
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఆన్ సె యంగ్ (దక్షిణ కొరియా) చాంపియన్‌గా నిలిచింది. ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ జి యి (చైనా)తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆన్ సె యంగ్ 13–21, 21–18, 21–18తో విజయం సాధించింది. 95 నిమిషాలపాటు ఆద్యంతం హోరాహోరీగా జరిగిన ఈ తుది సమరంలో ఆన్ సె యింగ్ కీలకదశలో పాయింట్లు గెలిచి కెరీర్‌లో రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
2023లో తొలిసారి ఆన్ సె యింగ్ ఈ టైటిల్‌ను సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో చైనా ప్లేయర్, ప్రపంచ నంబర్‌వన్ షి యుకీ రెండోసారి ఈ టైటిల్‌ను దక్కించుకున్నాడు. తొలిసారి 2018లో విజేతగా నిలిచిన షి యుకీ ఫైనల్లో 21–17, 21–19తో లీ చియా హావో (చైనీస్ తైపీ)పై నెగ్గాడు. విజేతగా నిలిచిన ఆన్ సె యింగ్, షి యుకీలకు 1,01,500 డాలర్ల (రూ. 88 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment