పీవీ సింధు(ఫైల్‌ఫొటో)
ముంబై: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు తన అధికారిక స్పాన్సర్ యోనెక్స్ క్షమాపణలు తెలియజేసింది. తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురికావడం వల్లే భారత్‌ను కించపరిచేలా సందేశం వచ్చిందని యోనెక్స్ వివరణ ఇచ్చింది. ఈ క్రమంలోనే సింధును క్షమించమంటూ విన్నవించింది.
'గుడ్ బై సింధు. భారత్‌లాంటి పేద దేశానికి చెందిన ఆటగాళ్లు ఇక మా స్పాన్సర్‌షిప్ పొందబోరు. ఇక మా దృష్టంతా జపాన్ యువ క్రీడాకారులపైనే' అని యోనెక్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సింధుకు మెసేజ్ వచ్చింది. అసలు ఏమి జరిగిందో తెలుసుకునేలోపే మరొక మెసేజ్ యోనెక్స్ నుంచి సింధుకు రావడంతో ఆమె ఊరట చెందింది. 'మా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ (యోనెక్స్ డాట్ కామ్)నుంచి మాకు తెలియకుండా పోస్ట్ అయిన ఆ అసంబద్ధ మెసేజ్ కారణంగా యోనెక్స్ అభిమానులందరికీ నిజాయితీగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మా అకౌంట్ హ్యాక్ అయింది. అంతలోనే సమస్య పరిష్కారం అయింది. మా అకౌంట్ మరింత భద్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్‌లో ఇలా జరగదు' అని యోనెక్స్ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment