శర్వానంద్‌కు జోడీగా కృతీ శెట్టి.. స్పెషల్‌ వీడియో రిలీజ్‌ | Krithi Shetty In Sharwanand 35th Movie, Team Released Special Video On Her Birthday Goes Viral - Sakshi
Sakshi News home page

Krithi Shetty In Sharwa 35 Movie: శర్వానంద్‌కు జోడీగా కృతీ శెట్టి.. బర్త్‌డే స్పెషల్‌ వీడియో రిలీజ్‌

Published Thu, Sep 21 2023 12:38 PM | Last Updated on Thu, Sep 21 2023 12:56 PM

Krithi Shetty in Sharwanand Movie, Video Released - Sakshi

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మిస్తోంది. ఈ సంస్థ నిర్మిస్తున్న చిత్రాల్లో శర్వానంద్ 35వ సినిమా ఒకటి. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్, హీరో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి చిత్రం ఉప్పెన తోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన కృతి శెట్టి ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా నటిస్తోంది.

ఈరోజు కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో కృతి శెట్టి అందంగా, క్యూట్ గా కనిపిస్తూ మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ మినహా మిగతా షూటింగ్ మొత్తం పూర్తయింది. అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాల వేగం పెంచనున్నారు.

ఈ చిత్రంలో శర్వానంద్ ఇంట్రెస్టింగ్ పాత్రలో కనిపించనున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ చేస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు.జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

చదవండి: అట్లీ తీరుపై కోపంగా నయన్.. ఆమెనే హైలెట్‌ కావడంపై చర్చ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement