కన్నప్పలో ప్రభాస్‌ రోల్.. ఎంతసేపు కనిపిస్తారంటే? | Manchu Vishnu Interesting Comments On Prabhas Role Time In Kannappa Movie, More Details Inside | Sakshi
Sakshi News home page

Kannappa Movie: కన్నప్పలో ప్రభాస్‌ రోల్.. మంచు విష్ణు ఏం చెప్పారంటే?

Jun 24 2025 10:15 PM | Updated on Jun 25 2025 12:08 PM

manchu Vishnu Comments On Prabhas Role Time In Kannappa Movie

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న కన్నప్ప రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నెల 27న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో ప్రభాస్‌, మోహన్ లాల్, అక్షయ్ కుమార్,  కాజల్ అగర్వాల్ లాంటి సూపర్ స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే కన్నప్ప మూవీకి సంబంధించిన ఓవర్‌సీస్‌ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి తెలుగు ఆడియన్స్‌కు కూడా బుకింగ్స్ ఓపెన్ కానున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మంచు విష్ణు.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ పాత్రలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి కేవలం పది రోజులు మాత్రమే కాల్‌ షీట్స్ తీసుకున్నామని తెలిపారు. ఈ సినిమాలో ప్రభాస్ దాదాపు 30 నిమిషాల పాటు కనిపిస్తారని చెప్పారు. ఈ ముగ్గురి షూట్ కోసం సెట్ మొత్తం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని పూర్తి చేశామని వెల్లడించారు.

సెన్సార్ పూర్తి

తాజాగా కన్నప్ప మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ మూవీ రన్‌టైమ్ దాదాపు 182 నిమిషాలుగా ఉంది. మైథలాజికల్ నేపథ్యంలో వస్తోన్న మూవీ కావడంతో రన్‌టైమ్‌ కాస్తా ఎక్కువగానే వచ్చింది. దాదాపు 195 నిమిషాల నిడివితో ఈ సినిమాను తెరకెక్కించగా.. సెన్సార్‌ బోర్డ్ 12 కట్స్ చెప్పింది. ఈ మేరకు సీబీఎఫ్‌సీ నిబంధనల ప్రకారం చిత్రంలో మార్పులు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement