Dwayne Bravo
-
Dwayne Bravo: అసలు సిసలు ‘చాంపియన్’!
ప్రపంచంలోని ఏ మూల ఫ్రాంచైజీ లీగ్ క్రికెట్ జరుగుతున్నా అందులో అతడు ఉండాల్సిందే! జాతీయ జట్టు మొదలుకొని... విశ్వవ్యాప్తంగా మొత్తం 43 జట్లకు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర అతడిది! అటు బౌలర్‌గా ఇటు బ్యాటర్‌గా మైదానంలో ఆల్‌రౌండ్ మెరుపులకు కేరాఫ్ అడ్రస్ అతడు! రెండుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన జట్టులోనూ సభ్యుడు, పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్, ఫ్రాంచైజీ క్రికెట్లో అత్యధిక ట్రోఫీలు సాధించిన ప్లేయర్... ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించిన అతడే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. రెండు దశాబ్దాలుగా ఏదో ఒక జట్టులో ప్లేయర్‌గా కొనసాగుతున్న డ్వేన్ బ్రావో ఆటగాడిగా తన క్రికెట్ ఇన్నింగ్స్‌కు శుభంకార్డు వేశాడు. ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నా ఏదో ఒక హోదాలో ఈ ఆటలోనే కొనసాగేందుకు బ్రావో నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున బ్రావో ‘మెంటార్’ పాత్రలో కనిపించనున్నాడు. రెండు దశాబ్దాలుగా మైదానంలో తన ఆటతీరుతో పాటు ఆటాపాటతోనూ అశేష అభిమానులను సొంతం చేసుకొని ప్లేయర్‌గా రిటైరైన నేపథ్యంలో ‘చాంపియన్’ బ్రావోపై ప్రత్యేక కథనం. టి20 ఫార్మాట్ ప్రారంభమైనప్పటి నుంచి పొట్టి క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. మూడేళ్ల క్రితమే జాతీయ జట్టు తరఫున చివరి టి20 మ్యాచ్ ఆడిన బ్రావో... తాజాగా ఫ్రాంచైజీ క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. కెరీర్లో 582 టి20 మ్యాచ్‌లాడిన 41 ఏళ్ల బ్రావో... 631 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ స్పిన్ స్టార్ రషీద్ ఖాన్ 613 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి తప్పుకునే సమయానికి 183 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించిన బ్రావో... వచ్చే సీజన్ నుంచి ‘మెంటార్’గా దర్శనమివ్వనున్నాడు. ఐపీఎల్లో అపార అనుభవం ఉన్న బ్రావో... డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు సాధించిన బ్రావో... టి20ల్లో చివరి నాలుగు (17 నుంచి 20) ఓవర్లలో 322 వికెట్లు పడగొట్టి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ డెత్ ఓవర్స్‌లో 201 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. చెన్నై చిన్నోడు! ఐపీఎల్ ఆరంభం నుంచి వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చాడు. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో ఆడటాన్ని ఎంతగానో ఇష్టపడే బ్రావో... సుదీర్ఘ కాలం పాటు చెన్నై ప్రధాన బౌలర్‌గా కొనసాగాడు. ప్రత్యర్థి ప్లేయర్లు భారీ షాట్లు కొడుతున్న ప్రతిసారీ ధోని బంతిని బ్రావో వైపు విసిరే వాడంటే... అతడిపై మహీకి ఉన్న నమ్మకమేంటో అర్థం చేసుకోవచ్చు. ఇతర లీగ్‌లతో పోల్చుకుంటే ఐపీఎల్లో తన బౌలింగ్‌తోనే ఎక్కువ ఆదరణ పొందిన బ్రావో... అత్యుత్తమ ఫీల్డర్ అనడంలో సందేహం లేదు. సర్కిల్లో ఫీల్డింగ్ చేస్తే చుట్టు పక్కల గోడ కట్టినట్లే అనే గుర్తింపు తెచ్చుకున్న బ్రావో... బౌండరీ మీద ఎన్నో అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. సిక్సర్ ఖాయమనుకున్న బంతిని సైతం కచ్చితమైన అంచనాతో గాల్లోకి ఎగిరి అమాంతం ఒడిసి పట్టడంలో బ్రావోది అందెవేసిన చేయి. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బ్రావో ఎప్పుడూ బౌండరీ వద్దే కనిపించేవాడు. ఆటతీరుతోనే కాకుండా ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించి వాటికి నృత్యరీతులను జత చేయడంలోనూ బ్రావో సిద్దహస్తుడు. ఆటతో పాటే పాట! మైదానంలో ఎంతో సరదాగా ఉండే బ్రావోను ప్రత్యర్థి ప్లేయర్లు సైతం ఇష్టపడేవారు. వికెట్ తీసినప్పుడు జరుపుకునే సంబరాల నుంచి మొదలుకొని విజయం సాధించినప్పుడు చేసే డాన్స్ వరకు అన్నిట్లో ప్రత్యేకత చాటుకున్న బ్రావో.. ఐపీఎల్లో రెండు సీజన్లలో 25 కంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013 సీజన్లో 32 వికెట్లు తీసిన బ్రావో... 2015లో 26 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ టి20 ఫార్మాట్లో 684 మ్యాచ్‌లాడి అగ్రస్థానంలో ఉండగా... 582 మ్యాచ్‌లతో బ్రావో రెండో స్థానంలో నిలిచాడు. షోయబ్ మాలిక్ (542 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (525 మ్యాచ్‌లు), రసెల్ (523 మ్యాచ్‌లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్లో విశ్వవ్యాప్తంగా 28 జట్లకు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... 2012, 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ గెలిచిన వెస్టిండీస్ జాతీయ జట్టులో కీలక పాత్ర పోషించాడు. సుదీర్ఘ కెరీర్లో పదో స్థానంలో మినహా అన్ని స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన దిగిన బ్రావో... 442 ఇన్నింగ్స్‌ల్లో 6970 పరుగులు సాధించాడు. ఇందులో ఒక్క సెంచరీ కూడా లేకపోగా... 20 అర్ధశతకాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్‌కు ప్రతిరూపం బ్యాట్‌తో 5 వేల పైచిలుకు పరుగులు... బంతితో 300 వికెట్లు... 200 క్యాచ్‌లు పట్టిన బ్రావో నిఖార్సైన ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. పురుషుల టి20 క్రికెట్లో 17 టోర్నమెంట్ ఫైనల్స్‌లో బ్రావో విజేతగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్లో ఇదే అత్యధికం కాగా... కీరన్ పొలార్డ్ 16 టోర్నీల్లో చాంపియన్‌గా నిలిచాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదు (2015, 2017, 2018, 2020, 2021), ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మూడు (2011, 2018, 2021), ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో రెండు (2012, 2016), కరీబియన్ టి20 లీగ్‌లో రెండు (2011/12, 2012/13), స్టాన్ఫోర్డ్ లీగ్ (2007/08), సీఎల్‌టి20 (2014), బీపీఎల్ (2016/17), పీఎస్ఎల్ (2019), ఐఎల్టి20 (2023/24)ల్లో ఒక్కో టైటిల్ సాధించాడు.ఆటగాడిగా ఉన్న సమయంలోనే సహచరులకు అవసరమైన సమయాల్లో సూచనలిస్తూ పెద్దన్న పాత్ర పోషించిన బ్రావో... ఇప్పుడు ఇక పూర్తిస్థాయిలో మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సుదీర్ఘ కాలంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బ్రావో... వచ్చే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా కనిపించనున్నాడు. -
కోల్‌కతా నైట్‌రైడర్స్ మెంటార్‌గా బ్రావో
న్యూఢిల్లీ: టి20 క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)తో తన సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలికాడు. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి అతను కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) టీమ్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. గత ఏడాది ఈ బాధ్యతలు నిర్వర్తించిన గౌతమ్ గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్‌గా వెళ్లగా, అతని స్థానంలో బ్రావోను ఎంచుకున్నట్లు కేకేఆర్ టీమ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. నైట్‌రైడర్స్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌లతో కలిసి అతను పని చేస్తాడు. కేకేఆర్ టీమ్ యాజమాన్యానికి చెందిన ఇతర టి20 జట్లు ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, లాస్ ఏంజెల్స్ నైట్‌రైడర్స్, అబుదాబి నైట్‌రైడర్స్‌లకు కూడా ఇన్చార్జ్గా ఉండేలా ఈ గ్రూప్‌తో బ్రావో దీర్ఘకాలిక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ప్రకటనకు ముందు రోజే గురువారం తాను ఆటగాడిగా అన్ని స్థాయిల నుంచి రిటైర్ అవుతున్నట్లు బ్రావో ప్రకటించాడు. ఐపీఎల్ ఆరంభంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బ్రావో 2011 నుంచి 2022 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడు. మధ్యలో రెండేళ్లు చెన్నైపై నిషేధం ఉన్న సమయంలో అతను గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సీఎస్కే తరఫున ఆడిన 10 సీజన్లలో 3 సార్లు టైటిల్ గెలిచిన జట్టులో అతను ఉన్నాడు. రిటైర్ అయ్యాక గత రెండు సీజన్లు చెన్నైకే బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రావో ఇప్పుడు ఆ జట్టుకు దూరమయ్యాడు. -
కన్నీటిపర్యంతమైన బ్రావో
విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరీబియన్ ప్రీమియర్ లీగ్-2024లో సెప్టెంబర్ 24న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ బ్రావో కెరీర్లో చివరి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో బ్రావో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ అనంతరం బ్రావో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న బాధను ఆపుకోలేక కన్నీటిపర్యంతమయ్యాడు. బ్రావో కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. Champion Dwayne Bravo announces his retirement from all formats of cricket.Know more: https://t.co/ljuWjTsGQS— CricTracker (@Cricketracker) September 27, 20242021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన బ్రావో.. వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలిచిన రెండు సందర్భాల్లో (2012, 2016) ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. బ్రావో పొట్టి క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బ్రావో తన టీ20 కెరీర్లో 582 మ్యాచ్‌లు ఆడి 631 వికెట్లు పడగొట్టాడు. బ్రావో తాజాగా ఐపీఎల్లో కేకేఆర్ ఫ్రాంచైజీ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025 నుంచి బ్రావో కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తాడు. కాగా, 40 ఏళ్ల బ్రావో 2004లో తన అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. నాటి నుంచి 2021 వరకు అతను విండీస్ జాతీయ జట్టుకు సేవలందించాడు. ఈ మధ్యలో 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన బ్రావో తన అంతర్జాతీయ కెరీర్లో 6300 పైచిలుకు పరుగులు సాధించి, 363 వికెట్లు పడగొట్టాడు. బ్రావో 2008 నుంచి 2022 వరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున ఐపీఎల్లో ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో బ్రావో 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి 183 వికెట్లు తీశాడు. చదవండి: భారత్‌తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
సీఎస్కేకు బై బై.. కేకేఆర్ మెంటార్‌గా వెస్టిండీస్ లెజెండ్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. తమ జట్టు మెంటార్‌గా వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను కేకేఆర్ మెనెజ్‌మెంట్ నియమించింది. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన బ్రావో.. ఇప్పుడు కేకేఆర్‌తో జతకట్టాడు. గత సీజన్లో కోల్‌కతా మెంటార్‌గా పనిచేసిన గౌతం గంభీర్ స్ధానాన్ని ఈ కరేబియన్ లెజెండ్ భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ అధికారికంగా ధ్రువీకరించింది. మా కొత్త మెంటార్, డిజే 'సర్ ఛాంపియన్' బ్రావోకు హాలో చెప్పండి. ఛాంపియన్ సిటీకి స్వాగతిస్తున్నాము కేకేఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చింది.నైట్‌రైడర్స్‌తో ప్రత్యేక బంధం..కాగా బ్రావో ఐపీఎల్లో ఎప్పుడూ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించినప్పటకి.. నైట్‌రైడర్స్ యాజమాన్యంతో అతడికి మంచి అనుబంధం ఉంది. 2013 నుంచి 2020 వరకు సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2023 సీజన్లో కూడా టీకేఆర్కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. కాగా కేకేఆర్, టీకేఆర్ ఇరు ఫ్రాంచైజీల యాజమాన్యం ఒక్కరే కావడం విశేషం.ప్రొఫెషనల్ క్రికెట్‌కు విడ్కోలు..కాగా అన్ని రకాల క్రికెట్‌కు బ్రావో విడ్కోలు పలికాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2024 అనంతరం ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని సీజన్ ఆరంభంలోనే వెల్లడించాడు. కానీ దురదృష్టవశాత్తూ టోర్నీ మధ్యలో గాయపడడంతో.. సీజన్ మొత్తం ఆడకుంటానే తన కెరీర్‌ను ముగించాడు. -
బ్రావో 'ది ఛాంపియన్'.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
వెస్టిండీస్ నుంచి ఎంతో మంది ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచాన్ని జయించారు. అందులో ఒకడే దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా పేరు గాంచాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు వీరుడుగా నిలిచాడు. తన విరోచిత పోరాటాలతో విండీస్‌కు రెండు వరల్డ్‌కప్‌లను అందిచాడు. తన ప్రదర్శనతో, డ్యాన్స్‌లతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు కరేబియన్ అయినప్పటకి భారత్‌లో కూడా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు.అయితే ఇకపై బ్రావో డ్యాన్స్‌లు మైదానంలో కన్పించవు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ వెస్టిండీస్ దిగ్గజం.. ఇప్పుడు ప్రొఫెషనల్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పేశాడు. ఎక్కడైతే తన కెరీర్ మొదలైందో అక్కడే ముగించనున్నాడు. సొంత ప్రజలముందే సగర్వంగా తనకు ఇష్టమైన ఆటనుంచి తప్పకోనున్నాడు. ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్‌తో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోనున్నట్లు బ్రావో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బ్రావో తన టీ20 క్రికెట్ జర్నీపై ఓ లుక్కే ద్దాం.టీ20 స్పెషలిస్టు.. విండీస్ హీరోబ్రావో ఒక టీ20 స్పెషలిస్టు. 2006లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బ్రావో.. తన బౌలింగ్, బ్యాటింగ్‌తో విండీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మఖ్యంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్‌లను వెస్టిండీస్ సొంతం చేసుకోవడంలో బ్రావోది కీలక పాత్ర. ఈ రెండు మెగా టోర్నీల్లో బ్రావో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు.విండీస్‌కే కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్లో సైతం తన మార్క్ చూపించాడు. ఐపీఎల్లో కూడా దుమ్ములేపాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ఈ కరేబియన్ ధీరుడు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కే తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటకీ బ్రావో(154) పేరిటే ఉంది.స్లోయర్ బాల్స్ స్పెషలిస్టు..బ్రావో హార్డ్ హిట్టింగ్ స్కిల్స్‌తో పాటు అద్బుతమైన బౌలింగ్ నైపుణ్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్లోయర్ బాల్స్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బోల్తా కొట్టించడం బ్రావో స్పెషాలిటీ. అంతేకాకుండా డెత్ ఓవర్ స్పెషలిస్టుగా బ్రావో పేరు గాంచాడు. ఇవన్నీ అతడిని టీ20 క్రికెట్లో విలువైన ఆస్తిగా మార్చాయి.2021లో గుడ్బైబ్రావో తన కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2021 టీ20 వరల్డ్‌కప్ లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. తన చివరి సహచర ఆటగాళ్లు, ఆసీస్ క్రికెటర్ల నుంచి బ్రావో గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించాడు. తన ఇంటర్ననేషనల్ కెరీర్లో 295 మ్యాచ్‌ల్లో విండీస్‌కు బ్రావో ప్రాతినిథ్యం వహించాడు. టీ20ల్లో రికార్డు అదుర్స్..టీ20 క్రికెట్ చరిత్రలో బ్రావోకు ఘనమైన రికార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచ్‌లు, లీగ్‌లు సహా మొత్తం 578 టీ20 మ్యాచ్‌లు ఆడిన అతడు ఏకంగా 630 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన జాబితాలో బ్రావో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. టీ20 క్రికెట్లో 630 వికెట్లతో పాటు అతడు 6,970 పరుగులు కూడా చేశాడు.ఛాంపియన్ డ్యాన్స్..బ్రావో "ఛాంపియన్ డ్యాన్స్ వరల్డ్ క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. వికెట్ తీసినా ప్రతీసారి మైదానంలో డ్యాన్స్ చేస్తూ బ్రావో సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇది 2016 టీ20 వరల్డ్‌కప్ నుంచి బ్రావో ఈ విధంగా డ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తున్నాడు. -
రిటైర్మెంట్ ప్రకటించిన విండీస్ దిగ్గజం
విండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ ప్రొఫెషనల్ క్రికెట్లో తనకు చివరి టోర్నీ అని ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. 40 ఏళ్ల బ్రావో ఇదివరకే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. బ్రావో సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. బ్రావో టీ20ల్లో అత్యధిక వికెట్ల వీరుడిగా కొనసాగుతున్నాడు. 2006 నుంచి ప్రొఫెషనల్ టీ20లు ఆడుతున్న బ్రావో తన కెరీర్లో మొత్తం 579 మ్యాచ్‌లు ఆడి 630 వికెట్లు పడగొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో బ్రావోతో పాటు రషీద్ ఖాన్ మాత్రమే 600 వికెట్ల మైలురాయిని దాటాడు. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47)బ్రావో తన రిటైర్మెంట్ సందేశంలో ఇలా రాసుకొచ్చాడు. "ఇది ఓ గొప్ప ప్రయాణం. ఈ రోజు నేను కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుండి రిటైర్మెంట్ను ప్రకటించాలనుకుంటున్నాను. ఈ సీజన్ నా చివరిది. కరీబియన్ ప్రజల ముందు నా చివరి ప్రొఫెషనల్ టోర్నమెంట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నాను. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ను ఉద్దేశిస్తూ.. ఎక్కడైతే మొదలు పెట్టానో, అక్కడే ముగించాలని కోరుకుంటున్నాను.కాగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని క్రికెట్ లీగ్‌ల్లో పాల్గొన్న బ్రావో.. వెస్టిండీస్ తరఫున 40 టెస్ట్‌లు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. ఇందులో దాదాపు 6500 పరుగులు చేసి 363 వికెట్లు తీశాడు. బ్రావో ఖాతాలో 5 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. అతను వివిధ ఫ్రాంచైజీల తరఫున 161 మ్యాచ్‌లు ఆడి 1560 పరుగులు చేసి, 183 వికెట్లు తీశాడు. -
చరిత్రపుటల్లోకెక్కిన రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆటగాడు, వరల్డ్ నంబర్ వన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ చరిత్రపుటల్లోకెక్కాడు. టీ20 ఫార్మాట్లో 600 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. హండ్రెడ్ లీగ్ 2024లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 29 జరిగిన మ్యాచ్‌లో రషీద్ 600 వికెట్ల క్లబ్లో చేరాడు. ఒరిజినల్స్ బ్యాటర్ పాల్ వాల్టర్ వికెట్ తీయడంతో 600 వికెట్ల మైలురాయిని తాకడు. టీ20ల్లో రషీద్‌కు ముందు విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రమే 600 వికెట్లు తీశాడు. బ్రావో 578 మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టగా.. రషీద్ కేవలం 441 మ్యాచ్‌ల్లో 600 వికెట్ల ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బ్రావో, రషీద్ తర్వాత సునీల్ నరైన్ (557), ఇమ్రాన్ తాహిర్ (502), షకీబ్ అల్ హసన్ (492), ఆండ్రీ రసెల్ (462) ఉన్నారు. భారత్ నుంచి అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్ ఉన్నాడు. చహల్ 305 మ్యాచ్‌ల్లో 354 వికెట్లు పడగొట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్‌కు ఆడుతున్న రషీద్ ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. రషీద్‌తో పాటు ఇమాద్ వసీం (2/21), సామ్ కుక్ (2/37) రాణించడంతో రసవత్తర పోరులో ఒరిజినల్స్‌పై రాకెట్స్ పరుగు తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. టామ్ బాంటన్ (45), రోవ్‌మన్ పావెల్ (27), రషీద్ ఖాన్ (15 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మాంచెస్టర్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 3, సికందర్ రజా 2, పాల్ వాల్టర్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం ఛేదనలో మాంచెస్టర్ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులకు పరిమితమైంది. ఫలితంగా రాకెట్స్ పరుగు తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో హెల్డన్ (40) టాప్ స్కోరర్‌గా కాగా.. మ్యాడ్సన్ (28), వాల్టర్ (29), సికందర్ రజా (21) ఓ మోస్తరు పరుగులు చేశారు. రాకెట్స్ బౌలర్లలో ఇమాద్ వసీం, రషీద్ ఖాన్, సామ్ కుక్ తలో 2 వికెట్లు, థాంప్సన్ ఓ వికెట్ పడగొట్టారు. -
T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా డ్వేన్ బ్రావో..
టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ (ACB) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం డ్వేన్ బ్రావోను ఏసీబీ నియమించింది. కరేబియన్ దీవులలో ఈ మెగా ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో బ్రావో సేవలను ఉపయెగించుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ నిర్ణయించుకుంది. కాగా అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ఇప్పటికే విండీస్‌కు చేరుకుంది. సెయింట్ కిట్స్‌లో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరంలో ప్రాక్టీస్ చేయనున్నారు. బ్రావో కూడా అతి త్వరలోనే అఫ్గాన్ జట్టుతో కలవనున్నాడు. ఇక బ్రావో ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్ పనిచేస్తున్నాడు. 40 ఏళ్ల బ్రావోకు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ప్రాంచైజీ క్రికెట్లో కూడా అపారమైన అనుభవం ఉంది. వెస్టిండీస్ తరపున ఓవరాల్‌గా 295 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్రావో.. 6423 పరుగులతో పాటు 363 వికెట్లు తీశాడు. టీ20 క్రికెట్(అంతర్జాతీయ మ్యాచ్‌లు+ లీగ్‌లు)లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావోనే కొనసాగుతున్నాడు. బ్రావో ఇప్పటివరకు టీ20ల్లో 625 వికెట్లు పడగొట్టాడు. వెస్టిండీస్ రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకోవడంలోనూ బ్రావోది కీలక పాత్ర. అంతేకాకుండా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, సీపీఎల్‌లో సెయింట్ లూసియా వంటి జట్లు టైటిల్స్‌ను సాధించడంలోనూ బ్రావో తన వంతు పాత్ర పోషించాడు. ఇటువంటి వరల్డ్‌క్లాస్ క్రికెటర్‌తో అఫ్గానిస్తాన్ క్రికెట్ ఒప్పందం కుదుర్చుకోవడం ఆ జట్టుకు ఎంతో లాభం చేకూరుతోంది. -
కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్‌గా గయానా.. ఫైనల్లో పొలార్డ్ టీమ్ చిత్తు
కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా ఇమ్రాన్ తహీర్ సారథ్యంలోని గయానా అమెజాన్ వారియర్స్ నిలిచింది. సోమవారం గయానా వేదికగా జరిగిన ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన అమెజాన్ వారియర్స్.. తొలిసారి సీపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్.. గయనా బౌలర్ల ధాటికి 94 పరుగులకే కుప్పకూలింది. గయనా బౌలర్లలో ప్రోటీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ 4 వికెట్లతో నైట్ రైడర్స్‌ను దెబ్బతీయగా.. మోతీ, తహీర్ తలా రెండు వికెట్లు సాధించారు. నైట్‌రైడర్స్ బ్యాటర్లలో కార్టీ(38) మినహా మిగితందరూ దారుణంగా విఫలమయయ్యారు. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గయానా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గయానా బ్యాటర్లలో ఓపెనర్ అయాబ్(52),హోప్(32) పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా డ్వైన్ ప్రిటోరియస్ నిలవగా.. షాయ్ హోప్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు వరించింది. చదవండి: KL Rahul: నేను అస్సలు ఊహించలేదు.. అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది -
'ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది.. మీ ఆజ్ఞ మహారాజా!'
మేజర్ లీగ్ క్రికెట్ తొలి ఎడిషన్‌లో భాగంగా ముంబై న్యూయార్క్ ఫైనల్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నికోలస్ పూరన్ సారధ్యంలోని ముంబై న్యూయార్క్ టెక్సస్ సూపర్ కింగ్స్‌తో జరిగిన చాలెంజర్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. జూలై 31న జరగనున్న ఫైనల్లో సీటెల్ ఓర్కాస్, ముంబై న్యూయార్క్‌లు తలపడనున్నాయి. కాగా వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్లు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావోలు మంచి స్నేహితులన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముంబై న్యూయార్క్‌కు పొలార్డ్ కెప్టెన్‌గా ఉంటే.. టెక్సస్ సూపర్ కింగ్స్‌లో బ్రావో సభ్యుడిగా ఉన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరి మధ్య ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముంబై న్యూయార్క్.. టెక్సస్ సూపర్ కింగ్స్‌ను ఓడించగానే బ్రావోనూ చూస్తూ పొలార్డ్.. ''ఇక నువ్వు ఫ్లైట్ ఎక్కాల్సిన సమయం ఆసన్నమైంది'' అంటూ సైగలు చేశాడు. దీనికి స్పందించిన బ్రావో పొలార్డ్ ముందు తలవంచి.. ''మీ ఆజ్ఞ మహారాజా.. తప్పక పాటిస్తా'' అంటూ చేతులెత్తి నమస్కరించాడు. దీంతో ఇద్దరి మధ్య నవ్వులు విరపూశాయి. ఆ తర్వాత బ్రావో, పొలార్డ్‌లు ఒకరినొకరు హగ్ చేసుకొని ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. These two & their banter 😂💙 Polly wins this round, DJ! 😉#OneFamily #MINewYork #MajorLeagueCricket #MINYvTSK pic.twitter.com/wEDEe7VKvg — MI New York (@MINYCricket) July 29, 2023 చదవండి: Japan Open 2023: భారత్ కథ ముగిసింది.. సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి -
డ్వేన్ బ్రావో ఊచకోత.. అయినా గెలవలేకపోయిన సూపర్ కింగ్స్
మేజర్ లీగ్ క్రికెట్ 2023లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఓటమిని ఎదుర్కొంది. వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో ఇవాళ (జులై 17) జరిగిన మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మెరుపు ఇన్నింగ్స్‌తో (39 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడినప్పటికీ సూపర్ కింగ్స్ గెలవలేకపోయింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించి, తమ జట్టుకు సీజన్ తొలి గెలుపును అందించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. మాథ్యూ షార్ట్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. షార్ట్‌తో పాటు ముక్తర్ అహ్మద్ (20), మోసస్ హెన్రిక్స్ (21) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు పడగొట్టగా.. మిచెల్ సాంట్నర్, మోహిసిన్ ఖాన్, డ్వేన్ బ్రావో తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సూపర్ కింగ్స్.. ఛేదనలో తడబడింది. మార్కో జన్సెన్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే తొలి బంతికే క్లీన్ బౌల్డ్ కాగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (14) మరోసారి విఫలమయ్యాడు. ఆతర్వాత బరిలోకి దిగిన లహీరు మిలంత (15), డేవిడ్ మిల్లర్ (14), మిలింద్ కుమార్ (3), మిచెల్ సాంట్నర్ (22) కూడా విఫలమైనా ఏడో నంబర్లో వచ్చిన బ్రావో సూపర్ కింగ్స్‌ను విజయతీరాలకు చేర్చేందుకు శక్తిమేరకు ప్రయత్నించాడు. అతనికి మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 157 పరుగులు మాత్రమే చేసి, ఓటమిపాలైంది. -
ఇదేమి సిక్స్‌రా బాబు.. ఏకంగా స్టేడియం బయటకు! వీడియో వైరల్
మేజర్ లీగ్ క్రికెట్-2023లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. ఆదివారం వాషింగ్టన్ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో టెక్సాస్ సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. 163 లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగల్గింది. సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో( 39 బంతుల్లో 76) మెరుపులు మెరిపించనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. కెప్టెన్ డుప్లెసిస్, డెవాన్ కాన్వే వంటి టాపర్డర్ బ్యాటర్ల విఫలం కావడంతో 73 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి సూపర్ కింగ్స్ కష్టాల్లోపడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన బ్రావో ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ఆఖరి ఓవర్లో సూపర్ కింగ్స్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. బ్రావో 20 పరుగులు రాబట్టాడు. దీంతో 6 పరుగల తేడాతో సూపర్ కింగ్స్ ఓటమి చవిచూడల్సి వచ్చింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఇన్నింగ్స్‌లో మథ్యూ షార్ట్ 80 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ఆడాడు. సూపర్ కింగ్స్ బౌలర్లలో గెరాల్డ్ కోయెట్జీ రెండు వికెట్లు సాధించగా.. బ్రావో, శాంట్నర్, మోహ్సిన్ తలా వికెట్ పడగొట్టారు. బ్రావో సూపర్ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో ఓ భారీ సిక్సర్ బాదాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్ వేసిన అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో.. బ్రావో 103 మీటర్ల భారీ సిక్స్ కొట్టాడు. నోర్జే షార్ట్‌పిచ్ డెలివరీ వేయగా.. బ్రావో లాంగ్ ఆన్ మీదుగా భారీ షాట్ ఆడాడు. బంతి కాస్త స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Dwayne Bravo hits a 106 meter six in MLC!#MajorLeagueCricket pic.twitter.com/QJXjSoPDbb — Abdullah Neaz (@Abdullah__Neaz) July 17, 2023 చదవండి: IND vs WI: వెస్టిండీస్‌కు వెళ్లనున్న అజిత్ అగర్కార్.. ఎందుకంటే? -
ధోని వల్లే ఇలా మారాల్సి వచ్చింది..!
-
ధోని చేతిలో మరో వజ్రాయుధం అతడు మరో బ్రావో...
-
KKR VS RR: చరిత్ర సృష్టించిన చహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ చరిత్ర సృష్టించాడు. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు (143 మ్యాచ్‌ల్లో 184) సాధించిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (మే 11) కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నితీశ్ రాణా వికెట్ పడగొట్టడం ద్వారా లీగ్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉండిన డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు)ను రెండో స్థానానికి వెనక్కునెట్టి ఐపీఎల్ టాప్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో చహల్, బ్రావోల తర్వాత ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (176 మ్యాచ్‌ల్లో 174), అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 172 వికెట్లు), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (196 మ్యాచ్‌ల్లో 171) టాప్-5లో ఉన్నారు. కాగా, కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న కేకేఆర్ 15 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 116 పరుగలు చేసింది. జేసన్ రాయ్ (10), రహ్మానుల్లా గుర్భాజ్ (18), నితిశ్ రాణా (22), ఆండ్రీ రసెల్ (10) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. వెంకటేశ్ అయ్యర్ (49 నాటౌట్), రింకూ సింగ్ (4) క్రీజ్‌లో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా.. చహల్, ఆసిఫ్ తలో వికెట్ దక్కించకున్నారు. పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లకు ఇది డూ ఆర్ డూమ్యాచ్. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ రెండు జట్లు ఈ మ్యాచ్ తప్పక గెలిచి తీరాలి. చదవండి: సంచలన క్యాచ్.. కొంచెం పట్టు తప్పినా అంతే సంగతి! -
LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..!
లక్నోలోని అటల్ బిహారీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వెటరన్ బౌలర్ అమిత్ మిశ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ పడగొట్టడం ద్వారా మిశ్రా ఐపీఎల్ టాప్-3 బౌలర్ల జాబితాలోకి దూసుకొచ్చాడు. మూడో ప్లేస్‌కు ఎగబాకే క్రమంలో మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో డ్వేన్ బ్రావో (161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. యుజ్వేంద్ర చహల్ (140 మ్యాచ్‌ల్లో 178) రెండో స్థానంలో, అమిత్ మిశ్రా (160 మ్యాచ్‌ల్లో 171 వికెట్లు) మూడో ప్లేస్‌లో ఉన్నారు. ఒక్క వికెట్‌తో ముగ్గురిని అధిగమించిన మిశ్రా.. ఐపీఎల్లో టాప్-3 బౌలర్ స్థానానికి చేరుకునే క్రమంలో అమిత్ మిశ్రా ఒకేసారి ముగ్గురు బౌలర్లను అధిగమించాడు. లక్నోతో మ్యాచ్‌కు ముందు 169 వికెట్లు కలిగిన మిశ్రా.. ఒక్క వికెట్‌తో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ (122 మ్యాచ్‌ల్లో 170), ముంబై స్పిన్నర్ పియూష్ చావ్లా (173 మ్యాచ్‌ల్లో 170), రాజస్థాన్ బౌలర్ అశ్విన్ (193 మ్యాచ్‌ల్లో 170)లను దాటేశాడు. మరో వికెట్ కూడా.. ఈ మ్యాచ్‌లో మిశ్రా ఖాతాలో మరో వికెట్ కూడా పడింది. దీంతో అతని వికెట్ల సంఖ్య 172కు చేరింది. రెండో స్థానంలో ఉన్న చహల్‌కు మిశ్రాకు కేవలం 6 వికెట్ల తేడా మాత్రమే ఉంది. సుయాశ్ ప్రభుదేశాయ్ వికెట్ తర్వాత మిశ్రా.. కీలకమైన డుప్లెసిస్ వికెట్ తీశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 18 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 115/6గా ఉంది. దినేశ్ కార్తీక్ (15), హసరంగ (1) క్రీజ్‌లో ఉన్నారు. -
RR VS LSG: చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్న చహల్... ఈ మ్యాచ్‌లోనే అవుతుందా..?
ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 19) జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. జైపూర్‌లోని సువాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్‌లో చహల్ మరో 7 వికెట్లు తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ జాబితాలో విండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో 183 వికెట్లతో (161 మ్యాచ్‌ల్లో) అగ్రస్థానంలో ఉండగా.. చహల్ ప్రస్తుతం 177 వికెట్లతో (136 మ్యాచ్‌ల్లో) రెండో స్థానంలో నిలిచాడు. చహల్ ఈ రికార్డును నేటి మ్యాచ్‌లోనే నెలకొల్పడం కాస్త కష్టమే అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. పైగా చహల్ ఈ మ్యాచ్ తమ సొంత మైదానంలో ఆడుతుండటం అతనికి అదనంగా కలిసొచ్చే అంశం. చదవండి: RR VS LSG: అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తర సమరం.. గెలుపెవరిది..? అదీ కాక చహల్‌కు లక్నోపై గణమైన రికార్డు ఉంది. ఐపీఎల్-2022లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో చహల్ 4 వికెట్లతో విజృంభించాడు. అదే సీజన్లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలకమైన దీపక్ హుడా (59) వికెట్ పడగొట్టి సత్తా చాటాడు. ప్రస్తుత సీజన్ ప్రారంభం నుంచి సూపర్ ఫామ్‌లో ఉన్న చహల్.. ఈ సీజన్లోనూ లీడింగ్ వికెట్ టేకర్‌గా (5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు) కొనసాగుతున్నాడు. ఇన్ని సానుకూలమైన అంశాల మధ్య చహల్ నేడు లక్నోతో జరిగే మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్ల ఐపీఎల్ రికార్డును తిరగరాస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే, రాజస్థాన్-లక్నో జట్ల మధ్య ఇవాళ జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ (5 మ్యాచ్‌ల్లో 4 విజయాలు).. రెండో స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ (5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో విజేత ఎవరో అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్ -
IPL 2023: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. భారీ రికార్డుపై కన్నేసిన చహల్
గౌహతి వేదికగా ఇవాళ (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య కీలక సమరం జరుగనుంది. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత ఎడిషన్‌లో ఇరు జట్లు ఆడిన చెరో మ్యాచ్‌లో విజయం సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్‌పై రాయల్స్ 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో విజయంపై ధీమాగా ఉంది. భారీ రికార్డుపై కన్నేసిన చహల్.. పంజాబ్‌తో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో చహల్ ఓ వికెట్ పడగొడితే, ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. చహల్ ఐపీఎల్లో ఇప్పటివరకు 132 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక మాజీ పేసర్ లసిత్ మలింగ సైతం 161 మ్యాచ్‌ల్లో అన్నే వికెట్లు పడగొట్టి ఐపీఎల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చహల్‌తో సమానంగా ఉన్నాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్ల రికార్డు కరీబియన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో (183) పేరిట నమోదై ఉంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా మలింగ్ రికార్డును సమం చేసిన చహల్.. ఈ సీజన్లో మరో 14 వికెట్లు పడగొడితే ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్‌గా ఆవిర్భవిస్తాడు. ప్రస్తుత సీజన్లో చహల్‌కు మినహా మరే బౌలర్‌కు ఈ రికార్డు సాధించే అవకాశం లేదు. 2023 ఐపీఎల్ ఆడుతున్న బౌలర్లలో అశ్విన్ (రాజస్థాన్, 158), భువనేశ్వర్ కుమార్ (ఎస్ఆర్హెచ్, 154), సునీల్ నరైన్ (కేకేఆర్, 153) మాత్రమే 150 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ఉన్నారు. -
ఐపీఎల్-2023లో బద్దలయ్యేందుకు రెడీగా రికార్డులివే..!
మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 16వ ఎడిషన్‌లో పలు రికార్డులు బద్దలయ్యేందుకు రెడీగా ఉన్నాయి. ఆ రికార్డులేంటో ఓసారి లుక్కేద్దాం. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు: ఇప్పటివరకు ఈ రికార్డు విండీస్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. ఈ సీఎస్కే మాజీ ఆల్‌రౌండర్ 183 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా చలామణి అవుతున్నాడు. ఈ రికార్డును రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యుజ్వేంద్ర చహల్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. చహల్ ఖాతాలో ప్రస్తుతం 166 వికెట్లు ఉన్నాయి. రానున్న సీజన్లో అతను మరో 18 వికెట్లు తీస్తే బ్రావో రికార్డు బ్రేక్ అవుతుంది. అత్యధిక సెంచరీలు: ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట నమోదై ఉంది. యూనివర్సల్ బాస్ ఖాతాలో 6 సెంచరీలు ఉండగా.. ఆర్ఆర్ జోస్ బట్లర్, ఆర్సీబీ విరాట్, పంజాబ్ రాహుల్, ఢిల్లీ వార్నర్ ఈ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీగా ఉన్నారు. అత్యధిక సిక్సర్ల రికార్డు: రాబోయే సీజన్లో ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న సెకెండ్ హైయ్యెస్ట్ సిక్సర్స్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. ఏబీడీ ఖాతాలో 251 సిక్సర్లు ఉండగా.. ఈ రికార్డును రోహిత్ శర్మ (240) బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ జాబితాలో అగ్రస్థానంలో క్రిస్ గేల్ (357) ఉన్నాడు. అత్యధిక డక్స్: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రానున్న సీజన్లో అత్యంత చెత్త రికార్డు నమోదు చేసే అవకాశం ఉంది. హిట్‌మ్యాన్ మరో మ్యాచ్‌లో డకౌటైతే మన్దీప్ సింగ్ (14)ను అధిగమించి హోల్ అండ్ సోల్‌గా చెత్త రికార్డుకు ఓనర్ అవుతాడు. ఇవే కాకుండా రానున్న సీజన్లో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్లో ఎవరికీ సాధ్యపడని పలు మైలురాళ్లను అధిగమించే అవకాశం ఉంది. అవేంటంటే.. అత్యధిక మ్యాచ్‌లు: సీఎస్కే సారధి ఎంఎస్ ధోని రానున్న ఐపీఎల్ సీజన్లో 250 మ్యాచ్‌ల మార్కును అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ధోని ఐపీఎల్లో 234 మ్యాచ్‌లు ఆడి టాప్‌లో ఉన్నాడు. అత్యధిక పరుగులు: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ రానున్న సీజన్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించే అవకాశం ఉంది. కోహ్లి ఖాతాలో ప్రస్తుతం 6624 పరుగులుండగా.. ధవన్ ఖాతాలో 6244 రన్స్ ఉన్నాయి. అలాగే వార్నర్ (5881), రోహిత్ శర్మ (5879)లు 6000 పరుగుల క్లబ్లో చేరే అవకాశం ఉంది. అత్యధిక క్యాచ్‌లు: ఐపీఎల్లో ఇప్పటివరకు 97 క్యాచ్‌లు అందుకున్న రోహిత్ శర్మ, 93 క్యాచ్‌లు అందుకున్న విరాట్ కోహ్లి 100 క్యాచ్‌ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఈ రికార్డు సురేశ్ రైనా (109) పేరిట ఉంది. -
‘ఐపీఎల్‌కు గుడ్‌బై’ చెప్పిన మరో దిగ్గజం.. బంపరాఫర్ ఇచ్చిన సీఎస్కే
Dwayne Bravo- Chennai Super Kings: మరో వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు వీడ్కోలు పలికాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇకపై ఆటగాడిగా కొనసాగబోనని స్పష్టం చేశాడు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశాడు. కాగా విజయవంతమైన జట్టుగా పేరొందిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు బ్రావో సుదీర్ఘ కాలంగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సీఎస్కేను చాంపియన్‌గా నిలపడంతో తన వంతు పాత్ర పోషించాడు ఈ రైట్ఆర్మ్ పేసర్. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో అతడిని రిలీజ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. బ్రావోకు బంపరాఫర్! అయితే, సుద్ఘీకాలం తమకు సేవలు అందించిన బ్రావోకు.. చెన్నై ఫ్రాంఛైజీ బంపరాఫర్ ఇచ్చింది. డ్వేన్ బ్రావోను సీఎస్కే బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ధ్రువీకరించిన సీఎస్కే సీఈవో కేఎస్ విశ్వనాథన్.. ఐపీఎల్లో విజయవంతంగా కెరీర్ కొనసాగించిన బ్రావోకు అభినందనలు తెలిపారు. సూపర్‌కింగ్స్ కుటుంబంలో దశాబ్దకాలంగా కీలక సభ్యుడిగా ఉన్న బ్రావోతో తమ అనుబంధం కొనసాగుతుందని.. అతడిని బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ సైతం ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు వచ్చే సీజన్లో అదే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. అత్యధిక వికెట్ల వీరుడు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్టు పడగొట్టిన ఆటగాడిగా డ్వేన్ బ్రావో రికార్డు సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో మొత్తంగా 161 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 183 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా 1560 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 2011లో సీఎస్కేకు ఆడటం మొదలుపెట్టిన బ్రావో.. 2011, 2018, 2021లో జట్టును చాంపియన్‌గా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. 2014 నాటి చాంపియన్స్ లీగ్ గెలిచిన జట్టులో కూడా సభ్యుడు. 2013, 2015లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రెండుసార్లు పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. చదవండి: Ricky Ponting: రికీ పాంటింగ్‌కు ఛాతీ నొప్పి.. ఆసుపత్రికి తరలింపు Rashid Khan: కెప్టెన్లుగా కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్.. ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన #ChampionForever 🦁💛 Official Statement 🔗🔽 @DJBravo47 — Chennai Super Kings (@ChennaiIPL) December 2, 2022 -
600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. టి20 క్రికెట్లో తొలి బౌలర్‌గా
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టి20 క్రికెట్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. హెండ్రెండ్ టోర్నమెంట్లో భాగంగా బ్రావో ఈ ఫీట్ అందుకున్నాడు. హండ్రెడ్‌లో నార్తన్ సూపర్‌చార్జర్స్‌కు ఆడుతున్న బ్రావో.. ఓవల్ ఇన్విసిబుల్స్తో మ్యాచ్‌లో సామ్ కరన్‌ను ఔట్ చేయడం ద్వారా టి20ల్లో 600వ వికెట్ మార్క్‌ను అందుకున్నాడు. సామ్ కరన్‌ను ఔట్ చేయగానే బ్రావో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరున్న బ్రావో టి20ల్లో 516 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకున్నాడు. కాగా మ్యాచ్‌లో ఓవరాల్‌గా 20 బంతులేసి 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా బ్రావో తర్వాత అఫ్గనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ 466 వికెట్లు, విండీస్‌కు చెందిన స్పిన్నర్ సునీల్ నరైన్ 457 వికెట్లతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక వెస్టిండీస్ క్రికెట్లో 2004 నుంచి 2021 కాలంలో కీలక ఆల్‌రౌండర్‌గా వెలుగొందాడు. 2012, 2016 టి20 ప్రపంచకప్‌లు విండీస్ గెలవడంలో బ్రావో పాత్ర కీలకం. ఓవరాల్‌గా విండీస్ తరపున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2018లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో టి20 ప్రపంచకప్ 2020 దృశ్యా తన టి20లకు అందుబాటులో ఉంటానని చెప్పి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో భాగంగా 2021.. నవంబర్ 6న.. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అనంతరం బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన నార్తన్ సూపర్ చార్జర్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆడమ్ లిత్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్లతో 79 పరుగులు సాధించాడు. లిత్ మినహా మిగతావారిలో పెద్దగా ఎవరు రాణించలేదు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఓవల్ ఇన్విసిబుల్స్ 97 బంతుల్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సామ కరన్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జోర్డాన్ కాక్స్ 29 బంతుల్లో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో టామ్ కరన్ 7 బంతుల్లో 18 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 6️⃣0️⃣0️⃣ T20 wickets for DJ Bravo! 🎉 He becomes the first to yet another milestone - no other player has yet reached 500! 🙌 pic.twitter.com/ZRBMhoFKHK — ESPNcricinfo (@ESPNcricinfo) August 11, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో Slow deliveries 🤝 Bravo! Spectacular bowling from the superstar @DJBravo47. Watch all the action from The Hundred LIVE, exclusively on #FanCode 👉https://t.co/3GLSe3BlEE@thehundred#TheHundred #TheHundredonFanCode pic.twitter.com/BRNYIenclH — FanCode (@FanCode) August 12, 2022 -
పొలార్డ్ కాళ్లకు దండం పెట్టిన బ్రావో.. వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంసకర ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండగా.. సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అతడి కాళ్లకు దండం పెట్టాడు. అదే విధంగా అనంతరం వీరిద్దరూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా వీరిద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అదే విధంగా వీరిద్దరూ చాలా ఏళ్ల పాటు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే పొలార్డ్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరనీ షాక్‌కు గురి చేశాడు. పొలార్డ్ విండీస్ తరపున 123 వన్డేలు, 101 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. pic.twitter.com/7gVh2Uys7n — Diving Slip (@SlipDiving) April 21, 2022 -
ఐపీఎల్లో డ్వేన్ బ్రావో సరికొత్త చరిత్ర
చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ఐపీఎల్లో చరిత్ర సృష్ఠించాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో దీపక్ హుడాను ఔట్ చేయడం ద్వారా బ్రావో ఐపీఎల్లో 171వ వికెట్ సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రావో కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో బ్రావో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ (170) రికార్డును బద్దలు కొట్టాడు. కాగా ఐపీఎల్ టాప్ ఐదు వికెట్ టేకర్స్ జాబితాను పరిశీలిస్తే.. బ్రావో(171 వికెట్లు), మలింగ(170 వికెట్లు) తొలి రెండు స్థానాల్లో ఉండగా.. ఆ తర్వాత అమిత్ మిశ్రా (166), పియుష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150)లు ఉన్నారు. చదవండి: మంచివో.. చెడ్డవో; ఏవైనా సీఎస్కేకే సాధ్యం.. Bravoooo Legend! No. 1⃣ 👑#LSGvCSK #Yellove #WhistlePodu 🦁💛 pic.twitter.com/GdgVCL6Gg2 — Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2022 -
IPL 2022: చరిత్ర సృష్టించేందుకు వికెట్ దూరంలో ఉన్న సీఎస్కే బౌలర్
CSK VS LSG: చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆల్‌రౌండర్, టీ20 స్పెషలిస్ట్ బౌలర్ డ్వేన్ బ్రావో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చరిత్ర సృష్టించేందుకు వికెట్ దూరంలో ఉన్నాడు. ఇవాళ (మార్చి 31) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌లో బ్రావో మరో వికెట్ తీస్తే.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగ (170) రికార్డును బద్దలు కొడతాడు. ప్రస్తుతం బ్రావో 170 వికెట్లతో మలింగతో సమానంగా ఐపీఎల్ హైయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ టాప్ 6 వికెట్ టేకర్స్ జాబితాలో మలింగ, బ్రావోల తరువాత అమిత్ మిశ్రా (166), పియుష్ చావ్లా (157), హర్భజన్ సింగ్ (150), రవిచంద్రన్ అశ్విన్ (145) ఉన్నారు. ఇదిలా ఉంటే, రవీంద్ర జడేజా నేతృత్వంలో సీఎస్కే ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం సీఎస్కే, ఎల్ఎస్జీ జట్లు చెరో మార్పు చేసే అవకాశం ఉంది. చెన్నై.. కాన్వే స్థానంలో మొయిన్ అలీని ఆడించే ఛాన్స్ ఉండగా, లక్నో.. మొహ్సిన్ ఖాన్ బదులు కృష్ణప్ప గౌతమ్, షాబజ్ నదీమ్‌లలో ఒకరిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలైనప్పటికీ వెటరన్ ఆటగాళ్లు బ్రావో (3/20), ధోని (50 నాటౌట్) రాణించడం ఆ జట్టుకు శుభపరిణామమనే చెప్పాలి. చదవండి: IPL 2022: బోణీ విజయం కోసం తహతహలాడుతున్న జడేజా, కేఎల్ రాహుల్.. చెరో మార్పుతో..! -
వికెట్ తీసిన ఆనందం.. బ్రావో డ్యాన్స్ అదిరిపోయిందిగా.. వీడియో వైరల్!
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో ఫీల్డ్‌లో ఎంత ఉత్సాహంగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వికెట్ తీసిన క్యాచ్ పట్టిన డ్యాన్స్ చేసి అభిమానులను అలరిస్తూ ఉంటాడు. తాజాగా ఐపీఎల్-2022లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్రావో మరో సారి డ్యాన్స్ చేశాడు. కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేసిన ఆనందంలో బ్రావో స్పెషల్ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 7 ఓవర్ బౌలింగ్ చేసిన బ్రావో.. వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేసి సీఎస్కేకు తొలి వికెట్ అందించాడు. ఈ క్రమంలో బ్రావో తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ 6 వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఎమ్మెస్ ధోని (38 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రహానే (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Dwayne Bravo: ఐపీఎల్లో డ్వేన్ బ్రావో సరికొత్త చరిత్ర Bravo's new celebration pic.twitter.com/M24LnOr8IK — That-Cricket-Girl (@imswatib) March 26, 2022 -
ఐపీఎల్లో డ్వేన్ బ్రావో సరికొత్త చరిత్ర
సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2022 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో సామ్ బిల్లింగ్స్‌ను ఔట్ చేయడం ద్వారా బ్రావో 170వ వికెట్ సాధించాడు. దీంతో ఐపీఎల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా లసిత్ మలింగతో కలిసి తొలి స్థానంలో నిలిచాడు. వీరిద్దరి తర్వాత అమిత్ మిశ్రా 160 వికెట్లతో రెండో స్థానంలో.. 157 వికెట్లతో పియూష్ చావ్లా మూడో స్థానంలో, హర్బజన్ సింగ్ 150 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక బ్రావో మరొక వికెట్ తీస్తే ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కేకేఆర్ శుభారంభం చేసింది. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రహానే 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సామ్ బిల్లింగ్స్ 25, శ్రేయాస్ అయ్యర్ 20 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించాడు. సీఎస్కే బౌలర్లలో డ్వేన్ బ్రేవో 3, మిచెల్ సాంట్నర్ ఒక వికెట్ తీశాడు. చదవండి: MS Dhoni: ఇది ధోని అంటే.. మూడేళ్ల తర్వాత ఎట్టకేలకు -
వికెట్ పడగొట్టాడు.. శ్రీవల్లి పాటకు స్టెప్పులేశాడు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. పుష్ప.. సినీ ప్రపంచాన్నే కాకుండా క్రికెట్ ప్రపంచాన్ని కూడాఓ ఊపు ఊపేస్తోంది. సాధారణంగా బౌలర్ వికెట్ తీసినప్పుడు తనదైన శైలిలో సెలబ్రేషన్ జరపుకుంటారు. కానీ ప్రస్తుతం బౌలర్లు పుష్ప డైలాగ్‌లు, పాటలకు స్టెప్పలేసి సంబరాలు జరపుకుంటాన్నారు. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ వేసిన డ్యాన్స్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో కూడా శ్రీవల్లీ పాటకు స్టెప్పులేశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కొమిల్లా విక్టోరియన్స్ ,ఫార్చ్యూన్ బారిషల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన బ్రావో బౌలింగ్‌లో మహిదుల్ ఇస్లాం అంకాన్ భారీ షాట్‌కు ప్రయత్నించగా.. అది మిస్టైమ్ అయ్యి ఫీల్డర్ చేతికి వెళ్లింది. ఈ క్రమంలో వికెట్ తీసిన సంతోషంలో బ్రావో శ్రీవల్లి పాటకు స్టెప్ వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Champion, @DJBravo47 channels his inner 𝑷𝒖𝒔𝒉𝒑𝒂 🕺🏼 after sending Mahidul Islam Ankon back to the pavilion! 😍 Catch the West Indian legend in relentless #BBPL2022 action for just ₹5, LIVE on #FanCode 👉 https://t.co/OLCsbLuBGA#BPLonFanCode @alluarjun pic.twitter.com/kVlAlvI2x3 — FanCode (@FanCode) January 25, 2022 -
బ్రావోతో కలిసి డేవిడ్ వార్నర్ డ్యాన్స్
David Warner Funny Dance.. డేవిడ్ వార్నర్ ఎంటర్టైన్మెంట్కు ఎంత ప్రాధాన్యమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఉంటే ఎంత విజృంభిస్తాడో.. బయట అంత ఉల్లాసంగా కనిపిస్తాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోతో కలిసి డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. విండీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడిన బ్రావోకు రిటైర్మెంట్ వేళ గార్డ్ ఆఫ్ ఆనర్తో పాటు వార్నర్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో ఆసీస్ విజయంలో వార్నర్ కీలకపాత్ర పోషించాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు.. 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు సాధించాడు. ప్రస్తుతం వార్నర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Chris Gayle: ఫన్నీ బౌలింగ్.. మిచెల్ మార్ష్ ఔట్‌తో ముగించాడు pic.twitter.com/hGPLe5VEa1 DJ Bravo dancing with Warner 😅 — PRAYAS-NULLAH- JAJAI 🇦🇫🇦🇫 (@cricloverPrayas) November 6, 2021 -
Retirement: బ్రావోకు చేదు అనుభవం.. తృటిలో తప్పించుకున్నాడు
Dwayne Bravo Falls After Pollard Shot Hits Him Viral.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోకు తన రిటైర్మెంట్ రోజే చేదు అనుభవం ఎదురైంది. ఏమైందో అని కంగారుపడకండి.. తృటిలో గాయం నుంచి తప్పించుకున్నాడు. మిచెల్ మార్ష్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్ ఐదో బంతిని వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి వేగంగా దూసుకురాడంతో బ్రావో కిందకు వంగాడు.. ఈ నేపథ్యంలో బ్యాట్ ఎగిరి క్రీజుపై పడింది. బ్రావో కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే పెద్ద ప్రమాదం జరిగేది. ఒకవేళ బంతి తగిలి ఉంటే మాత్రం బ్రావోకు తన చివరి మ్యాచ్ చేదు అనుభవంగా మిగిలిపోయి ఉండేది. చదవండి: Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రావో గుడ్ బై.. ఇక చాలు 2004లో డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన బ్రావో.. ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1000 పరుగులు చేశాడు. 78 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.అదే విధంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ముఖ్యంగా 2012 టోర్నీలో విన్నింగ్ క్యాచ్ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును ఎవరూ మర్చిపోలేరు. చదవండి:Chris Gayle Retirement: సన్ గ్లాసెస్‌తో బరిలోకి.. క్రిస్ గేల్ రిటైర్మెంట్! pic.twitter.com/nOfU94aN1L — Simran (@CowCorner9) November 6, 2021 -
అంతర్జాతీయ క్రికెట్‌కు డ్వయాన్ బ్రావో గుడ్‌బై
-
Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రావో గుడ్ బై.. ఇక చాలు
T20 World Cup 2021- Dwayne Bravo Confirms Retirement: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కీలక ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు... ‘‘సమయం ఆసన్నమైందని అనిపిస్తోంది. వెస్టిండీస్‌కు 18 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాను. అయితే, వెనక్కి తిరిగి చూసుకుంటే నా కెరీర్లో ఎన్నో విజయాలు సాధించాను. కరేబియన్ ప్రజల తరఫున అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించడం పట్ల కృతజ్ఞతాభావంతో నా మనసు నిండిపోయింది. మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన విండీస్ జట్టులో సభ్యుడిని కావడం సంతోషకరం’’ అని బ్రావో వ్యాఖ్యానించాడు. నవంబరు 4న శ్రీలంకతో మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓడిన తర్వాత ఆల్‌రౌండర్ బ్రావో ఈ మేరకు ప్రకటన చేశాడు. యూటర్న్ తీసుకుని.. మళ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించి ఏడాది దాటిన తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు బ్రావో 2019లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీ20 ఫార్మాట్ సెలక్షన్స్‌కు అందుబాటులో ఉండేందుకే తాను యూటర్న్ తీసుకున్నట్లు వెల్లడించాడు. అప్పట్లో బోర్డు పెద్దల వ్యవహారం సరిగ్గా లేనందు వల్లే రిటైర్మెంట్ ఆలోచన చేశానన్న బ్రావో... ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపాడు. 90 టీ20 మ్యాచ్‌లు 2004లో డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. వెస్టిండీస్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా అన్ని ఫార్మాట్లు కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2006లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేసిన బ్రావో.. ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 1000 పరుగులు చేశాడు. 78 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అదే విధంగా 2012, 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. ముఖ్యంగా 2012 టోర్నీలో విన్నింగ్ క్యాచ్ అందుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును ఎవరూ మర్చిపోలేరు. ఇక టీ20 వరల్డ్‌కప్-2021లో భాగంగా ఆస్ట్రేలియాతో నవంబరు 6న జరగనున్న మ్యాచ్‌లో తుది జట్టులో చోటు దక్కితే విండీస్ తరఫున బ్రావో ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 294కు చేరుతుంది. చదవండి: Chris Gayle: ఏంటిది గేల్.. చెత్త రికార్డు...ఇన్ని ఘనతలు ఉన్నా.. శ్రీలంకపై మాత్రం.. -
T20 World Cup: ధోని, కోహ్లికి సాధ్యం కానిది.. రోహిత్ శర్మ అరుదైన ఘనత!
T20 World Cup: Seven players who featured in all editions: 2007- 2016 వరకు ఇప్పటికీ 6 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు జరిగాయి. తొట్టతొలి పొట్టి ఫార్మాట్ ప్రపంచకప్‌ను ముద్దాడి జగజ్జేతగా నిలిచింది ధోని సేన. ఆ తర్వాత పాకిస్తాన్(2009), ఇంగ్లండ్(2010), వెస్టిండీస్(2012, 2016- రెండుసార్లు), శ్రీలంక(2014) ఈ ఘనత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా విండీస్ జట్టు బరిలోకి దిగనుంది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మెగా టోర్నీలో తమ తమ జాతీయ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఎవరో తెలుసా?! హిట్‌మ్యాన్ అరుదైన ఘనత టీమిండియా వైస్ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) 2007 నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తాజా ఈవెంట్లోనూ అతడు కీలక పాత్ర పోషించనున్నాడు. ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో 28 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ.. 673 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 79(నాటౌట్). షకీబ్ అల్ హసన్(బంగ్లాదేశ్) ఆధునిక క్రికెట్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు షకీబ్ అల్ హసన్(Shakib Al Hasan). టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇప్పటి వరకు 25 మ్యాచ్‌లు ఆడిన అతడు... 567 పరుగులు చేశాడు. 30 వికెట్లు పడగొట్టాడు. సూపర్ 12కు బంగ్లాదేశ్ అర్హత సాధించే క్రమంలో షకీబ్ పాత్ర కీలకం కానుంది. కాగా టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ అరుదైన ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ(107 వికెట్లు) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును షకీబ్(108) అధిగమించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బంగ్లా ఆరు పరుగుల తేడాతో ఓడిపోవడం గమనార్హం. డ్వేన్ బ్రావో(వెస్టిండీస్) టీ20 ఫార్మాట్లో తొలి 300, 400, 500 వికెట్లు తీసిన విండీస్ క్రికెట్ స్టార్ డ్వేన్ బ్రావో(Dwayne Bravo). బ్యాటర్‌గానూ సత్తా చాటిన అతడు మెగా టోర్నీలో 504 పరుగులు చేశాడు. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ట్రోఫీ వేటలో ఈ ఆల్‌రౌండర్ ప్రముఖ పాత్ర పోషించనున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహ్మదుల్లా(బంగ్లాదేశ్) టీ20 వరల్డ్‌కప్-2021లో బంగ్లాదేశ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు మహ్మదుల్లా(Mahmudullah). మిడిలార్డర్ బ్యాటర్‌గా, ఆఫ్ స్సిన్నర్‌గా ఉన్న అతడు ఇంతవరకు మెగా ఈవెంట్లో మెరుగ్గా రాణించింది లేదు. 2007-16 వరకు 22 మ్యాచ్‌లు ఆడిన మహ్మదుల్లా కేవలం 194 పరుగులు చేసి, 8 వికెట్లు తీశాడు. ముష్ఫికర్ రహీం(బంగ్లాదేశ్) వికెట్ కీపర్ బ్యాటర్ రహీమ్(Mushfiqur Rahim)ది కూడా మహ్మదుల్లా లాంటి కథే. ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో 20 ఇన్నింగ్స్ ఆడిన అతడు 258 పరుగులు సాధించాడు. 19 డిస్మిసల్స్ చేశాడు. క్రిస్ గేల్(వెస్టిండీస్) యూనివర్సల్ బాస్, బిగ్ హిట్టర్ క్రిస్ గేల్(Chris Gayle) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఫాస్టెస్ట్ సెంచరీ, అత్యధిక సిక్సర్లు, అత్యధిక పరుగులు.. ఇలా ఒక్కటేమిటి.. పొట్టి ఫార్మాట్లో గేల్ సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఇప్పటికే ఆరుసార్లు టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో విండీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. 920 పరుగులు చేశాడు. శ్రీలంక కెప్టెన్ మహేల జయవర్దనే(1016 రన్స్) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గేల్ కావడం విశేషం. షోయబ్ మాలిక్(పాకిస్తాన్) ఇప్పటికే పాక్ తరఫున ఆరుసార్లు ఈ మెగా టోర్నీలో పాల్గొన్న వెటరన్ ప్లేయర్ షోయబ్ మాలిక్(Shoaib Malik)కు.. ఈసారి సొహైబ్ మక్సూద్ గాయపడటంతో అవకాశం లభించింది. కాగా 2009లో టీ20 ప్రపంచకప్ గెలిచిన పాకిస్తాన్ జట్టులో షోయబ్ మాలిక్ సభ్యుడు. ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు అతడు 2335 పరుగులు చేయడం సహా 28 వికెట్లు తన పేరిట లిఖించుకున్నాడు. చదవండి: T20 WC 2021: అరె ఏంట్రా ఇది.. పాపం బంగ్లాదేశ్ కెప్టెన్... అసలు మాట్లాడనిస్తే కదా! -
డ్వేన్ బ్రావో ఖాతాలో 16వ టి20 టైటిల్
టి20 ఫార్మాట్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో రికార్డు నెలకొల్పాడు. 15 టైటిల్స్‌తో వెస్టిండీస్‌కే చెందిన కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. బ్రావో టైటిల్స్ వివరాలు 3 ఐపీఎల్ (చెన్నై; 2011, 2018, 2021) 1 చాంపియన్స్ లీగ్ (చెన్నై; 2014) 2 టి20 వరల్డ్ కప్ (వెస్టిండీస్; 2012, 2016) 1 స్టాన్ఫోర్డ్ కప్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 2008) 2 బిగ్‌బాష్ లీగ్ (విక్టోరియన్ బుష్రేంజర్స్; 2010, సిడ్నీ సిక్సర్స్–2011) 5 కరీబియన్ ప్రీమియర్ లీగ్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో; 2015, 2017, 2018; ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 2020, సెయిట్ కిట్స్ అండ్ నెవిస్ 2021) 1 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఢాకా డైనమైట్స్; 2016) 1 పాకిస్తాన్ సూపర్ లీగ్ (క్వెట్టా గ్లాడియేటర్స్; 2019) -
హర్షల్ పటేల్‌ను అభినందనల్లో ముంచెత్తిన బ్రావో.. సూపర్ అంటూ..
Harshal Patel: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. దీంతో హర్షల్ పటేల్ 2013 సీజన్లో అత్యధిక వికెట్లు (32) తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్‌ను అభినందించాడు. "అభినందనలు హర్షల్. నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు !! నీ పోరాట పటిమ చూడటానికి చాలా బాగుంది!' అని బ్రావో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. కాగా మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టిన హర్షల్ ఈ ఘనత సాధించాడు. కాగా 17ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో సునీల్ నరైన్ క్యాచ్ పడక్కల్ వదిలివేయడంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డను తృటిలో చేజార్చుకున్నాడు. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా హర్షల్ పటేల్ నిలిచాడు. కాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన ఇంటిముఖం పట్టింది. చదవండి: Glenn Maxwell: కొంచెం డీసెంట్‌గా ఉండండి.. చెత్తగా వాగొద్దు -
IPL 2021: లాస్ట్ బాల్ సిక్స్ కొడితే ఆ మజా వేరు
Match Won By Last-ball Six IPL History.. క్రికెట్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎంఎస్ ధోని ఆఖరిబంతికి సిక్స్ కొట్టి టీమిండియాకు కప్ అందించి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ ఒక్క సిక్స్ అభిమానుల్లో ధోని పేరు చిరస్థాయిగా గుర్తుండిపోయేలా చేసింది. అలా లాస్ట్బాల్ సిక్స్ కొట్టడం అంతకముందు జరిగాయి.. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కీలక మ్యాచ్‌లో ఆఖరి సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్‌లోనూ చాలానే చూశాం. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్లోనూ ఇలాంటివే పునరావృతమవుతున్నాయి. అందులో ఒక మూడు మాత్రం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోతాయి. అవేంటో చూద్దాం. కెఎస్ భరత్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, 2021 Courtesy: IPL Twitter తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి ఆర్సీబీకి ఉత్కంఠ విజయాన్ని కట్టబెట్టాడు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 6 పరుగులకే ఓపెనర్లిద్దరి వికెట్లు కోల్పోయింది. అయితే భరత్ మొదట డివిలియర్స్, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి ఇన్నింగ్స్ నడిపించాడు. ఇక ఆఖరి ఓవర్లో ఆర్సీబీ గెలుపుకు 15 పరుగులు అవసరమయ్యాయి. మొదటి ఐదు బంతుల్లో ఆవేశ్ ఖాన్ 9 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఒత్తిడిలో ఆవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో ఈక్వేషన్ ఒక బంతికి ఐదు పరుగులుగా మారింది. ఈ దశలో ఆవేశ్ ఖాన్ వేసిన లో ఫుల్‌టాస్‌ను భరత్ లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టి ఆర్సీబీకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్‌గా ఆర్సీబీ- డీసీ మ్యాచ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్ 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఎంఎస్ ధోని( రైజింగ్ పుణే సూపర్ జెయింట్, 2016) Courtesy: IPL Twitter ఎంఎస్ ధోని అంటే మొదటగా గుర్తుకు వచ్చే పదం మ్యాచ్ ఫినిషర్. అయితే ఎంఎస్ ధోని ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్పై ఆఖరిబంతికి సిక్స్ కొట్టి గెలిపించాడు. కానీ 2016లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తరపున పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆఖరి బంతికి ధోని సిక్స్ కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఆ మ్యాచ్‌లో 173 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన రైజింగ్ పుణే జట్టు 19 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. క్రీజులో ధోనితో పాటు అశ్విన్ ఉన్నాడు. అక్షర్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో ధోని స్ట్రైక్ తీసుకున్నాడు. తొలి బంతికి పరుగు రాలేదు. ఐదు బంతుల్లో 23 పరుగులు. అక్షర్ వైడ్ వేశాడు. అయితే ఆ తర్వాత అక్షర్ వేసిన నాలుగు బంతులను ధోని వరుసగా ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే పుణే విజయానికి ఆఖరి బంతికి సిక్స్ కావాలి. అక్షర్ పటేల్ ఫుల్ డెలివరీ వేశాడు. అంతే ధోని ఫ్రంట్‌ఫుట్ వచ్చి మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టడంతో రైజింగ్ పుణే జట్టులో సంబరాలు షురూ అయ్యాయి. డ్వేన్ బ్రావో(చెన్నై సూపర్‌కింగ్స్, 2012) Courtesy: IPL Twitter ఐపీఎల్ చరిత్రలో ఆఖరి బంతికి సిక్స్ కొట్టి జట్టును గెలిపించిన తొలి బ్యాటర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు. 2012లో లీగ్ దశలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 19 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. ధోనితో పాటు బ్రావో క్రీజులో ఉన్నాడు. రజత్ బాటియా వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతికి బ్రావో సింగిల్ తీశాడు. రెండో బంతికి ధోని బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత మూడు బంతుల్లో మూడు పరుగులు మాత్రమే చేయడంతో సీఎస్కేకు ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో బాటియా వేసిన ఫుల్‌టాస్ డెలివరీని లాంగాన్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ బాదడంతో సీఎస్కే డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు జరుపుకుంది. -
విజయానందంలో ఆ ఢిల్లీ ఆటగాడు ఏం చేశాడో చూడండి..!
Shimron Hetmyer Jumps On Dwayne Bravo Back After DC Win Over CSK: ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య సోమవారం జరిగిన ఉత్కంఠ పోరులో డీసీ జట్టును విజయం వరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం జరిగిన ఓ ఆసక్తికర సన్నివేశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. మ్యాచ్ గెలిపించానోచ్ అంటూ ఢిల్లీ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్.. ప్రత్యర్ధి ఆటగాడు డ్వేన్ బ్రావో భుజాలపైకి ఎక్కి తన సంతోషాన్ని పంచుకున్నాడు. బ్రావో సైతం హెట్మైర్ను భుజాలపై మోస్తూ కాసేపు సందడి చేశాడు. ప్రత్యర్ధి జట్టు ఆటగాడితో విజయానందాన్ని షేర్ చేసుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. Nail-biting finish! 👌 👌@DelhiCapitals hold their nerve & beat #CSK by 3⃣ wickets in a last-over thriller. 👍 👍 #VIVOIPL #DCvCSKScorecard 👉 https://t.co/zT4bLrDCcl pic.twitter.com/ZJ4mPDaIAh— IndianPremierLeague (@IPL) October 4, 2021 కాగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఐపీఎల్లో తమ 100వ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ చేసిన సీఎస్కే 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఢిల్లీ జట్టు సైతం తడబడినప్పటికీ .. ఆఖర్లో హెట్‌మైర్(18 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఢిల్లీ ఖాతాలో 20 పాయింట్లు చేరాయి. చదవండి: యాషెస్ సిరీస్ డౌటే.. మెలిక పెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు -
అరె.. బ్రావో ఇలా చేశాడే అని బ్యాటర్స్ ఆశ్చర్యపోతారు కదా: ధోని
MS Dhoni reveals fight with 'brother' Dwayne Bravo: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయంలో కీలక పాత్ర పోషించిన డ్వేన్ బ్రావోపై చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రణాళికలను మైదానంలో పక్కాగా అమలు చేసి సత్ఫలితాలు సాధించడం సంతోషంగా ఉందన్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో బాధ్యతగా వ్యవహరిస్తాడని బ్రావోను కొనియాడాడు. కాగా శుక్రవారం ఆర్సీబీతో షార్జాలో జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక ఆర్సీబీ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, మాక్స్వెల్, హర్షల్ పటేల్ వికెట్లు తన ఖాతాలో వేసుకున్న డ్వేన్ బ్రావో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘‘బ్రావో ఫిట్నెస్ బాగుంది. ఇది మంచి విషయం. తన ప్లాన్‌ను పక్కాగా అమలు చేయడం కలిసి వచ్చే అంశం. తనని నా సోదరుడిగా భావిస్తాను. బ్రదర్ అని పిలుస్తాను. తను స్లోగా బౌలింగ్ చేసినపుడు మా మధ్య గొడవలు జరుగుతాయి. తన టెక్నిక్(స్లో బాల్స్ వేస్తాడన్న ఉద్దేశంలో) గురించి అందరికీ తెలుసన్న విషయం బ్రావోకు అనేకసార్లు చెప్పాను. కాబట్టి ఒక ఓవర్లో ఆరు వైవిధ్యమైన బంతులు విసరాలని సూచించాను. ముఖ్యంగా యార్కర్లు వేస్తే బాగుంటుందని చెబుతాను. అప్పుడు.. ‘అరె.. నెమ్మదైన బంతులు వేసే బ్రావో ఇలా చేశాడా’ అని బ్యాటర్స్ ఆశ్చర్యపోతారు కదా. వాళ్లను కన్ఫ్యూజ్ చేయొచ్చు కూడా. ఈ విషయాలను పక్కన పెడితే... తనకు ప్రపంచంలోని వివిధ మైదానాల్లో ఆడిన అనుభవం ఉంది. అది మాకు ఎంతగానో ఉపకరిస్తుంది. బాధ్యతగా వ్యహరించాల్సిన సమయంలో తను ఎల్లప్పుడూ ముందుంటాడు’’ అని కితాబిచ్చాడు. కాగా కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా గాయపడిన డ్వేన్ బ్రావో కోలుకుని.. ఐపీఎల్ రెండో అంచెకు అందుబాటులోకి వచ్చాడు. ఫేజ్ 2 తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబైతో జరిగిన పోరులో 3 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో... 8 బంతుల్లో 23 పరుగులు చేసి సత్తా చాటాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్లో టిమ్ డేవిడ్ సరికొత్త రికార్డు.. High on XP-erience! DJ decodes the Super Fam's action on the field! #RCBvCSK #WhistlePodu #Yellove 🦁💛 @DJBravo47 pic.twitter.com/1FAqNRIztd — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) September 25, 2021 -
టీ20ల చరిత్రలో అరుదైన ఘనత.. ఆ జాబితాలో ఇద్దరూ విండీస్ యోధులే
సెయింట్ కిట్స్: పొట్టి క్రికెట్లో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 500 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్-2021)లో ఫైనల్ మ్యాచ్ ఆడడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. మొత్తంగా 500 టీ20లు ఆడిన బ్రావో.. 6,566 పరుగులు సాధించడంతో పాటు 540 వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ జాబితాలో విండీస్‌కే చెందిన మరో ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. పొలార్డ్ 561 మ్యాచ్‌ల్లో 11,159 పరుగులు చేయడంతో పాటు 298 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే, సీపీఎల్‌లో బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బ్రావో సారథ్యంలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సెయింట్ లూసియా కింగ్స్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. రకీమ్ కార్న్‌వాల్(32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్(40 బంతుల్లో 43; ఫోర్లు, 2 సిక్సర్లు), కీమో పాల్(21 బంతుల్లో 39; 5 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఛేదనలో సెయింట్ కిట్స్ ఆటగాడు డొమినిక్ బ్రేక్స్(24 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. చదవండి: 'ఆ ఒక్కటి' మినహా.. ధోనితో పోలిస్తే కోహ్లినే బెటర్..! -
వైరల్: వికెట్ తీసిన ఆనందం.. విండీస్ క్రికెటర్ డ్యాన్స్
ముంబై: విండీస్ ఆటగాళ్లంటే ఎంటర్టైన్మెంట్కు మారుపేరు.. ఐపీఎల్ ఆరంభం అయినప్పటి నుంచి ప్రతీ సీజన్‌కు రెగ్యులర్‌గా అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా డ్వేన్ బ్రావో, క్రిస్ గేల్ లాంటి ఆటగాళ్లు ఆటతో పాటు ఎంటర్టైన్ అందించడంలో ముందు వరుసలో ఉంటారు. తాజాగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టాడు. మురుగన్ అశ్విన్ వికెట్ తీసిన ఆనందంలో విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోని వాతీ కమింగ్ పాటకు విజయ్ తరహాలో డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. కాగా బ్రావో స్టెప్పులు వేసే సమయంలో పక్కనే ఉన్న అంబటి రాయుడు పడిపడి నవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలోని ఇంట్రో సాంగ్ ‘వాతీ కమింగ్' దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ఆ సాంగ్‌లోని లిరిక్స్, డ్యాన్స్ స్టెప్పులను చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పటికి అనుకరిస్తూనే ఉన్నారు. కాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే సునాయస విజయాన్ని అందుకుంది. దీపక్ చహర్ నాలుగు వికెట్లతో టాప్ ఆర్డర్ నడ్డి విరవడంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటింగ్‌లో షారుఖ్ ఖాన్ 47 పరుగులు మినహా మిగతావారెవరు రాణించలేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 4 వికెట్లు కోల్పోయి 15.4 ఓవరల్లో చేధించింది. సీఎస్కే బ్యాటింగ్‌లో మొయిన్ అలీ 46, డుప్లిసిస్ 36* పరుగులతో రాణించారు. కాగా సీఎస్కే తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 19న ముంబై వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. చదవండి: చిన్న పిల్లాడిలా కోహ్లి.. ఏబీ, చహల్ మాత్రం సూపర్ జడ్డూ.. ఇటు రనౌట్.. అటు స్టన్నింగ్ క్యాచ్ Vaathi coming step 💥......😍champion Bravo😍#MSDhoni pic.twitter.com/36PvYxvJzW — RAM (@itz_me_ram143) April 16, 2021 -
పొలార్డ్ బ్యాగ్‌లు సర్దుకోమన్నాడు: బ్రేవో
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్ నుంచి సీఎస్కే ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో వైదొలిగిన సంగతి తెలిసిందే. గాయం కారణంగా టోర్నీ మధ్య నుంచి బ్రేవో తప్పుకున్నాడు. ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు గాయం కారణంగా దూరమైన బ్రేవో.. ఈ టోర్నీలో పూర్తిగా ఆస్వాదించుకుండానే తప్పుకున్నాడు. సీఎస్కేది కూడా దాదాపు నిష్ర్కమించే పరిస్థితి. ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే ఏడింట ఓటమి చూసింది. ఇంకా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉండటంతో సీఎస్కే వాటిలో విజయం సాధించినా ప్లేఆఫ్స్‌కు చేరడం అసాధ్యం. (ఆరుసార్లు ఆర్చర్‌కే దొరికేశాడు..!) ముంబై ఇండియన్స్‌తో ఈరోజు సీఎస్కే రెండో అంచె మ్యాచ్ జరుగనుంది. తొలి అంచె మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించగా, రెండో అంచె మ్యాచ్‌లో ముంబై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని విషయాలను స్టార్ స్పోర్ట్స్ చాట్ షోలో బ్రేవో పంచుకున్నాడు. దాదాపు ఏడేళ్ల నాటి ఘటనను బ్రేవో గుర్తు చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఫైనల్ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకోగా, సీఎస్కే రన్నరప్‌గా సరిపెట్టుకుంది. అయితే ఆ మ్యాచ్‌కు ముందు తనను ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కీరోన్ పొలార్డ్ తనను టీజ్ చేశాడని బ్రేవో చెప్పుకొచ్చాడు. ‘పొలార్డ్ అప్పుడు ఒక వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఇక మీ బ్యాగ్‌లు సర్దుకోండి అని టెక్స్ట్ మెసేజ్ చేశాడు. మీరు ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి’ అని అన్నాడు. దానికి ఓకే అని రిప్లే ఇవ్వడమే కాకుండా ప్రొబ్లమ్ ఏమీ లేదని తిరిగి మెసేజ్ చేశానన్నాడు. ప్లేఆఫ్‌లో ముంబైపై గెలిచి సీఎస్కే ఫైనల్‌కు క్వాలిఫై అయిన విషయాన్ని ప్రస్తావించిన బ్రేవో.. ఎవరు ఇంటికి వెళతారో చూద్దాం అని పొలార్డ్‌కు రిప్లే ఇచ్చానన్నాడు. 2013 ఫైనల్ అనేది నిజంగా ఒక గొప్ప మ్యాచ్ అని బ్రేవో తెలిపాడు. అప్పటివరకూ ముంబైని తాము ఓడిస్తూ వస్తే, అప్పుడు వారు తమపై గెలిచి సంతృప్తి చెందారన్నాడు. అప్పట్నుంచి ఇరుజట్ల మధ్య ఎప్పుడు పోరు జరిగినా ఆసక్తికరంగానే ఉంటుందన్నాడు. -
'బ్రావోతో నేనేందుకు అలా ప్రవర్తిస్తాను'
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో మంగళవారం సన్‌రైజర్స్, సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సీఎస్కే 20 పరుగులతో ఎస్ఆర్హెచ్పై విజయం సాధించింది. ఈ సంగతి కాసేపు పక్కన పెడితే మ్యాచ్ మధ్యలో ఖలీల్ అహ్మద్, బ్రావో మధ్య చోటుచేసుకున్న సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అసలు విషయంలోకి వస్తే.. చెన్నై ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావోను ఖలీల్ అహ్మద్ డకౌట్ చేశాడు. లెగ్‌స్టంప్ మీదుగా వెళ్లిన బంతిని బ్రావో అంచనా వేయడంలో పొరబడడంతో నేరుగా వికెట్లను గిరాటేసింది. అయితే ఖలీల్ ఎలాంటి సెలబ్రేషన్స్ చేయకుండా సైలంట్‌గానే ఉన్నాడు కానీ బ్రావోను చూస్తూ చిన్న వెకిలి నవ్వు నవ్వాడు. ఇప్పుడు ఆ వెకిలి నవ్వే ఖలీల్‌ను సోషల్ మీడియాలో విలన్‌ను చేసింది. ఇదే ఖలీల్ అహ్మద్ రాజస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా రాహుల్ తెవాటియాతోనూ గొడవ పడిన సంగతి తెలిసిందే. (చదవండి :ఏం చేసినా జట్టు కోసమే : తాహిర్) 'ఒక సీనియర్ అంతర్జాతీయ క్రికెటర్ అయిన బ్రావోకు నువ్వు ఇచ్చే గౌరవం ఇదేనా ' అంటూ మండిపడ్డారు. దీనితో పాటు ఖలీల్‌పై నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోయారు.' ఖలీల్ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. ప్రతీ క్రికెటర్ ఎంతో కొంత స్పోర్టివ్ ప్రదర్శిస్తాడు. కానీ ఖలీల్‌కు కనీసం అది కూడా లేదు.. తెవాటియాతోనూ ఇలాంటిదే చేశావు.. షేమ్ ఆన్ యూ.. ఖలీల్‌కు అసలు క్రీడా స్పూర్తి అనేదే లేదు.. అంటూ మండిపడ్డారు. అయితే దీనిపై ఖలీల్ అహ్మద్ స్పందించాడు. నేను బ్రావోను చూసి నవ్వలేదు. 'నా నవ్వు వెనుక అసలు కారణం అది కాదు. అయినా బ్రావో లాంటి ఆటగాడిపై నేను అలా ప్రవర్తిస్తానా చెప్పండి. అయినా నేను బ్రావోను అన్నలాగా భావిస్తాను. దయచేసి దీనిని పెద్ద ఇష్యూ చేయకండి.' అంటూ ట్విటర్లో పేర్కొన్నాడు. -
అలుపెరగని ఆల్‌రౌండర్
ఐపీఎల్ టీమ్‌లంటే ఠక్కున గుర్తొచ్చే పేరు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). ఈ జట్టు అనగానే మదిలో మెదిలే తొలి పేరు ధోని. మరి ధోని, రైనాలతోపాటు మరో స్టార్ కూడా సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతనే వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో. చెన్నై మూడుసార్లు ఐపీఎల్ చాంపియన్‌షిప్ సాధించడంలో ధోని సారథ్యం ఎంత ఉందో... బ్రావో సత్తా కూడా అంతే ఉంది. పొట్టి క్రికెట్లో గట్టి ఆల్‌రౌండర్ ఈ కరీబియన్ సూపర్‌స్టార్. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టోర్నీలో భాగంగా బుధవారం సెయింట్ లూసియా జూక్స్తో జరిగిన మ్యాచ్‌లో బ్రావో 500 వికెట్ల మైలురాయి దాటి టి20 క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. –సాక్షి క్రీడా విభాగం ట్రినిడాడ్‌లోని కరీబియన్ దిగ్గజం బ్రియాన్ లారా అడుగు జాడల నుంచే బ్రావో వచ్చాడు. కానీ లారా మాదిరిగా క్లాస్ బ్యాటింగ్ లేదు. తన ట్రేడ్‌మార్క్ షాట్ కవర్‌డ్రైవ్‌ను ఏమంత బాగా ఆడలేడు. చెప్పాలంటే పర్ఫెక్ట్ షాట్లేవీ తనకంటూ లేకపోయినా బ్రావో మాత్రం బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. మ్యాచ్‌లను బ్యాట్‌తో ముగించగలడు. బంతి (పేస్ బౌలింగ్)తో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కూల్చేయగలడు. ఇక టి20 లీగ్లకైతే స్పెషలిస్ట్‌గా మారాడు... కాదు కాదు ఎదిగాడు. ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడు. అందుకే ఎవరికీ సాధ్యంకాని 500 వికెట్లను తన పేస్ బౌలింగ్‌తో సుసాధ్యం చేసుకున్నాడు. బ్యాట్‌తోనూ బ్రావో మెరిపించగలడు. ఓవరాల్‌గా 459 టి20 మ్యాచ్‌లు ఆడిన బ్రావో ఇప్పటివరకు 501 వికెట్లు తీయడంతోపాటు 6,313 పరుగులు చేసి, 225 క్యాచ్‌లు కూడా పట్టాడు. (చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ ) పొట్టి ఫార్మాట్ మేటి బౌలర్... సంప్రదాయ క్రికెట్‌ను వన్డే ఆట మించితే... ఈ 50 ఓవర్లను దంచేసే ఆట 20–20. ఇందులో బాదడాని కే బాట ఉంటుంది. బ్యాట్స్ మెన్దే ఆట. బ్యాటింగ్ మెరుపులతోనే టి20 వెలుగు వెలుగుతోంది. ఇలాంటి ఫార్మాట్లో ప్రత్యేకించి బౌలరే బలిపశువయ్యే పోటీల్లో 500 వికెట్లు తీయడం ఆషామాషీ కానే కాదు. ఎందుకంటే టెస్టులో వేసినట్లు అపరిమిత ఓవర్లు వేయలేం. వన్డేల్లా 10 ఓవర్ల కోటా ఉండదు. ఏమున్నా... ఆ నాలుగు ఓవర్లతోనే సాధించాలి. లేదంటే బ్యాట్స్‌మన్ బాదుడుకు మోకరిల్లాలి! బ్యాటింగ్ విశ్వరూపం కనిపించే టి20ల్లో బ్రావోది కచ్చితంగా అనితర సాధ్యమైన ప్రదర్శనే! ఇది అతని శైలి... క్రీజులో పాతుకుపోయిన ఉద్ధండుల్ని, డివిలియర్స్ లాంటి ‘360 డిగ్రీ బ్యాట్స్‌మన్’ను తన వైవిధ్యమైన బంతులతో బోల్తా కొట్టించే ప్రత్యేకత బ్రావోది. భారత్‌లో జరిగిన 2016 టి20 ప్రపంచకప్‌లో సఫారీ స్టార్ డివిలియర్స్‌ను అంతుచిక్కని బంతితో ఆట ముగించాడు. లంక బౌలర్ మలింగ వేగం, తనకు మాత్రమే సాధ్యమయ్యే ‘స్లోయర్ ఆఫ్ కట్టర్’, ‘స్లోయర్ బౌన్సర్’లు బ్రావో అస్త్రాలు. అందుకేనేమో బ్యాట్స్‌మెన్ దంచేసి ఆటలో మించిపోయిన బౌలర్ బ్రావో ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు. విండీస్ సూపర్ స్టార్ లారా కెప్టెన్సీలో 16 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయమైన బ్రావో అలుపెరగని బాటసారిగా ఆడుతూనే ఉన్నాడు. పొట్టి ఫార్మాట్లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కిన బ్రావోకు దరిదాపుల్లో ఏ ఒక్కరూ లేదు. ఈ వరుసలో రెండో స్థానంలో ఉన్న లంక బౌలర్ మలింగ (390) కనీసం 400 మార్క్‌ను దాటలేదు. లీగ్ ఏదైనా టాపర్ ఒకడే! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), చాంపియన్స్ లీగ్, కరీబియన్, బంగ్లాదేశ్, బిగ్‌బాష్ ఇలా లీగ్ ఏదైనా బ్రావో ఆడితే అతనే బౌలింగ్ టాపర్. 2009లో ట్రినిడాడ్ తరఫున చాంపియన్స్ లీగ్ ఆడిన బ్రావో 12 వికెట్లతో టాప్ లేపాడు. ఐపీఎల్లో అయితే రెండుసార్లు (2013, 15) సీఎస్కే తురుఫుముక్కగా రాణించాడు. ఆ రెండు సీజన్లలో అతను 32, 26 వికెట్లు పడేశాడు. సొంతగడ్డపై జరిగే కరీబియన్ లీగ్‌ల్లో 2015, 2016లలో వరుసగా 28, 21 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (2016)లో 21 వికెట్లు, బిగ్‌బాష్ (2017) లీగ్‌లో 18 వికెట్లు తీసి టాప్ బౌలర్‌గా నిలిచాడు. (చదవండి:ఊహించని ట్విస్ట్.. పాపం కెవిన్ ఒబ్రెయిన్) -
బ్రావో... 500 వికెట్లు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : క్రికెట్లో 24 గంటల వ్యవధిలో రెండు అరుదైన ఘనతలు నమోదయ్యాయి. మంగళవారం సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ 600 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందగా.... బుధవారం పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో టి20 క్రికెట్లో 500 వికెట్లు పూర్తి చేసుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) టి20 టోర్నమెంట్లో భాగంగా బుధవారం సెయింట్ లూసియా జూక్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న డ్వేన్ బ్రావో ఈ ఘనత అందుకున్నాడు. రఖీమ్ కార్న్‌వాల్‌ను అవుట్ చేయడం ద్వారా బ్రావో టి20 క్రికెట్ చరిత్రలో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అనంతరం రోస్టన్ చేజ్‌ను కూడా అవుట్ చేసి బ్రావో తన వికెట్ల సంఖ్యను 501కు పెంచుకున్నాడు. సెయింట్ లూసియా జూక్స్ జట్టు 17.1 ఓవర్లలో 6 వికెట్లకు 111 పరుగుల వద్ద ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టాక ట్రిన్‌బాగో జట్టు లక్ష్యాన్ని 9 ఓవర్లలో 72 పరుగులుగా నిర్ణయించారు. ట్రిన్‌బాగో 8 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో నెగ్గి ఈ లీగ్‌లో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. 2006లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20 క్రికెట్లో అరంగేట్రం చేసిన బ్రావో గత 14 ఏళ్లలో అంతర్జాతీయ, ప్రొఫెషనల్ లీగ్స్‌తో కలిపి 459 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 501 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగ 390 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న పలు టి20 లీగ్స్‌లో ప్రముఖ జట్లకు ఆడిన బ్రావో... చాంపియన్స్ లీగ్ (2009–10; ట్రినిడాడ్ అండ్ టొబాగో 12 వికెట్లు), ఐపీఎల్ (చెన్నై సూపర్ కింగ్స్–2013లో 32 వికెట్లు; 2015లో 26 వికెట్లు), కరీబియన్ ప్రీమియర్ లీగ్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో–2015లో 28 వికెట్లు; ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్–2016లో 21 వికెట్లు), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఢాకా డైనమైట్స్–2016–2017; 21 వికెట్లు), బిగ్‌బాష్ లీగ్ (మెల్బోర్న్ రెనెగెడ్స్–2017–2018; 18 వికెట్లు)లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. -
జరిగిందేదో జరిగిపోయింది!
కింగ్స్టన్: నల్ల జాతీయుల పట్ల ఇప్పటి వరకు జరిగింది చాలని, ఇక నుంచైనా వారిని అందరితో సమానంగా గౌరవించాలని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. ఎన్నో ఏళ్లుగా వివక్షకు గురవుతోన్న నల్ల జాతీయులు ప్రతీకారం కోసం చూడట్లేదని, సమానత్వాన్ని కోరుకుంటున్నారని బ్రేవో పేర్కొన్నాడు. ‘వర్ణ వివక్ష విచారకరం. ఎన్నో ఏళ్లుగా జరుగుతోన్న అఘాయిత్యాల గురించి నల్ల జాతీయునిగా నాకు బాగా తెలుసు. కానీ వాటికి ప్రతీకారం కోరుకోవట్లేదు. మాకు కావల్సిందల్లా సమానత్వం, గౌరవం అంతే’ అని జింబాబ్వే మాజీ క్రికెటర్ పోమీ ఎంబాగ్వాతో ఇన్స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా బ్రేవో వ్యాఖ్యానించాడు. విండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 71 టి20లు ఆడిన 36 ఏళ్ల బ్రేవో... నల్ల జాతీయులు కూడా మిగతా వారిలాగే శక్తివంతమైన, అందమైన వారని ప్రపంచం గుర్తించాలని కోరాడు. ‘సోదర సోదరీమణులను నేను కోరేదొక్కటే. నెల్సన్ మండేలా, మొహమ్మద్ అలీ, మైకేల్ జోర్డాన్ లాంటి గొప్ప వ్యక్తులు మాలోని వారే. మేం కూడా శక్తివంతులమనే విషయాన్ని ప్రపంచం గుర్తించాలి’ అని పేర్కొన్నాడు. -
పొలార్డ్‌లో నిజాయితీ ఉంది: బ్రేవో
ఆంటిగ్వా: ప్రస్తుతం తమ క్రికెట్ జట్టులో బ్యాటింగ్ లోతు అసాధారణమని వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో పేర్కొన్నాడు. కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల తమ బ్యాటింగ్‌లో పూర్తి స్థాయి సామర్థ్యం బయటకు రావడం లేదని తెలిపిన బ్రేవో.. ఓవరాల్‌గా చూస్తే తమకున్న బ్యాటింగ్ వనరులు అమోఘమన్నాడు. 2016 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టు కంటే కూడా ప్రస్తుతం ఉన్న జట్టే సూపర్ అని బ్రేవో తెలిపాడు. తమ బ్యాటింగ్ లైనప్‌ను చూస్తే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుందన్నాడు. పదో నంబర్ వరకూ కూడా తమ జట్టులో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉన్నారన్నాడు. కాగా, గత శ్రీలంక సిరీస్‌లో తమ బ్యాటింగ్ లైనప్‌లో సామర్థ్యాన్ని కోచ్ ఫిల్ సిమ్మన్స్ మరింత వెలికి తీశాడన్నాడు. తన పేరును 9వ స్థానంలో పెట్టడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. తాను ఎప్పుడూ టీ20 క్రికెట్లో 9వ స్థానంలో బ్యాటింగ్ చేస్తానని అనుకోలేదనే, ఇందుకు కారణం తమ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండటమేనన్నాడు. ఇదే విషయాన్ని తమ కుర్రాళ్లకు సైతం చెప్పానన్నాడు.(‘ఆసీస్‌తో టీమిండియాను పోల్చలేం’) ‘ మా బ్యాటింగ్ లైనప్ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇందులో ఎటువంటి జోక్ లేదు. మ్యాచ్ ముగిసే రోజు పదో స్థానం వరకూ బ్యాటింగ్ చేసే సామర్థ్యం ప్రస్తుత వెస్టిండీస్ జట్టు సొంతం. ఒక ఆధిపత్యం చెలాయించే జట్టు మాది. ప్రత్యేకంగా టీ20ల్లో మాకు తిరుగులేదు. ఇక నుంచి జట్టు బౌలింగ్ విభాగంలో కూడా కీలక పాత్ర పోషించాలనుకుంటున్నా. ప్రధానంగా డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఆకట్టుకోవాలనుకుంటున్నా. గతంలో తాను ఏ రకంగా అయితే బౌలింగ్ చేసేవాడినో దాన్ని అందిపుచ్చుకోవాలి’ అని బ్రేవో తెలిపాడు. ఇక తమ పరిమిత ఓవర్ల కెప్టెన్ పొలార్డ్‌లో నిజాయితీని చూశానన్నాడు. ‘పొలార్డ్ ఎప్పుడూ గెలవడాన్ని ఆస్వాదిస్తాడు. కెప్టెన్‌గా అది చాలా ముఖ్యం. విజయం సాధించడానికి మిక్కిలి శ్రమిస్తాడు. విజయం సాధించడం కోసం అనే రకాలు మార్గాలను పొలార్డ్ ఎంచుకుంటాడు. ఎప్పుడైతే పొలార్డ్‌కు సారథ్య బాధ్యతలు అప్పచెప్పారో, ఇది నీకు ఒక చాలెంజ్ అని చెప్పా. అత్యంత కష్టంతో కూడుకున్న పెద్ద బాధ్యత నీపై ఉందని చెప్పా. జట్టును మరింత ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి, సరైన దిశలో నడిపించడానికి పొలార్డ్ సరైన సమయంలో బాధ్యతలు తీసుకున్నాడనే అనుకుంటున్నా. పొలార్డ్ చాలా నిజాయితీ పరుడు. సెలక్షన్ విషయంలో అతని మార్కు కచ్చితంగా ఉంటుంది. గతంలోని కెప్టెన్లు వలే సెలక్టర్లు చెప్పిన దానికి తల ఊపడు. అతనికి నచ్చిన విధంగానే జట్టు ఉంటుంది’ అని బ్రేవో పేర్కొన్నాడు. గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన బ్రేవో.. జనవరిలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు.(‘ధోనికి చాలా సిగ్గు.. ఆ తర్వాతే మారాడు’) -
అంబటి రాయుడు ఒక ముక్కోపి..!
ఆంటిగ్వా: టీమిండియా క్రికెటర్, హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడిపై డ్వేన్ బ్రేవో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అంబటి రాయుడు అనే వ్యక్తి ఒక ముక్కోపి అని బ్రేవో వ్యాఖ్యానించాడు. గత కొన్ని సీజన్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అంబటి రాయుడు-బ్రేవోలు కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాయుడు గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు బ్రేవో. సీఎస్కే ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో రాయుడితో ఆడిన సందర్భాల్లో తాను ఎలా ఉండేవాడినో బ్రేవో చెప్పుకొచ్చాడు. రాయుడితో ఐపీఎల్ మ్యాచ్‌లు కలిసి ఆడినప్పుడు చాలా విషయాల్లో తప్పుగా అర్ధం చేసుకున్నానని వ్యాఖ్యానించాడు. (‘ధోని వ్యూహాలకు తగ్గ కెప్టెన్లను తీసుకున్నాడు’) ‘అంబటి రాయుడు నా ఫేవరెట్ ప్లేయర్లలో ఒకడు. మేమిద్దరం ముంబై ఇండియన్స్‌కు ఆడాం. కానీ ఇద్దరం కలిసి ఆడిన సందర్భాలు చాలా తక్కువ. నా తరహాలోనే అతను ప్లేయర్. అతనొక ముక్కోపి. అతను కరెక్ట్ కాదని అనుకుడేవాడిని. ఆ విషయాల్ని తప్పని రాయుడు నిరూపించాడు. ‘‘నువ్వొక చెత్త.. మంచి వాడివి కాదు.. చెన్నై నిన్ను ఎందుకు కొనుగోలు చేసిందో’’ అనే వ్యాఖ్యలతో రాయుడ్ని ఏడిపించడం ఇష్టం. నేనే సీఎస్కేకు ఆడిన తొలి సీజన్లో ఎప్పుడూ నా పక్కనే కూర్చొని ఉండేవాడు. నాకు అతను నచ్చక నేను కూడా నెగిటివ్ విషయాల్నే మాట్లాడేవాడిని. రాయుడితో అంత సఖ్యత ఉండేది కాదు. అవి తప్పని రాయుడు నిరూపించాడు. అతనొక ప్రత్యేకమైన వ్యక్తి. మీరు ఏ వ్యక్తి గురించైనా తెలుసుకోవాలంటే ముందు అతనితో సఖ్యత ద్వారానే తెలుసుకుంటాం. ఒకవేళ తెలియకపోతే సదరు వ్యక్తి గురించి చెడు అభిప్రాయం వస్తుంది. రాయుడు నిజమైన క్రికెటర్. క్రికెట్‌ను బాగా ఆస్వాదిస్తాడు’ అని బ్రేవో తెలిపాడు. -
మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి..
గ్రెనడా: ఇటీవల తన రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌కు బ్రేవోను ఎంపిక చేస్తూ విండీస్ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. 2016లో విండీస్ తరఫున చివరి మ్యాచ్ ఆడిన బ్రేవో.. ఆపై బోర్డుతో విభేదించి వీడ్కోలు చెప్పాడు. కాగా, కొంతకాలం క్రితం నూతన బోర్డు ఏర్పాటు కావడంతో తన వీడ్కోలు నిర్ణయాన్ని బ్రేవో ఉపసంహరించుకున్నాడు. ఈ క్రమంలోనే తన పునరాగమనంపై ఆశలు పెట్టుకున్న బ్రేవోకు ఊహించినట్లుగానే చోటు కల్పించింది విండీస్ మేనేజ్మెంట్. 2016 సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ బ్రేవోకు అంతర్జాతీయ స్థాయిలో చివరిది. కాగా, మూడేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ కోసం సిద్ధమయ్యాడు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌కు టెస్టు కెప్టెన్ జాసన్ హోల్డర్‌కు విశ్రాంతి కల్పించారు. ఇక ఫాబియన్ అలెన్ గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోవడంతో అతను అందుబాటులోకి రాలేదు. దాంతోనే బ్రేవో ఎంపికకు మార్గం సుగమం అయ్యింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను విండీస్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. -
బ్రేవో వచ్చేస్తున్నాడు
న్యూఢిల్లీ: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో మళ్లీ అంతర్జాతీయ టి20 క్రికెట్లోకి వచ్చేస్తున్నాడు. నిరుడు అక్టోబర్‌లో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్‌తో గొడవల కారణంగా... అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రేవో తిరిగి తన దేశానికి ఆడాలని ఉందంటూ మనసులోని మాటను బయట పెట్టాడు. దీనికి కారణం వివాదాస్పద అధ్యక్షుడిగా ముద్ర వేయించుకున్న డేవ్ కామెరూన్ స్థానంలో మాజీ విండీస్ జట్టు మేనేజర్ రికీ స్కెరిట్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టడమే అని అతడు పేర్కొన్నాడు. అయితే తన పునరాగమనం టి20లకి మాత్రమే పరిమితమని బ్రేవో తెలిపాడు. ప్రస్తుతం ఉన్న జట్టులో ప్రతిభకు కొదవలేదని, కొత్త కోచ్ ఫిల్ సిమన్స్, పొలార్డ్ సారథ్యంలోని జట్టు అద్భుతంగా ఆడుతుందంటూ కితాబిచ్చాడు. బ్రేవో విండీస్ తరఫున చివరి టి20ని మూడేళ్ల క్రితం సెపె్టంబర్లో ఆడాడు. బ్రేవో విండీస్ తరఫున మొత్తం 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టి20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 6310 పరుగులు చేసిన అతను 337 వికెట్లు కూడా తీశాడు. -
ఏడాది తర్వాత బ్రేవో యూటర్న్
ఆంటిగ్వా: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి ఏడాదికి పైగా దాటిన తర్వాత వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రేవో యూటర్న్ తీసుకున్నాడు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించాడు. ప్రత్యేకంగా టీ20 సెలక్షన్స్‌కు తాను కూడా అందుబాటులో ఉంటానంటూ వెల్లడించాడు. ‘ నాకు అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేయాలని ఉంది. ఈ విషయాన్ని నా అభిమానులకు నా మంచి కోరుకునే వారికి తెలియజేస్తున్నా. నా రిటైర్మెంట్పై యూటర్న్ తీసుకోవడానికి కారణం ఒక్కటే. మా క్రికెట్ బోర్డు పరిపాలనలో ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతోనే నా రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నా. ఇందులో సీక్రెట్ ఏమీ లేదు. బోర్డు పెద్దల వ్యవహారం సరిగా లేని కారణంగానే నేను అప్పుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ఇప్పుడు పాలన మారడంతో నా మనసు కూడా మార్చుకున్నా’ అని బ్రేవో తెలిపాడు. గతేడాది బ్రేవో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2012, 2016ల్లో విండీస్ గెలిచిన టీ20 వరల్డ్‌కప్‌లో బ్రేవో సభ్యుడు. 2016 సెప్టెంబర్‌లో విండీస్ జెర్సీలో బ్రేవో చివరిసారి కనిపించాడు. విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలపై తిరుగుబాటు చేస్తూ వచ్చిన బ్రేవో తన రిటైర్మెంట్ను 2018 అక్టోబర్‌లో ప్రకటించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న బ్రేవో.. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనప్పటికీ విదేశీ లీగ్‌లో బ్రేవో అలరిస్తూనే ఉన్నాడు. కాగా, ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా విండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో బ్రేవోను చేర్చారు. కాకపోతే బ్రేవోకు ఆడే అవకాశం రాలేదు. ప్రస్తుత నిర్ణయంతో విండీస్ తరఫున ఆడే అవకాశాన్ని సెలక్టర్లు ఇస్తారో లేదో చూడాలి. -
చాలామంది కెరీర్‌ను నాశనం చేశాడు: బ్రేవో
ఆంటిగ్వా: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కామెరూన్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రేవో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిపోవడానికి, అలాగే చాలామంది క్రికెట్ నుంచి వైదొలగడానికి కారణం కామెరూన్ ప్రతీకార చర్యలే కారణమంటూ విమర్శించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన బ్రేవో.. కొన్ని నెలల క్రితం బోర్డుకు వచ్చిన కొత్త అధ్యక్షుడు రికీ స్కిరిట్‌తోనైనా తమ క్రికెట్ మారుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే డేవ్ కామెరూన్ పదవీ కాల ముగిసిపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు బ్రేవో. కామెరూన్ పదవీ కాలం ముగియడంతో తమ క్రికెట్ బోర్డుక మంచి రోజులు వచ్చాయన్నాడు. సుదీర్ఘకాలం పని చేసిన కామెరూన్ నియంత పోకడలతో క్రికెట్ బోర్డును నాశనం చేశాడన్నాడు. అతని వైఖరి వల్ల పలువురు క్రికెటర్లు క్రికెట్‌కు గుడ్ బై చెప్పారన్నాడు. 2017లో వెస్టిండీస్ తరఫున బ్రేవో చివరి మ్యాచ్ ఆడాడు. కాగా, గతేడాది విండీస్ బోర్డు నిర్ణయాలతో విసుగు చెంది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అయితే ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్ రిజర్వ్ ఆటగాళ్లలో బ్రేవోకు స్థానం కల్పించడం గమనార్హం. టెస్టుల్లో 2,200 పరగులతో పాటు 86 వికెట్లు సాధించిన బ్రేవో.. వన్డేల్లో 2,968 పరుగులు సాధించడంతో పాటు 199 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 1,142 పరుగులు చేయగా 52 వికెట్లను సాధించాడు. 2014లో భారత పర్యటనలో భాగంగా విండీస్ కెప్టెన్‌గా బ్రేవో వ్యవహరించిన సమయంలోనే బోర్డుపై తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. జీతభత్యాల విషయంలో బోర్డు అలసత్వం ప్రదర్శించడంతో ఉన్నపళంగా పర్యటనను రద్దు చేసుకుని విండీస్‌కు వెళ్లిపోయాడు. దాంతో ఆ పర్యటనలో భారత్-విండీస్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో వన్డే రద్దయ్యింది. అంతకుముందు భారత్‌తో ఆ సిరీస్‌లో ఆడిన నాల్గో వన్డేనే బ్రేవోకు విండీస్ తరఫున చివరి వన్డే. -
ధోని బ్యాక్ హ్యాండ్ స్మాష్‌కు బ్రేవో షాక్!
చెన్నై: దీపావళి పండుగను పురస్కరించుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తనలోని టేబుల్ టెన్నిస్ స్కిల్‌ను బయటపెట్టాడు. స్వతహాగా క్రికెటర్ అయినప్పటికీ పలు క్రీడలు ఆడటం ధోనికి అలవాడు. క్రికెటర్‌గా మారడానికి ముందు ఎంఎస్ ధోని తన కెరీర్‌ను ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఫుట్‌బాల్, గోల్ఫ్, టేబుల్ టెన్నిస్‌లను ధోని సరదాగా ఆడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సీఎస్కే సహచర ఆటగాడైన బ్రేవోతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడాడు. కాగా, ధోని ఆడిన బ్యాక్‌హ్యాండ్ స్మాష్‌కు డ్వేన్ బ్రావో సైతం షాకయ్యాడు. దీంతో డ్వే బ్రావో నేను ర్యాలీ ఆడుతున్నా అని చెప్పగా ధోని తనదైన స్టైల్లో తాను ర్యాలీలు ఆడను అని చెప్పాడు. ఏదేమైనా ధోని, బ్రేవో సుదీర్ఘ ర్యాలీ ఆడినప్పటికీ ధోనినే పాయింట్ గెలిచాడు.2019, మార్చిలో రూపొందించిన ఈ వీడియోను సీఎస్కే తన ప్రమోషన్లో భాగంగా తాజాగా విడుదల చేసింది. Back in March 2019, when #Thala @msdhoni, #Champion @DJBravo47 and #Sir @imjadeja were all utterly dapperly attired for a Deepavali collection shoot, they decided to conquer other sports! Catch it fully here https://t.co/cDWiiCu3Vg! 🦁💛 #WhistlePodu #HappyDeepavali pic.twitter.com/4LHJEEqEDF — Chennai Super Kings (@ChennaiIPL) October 27, 2019 -
మళ్లీ విండీస్‌కు ఆడాలనుకుంటున్నా బ్రో!
ఆంటిగ్వా: తనకు మళ్లీ వెస్టిండీస్ జట్టుకు ఆడాలని ఉందంటూ ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డ్వేన్ బ్రేవో స్పష్టం చేశాడు. విండీస్ వన్డే, టీ20 జట్లకు కీరన్ పొలార్డ్‌ను కెప్టెన్‌గా నియమించిన నేపథ్యంలో బ్రేవో స్పందిస్తూ.. ‘ నా ఫ్రెండ్ పొలార్డ్‌కు కంగ్రాట్స్. నీలో విండీస్ కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. విండీస్ జట్టును ముందుండి నడిపించి ఒక అత్తుత్తమ నాయకుడిగా ఎదుగుతావని ఆశిస్తున్నా. మళ్లీ నన్ను నేను విండీస్ జెర్సీలో చూసుకోవాలనుకుంటున్నా. విండీస్ తరఫున ఆడాలనుకుంటున్నా’ అని బ్రేవో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పేర్కొన్నాడు. దీనికి హాస్యపూరితమైన కొన్ని ఎమోజీలను జత చేశాడు. దీనికి పొలార్డ్ థాంక్స్ సోల్జర్ అని రిప్లై ఇచ్చాడు. 2018 అక్టోబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు బ్రేవో వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్ తొమ్మిదో స్థానంలో నిలవగా, భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కూడా ఘోరంగా వైఫల్యం చెందింది. దాంతో మార్పులకు శ్రీకారం చుట్టింది విండీస్ క్రికెట్ బోర్డు. విండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న కార్లోస్ బ్రాత్‌వైట్‌ను ఆ పదవి నుంచి తప్పించి పొలార్డ్‌కు పగ్గాలు అప్పచెప్పింది. 2020 టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని డిఫెండింగ్ చాంపియన్ ఇప్పట్నుంచే మార్పులు చేస్తోంది. -
ఆర్టిస్ట్ బ్రావో!
క్రికెట్ ప్రేమికులకు వెస్టిండీస్ క్రికెట్ ప్లేయర్ డ్వేన్ బ్రావో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఆల్‌రౌండర్‌గా క్రికెట్ గ్రౌండ్లో బ్రావో సాధించిన ఘనతలు ఆయన్ను గుర్తుపెట్టుకునేలా చేస్తున్నాయి. ఇప్పుడు బ్రావో క్రికెటర్‌గా మాత్రమే కాదు ఆర్టిస్టుగా కనిపించనున్నారు. ‘మెన్ టేక్ లీడ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాత. ‘ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్’ వంటి డాక్యుమెంటరీలను తెరకెక్కించిన ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కలిగించే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘‘ఇటీవల తమిళనాడులో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. దీంతో ఇండియాలో ప్లాన్ చేసిన షూటింగ్ పూర్తయింది. ఈ నెలలో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్, టోబాగో లొకేషన్స్‌లో చిత్రీకరణ జరపబోతున్నాం. డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు దర్శకురాలు ఆర్తి. -
వెస్టిండీస్ క్రికెటర్‌తో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను నిర్మించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ వెల్లడించారు. ఈ సంస్థ ప్రస్తుతం సమంత అక్కినేని ప్రధాన పాత్రలో ఓ బేబి, విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ వెంకీ మామ, అనుష్క, మాధవన్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సైలెన్స్, నాగశౌర్యతో మరో సినిమాను నిర్మిస్తోంది. ఈ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో, తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS)లో భాగంగా ఓ షార్ట్ ఫిలింను నిర్మించబోతోంది. దీనికి సంబంధించి శనివారం ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళైలు పాల్గొన్నారు. సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడుతో పాటు వెస్టిండీస్ లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్‌లో షూటింగు ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. -
రిటైర్డ్ ఆటగాడు రిజర్వ్ జాబితాలో!
సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా): గత ఏడాది అక్టోబరులో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. 2016 సెప్టెంబర్‌లో అతను చివరిసారిగా విండీస్ తరఫున టి20ల్లో బరిలోకి దిగాడు. వన్డే ఆడి దాదాపు ఐదేళ్లవుతోంది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అది గుర్తుందో లేదో కానీ 2019 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన 10 మంది రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో డ్వేన్ బ్రేవోకు కూడా చోటు కల్పించింది. బ్రేవోలాగే ఐదేళ్ల క్రితం వన్డే బరిలోకి దిగిన విధ్వంసక ఆటగాడు కీరన్ పొలార్డ్‌ను కూడా రిజర్వ్ టీమ్‌లోకి బోర్డు ఎంపిక చేసింది. ‘మా జట్టు సమతూకంతో ఉందని, అత్యవసర పరిస్థితిలో అవసరమైతే కావాల్సిన ఆటగాళ్లు కూడా ఉన్నారని చెప్పేందుకే రిజర్వ్ జాబితాను ప్రకటించాం. ఇందులో కుర్రాళ్లతో పాటు అనుభవజ్ఞులు కూడా ఉండాలని భావించాం’ అని సెలక్షన్ కమిటీ చైర్మన్ రాబర్ట్ హేన్స్ వెల్లడించారు. ఈ ఇద్దరితో పాటు సునీల్ ఆంబ్రిస్, జాన్ క్యాంప్‌బెల్, జొనాథన్ కార్టర్, రోస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, కీమో పాల్, ఖారీ పైర్, రేమన్ రీఫర్లను కూడా రిజర్వ్‌లుగా ఎంపిక చేశారు. -
వరల్డ్‌కప్ జట్టులో రిటైర్డ్ ఆటగాడు..
ఆంటిగ్వా: వెస్టిండీస్ ప్రపంచకప్ జట్టులో కీరోన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవోలు స్టాండ్ బైగా ఎంపికయ్యారు. గతంలో ప్రకటించిన వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కని వీరిని రిజర్వ్ ఆటగాళ్లగా ఎంపిక చేస్తూ విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 మందితో కూడిన రిజర్వ్ బెంచ్‌ని విండీస్ ప్రకటించగా, అందులో స్టార్ ఆల్ రౌండర్లు బ్రేవో, పొలార్డ్‌లు చోటు దక్కించుకున్నారు. వరల్డ్‌కప్ కోసం విండీస్ ముందుగా ప్రకటించిన 15 మంది జాబితాలో ఎవరైనా గాయపడిన పక్షంలో పొలార్డ్, బ్రేవోలకు అవకాశం దక్కుతుంది. కాగా, 2018లోనే బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌కు గుబ్ బె చెప్పినా, అతని అనుభవాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే విండీస్ బోర్డు తిరిగి డ్వేన్ బ్రేవోను రిజ్వర్ ఆటగాడిగా ఎంపిక చేసింది. ఇందుకు బ్రేవో అనుమతి తీసుకున్న తర్వాతే అతన్ని రిజర్వ్ ఆటగాడి జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీ నిర్వహించే రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో విండీస్ పాల్గొనుంది. మే 26వ తేదీన దక్షిణాఫ్రికాతో, మే 28వ తేదీన న్యూజిలాండ్‌తో విండీస్ వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత మెగాటోర్నీలో భాగంగా వెస్టిండీస్ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. మే 31వ తేదీన ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా విండీస్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్ రిజర్వ్ ఆటగాళ్ల జాబితా సునీల్ ఆంబ్రిస్, డ్వేన్ బ్రేవో, జాన్ క్యాంప్‌బెల్, జోనాథన్ కార్టర్, రోస్టన్ ఛేజ్, షేన్ డొవ్రిచ్, కీమో పాల్, ఖారీ పీరే, రేమాన్ రీఫర్, కీరోన్ పొలార్డ్ -
‘మాకేం అరవై ఏళ్లు లేవు’
న్యూఢిల్లీ: పదేపదే చెన్నై సూపర్ కింగ్స్‌ను ‘డాడీ ఆర్మీ’అంటూ ఎగతాళి చేస్తున్న వారిపై ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం మాట్లాడిన బ్రేవో.. ‘మా వయసు గురించి మాకు తెలుసు. ఇంకొకరు చెప్పక్కర్లేదు. సీఎస్కే ఆటగాళ్ల వయసు 32-35 మధ్యే ఉంది. మా జట్టులోని ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉన్నారు. మాకేం అరవై ఎళ్లు లేవు. వయసు కాదు ఆట, ఆనుభవం ముఖ్యం. ఈ విషయాన్ని మేధావులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో’అంటూ సీఎస్కే విమర్శకులపై మండిపడ్డాడు. బ్యాటింగ్, బౌలింగ్‌తో రాణిస్తాం ఢిల్లీ క్యాపిటల్స్‌ను వారి సొంత గడ్డపై ఓడించిన అనంతరం సీఎస్కే సారథి ఎంఎస్ ధోని మాట్లాడుతూ..‘మేం ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేస్తున్న మాట వాస్తవం. అయితే ఆ లోటును బ్యాటింగ్, బౌలింగ్‌తో పూడుస్తున్నాం. మా బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. చివరి ఓవర్లలో ఇంకా బాగా ఆడాల్సి వుంది. కానీ మంచి క్రికెట్ ఆడామనుకుంటున్నాం. ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతాం’అంటూ వివరించారు. ఇక ఈ మ్యాచ్‌లో బ్రేవోతో పాటు సీఎస్కే బౌలర్లు రాణించడంతో ఢిల్లీ 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం వాట్సన్(44), రైనా(30), ధోని(35 నాటౌట్) రాణించడంతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసి లీగ్‌లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. (చదవండి: ‘డాడీ ఆర్మీ’ అన్నారు కదా.. ఏమైంది?) -
ధోని, కోహ్లిలపై బ్రేవో అదిరే సాంగ్!
ముంబై : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో మైదానంలో బంతి, బ్యాట్‌తోనే కాకుండా తన ఆట, పాటలతో అభిమానులను అలరిస్తాడన్న విషయం తెలిసిందే. వికెట్ తీసినప్పుడైనా.. మ్యాచ్ గెలిచినప్పుడైనా సంతోషంలో అతను వేసే చిందులు కనువిందును చేస్తాయి. అయితే ఈ క్రికెట్ర్ కమ్ సింగర్ 2018 అక్టోబర్‌లో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పినా.. ఆయా దేశవాళీ టీ20 లీగ్‌ల్లో మాత్రం ఆడుతానని స్పష్టం చేశాడు. ఇక 2016 టీ20 ప్రపంచకప్ విజయానంతరం ‘ఛాంపియన్’ సాంగ్‌ను విడుదల చేసి తనో మంచి సింగర్నని చాటుకున్న ఈ కరేబియన్ క్రికెటర్.. తాజాగా మరో ఆల్భమ్‌ను విడుదల చేశాడు. ఈ సారి ఆసియా క్రికెటర్లను ప్రస్తావిస్తూ అతను పాడిన పాట ఆకట్టుకుంటోంది. ఆసియా క్రికెటర్లు కుమార సంగాక్కర, మహేళ జయవర్ధనే, విరాట్ కోహ్లి, ఎంఎస్ధోని, షకీబుల్ హసన్, షాహిదీ అఫ్రీదీ, రషీద్ ఖాన్‌లను ప్రస్తావిస్తూ ‘దిస్ వన్ ఈజ్ ఏషియా’ గా ఈ పాటను రూపొందించాడు. ఈ సాంగ్‌ను పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రీదీ కొనియాడుతూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. Well @DJBravo47, this is definitely an improvement on the ‘Champion’ song, especially since you’ve included me in the lineup 😜. Wishing you all the very best with this new number, & I hope it gets just as popular! pic.twitter.com/VvK0RzsW8J — Shahid Afridi (@SAfridiOfficial) February 7, 2019 ‘బ్రేవో అద్భుతం.. ఇది పక్కా చాంపియన్ సాంగ్‌కు మించి ఉంది. ముఖ్యంగా ఈ పాటలో నా పేరు ప్రస్తావించడం బాగుంది. ఇది విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశాడు. బ్రేవో అనేక టీ20 లీగ్‌ల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాడు. అలాగే పీఎస్ఎల్, బీబీఎల్, సీపీఎల్ల్లో కూడా పాల్గొన్నాడు. టెస్ట్‌ల్లో 86 వికెట్లతో 2200 పరుగులు చేసిన ఈ ఆల్‌రౌండర్.. వన్డేల్లో 2986 పరుగులు చేసి 199 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 52 వికెట్లతో పాటు 1142 పరుగులు తనఖాతాలో వేసుకున్నాడు. -
‘ఆ కాంట్రాక్ట్ మొత్తాన్ని బీసీసీఐ ఇస్తామంది’
ఆంటిగ్వా: దాదాపు నాలుగేళ్ల క్రితం భారత పర్యటనకు వచ్చిన వెస్టిండీస్ క్రికెట్ జట్టు సిరీస్‌ను అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి పయనమైన సంగతి తెలిసిందే. భారత్‌తో నాలుగు వన్డేల జరిగిన తర్వాత ఐదో వన్డే ఆడే క్రమంలో ఆ జట్టు పర్యటనకు స్వస్తి పలికింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో ఆ దేశ క్రికెటర్లకు కాంట్రాక్ట్ విషయంలో విభేదాలు నెలకొనడంతో భారత పర్యటన సజావువుగా సాగలేదు. అయితే ఆనాడు చోటు చేసుకున్న పరిస్థితులను తాజాగా గుర్తు చేసుకున్నాడు ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆ దేశ క్రికెటర్ డ్వేన్ బ్రేవో. ఆ సమయంలో తమ క్రికెట్ బోర్డుతో నెలకొన్న విభేదాల కారణంగా తాము పెద్ద మొత్తంలో నగదును కోల్పోయి పరిస్థితే వస్తే, అందుకు బీసీసీఐ నుంచి ఊహించని మద్దతు లభించిందన్నాడు. ‘మేము భారత్ పర్యటనకు వచ్చేటప్పటికే మా బోర్డుతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అసలు ఐదు వన్డేల సిరీస్ జరుగుతుందా అనేది కూడా అనుమానమే. మా ఆటగాళ్లు ఎవరూ మ్యాచ్‌లు ఆడటానికి సుముఖంగా లేరు. ఈ విషయం అప్పటి బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ వరకూ వెళ్లింది. ఆ క్రమంలోనే నన్ను పిలిచి మాట్లాడారు. మేము కోల్పోయే మొత్తాన్ని ఇచ్చేందుకు ఆఫర్ చేశారు. ఇదే విషయాన్ని టీమ్ సభ్యులకు చెప్పాను. మనం కచ్చితంగా సిరీస్ ఆడాలనే వారికి స్పష్టం చేశా. ఒక్క ఆటగాడు మినహా అంతా ఆడటానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆటగాళ్ల బెదిరింపుల మధ్య నాలుగు వన్డేలు జరిగాయి. అయితే ఐదో వన్డే నాటికి సమస్య తీవ్రత ఎక్కువ కావడంతో ఆ మ్యాచ్ జరగలేదు’ అని బ్రేవో తెలిపాడు. అప్పుడు తమకు బీసీసీఐ నుంచి లభించిన మద్దతు ఊహించలేనిదన్నాడు. ఇలా వేరే క్రికెట్ బోర్డు తాము కోల్పోయే కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇస్తామనడం నిజంగానే గొప్ప విషయమన్నాడు. కాకపోతే మరొక బోర్డు నుంచి డబ్బులు తీసుకునే విధానాన్ని తాము కోరుకోలేదని, తమ బోర్డుతో ఉన్న సమస్యను పూర్తిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం మాత్రమే ఉందని బ్రేవో పేర్కొన్నాడు. -
బ్రేవో వీడ్కోలు
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: టి20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు చిర పరిచితమైన వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం ప్రకటించాడు. అయితే, టి20 లీగ్‌లు మాత్రం ఆడతానని తెలిపాడు. 35 ఏళ్ల బ్రావో... 2004లో ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టు ద్వారా వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌పై జార్జిటౌన్లో తొలి వన్డే ఆడాడు. 40 టెస్టుల్లో 2,200 పరుగులు చేసి, 86 వికెట్లు పడగొట్టాడు. 164 వన్డేల్లో 2,968 పరుగులు, 199 వికెట్లు తీశాడు. టి20ల్లో మరింత ప్రభావవంతుడైన ఈ ఆల్‌రౌండర్ 2012, 2016 టి 20 ప్రపంచ కప్ నెగ్గిన వెస్టిండీస్ జట్టులో సభ్యుడు. ఈ ఫార్మాట్లో 66 మ్యాచ్‌ల్లో 1,142 పరుగులు చేసి, 52 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ తరఫున ఆడాడు. కెరీర్ అలా ముగిసింది: బ్రావో టెస్టు కెరీర్ 2010లోనే ముగిసింది. 2014లో భారత్‌లో పర్యటించిన విండీస్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన బ్రావోకు ఆ సిరీసే చివరిదైంది. బోర్డుతో వివాదాల నేపథ్యంలో నిరసన తెలిపేందుకు ధర్మశాలలో జరిగిన నాలుగో వన్డేలో టాస్ వేసేందుకు జట్టంతటినీ మైదానంలోకి తీసుకొచ్చి సంచలనం రేపాడు. తర్వాత విండీస్ జట్టు చివరిదైన ఐదో వన్డే, ఏకైక టి20, మూడు టెస్టులు ఆడకుండానే స్వదేశం వెళ్లిపోయింది. దీంతో ధర్మశాల మ్యాచ్‌తోనే ఆల్‌రౌండర్ వన్డే కెరీర్ ముగిసినట్లైంది. 2016లో అబుదాబిలో పాకిస్తాన్‌తో చివరి టి20 ఆడిన బ్రావో... ప్రస్తుతం విండీస్ దీవులతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్లలో నిర్వహించే టి20 లీగ్‌లలో పాల్గొంటున్నాడు. మారిన పరిణామాలతో దేశం తరఫున 2019 వన్డే ప్రపంచ కప్ ఆడతాడని భావించారు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. -
‘అది క్రికెట్‌కు చాలా లోటు’
చెన్నై: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడంపై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందించారు. బ్రేవో క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం అంతర్జాతీయ క్రికెట్‌కు తీవ్రమైన లోటుగా ఆయన పేర్కొన్నారు. ‘ బ్రేవో ఒక అరుదైన ఆల్ రౌండర్. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడం కచ్చితంగా క్రికెట్‌కు లోటే. ప్రధానంగా వన్డే, టీ20 ఫార్మాట్లో బ్రేవో స్థానం ప్రత్యేకం. అతను ఉపయోగకరమైన ఆల్ రౌండర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక నాణ్యమైన ఆల్ రౌండర్‌ను విండీస్ తప్పకుండా మిస్సవుతుంది. చాలామంది టాప్ ఆటగాళ్లు లేకపోవడంతో విండీస్ ఇప్పటికే తీవ్ర కష్టాల్లో పడింది. ఈ తరుణంలో బ్రేవో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం విండీస్‌కు పెద్ద దెబ్బే. అయితే ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రేవో చెప్పడం ఆనందించదగింది’ అని విశ్వనాథన్ పేర్కొన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో సీఎస్కే తరుపున బ్రేవో ఆడుతున్న సంగతి తెలిసిందే. డ్వేన్ బ్రేవో షాకింగ్ నిర్ణయం -
డ్వేన్ బ్రేవో షాకింగ్ నిర్ణయం
ఆంటిగ్వా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 35 ఏళ్ల బ్రావో 2016 సెప్టెంబర్‌లో చివరిసారిగా విండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 2016 టీ20 వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బ్రేవో.. 270 మ్యాచ్‌ల్లో విండీస్ తరఫున బరిలో దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి అధికారికంగా తప్పుకుంటున్నట్టు బ్రేవో బుధవారం రాత్రి ప్రకటించాడు. ‘14 ఏళ్ల క్రితం వెస్టిండీస్ తరఫున అరంగేట్రం చేశాను. నాకు ఇప్పటికీ ఆ క్షణాలు గుర్తున్నాయి. 2004లో ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడటానికి లార్డ్స్‌లోకి అడుగుపెట్టే ముందు మెరూన్ క్యాప్ అందుకున్నాను. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడాను. తర్వాతి తరం క్రికెటర్లకు అవకాశం ఇవ్వడం కోసం రిటైర్ అవుతున్నా’ అని బ్రేవో తన ప్రకటనలో స్పష్టం చేశాడు. అయితే క్రికెటర్‌గా ప్రొఫెషనల్ కెరీర్‌ను కొనసాగిస్తానని బ్రేవో తెలిపాడు. దాంతో ఐపీఎల్ వంటి లీగ్‌ల్లో ఆడతానని బ్రేవో చెప్పకనే చెప్పేశాడు. 40 టెస్టులు ఆడిన బ్రావో 31.43 సగటుతో 2200 పరుగులు చేయడంతోపాటు 86 వికెట్లు తీశాడు. 164 వన్డేలు ఆడిన ఈ కరేబియన్ ప్లేయర్ 2968 రన్స్ చేయడంతోపాటు 199 వికెట్లు పడగొట్టాడు. 66 టీ20ల్లో 1142 పరుగులు చేసి, 52 వికెట్లు తీశాడు. చివరిసారిగా 2010లో శ్రీలంకపై చివరి టెస్ట్ ఆడాడు. 2014లో భారత్‌పై ఆఖరి వన్డే ఆడిన బ్రావో.. 2016లో పాక్‌పై చివరి టీ20 మ్యాచ్ ఆడాడు.