‘ఖుషి, హాయ్ నాన్న’ వంటి చిత్రాల్లోని బీట్స్ ప్రేక్షకుల హార్ట్ బీట్‌ని టచ్ చేశాయి. అందుకే జస్ట్ రెండు మూడు చిత్రాలతో సంగీతదర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాగలిగారు హేషమ్ అబ్దుల్ వహాబ్. ఇప్పుడు ‘మనమే’కి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు హేషమ్. శర్వానంద్, కృతీ శెట్టి జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్ ప్రోడక్షన్‌లో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మనమే’ గురించి, ఇతర విశేషాలను సంగీతదర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ విధంగా పంచుకున్నారు.
⇒
సంగీతానికి ప్రాధాన్యం ఉన్న సినిమా చేయడం ఏ సంగీతదర్శకుడికైనా ఆనందంగా ఉంటుంది. ‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి. నా గత చిత్రాలకన్నా ఈ చిత్రానికి ఎక్కువ హార్డ్‌వర్క్ చేశాను. ముందు 16 పాటలు ఉంటాయని ఊహించలేదు. కానీ శ్రీరామ్ ఆదిత్య కథని మలిచిన తీరు ఎక్కువ పాటలకు స్కోప్ ఇచ్చింది. ఫస్టాఫ్‌లో పది, సెకండాఫ్‌లో ఆరు పాటలు అవసరం అవుతాయని కంపోజ్ చేసేటప్పుడు అర్థం అయింది. పదకొండు ఫుల్ సాంగ్స్, మిగతావి బిట్ సాంగ్స్‌లా వస్తాయి ∙నా గత చిత్రం ‘హాయ్ నాన్న’లో తండ్రీ కూతురు ఎమోషన్ ఉంటుంది. ‘మనమే’లో కూడా పేరెంటింగ్ ప్రాధాన్యమైన అంశం. అయితే రెండు కథలు పూర్తిగా వేరు. ‘మనమే’లో పేరెంటింగ్ అనే ఎమోషన్‌తో పాటు ఇంకా చాలా రకాల ఎమోషన్స్ ఉన్నాయి
⇒
‘మనమే’లో 16 పాటలు ఉన్నాయి కాబట్టి మిగతా సినిమాలకన్నా ఎక్కువ పారితోషికం తీసుకున్నారా? అని అడిగితే... ఓ క్రియేటర్‌గా మనీ గురించి కాకుండా మానసిక తృప్తి ముఖ్యం అనుకుంటాను. ఆ విధంగా చూస్తే ‘మనమే’ నాకు పూర్తి సంతృప్తిని ఇచ్చింది. సంగీతం పట్ల నాకు ఉన్న అవగాహనను పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశం దక్కింది. అలాగే నా పనికి తగ్గ పారితోషికం కూడా దక్కింది (నవ్వుతూ). నా గత చిత్రాలు, ఇప్పుడు ‘మనమే’ వంటి మంచి ప్రాజెక్ట్‌కి చాన్స్ దక్కడం ఆశీర్వాదంలా భావిస్తున్నాను
⇒
ఫలానా సినిమాలో ఉన్న అలాంటి బీట్ ఇవ్వండి అంటూ ఇప్పటివరకూ ఏ దర్శకుడూ అడగకపోవడం నా లక్. మంచి ట్యూన్‌ని ఆదర్శంగా తీసుకోవడం తప్పేం కాదు. కానీ నా వరకూ ఒరిజినల్ ట్యూన్ ఇవ్వాలనుకుంటాను. ఒకవేళ డైరెక్టర్ అడిగితే... ఆయన చెప్పిన ట్యూన్ కథలోని సందర్భానికి తగ్గట్టుగా ఉందనిపిస్తే అప్పుడు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేయడానికి ట్రై చేస్తాను ∙ప్రస్తుతం రష్మికా మందన్నా నటిస్తున్న ‘గర్ల్ ఫ్రెండ్’కి వర్క్ చేస్తున్నాను. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్‌లో సాగే సినిమా చేయడం నాకు ఇదే ఫస్ట్ టైమ్. ఇదో కొత్త అనుభవం. ఇక తెలుగు పరిశ్రమ చాలా గొప్పది. ఎంతమంది వచ్చినా ఇక్కడ అవకాశం ఉంటుంది... ్రపోత్సాహం ఉంటుంది. అందుకే కేరళ నా ఫస్ట్ హోమ్ అయితే హైదరాబాద్ నా సెకండ్ హోమ్ అంటాను.
Comments
Please login to add a commentAdd a comment