వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను నిర్మించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ వెల్లడించారు. ఈ సంస్థ ప్రస్తుతం సమంత అక్కినేని ప్రధాన పాత్రలో ఓ బేబి, విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ వెంకీ మామ, అనుష్క, మాధవన్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సైలెన్స్, నాగశౌర్యతో మరో సినిమాను నిర్మిస్తోంది.
ఈ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో, తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS)లో భాగంగా ఓ షార్ట్ ఫిలింను నిర్మించబోతోంది. దీనికి సంబంధించి శనివారం ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళైలు పాల్గొన్నారు.
సోషల్ అవేర్నెస్‌కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడుతో పాటు వెస్టిండీస్ లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్‌లో షూటింగు ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
వెస్టిండీస్ క్రికెటర్‌తో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్
Published Sat, Jun 29 2019 3:30 PM | Last Updated on Sat, Jun 29 2019 3:31 PM
Comments
Please login to add a commentAdd a comment