
చిరంజీవి, వెంకటేశ్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారా? అంటే... అవుననే సమాధానమే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇటీవల ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. సాహు గారపాటి, సుష్మితా కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.
ఇక ఈ సినిమాలోని అతిథి పాత్రలో వెంకటేశ్ నటించనున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాప్రారంభోత్సవంలో చిరంజీవిపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి వెంకటేశ్ క్లాప్ కొట్టారు... సో.. అతిథి పాత్ర చేస్తున్నారు కాబట్టిప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొన్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.