Indonesia Masters: మెయిన్‌ ‘డ్రా’కు కిరణ్‌ జార్జి అర్హత  | Kiran George Enters Main Draw Of Indonesia Masters | Sakshi
Sakshi News home page

Indonesia Masters: మెయిన్‌ ‘డ్రా’కు కిరణ్‌ జార్జి అర్హత 

Published Wed, Jan 24 2024 9:44 AM | Last Updated on Wed, Jan 24 2024 9:44 AM

Kiran George Enters Main Draw Of Indonesia Masters - Sakshi

ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ కిరణ్‌ జార్జి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన రెండు క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌ల్లోనూ ప్రపంచ 36వ ర్యాంకర్‌ కిరణ్‌ జార్జి గెలుపొందాడు.

కేరళకు చెందిన 23 ఏళ్ల కిరణ్‌ తొలి రౌండ్‌లో 12–21, 21–18, 22–20తో లానియర్‌ (ఫ్రాన్స్‌)పై, రెండో రౌండ్‌లో 21–17, 12–21, 21–15తో రుస్తావిటో (ఇండోనేసియా)పై నెగ్గాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement