భారత బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధు పెళ్లి వేడుక లేటెస్ట్ సెన్సేషన్ అని చెప్పవచ్చు. చాలా సాదాసీదాగా, ఆట తప్ప, మరో ధ్యాస లేదు అన్నట్టుగా కనిపించే సింధు ఫ్యాషన్‌లో కూడా పర్‌ఫెక్ట్ అనిపించుకుంది. నిశ్చితార్థం మొదలు, ప్రీ-వెడ్డింగ్ షూట్, హల్దీ, సంగీత్, మూడు ముళ్ల ముచ్చట, రిసెప్షన్ ఇలా ప్రతీ వేడుకలో చాలా ఎలిగెంట్‌గా, సూపర్ స్టైలిష్‌గా మెరిసిపోయింది.
తన చిరకాల స్నేహితుడు వెంకట దత్త సాయితో పీవీ సింధు వివాహ వేడుక (డిసెంబర్ 22)అత్యంత సుందరంగా, స్టైలిష్‌గా జరిగింది. గ్లామరస్ బ్రైడల్ లుక్‌తో అందర్ని కట్టి పడేసిందీ జంట. 'మాచీ-మ్యాచీ' లుక్స్‌తో స్వీట్ అండ్ క్యూట్ కపుల్ అనిపించుకున్నారు. తాజాగా ప్రీవెడ్డింగ్ షూట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇందులో సీ గ్రీన్ డిజైనర్ లెహంగాలో అందంగా కనిపించింది. మరొక సెట్ చిత్రాలలో, బ్యాడ్మింటన్-ప్రేరేపిత పాస్టెల్ బ్లూ లుక్‌లో మెరిసారు.
ఈ ఎథ్నిక్ పాస్టెల్ కలర్ లెహంగా డిజైనర్ మసాబా కలెక్షన్‌లోనిది. అంబర్ బాగ్ టిష్యూ లెహంగా సెమీ-షీర్ స్టైల్‌తో గోల్డ్-టోన్డ్ ఫాయిల్ ప్రింట్‌లతో వచ్చింది. దీని జతగా ఎంబ్రాయిడరీ దుపట్టా మరింత అందంగా అమిరింది. ఇక ఆభరణాల విషయానికి వస్తే లేయర్డ్ నెక్లెస్‌లు, స్టేట్‌మెంట్ చెవిపోగులు అతికినట్టు అమరాయి. మహారాణిలాంటి ఆమె లుక్‌తో సమానంగా దత్త సాయి మ్యాచింగ్ లుక్‌లో అదిరిపోయాడు. గోల్డ్ టోన్ ప్రింట్‌లతో కూడిన 'అంబర్ బాగ్' కుర్తా సంప్రదాయ పంచెకట్టుతో స్పెషల్‌గా కనిపించాడు.
ఇంకా చాలా విశేషాలు
ఈ కస్టమ్ క్రియేషన్‌లో బ్యాడ్మింటన్ రాకెట్‌లు, షటిల్ కాక్స్, బంగారు పతకాలు (టోక్యో , రియో ఒలింపిక్స్‌లో సింధు సాధించిన విజయాలకు ప్రతీక) ఉంగరాలు, పేపర్ ఎయిర్‌ప్లేన్ మోటిఫ్స్, సొగసైన జడ స్టైల్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment