మంచు విష్ణు హీరోగా నటిస్తున్న మూవీ 'కన్నప్ప'. గతంలో వచ్చిన 'భక్త కన్నప్ప'లానే ఇది కూడా డివోషనల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన సినిమా. కాకపోతే విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోలందరూ ఇందులో కీలక పాత్రలు పోషించారు. కొన్నిరోజుల క్రితం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టీజర్ స్క్రీనింగ్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)
ఇకపోతే టీజర్ మొత్తం యాక్షన్ సీన్స్‌తో నింపేశారు. అలానే శివుడిగా అక్షయ్ కుమార్ దర్శనమిచ్చాడు. నుదుట అడ్డ నామాలతో ప్రభాస్ కేవలం ఒకే ఒక్కే సెకను కనిపించాడు. ఇకపోతే ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా హీరో మంచు విష్ణు.. 'కన్నప్ప' గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమా తీయమని తనకు శివుడు చెప్పాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
'2019లో న్యూజిలాండ్‌కి వెళ్లేటప్పుడు నాన్నగారు పిలిచి.. డైరెక్టర్‌ని ఇంకా ఫిక్స్ చేయలేదు. నువ్వు మాత్రం లొకేషన్స్ చూస్తూనే ఉన్నావ్ ఏంటి? అని అడిగారు. నాన్న.. పరమేశ్వరుడు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఆ రోజు నేను తీయడానికి ప్రిపేర్డ్‌గా ఉండాలనే నేను మొత్తం హోమ్ వర్క్ అంతా చేస్తున్నానని అన్నాను. గతేడాది జనవరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు, ఇప్పుడు తీయ్ కన్నప్ప అని. ఇది మీ ముందుకు తీసుకురావడానికి శివుడు ఆశీస‍్సులే కారణం' అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్)
కన్నప్ప సినిమా తియ్యమని శివుడు చెప్పాడు - @iVishnuManchu #ManchuVishnu #Kannappa #TeluguFilmNagar pic.twitter.com/fBKY3yRSC8
— Telugu FilmNagar (@telugufilmnagar) June 14, 2024
Comments
Please login to add a commentAdd a comment