hundred
-
ఆ బూత్‌లో 9 గంటలకే 100 శాతం పోలింగ్!
ఈరోజు (మంగళవారం) దేశంలో లోకసభ ఎన్నికల మూడో దశ పోలింగ్ జరుగుతోంది. అయితే ఒక పోలింగ్ బూత్‌లో ఉదయం 9 గంటలకే వందశాతం ఓటింగ్ నమోదయ్యింది. ఇది వినేందుకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పోలింగ్ కేంద్రం ఛత్తీస్‌గఢ్‌లో ఉంది.వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని షెర్దాండ్ పోలింగ్ స్టేషన్ నంబర్ 143లో మొత్తం ఐదుగురు ఓటర్లు తమ ఓటు వేశారు. దీంతో ఇక్కడ 100 శాతం పోలింగ్ పూర్తయ్యింది. ఎంపీని ఎన్నుకునేందుకు వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.షెర్దాండ్ పోలింగ్ కేంద్రం కొరియా జిల్లాలోని సోన్హట్ జన్‌పాడ్ పంచాయతీ పరిధిలోని మారుమూల అటవీ ప్రాంతంలో ఉంది. ఐదుగురు ఓటర్ల కోసం ఇక్కడ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటింగ్ సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండగా, ఉదయం 9కే 100 శాతం ఓటింగ్ నమోదయ్యింది. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే, సీఈవో డాక్టర్ అశుతోష్ చతుర్వేది, అదనపు కలెక్టర్ అరుణ్ మార్కం, ఎస్డీఎం రాకేష్ సాహు తదితర జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఈ ఓటింగ్ ప్రక్రియ జరిగింది. ఈ ఓటర్లకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కుమార్ లాంగే కృతజ్ఞతలు తెలిపారు.వనాంచల్ ప్రాంతంలోని షెర్దాండ్‌లో మొత్తం ఐదుగురు ఓటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఓటర్లలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు. ఈ ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడికి చేరుకోవడానికి పక్కా రోడ్లు లేవు. గ్రామపంచాయతీ చందా నుంచి పోలింగ్ పార్టీలు ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని, ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాయి. -
Mann Ki Baat: మన్ కీ బాత్... నా ఆధ్యాత్మిక ప్రయాణం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారంతో 100 వారాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ఆయన ఉద్విగ్నంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని తనకు ఆధ్యాత్మిక ప్రయాణంగా అభివర్ణించారు. ‘‘ఇది కేవలం కార్యక్రమం కాదు. నా విశ్వాసానికి సంబంధించిన అంశం. 2014లో ఢిల్లీ వచ్చాక నాలో ఉన్నట్టనిపించిన ఖాళీని భర్తీ చేసింది. కోట్లాది ప్రజలకు నా భావాలను తెలియజేసేందుకు ఉపయోగపడింది. ప్రజల నుంచి ఎప్పుడూ దూరంగా లేనన్న భావన కలిగించింది’’ అంటూ మన్ కీ బాత్‌తో ముడిపడ్డ తన జ్ఞాపకాలు, అనుభవాలు, అనుభూతులను నెమరేసుకున్నారు. గత మన్ కీ బాత్‌ల్లో ప్రస్తావించిన పలువురు విశిష్ట వ్యక్తులతో ఈ సందర్బంగా ఫోన్లో మాట్లాడారు. గత ఎపిసోడ్లలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్ ను ప్రస్తావించారు. మోదీ ఇంకా ఏం చెప్పారంటే... ఇతరుల నుంచి ఎంతో నేర్చుకున్నా... ‘‘2014 అక్టోబర్ 3న విజయ దశమి నాడు మన్ కీ బాత్కు శ్రీకారం చుట్టాం. ఇప్పుడదో పండుగలా మారింది. 100వ ఎపిసోడ్ సందర్భంగా శ్రోతల నుంచి వేలాది లేఖలందాయి. అవి భావోద్వేగాలకు గురిచేశాయి. కోట్లాది భారతీయుల మనసులో మాటకు, వారి భావాల వ్యక్తీకరణకు ప్రతిబింబం మన్ కీ బాత్. స్వచ్ఛ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి వాటిని తొలుత మన్ కీ బాత్‌లోనే ప్రస్తావించాం. తర్వాత ప్రజా ఉద్యమాలుగా మారాయి. ఈ రేడియో కార్యక్రమం రాజకీయాలకతీతం. ఇతరుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కీలక మాధ్యమంగా మారింది. శత్రువులైనా మంచి గుణాలను గౌరవించాలని నా గురువు లక్ష్మణ్‌రావు ఈనాందార్ చెప్పేవారు. ఇతరుల్లోని సద్గుణాలను ఆరాధించడంతో పాటు వారి నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన్ కీ బాత్ నాకో కసరత్తులా ఉపయోగపడింది. మన్ కీ బాత్ నిజానికి మౌన్ (నిశ్శబ్దం) కీ బాత్ అంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. చైనాతో వివాదం, అదానీ అక్రమాలు, ఆర్థిక అసమానతలు, మహిళలపై అరాచకాల వంటి కీలకాంశాలను 100వ ఎపిసోడ్లో మోదీ ఎందుకు ప్రస్తావించలేదని ఆక్షేపించింది. దేశ ప్రజలే నాకు సర్వస్వం ‘‘గుజరాత్ సీఎంగా తరచూ ప్రజలను కలుస్తూ, మాట్లాడుతూ ఉండేవాన్ని. 2014లో ఢిల్లీకి చేరాక భిన్నమైన జీవితం, పని విధానం, బాధ్యతలు! చుట్టూ పటిష్ట భద్రత, సమయపరమైన పరిమితులు. ఇలా ప్రజలను కలవని రోజంటూ వస్తుందని అనుకోలేదు. నాకు సర్వస్వమైన దేశ ప్రజల నుంచి దూరంగా జీవించలేను. ఈ సవాలుకు మన్ కీ బాత్ పరిష్కార మార్గం చూపింది. ఇది నాకు ఒక ఆరాధన, ఒక వ్రతం. గుడికెళ్లి ప్రసాదం తెచ్చుకుంటాం. ప్రజలనే దేవుడి నుంచి నాకు లభించిన ప్రసాదం మన్ కీ బాత్. ప్రజాసేవ చేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సాగిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులు నాకు మార్గదర్శకులుగా మారారు. మన్ కీ బాత్‌లో గతంలో ప్రస్తావించిన వ్యక్తులంతా హీరోలే. వారే ఈ కార్యక్రమానికి జీవం పోశారు’’ ఐరాస, విదేశాల్లోనూ... న్యూయార్క్: అమెరికాలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మన్ కీ బాత్ 100వ ఎడిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ ట్వీట్ చేశారు. యునెస్కో డైరెక్టర్ జనరల్ అడ్రీ అజాలే మన్ కీ బాత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కార్యక్రమంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారు. పలు దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. అమెరికా, బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, చిలీ, మొరాకో, మెక్సికో, కాంగో, ఇరాక్, ఇండోనేషియా తదితర దేశాల్లో మన్ కీ బాత్కు విశేష స్పందన లభించింది. దేశమంతటా... ► మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం దేశవ్యాప్తంగా పండుగలా జరిపారు. ► ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా వీక్షించారు. ► బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.ళీ ‘‘ఇది కేవలం రేడియో కార్యక్రమం కాదు. సామాజిక మార్పుకు చోదక శక్తి. మోదీ సందేశం యువతకు స్ఫూర్తినిస్తోంది’’ అని అమిత్ షా కొనియాడారు. ► అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు భారత్‌లో, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాలో కార్యక్రమాన్ని వీక్షించారు. కేరళలోని కొచ్చిన్‌లో పెళ్లి వేడుకకు వచ్చిన అతిథులతో కలిసి మన్‌కీబాత్ 100వ ఎపిసోడ్ వింటున్న నూతన వధూవరులు -
ఏపీపీఎస్సీ కొత్త నిబంధన.. ఆ అభ్యంతరాలకు రూ.100 చెల్లించాలి
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలు, వాటి జవాబులపై అభ్యర్థులు లేవనెత్తే అభ్యంతరాలకు ఒక్కో దానికి రూ.100 చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నిబంధన విధించింది. ఇటీవల విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. కమిషన్ నిర్వహించే వివిధ పరీక్షల్లో కీలపై వస్తున్న వేలాది అభ్యంతరాల్లో తప్పుడువే అత్యధికంగా ఉంటున్నాయి. ‘కమిషన్ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్ష (స్క్రీనింగ్ టెస్టు)ల్లో ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లోని ప్రశ్నలు, వాటి సమాధానాల కీలకు వ్యతిరేకంగా అభ్యర్థులు తప్పుడు, అసంబద్ధమైన అభ్యంతరాలను వేలాదిగా దాఖలు చేస్తున్నారు. వీటిని పరిశీలించి పరిష్కరించే క్రమంలో ఫలితాల ప్రకటన సహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో విపరీత జాప్యం జరుగుతోంది. చదవండి: (ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?) అందువల్ల కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు వర్తించేలా ఒక నిబంధన చేర్చాలని కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రశ్న పత్రం, జవాబు కీ, ఇతర విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారం కింద ఈ నిబంధన పెట్టాలని కమిషన్ నిర్ణయించింది. ఇకపై అభ్యర్థి ప్రశ్న, జవాబు కీకి వ్యతిరేకంగా లేవనెత్తే ప్రతి అభ్యంతరానికి రూ.100 చొప్పున నిర్ణీత గడువులోగా చెల్లించాలి. తుది పరిశీలనలో ఈ అభ్యంతరాల్లో నిజమైన వాటిని దాఖలు చేసిన అభ్యర్ధులకు ఆ మొత్తాన్ని తిరిగి కమిషన్ చెల్లిస్తుంది.’ అని కమిషన్ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్త నిబంధనను అదనంగా జోడించిన నోటిఫికేషన్ల నంబర్లు: 08/2021, 16/2022, 09/2021, 17/2022, 10/2021, 18/2022, 14/2021, 14/2022, 15/2021, 15/2022, 23/2021, 24/2021, 6/2022, 11/2022, 12/2022, 19/2022, 20/2022, 21/2022, 25/2022, 28/2022 -
600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. హెండ్రెండ్ టోర్నమెంట్లో భాగంగా బ్రావో ఈ ఫీట్ అందుకున్నాడు. హండ్రెడ్‌లో నార్తన్ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్ ఇన్విసిబుల్స్తో మ్యాచ్‌లో సామ్ కరన్‌ను ఔట్ చేయడం ద్వారా టి20ల్లో 600వ వికెట్ మార్క్‌ను అందుకున్నాడు. సామ్ కరన్‌ను ఔట్ చేయగానే బ్రావో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో టి20ల్లో 516 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. కాగా మ్యాచ్‌లో ఓవరాల్‌గా 20 బంతులేసి 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా బ్రావో తర్వాత అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 466 వికెట్లు, విండీస్‌కు చెందిన స్పిన్నర్ సునీల్ నరైన్ 457 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక వెస్టిండీస్ క్రికెట్లో 2004 నుంచి 2021 కాలంలో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందాడు. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో బ్రావో పాత్ర కీలకం. ఓవరాల్‌గా విండీస్ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో టి20 ప్రపంచకప్ 2020 దృశ్యా తన టి20లకు అందుబాటులో ఉంటానని చెప్పి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో భాగంగా 2021.. నవంబర్ 6న.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్ చార్జర్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆడమ్ లిత్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. లిత్ మినహా మిగతావారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విసిబుల్స్ 97 బంతుల్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సామ కరన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోర్డాన్ కాక్స్ 29 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో టామ్ కరన్ 7 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 6️⃣0️⃣0️⃣ T20 wickets for DJ Bravo! 🎉 He becomes the first to yet another milestone - no other player has yet reached 500! 🙌 pic.twitter.com/ZRBMhoFKHK — ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో Slow deliveries 🤝 Bravo! Spectacular bowling from the superstar @DJBravo47. Watch all the action from The Hundred LIVE, exclusively on #FanCode 👉https://t.co/3GLSe3BlEE@thehundred#TheHundred #TheHundredonFanCode pic.twitter.com/BRNYIenclH — FanCode (@FanCode) August 12, 2022 -
Shafali Verma: ‘హండ్రెడ్’లో షఫాలీ
న్యూఢిల్లీ: భారత టీనేజ్ బ్యాటర్ షఫాలీ వర్మకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో తొలి సారి నిర్వహించనున్న ‘హండ్రెడ్’ టోర్నీలో ఆమె పాల్గొననుంది. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుకు షఫాలీ ప్రాతినిధ్యం వహిస్తుంది. న్యూజిలాండ్ దిగ్గజం సోఫీ డివైన్ స్థానంలో చివరి నిమిషంలో ఆమెకు అవకాశం దక్కింది. బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలకు బీసీసీఐ ఎన్ఓసీ మంజూరు చేసింది. భారత్‌నుంచి నాలుగో ప్లేయర్‌గా షఫాలీ బరిలోకి దిగనుంది. ప్రస్తుతం ఐసీసీ టి20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న ఈ హరియాణా అమ్మాయికి ఆస్ట్రేలియాలో జరిగే ఉమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడేందుకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. భారత్ తరఫున 22 టి20లు ఆడిన షఫాలీ...148.31 స్ట్రైక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది. -
‘దవా’ఖానాకు మరో వంద
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన వ్యాధులకు అవసరమైన వంద రకాల అత్యవసర మందులను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి పేదలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఉన్న 238 రకాల అత్యవసర మందులతో కలిపి మొత్తం 338 రకాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయి. నూతన అత్యవసర మందులు వచ్చే ఏప్రిల్ నుంచి ఆసుపత్రులకు చేరతాయి. గుండె, కిడ్నీ, గ్యాస్ట్రిక్, అలర్జీ, థైరాయిడ్, డయాబెటిక్, ఇతర ఇన్ఫెక్షన్లు, జీవనశైలి తదితర జబ్బులకు అవసరమైన అత్యవసర మందులను అందుబాటులోకి తీసుకొస్తారు. ప్రస్తుతం వాడే అనేక మందులకు ప్రపంచవ్యాప్తంగా కొత్త రకాల మాలిక్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ మాలిక్యూల్స్‌తో అనేక కంపెనీలు అప్డేటెడ్ ఔషధాలను తయారు చేశాయి. మరోవైపు డెంగీ, చికున్ గున్యా, వైరల్ ఫీవర్లు, స్వైన్‌ఫ్లూ వంటివి రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. వాటిని నియంత్రించేందుకు అవసరమైన యాంటీ బయోటిక్స్ సహా పలు మందులనూ ఫార్మా కంపెనీలు తయారు చేశాయి. ఆయా రోగాలకు పాత మందులు పూర్తిస్థాయిలో పనిచేసే పరిస్థితి ఉండటం లేదు. ఈ నేపథ్యంలో కొత్త రకాల మాలిక్యూల్స్‌తో తయారైన అప్డేటెడ్ అత్యవసర మందులను కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. వాటిని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచుతారు. కమిటీ నివేదిక మేరకు నిర్ణయం.. గతేడాది డెంగీ, చికున్‌గున్యా, వైరల్ ఫీవర్లు రాష్ట్రాన్ని వణికించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 వేల మంది డెంగీ బారిన పడినట్లు అంచనా. అయితే డెంగీ సీరియస్ అయితే దాన్ని లొంగదీసేందుకు అవసరమైన మందులు కానీ, యాంటీ బయోటిక్స్ కానీ అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో లేవన్న విమర్శలు వచ్చాయి. మరోవైపు ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లో కీలకమైన గుండె, కిడ్నీ, ఇన్ఫెక్షన్లు తదితర వ్యాధుల నివారణకు అవసరమైన అత్యవసర మందులు పూర్తిస్థాయిలో పనిచేసేవి లేవన్న ఆరోపణలున్నాయి. అవే జబ్బులకు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో నాణ్యమైన, బ్రాండెడ్ మందులు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి వచ్చే రోగులు కూడా బయట మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొందరు రోగులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తే జబ్బు తగ్గడం లేదని భావించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి నయం చేయించుకుంటున్నారు. దీంతో పేద రోగులకు ఆర్థికంగా భారమవుతోంది. ఈ పరిస్థితిపై వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలోని ఔషధాల కొనుగోలుపై ఏర్పాటైన కమిటీ గత కొన్ని నెలలుగా పరిస్థితిని అధ్యయనం చేసింది. అసలు ఏ మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నాయి.. అవి పనిచేస్తున్నాయా లేదా.. ఇంకా ఫార్మా మార్కెట్లో కొత్త రకాలు ఏమున్నాయన్న దానిపై కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ మేరకు ఈ 100 రకాల కొత్త మందుల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వీటి కోసం త్వరలో టెండర్లు పిలిచి ఫార్మా కంపెనీల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ నిర్ణయించింది. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరంలేని మందులు 200 రకాలున్నాయని గుర్తించారు. వాటిని నిలిపేయాలని నిర్ణయించారు. వాటిని వాడుతున్నా రోగం తగ్గకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్య రోగాలకు అవసరమైన అన్ని మందులు.. ప్రభుత్వ ఆసుపత్రులకు వివిధ రోగాలకు అవసరమైన అత్యవసర మందులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. దీనికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈసారి మందులు కొనుగోలు చేసేముందు టెండర్లలో పాల్గొనే ఫార్మా కంపెనీల తయారు చేసే ప్రాంతాలకు వెళ్లి అధ్యయనం చేస్తాం. నాణ్యత ప్రమాణాలను తెలుసుకుంటాం. నిపుణుల కమిటీ నిర్ణయం మేరకు అత్యవసర మందులను కొనుగోలు చేస్తాం. ముఖ్యమైన రోగాలకు అవసరమైన అన్ని రకాల అత్యవసర మందులూ ఈ వంద రకాల్లో ఉన్నాయి. పేదల కోసం అత్యవసర మందులను కొనుగోలు చేస్తున్నాం. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
బీపీఎల్ ఫైనల్లో విండీస్ స్టార్ విధ్వంసం
-
మళ్లీ జి‘గేల్’మన్నాడు
ఢాకా: ఆకాశమే హద్దు... పట్టపగ్గాల్లేవ్.. వీర విజృంభణ... ఇలాంటి విశేషణాల కలబోతగా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి చెలరేగిపోయాడు. మంగళవారం ఢాకా డైనమైట్స్, రంగ్‌పూర్ రైడర్స్ మధ్య జరిగిన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) ఫైనల్లో విశ్వరూపం చూపాడు. రైడర్స్ ఓపెనర్‌గా వచ్చిన గేల్ 69 బంతుల్లోనే అజేయంగా 146 పరుగులు చేశాడు. 22 పరుగుల వద్ద షకీబుల్ హసన్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతడు తర్వాత ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలో ఏకంగా 18 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. గేల్‌తో పాటు బెండ్రన్ మెకల్లమ్ (54, 4 ఫోర్లు, మూడు సిక్స్‌లు) అదరగొట్టడంతో రంగ్‌పూర్ నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. ఢాకా డైనమైట్స్ 149/9కే పరిమితం కావడంతో రైడర్స్ తొలిసారి బీపీఎల్ టైటిల్ నెగ్గింది. ఫైనల్లో గేల్ ఘనతలు.. టి20ల్లో 11 వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్. 8,526 పరుగులతో మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. టి20ల్లో అత్యధికంగా 20 శతకాలు చేసిన తొలి బ్యాట్స్‌మన్. ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 18 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడు. ఈ క్రమంలో 17 సిక్సర్లతో తన పేరిటే ఉన్న రికార్డును (2013లో పుణే వారియర్స్‌పై) తిరగరాశాడు. బీపీఎల్‌లో వంద సిక్సర్లు కొట్టిన, ఓవరాల్‌గా టి20ల్లో 800 సిక్సర్లు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్. మెకల్లమ్‌తో కలిసి నెలకొల్పిన 201 పరుగుల అజేయ భాగస్వామ్యం ఓ టి20 ఫైనల్లో అత్యధిక భాగస్వామ్యం. -
శతమానం ప్రగతి
రాజోలు బాలుర ఉన్నత పాఠశాలకు వందేళ్లు శతాబ్ది ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఈనెల 11, 12 తేదీల్లో నిర్వహణ ఉన్నత స్థాయిలో పూర్వ విద్యార్థులు రాజోలు : అనేక మందిని ఉత్తములుగా తీర్చిదిద్దిన రాజోలు ఉన్నత పాఠశాల వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ వికసించిన విద్యాకుసుమాలు రాజకీయ, ఉద్యోగ, వైద్య, వ్యాపార, నిర్మాణ, శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాలతో పాటు సినీనటులుగా, దర్శికులుగా, రచయితలుగా స్థిరపడ్డారు. 1916లో రాజోలులో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికి 100 ఏళ్లు పూర్తికావడంతో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, సీనియర్ న్యాయవాది పొన్నాడ హనుమంతురావు తదితరులు ఆలోచన చేశారు. మూడు నెలలుగా శ్రమించి పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థుల చిరునామాలు, ఫో¯ŒS నంబర్లు సేకరించి ఈ ఉత్సవాలు నిర్వహించే దిశగా అడుగులు వేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో రెండు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిరోజు జాతీయ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారంభించి శతాబ్ది ఉత్సవాలు గుర్తుగా పాఠశాల ఆవరణలో శత వసంతాల స్థూపం ఆవిష్కరించనున్నారు. రెండో రోజు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, పరిచయం, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుంది. ఉత్సవాలను పురస్కరించుకొని ఇంత వరకు పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయులందరినీ సత్కరించనున్నారు. వికసించిన విద్యా కుసుమాలు వందేళ్లు చరిత్ర పూర్తి చేసుకున్న రాజోలు బాలుర ఉన్నత పాఠశాలలో అనేక మంది విద్యాభ్యాసం పూర్తి చేసి ఖండాంతర ఖ్యాతిని గడించారు. సుప్రసిద్ధ కవి, రచయిత పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న 1920లో ఈ పాఠశాలలో చదివారు. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లి రామయ్య, మాజీ డిప్యూటీ స్పీకర్ ఎ.వి.సూర్యనారాయణరాజు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి వల్లూరి కామేశ్వరరావు, యూఎస్ఏలో శాస్త్రవేత్త నల్లి సాల్మ¯ŒSరాజు, ప్రముఖ డైరెక్టర్ బండ్రెడ్డి సుకుమార్, ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్, ప్రపంచ గ్లాస్ కం పెనీ సెయింట్ గోబేయి¯ŒS మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ తనికెళ్ల, దూదర్శ¯ŒS డైరెర్టర్ భూపతి విజయ్‌కుమార్, శ్రీహరికోటలోని ఇస్రోలో డిప్యూటీ జనరల్ మేనేజర్ బిక్కిన ప్రసాద్, సత్యవాణి ప్రాజెక్స్, కనస్ట్రక్ష¯Œ్స ఎండీ పొన్నాడ సూర్య ప్రకాష్, ఏపీ జె¯ŒSకో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గుబ్బల చంద్రరావు, ఓఎన్జీసీ సీని యర్ ఎకౌంట్స్ ఆఫీసర్ తమ్మన ప్రసాద్ తదితరులు ఈ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయికి ఎదిగారు.