టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థపై సీనియర్ డైరెక్టర్ ఆగ్రహం.. కారణమేంటి? | Director Vn Aditya Comments On People Media Factory | Sakshi
Sakshi News home page

Vn Adithya: పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు వీఎన్ ఆదిత్య ఫైర్

Published Mon, Jul 1 2024 1:38 PM | Last Updated on Mon, Jul 1 2024 3:00 PM

Director Vn Aditya Comments On People Media Factory

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే, నేనున్నాను లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. అలాంటిది ఇతడు గత కొన్నేళ్లుగా మూవీస్ తీస్తున్నప్పటికీ అవి రిలీజ్ కావడం లేదు. అయితే అందుకు గల కారణాన్ని ఇప్పుడు ఈయనే బయటపెట్టాడు. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో దర్శకుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రస్తుతం.. 'మిస్టర్ బచ్చన్, విశ్వం, మా కాళి, స్వాగ్ సినిమాలని నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల గురించి టీమ్ అంతా చర్చించుకున్నామని చెప్పి ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీనికి బదులిస్తూనే దర్శకుడు వీఎన్ ఆదిత్య షాకింగ్ కామెంట్స్ చేశారు.

"నా మూడు సెన్సిబుల్ సినిమాలు ఈ సంస్థ ద్వారా విడుదల అవుతాయని గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నా. మీ కంపెనీ పెద్దలు నా సినిమాల విడుదల గురించి అరక్షణం ఆలోచిస్తే సరిపోతుంది. నేను సహనం కోల్పోయా. అందుకే ఇలా అడగాల్సి వస్తోంది' అని వీఎన్ ఆదిత్య ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టారు. ఈయన డైరెక్ట్ చేసిన లవ్@ 65, మర్యాద కృష్ణయ్య, మీరెవరు లాంటి మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికి ఏళ్లకు ఏళ్లు జాప్యం చేస్తుండటంత వీఎన్ ఆదిత్య ఇలా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరి దీనికి సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement