సాక్షి, హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ లెజెండ్, మాజీ ప్రపంచ నెంబర్ వన్ శ్రీకాంత్ కిదాంబితో హండ్రెడ్ స్పోర్ట్స్ జట్టు కట్టింది. అంతర్జాతీయ వేదికగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన హండ్రెడ్ స్పోర్ట్స్.. తమ బ్రాండ్ ఉనికిని బలోపేతం చేయాలనే లక్ష్యంలో శ్రీకాంత్‌తో కలిసి పనిచేయనున్నట్లు ప్రకటించింది.
ఈ భాగస్వామ్యం ప్రతిష్టాత్మక ఇండోనేషియా మాస్టర్స్-2025 టోర్నీలో అధికారికంగా మొదలుకానుంది. ఇది భవిష్యత్ తరం బ్యాడ్మింటన్ ఔత్సాహికులను ప్రేరేపించడానికి, ప్రోత్సాహం అందించడానికి హండ్రెడ్ నిబద్ధతకు ప్రతీకగా నిలవనుంది.
కాగా 2024లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గూగుల్-డెలాయిట్ థింక్ స్పోర్ట్స్ నివేదిక.. 'ప్రస్తుతం భారత్ లో Gen Zలో బ్యాడ్మింటన్ క్రీడ రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ'గా వెల్లడించింది. దేశంలో క్రికెట్ తర్వాత రెండవ స్థానంలో బ్యాడ్మింటన్ ఉంది.
ఇలాంటి తరుణంలో శ్రీకాంత్ కిదాంబి హండ్రెడ్ తో కొనసాగనున్న అనుబంధం భారతదేశంలోని క్రీడాభివృద్ధిని పెంపొందించడానికి, యువ ప్రతిభను పెంపొందించడానికి బ్రాండ్ కనబరుస్తున్న అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.
బ్యాడ్మింటన్‌తో సహా భారతదేశంలోని అన్ని క్రీడా విభాగాలలో ఆధిపత్యం చెలాయించడం, అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచ వారసత్వ ఆటగాళ్లతో పోటీ పడటం హండ్రెడ్ లక్ష్యాలు. ఈ ప్రయాణంలో ప్రస్తుత భాగస్వామ్యం నూతన ఆవిష్కరణలతో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది.
ఆనందంగా ఉంది
ఇక హండ్రెడ్ స్పోర్ట్స్ తో భాగస్వామ్యం, అనుబంధం గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.., "నా ప్రదర్శన పట్ల, నా క్రీడా ప్రయాణాన్ని ప్రతిబింబించగలిగే బ్రాండ్ అయిన హండ్రెడ్‌తో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ గొప్ప కలయికతో తదుపరి తరం బ్యాడ్మింటన్ ఆటగాళ్లను ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాము" అని తెలిపారు.
హండ్రెడ్ సింగపూర్ డైరెక్టర్ మనక్ కపూర్ మాట్లాడుతూ.., "శ్రీకాంత్‌ను హండ్రెడ్ కుటుంబంలోకి స్వాగతించడం ప్రపంచవ్యాప్తంగా బ్యాడ్మింటన్ మూలాలను మరింత ముందుకు తీసుకెళ్లాలననే మా నిబద్ధతకు నిదర్శనం. ఈ మిషన్‌ను నడిపించడంలో శ్రీకాంత్‌ను కీలకమైన వ్యక్తిగా మేము చూస్తున్నాము.
ముఖ్యంగా భారతదేశంలో అతడి క్రీడా వారసత్వం, ప్రభావం యువ ఆటగాళ్లను బ్యాడ్మింటన్ క్రీడను స్వీకరించడానికి ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా తమ క్రీడా ప్రయాణాన్ని అత్యున్నత స్థాయిలలో పోటీ పడటానికి బాటలు వేస్తుంద"ని పేర్కొన్నారు.
వ్యూహాత్మకంగా ముందుకు
హండ్రెడ్ ఇండియా డైరెక్టర్ విశాల్ జైన్ మాట్లాడుతూ.., “గత దశాబ్ద కాలంలో భారతదేశంలో బ్యాడ్మింటన్ అద్భుతమైన వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో యువతరంలో రెండవ అత్యధికంగా ఆడే క్రీడగా మారింది. హండ్రెడ్‌లో అధిక పనితీరు గల ఉత్పత్తులను అందించడం ద్వారా మాత్రమే కాకుండా, క్రీడా రంగ పరిశ్రమను చురుకుగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ వృద్ధిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని" వివరించారు.
ఎలైట్ "క్లబ్ హండ్రెడ్" బృందం:
👉లైన్ క్జార్స్‌ఫెల్డ్ట్ (డెన్మార్క్)
👉 రాస్మస్ గెమ్కే (డెన్మార్క్)
👉మాడ్స్ క్రిస్టోఫర్‌సెన్ (డెన్మార్క్)
👉అలెగ్జాండ్రా బోజే (డెన్మార్క్)
👉 డెజాన్ ఫెర్డినాన్సియా (ఇండోనేషియా)
👉గ్లోరియా ఎమాన్యుయెల్ విడ్జాజా (ఇండోనేషియా).
చదవండి: వారానికి రూ. 5 కోట్లు.. జాక్‌పాట్ కాదు! అంతకు మించి..
Comments
Please login to add a commentAdd a comment