
David Warner Funny Dance.. డేవిడ్ వార్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంత ప్రాధాన్యమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఉంటే ఎంత విజృంభిస్తాడో.. బయట అంత ఉల్లాసంగా కనిపిస్తాడు. తాజాగా టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోతో కలిసి డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. విండీస్ తరపున ఆఖరి మ్యాచ్ ఆడిన బ్రావోకు రిటైర్మెంట్ వేళ గార్డ్ ఆఫ్ ఆనర్‌తో పాటు వార్నర్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో ఆసీస్ విజయంలో వార్నర్ కీలకపాత్ర పోషించాడు. 56 బంతుల్లో 9 ఫోర్లు.. 4 సిక్సర్ల సాయంతో 89 పరుగులు సాధించాడు. ప్రస్తుతం వార్నర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Chris Gayle: ఫన్నీ బౌలింగ్.. మిచెల్ మార్ష్ ఔట్‌తో ముగించాడు
pic.twitter.com/hGPLe5VEa1 DJ Bravo dancing with Warner 😅
— PRAYAS-NULLAH- JAJAI 🇦🇫🇦🇫 (@cricloverPrayas) November 6, 2021
Comments
Please login to add a commentAdd a comment