఉత్తేజిత రావు 21–14, 17–21, 21–10తో దిశా గుప్తా (అమెరికా)పై గెలుపొందగా... గుమ్మడి వృశాలి 16–21, 10–21తో ఫితాయపోర్న్ చైవన్ (థాయ్‌లాండ్) చేతిలో... కుదరవల్లి శ్రీకృష్ణప్రియ 15–21, 10–21తో కి జుయ్‌ఫె (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
46 నిమిషాల్లోనే ముగించేసింది..
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా జరిగిన సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీని 46 నిమిషాల్లోనే చిత్తుచిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన ఈ సెమీస్‌లో 21-19, 21-10 తేడాతో యుఫీని సింధూ మట్టికరిపించి తొలిసారి ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లోకి సగర్వంగా అడుగుపెట్టింది. మ్యాచ్‌ను చైనా షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధూపై మొదటి గేమ్‌లో 4-7తో ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత దూకుడును పెంచిన సింధు అటాకింగ్ గేమ్‌తో మొదటి సెట్‌ను 21-19తో కైవసం చేసుకుంది. అనంతరం రెండో గేమ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇక ఫైనల్లో భాగంగా ఆదివారం జపాన్ స్టార్ క్రీడాకారిణి యమగూచితో సింధూ తలపడనుంది. ఇక సింధూ ఫైనల్‌కు చేరడంపై భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేసింది. ఐదో సీడ్ సింధు గోల్డ్ మెడల్ సాధించాలని బాయ్ ఆకాంక్షించింది. Superrrrrr Sindhu!!!🔥 What a performance from the World No 5 @Pvsindhu1, dominated the proceeding to reach the finals of #BlibliIndonesiaOpen2019 defeating World No 3 #ChenYuFei 2⃣1⃣:1⃣9⃣2⃣1⃣:1⃣0⃣. Way to go, Girl! ⚡️ Go for Gold!🥇#IndiaontheRise #badminton pic.twitter.com/FtTZtOLwFq — BAI Media (@BAI_Media) 20 July 2019 -
ఇండోనేసియా ఓపెన్ : సెమీస్‌లోకి సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–14, 21–7 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్)పై వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి నుంచి సింధు ఒకుహారాపై ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్లో 5-5తో కొంత పోటీనిచ్చిన ఒకుహారా రెండో సెట్లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించిన సింధు మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యంతో 21–7తో ఒకహారా పతనాన్ని శాసించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) పై గెలిచిన విషయం తెలిసిందే. ఇక సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది. -
క్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్స్‌లో ప్రవేశించింది. గురువారం 62 నిమిషాల పాటు సాగిన మహిళల ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో ఐదో సీడ్ సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్) పై గెలిచింది. మ్యాచ్‌ను డెన్మార్క్ షట్లర్ ధాటిగా ఆరంభించింది. సింధుపై మొదటి గేమ్‌లో 6–3తో ఆధిక్యంలో వెళ్లింది. వెంటనే తేరుకున్న సింధు వెంట వెంటనే పాయింట్లు సాధించి స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన సింధు సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్ షాట్లతో హోరెత్తించి మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌ను మియా గెలవడంతో మ్యాచ్ మూడో గేమ్‌కు దారితీసింది. మూడో గేమ్‌లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు 21–11తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. మియా బ్లిచ్‌ఫెల్ట్‌పై సింధుకిది మూడో విజయం కావడం విశేషం. గతంలో ఇండియన్ ఓపెన్, సింగపూర్ ఓపెన్లలో సింధు ఆమెను మట్టికరిపించింది. పురుషుల ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 19–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో వరుస గేమ్‌లలో చిత్తయ్యాడు. పురుషుల డబుల్స్‌లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి 15–21, 14–21తో టోర్నీ టాప్ సీడ్ మార్కస్ గిడియోన్ – కెవిన్ సంజయ(ఇండోనేషియా) జంట చేతిలో... మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) 14–21, 11–21తో టాప్ సీడ్ జెంగ్ సి వె–హువాంగ్ యా కియోంగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైయ్యారు. శుక్రవారం జరిగే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మూడో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సింధు పోటీ పడనుంది. వీరిద్దరూ 14 సార్లు తలపడగా.. చెరో ఏడు సార్లు గెలిచి సమంగా ఉన్నారు. -
రన్నరప్ శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్ : కోట్ డి ఐవరీ ఓపెన్ అంతర్జాతీయ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కుదరవెల్లి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. ఐవరీకోస్ట్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 82వ ర్యాంకర్ శ్రీకృష్ణప్రియ 17–21, 13–21తో ప్రపంచ 101వ ర్యాంకర్ థెట్ తార్ తుజర్ (మయన్మార్) చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోని శ్రీకృష్ణప్రియ టైటిల్ పోరులో మాత్రం తడబడింది. తదుపరి శ్రీకృష్ణప్రియ ఈనెల తొమ్మిదిన మొదలయ్యే యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో బరిలోకి దిగనుంది. తొలి రౌండ్లో ఆమె కిమ్ గా యున్ (దక్షిణ కొరియా)తో ఆడుతుంది. -
ముగిసిన భారత్ పోరు
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఇప్పటికే మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లో భారత జోడీలు వెనుదిరగ్గా, తాజాగా మహిళల, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో తొలి టైటిల్ ఖాతాలో వేసుకోవాలని బరిలోకి దిగిన పీవీ సింధుతోపాటు, సమీర్ వర్మ, సాయిప్రణీత్ సైతం ఇంటిబాట పట్టారు. గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, వరల్డ్ నెం.5 సింధు 19–21 18–21తో 29వ ర్యాంకర్ నిచోన్ జిందాపోల్(థాయ్‌లాండ్) చేతిలో పరాజయం పాలైంది. 49 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కీలక సమయాల్లో తడబడిన సింధు మూల్యం చెల్లించుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నెం.12 సమీర్ 16–21, 21–7, 13–21తో వాంగ్ జు వీ(తైవాన్) చేతిలో, సాయి ప్రణీత్ 23–25, 9–21తో రెండో సీడ్ ఆంథోనీ సినిసుక గింటింగ్(ఇండోనేషియా) చేతిలో, పారుపల్లి కశ్యప్ 17–21 22–20 14–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడారు. అలాగే పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ పోరాటం సైతం ముగిసింది. సాయిరాజ్– చిరాగ్ ద్వయం 19–21, 18–21తో లి జున్హుయ్– లియూ యుచెన్(చైనా) చేతిలో పోరాడి ఓడింది. ముఖాముఖి పోరులో జిందాపోల్ చేతిలో ఇది సింధుకు రెండో ఓటమి. ఇప్పటివరకూ వీరిద్దరూ ఏడు సార్లు తలపడగా ఐదింట్లో విజయం సింధూనే వరించింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌తోపాటు మరో నాలుగు టోర్నీల్లో పాల్గొన్న సింధు ఒక్కదాంట్లోనూ కనీసం ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. స్వదేశంలో జరిగిన ఇండియా ఓపెన్‌లో మాత్రం సెమీస్‌కు చేరగలిగింది. -
సింధు శుభారంభం
సిడ్నీ: ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించే దిశగా భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వరల్డ్ నెం.5, రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సింధు 21–14,21–9తో చొయరున్నీసా (ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించింది. కాగా, పురుషుల విభాగంలో సమీర్ వర్మ, సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్ సైతం రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఆరో సీడ్ సమీర్ 21–15, 16–21, 21–12తో లీ జీ జియా(మలేషియా)పై గెలిచాడు. ఫలితంగా సుదిర్మన్ కప్‌లో అతని చేతిలో ఎదురైన అనూహ్య ఓటమికి బదులు తీర్చుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో భమిడిపాటి సాయి ప్రణీత్ 21–16, 21–14తో లీ డాంగ్ కియూన్ (దక్షిణకొరియా)పై, కశ్యప్ 21–16, 21–15తో అవిహింగ్సనన్(థాయ్‌లాండ్) పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకోగా, హెచ్ఎస్ ప్రణయ్ 18–21, 19–21తో చైనా దిగ్గజం లిన్ డాన్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తదుపరి రౌండ్లో జిందాపోల్(థాయ్‌లాండ్)తో సింధు, వాంగ్ జు వీ(తైవాన్)తో సమీర్, ఆంథోనీ సినిసుక గింటింగ్(ఇండోనేషియా)తో ప్రణీ త్ తలపడతారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి–చిరాగ్ షెట్టి ద్వయం 21–12, 21–16తో మనదేశానికే చెందిన మనుఅత్రి –సుమీత్ రెడ్డిజోడీని ఓడించగా, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ 14–21, 13–21 తో బేక్ హ న– కిమ్ హైరిన్(దక్షిణకొరియా)జంట చేతిలో పరాజయం పాలైంది. -
సైనాకు షాక్
స్థాయికి తగ్గట్టు ఆడితే కనీసం ఫైనల్ చేరుకోవాల్సిన టోర్నీలో భారత స్టార్ సైనా తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఒక్కోసారి ప్రత్యర్థి ర్యాంక్ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందని ఈ టోర్నీలో నిరూపితమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 212వ స్థానంలో ఉన్న చైనాకు చెందిన 19 ఏళ్ల అమ్మాయి వాంగ్ జియి ధాటికి తొమ్మిదో ర్యాంకర్ సైనా చేతులెత్తేసింది. ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. రెండో సీడ్ సైనా నెహ్వాల్‌తోపాటు అనురా ప్రభుదేశాయ్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 16–21, 23–21, 4–21తో ప్రపంచ 212వ ర్యాంకర్ వాంగ్ జియి (చైనా) చేతిలో... అనురా 9–21, 10–21తో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. వాంగ్ జియితో తొలిసారి ఆడిన సైనా తొలి గేమ్ ఆరంభంలోనే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి 0–4తో వెనుకబడింది. ఆ తర్వాత వాంగ్ అదే జోరును కొనసాగించి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఒకదశలో సైనా 12–17తో వెనుకబడినా పుంజుకొని స్కోరును సమం చేయడంతోపాటు కీలకదశలో పాయింట్లు నెగ్గి గేమ్‌ను గెల్చుకొని మ్యాచ్‌లో నిలిచింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ఏడాది ఏడు టోర్నీల్లో పాల్గొన్న సైనా మలేసియా ఓపెన్, న్యూజిలాండ్ ఓపెన్లలో తొలి రౌండ్లో ఓడిపోగా... ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచి, మలేసియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు చేరింది. ఆల్ ఇంగ్లండ్, సింగపూర్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సాయిప్రణీత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... లక్ష్య సేన్, శుభాంకర్ డే తొలి రౌండ్లో నిష్క్రమించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయి ప్రణీత్ 21–17, 19–21, 21–15తో సహచరుడు శుభాంకర్ డేపై కష్టపడి నెగ్గగా... ప్రణయ్ 21–15, 21–14తో లో కీన్ యె (సింగపూర్)ను అలవోకగా ఓడించాడు. క్వాలిఫయర్ లక్ష్య సేన్ 21–15, 18–21, 10–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లిన్ డాన్ (చైనా)తో సాయిప్రణీత్; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో ప్రణయ్ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) ద్వయం 21–7, 21–10తో ఫెంగ్ జాషువా–జాక్ జియాంగ్ (న్యూజిలాండ్) జోడీని ఓడించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 14–21, 23–21, 14–21తో లియు జువాన్జువాన్–జియా యుటింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్
కౌలాలంపూర్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ –750 మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ఒక్కడి పోరాటమే మిగిలింది. ఈ టోర్నీలో 8వ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మహిళల సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట కూడా నిష్క్రమించింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ స్టార్ ప్లేయర్ శ్రీకాంత్ 21–11, 21–15తో థాయ్‌లాండ్‌కు చెందిన కోసిట్ ఫెట్ప్రదబ్ను వరుస గేముల్లో ఓడించాడు. 32 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత స్టార్ జోరుకు ఎదురులేకుండా పోయింది. థాయ్ ప్రత్యర్థిపై అతను అలవోక విజయం సాధించాడు. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్... ఒలింపిక్ చాంపియన్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ (చైనా)ను ఎదుర్కొంటాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ సింధు 18–21, 7–21తో çసుంగ్ జీ హ్యున్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది. తొలి గేమ్‌లో 13–10తో ఆధిక్యంలో ఉన్న సింధు అనూహ్యంగా వెనుకబడింది. ఇక రెండో గేమ్‌లో ప్రత్యర్థి జోరుకు తలవంచింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జోడీ 21–15, 17–21, 13–21తో తన్ కియన్ మెంగ్– లై పై జింగ్ (మలేసియా) జంట చేతిలో ఓడింది. -
క్వార్టర్స్‌లో సాయిప్రణీత్
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, హెచ్.ఎస్. ప్రణయ్, మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి, ప్రణవ్ చోప్రా–శివమ్ శర్మ జోడీలు, మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి–అశ్విని పొన్నప్ప, అపర్ణా బాలన్–శ్రుతి జంటలు కూడా క్వార్టర్స్ చేరాయి. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భమిడిపాటి సాయిప్రణీత్ 18–21, 21–16, 21–15తో భారత్‌కే చెందిన ఐదో సీడ్ సమీర్‌వర్మకు షాకిచ్చాడు. మూడో సీడ్ శ్రీకాంత్ 21–11, 21–16తో లూ గ్వాంగ్జు (చైనా)పై గెలుపొందగా, హెచ్.ఎస్.ప్రణయ్ 21–19, 20–22, 21–17తో జాన్ జార్జెన్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. పారుపల్లి కశ్యప్ 21–11, 21–13తో తనోంగ్సక్ సెన్సోబూన్సుక్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, రెండో సీడ్ సింధు 21–11, 21–13తో డెంగ్ జాయ్ జువన్ (హాంకాంగ్)పై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో ఆరో సీడ్ మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం 25–23, 21–18తో హువంగ్ కిజియంగ్–వాంగ్ జెకంగ్ (చైనా) జంటపై, ప్రణవ్–శివమ్ జోడీ 21–15, 21–11తో భారత్‌కే చెందిన అనిరుధ మయేకర్–వినయ్ జంటపై గెలుపొందాయి. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి –అశ్విని పొన్నప్ప జంట 21–18, 21–14తో చెన్‌జియాఫో–జౌ చొమిన్ (చైనా) జోడీపై, అపర్ణ–శ్రుతి జంట 21–19, 7–21, 21–17తో వింగ్ యంగ్–యియంగ్ టింగ్ (హాంకాంగ్) జోడీపై గెలిచాయి. నేటి పురుషుల క్వార్టర్స్‌లో శ్రీకాంత్‌తో సాయిప్రణీత్ ఢీకొంటాడు. -
అజయ్, మిథున్ పరాజయం
ఓర్లీన్స్ (ఫ్రాన్స్): భారత షట్లర్లు ఓర్లీన్స్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీలో నిరాశపరిచారు. గురువారం బరిలోకి దిగిన సింగిల్స్, డబుల్స్ ప్లేయర్లంతా పరాజయం చవిచూశారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మిథున్ మంజునాథ్ 9–21, 18–21తో గత్రా ఫిలియంగ్ ఫిఖిహిలా కుపు (ఇండోనేసియా) చేతిలో ఓడిపోగా, అజయ్ జయరామ్‌కు 10–21, 17–21తో ఎనిమిదో సీడ్ థామస్ రూక్సెల్ (ఫ్రాన్స్) చేతిలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో ముగ్దా ఆగ్రేను 10–21, 19–21తో ఆరో సీడ్ సబ్రినా జాకెట్ (స్విట్జర్లాండ్) ఇంటిదారి పట్టించింది. మహిళల డబుల్స్‌లో ఆరో సీడ్ యుల్ఫిరా బర్కాన్– జౌజా ఫధిలా సుగియార్తో (ఇండోనేసియా) జోడీ 21–14, 18–21, 21–19తో పూజ దండు–సంజన జంటపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–కుహూ గార్గ్ జంట 21–23, 12–21తో నాలుగో సీడ్ ఎవెంజి డ్రిమిన్–ఎవ్‌జినియా దిమోవ (రష్యా) జోడీ చేతిలో ఓడింది. -
సాయిప్రణీత్ @19
న్యూఢిల్లీ: స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు. మంగళవారం విడుదలైన ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో సాయిప్రణీత్ పురుషుల సింగిల్స్ విభాగంలో మూడు స్థానాలు ఎగబాకి 19వ స్థానానికి చేరుకున్నాడు. శ్రీకాంత్ ఏడో స్థానంలో, సమీర్ వర్మ 14వ స్థానంలో కొనసాగుతున్నారు. పురుషుల సింగిల్స్ టాప్–100లో భారత్ నుంచి పది మంది ఉండటం విశేషం. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో సింధు, సైనా వరుసగా ఆరు, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారు. -
రన్నరప్ సాయిప్రణీత్
చాలా రోజుల తర్వాత నా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో రెండో గేమ్‌లో కీలకదశలో రెండేసి పాయింట్ల చొప్పున కోల్పోవడం మలుపు తిప్పింది. సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్‌పై సాధించిన గెలుపు నా కెరీర్‌లోని గొప్ప విజయాల్లో ఒకటి. వచ్చే వారం భారత్‌లో జరిగే ఇండియా ఓపెన్‌లో టైటిల్ సాధించేందుకు కృషి చేస్తాను. –‘సాక్షి’తో సాయిప్రణీత్ బాసెల్ (స్విట్జర్లాండ్): దాదాపు రెండేళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ టైటిల్ కొరతను తీర్చుకోవాలని ఆశించిన భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌కు నిరాశ ఎదురైంది. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సాయిప్రణీత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–19, 18–21, 12–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2017లో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత స్విస్ ఓపెన్ రూపంలో మరో అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ చేరిన ఈ హైదరాబాద్ ప్లేయర్ తుది మెట్టుపై తడబడ్డాడు. 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాయిప్రణీత్ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్ నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది. ఈ గేమ్‌లో పలుమార్లు స్కోరు సమంగా నిలిచింది. అయితే స్కోరు 18–18 వద్ద షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి జోరు పెంచగా, సాయిప్రణీత్ డీలా పడ్డాడు. విజేత షి యుకికి 11,250 డాలర్లు (రూ. 7 లక్షల 75 వేలు)... రన్నరప్ సాయిప్రణీత్‌కు 5,700 డాలర్లు (రూ. 3 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ►దాదాపు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో గతంలో భారత క్రీడాకారులు శ్రీకాంత్ (2015), ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018), సైనా (2011, 2012) టైటిల్స్ నెగ్గగా... భారత్ నుంచి రన్నరప్‌గా నిలిచిన తొలి ప్లేయర్ సాయిప్రణీత్. -
క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
కౌలాలంపూర్: కొత్త ఏడాది ఆరంభ టోర్నీ మలేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్... మహిళల డబుల్స్ కేటగిరీలో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ రెండో రౌండ్లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ సైనా (భారత్) 21–14, 21–16తో పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్)పై వరుస గేముల్లో కేవలం 39 నిమిషాల్లోనే గెలుపొందింది. నేడు జరిగే క్వార్టర్స్‌లో 2017 ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ నొజోమి ఒకుహారా (జపాన్)తో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా తలపడుతుంది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న సైనా ముఖాముఖీ రికార్డులో 8–4తో ఒకుహారా (వరల్డ్ నెం.2)పై ఆధిక్యంలో ఉంది. మరోవైపు పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఏడో సీడ్ శ్రీకాంత్ (భారత్) 23–21, 8–21, 21–18తో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై పోరాడి గెలిచాడు. నేటి మ్యాచ్‌లో నాలుగో సీడ్ సన్‌వాన్‌హో (కొరియా)తో శ్రీకాంత్ తలపడతాడు. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ కశ్యప్ 17–21, 23–25తో ఆరోసీడ్ ఆంథోని సినిసుకా జింటింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల డబుల్స్ రెండోరౌండ్లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 18–21, 17–21తో ని కెటుట్ మహాదేవి ఇస్తారాణి– రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. -
రెండో రౌండ్లో సైనా, శ్రీకాంత్
కౌలాలంపూర్ (మలేసియా): కొత్త ఏడాదిలో తొలి టైటిల్ సాధించడమే లక్ష్యంగా... మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలోకి దిగిన భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 21–17, 21–11తో లాంగ్ ఆంగస్ (హాంకాంత్)పై 30 నిమిషాల్లోనే విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ పారుపల్లి కశ్యప్ (భారత్) 19–21, 21–19, 21–10తో రస్మస్ జెమ్‌కీ (డెన్మార్క్)పై నెగ్గి ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సైనా నెహ్వాల్ 14–21, 21–18, 21–18తో డెంగ్ జాయ్ యువాన్ (హాంకాంగ్)పై కష్టపడి గెలిచింది. మరోవైపు మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్) ద్వయం 21–16, 22–20తో ఎన్ సు యు– యెన్ సిన్ యింగ్ (హాంకాంగ్) జోడీపై నెగ్గి రెండోరౌండ్‌కు చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలోనే భారత్‌కు వ్యతిరేక ఫలితం ఎదురైంది. తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా– సిక్కిరెడ్డి (భారత్) జంట 19–21, 17–21తో రాబిన్ తాబులింగ్– సెలీనా పియెక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేటి రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో శ్రీకాంత్, ఆరోసీడ్ అంథోని సినిసుకా జింటింగ్ (ఇండోనేసియా)తో కశ్యప్, యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)తో సైనా ఆడతారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో కెటుట్ మహాదేవి ఇస్తారాణి– రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జోడీతో అశ్విని– సిక్కి జంట ఆడుతుంది. -
సింగిల్స్ సెమీస్‌లో శుభాంకర్ డే
సార్లార్లక్స్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో భారత బ్యాడ్మింటన్ ఆటగాడు శుభాంకర్ డే సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. జర్మనీలోని సార్‌బ్రకెన్ నగరంలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుభాంకర్ 21–16, 21–9తో టోబీ పెంటీ (ఇంగ్లండ్)పై గెలుపొందాడు. మరో క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ 16–21, 18–21తో టోమా జూనియర్ పపోవ్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శైలి రాణే (భారత్) 14–21, 9–21తో లైన్ హోమార్క్ జార్స్‌ఫెల్డ్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. -
ప్రిక్వార్టర్స్‌లో సాయి ఉత్తేజిత
డచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఉత్తేజిత 21–10, 21–13తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై గెలిచింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన శ్రీకృష్ణప్రియ 11–21, 12–21తో ఫాబిని డిప్రెజ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన శైలి రాణే, అనురా ప్రభు దేశాయ్, రియా ముఖర్జీ కూడా తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
అజయ్, సౌరభ్ సత్తా చాటుతారా!
తైపీ సిటీ: స్టార్ షట్లర్లు దూరమైన చైనీస్ తైపీ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్లో సత్తా చాటా లని భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ పట్టుదలగా ఉన్నారు. నేటినుంచి జరిగే ఈ టోర్నీకి పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లు దూరంగా ఉన్నారు. ఈ నెలలోనే కీలకమైన డెన్మార్క్ ఓపెన్ (16 నుంచి 21 వరకు), ఫ్రెంచ్ ఓపెన్ (23 నుంచి 28 వరకు) టోర్నీలు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో అజయ్ జయరామ్, మాజీ జాతీయ చాంపియన్ సౌరభ్ వర్మ లకు ఇది మంచి అవకాశం. మహిళల సింగిల్స్‌లో తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, శ్రీకృష్ణప్రియలు బరిలోకి దిగుతున్నారు. వియ త్నాం, వైట్‌నైట్స్ టోర్నీలో ఫైనల్ చేరిన అజయ్ జయరామ్ ఈ టోర్నీలో టైటిల్‌పై కన్నేశాడు. తొలిరౌండ్లో అతను జపాన్‌కు చెందిన హషిరు షిమోనోతో తలపడనుండగా... ప్రపంచ 65వ ర్యాంకర్ సౌరభ్ వర్మ స్థానిక ఆటగాడు లీ చియ హవ్ను ఎదుర్కొంటాడు. మిగతా మ్యాచ్‌ల్లో చిట్టబోయిన రాహుల్... లు చియ హుంగ్ (తైపీ)తో, అభిషేక్... ఐదో సీడ్ జాన్ జొర్గెన్సన్ (డెన్మార్క్)తో పోటీపడతారు. మహిళల సింగిల్స్‌లో ఉత్తేజిత... చియాంగ్ యింగ్ లీ (తైపీ)తో, ముగ్ధ అగ్రే... ఏడో సీడ్ సోనియా (మలేసియా)తో, శ్రీకృష్ణప్రియ... లిన్ యింగ్ చన్ (తైపీ)తో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో ఒక్క తరుణ్ కోన మాత్రమే ఆడుతున్నాడు. అతను మలేసియాకు చెందిన లిమ్ కిమ్ వాతో జతకట్టగా, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో భారత షట్లర్లు ఎవరూ పాల్గొనడం లేదు. -
వృశాలి సంచలనం
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి గుమ్మడి వృశాలి సంచలనం సృష్టించింది. పోలాండ్లోని బీరన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో వృశాలి 23–21, 21–19తో టాప్ సీడ్ కేట్ ఫ్యూ కున్ (మారిషస్)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్లో ఏడో సీడ్ సారా పెనాల్వార్ పెరీరా (స్పెయిన్)పై 20–22, 21–12, 21–11తో నెగ్గిన వృశాలి... ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 21–13తో మోనికా సుజోక్ (హంగేరి)ను ఓడించింది. భారత్‌కే చెందిన రితూపర్ణ దాస్ కూడా సెమీస్ చేరింది. క్వార్టర్ ఫైనల్లో రితూపర్ణ 21–7, 21–14తో జార్జినా బ్లాండ్ (ఇంగ్లండ్)పై గెలిచింది. -
కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల జంటకు టైటిల్
ఆర్ఎస్ఎల్ ఖార్కివ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ యువ ఆటగాడు గారగ కృష్ణ ప్రసాద్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు. ఉక్రెయిన్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో కృష్ణ ప్రసాద్–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–19, 21–16తో డానియల్ హెస్–జాన్స్ పిస్టోరియస్ (జర్మనీ) జోడీపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో సౌరభ్–అనౌష్క జోడీ 18–21, 21–19, 22–20తో పావెల్ స్మిలోస్కి–మగ్దలీనా (పోలాండ్) జంటపై నెగ్గి టైటిల్ సొంతం చేసుకుంది. -
ఎస్టీఎస్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు
సింగపూర్ : సింగపూర్ తెలుగు సమాజం(ఎస్టీఎస్) ఆధ్వర్యంలో సింగపూర్‌లోని అవర్ టంపనీస్ హబ్‌లో బ్యాడ్మింటన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 250 మందికిపైగా స్థానిక తెలుగు క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 140 మంది పురుషులు, 60 మంది మహిళలు, 50 మంది బాలబాలికలు ఉన్నారు. రెండు రోజులపాటూ నిర్వహించిన ఈ టోర్నమెంట్లో వివిధ విభాగాలు కలిపి 320 మ్యాచ్‌లు నిర్వహించి విజేతలను ప్రకటించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంలో క్రీడలు మన శక్తిని కొత్తపుంతలు తొక్కిస్తాయని, మనోరంజక సాధనాలుగా ఉంటాయన్నారు. స్థానిక తెలుగువారి క్రీడాస్పూర్తిని ప్రశంసించారు. పోటీల అనంతరం స్పాన్సర్స్‌తో విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఇంతమంది తెలుగువారు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనడం పట్ల కార్యక్రమ నిర్వహణాధికారి మల్లిక్ పాలెపు హర్షం వ్యక్తం చేశారు. స్పాన్సర్స్‌కు, వాలంటీర్స్‌కు, కార్యవర్గ సభ్యులకు, ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికీ సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రిక్వార్టర్స్‌లో జయరామ్, రితూపర్ణ
హో చీ మిన్ (వియత్నాం): భారత షట్లర్లు అజయ్ జయరామ్, రితూపర్ణ దాస్ వియత్నాం ఓపెన్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో జయరామ్ 21–17, 21–16తో పిలియాంగ్ ఫిఖీలా (ఇండోనేసియా)పై... మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ 21–13, 21–14తో షియోరి సైటో (జపాన్)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. మరో భారత ఆటగాడు కార్తీక్ జిందాల్ 9–21, 21–16, 21–16తో జూలియన్ పాల్ (మారిషస్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరాడు. ఇతర మ్యాచ్‌ల్లో సిరిల్ వర్మ తొలి రౌండ్లో 21–17, 21–16తో శ్రేయాన్‡్ష జైస్వాల్ (భారత్)పై గెలిచి... రెండో రౌండ్లో 20–22, 21–17, 17–21తో టాప్ సీడ్ యగోర్ కొలెహో (బ్రెజిల్) చేతిలో ఓడాడు. శివాని ఓటమి: తెలంగాణ యువ క్రీడాకారిణి రుత్విక శివాని మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 19–21, 17–21తో యిన్ ఫన్ లిమ్ (మలేసియా) చేతిలో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో రసిక రాజే, ముగ్ధ, వైదేహి కూడా పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో భారత్ పోరాటం ముగిసింది. తొలి రౌండ్లో ధ్రువ్ కపిల–జక్కంపూడి మేఘన జంట 17–21, 21–18, 21–23తో జియాంగ్ జెన్‌బాంగ్–చెన్ యింగెక్సూ(చైనా) జోడీ చేతిలో, శివమ్ శర్మ– పూర్విషా ద్వయం 15–21, 16–21తో తడయూకీ ఉరాయి– మియౌర (జపాన్) జంట చేతిలో ఓడింది. -
రాహుల్ శుభారంభం
వ్లాదివోస్టాక్ (రష్యా): బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్– 100 రష్యా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదు గురు భారత ఆటగాళ్లు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ యాదవ్ 21–11, 21–10తో మకలోవ్ (రష్యా)ను ఓడించగా... జయరామ్ 21–14, 21–8తో జియోడాంగ్ షెంగ్ (కెనడా)పై, ప్రతుల్ జోషి 21–11, 21–8తో జెఫ్రీ లామ్ (కెనడా)పై, మిథున్ 21–14, 21–13తో ఇలియాస్ బ్రాకె (బెల్జియం)పై, సిద్ధార్థ్ 21–17, 21–16తో జియా వె తాన్ (మలేసియా)పై గెలిచారు. -
ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
సాక్షి, హైదరాబాద్: లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ ఫైనల్లోకి ప్రవేశించింది. నైజీరియాలో జరుగుతోన్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకృష్ణప్రియ 21–12, 21–9తో డొర్కాస్ అజోక్ అడెసొకాన్ (నైజీరియా)పై అలవోకగా గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన రెండో సీడ్ శ్రీకృష్ణప్రియ క్వార్టర్ ఫైనల్లో 17–21, 21–9, 21–6తో సోనియా గొన్కాల్వెస్ (పోర్చుగల్)ను ఓడించిం ది. ఫైనల్లో మూడో సీడ్ సెనియా పొలికర్పోవా -
రన్నరప్ జయరామ్
గాట్చిన (రష్యా): భారత మేటి షట్లర్ అజయ్ జయరామ్ వైట్‌నైట్స్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. టైటిల్ పోరులో అతను స్పెయిన్‌కు చెందిన టాప్ సీడ్ పాబ్లో అబియన్ చేతిలో పోరాడి ఓడాడు. 30 ఏళ్ల జయరామ్ గాయం నుంచి కోలుకున్నాక గత నెలలో బరిలోకి దిగిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ ఈవెంట్లో సెమీస్ చేరుకున్నాడు. తాజాగా రష్యాలో జరిగిన ఈవెంట్ ఫైనల్లో 21–11, 16–21, 17–21తో పాబ్లో చేతిలో పరాజయం చవిచూశాడు. 55 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత ఆటగాడు తర్వాతి రెండు గేముల్లో ప్రత్యర్థితో పోరాడినప్పటికీ ఫలితం సాధించలేకపోయాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో తరుణ్ కోనా–సౌరభ్ శర్మ జంట 21–18, 13–21, 17–21తో జార్నే జెయిస్–జాన్ కొలిన్ ఓల్కర్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు
జకార్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే కంగుతిన్నాడు. మహిళల విభాగంలో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కెంటో మొమోటా (జపాన్) 12–21, 21–14, 21–15తో నాలుగో సీడ్ శ్రీకాంత్‌ను ఓడించాడు. గతవారం మలేసియా ఓపెన్ సెమీఫైనల్లోనూ మొమోటా చేతిలోనే శ్రీకాంత్ ఓడిపోవడం గమనార్హం. మహిళల సింగిల్స్ మొదటి రౌండ్లో సింధు 21–15, 19–21, 21–13తో పార్న్పావి చొచువాంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. జక్కా వైష్ణవి రెడ్డి 12–21, 10–21తో లిన్ హొజ్‌మార్క్ (డెన్మార్క్) చేతిలో ఓడింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కిరెడ్డి–ప్రణవ్ చోప్రా జంట 12–21, 14–21తో జెంగ్ సీవె–హువాంగ్ యకివాంగ్ (చైనా) జోడీ చేతిలో, పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమిత్ రెడ్డి జోడీ 21–15, 15–21, 17–21తో లీ చెంగ్–జంగ్ నాన్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయాయి. -
సైనాకు షాక్
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్‌టోర్నీ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 15–21, 13–21తో అకానె యామగుచి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. ఇప్పటి వరకు ఏడుసార్లు యామగుచితో తలపడిన సైనా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఓడింది. ఇతర మ్యాచ్‌ల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21–8, 21–14తో యింగ్ యింగ్ లీ (మలేసియా)పై; పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్ 22–20, 21–12తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ)పై గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. -
మలేసియా ఓపెన్: సైనా ఔట్
కౌలాంలపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ కథ ముగిసింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 15-21, 13-21 తేడాతో యమగూచి(జపాన్) చేతిలో పరాజయం పాలైంది. 36 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో యమగూచి చెలరేగి ఆడింది. ఈ రెండు గేమ్‌ల్లోనూ సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వని యమగూచి ఆకట్టుకుని క్వార్టర్స్‌లోకి చేరగా, సైనా రెండో రౌండ్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. వీరిద్దరూ ముఖాముఖి పోరులో ఇప్పటివరకూ ఆరుసార్లు తలపడగా యమగూచి ఐదుసార్లు విజయం సాధించింది. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లోనే సైనా గెలుపొందింది. -
ప్రిక్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 26–24, 21–15తో అయా ఒహోరి (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21–18, 21–9తో జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో సాయిప్రణీత్ 12–21, 7–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 16–21, 15–21తో టకుటో ఇనుయి–యూకీ కనెకో (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో అకానె యామగుచి (జపాన్)తో సైనా నెహ్వాల్; యింగ్ యింగ్ లీ (మలేసియా)తో సింధు; వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో శ్రీకాంత్ తలపడతారు. -
సెమీస్‌లో సుమీత్ జంట
సిడ్నీ: ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో తెలంగాణ ప్లేయర్ సుమీత్ రెడ్డి తన భాగస్వామి మను అత్రితో కలిసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో సుమీత్–మను ద్వయం 17–21, 21–19, 21–18తో భారత్‌కే చెందిన అర్జున్–శ్లోక్ రామచంద్రన్ జంటపై గెలుపొందింది. సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాయి ప్రణీత్ 12–21, 14–21తో లీ చెయుక్ యియు (హాంకాంగ్) చేతిలో... సమీర్ వర్మ 14–21, 6–21తో లూ గ్వాంగ్జు (చైనా) చేతిలో ఓడిపోయారు. -
సెమీస్‌లో సమీర్ వర్మ
న్యూఢిల్లీ: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ 17–21, 21–19, 21–15తో లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి నందగోపాల్–ఆల్విన్ ఫ్రాన్సిస్ (భారత్) ద్వయం 21–19, 14–21, 8–21తో మార్క్ లామ్స్‌ఫస్–మార్విన్ సీడెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది. -
తరుణ్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: జమైకా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కోన తరుణ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో... తరుణ్–సౌరభ్ శర్మ (భారత్) జంట 21–17, 21–17తో గారెత్ హెన్రీ–రికెట్స్ (జమైకా) ద్వయంపై గెలిచింది. సెమీస్‌లో ఈ జోడీ 21–5, 21–8తో టాప్ సీడ్ జోస్ గ్యురెవా–డానిల్లె టొర్రె (పెరూ) జంటపై విజయం సాధించింది. -
మేఘన డబుల్ ధమాకా
బరేలీ: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి మేఘన జక్కంపూడి సత్తా చాటింది. ఈ టోర్నీలో మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో టైటిళ్లను కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో మేఘన– పూర్విషా రామ్ (ఆర్బీఐ) ద్వయం 21–19, 21–14తో మూడో సీడ్ వైష్ణవి భాలే– అనురా ప్రభుదేశాయ్ జంటపై గెలుపొందింది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌పోరులో మేఘన– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 22–10, 21–10తో పొదిలె శ్రీ కృష్ణ సాయి కుమార్– రుతుపర్ణ పాండా జోడీని ఓడించింది. సెమీస్‌లో సాయివిష్ణు ఓటమి... గుల్బర్గా: ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల సాయివిష్ణు పోరాటం సెమీస్‌లో ముగిసింది. అండర్–15 బాలుర సింగిల్స్ సెమీస్‌లో మూడోసీడ్ సాయివిష్ణు 16–21, 9–21తో శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరో తెలుగు కుర్రాడు ప్రణవ్‌రావు గంధం ఫైనల్‌కు చేరుకున్నాడు. సెమీస్‌లో టాప్‌సీడ్ ప్రణవ్‌రావు 21–15, 21–12తో ప్రణవ్ కట్టపై గెలుపొందాడు. -
తరుణ్–సౌరభ్ జంటకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కోనా తరుణ్‌కు టైటిల్ దక్కింది. ప్రిటోరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో తరుణ్–సౌరభ్ శర్మ (భారత్) ద్వయం 21–9, 21–15తో టాప్ సీడ్ ఆతిష్ లూబా–జూలియన్ పాల్ (మారిషస్) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత జోడీ 21–12, 21–10తో కొపోలో పాల్–థబారి మాథె (జింబాబ్వే) జంటపై... క్వార్టర్ ఫైనల్లో 21–16, 21–14తో బహాదీన్ అహ్మద్–నాసిర్ (జోర్డాన్) ద్వయం, సెమీఫైనల్లో 15–21, 21–14, 21–13తో ఆదర్శ్ కుమార్–జగదీశ్ యాదవ్ (భారత్) జోడీపై గెలిచాయి. -
మెయిన్ ‘డ్రా’కు కశ్యప్
కౌలూన్ (హాంకాంగ్): మళ్లీ పూర్వ వైభవం కోసం తపిస్తున్న భారత మాజీ నంబర్‌వన్ పారుపల్లి కశ్యప్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21–12, 21–10తో కాన్ చావో యు (చైనీస్ తైపీ)పై, 21–13, 21–19తో లీ చెయుక్ యియు (హాంకాంగ్)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జంట 18–21, 11–21తో హఫీజ్ ఫైజల్–గ్లోరియా (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో మెటీ పౌల్సెన్ (డెన్మార్క్)తో సైనా నెహ్వాల్; లెయుంగ్ యీ (హాంకాంగ్)తో పీవీ సింధు; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో సౌరభ్ వర్మ; హు యున్ (హాంకాంగ్)తో ప్రణయ్; సన్ వాన్ హో (కొరియా)తో సాయిప్రణీత్; లీ డాంగ్ కెయున్ (కొరియా)తో కశ్యప్ తలపడతారు. ప్రాంజల జంట ముందంజ ముంబై: హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ప్రాంజల–కర్మన్‌కౌర్ థండి (భారత్) జంట 6–3, 7–5తో నైక్తా బెయిన్స్ (ఆస్ట్రేలియా)–ఫ్యానీ స్టోలర్ (హంగేరి) ద్వయంపై గెలిచింది. -
మెయిన్ ‘డ్రా’కు సాత్విక్–అశ్విని జంట
ఫుజౌ (చైనా): మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బరిలో ఉన్న ఏకైక భారత జోడీ సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన క్వాలిఫయింగ్ పోటీల్లో సాత్విక్–అశ్విని ద్వయం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి రౌండ్లో ఈ భారత జోడీ 24–22, 21–7తో లీ జె హుయె–వు తి జంగ్ (చైనీస్ తైపీ) జంటపై... రెండో రౌండ్లో 21–16, 19–21, 22–20తో నిక్లాస్ నోర్–సారా తిగెసన్ (డెన్మార్క్) ద్వయంపై గెలిచింది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో మథియాస్ క్రిస్టియాన్సన్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) జోడీతో సాత్విక్–అశ్విని జంట తలపడుతుంది. మరోవైపు బుధవారం జరిగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో బీవెన్ జాంగ్ (అమెరికా)తో సైనా నెహ్వాల్; సయాకా సాటో (జపాన్)తో పీవీ సింధు తలపడతారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో సౌరభ్ వర్మ; లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో హెచ్ఎస్ ప్రణయ్ ఆడతారు. -
కశ్యప్ ఆట ముగిసింది...
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పారుపల్లి కశ్యప్ క్వాలిఫయింగ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మిక్స్డ్ డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడి ప్రధాన డ్రాకు అర్హత సంపాదించింది. ఆడిన రెండు క్వాలిఫయింగ్ పోటీల్లోనూ ఈ జంట గెలుపొందింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్లో కశ్యప్ తొలి రౌండ్లో 21–13, 21–16తో విక్టర్ స్వెండ్సెన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. తర్వాత జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 4–21, 19–21తో జపాన్‌కు చెందిన తకుమా వుయేడా చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్డ్ డబుల్స్ తొలి మ్యాచ్‌లో రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్–అశ్విని జంట 21–17, 21–13తో క్రిస్టోఫర్ నుడ్సెన్–ఇసాబెలా నీల్సన్ (డెన్మార్క్) జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో రౌండ్లోనూ ఈ భారత జోడి 21–8, 21–13తో జోన్స్ రాల్ఫీ జన్సెన్–ఎవా జన్సెన్స్ (జర్మనీ) జంటపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్ మెయిన్ డ్రా తొలి రౌండ్లో ప్రణవ్ చోప్రా–సిక్కిరెడ్డి జంట 17–21, 15–21తో సామ్ మాగి–క్లొ మాగి(ఐర్లాండ్) జోడి చేతిలో ఓడింది. -
మిక్స్డ్ సెమీస్‌లో సాత్విక్ జంట
డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అశ్విని పొన్నప్పతో కలిసి హైదరాబాద్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని (భారత్) ద్వయం 21–18, 21–14తో స్కాట్ ఇవాన్స్ (ఐర్లాండ్)–అమందా (స్వీడన్) జోడీపై గెలిచింది. -
మెయిన్ డ్రాకు ప్రణవి, ప్రీతి
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు కె. ప్రణవి రెడ్డి, కె.ప్రీతి రాణించారు. గుంటూరులో జరుగుతోన్న ఈ టోర్నీ మెయిన్‌డ్రాకు వీరు అర్హత సాధించారు. సోమవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో ప్రణవి 15–7, 16–14తో ప్రేరణ నీలూరి (కర్ణాటక)పై గెలుపొందగా... ప్రీతి 15–4, 15–2తో అరువి తిరుమేని (తమిళనాడు)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణాలి కరాని (తెలంగాణ)కు వాకోవర్ లభించగా, సుప్రియ (తెలంగాణ) 15–6, 15–8తో అనుభా కౌషిక్ (ఢిల్లీ)పై, కైవల్య లక్ష్మీ (తెలంగాణ) 15–9, 15–6తో సహనా (తమిళనాడు)పై గెలుపొంది మెయిన్‌డ్రాకు అర్హత సాధించారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లీలా లక్ష్మీ, రోషిణి గాయత్రి కూడా ముందంజ వేశారు. లీల 15–10, 15–9తో ఆర్య మోరే (మహారాష్ట్ర)పై, రోషిణి 8–15, 15–4, 15–12తో ఆయుషి సింగ్ (హరియాణా)పై గెలుపొందారు. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో ఉమాకాంత్ సర్గే (మహారాష్ట్ర)–ప్రమద (తెలంగాణ) ద్వయం 10–15, 15–11, 16–14తో ఆకాశ్ (యూపీ)–కైలాశ్ (ఛత్తీస్‌గఢ్) జంటపై, గోపాలకృష్ణ రెడ్డి–ప్రీతి (తెలంగాణ) ద్వయం 9–15, 15–13, 18–16తో మొహమ్మద్ రెహాన్–అనీస్ కౌసర్ (తమిళనాడు) జంటపై నెగ్గి మెయిన్‌డ్రాకు చేరుకున్నాయి. -
అనికేత్, యశ్వంత్‌ల శుభారంభం
సాక్షి, గుంటూరు: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాళ్లు అనికేత్ రెడ్డి, యశ్వంత్ రామ్ శుభారంభం చేశారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అనికేత్ రెడ్డి 15–10, 15–8తో అర్జున్ కృష్ణన్ (తమిళనాడు)పై గెలుపొందగా, యశ్వంత్ 15–11, 15–11తో ఉమంగ్ కౌశిక్ (ఉత్తరాఖండ్)పై నెగ్గాడు. మిగతా మ్యాచ్‌ల్లో వెంకట హర్షవర్ధన్ (ఏపీ) 4–15, 15–13, 15–10తో కవియరాసన్ (తమిళనాడు)పై, అనురాగ్ (ఏపీ) 15–1, 15–4తో హేమంత్ సింగ్ (కర్ణాటక)పై, పవన్ కుమార్ (ఏపీ) 16–14, 9–2తో సోహం నవందర్ (మహారాష్ట్ర)పై, దత్తాత్రేయ రెడ్డి (ఏపీ) 15–11, 15–7తో తుషార్ మక్కర్ (హరియాణా)పై, సాయి నాగ కోటేశ్వర్ (ఏపీ) 15–8, 15–6తో ఉమాకాంత్ సర్గే (మహారాష్ట్ర)పై, శరత్ (ఏపీ) 15–5, 15–3తో నితిన్ కుమార్ (హరియాణా)పై, సుమంత్ (ఏపీ) 15–4, 18–20, 15–10తో ఆశిష్ (తమిళనాడు)పై విజయం సాధించారు. రోహన్ (మహారాష్ట్ర) 15–3, 15–4తో మురళీధర్ (ఏపీ)పై, వెళవన్ (తమిళనాడు) 15–5, 15–9తో ధీరజ్ (ఏపీ)పై గెలుపొందగా, యద్దనపూడి అమ్మన్న గౌడ్ (తెలంగాణ) వాకోవర్‌తో ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రజ్ఞ (ఏపీ) 12–15, 15–12, 15–11తో అంతర దాస్ (తెలంగాణ)పై విజయం సాధించగా, శ్రేయ రెడ్డి (తెలంగాణ) 0–15, 3–15తో విభూతి శర్మ (ఢిల్లీ) చేతిలో, వన్షిక కపిల (తెలంగాణ) 15–11, 12–15, 13–15తో షాలిని శుక్లా (ఉత్తర ప్రదేశ్) చేతిలో, ప్రవళిక 3–15, 5–15తో ఆరుషి శర్మ (తమిళనాడు) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్డ్ డబుల్స్‌లో గోపాలకృష్ణ–ప్రీతి (తెలంగాణ) జోడి 15–4, 15–9తో వినోద్–అశ్రిత (తమిళనాడు) జంటపై గెలిచింది. అంతకుముందు జరిగిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. -
డబుల్స్ ఫైనల్లో మనీషా ద్వయం
సాక్షి, హైదరాబాద్: పోలిష్ ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి కె. మనీషా భారత్‌కే చెందిన తన భాగస్వామి ఆరతి సారా సునీల్‌తో కలిసి ఫైనల్లోకి ప్రవేశించింది. పోలాండ్లోని బీరన్ నగరంలో శనివారం జరిగిన మహిళల డబుల్స్ సెమీఫైనల్లో మనీషా–ఆరతి జోడీ 21–12, 21–13తో కార్నెలియా మార్క్‌జాక్–మగ్దలీనా విటెక్ (పోలాండ్) జంటపై విజయం సాధించింది. -
ఫైనల్లో శ్రీకృష్ణప్రియ
ఖార్కివ్ (ఉక్రెయిన్): హైదరాబాదీ యువ క్రీడాకారిణి శ్రీకృష్ణప్రియ ఫొర్జా ఖార్కివ్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఆమె శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో 6–21, 21–12, 21–14తో ఐదో సీడ్ మరియా మిత్సోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో 22–20, 21–4తో అలెసియా జయిత్సవ (బెలారస్)ను ఓడించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో శ్రీకృష్ణప్రియ... ఉక్రెయిన్‌కు చెందిన ఏడో సీడ్ నటాలియా వొయెత్సెఖ్తో తలపడనుంది. కిడాంబి శ్రీకాంత్ సోదరుడు నందగోపాల్ మిక్స్డ్, పురుషుల డబుల్స్‌లో తుదిపోరుకు అర్హత పొందాడు. మిక్స్డ్ సెమీస్‌లో మూడో సీడ్ నందగోపాల్–మహిమా అగర్వాల్ (భారత్) జంట 21–18, 21–15తో జోచిమ్ పెర్సన్–ఎమిలీ జువుల్ (డెన్మార్క్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ సెమీస్‌లో నందగోపాల్–రోహన్ కపూర్ (భారత్) జోడి 21–13, 21–14తో భారత్‌కే చెందిన ఉత్కర్‡్ష అరోరా–స్వర్ణరాజ్ బొరా ద్వయంపై గెలిచింది. -
గాయత్రి–సామియా జంట ఓటమి
పుణే: ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పుల్లెల గాయత్రి–సామియా ఇమాద్ ఫారుఖీ (భారత్) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో గాయత్రి–సామియా ద్వయం 19–21, 26–24, 15–21తో యుయి సుజు–మో యామగుచి (జపాన్) జంట చేతిలో పోరాడి ఓడింది. సింగిల్స్ విభాగంలోనూ భారత క్రీడాకారిణులు నిరాశపరిచారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రాషి జోషి 11–21, 21–23తో పత్తారసుద చాయ్‌వాన్ (థాయ్‌లాండ్) చేతిలో, జక్కా వైష్ణవి రెడ్డి 18–21, 21–18, 15–21తో మెంగ్ జూ (చైనా) చేతిలో, సామియా 9–21, 21–18, 18–21తో రెండో సీడ్ ఆకర్షి కశ్యప్ (భారత్) చేతిలో పరాజయం పాలయ్యారు. -
ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత రుత్విక శివాని
పుణే వేదికగా జరిగిన ఆలిండియా ర్యాంకింగ్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడా కారిణి గద్దె రుత్విక శివాని చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక శివాని 21–10, 21–13తో ఐదో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచే క్రమంలో ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన రుత్విక శివాని తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రుత్విక నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది. -
క్వార్టర్స్‌లో కశ్యప్
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. వీరిద్దరితో పాటు ప్రణయ్, సౌరభ్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో కశ్యప్ 21–9, 21–8తో ఆస్కార్ గువో (న్యూజిలాండ్)పై, సిరిల్ వర్మ 21–14, 21–16తో సపుత్ర విక్కీ అంగా (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 23–21, 21–18తో ఫర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై, సౌరభ్ వర్మ 21–16, 21–16తో విబవో (ఇండోనేసియా)పై గెలిచారు. -
కశ్యప్ శుభారంభం
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్, సిరిల్ వర్మ, సౌరభ్ వర్మ శుభారంభం చేయగా... రెండో సీడ్ అజయ్ జయరామ్ పరాజయం చవిచూశాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో కశ్యప్ కేవలం 22 నిమిషాల్లో 21–5, 21–10తో రుంబాకా (ఇండోనేసియా)ను చిత్తుగా ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ప్రణయ్ 21–14, 21–16తో రుస్తావితో (ఇండోనేసియా)పై, సౌరభ్ వర్మ 21–17, 21–15తో నాథన్ (ఆస్ట్రేలియా)పై, సిరిల్ వర్మ 21–13, 21–12తో రియాంతో సుబగ్జా (ఇండోనేసియా)పై గెలిచారు. అజయ్ జయరామ్ 19–21, 13–21తో చియా హుంగ్ లూ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. -
కశ్యప్ ముందంజ
కాలిఫోర్నియా: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో కశ్యప్ 21–19, 21–10తో నికులా కరుణరత్నె (శ్రీలంక)పై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్లో కశ్యప్ 21–18, 17–6తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి గెర్గిలీ క్రసుజ్ (హంగేరి) గాయంతో వైదొలిగాడు . ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో సమీర్ వర్మ 18–21, 21–14, 21–18తో తొమ్మిదో సీడ్ యోగర్ కోల్హో (బ్రెజిల్)పై, ప్రణయ్ 21–8, 14–21, 21–16తో మార్క్ కాల్జు (నెదర్లాండ్స్)పై విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సమీర్ వర్మతో కశ్యప్; సునెయామ (జపాన్)తో ప్రణయ్ తలపడతారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో శ్రీకృష్ణప్రియ 11–21, 10–21తో జాంగ్ మీ లీ (కొరియా) చేతిలో, రితూపర్ణ దాస్ 15–21, 20–22తో నటాలియా కోచ్ రోడ్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు.