కన్నప్ప: మంచు విష్ణు చెప్పింది కాకుండా ప్రభాస్‌.. | Manchu Vishnu Says Prabhas Select His Role for Kannappa Movie | Sakshi
Sakshi News home page

కన్నప్పలో ప్రభాస్‌.. ఆసక్తికర విషయం చెప్పిన మంచు విష్ణు

Published Sat, May 11 2024 7:29 PM | Last Updated on Sat, May 11 2024 8:01 PM

Manchu Vishnu Says Prabhas Select His Role for Kannappa Movie

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి వరుస అప్‌డేట్లు వదులుతున్నారు. ఈ మధ్యే కన్నప్ప సెట్స్‌లోకి ప్రభాస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే! ప్రభాస్‌ తన పాత్ర తానే సెలక్ట్‌ చేసుకున్నాడంటున్నాడు విష్ణు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. ‘కన్నప్ప నుంచి ఏ న్యూస్‌ వచ్చినా అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. గత ఐదారు అప్డేట్లు టాప్‌లో ట్రెండ్ అయ్యాయి. నా మిత్రుడు ప్రభాస్ షూట్‌లో జాయిన్ అయ్యాడని చెప్పిన వార్త దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. 

ప్రభాస్‌ను కలిసినప్పుడు..
కన్నప్ప కథలో చాలా గొప్ప పాత్రలున్నాయి. ఆ పాత్రలను అద్భుతమైన ఆర్టిస్టులు పోషిస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు, డై హార్డ్ ఫ్యాన్స్‌ కోసం ఓ ఆసక్తికర విషయం చెప్పాలి. ప్రభాస్‌ను కలిసినప్పుడు.. నేను కన్నప్ప సినిమా చేస్తున్నా.. నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలని చెప్పాను. అందుకాయన ‘కథ బాగా నచ్చింది నాకు ఫలానా పాత్ర ఇంకా బాగా నచ్చింది.. ఆ క్యారెక్టర్‌ నేను చేయొచ్చా?’ అని అడిగారు. ఏ కారెక్టర్‌ అయితే ప్రభాస్‌కు బాగా నచ్చిందో అదే పాత్రను పోషించారు. 

అద్భుతమైన అప్‌డేట్
త్వరలోనే ఒక్కో పాత్రను మీ ముందుకు తీసుకొస్తాను. అధికారికంగా ఆ పాత్రల గురించి మేం చెప్పినప్పుడే నమ్మండి. బయట వచ్చే వాటిని నమ్మకండి. సోమవారం నాడు మీకు అద్భుతమైన అప్‌డేట్ ఇవ్వబోతున్నాము’ అన్నాడు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్‌గా ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీ పని చేస్తున్నారు.

చదవండి: నా కన్నా మా అక్కే అందంగా ఉండేది.. టార్చర్‌ పెట్టా: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement