![Indian Badminton Legend Nandu Natekar Passed Away - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/28/nadu.jpg.webp?itok=NRI3uqhR)
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం నందు నటేకర్(88) బుధవారం ఉదయం కన్నుమూశారు. 1950-60 మధ్య కాలంలో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నుంచి సూపర్‌స్టార్‌గా వెలుగొందారు.తన కెరీర్‌లో 100కు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిల్స్ అందుకున్న నటేకర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్ 3గా కొంతకాలం కొనసాగారు. నటేకర్ బరిలోకి దిగితే కోర్టులో వీరోచితంగా పోరాడి విజయాలు సాధించేవారు. ఆయన మృతి పట్ల దేశ ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాళి అర్పించారు.
ఇక బ్యాడ్మింటన్ విభాగంలో నందు నటేకర్ మైలురాళ్లను పరిశీలిస్తే..
►1956లో ఇంటర్నేషనల్ మలేషియాలో సెల్లంజర్ ఇంటర్నేషనల్ లో టోర్నమెంట్లో విజయం
►1954లో ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిక.
►థామస్ కప్‌లో 16 సింగిల్స్ మ్యాచ్‌లో 12 విజయాలు.. అలాగే టీమ్ తరపున 16 డబుల్స్ మ్యాచ్‌ల్లో 8 విజయాలు
►బ్యాడ్మింటన్ లో నందు సాధించిన విజయాలకు కేంద్ర ప్రభుత్వం 1961లో అర్జున అవార్డును ప్రధానం చేసింది.
►1965లో జమైకాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment