బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధుకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ అయిన పీవీ సింధు చైనాకుకు చెందిన వైఎమ్ ఝాంగ్ చేతిలో 21-17, 21-11 వరుస గేముల్లో చిత్తయింది.
39 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు కనీసం పోరాడలేక చేతులెత్తేసింది. కాగా ఈ ఏడాది తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం పీవీ సింధుకు ఇది మూడోసారి కావడం గమనార్హం. ఇంతకముందు మలేషియా ఓపెన్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ తొలి రౌండ్‌లో వెనుదిరిగిన సింధు.. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది.
ఇక బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌లో భారత జోడి త్రీసా జోలీ, గాయత్రి గోపిచంద్ పుల్లెల థాయ్‌లాండ్‌కు చెందిన ఏడో సీడ్ జోంగ్‌కోల్పన్ కితిరాకుల్, రావిండా ప్రజొగ్జాంయ్‌లకు షాకిచ్చింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ జంటను 21-18, 21-14తో మట్టి కరిపించిన త్రీసా, గాయత్రి పుల్లెల ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణోయ్‌లు తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
“Still in search for a new coach”, says @Pvsindhu1 and she apologises for upsetting the Indian fans at All England, promises to bounce back stronger. @AMRIHospitals @iabhijitdesh @BoriaMajumdar #allengland2023 #IWD2023 #PVSindhu pic.twitter.com/dBiO7uFKJK
— RevSportz (@RevSportz) March 15, 2023
చదవండి: WPL 2023: యూపీ వారియర్జ్‌తో మ్యాచ్.. ఆర్‌సీబీ ఇవాళైనా
Comments
Please login to add a commentAdd a comment