People Media Factory
-
పవన్ పార్ట్నర్కు 1,200 ఎకరాలు
వడ్డించే వాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొదవుండదన్నట్లు.. భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్నర్ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైపోతాయనేందుకు ఈ ‘ఒప్పందం’ అతికినట్లు సరిపోతుంది. సినిమా నిర్మాణానికి, వాహనాల తయారీకి ఎక్కడా పొంతన కుదరకున్నా, ఏ మాత్రం అనుభవం లేకున్నా.. ఆ పార్ట్నర్ అడగడం.. ఈ పార్ట్నర్ మద్దతు పలకడం.. పొలిటికల్ పార్ట్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయింది. కనీసం ఈ–మొబిలిటీ వాహనాలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కూడా లేకుండానే ఏకంగా 1,200 ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం పట్ల అటు వ్యాపార ప్రముఖులు, ఇటు అధికారులు నివ్వెరపోతున్నారు. సాక్షి, అమరావతి: టీజీ విశ్వ ప్రసాద్ (TG Vishwa Prasad) ఈ పేరు చాలా మందికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) పలు సినిమాలు తీయడమే కాకుండా, ఆయనతో భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టింది ఈయనే. టీజీ విశ్వప్రసాద్‌కు ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌తో కలిపి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీ (లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్) తొలి దశలో 15 చిత్రాలు నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు. ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ అనే సినిమా కూడా తీశారు. అందులో అప్పటి జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిత్వ హననం చేసే విధంగా నటుడు పృథ్వీతో ఓ సీన్ పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా 2024 ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం నుంచి జనసేన తరుఫున అభ్యర్థిగా పోటీ చేయడానికి విశ్వప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కూటమి ఒప్పందంలో భాగంగా ఆ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో పోటీ చేయలేకపోయారు. అయితే ఎన్నికల ప్రచారానికి భారీగా నిధులు సమకూర్చినట్లు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫలితాల అనంతరం ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో హైదారాబాద్‌లో విశ్వప్రసాద్ గ్రాండ్ పార్టీ ఇవ్వడంపై భారీగా చర్చ జరిగింది. పవన్‌కళ్యాణ్ పార్టనర్ అయినందునే ఆయనకు రూ.కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టేయడానికి ఫైళ్లు చకచకా కదిలాయని, ఆ వెంటనే ఒప్పందం కుదిరిందనే వాదన వినిపిస్తోంది. అనుభవం లేని కంపెనీతో ఒప్పందంపీపుల్ టెక్ టెక్నాలజీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ స్క్రీన్స్, పీఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పీటీజీ వెంచర్స్, వీ జోన్ హాస్పిటల్స్ వంటి విభిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీజీ విశ్రప్రసాద్ ఇప్పుడు ఎటువంటి అనుభవం లేకుండానే ఈ–మొబిలిటీ పార్కుతోపాటు ఈ– స్కూటర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఈ–మొబిలిటీ వాహన తయారీ కోసం ఇంకా భాగస్వామ్య కంపెనీని కూడా ఎంచుకోలేదు. తైవాన్, కొరియా, చైనా దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొన్నారు. రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆర్థికస్థితి పీపుల్ గ్రూపుకు లేనే లేదు. అయినా ఈ విషయాలు ఏమీ పరిగణనలోకి తీసుకోకుండా ఏపీ ఈడీబీ పీపుల్స్ గ్రూపుతో ఒప్పందం చేసుకుంది.కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1,200 ఎకరాలను రూ.1,800 కోట్లతో ఈ–మొబిలిటీ పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు, యాంకర్ (ప్రధాన) కంపెనీగా పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ రూ.300 కోట్లతో ఈ –మొబిలిటీ యూనిట్‌ను ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.సచివాలయంలో శుక్రవారం పవన్ కళ్యాణ్‌ను కలిసిన విశ్వప్రసాద్ రూ.6 వేల కోట్లు పైమాటేహైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధికి 2,621 ఎకరాలను కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే ఆ భూమి పక్కనే 1,200 ఎకరాల్లో ఈ మొబిలిటీ పార్కు ఏర్పాటు చేస్తామంటూ పీపుల్ టెక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకోవడం.. అనంతరం ఆ కాగితాలతో విశ్వప్రసాద్.. డిప్యూటీ సీఎంను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం అంతా చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఎకరం రూ.కోటి వరకు ఉన్న ఈ భూమి ధర.. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చెందితే రూ.ఐదారు కోట్ల వరకు వెళుతుంది. ఈ లెక్కన 1,200 ఎకరాల భూమి విలువ రూ.ఐదారు వేల కోట్లకు పైగానే ఉంటుందని పరిశ్రమల శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అంశం తెలుగుదేశం పార్టీతో పాటు పరిశ్రమల శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.కారు చౌకగా కొట్టేసే యత్నంఓర్వకల్లు వద్ద సుమారు 9,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందులో తొలి దశలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిక్‌డిక్ట్ నిధులతో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం పారిశ్రామిక పార్కు కోసం 2,621 ఎకరాల భూమి బదలాయింపునకు ఆమోదం తెలిపింది. ఒక్కసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులు మొదలైతే అక్కడ భూముల రేట్లు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి 80 లక్షల నుంచి కోటి రూపాయల పైనే పలుకుతోంది. ఒకసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి అయితే ఈ రేట్లు నాలుగైదు రెట్లు పెరుగుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న డిప్యూటీ సీఎం వ్యాపార భాగస్వామి కారు చౌకగా ఈ భూములను కొట్టేసే విధంగా పథకం రూపొందించారు. పీపుల్ టెక్ పేరుతో ఈ మొబిలిటీ పార్కును ఏర్పాటు చేస్తున్నామంటూ ఎకరా రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షలకు అప్పగించే విధంగా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పుతున్నారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడక్కడ ఏపీఐఐసీనే ఎకరం రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలకు విక్రయిస్తుంటే అత్యంత కారుచౌకగా భూములను అప్పగించడానికి రంగం సిద్ధం కావడం వెనుక ఏం జరిగి ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్‌కళ్యాణ్ వ్యాపార భాగస్వామికి రూ.వేల కోట్ల విలువైన భూములను అత్యంత కారుచౌకగా ధారాదత్తం చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. -
ఫిల్మ్ విభాగాల్లో ఉచిత శిక్షణ: టీజీ విశ్వప్రసాద్
‘గూఢచారి, కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్, చైర్మన్ టీజీ విశ్వప్రసాద్ హైదరాబాద్, బెంగళూరులో ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ని ఆరంభించారు. ఈ సందర్భంగా టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగంలో రాణించాలనుకునే నేటి యువతకి మేం ఉన్నామని భరోసా ఇస్తూ ఉచిత శిక్షణ కల్పించి, ప్రతిభావంతులుగా ఇండస్ట్రీకి పరిచయం చేయడమే ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ ప్రధాన లక్ష్యం. చైర్ఉమెన్ టీజీ వందనా ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి శిక్షణతోపాటు భావితరాలకి మంచి భవిష్యత్తు అందించడానికి దిశా నిర్దేశంగా ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫిల్మ్ అకాడమీ’ అడుగులు వేస్తుంది. స్టూడెంట్స్‌కు రియల్ప్రాజెక్టులపై పని చేసే అవకాశం కల్పించడంతోపాటు, సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ ఫిల్మ్ కోర్సులు పూర్తి ఉచితంగా శిక్షణ ఇస్తాం. యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, డిజైనింగ్, వర్చ్యువల్ ప్రోడక్షన్– డిఐ, లైటింగ్ విభాగాల్లో శిక్షణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు 90322 57101 నంబరులో సంప్రదించాలి’’ అని తెలిపారు. -
సుమ తనయుడి కొత్త చిత్రం.. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా?
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతేడాది బబుల్గమ్ మూవీతో టాలీవుడ్ హీరోగా అరంగేట్రం చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే తాజాగా మరో చిత్రానికి రెడీ అయ్యారు రోషన్. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్షన్లో నటించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోగ్లీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తే రోషల్ వైల్డ్ లుక్‌ను తలపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ సాక్షిసాగర్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని లవ్ స్టోరీగానే తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 𝐓𝐇𝐄 𝐋𝐎𝐔𝐃𝐄𝐒𝐓 𝐖𝐀𝐑 𝐎𝐅 𝐀 𝐒𝐈𝐋𝐄𝐍𝐓 𝐋𝐎𝐕𝐄 𝐒𝐓𝐎𝐑𝐘 ❤🔥#Mowgli ’s Wild Adventure Begins 💥💥Stay tuned for more exciting updates!#Mowgli2025A @SandeepRaaaj directorial.🌟ing @RoshanKanakala & #SakshiMhadolkarA @Kaalabhairava7 musical 🎵… pic.twitter.com/vxtDMvAqU4— People Media Factory (@peoplemediafcy) December 19, 2024 -
ది రాజాసాబ్ ఆన్ ట్రాక్.. రూమర్స్‌పై స్పందించిన నిర్మాణ సంస్థ!
కల్కి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఇటీవల బచ్చలమల్లి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన మారుతి.. ప్రభాస్ సినిమా గురించి మాట్లాడారు. నా నవ్వు చూస్తే చాలు.. ది రాజాసాబ్ గురించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అయితే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం రూమర్స్ వస్తూనే ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ది రాజాసాబ్ విడుదల వాయిదా పడిందంటూ వార్తలొచ్చాయి. అదే రోజు సిద్ధు జొన్నలగడ్డ మూవీ రానుందని.. అందువల్లే ది రాజాసాబ్ డేట్ మారినట్లు న్యూస్ వైరలైంది.డే అండ్ నైట్ జరుగుతోంది..తాజాగా ఈ వార్తలపై ది రాజాసాబ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పందించింది. ది రాజాసాబ్ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని తెలిపింది. ఈ మూవీ షూటింగ్ డే అండ్ నైట్ షెడ్యూల్స్ నిరంతరాయంగా జరుగుతున్నాయని పేర్కొంది. ఇప్పటికే దాదాపు 80 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించింది.అయితే క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా ది రాజా సాబ్ టీజర్ విడుదల కానుందని మరికొన్ని ఊహాగానాలు వస్తున్నాయని తెలిసింది. ఇలాంటి వాటిని ఎవరూ కూడా నమ్మవద్దని కోరుతున్నట్లు టీమ్ వెల్లడించింది. ఈ మూవీకి సంబంధించి సరైన సమయంలో మేమే అప్డేట్స్ ఇస్తామని ట్విటర్ ద్వారా కోరింది నిర్మాణ సంస్థ. ఈ ప్రకటనతో ది రాజాసాబ్ చిత్రంపై వస్తున్న రూమర్లకు చెక్ పడింది.గాయం కావడం వల్లే రూమర్స్..'ది రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. #TheRajaSaab shooting is progressing rapidly with continuous day and night schedules. Nearly 80% of the shoot has been completed, and post production work is in full swingWe’ve noticed various speculations circulating about the teaser release during Christmas or New Year. We… pic.twitter.com/qJIX2AXxDh— People Media Factory (@peoplemediafcy) December 18, 2024 -
రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
హరీశ్ శంకర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. ఎక్కువగా రీమేక్ కథలతో మూవీస్ తీస్తాడనే అపవాదు ఉన్న ఈ దర్శకుడు తీసిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజై ఘోరంగా ఫ్లాప్ అయింది. చాలా నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే హరీశ్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతానికి రెండు కోట్లు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చారని, త్వరలో మరి కొంచె వెనక్కి ఇచ్చే అవకాశముందని సమాచారం. ఏదేమైనా ఇలా సినిమా నష్టపోతే ఇలా పారితోషికం వెనక్కి ఇచ్చి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లని ఆదుకోవడం మంచి విషయమే. మరోవైపు ఇదే సినిమాలో హీరోగా రవితేజ నుంచి ఇలాంటి రెస్పాన్స్ రాలేదు.(ఇదీ చదవండి: Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ!)'మిస్టర్ బచ్చన్' విషయానికొస్తే.. 2018 హిందీలో వచ్చిన 'రైడ్' అనే మూవీకి రీమేక్‌గా దీన్ని తీశారు. అయితే ఒరిజినల్ స్టోరీ సీరియస్‌గా ఉంటుంది. హరీశ్ శంకర్ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పి పాటలు, ఫైట్స్ అని అదనంగా జోడించారు. దీంతో మూవీ కాస్త కిచిడి అయిపోయింది. అలానే మరీ ఎక్కువగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలని చూపించడం కూడా అసలు కథని పక్కదారి పట్టించిందనే విమర్శలు వచ్చాయి.ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనేలా అగ్రిమెంట్ చేసుకున్నారని టాక్. దీనిబట్టి చూస్తే వచ్చే వారం ఈ సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశముంది. లేదంటే వినాయక చవితి కానుకగా ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం) -
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థపై సీనియర్ డైరెక్టర్ ఆగ్రహం.. కారణమేంటి?
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అలాంటిది ఇతడు గత కొన్నేళ్లుగా మూవీస్ తీస్తున్నప్పటికీ అవి రిలీజ్ కావడం లేదు. అయితే అందుకు గల కారణాన్ని ఇప్పుడు ఈయనే బయటపెట్టాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్బుక్లో దర్శకుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రస్తుతం.. 'మిస్టర్ బచ్చన్, విశ్వం, మా కాళి, స్వాగ్ సినిమాలని నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల గురించి టీమ్ అంతా చర్చించుకున్నామని చెప్పి ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీనికి బదులిస్తూనే దర్శకుడు వీఎన్ ఆదిత్య షాకింగ్ కామెంట్స్ చేశారు."నా మూడు సెన్సిబుల్ సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అరక్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది' అని వీఎన్ ఆదిత్య ఫేస్బుక్ పోస్ట్ పెట్టారు. ఈయన డైరెక్ట్ చేసిన లవ్@ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు లాంటి మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికి ఏళ్లకు ఏళ్లు జాప్యం చేస్తుండటంత వీఎన్ ఆదిత్య ఇలా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్) -
డల్లాస్‌లో తమన్ భారీ మ్యూజికల్ ఈవెంట్.. ఎప్పుడో తెలుసా?
ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పలు పాన్ ఇండియన్ సినిమాలతో ఇతడు బిజీగా ఉన్నాడు. తమిళ, తెలుగు అనే తేడా లేకుండా ప్రతిచోట తమన్ పాటలు అదరగొట్టేస్తున్నాయి. ఎప్పుడు ఎంతో బిజీగా ఉండే ఇతడితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఓ మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.(ఇదీ చదవండి: పాయల్ రాజ్‌పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!)అమెరికాలోని డల్లాస్‌లో తమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడు. స్పైస్ టూర్ పేరుతో జరిగే ఈ కార్యక్రమం జూన్ 1న ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాని చూపించారు. ఇప్పటివరకు డల్లాస్ లో జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్) -
కొత్త పాయింట్‌తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్‌బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
సడన్‌గా ఓటీటీ వచ్చేసిన స్టార్ కమెడియన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం, మేఘా ఆకాష్ జంటగా నటించిన వడక్కుపట్టి రామసామి. పీరియాడికల్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు కార్తిక్ యోగి దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 1960-70 కాలంలో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందించారు. మంగళవారం నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్టార్ కమెడియన్ నటించిన సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అభిమానుల అంచనాలను అందుకోవడంపై బోల్తా కొట్టింది. కానీ గతంలో సంతానం - కార్తిక్ యోగి కాంబినేషన్లో వచ్చిన డిక్కీలోనా అనే మూవీ కమర్షియల్ సక్సెస్ కావడంతో వడక్కుపట్టి రామసామిపై అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. కేవలం రూ.5.5 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు సాధించింది. థియేటర్లలో మిస్సయినవారు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి. కాగా.. ఈ సినిమాతోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం త్వరలోనే తెలుగులోనూ అందుబాటులోకి రానుందని టాక్. After a thundering response for the theatrical release, Fun-filled social drama #VadakkupattiRamasamy is now available on @PrimeVideoIN #VadakkupattiRamasamyOnPrime @karthikyogidir @akash_megha @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @RajaS_official @Sunilofficial… pic.twitter.com/rqAoormWfu — Santhanam (@iamsanthanam) March 12, 2024 -
ఈగల్ మేకర్స్ డేరింగ్ స్టెప్.. ఆ విషయంలో షాకింగ్ డెసిషన్!
సంక్రాంతి రావాల్సిన మాస్ మహారాజా ఫిబ్రవరికి రెడీ అయిపోయారు. రవితేజ, అనుమప పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరో, హీరోయిన్లుగా నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఈగల్ మరో మూడు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం గ్రాండ్‌గా నిర్వహించారు. గతేడాది రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో అలరించిన మాస్ హీరో మరోసారి ఫుల్ యాక్షన్ ట్రీట్ ఇవ్వనున్నారు. అయితే ఈ సినిమాకు రిలీజ్‌కు చిత్రబృందం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకుందాం. పెద్ద సినిమాలు అంటే టికెట్ల రేట్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. మొదటి రోజు బుకింగ్స్ దొరకడం కూడా కష్టమే. సినిమా బడ్జెట్ ఆధారంగా మేకర్స్ టికెట్ రేట్లు పెంచేస్తుంటారు. పెద్ద హీరోల సినిమాలకు ప్రభుత్వాలు సైతం ధర పెంచుకునేందుకు సడలింపులు ఇస్తాయి. కానీ ఈగల్ మేకర్స్ మాత్రం ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఈగల్ సినిమా టికెట్లను మామూలు రోజుల్లో ఉండే ధరలకే అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ల్లో ఉండే టికెట్ ధర రూ.200, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.150కే పరిమితం చేశారు. అత్యధికంగా మల్లీప్లెక్స్‌లలో టికెట్ ధర రూ.295 వరకు పెంచుకునే అవకాశం ఉంది. కానీ ఈగల్ సినిమాను ఎక్కువమంది చూడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభం కాగా.. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ రూ.200 మాత్రమే చూపిస్తోంది. ఫిబ్రవరి, మార్చిలో పరీక్షల సమయం కావడంతో స్టూడెంట్స్ చాలా వరకు సినిమాలకు దూరంగా ఉంటారు. ఇది కూడా ఒక కారణం అయినప్పటికీ.. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ డేరింగ్ డెసిషన్ తీసుకున్నట్లు అనిపిస్తోంది. ర్యాప్ వీడియో వైరల్ అయితే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఓ యువకుడు రవితేజ సినిమాలను డైలాగ్స్‌తో అదిరిపోయేలా పాట పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సైతం ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. The video is so good that even the pause button has given up. Can someone send us help or more popcorn? 🍿,🫠 Cinema Cinema Cinema ♥️#RaviTeja #EAGLEonFEB9th #Eagle pic.twitter.com/oMqjByZqUF — People Media Factory (@peoplemediafcy) February 6, 2024 -
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.. రవితేజ 'ఈగల్' టీమ్ లేఖ
రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం 'ఈగల్'. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. జవనరి 13న సంక్రాంతి కానుకగా రావాల్సిన ఈ సినిమా థియెటర్ల కొరత ఉండటంతో అప్పుడు వాయిదా పడింది. సంక్రాంతి సినిమాల విడుదలపై.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశం అయి ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుల వ్యవధిలోనే ఐదు సినిమాలు విడుదలైతే పలు ఇబ్బందులు వస్తాయిని దానిపై ఈగల్ నిర్మాతలతో సుదీర్ఘ చర్చలు అప్పట్లో జరిగాయి. వారందరి కోరిక మేరకు ‘ఈగల్’ నిర్మాత తమ సినిమాని పోస్ట్‌పోన్ చేసేందుకు అంగీకరించారు. అందుకు గాను ఈగల్ సినిమాకు సింగిల్ రిలీజ్ డేట్‌గా ఫిబ్రవరి 9 ఫైనల్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఈగల్ సినిమాకు అలాంటి పరిస్థితే వస్తుంది. ఫిబ్రవరి 8న యాత్ర-2, ఊరు పేరు భైరవకోన చిత్రాలతో పాటు ఫిబ్రవరి 9న లాల్ సలామ్ విడుదల కానుంది. అంటే ఈగల్ సినిమాతో కలిపి మొత్తంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. దీంతో తాజాగా ఈగల్ సినిమాకు సంబంధించిన పీపుల్స్ మీడియా వారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు లేఖ రాశారు. సంక్రాంతికి రావాల్సిన ఈగల్ సినిమా ఛాంబర్ పెద్దల నిర్ణయం మేరకు, సినీ పరిశ్రమ మంచి కోసం తాము వాయిదా వేసుకున్నామని ఆ లేఖలో తెలిపారు. ఈ క్రమంలో తమ ఈగల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ ఇస్తామని మాట ఇచ్చారు. కానీ తమ సినిమా రిలీజ్ రోజే మరి కొన్ని సినిమాలు విడుదల కానున్నాయని తెలిపారు. ఈగల్ సినిమాకి సోలో డేట్ ఇస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని పీపుల్స్ మీడియా విజ్ఞప్తి చేసింది. ఈగల్ సినిమా సోలోగా విడుదలయ్యేలా సహకరించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను కోరింది. ఈ లేఖకు ఎలాంటి సమాధానం ఇంకా వెలువడలేదు. Ravi Teja’s #Eagle Solo Release issue. pic.twitter.com/BOauCOiKMm — Christopher Kanagaraj (@Chrissuccess) January 19, 2024 -
సంక్రాంతి నుంచి తప్పుకుంటున్న రవితేజ.. కారణం ఇదేనా?
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమపరమేశ్వరన్‌తో పాటు కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకొస్తోందని ఈ చిత్ర యూనిట్ కొద్దిరోజుల క్రితం కౌంట్‌డౌన్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. కానీ సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈగల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ కూడా యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ చిత్రానికి సెన్సార్ ఇవ్వడం గమనార్హం. కానీ సంక్రాంతి రేసులో భారీగా చిత్రాలు ఉండటం వల్ల రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ కొరత ఏర్పడింది. మహేష్ బాబు గుంటూరు కారం, హనుమాన్,వెంకటేష్ సైంధవ్, నా సామిరంగా వంటి చిత్రాలు ఉండటంతో రేసు నుంచి తప్పకుంటే బెటర్ అని ఈగల్ టీమ్ ఆలోచిస్తుందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈగల్... ఇన్నీ సినిమాల మద్య వస్తే థియేటర్స్ కొరత ఏర్పడి నష్టాలు రావచ్చని వారు అంచనా వేస్తున్నారట. సినీ విశ్లేషకులు కూడా ఇదే సరైన నిర్ణయం అని వ్యాఖ్యానిస్తున్నారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్- రవితేజ కాంబోలో గతేడాది 'ధమాకా' చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈగల్ కూడా భారీ హిట్ కొట్టడం ఖాయం అనుకుంటున్న తరుణంలో సంక్రాంతి నుంచి ఈ చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు సోషల్మీడీయాలో ప్రచారం జరుగుతుండటంతో రవితేజ ఫ్యాన్స్ కొంతమేరకు నిరుత్సాహానికి గురి అయ్యారు. ఈగల్ సినిమా వాయిదా దాదాపు ఖాయం.. కానీ అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. -
ప్రభాస్ కొత్త సినిమా ప్రకటన.. రెమ్యునరేషన్ వద్దని చెప్పిన డార్లింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. విడుదలైన వారంలోపే రూ. 500 కోట్ల క్లబ్లో సలార్ చేరిపోయంది. ప్రభాస్ గత సినిమాలు రాధేశ్యామ్,ఆదిపురుష్‌తో పాటు సలార్ అన్నీ కూడా విభిన్నమైన కథాంశాలతోనే తెరకెక్కాయి. ముఖ్యంగా సాహో, సలార్ సినిమాలతో ప్రభాస్‌కు మాస్ ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో ఆయన నుంచి తర్వాత వచ్చే సినిమాలు ఎలా ఉండబోతున్నాయని అందరిలో ఆసక్తి నెలకొంది. మారుతితో ఒక సినిమాను ఇదివరకే ప్రభాస్ ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజాగా ఈ సినిమా నుంచి ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. సంక్రాంతి పండుగ రోజు మారుతి- ప్రభాస్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తెలిపింది. ఇప్పటి వరకు మీరందరూ డైనోసార్ ప్రభాస్‌ను చూశారు.. ఇక త్వరలో మళ్లీ డార్లింగ్ ప్రభాస్‌ను చూసేందుకు రెడీగా ఉండండి అంటూ ఒక పోస్ట్‌ర్ విడుదల చేసి చిత్ర యూనిట్ తెలపింది. ప్రభాస్‌ను మాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన్ను ఇష్టపడుతారు.. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్‌ను మళ్లీ వింటేజ్ లుక్‌లో చూడొచ్చని ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. సినిమా జోనర్ ఏంటి మారుతి- ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి గతంలోనే ఎన్నో వార్తలు వచ్చాయి. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జోనర్లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ఒక బంగ్లా చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని టాక్ ఉంది. ఈ చిత్రానికి రాజా డీలక్స్ అని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్‌కు ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. రూ. 150 కోట్ల లోపే ఈ సినిమాకు బడ్జెట్ అని సమాచారం. ఈ సినిమా కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ లేకుండానే చేస్తున్నారని టాక్.. కానీ సినిమా విడుదలయ్యాక బడ్జెట్ పోను మిగిలిన ఆదాయంలో వాటా తీసుకునేలా ప్రభాస్ డీల్ సెట్ చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరోవైపు 'కల్కి 2898 ఏడి' సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా వేగంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. People Media Factory proudly unveils the Dinosaur transformed into an absolute DARLING 😍 First Look and Title will be unveiled on Pongal 🔥#Prabhas #PrabhasPongalFeast ❤️🔥 A @DirectorMaruthi film. @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla pic.twitter.com/vGErsqcv1z — People Media Factory (@peoplemediafcy) December 29, 2023 -
'బబుల్గమ్' రొమాంటిక్ వీడియో సాంగ్‌తో హీట్ పెంచిన రోషన్
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్‌తో ‘క్షణం’ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ రవికాంత్.. దీంతో బబుల్గమ్ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేమకథను ప్రధానమైన కాన్సెప్ట్‌గా మంచి రిలేషన్షిప్ డ్రామాగా ‘బబుల్గమ్’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు డైరెక్టర్ తెలిపాడు. ఈ చిత్రంలో ఆది పాత్రలో రోషన్, జాన్వీ పాత్రలో తెలుగు అమ్మాయి మానస నటించడం విషేశం అని ఆయన చెప్పాడు. కొత్తవారితో చేయాల్సిన సినిమా ఇది అని రోషన్ హీరోగా పరిచయమవుతున్నాడని తెలిసి, ఈ కథను చెప్పాను అన్నాడు. కాలేజీ చదువు పూర్తి చేసుకున్న తర్వాత యువకుల కెరీర్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. దానిని ఈ సినిమాలో చూపించామని ఆయన తెలిపాడు. 'బబుల్గమ్' సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'జస్ట్ ఈజీ పీసీ' రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీ చరణ్ ఈ చిత్రానికి చక్కటి సంగీతం అందించాడు. -
బబుల్గమ్ ట్రైలర్‌తో యూత్‌ను టార్గెట్ చేసిన రోషన్ కనకాల
'బబుల్గమ్' సినిమాతో వెండితెరపై కనిపించనున్నాడు యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల. ఈ సినిమాలో ఆయనకు జోడీగా మానస చౌదరి నటిస్తుంది. రవికాంత్ పేరెపు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌తో మంచి ఇంపాక్ట్ చూపించాడు రోషన్ కనకాల. ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసినట్లు ట్రైలర్‌తో అర్థమౌతుంది. ప్రియురాలి వల్లే ప్రియుడికి అవమానం ఎదురైతే ఆ యువకుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో పర్ఫెక్ట్గా చూపించాడు రోషన్. అలాంటి సమయం ఎదురైతే జీవితంలో ఆ యువకుడు ఎలా సక్సెస్ అయ్యాడు..? అదే విధంగా ఆమెపై ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు..? అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ ఉంది. ఇందులో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పిస్తుంది. పాటలకు కూడా శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం యువతను మెప్పిస్తుంది. మొదటి సినిమాతోనే రోషన్ నటన సూపర్ అనిపించేలా ఉంది. యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్న ఈ ట్రైలర్‌ను చూసేయండి. డిసెంబర్ 29న బబుల్గమ్ విడుదల కానుంది. -
సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్.. పాల్గొనాలంటే ఇలా చేయండి..
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ను ఆవిష్కరించింది. ఈ సంచలనాత్మక ఉత్సవంలో సినిమాలను ప్రదర్శించటంతో పాటు గ్రూప్ డిస్కషన్స్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి. వర్ధమాన దర్శకులు తమ ప్రతిభను చాటిచెప్పుకోవడానికి ఇదొక వేదికగా పని చేయనుంది. ఈ వేడుకలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు https://blog.aha.video/entertainment/nominations-for-south-indian-film-festival/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మూడు విభాగాల్లో పోటీ ఈ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేవారిని మూడు భాగాలుగా విభజించారు. షార్ట్ ఫిలిం విభాగంలో 3-15 నిమిషాల వ్యవధి ఉన్న షార్ట్ ఫిలిం పంపాలి. రెండో విభాగం షార్ట్స్ షార్ట్.. దీని కోసం మూడు నిమిషాల కంటే తక్కువగా ఉన్న షార్ట్స్ షార్ట్‌ను పంపాల్సి ఉంటుంది. అలాగే మ్యూజిక్ వీడియో విభాగం కోసం ఐదు నిమిషాల కంటే తక్కువగా ఉన్న వీడియోను చిత్రీకరించి పంపాలి. 2020లో జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 10 మధ్య వచ్చిన సినిమాల కంటెంట్‌తో వీడియోలను చిత్రీకరించి పంపాల్సి ఉంటుంది. డిసెంబర్ 20న తెలుగు ఫిలిం ఫెస్టివల్.. ప్రస్తుతం తెలుగులో ఈ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. టాలీవుడ్‌కి చెందిన స్టార్ మేకర్స్ ఈ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్‌గా పని చేయనున్నారు. నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, వి.ఎన్.ఆదిత్య, చందు మొండేటి.. నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్.. ఇండియన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్‌గా పని చేసిన అనీల్ వాన్వరి ఈ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్స్‌గా ఉన్నారు. డిసెంబర్ 20 నుంచి ఈ తెలుగు ఫిలిం ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియాలోని ప్రముఖ సినీ సెలబ్రిటీలు పాల్గొననున్నారు. చదవండి: సినిమా షూటింగ్లో హీరో సూర్యకు ప్రమాదం.. -
ఈగల్ టీజర్లో రవితేజ విధ్వంసం.. ఎలా ఉందో చూసేయండి
రవితేజ హీరోగా దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న సినిమా 'ఈగల్'. భారీ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ లుక్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ నటిస్తున్నారు. నవదీప్, మధుబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టి. జి. విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈగల్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: రష్మిక మందన్న ఫేక్ వీడియో వైరల్.. వారిని శిక్షించాలని డిమాండ్) కొండలో లావాను కిందకు పిలవకు. ఊరు ఉండదు. నీ ఉనికి ఉండదు అంటూ రవితేజ చెప్పిన పంచ్ డైలాగ్‌తో టీజర్ ఇంట్రెస్టింగ్గా ప్రారంభమైంది. అడవిలో ఉంటాడు. నీడై తిరుగుతుంటాడు. కనిపించడు. కానీ వ్యాపించి ఉంటాడు.. వెలుతురు వెళ్లే ప్రతిచోటకు వాడి బుల్లెట్ వెళుతుంది అంటూ రవితేజ క్యారెక్టర్ గురించి ఇచ్చిన ఎలివేషన్ డైలాగ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఈగల్ సినిమాను కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఆయన నిఖిల్‌తో 'సూర్య వర్సెస్ సూర్య' చిత్రంతో మెప్పించాడు.. కార్తిక్ ఘట్టమనేనికి ఇది రెండో సినిమా. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్లు టీజర్లో ప్రకటించారు. ఇటీవల 'టైగర్ నాగేశ్వరరావు'తో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో డాన్‌శీను, బలుపు, క్రాక్ వచ్చాయి. -
శర్వానంద్‌కు జోడీగా కృతీ శెట్టి.. స్పెషల్ వీడియో రిలీజ్
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ 35వ సినిమా ఒకటి. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి చిత్రం ఉప్పెన తోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది. ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. చదవండి: అట్లీ తీరుపై కోపంగా నయన్.. ఆమెనే హైలెట్ కావడంపై చర్చ! -
మారుతి, ప్రభాస్ సినిమా షురూ.. టైటిల్ ఇదేనా?
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమే. ప్రభాస్, మారుతి కాంబినేషన్లోని సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్ర నిర్మాణసంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో పూజా కార్యక్రమాల జరిగాయి. ఇటలీలో ఉండటంవల్ల ప్రభాస్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనలేదు. హారర్–కామెడీ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించ నున్నారని, ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. -
50 శాతం పూర్తి.. వీసా కోసం వెయిటింగ్
కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన యువ నటుడు అవసరాల శ్రీనివాస్. అష్టా చమ్మా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల కొద్ది రోజుల్లోనే ఊహలు గుస గుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. రెండో ప్రయత్నంగా జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్‌పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్ ద్వారా స్పందించింది. ‘నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయింది. చాలా అద్భుతంగా సినిమా రూపొందుతోంది. మిగతా షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్ఏ షెడ్యూల్ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత వివేక్ కూచిభొట్ల ట్వీట్ చేశారు. ఇక అశ్వథ్థామతో హిట్ ట్రాక్‌లో వచ్చిన యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలో జోరుపెంచాడు. అవసరాల శ్రీనివాస్‌తో ఓ సినిమా రూపొందుతుండగానే.. లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. చదవండి: ‘అశ్వథ్థామ’ మూవీ రివ్యూ 'ముద్దు సన్నివేశం నాకు తెలియకుండానే తీశారు' -
డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్ ఫిలిం
ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ అవేర్నేష్ ఫిల్మ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంఎల్ఏ, వైఫ్ ఆఫ్ రామ్, గూఢచారి, ఓబేబి లాంటి వైవిధ్యమైన, విజయవంతమైన చిత్రాలు నిర్మించి అభిరుచి గల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్యల క్రేజీ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ చిత్రాన్ని, అలాగే అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం అనే అంతర్జాతీయ చిత్రాన్ని కూడా ఈ సంస్థలో నిర్మిస్తున్నారు. అయితే... కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా, సామాజిక స్పృహకు సంబంధించిన విషయాలలో కూడా ప్రజలలో అవగాహన కల్పించాలనే సదుద్దేశ్యంతో సోషల్ అవేర్నెస్ ఫిల్మ్స్ ను నిర్మిస్తున్నారు సంస్థ నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల. ఎ.ఎన్.టి ప్రొడక్షన్స్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా సోషల్ అవేర్నస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR)’ లో భాగంగా వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఈ చిత్రానికి ఆర్తి శ్రీవాత్సవ దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె దర్శకత్వం వహించిన ల్యాండ్ ఆఫ్ విడోస్, వైట్ నైట్ ఈ రెండు డాక్యుమెంటరీస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకున్నాయి. ఇప్పుడు మహిళలకు శుభ్రత విషయంలో అవగాహన కల్పించేందుకు గాను ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డ్వేన్ బ్రావో తన అధికారిక ఫేస్ బుక్ పేజ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ చిత్ర విశేషాలను దర్శకురాలు ఆర్తి శ్రీవాత్సవ తెలియచేస్తూ.. ‘డ్వేన్ బ్రావోతో ఈ సినిమాని రూపొందిస్తున్నందుకు చాలా సంతోషంగాను, గర్వంగాను ఉంది. జులైలో తమిళనాడులో షూటింగ్ జరిగింది. దీంతో ఇండియలో షూటింగ్ పూర్తయ్యింది. ఆగష్టులో వెస్టిండీస్ లోని ట్రినిడాడ్, టోబాగోలలో షూటింగ్ చేయనున్నాం’ అని తెలిపారు. -
తెర పైకి క్రికెటర్ బ్రావో
తక్కువ కాలంలోనే మంచి కాంబినేషన్‌తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకొన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను ఎనౌన్స్ చేశారు. అది కూడా ప్రముఖ వెస్టీండీస్ ఆల్‌రౌండర్ డారెన్ బ్రావోతో కావడం విశేషం. ప్రస్తుతం సమంత ముఖ్యపాత్రలో ‘ఓ బేబి’, వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ చిత్రాన్ని నిర్మిస్తోందీ సంస్థ. అలాగే అనుష్క, మాధవన్ కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘డారెన్ బ్రావోతో ఓ షార్ట్ ఫిలింను ప్లాన్ చేశాం’’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తెలిపారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా శనివారం బ్రావో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒప్పందం జరిగింది. కోయంబత్తూర్, తమిళనాడు, వెస్ట్ండీస్లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు, టి.జి.విశ్వప్రసాద్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్లై పాల్గొన్నారు. -
వెస్టిండీస్ క్రికెటర్‌తో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను నిర్మించనుంది. ఈ విషయాన్ని సంస్థ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ వెల్లడించారు. ఈ సంస్థ ప్రస్తుతం సమంత అక్కినేని ప్రధాన పాత్రలో ఓ బేబి, విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ వెంకీ మామ, అనుష్క, మాధవన్, కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ కాంబినేషన్లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ సైలెన్స్, నాగశౌర్యతో మరో సినిమాను నిర్మిస్తోంది. ఈ సంస్థ మరో ముందడుగు వేసి ప్రపంచ ప్రఖ్యాత వెస్టిండీస్ క్రికెట్ ఆటగాడు డ్వేన్ బ్రావోతో, తమ సంస్థ ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CRS)లో భాగంగా ఓ షార్ట్ ఫిలింను నిర్మించబోతోంది. దీనికి సంబంధించి శనివారం ఒప్పందాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్ళైలు పాల్గొన్నారు. సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించి రూపొందే ఈ లఘు చిత్రం కోయంబత్తూర్, తమిళనాడుతో పాటు వెస్టిండీస్ లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. రేపటినుంచి కోయంబత్తూర్‌లో షూటింగు ప్రారంభమవుతుందని, మరిన్ని వివరాలను త్వరలోనే మీడియాకు తెలుపుతామన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.