
టాలీవుడ్ హీరో నాని, శ్రీకాంత్ ఓదెలా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ సినిమా 'ది ప్యారడైజ్'(The Paradise ).. పోస్టర్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సినీ ప్రేక్షకులను మెప్పించిన ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ ప్రారంభం కాకుండానే ఓటీటీ ఢీల్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. కేవలం గ్లింప్స్‌తోనే సంచలనం క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో నాని అసంతృప్తితో ఉన్నారని, కొన్ని మార్పులు చేయాలని కోరినట్లు వైరల్ అయింది. ఆపై బడ్జెట్ కూడా భారీగానే పెరిగిపోవడం వల్ల ఈ సినిమాను ఆపేస్తున్నారని కథనాలు వచ్చాయి. అయితే, ఈ అంశంపై చిత్ర యూనిట్ గట్టిగానే రియాక్ట్ అయింది.
సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు రూమర్స్ వైరల్ చేసేవారిని జోకర్స్‌తో పోలుస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'ది ప్యారడైజ్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అనుమానాలు వద్దు. మేము అనుకున్నట్లుగానే పనులు జరుగుతున్నాయి. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా తెరకెక్కిస్తున్నాం. దానిని మీరందరూ కూడా త్వరలో చూస్తారు. ఆ సమయం వరకు రూమర్స్‌తో కొందరు బతికేయవచ్చు. 'గజరాజు నడుస్తూ ఉంటే..గజ్జి కుక్కలు అరుస్తాయి'. ది ప్యారడైజ్ సినిమాపై అభిమానులు చూపించే ప్రేమను మేము చాలా దగ్గరగా చూస్తునే ఉన్నాం.

ఆపై ఈ మూవీపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని కూడా గమనిస్తున్నాం. మేము ప్రేమ, ద్వేశాన్ని రెండూ తీసుకుంటాము. వాటన్నిటితో ఒక శక్తిగా మీ ముందుకు తిరిగొస్తాం. తెలుగు పరిశ్రమలో ఉండే గొప్ప చిత్రాలలో ఒకటిగా ఈ మూవీ ఉంటుంది. సినిమాపై రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము.. ఫ్యాన్స్ అందరూ మెచ్చేలా ప్యారడైజ్ సినిమాతో నాని తిరిగొస్తాడని మాట ఇస్తున్నాం.' అని ఒక చిత్ర యూనిట్ ఒక పోస్ట్ చేసింది.
హిట్ 3 టీజర్‌లో మోస్ట్ వయోలెంట్ ఆఫీసర్‌గా కనిపించిన నాని దానికి మించిన రేంజ్‌లో ది ప్యారడైజ్‌లో కనిపంచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వచ్చే సంవత్సరం మార్చి 26న ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇంగ్లీష్, స్పానిష్ సహా 8 భాషలలో ది ప్యారడైజ్ విడుదల కానుంది.
To all 🤡s out there, you feed on us... because we let you do so.#TheParadise is rising in all its glory. Rest assured, it is on the right track. And you all will witness it soon.
Meanwhile, keep feeding on us as much as you can. Because...'Gajaraju nadiste..Gajji kukkalu…— THE PARADISE (@TheParadiseOffl) April 2, 2025