ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య‌కు గౌర‌వ‌ డాక్ట‌రేట్‌ | VN Aditya Gets Doctorate From America George Washington University Of Peace | Sakshi
Sakshi News home page

VN Aditya: ద‌ర్శ‌కుడికి డాక్ట‌రేట్‌.. అమ్మ‌కు అంకిత‌మిస్తున్నానంటూ..

Feb 24 2024 9:05 PM | Updated on Feb 24 2024 9:05 PM

VN Aditya Gets Doctorate From America George Washington University Of Peace - Sakshi

"మనసంతా నువ్వే", "నేనున్నాను" వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త సంపాదించుకున్నారు డైరెక్ట‌ర్ వీఎన్ ఆదిత్య. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. బెంగళూరులో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్‌ల‌ను ప్రదానం చేసింది.

ఈ డాక్టరేట్ గౌరవాన్ని..
అందులో సినీ రంగం నుంచి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి, నేషనల్ SC & ST కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. 'ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నాను.

నాకే కాదు అమ్మకు కూడా..
నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన చిత్ర‌ రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్నిచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ పీస్ వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను' అన్నారు. ఈ సందర్భంగా ఆయనకు చిత్ర పరిశ్రమ నుంచి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement