ఇండోనేసియా మాస్టర్స్‌ ఓపెన్‌లో సింధు శుభారంభం.. | PV Sindhu to spearhead Indias campaign at Indonesia Masters Super 750 tournament | Sakshi

Indonesia Masters Open: సింధు శుభారంభం..

Nov 17 2021 7:46 AM | Updated on Nov 17 2021 7:46 AM

PV Sindhu to spearhead Indias campaign at Indonesia Masters Super 750 tournament - Sakshi

బాలి: ఇండోనేసియా మాస్టర్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21–15, 21–19తో సుపనిద (థాయ్‌లాండ్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో లక్ష్య సేన్‌ (భారత్‌) 21–17, 18–21, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్‌ కాంటా సునెయామ (జపాన్‌)పై సంచలన విజయం సాధించాడు.

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం 9–21, 21–11, 21–18తో బోయె– మెటీ పౌల్సెన్‌ (డెన్మార్క్‌) జోడీపై నెగ్గగా... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సా యిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జంట 17–21, 15–21తో ఒంగ్‌ యె సిన్‌–తెయో ఈ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయింది.

చదవండి: IND vs NZ: కివీస్‌తో తొలి టి20.. వెంకటేశ్‌ అయ్యర్‌పై ద్రవిడ్‌ దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement