జకార్తా: ఈ ఏడాది ఆడుతున్న మూడో టోర్నమెంట్‌లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మలేసియా ఓపెన్‌లో తొలి రౌండ్‌లో, ఇండియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా... తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సైనా 15–21, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ హాన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏ దశలోనై చైనా ప్లేయర్‌కు పోటీనివ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనైతే సైనా ఆరంభంలోనే వరుసగా 10 పాయింట్లు కోల్పోయి 0–10తో వెనుకబడిపోయింది.
క్వార్టర్స్‌లో లక్ష్య సేన్
ఇక రెండో గేమ్‌లో సైనా తొలుత వరుసగా మూడు పాయింట్లు, అనంతరం వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–8, 21–17తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా)పై గెలుపొందాడు.
చదవండి: పోటీకి సిద్ధమైన రెజ్లర్లు
ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టోర్నీ జాగ్రెబ్ ఓపెన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగేందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు క్రొయేషియాలో జరిగే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్, రవి కుమార్, దీపక్ పూనియాలు పోటీపడనున్నారు.
వీరితోపాటు మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షు మలిక్ బరిలోకి దిగనున్నారు. ఒకవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు కాగా.. మరోవైపు ఈ మేరకు రెజ్లర్లు టోర్నికి సిద్ధం కావడం విశేషం.
చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు
Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్‌లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే?
Comments
Please login to add a commentAdd a comment