Dwayne Bravo Has Become First Player To Claim 600 Wickets T20 Cricket - Sakshi
Sakshi News home page

Dwayne Bravo: 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్‌లో తొలి బౌలర్‌గా

Published Fri, Aug 12 2022 3:31 PM | Last Updated on Fri, Aug 12 2022 3:51 PM

Dwayne Bravo Has Become First Player To Claim 600 Wickets T20 Cricket - Sakshi

వెస్టిండీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో టి20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. హెండ్రెండ్‌ టోర్నమెంట్‌లో భాగంగా బ్రావో ఈ ఫీట్‌ అందుకున్నాడు. హండ్రెడ్‌లో నార్తన్‌ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్‌ ఇన్‌విసిబుల్స్‌తో మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ను ఔట్‌ చేయడం ద్వారా టి20ల్లో 600వ వికెట్‌ మార్క్‌ను అందుకున్నాడు. సామ్‌ కరన్‌ను ఔట్‌ చేయగానే బ్రావో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో టి20ల్లో 516 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. కాగా మ్యాచ్‌లో ఓవరాల్‌గా 20 బంతులేసి 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా బ్రావో తర్వాత అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌ 466 వికెట్లు, విండీస్‌కు చెందిన స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ 457 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక వెస్టిండీస్‌ క్రికెట్‌లో 2004 నుంచి 2021 కాలంలో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందాడు. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు విండీస్‌ గెలవడంలో బ్రావో పాత్ర కీలకం.

ఓవరాల్‌గా విండీస్‌ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన బ్రావో టి20 ప్రపంచకప్‌ 2020  దృశ్యా తన టి20లకు అందుబాటులో ఉంటానని చెప్పి రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత  టి20 ప్రపంచకప్‌లో భాగంగా 2021.. నవంబర్‌ 6న.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తన్‌ సూపర్‌ చార్జర్స్‌ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆడమ్‌ లిత్‌ 33 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. లిత్‌ మినహా మిగతావారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఓవల్‌ ఇన్‌విసిబుల్స్‌ 97 బంతుల్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సామ​ కరన్‌ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జోర్డాన్‌ కాక్స్‌ 29 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో టామ్‌ కరన్‌ 7 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

చదవండి: చరిత్ర సృష్టించిన కీరన్‌ పొలార్డ్‌.. ఎవరికి అందనంత ఎత్తులో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement