Indonesia Masters Open
-
సాత్విక్–చిరాగ్ జోడీ అవుట్
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ జంట సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. సాత్విక్–చిరాగ్ జంట 20–22, 21–23తో కిట్టినపొంగ్ కెడ్రెన్–డెచాపోల్ (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత నంబర్‌వన్ లక్ష్యసేన్ 16–21, 21–12, 21–23తో నిషిమోటో (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయాడు. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో, మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో తనీషా–అశ్విని జోడీలు ఓటమి పాలయ్యాయి. -
సింధుకు షాక్
జకార్తా: ఈ ఏడాది బరిలోకి దిగిన రెండో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. ఇండియా ఓపెన్–750 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించిన సింధు... ఇండోనేసియా మాస్టర్స్ –500 టోర్నమెంట్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 32వ ర్యాంకర్ థుయి లిన్ నుయెన్ (వియత్నాం) 22–20, 21–12తో సింధుపై సంచలన విజయం సాధించింది.గతంలో సింధుతో ఆడిన రెండుసార్లూ (2022 సింగపూర్ ఓపెన్, 2023 ఆర్క్టిక్ ఓపెన్) ఓడిపోయిన నుయెన్ మూడో ప్రయత్నంలో గెలుపు రుచి చూసింది. 37 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో స్కోరు 14–20 వద్ద నుయెన్ ఒక్కసారిగా చెలరేగిపోయింది. వరుసగా 8 పాయింట్లు గెలిచి గేమ్‌ను సొంతం చేసుకుంది. చేజేతులా తొలి గేమ్‌ను చేజార్చుకున్న సింధు రెండో గేమ్‌లో తడబడింది. ఆరంభంలోనే 1–6తో వెనుకబడిన సింధు ఆ తర్వాత కోలుకోలేకపోయింది. మహిళల సింగిల్స్‌లో పోటీపడ్డ ఇతర భారత క్రీడాకారిణులు ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్, రక్షిత శ్రీ, తాన్యా హేమంత్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఆకర్షి 10–21, 13–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 12–21, 5–21తో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గ్రెగోరియా మరిస్కా టున్‌జుంగ్ (ఇండోనేసియా) చేతిలో, తాన్యా 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ (థాయ్‌లాండ్) చేతిలో, రక్షిత శ్రీ 17–21, 19–21తో టొమోక మియకాజి (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా–సుకిత్త (థాయ్‌లాండ్) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 9–21, 13–21తో గ్రెగొరీ మేర్స్–జెన్నీ మేర్స్ (ఇంగ్లండ్) జంట చేతిలో ఓడిపోగా... ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (భారత్) ద్వయం 21–18, 21–14తో అద్నాన్ మౌలానా–ఇందా చాయసారి (ఇండోనేసియా) జోడీపై గెలిచింది. లక్ష్య సేన్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్ 21–9, 21–14తో ఒబయాషి (జపాన్)పై నెగ్గాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కిరణ్ జార్జి (భారత్) 12–21, 10–21తో హైక్ జిన్ జియోన్ (కొరియా) చేతిలో, ఆయుశ్ శెట్టి (భారత్) 19–21, 19–21తో షి యుకి (చైనా), ప్రియాన్షు (భారత్) 14–21, 21–13, 18–21తో కొడాయ్ నరోకా (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. -
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–16, 21–15తో చెన్ జి రే–లిన్ యు చియె (చైనీస్ తైపీ) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత జోడీకి ప్రతిఘటన ఎదురైనా కీలకదశల్లో పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి గేమ్‌లో స్కోరు 17–16 వద్ద సాత్విక్–చిరాగ్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. రెండో గేమ్‌లోనూ భారత ద్వయం దూకుడు కొనసాగించి ఆరంభంలోనే 12–5తో ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు.సాత్విక్–చిరాగ్ జంట ఆడిన గత మూడు టోర్నీలలో (చైనా మాస్టర్స్, మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) సెమీఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప (భారత్) జంట కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. తొలి రౌండ్లో తనీషా–అశ్విని ద్వయం 21–6, 21–14తో ఒర్నిచా జోంగ్సతాపోర్న్పార్న్–సుకిత్త సువాచాయ్ (థాయ్‌లాండ్) జంటపై గెలిచింది. సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టితో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ శ్రీకాంత్ 7–21, 15–21తో ఓడిపోవడం గమనార్హం.మహిళల క్వాలిఫయింగ్ తొలి రౌండ్లో తాన్యా హేమంత్ 16–21, 21–17, 21–15తో టుంగ్ సియో టాంగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. మరో మ్యాచ్‌లో ఇషారాణి బారువా 18–21, 20–22తో చియారా మార్వెలా హండాయో (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయి మెయిన్ ‘డ్రా’కు చేరుకోవడంలో విఫలమైంది. -
పెళ్లి తర్వాత తొలిసారి..
ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్...ఒకే ఏడాది నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించి... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన ఘనత... బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో ఇలా ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రస్తుతం పునర్వైభవం సాధించాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టిన 31 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది తొలిసారి రాకెట్ పట్టి బ్యాడ్మింటన్ కోర్టులో అడుగు పెట్టనున్నాడు. జకార్తా వేదికగా మంగళవారం నుంచి మొదలయ్యే సీజన్ మూడో టోర్నమెంట్ ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నమెంట్లో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ విభాగంలో పోటీపడనున్నాడు. భారత్‌కే చెందిన ఆయుశ్ శెట్టితో శ్రీకాంత్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ గెలిస్తే మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 45వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో చైనా ప్లేయర్ షి ఫెంగ్ లీతో తలపడే అవకాశం ఉంది. గత ఏడాది శ్రీకాంత్ 14 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. స్విస్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరుకొని తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో భారత్ నుంచి కిరణ్ జార్జి, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. తొలి రౌండ్లో కిరణ్ జార్జి క్వాలిఫయర్‌తో... టకుమా ఒబయాషి (జపాన్)తో లక్ష్య సేన్... కొడాయ్ నరోకా (జపాన్)తో ప్రియాన్షు ఆడతారు. తొలి రోజు మంగళవారం సింగిల్స్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు, డబుల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. బరిలో పీవీ సింధుమరోవైపు... మహిళల సింగిల్స్ విభాగంలో క్వాలిఫయింగ్‌లో ఇషారాణి బారువా, తాన్యా హేమంత్ పోటీపడనున్నారు. మెయిన్ ‘డ్రా’లో పీవీ సింధు, రక్షితశ్రీ, ఆకర్షి కశ్యప్, అనుపమ ఉపాధ్యాయ్ బరిలో ఉన్నారు. మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప; పురుషుల డబుల్స్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; మిక్స్డ్ డబుల్స్‌లో గద్దె రుతి్వక శివాని–రోహన్ కపూర్; తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. మరిన్ని క్రీడా వార్తలుహరికృష్ణ ఖాతాలో తొలి ‘డ్రా’ టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ మాస్టర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. నెదర్లాండ్స్‌లోని విక్ ఆన్ జీ నగరంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. భారత్‌కే చెందిన లియోన్ ల్యూక్ మెండోకాతో సోమవారం జరిగిన మూడో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 44 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో జ్యోతి సురేఖ ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మరోసారి కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది. సోమవారం విడుదల చేసిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్స్‌లో విజయవాడకు చెందిన 28 ఏళ్ల జ్యోతి సురేఖ రెండు స్థానాలు పురోగతి సాధించి రెండో ర్యాంక్‌లో నిలిచింది. గత ఏడాది ఏప్రిల్‌లో జ్యోతి సురేఖ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను సాధించింది. 2011 నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జ్యోతి సురేఖ అంతర్జాతీయస్థాయిలో 30 కంటే ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంది. -
కిదాంబి శ్రీకాంత్‌తో హండ్రెడ్ స్పోర్ట్స్ భాగస్వామ్యం
సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ లెజెండ్, మాజీ ప్రపంచ నెంబర్ వన్ శ్రీకాంత్ కిదాంబితో హండ్రెడ్ స్పోర్ట్స్ జట్టు కట్టింది. అంతర్జాతీయ వేదికగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన హండ్రెడ్ స్పోర్ట్స్.. తమ బ్రాండ్ ఉనికిని బలోపేతం చేయాలనే లక్ష్యంలో శ్రీకాంత్‌తో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించింది. ఈ భాగస్వామ్యం ప్రతిష్టాత్మక ఇండోనేషియా మాస్టర్స్-2025 టోర్నీలో అధికారికంగా మొదలుకానుంది. ఇది భవిష్యత్ తరం బ్యాడ్మింటన్ ఔత్సాహికులను ప్రేరేపించడానికి, ప్రోత్సాహం అందించడానికి హండ్రెడ్ నిబద్ధతకు ప్రతీకగా నిలవనుంది.కాగా 2024లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గూగుల్-డెలాయిట్ థింక్ స్పోర్ట్స్ నివేదిక.. 'ప్రస్తుతం భారత్ లో Gen Zలో బ్యాడ్మింటన్ క్రీడ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ'గా వెల్లడించింది. దేశంలో క్రికెట్ తర్వాత రెండవ స్థానంలో బ్యాడ్మింటన్ ఉంది. ఇలాంటి తరుణంలో శ్రీకాంత్ కిదాంబి హండ్రెడ్ తో కొనసాగనున్న అనుబంధం భారతదేశంలోని క్రీడాభివృద్ధిని పెంపొందించడానికి, యువ ప్రతిభను పెంపొందించడానికి బ్రాండ్ కనబరుస్తున్న అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.బ్యాడ్మింటన్‌తో సహా భారతదేశంలోని అన్ని క్రీడా విభాగాలలో ఆధిపత్యం చెలాయించడం, అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ వారసత్వ ఆటగాళ్లతో పోటీ పడటం హండ్రెడ్ లక్ష్యాలు. ఈ ప్రయాణంలో ప్రస్తుత భాగస్వామ్యం నూతన ఆవిష్కరణలతో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది.ఆనందంగా ఉందిఇక హండ్రెడ్ స్పోర్ట్స్ తో భాగస్వామ్యం, అనుబంధం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.., "నా ప్రదర్శన పట్ల, నా క్రీడా ప్రయాణాన్ని ప్రతిబింబించగలిగే బ్రాండ్ అయిన హండ్రెడ్‌తో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప కలయికతో తదుపరి తరం బ్యాడ్మింటన్ ఆటగాళ్లను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని తెలిపారు.హండ్రెడ్ సింగపూర్ డైరెక్టర్ మనక్ కపూర్ మాట్లాడుతూ.., "శ్రీకాంత్‌ను హండ్రెడ్ కుటుంబంలోకి స్వాగతించడం ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్ మూలాలను మరింత ముందుకు తీసుకెళ్లాలననే మా నిబద్ధతకు నిదర్శనం. ఈ మిషన్‌ను నడిపించడంలో శ్రీకాంత్‌ను కీలకమైన వ్యక్తిగా మేము చూస్తున్నాము.ముఖ్యంగా భారతదేశంలో అతడి క్రీడా వారసత్వం, ప్రభావం యువ ఆటగాళ్లను బ్యాడ్మింటన్ క్రీడను స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా తమ క్రీడా ప్రయాణాన్ని అత్యున్నత స్థాయిలలో పోటీ పడటానికి బాటలు వేస్తుంద"ని పేర్కొన్నారు.వ్యూహాత్మకంగా ముందుకుహండ్రెడ్ ఇండియా డైరెక్టర్ విశాల్ జైన్ మాట్లాడుతూ.., “గత దశాబ్ద కాలంలో భారతదేశంలో బ్యాడ్మింటన్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో యువతరంలో రెండవ అత్యధికంగా ఆడే క్రీడగా మారింది. హండ్రెడ్‌లో అధిక పనితీరు గల ఉత్పత్తులను అందించడం ద్వారా మాత్రమే కాకుండా, క్రీడా రంగ పరిశ్రమను చురుకుగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ వృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని" వివరించారు.ఎలైట్ "క్లబ్ హండ్రెడ్" బృందం:👉లైన్ క్జార్స్ఫెల్డ్ట్ (డెన్మార్క్)👉 రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)👉మాడ్స్ క్రిస్టోఫర్సెన్ (డెన్మార్క్)👉అలెగ్జాండ్రా బోజే (డెన్మార్క్)👉 డెజాన్ ఫెర్డినాన్సియా (ఇండోనేషియా)👉గ్లోరియా ఎమాన్యుయెల్ విడ్జాజా (ఇండోనేషియా).చదవండి: వారానికి రూ. 5 కోట్లు.. జాక్‌పాట్ కాదు! అంతకు మించి.. -
కిరణ్ జార్జి సంచలనం
ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్, ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 13–21, 21–18తో ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ౖఫైనల్కు చేరాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్, ప్రియాన్షు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఓటమి
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ హెచ్ఎస్ ప్రణయ్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టగా... లక్ష్య సేన్, ప్రియాన్షుæ, కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. జకార్తాలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21–19, 14–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో... ప్రణయ్ 18–21, 21–19, 10–21తో లో కీన్ యె (సింగపూర్) చేతిలో ఓడిపోయారు. -
Indonesia Masters: మెయిన్ ‘డ్రా’కు కిరణ్ జార్జి అర్హత
ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ కిరణ్ జార్జి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లోనూ ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి గెలుపొందాడు. కేరళకు చెందిన 23 ఏళ్ల కిరణ్ తొలి రౌండ్లో 12–21, 21–18, 22–20తో లానియర్ (ఫ్రాన్స్)పై, రెండో రౌండ్లో 21–17, 12–21, 21–15తో రుస్తావిటో (ఇండోనేసియా)పై నెగ్గాడు. -
ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీకి సాత్విక్ జోడీ దూరం
జకార్తాలో నేటి నుంచి జరిగే ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ వైదొలిగింది. ఈ టోర్నీలో సాత్విక్ –చిరాగ్‌లకు టాప్ సీడింగ్ దక్కింది. ఈ నెలలో ఆడిన రెండు టోర్నీల్లోనూ (మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్) సాత్విక్ –చిరాగ్ జంట రన్నరప్‌గా నిలిచింది. ఇండోనేసియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు ప్రణయ్, శ్రీకాంత్, లక్ష్య సేన్, ప్రియాన్షు రజావత్ బరిలో ఉన్నారు. -
సైనాకు చేదు అనుభవం
జకార్తా: ఈ ఏడాది ఆడుతున్న మూడో టోర్నమెంట్లోనూ భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది. మలేసియా ఓపెన్‌లో తొలి రౌండ్లో, ఇండియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన సైనా... తాజాగా ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 టోర్నీలోనూ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 28వ ర్యాంకర్ సైనా 15–21, 7–21తో ప్రపంచ 11వ ర్యాంకర్ హాన్ యు (చైనా) చేతిలో పరాజయం పాలైంది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏ దశలోనై చైనా ప్లేయర్‌కు పోటీనివ్వలేకపోయింది. తొలి గేమ్‌లోనైతే సైనా ఆరంభంలోనే వరుసగా 10 పాయింట్లు కోల్పోయి 0–10తో వెనుకబడిపోయింది. క్వార్టర్స్‌లో లక్ష్య సేన్ ఇక రెండో గేమ్‌లో సైనా తొలుత వరుసగా మూడు పాయింట్లు, అనంతరం వరుసగా ఎనిమిది పాయింట్లు సమర్పించుకొని కోలుకోలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 19–21, 21–8, 21–17తో ఎన్జీ జె యోంగ్ (మలేసియా)పై గెలుపొందాడు. చదవండి: పోటీకి సిద్ధమైన రెజ్లర్లు ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టోర్నీ జాగ్రెబ్ ఓపెన్ గ్రాండ్‌ప్రిలో బరిలోకి దిగేందుకు భారత అగ్రశ్రేణి రెజ్లర్లు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు క్రొయేషియాలో జరిగే ఈ టోర్నీలో టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలు బజరంగ్, రవి కుమార్, దీపక్ పూనియాలు పోటీపడనున్నారు. వీరితోపాటు మహిళా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, అన్షు మలిక్ బరిలోకి దిగనున్నారు. ఒకవైపు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ కమిటీ ఏర్పాటు కాగా.. మరోవైపు ఈ మేరకు రెజ్లర్లు టోర్నికి సిద్ధం కావడం విశేషం. చదవండి: Team India: అలా అయితే ఆ రెండు జట్లను బ్యాన్ చేయాలి! క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు అక్కడ లేరు Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్లో ఎన్ని గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు అంటే? -
ఒలింపిక్ ఛాంపియన్‌కు షాకిచ్చిన భారత షట్లర్
బాలీ: ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. టోర్నీ రెండో సీడ్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 14–21, 21–19, 21–16తో విక్టర్ అక్సెల్సన్పై గెలుపొందాడు. 71 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్... రెండో గేమ్ నుంచి పుంజుకున్నాడు. అద్భుతమైన స్మాష్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు. రెండు, మూడు గేమ్‌ల్లో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. విక్టర్ అక్సెల్సన్పై ప్రణయ్‌కిదే తొలి విజయం. గతంలో అతడితో ఆడిన ఐదు సార్లు కూడా ప్రణయ్ ఓడిపోయాడు. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 13–21, 21–18, 21–15తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై నెగ్గగా... లక్ష్యసేన్ 13–21, 19–21తో ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల పిక్వ్రార్టర్స్‌లో పీవీ సింధు 17–21, 21–7, 21–12 క్లారా అజుర్మెండి (స్పెయిన్)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ ఐదో ర్యాంక్ జంటను ఓడించిన సిక్కి రెడ్డి–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం పోరాటం ప్రిక్వార్టర్స్‌లో ముగిసింది. సిక్కి రెడ్డి–ధ్రువ్ జంట 15–21, 23–21, 18–21తో జోమ్కో–సుపిసార (థాయ్‌లాండ్) జోడీ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కి రెడ్డి (భారత్) జోడీ 18–21, 12–21తో కిటిట్‌హరకుల్–రవిండ ప్రజోంగ్జ (థాయలాండ్) జంట చేతిలో ఓడింది. -
ఇండోనేసియా మాస్టర్స్ ఓపెన్‌లో సింధు శుభారంభం..
బాలి: ఇండోనేసియా మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21–15, 21–19తో సుపనిద (థాయ్‌లాండ్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో లక్ష్య సేన్ (భారత్) 21–17, 18–21, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్ కాంటా సునెయామ (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 9–21, 21–11, 21–18తో బోయె– మెటీ పౌల్సెన్ (డెన్మార్క్) జోడీపై నెగ్గగా... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్ సా యిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 17–21, 15–21తో ఒంగ్ యె సిన్–తెయో ఈ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది. చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టి20.. వెంకటేశ్ అయ్యర్‌పై ద్రవిడ్ దృష్టి -
ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్ సైనాదే
జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్ వరల్డ్ సూపర్-500 టోర్నమెంట్ విజేతగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ నిలిచింది. స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన సైనా నెహ్వాల్.. గేమ్ ముగియకుండానే టైటిల్‌ని ఖాతాలో వేసుకుంది. ఆట ప్రారంభం నుంచి దూకుడు ప్రదర్శించిన కరోలినా.. సైనాపై ఆధిపత్యం ప్రదర్శించింది. ఓ దశలో 7-2తో ఆధిక్యంలో ఉన్న సమయంలో కరోలినా కాలికి గాయం అవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యింది. ప్రాథమిక చికిత్స అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభించిన కరోలినా మరో రెండు పాయింట్లు సాధించన అనంతరం మరోసారి గాయం తిరగబెట్టడంతో ఫైనల్ పోరు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది. దీంతో టోర్నీ నిర్వాహకులు సైనా నెహ్వాల్‌ను విజేతగా ప్రకటించారు. ఈ టైటిల్ గెలవడంతో ఈ ఏడాది తొలి మాస్టర్స్ టైటిల్‌ను సైనా తన ఖాతాలో వేసుకుంది. మలేషియా మాస్టర్స్ సెమీఫైనల్లో సైనా.. కరోలినా చేతిలో ఓడిన విషయం తెలిసిందే. గతేడాది కూడా ఇండోనేసియా మాస్టర్స్ ఫైనల్ చేరిన సైనా తుది పోరులో ఓటమి చవిచూసింది. -
క్వార్టర్స్‌కు సింధు, శ్రీకాంత్
జకార్తా: భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లు ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో భాగంగా మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సింధు 23-21, 21-7 తేడాతో గ్రెగోరియా మరిస్కా (ఇండోనేసియా)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించగా, పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ పోరులో ఎనిమిదో సీడ్ శ్రీకాంత్ 21-14, 21-9 తేడాతో కెంటో నిషిమోటో (జపాన్)పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో సింధు తొలి గేమ్‌ను పోరాడి గెలవగా, రెండో గేమ్‌లో అవలీలగా సొంతం చేసుకున్నారు. కేవలం 37 నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు తన అనుభవాన్ని ఉపయోగించి క్వార్టర్లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో కరోలినా మారిన్(స్పెయిన్)తో సింధు తలపడే అవకాశం ఉంది. ఇక పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏకపక్ష విజయం సాధించాడు. తొలి గేమ్‌ను 21-14తో గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌లో పెద్దగా కష్టపడకుండానే సొంతం చేసుకున్నాడు. -
మళ్లీ నిరాశ
జకార్తా: కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించాలని ఆశించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ అమ్మాయి రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ సైనా 9–21, 13–21తో ఓడిపోయింది. కేవలం 27 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేకపోయింది. రెండు గేముల్లోనూ ఆరంభం నుంచే తై జు యింగ్ జోరు కొనసాగింది. సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. తై జు యింగ్‌పై సైనా చివరిసారి 2013 స్విస్ ఓపెన్‌లో గెలుపొందడం గమనార్హం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
సైనా, సింధు శుభారంభం
జకర్తా: ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్ పోటీల్లో సింధు 21–13, 21–10తో హన్న రమదిని (ఇండోనేసియా)పై, సైనా 22–24, 21–15, 21–14తో ఏడో సీడ్ చెన్ యుఫె (చైనా)పై గెలుపొందారు. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మకు మొదటి రౌండ్లోనే చుక్కెదురైంది. అతను 16–21, 21–12, 10–21తో కజుమస సాకాయ్ (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. పురుషుల డబుల్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–15, 21–17తో ఎనిమిదో సీడ్ తకుటో ఇనోయె – యుకి కనెకో (జపాన్) జంటపై విజయం సాధించగా, మను అత్రి– సుమిత్ రెడ్డి జోడి 18–21, 21–16, 16–21తో లు చింగ్ యో– యంగ్ పొ హన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. పారుపల్లి కశ్యప్ 18–21, 18–21తో వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
టైటిల్ పోరుకు శ్రీకాంత్
మలాంగ్: వరుస వైఫల్యాల తర్వాత భారత నంబర్‌వన్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇండోనేసియా మాస్టర్స్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ శ్రీకాంత్ 21-13, 21-19తో ప్రపంచ 39వ ర్యాంకర్ జిన్‌టింగ్ ఆంథోనీ (ఇండోనేసియా)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో శ్రీకాంత్ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1-2తో వెనుకంజలో ఉన్నాడు. ఆంథోనీతో 38 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ నిలకడైన ఆటతీరును కనబరిచి ఎనిమిది నెలల తర్వాత మరోసారి ఓ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచిన తర్వాత శ్రీకాంత్ ఫామ్ కోల్పోయాడు. బరిలోకి దిగిన 15 టోర్నమెంట్లలో క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అయితే తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకున్న ఈ తెలుగు తేజం ఇండోనేసియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకొని మళ్లీ గాడిలో పడ్డాడు. ఈ ఏడాది ఇండోనేసియా సూపర్ సిరీస్ టోర్నీలో ఆంథోనీ చేతిలో ఓడిన శ్రీకాంత్ ఈసారి పట్టుదలతో ఆడాడు. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే పట్టు బిగించాడు. తొలి గేమ్‌లో 7-2తో ముందంజ వేసిన శ్రీకాంత్ ఆ తర్వాత ఇదే జోరును కొనసాగించాడు. స్కోరు 15-13 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్ మొదట్లో శ్రీకాంత్ 5-8తో వెనుకబడ్డాడు. ఈ దశలో శ్రీకాంత్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా 11 పాయింట్లు సాధిం చాడు. 16-8తో ఆధిక్యం లోకి వెళ్లాడు. ఆంథోనీ కోలుకునే ప్రయత్నం చేసినా శ్రీకాంత్ సంయమనంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.