ప్రస్తుతం దక్షిణాదిలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పలు పాన్ ఇండియన్ సినిమాలతో ఇతడు బిజీగా ఉన్నాడు. తమిళ, తెలుగు అనే తేడా లేకుండా ప్రతిచోట తమన్ పాటలు అదరగొట్టేస్తున్నాయి. ఎప్పుడు ఎంతో బిజీగా ఉండే ఇతడితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఓ మ్యూజికల్ ఈవెంట్ ప్లాన్ చేసింది.
(ఇదీ చదవండి: పాయల్ రాజ్‌పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!)
అమెరికాలోని డల్లాస్‌లో తమన్ అతి పెద్ద మ్యూజికల్ ఈవెంట్ చేయబోతున్నాడు. స్పైస్ టూర్ పేరుతో జరిగే ఈ కార్యక్రమం జూన్ 1న ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలో గుంటూరు కారం నుంచి 'దమ్ మసాలా' అంటూ తమన్ చేసిన హంగామాని చూపించారు. ఇప్పటివరకు డల్లాస్ లో జరగనంత భారీ ఎత్తున ఈ మ్యూజికల్ ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment