All England Open Championship
-
All Eng Open: సంచలనాలకు సెమీస్‌లో ముగింపు..
బర్మింగ్హమ్: ప్రతిష్టాతక్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన యువ జంట గాయత్రి పుల్లెల, ట్రెసా జోలీల సంచలన ప్రదర్శన సెమీస్‌లో ముగిసింది. బర్మింగ్హమ్లో శనివారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో కొరియాకు చెందిన బేక్ నా హా, లీ సో హీ జంట చేతిలో 10-21, 10-21తో ఓటమి పాలయ్యారు. 46 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. తొలి గేమ్‌లో 0-4తో వెనుకబడిన గాయత్రి జోడి ఆ తర్వాత కాస్త ప్రతిఘటించడంతో 9-13కు తగ్గింది. ఆ తర్వాత అదే టెంపోను కొనసాగించడంలో విఫలమైన ఈ జోడి చివరకు రెండు వరుస గేముల్లో ఓడి సెమీస్‌లోనే తమ పోరాటాన్ని ముగించారు. ఒకవేళ ఫైనల్ చేరి ఉంటే మాత్రం ఈ ఇద్దరు చరిత్ర సృష్టించేవారు. కానీ ఏం చేస్తాం మంచి చాన్స్ మిస్ అయింది. #AllEngland2023 #Badminton 🏸 ✅ Defeated world No 8 ✅ Defeated world No 9 ✅ Defeated a rising pair from 🇨🇳 ❌ Lost against one of the most in-form Korean pairs End of a fine week again at All England for Gayatri Gopichand and Treesa Jolly.https://t.co/QruEtFPI0N pic.twitter.com/lGWrccz45d — The Field (@thefield_in) March 18, 2023 చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. హర్మన్ కూడా ఊహించి ఉండదు -
సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ 2023 ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ సంచలనం కొనసాగుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో జపాన్‌కు చెందిన మాజీ వరల్డ్ నెంబర్‌వన్ జోడి.. మాజీ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్స్ యుకీ ఫుకుషిమా, సయకా హిరోతా జంటపై 21-14, 24-22 తేడాతో స్టన్నింగ్ విక్టరీ అందుకొని క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. 50 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్‌ను తొందరగానే గెలుచుకున్న గాయత్రి-టెస్రా జోడి రెండో గేమ్‌ను గెలవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. భారత జోడి 9 పాయింట్లు ఆధిక్యంలో ఉన్న సమయంలో జపాన్ జంట ఫుంజుకున్నారు. అయితే ఆరవ పాయింట్ దగ్గర గాయత్రి-టెస్రాలు సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. Women on a mission went past WR-9 pair in style 😎🔥 📸: @badmintonphoto #AllEngland2023#IndiaontheRise#Badminton pic.twitter.com/ce4NANZnWN — BAI Media (@BAI_Media) March 16, 2023 ✅ @BAI_Media https://t.co/Iau4RzgK0Y pic.twitter.com/2YlD6gKmKg — 🏆 Yonex All England Badminton Championships 🏆 (@YonexAllEngland) March 16, 2023 -
All England Open Championship: గాయత్రి–ట్రెసా జోడీ సంచలనం
బర్మింగ్‌హామ్: కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 17వ ర్యాంక్ జోడీ గాయత్రి–ట్రెసా జాలీ 21–18, 21–14తో ఎనిమిదో ర్యాంక్ జోంగ్కోల్ఫోన్ కితితారాకుల్–రవీంద ప్రజోంగ్‌జై (థాయ్‌లాండ్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. 46 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో గాయత్రి, ట్రెసా పూర్తి సమన్వయంతో ఆడి ఆద్యంతం తమ ఆధిపత్యం చాటుకున్నారు. గతంలో ఈ థాయ్‌లాండ్ జోడీతో ఆడిన నాలుగుసార్లూ ఓటమి పాలైన గాయత్రి–ట్రెసా ఐదో ప్రయత్నంలో మాత్రం విజయఢంకా మోగించారు. గత ఏడాది ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ చేరి సంచలనం సృష్టించిన గాయత్రి–ట్రెసా ప్రిక్వార్టర్ ఫైనల్లో యూకీ ఫకుషిమా–సయాకా హిరోటా (జపాన్)లతో తలపడతారు. మళ్లీ తొలి రౌండ్లోనే... ఈ ఏడాది భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. వరుసగా మూడో టోర్నమెంట్లోనూ ఆమె తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 9వ ర్యాంకర్ సింధు 17–21, 11–21తో ప్రపంచ 17వ ర్యాంకర్ జాంగ్ యి మాన్ (చైనా) చేతిలో ఓడిపోయింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పలుమార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో ఒకదశలో సింధు 16–13తో ఆధిక్యంలోకి నిలిచింది. ఈ దశలో జాంగ్ యి మాన్ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఏడు పాయింట్లు గెలిచింది. 13–16 నుంచి జాంగ్ యి మాన్ 20–16తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం సింధు ఒక పాయింట్ గెలిచినా, ఆ వెంటనే జాంగ్ మరో పాయింట్ నెగ్గి తొలి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్ ఆరంభంలో ఇద్దరు 5–5తో సమంగా ఉన్నారు. ఆ తర్వాత సింధు మళ్లీ తడబడి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. ఆ తర్వాత సింధు తేరుకోలేకపోయింది. ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన తన వ్యక్తిగత కోచ్ పార్క్ తే సాంగ్‌తో విడిపోయిన సింధు ఈ ఏడాది మలేసియా ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీల్లోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ప్రస్తుతం తనకు ఎవరూ వ్యక్తిగత కోచ్ లేరని, త్వరలోనే కొత్త కోచ్‌ను నియమించుకుంటానని మ్యాచ్ అనంతరం సింధు వ్యాఖ్యానించింది. శ్రమించిన శ్రీకాంత్ పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోవడానికి కష్టపడ్డాడు. టోమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 19–21, 21–14, 21–5తో గెలుపొందాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ 21–13, 21–13తో పంజాల విష్ణువర్ధన్ గౌడ్–గరగ కృష్ణప్రసాద్ (భారత్) ద్వయంపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. -
All England Open: మారని ఆటతీరు.. తొలి రౌండ్లోనే ఓటమి
బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు చైనాకుకు చెందిన వైఎమ్ ఝాంగ్ చేతిలో 21-17, 21-11 వరుస గేముల్లో చిత్తయింది. 39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు కనీసం పోరాడలేక చేతులెత్తేసింది. కాగా ఈ ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరగడం పీవీ సింధుకు ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకముందు మలేషియా ఓపెన్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ తొలి రౌండ్లో వెనుదిరిగిన సింధు.. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. ఇక బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో భారత జోడి త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్ పుల్లెల థాయ్‌లాండ్‌కు చెందిన ఏడో సీడ్ జోంగ్‌కోల్పన్ కితిరాకుల్, రావిండా ప్రజొగ్జాంయ్‌లకు షాకిచ్చింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ జంటను 21-18, 21-14తో మట్టి కరిపించిన త్రీసా, గాయత్రి పుల్లెల ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణోయ్‌లు తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. “Still in search for a new coach”, says @Pvsindhu1 and she apologises for upsetting the Indian fans at All England, promises to bounce back stronger. @AMRIHospitals @iabhijitdesh @BoriaMajumdar #allengland2023 #IWD2023 #PVSindhu pic.twitter.com/dBiO7uFKJK — RevSportz (@RevSportz) March 15, 2023 చదవండి: WPL 2023: యూపీ వారియర్జ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ ఇవాళైనా -
లక్ష్యం చేరలేదు..!
బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలిచిన మూడో భారతీయుడిగా నిలవాలని ఆశించిన భారత యువతార లక్ష్య సేన్‌కు నిరాశే ఎదురైంది. టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన లక్ష్య సేన్ బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక ఓటమి పాలయ్యాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నంబర్‌వన్, టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్) 21–10, 21–15 స్కోరుతో లక్ష్య సేన్‌పై విజయం సాధించి రెండోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించాడు. 2020లోనూ అక్సెల్సన్ ఈ టోర్నీలో విజేతగా నిలిచాడు. 53 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో కొన్నిసార్లు లక్ష్య సేన్ దీటుగా పోరాడినా తుది ఫలితం మాత్రం ప్రతికూలంగా వచ్చింది. గత ఏడాది ఇదే టోర్నీ ఫైనల్లో అనూహ్యంగా ఓటమి పాలై రన్నరప్‌గా సంతృప్తి చెందిన అక్సెల్సన్ ఈసారి తన స్థాయికి తగ్గ ఆటతో చాంపియన్ అయ్యాడు. విజేత అక్సెల్సన్కు 70 వేల డాలర్లు (రూ. 53 లక్షల 17 వేలు), రన్నరప్ లక్ష్య సేన్‌కు 34 వేల డాలర్లు (రూ. 25 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సుదీర్ఘ ర్యాలీలతో... ఫైనల్ పోరుకు ముందు అక్సెల్సన్తో ముఖాముఖి సమరాల్లో లక్ష్య 1–4తో వెనుకంజలో ఉన్నాడు. అయితే ఆ ఒక్క విజయం ఎనిమిది రోజుల ముందే జర్మన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో వచ్చింది. దాంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న సేన్‌పై అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే విక్టర్ ఆరంభంలోనే సేన్‌ను దెబ్బ కొట్టాడు. వరుస పాయింట్లతో దూసుకుపోయిన అతను 6–0తో ముందంజలో నిలిచిన తర్వాత గానీ లక్ష్య తొలి పాయింట్ సాధించలేకపోయాడు. తొలి గేమ్ మొత్తం దాదాపు ఇదే తరహాలో సాగింది. అక్సెల్సన్ ఆధిపత్యం ముందు సేన్ జవాబివ్వలేకపోయాడు. 2–8 వద్ద 61 షాట్ల ర్యాలీ కూడా రావడంతో సేన్ బాగా అలసిపోయాడు. చక్కటి డిఫెన్స్ ప్రదర్శిస్తూ 11–2తో ముందంజ వేసిన డానిష్ ఆటగాడు దానిని కొనసాగిస్తూ అలవోకగా తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో సేన్ కొంత పోటీనిచ్చాడు. ముఖ్యంగా అతని స్మాష్‌లు మంచి ఫలితాలనిచ్చాయి. అయితే 4–4తో సమంగా ఉన్న స్థితి నుంచి అక్సెల్సన్ 11–5 వరకు తీసుకుపోగా, విరామం తర్వాత కోలుకొని వరుసగా మూడు పాయింట్లు సాధించి సేన్ 9–12తో అంతరాన్ని తగ్గించాడు. ఈ దశలో విక్టర్ మళ్లీ చెలరేగి 10–17తో ఆధిక్యంలో నిలిచాడు. ఈ సమయంలో ఇద్దరు హోరాహోరీగా తలపడుతూ 70 షాట్ల ర్యాలీ ఆడగా, సేన్‌కు పాయింట్ దక్కి స్కోరు 11–17కు చేరింది. అయితే చివర్లో లక్ష్య మూడు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా... అప్పటికే ఆలస్యమైపోయింది. అనుభవలేమి, ఒత్తిడిలో ఓటమి పాలైనా... వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలవడం 20 ఏళ్ల లక్ష్య సేన్ కెరీర్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. -
గాయత్రి–త్రిషా జంట సంచలనం
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి... ఒత్తిడిని దరిచేరనీయకుండా సహజశైలిలో ఆడితే అద్భుతాలు చేయవచ్చని భారత బ్యాడ్మింటన్ టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ నిరూపించింది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో గాయత్రి–త్రిషా ద్వయం నమ్మశక్యంకానీ రీతిలో ఆడి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ క్రమంలో వందేళ్లపైబడిన చరిత్ర కలిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన తొలి భారతీయ జోడీగా గాయత్రి–త్రిషా జంట రికార్డు నెలకొల్పింది. బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుక్రవారం అద్భుతం జరిగింది. మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే భారత టీనేజ్ జోడీ గాయత్రి గోపీచంద్–త్రిషా జాలీ సంచలనం సృష్టించింది. ఓటమి అంచుల నుంచి విజయ తీరానికి చేరి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 67 నిమిషాలపాటు జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 46వ ర్యాంక్ జోడీ గాయత్రి–త్రిషా 14–21, 22–20, 21–15తో ప్రపంచ రెండో ర్యాంక్, రెండో సీడ్ ద్వయం లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ (దక్షిణ కొరియా)పై గెలిచింది. ఈ క్రమంలో 19 ఏళ్ల కేరళ అమ్మాయి త్రిషా జాలీ, 18 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి గాయత్రి 123 ఏళ్ల చరిత్ర కలిగిన ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్ షిప్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరుకున్న భారతీయ జంటగా రికార్డు నెలకొల్పింది. గత ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం, టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచిన లీ సోహీ–షిన్ సెయుంగ్‌చాన్ జంటతో జరిగిన పోరులో గాయత్రి–త్రిషా అద్భుతంగా ఆడారు. తొలిసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడుతున్న గాయత్రి–త్రిషా తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్‌లో 18–20తో ఓటమి అంచుల్లో నిలిచారు. కొరియా జంట మరో పాయింట్ గెలిచిఉంటే గాయత్రి–త్రిషా ఇంటిదారి పట్టేవారే. కానీ అలా జరగలేదు. రెండు పాయింట్లు వెనుకంజలో ఉన్నప్పటికీ గాయత్రి–త్రిషా పట్టువదలకుండా పోరాడి వరుసగా నాలుగు పాయింట్లు గెలిచారు. రెండో గేమ్‌ను 22–20తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచారు. నిర్ణాయక మూడో గేమ్‌లో గాయత్రి–త్రిషా స్కోరు 8–8తో సమంగా ఉన్న దశలో ఒక్కసారిగా విజృంభించారు. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 13–8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ఆ తర్వాత కొరియా జోడీ తేరుకునే ప్రయత్నం చేసినా గాయత్రి–త్రిషా తమ దూకుడు కొనసాగించి ప్రత్యర్థి ఆట కట్టించారు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 276వ ర్యాంక్ జోడీ జెంగ్ యు–షు జియాన్ జాంగ్ (చైనా)లతో గాయత్రి–త్రిషా ద్వయం తలపడుతుంది. సెమీస్‌లో లక్ష్య సేన్... పురుషుల సింగిల్స్ విభాగంలో భారత యువతార లక్ష్య సేన్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్‌తో తలపడాల్సిన చైనా ప్లేయర్ లూ గ్వాంగ్ జు గాయం కారణంగా వైదొల గడంతో లక్ష్య సేన్‌కు వాకోవర్ లభించింది. ప్రకాశ్ పదుకొనె, పుల్లెల గోపీచంద్ తర్వాత ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ చేరిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. డిఫెండింగ్ చాంప్ లీ జి జియా (మలేసియా)–మాజీ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్) మధ్య మ్యాచ్ విజేతతో నేడు జరిగే సెమీఫైనల్లో లక్ష్య సేన్ ఆడతాడు. పురుషుల డబుల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ జోడీ మార్కస్ గిడియోన్ –కెవిన్ సుకముల్జో (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం 22–24, 17–21తో ఓడింది. తొలి గేమ్‌లో భారత జంటకు ఆరు గేమ్ పాయింట్లు లభించినా ఫలితం లేకపోయింది. నిజానికి ఈ టోర్నీలో మాకు ఎంట్రీ లభిస్తుందని ఆశించలేదు. అయితే చివరి నిమిషంలో కొన్ని జోడీలు వైదొలగడంతో రిజర్వ్ జాబితా నుంచి మాతోపాటు వేరే జోడీలకూ ఎంట్రీ లభించింది. ప్రతి మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాం. క్వార్టర్ ఫైనల్లోని రెండో గేమ్‌లో 18–20తో వెనుకబడ్డా ఆందోళన చెందకుండా, ఒత్తిడికి లోనుకాకుండా ఆడి విజయాన్ని అందుకున్నాం. –గాయత్రి తల్లిదండ్రులకు తగ్గ తనయ గాయత్రి తండ్రి పుల్లెల గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించారు. తల్లి పీవీవీ లక్ష్మి 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. తల్లిదండ్రులు రాణించిన ఆటలోనే ఇప్పుడు కుమార్తె మెరి సింది. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి గాయత్రి తన పేరును చరిత్ర పుటల్లో లిఖించుకుంది. -
భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్ కన్నుమూత
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్(88) బుధవారం ఉదయం కన్నుమూశారు. 1950-60 మధ్య కాలంలో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నుంచి సూపర్‌స్టార్‌గా వెలుగొందారు.తన కెరీర్లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ అందుకున్న నటేకర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్ 3గా కొంతకాలం కొనసాగారు. నటేకర్ బరిలోకి దిగితే కోర్టులో వీరోచితంగా పోరాడి విజయాలు సాధించేవారు. ఆయన మృతి పట్ల దేశ ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాళి అర్పించారు. ఇక బ్యాడ్మింటన్ విభాగంలో నందు నటేకర్ మైలురాళ్లను పరిశీలిస్తే.. ►1956లో ఇంటర్నేషనల్ మలేషియాలో సెల్లంజర్ ఇంటర్నేషనల్ లో టోర్నమెంట్లో విజయం ►1954లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిక. ►థామస్ కప్‌లో 16 సింగిల్స్ మ్యాచ్‌లో 12 విజయాలు.. అలాగే టీమ్ తరపున 16 డబుల్స్ మ్యాచ్‌ల్లో 8 విజయాలు ►బ్యాడ్మింటన్ లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రధానం చేసింది. ►1965లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. -
సింధు... అక్కడే ఆగిపోయింది!
బర్మింగ్‌హామ్: ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట (పీవీ) సింధు ఓ సువర్ణావకాశాన్ని వదిలేసింది. చైనా, చైనీస్ తైపీ, దక్షిణ కొరియా స్టార్ షట్లర్లతోపాటు తెలుగుతేజాన్ని పదేపదే ఓడించే కరోలినా మారిన్ (స్పెయిన్) కూడా గైర్హాజరయిన నేపథ్యంలో... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ గెలిచేందుకు ఏర్పడిన అనుకూల పరిస్థితులను సింధు సద్వినియోగం చేసుకోలేకపోయింది. అనవసరంగా ఒత్తిడిలోకి వెళ్లి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్ట్ టూర్ సూపర్–1000 టోర్నీ నుంచి సింధు సెమీఫైనల్లో నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 17–21, 9–21తో పోర్న్‌పవీ చోచువోంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో భారత స్టార్ నిరాశపరిచింది. రెండో గేమ్‌లోనైతే సింధు కనీస ప్రతిఘటన కూడా చేయలేకపోవడం ఆశ్చర్యపరిచింది. అనవసర తప్పిదాలతో పలుమార్లు ప్రత్యర్థికి పాయింట్లు సమర్పించుకుంది. తొమ్మిదోసారి ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఆడిన సింధు సెమీఫైనల్లో వెనుదిరగడం ఇది రెండోసారి. 2018లోనూ ఆమె సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయింది. -
శ్రీకాంత్, కశ్యప్ ఇంటిముఖం
బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్ (భారత్) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 11–21, 21–15, 12–21తో ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్) చేతిలో... కశ్యప్ 13–21, 20–22తో కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. సింధు 21–11, 21–17తో సోనియా (మలేసియా)పై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 21–14, 21–12 తో బెన్యాప–నుంతకామ్ (థాయ్‌లాండ్) జోడీపై... పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–10తో నిఖర్ గార్గ్ (ఇంగ్లండ్)–అనిరుధ (భారత్) జంటపై గెలిచాయి. టోర్నీకి ముందు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలలో ముగ్గురు భారత ఆటగాళ్లకు, సహాయక సిబ్బందిలో ఒకరికి పాజిటివ్ రాగా... మంగళవారం మళ్లీ నిర్వహించిన పరీక్షలలో అందరికీ నెగెటివ్ రావడంతో భారత బృందం ఊపిరి పీల్చుకుంది. -
సైనాకు రూ.25 లక్షల నజరానా
న్యూఢిల్లీ : ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... కేంద్రం నుంచి రూ.25 లక్షల నజరానాను అందుకుంది. మార్చిలో జరిగిన ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా నిలిచింది. ‘అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు, కోచ్‌లకు ప్రత్యేక అవార్డులను ఇచ్చే క్రీడా శాఖ స్కీమ్‌లో భాగంగా సైనాకు ఈ మొత్తం అందనుంది’ అని కేంద్ర క్రీడాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే అంతర్జాతీయ ఈవెంట్స్‌లో రాణించగల సత్తా ఉన్న ఆటగాళ్లందరినీ కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘టాప్’ పథకంలో చేర్చాలని సైనా అభిప్రాయపడింది. ‘ర్యాంకింగ్స్ గురించి పట్టించుకోకుండా శాయశక్తులా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం పైనే నా దృష్టి ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా నేనూహించని విధంగా సాగింది’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సైనా తెలిపింది.