ది రాజాసాబ్‌ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ! | Tollywood Hero Prabhas The Raaja Saab Movie Team Clarity On Rumours | Sakshi
Sakshi News home page

The Raaja Saab Movie: డౌట్స్ వద్దు రాజాసాబ్.. నిర్మాణ సంస్థ క్లారిటీ!

Published Wed, Dec 18 2024 7:27 PM | Last Updated on Wed, Dec 18 2024 7:52 PM

Tollywood Hero Prabhas The Raaja Saab Movie Team Clarity On Rumours

కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్‌ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్‌ వైరలైంది.

డే అండ్ నైట్ జరుగుతోంది..

తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్‌ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ ‍విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్  డే అండ్ నైట్ షెడ్యూల్స్‌ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.

అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని   ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని  కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్‌డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్‌ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.

గాయం కావడం వల్లే రూమర్స్..

'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement