సైనాకు రూ.25 లక్షల నజరానా | Rs 25 lakhs Reward to Saina | Sakshi
Sakshi News home page

సైనాకు రూ.25 లక్షల నజరానా

Published Sat, May 9 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

సైనాకు రూ.25 లక్షల నజరానా

సైనాకు రూ.25 లక్షల నజరానా

న్యూఢిల్లీ : ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచిన స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్... కేంద్రం నుంచి రూ.25 లక్షల నజరానాను అందుకుంది. మార్చిలో జరిగిన ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సైనా నిలిచింది. ‘అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన ఆటగాళ్లకు, కోచ్‌లకు ప్రత్యేక అవార్డులను ఇచ్చే క్రీడా శాఖ స్కీమ్‌లో భాగంగా సైనాకు ఈ మొత్తం అందనుంది’ అని కేంద్ర క్రీడాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

 అలాగే అంతర్జాతీయ ఈవెంట్స్‌లో రాణించగల సత్తా ఉన్న ఆటగాళ్లందరినీ కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ‘టాప్’ పథకంలో చేర్చాలని సైనా అభిప్రాయపడింది. ‘ర్యాంకింగ్స్ గురించి పట్టించుకోకుండా శాయశక్తులా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం పైనే నా దృష్టి ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా నేనూహించని విధంగా సాగింది’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సైనా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement