Mohan Lal
-
ది రాజాసాబ్ భామకు క్రేజీ ఆఫర్.. ఆ స్టార్ నటుడితో తొలిసారి!
గతేడాది తంగలాన్‌తో సూపర్ కొట్టిన హీరోయిన్ మాళవిక మోహనన్. కొత్త ఏడాదిలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం రెబల్ స్టార్ సరసన ది రాజాసాబ్‌లో కనిపించనుంది. మారుతి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రాజెక్ట్ లైన్లో ఉండాగానే మరో క్రీజీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది ముద్దుగుమ్మ.మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ చిత్రంలో మాళవిక నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మాలీవుడ్ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ హృదయపూర్వం అనే టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మాళవిక మోహనన్‌ను ఎంచుకున్నట్లు మాలీవుడ్‌లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే మాళవిక తొలిసారి మోహన్ లాల్‌తో జతకట్టనుంది. ఈ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఫిబ్రవరి 10న కొచ్చిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.మాళవిక విషయానికొస్తే పట్టం పోల్ (2013)సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత బియాండ్ ది క్లౌడ్స్, పెట్టా (2019), మాస్టర్ (2021) చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది విక్రమ్ మూవీతో విభిన్నమైన పాత్రతో అభిమానులను మెప్పించింది. అంతేకాకుండా యుధ్రా సినిమాతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ పాన్ ఇండియా చిత్రం ది రాజాసాబ్‌లో కనిపించనుంది. ఇటీవల మాళవిక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రం 2025 వేసవిలో గ్రాండ్ రిలీజ్ కానుంది. -
ఓటీటీకి మోహన్ లాల్ డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal) నటించిన చిత్రం 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్లో మరో డిజాస్టర్‌గా నిలిచింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈనెల 22 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించారు. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు.బరోజ్ 3డీ కథేంటంటే..ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. Step into the magical world of Barroz: The Guardian of Treasures, streaming from January 22nd on Disney+ Hotstar.@mohanlal @antonypbvr @aashirvadcine @santoshsivan @aaroxstudios#DisneyPlusHotstar #DisneyPlusHotstarMalayalam #Barroz #Mohanlal #TheCompleteActor #Fantasy… pic.twitter.com/azNNowsbSw— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) January 20, 2025 -
ఓటీటీకి మోహన్ లాల్ ఫాంటసీ మూవీ.. పార్ట్నర్ ఫిక్స్
మలయాళీ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal) నటించిన లేటేస్ట్ మూవీ 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది.తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుందని ఓటీటీ సంస్థ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ ఈ చిత్రంలో కనిపించారు.(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్)బరోజ్ 3డీ కథేంటంటే.. ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ. View this post on Instagram A post shared by Disney+ Hotstar Malayalam (@disneyplushotstarmalayalam) -
భారీ బడ్జెట్ చిత్రాలు.. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్స్!
కాలం ఎవరి కోసం ఆగదు. కాలంతో పాటే మనం పరిగెత్తాల్సిందే కానీ నీకోసం ఈ ప్రపంచంలో ఏది వేచి ఉండదు. అలా కర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కాలం. చూస్తుండగానే మరో ఏడాది కనుమరుగవుతోంది. ఈ కాలమనే భూగర్భంలో 2024 కలిసిపోనుంది. కొత్త ఆశలతో మరో ఏడాది అందరికీ స్వాగతం పలుకుతోంది. ఈ ఏడాది అయినా సక్సెస్ సాధించాలని కోరుకునే వాళ్లే ఎక్కువ కనిపిస్తారు. మరి ఈ ఏడాది సినీ పరిశ్రమకు కలిసొచ్చిందా? లేదా? అనేది చూద్దాం.మరి ఈ ఏడాది సినీ పరిశ్రమ కొంతవరకు సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ వద్ద కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్తీ-2 లాంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అయితే కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అనూహ్యంగా చతికిలపడ్డాయి. భారీ అంచనాలతో రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయాయి. మరి 2024లో విడుదలై బాక్సాఫీస్ డిజాస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో మనం ఓ లుక్కేద్దాం. ఇండియన్-2- నిరాశపరిచిన సీక్వెల్28 ఏళ్ల క్రిత శంకర్ డైరెక్షన్లో వచ్చిన చిత్రం ఇండియన్(భారతీయుడు). ఈ మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కించారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వచ్చిన ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా కమల్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. కమల్ హాసన్ నటనతో మెప్పించినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.సూర్య కంగువాకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం కేవలం రూ.100 కోట్లకు పైగా నెట్ వసూళ్లు మాత్రమే సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజైన చిత్రాల్లో బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.రామ్ పోతినేని- డబుల్ ఇస్మార్ట్ సీక్వెల్రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో గతంలో వచ్చిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో అదే కాన్ఫిడెన్స్‌తో డబుల్ ఇస్మార్ట్ పేరుతో సీక్వెల్‌ను తీసుకొచ్చారు పూరి జగన్నాధ్. ఈ ఏడాది విడుదలైన ఈ చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ నటన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం డిజాస్టర్‌గా పేరును దక్కించుకుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు.మోహన్ లాల్- మలైకోట్టై వాలిబన్మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ మలైకోట్టై వాలిబన్. భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం వీజువల్ ఫీస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ ఫెయిల్యూర్‌గా నిలిచింది. కథ, మోహన్ లాల్ నటన మెప్పించినప్పటికీ స్క్రీన్‌ప్లే మైనస్ కావడంతో బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. వాలిబన్ అనే ఓ యోధుని కథ ఆధారంగా ఈ మూవీని తీసుకొచ్చారు. కాగా.. ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించారు.మహేశ్ బాబు- గుంటూరు కారంఈ ఏడాది సంక్రాంతికి రీలీజైన టాలీవుడ్ చిత్రం గుంటూరు కారం. మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈచిత్రం అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు గతంలో సూపర్ హిట్స్ కావడంతో అదేస్థాయిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా అభిమానులను ఆకట్టుకుంది.మరోవైపు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, క, వాజై, మెయిజగన్ వంటి చిత్రాలు పెద్ద కమర్షియల్ హిట్ సాధించాయి. భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. -
పడుచు హీరోయిన్లతో సీనియర్ హీరోల రొమాన్స్.. 'తప్పేముంది?'
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు కానీ హీరోలు మాత్రం అలాగే ఉంటారు. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వచ్చిందంటే వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు. ఈ క్రమంలో వారి వయసుకు తగ్గ కథానాయికలతో కాకుండా కుర్ర హీరోయిన్లతోనూ స్టెప్పులేస్తున్నారు. అయితే ఇందులో తప్పే లేదంటున్నాడు మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal).అందులో తప్పేం లేదుతాజాగా ఓ ఇంటర్వ్యూలో మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ఈ పద్ధతి ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఎప్పటినుంచో మన ఇండస్ట్రీ ఇలాగే ఉంది. తెలుగు (Tollywood), తమిళంలోనూ ఇదే కొనసాగుతోంది. నువ్వు ఆరోగ్యంగా ఉంటే వంద ఏళ్లు వచ్చినా సరే యాక్ట్ చేయొచ్చు. ఎలాంటి పాత్రల్ని ఎంచుకుంటున్నావనేది నీ చేతిలో ఉంటుంది. నీకు అసౌకర్యంగా అనిపిస్తుందంటే అలాంటి అవకాశాలను వదిలేసుకోవడమే మంచిది. కానీ జనాలు మిమ్మల్ని ఆయా పాత్రల్లో ఇష్టపడుతుంటే వాటిని అంగీకరించడంలో తప్పేం లేదు. యాక్టింగ్ అనేది ఒక పర్ఫామెన్స్ అంతే! దానికి వయసుతో సంబంధం లేదు. కేవలం అక్కడ ఎటువంటి పాత్ర చేస్తున్నావన్నది నీపై ఆధారపడి ఉంటుంది అన్నాడు.చదవండి: 2025 ప్రారంభంలో ఓటీటీలో రిలీజయ్యే కొత్త సినిమాలు, సిరీస్‌లు ఇవే!ఏదీ ఆలోచించలేదుభవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు.. ఏదీ చేయాలనుకోవడం లేదు. నా జీవితంలో అన్నీ వాటికవే జరిగిపోతున్నాయి. ఇప్పుడు సినిమాలు (Movies) చేస్తున్నాను. కాబట్టి ఇంకా దేని గురించీ ఆలోచించట్లేదు. ఒకవేళ ఏదైనా జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. జీవితం అనేది ఒక ప్రవాహం.. అది ఎటు తీసుకెళ్తే అటు సాగిపోతూ ఉండాలి అని చెప్పుకొచ్చాడు.అదే పెద్ద మార్పుసినిమా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులపై స్పందిస్తూ.. కాలం వేగంగా గడుస్తోంది. అన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ.. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి. ఏఐ, వీఎఫ్ఎక్స్ వల్ల సినిమాల్లో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇదే అన్నింటికంటే పెద్ద మార్పు. కానీ ఏ గ్యాడ్జెట్ కూడా ఎమోషన్స్‌ను మార్చలేవు. మన ఎమోషన్స్ మన చేతిలోనే ఉన్నాయి అని మోహన్‌లాల్ చెప్పుకొచ్చాడు.చదవండి: టాలీవుడ్ ప్రముఖ హీరో కుమారుడు.. సినిమా ఎంట్రీకి రెడీ -
దృశ్యం 3పై మోహన్ లాల్ క్లారిటీ..
-
గత 40 ఏళ్లలో ఎవరూ ఇలా ట్రై చేయలేదు: మోహన్‌లాల్ కామెంట్స్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'బరోజ్'(Barroz) ఈ ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ మూవీని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాను తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాత యలమంచిలి రవి పాల్గొన్నారు. అయితే ఈ సినిమాను 3డీ వర్షన్లో తెరకెక్కించడం మరో విశేషం. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో మోహన్ లాల్ తెలుగు సినీఇండస్ట్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్)మోహన్ లాల్ మాట్లాడుతూ..'తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి. పుష్ప లాంటి పెద్ద సినిమాను మనం చూశాం. తెలుగు ఆడియన్స్ ప్రతి సినిమాను గౌరవిస్తారు. బరోజ్ రిలీజ్ చేస్తున్నందుకు మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. గత 40 ఏళ్లలో ఎవరూ ప్రయత్నించని నేటివ్ 3డిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సరికొత్త విధానంలో కథను పరిచయం చేస్తున్నాం. కొత్త ఆలోచనతో బరోజ్‌ను తీశాం. ఈ సినిమా చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఇది మీలోని పసితనాన్ని గుర్తు చేస్తుంది.' అని అన్నారు. 'We shot the film as Native 3D which over the 40years nobody has tried. It will enhance the child in you❤🔥' - @Mohanlal Garu at #Barroz event ✨#Barroz Grand release worldwide tomorrow 💥💥#Barroz3D Telugu release by @MythriRelease ❤🔥@aashirvadcine @antonypbvr… pic.twitter.com/KxV2Mt1u1A— YouWe Media (@MediaYouwe) December 24, 2024 'Telugu industry is the biggest film industry and they respect films and deliver blockbusters like #Pushpa2TheRule ❤🔥' - @Mohanlal Garu at #Barroz event ✨#Barroz Grand release worldwide tomorrow 💥💥#Barroz3D Telugu release by @MythriRelease ❤🔥@aashirvadcine… pic.twitter.com/bxplRH2nUu— YouWe Media (@MediaYouwe) December 24, 2024 -
'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ 'బరోజ్ 3డీ'. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మోహన్ లాల్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.→బరోజ్ త్రీడీ ఫాంటసీ ఫిల్మ్. ఇప్పటివరకూ మలయాళం నుంచి మూడు త్రీడీ సినిమాలే వచ్చాయి. అయితే బరోజ్ లో ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చాలా యూనిక్ గా సినిమాని రూపొందించాం. సినిమా అద్భుతంగా వచ్చింది. విజువల్ వండర్ తో పాటు స్టొరీ టెల్లింగ్ ని రీడిస్కవర్ చేసేలా ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరికీ నచ్చేలా ఉంటుంది. గత నలభై ఏళ్ళుగా ఇలాంటి సినిమా రాలేదు. దర్శకుడిగా ఇది నాకు కొత్త అనుభూతి. దర్శకుడిగా తొలి సినిమానే త్రీడీలో చేయడం సవాలుగా అనిపించింది. టీం అందరూ చాలా సపోర్ట్ చేశారు.→గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్ నవలను ఆధారంగా చేసుకొని ఒక ఇమాజనరీ అడ్వంచర్ కథని రూపొందించాం. వాస్కో డి గామాలో దాగి ఉన్న రహస్య నిధిని కాపాడుతూ వచ్చే బరోజ్, ఆ సంపదను దాని నిజమైన వారసుడికి అందించడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా ఉంటాయి. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్త ఉంటుంది. ప్రేక్షకులు ఓపెన్ మైండ్ తో వచ్చి ఈ ఇమాజినరీ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను.→ త్రీడీ సినిమా చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యేకమైన కెమరాలు అవసరం పడతాయి. అన్ని కెమరాల విజన్ పర్ఫెక్ట్ గా సింక్ అవ్వాలి. ప్రేక్షకడికి గొప్ప త్రీడీ అనుభూతి ఇవ్వడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం.→ ఈ సినిమాకి ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పని చేశారు. హాలీవుడ్ పాపులర్ కంపోజర్ మార్క్ కిల్లియన్ బీజీఎం ఇచ్చారు. ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. 12 ఏళ్ల లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి సాంగ్స్ కంపోజ్ చేయడం మరో విశేషం. → టాప్ లెన్స్ మ్యాన్ సంతోష్ శివన్ కెమరా వర్క్ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తుంది. విజువల్స్ ప్రేక్షకుడికి చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అలాగే గ్రాఫిక్స్ వర్క్ కూడా అద్భుతంగా ఉంటుంది. దీని కోసం యానిమేటెడ్ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేశాం. చాలా మంది హాలీవుడ్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేశారు→ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా కేర్ తీసుకొని చేశాం.ఆడియన్స్ థియేటర్స్ లో ఓ న్యూ వరల్డ్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తారనే నమ్మకం వుంది. తప్పకుండా సినిమా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. -
బంగారాన్ని కాపాడే భూతం 'బరోజ్'.. తెలుగు ట్రైలర్
మోహన్‌లాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బరోజ్’. ఫ్యాంటసీ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 25న పాన్ ఇండియా రేంజ్లో ఈ మూవీ విడుదల కానుంది.బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా చాలా ఆసక్తిగా ఉంది. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది.తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మించారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది. -
మంచు విష్ణు కన్నప్ప మూవీ.. మోహన్ లాల్ క్యారెక్టర్ రివీల్!
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ తారాగణంతో రూపొందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు.ఈ చిత్రంలో మోహన్ లాల్ కిరాటా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ సైతం నటిస్తున్నారు. ఓ యదార్థ కథ ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25,2025లో థియేటర్లలో సందడి చేయనుంది. ‘KIRATA’! The legend Sri. Mohanlal in #Kannappa. I had the honor of sharing the screen space with one of the greatest Actor of our time. This entire sequence will be 💣💣💣💣💣 ! @Mohanlal pic.twitter.com/q9imkDZIxz— Vishnu Manchu (@iVishnuManchu) December 16, 2024 -
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్‌ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్‌కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్‌లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్‌కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్‌డ్రాప్‌కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్‌లాల్ ఈ యాక్షన్ థిల్లర్‌ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్‌కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్‌కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్.. 3డీ ట్రైలర్ చూశారా?
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్స్'. ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి హిందీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే మలయాళంలో ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించనున్నాడు. అయితే ఆ సంపదను ఆయన ఎందుకు రక్షిస్తున్నాడు. చివరగా దానిని ఎవరికి అందించాలని ఆయన ప్రయత్నం చేస్తాడనేది ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్లో తెరకెక్కించారు. భారీ వీఎఫ్ఎక్స్తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో క్రిస్మస్ కానుకగా ఈ డిసెంబరు 25న విడుదల కానుంది. అయితే హిందీ వర్షన్ మాత్రం డిసెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మోహన్ లాల్ ట్వీట్ చేశారు. బాలీవుడ్లో పెన్ స్టూడియోస్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న విడుదల చేయాలని ఇది వరకే ప్రకటించారు. కానీ, నిర్మాణంతర పనులు పెండింగ్ ఉండటం వల్ల విడుదల ఆలస్యమైంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, ఈ మూవీ రిలీజ్ కానుంది.The #Barroz3D Hindi trailer is here! Thrilled to present this magical adventure in Hindi, brought to you in collaboration with #Penstudios. The Hindi version hits theatres on December 27. https://t.co/3pgb0ku861#Barroz— Mohanlal (@Mohanlal) December 11, 2024 -
ఎనిమిది రాష్ట్రాలు.. నాలుగు దేశాలు.. 14 నెలల జర్నీ: మోహన్ లాల్
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంపురన్ (లూసిఫర్-2). 2019లో విడుదలైన లూసిఫర్‌కు సీక్వెల్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మోహన్‌లాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.మోహన్ లాల్ తన ట్వీట్లో రాస్తూ..' ఎంపురాన్ 14 నెలల అద్భుతమైన ప్రయాణం. ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో పర్యటించాం. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత, అద్భుతమైన దర్శకత్వం పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్ ప్లేతో కథకు ప్రాణం పోసిన మురళీ గోపీకి ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నటుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం. ఈ కథకు పనిచేసిన తారాగణం, సిబ్బంది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతు మాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి.' అని రాసుకొచ్చారు.కాగా.. లూసిఫర్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.That’s a wrap for L2: Empuraan!What an incredible 14-month journey across 8 states and 4 countries, including the UK, USA, and UAE.This film owes its magic to the brilliant direction of Prithviraj Sukumaran whose creativity elevates every frame. A big thank you to Murali Gopy… pic.twitter.com/6bnuItDlxd— Mohanlal (@Mohanlal) December 1, 2024 -
'ప్రతి రోజు ఐదు లవ్ లెటర్స్'.. ప్రేమకథ పంచుకున్న స్టార్ నటుడి భార్య!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి తెలుగువారికి చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌తో టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాల్లోనూ నటించారు. మాలీవుడ్ స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన తెలుగులోనూ అంతే ఫేమల్ అయ్యారు. ప్రస్తుతం మంచువిష్ణు కన్నప్ప, ఎంపురన్ చిత్రాల్లో నటిస్తున్నారు.అయితే గతంలో మోహన్ లాల్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన భార్య సుచిత్ర వీరిద్దరి ప్రేమాయణం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తానే మోహన్ లాల్‌కు ప్రేమలేఖలు రాసేదాన్ని అని తెలిపింది. అదేపనిగా లవ్ లెటర్స్ రాస్తూ విసిగించేదాన్ని అంటూ తమ ప్రేమకథను వివరించింది.సుచిత్ర మాట్లాడుతూ..'నేను ఫస్ట్ టైమ్ త్రివేండ్రంలో అతన్ని కలిశా. అంతకు ముందు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేదాన్ని. దగ్గర నుంచి చూడడం అదే మొదటిసారి. మా కుటుంబాలకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారని బంధువుల పెళ్లిలో నాకు తెలిసింది. నేను కోజికోడ్‌లో ఉన్నప్పుడు సెలవుల్లో అతని సినిమాలను థియేటర్లలో చూసేదాన్ని. ఆయన మొదటి సినిమా మజిల్ విరింజ పుక్కల్ చూసినప్పుడు ఆయనపై ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. కానీ ఆయన టాలెంట్‌ను గుర్తించి ప్రేమించడం మొదలుపెట్టా' అని తెలిపింది.'ఆ తర్వాత నా పేరు రాయకుండా ఆయనకు లేఖలు రాయడం ప్రారంభించా. ప్రతి రోజు ఐదు రాసి పంపించాను. ఆయన అడ్రస్ తెలుసుకుని మరీ లెటర్స్ రాశా. నా ప్రేమలేఖలతోనే ఓ రేంజ్లో వేధించా. మా ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని సుందర కుట్టప్పన్ (అందమైన అబ్బాయి) అనే నిక్‌నేమ్‌తో పిలిచేదాన్ని. ఆ తర్వాత మా అమ్మ, నాన్నకు మోహన్‌లాల్ గురించి చెప్పా. వెంటనే నా ప్రేమను అంగీకరించి తెలిసినవాళ్లతో మాట్లాడి మా పెళ్లి చేశారు' తమ లవ్‌స్టోరీని గుర్తుచేసుకున్నారు. కాగా.. మోహన్ లాల్, సుచిత్ర వివాహం 1988లోనే జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. -
మోహన్‌లాల్ అంత తెలివితక్కువవాడు కాదు: పృథ్వీరాజ్ అమ్మ
మలయాళ చిత్రపరిశ్రమపై 'జస్టిస్ హేమ కమిటీ' ఇచ్చిన రిపోర్ట్‌తో దేశవ్యాప్తంగా అలజడి రేగింది. మలయాళ చిత్రపరిశ్రమలో పనిచేస్తున్న మహిళల పట్ల లైంగిక దాడులు జరుగుతున్నాయని ఆ రిపోర్ట్‌లో ఉంది. దీంతో చాలామంది ఈ అంశం గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయ్యారు. ఆపై మోహన్లాప్పై కూడా ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నటి మల్లికా.. మలయాళ ప్రముఖ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు అమ్మ అని తెలిసిందే.. సుమారు ఆమె 60కి పైగా సినిమాల్లో రాణించారు. కతర్ దేశంలో ఆమెకు ఆరు రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం పరిశ్రమకు దూరంగా వ్యాపారవేత్తగా ఆమె ఉన్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడారు. 'అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)లో విని మౌనంగా ఉండే వారు మాత్రమే ఇక్కడ ఇమడగలరు. నిరుపేద నటీనటులకు ఆర్థిక సహాయం అందించే చేయూత పథకంలో చాలా లోపాలు ఉన్నాయి. ఇదే విషయం ఒకసారి మా అబ్బాయితో కూడా చెప్పాను.పథకాలకు అర్హులైనవారు, వెనుకబడినవారు చాలామంది ఉన్నారు. నెలలో 15 రోజుల పాటు విదేశాలకు వెళ్తున్నవారికి చేయూత పథకాలు అందుతున్నాయి. ఇదీ ముమ్మాటికి నిజం. మందులు కొనుక్కోవడానికి డబ్బు లేని నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వారికి ఆపన్న హస్తం అందించాలి. మోహన్‌లాల్ అంత తెలివితక్కువవాడు కాదు. సంస్థలో కొన్ని తప్పులు దొర్లాయని అమ్మ మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్‌కు కూడా బాగా తెలుసు. ఇక్కడ చాలా మంది తమ స్వంత ఇష్టాలకు నిర్ణయాలు తీసుకున్నారు. అమ్మ తొలినాళ్లలో కూడా చాలా తప్పులు జరిగాయి. దాన్ని అప్పట్లో నటుడు సుకుమారన్ (ఆమె భర్త) ఎత్తి చూపారు. చట్టబద్ధంగా ప్రతి విషయాన్ని సరిదిద్దుతామని చెప్పారు. ఇది కొందరికి ఈగోల గొడవతో ముగిసింది. సుకుమారన్ చనిపోయిన తర్వాతే వారికి అది అర్థమైంది.హేమ కమిటీ నివేదిక కుండబద్దలు కొట్టిన భూతంలా ఉందని మల్లికా అన్నారు. చిత్రపరిశ్రమకు చెందిన ఒక నటిపై దాడి కేసు విషయంలో ఈ ప్రభుత్వం ఏమేరకు న్యాయం చేసిందో చెప్పాలని ఆమె కోరారు. ఇండస్ట్రీలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న ఆ హీరోయిన్ మీద హింస జరిగిన మాట వాస్తవమే అని అందరికీ తెలుసు. కానీ, ఒక్కరు నోరెత్తరని ఆమె అన్నారు. ఆ ఘటన జరిగి ఏడేళ్లు కావస్తుందని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని ఆమె కోరారు. అన్యాయం జరిగిన వెంటనే చర్యలు తీసుకుంటే మళ్లీ జరగవు కదా అని మల్లిక ప్రశ్నించారు. -
కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ కూడా విడుదల చేశారు. కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ను కాంతారా ఒక్కసారిగా మార్చేసింది. దీంతో కాంతార ప్రీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే తాజాగా కాంతార చాప్టర్-1కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి తండ్రిగా ఆయన నటిస్తారని లేటేస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిషబ్ శెట్టిని మోహన్‌లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతార గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంతారా: చాప్టర్-1 లో మోహన్‌లాల్ పాత్రపై గత రెండు రోజులుగా శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే.(ఇది చదవండి: 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం)కాగా.. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తోన్న కాంతార చాప్టర్- 1 ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
చాలా రంగాల్లో లైగిక వేధింపులు ఎక్కువగా అవుతున్నాయి. కొందరు ధైర్యం చేసి కంప్లైంట్స్ ఇస్తున్నారు. మరికొందరు ఎవరికీ చెప్పలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళలపై గతంలో జరిగిన, ఇప్పుడు జరుగుతున్న హింసపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రిటైర్డ్ నాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీ నియమించి మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలని తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు.కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఏం చెప్పారంటే?కేరళలో హేమ కమిటీ రిపోర్ట్ రిలీజైన వెంటనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. పూనమ్ కౌర్ తనకు అన్యాయం జరిగిందని ట్విటర్లో చెప్పితే ఎలా? లిఖిత పూర్వకంగా తనపై జరిగిన హింసని చెబితేనే కదా? జానీ మాస్టర్‌కి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డ్‌ని ఈ లైంగిక వేధింపుల కేసు విచారణ ముగిసే వరకు ఇవ్వకూడదని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రికి డిమాండ్ చేస్తున్నాం.షూటింగ్స్ జరిగే ప్రదేశాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి ఇలాంటి వేధింపులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఓ చట్టం తీసుకురావాలి. వానిటీ వెహికల్ తదితర సౌకర్యాల్ని తమిళనాడు లాగా నిర్మాతలు వెంటనే రద్దు చేయలి. ఈ లైంగి వేధింపుల కేసు తేలే వరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి చెప్పుకొచ్చారు. -
మాలీవుడ్‌లో మీ టూ : ‘మాకు ఆ విషయం చెప్పలేదు’
హేమ కమిటీ నివేదిక మాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ రిపోర్ట్ బయటకొచ్చాక పలువురు డైరెక్టర్స్, నటులపై పెద్దఎత్తున లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ తమకెదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్(AMMA) సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అమ్మ అధ్యక్ష పదవిలో ఉన్న మోహన్ లాల్ సైతం వైదొలిగారు. పాలక మండలి పదవుల నుంచి మొత్తం 17 మంది సభ్యులు రాజీనామాలు సమర్పించారు. వీరంతా నైతిక బాధ్యత వహిస్తూ పక్కకు తప్పుకున్నారు. దీంతో మలయాళ చిత్రమండలిని రద్దు చేశారు. రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.రాజీనామా చేయని ఇద్దరు?అయితే అమ్మ సభ్యులుగా ఉన్న మరో ఇద్దరు హీరోయిన్స్ మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. తాజాగా రద్దయిన కమిటీలో హీరోయిన్స్ సరయు, అనన్య సభ్యులుగా ఉన్నారు. అయితే రాజీనామా నిర్ణయంపై తమ సమాచారం లేదని వీరిద్దరు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ అభిప్రాయం కూడా తీసుకోలేదని ఆరోపించారు. అయితే మండలి పూర్తిగా రద్దు చేయడంతో వీరి పదవులు కూడా పోయినట్లేనని భావిస్తున్నారు.అసలేంటి హేమ కమిటీ?ఇటీవల జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదికను బహిర్గతం చేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. ఆ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఆ తర్వాత దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే మొదట అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. -
మలయాళ ఇండస్ట్రీలో మరో కుదుపు.. ఒకేసారి 17 మంది రాజీనామా
మలయాళ సినీ పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రీసెంట్గా ఓ నివేదిక సమర్పించింది. ఇందులో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మలయాళ సినిమాల్లో పనిచేసే మహిళలు.. క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటోంది. తాజాగా మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ముకుమ్మడి రాజీనామా చేశారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదం.. నెలలోనే కోలుకున్న 'ప్రేమలు' నటుడు)అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు మోహన్ లాల్ తొలుత రాజీనామా చేయగా.. పాలక మండలిలోని మిగిలిన సభ్యులందరూ ఇదే ఫాలో అయిపోయారు. ఈ మేరకు 'అమ్మ' సంఘం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీలోని కొంతమంది సభ్యులపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడమే దీనికి కారణం. దీంతో వీళ్లంతా నైతిక బాధ్యతగా రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. అలానే రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి, కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించారు.అమ్మ సంఘంలో నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. తాజాగా జస్టిస్ హేమ కమిటీ షాకింగ్ నివేదిక విడుదల చేసిన అనంతరం.. దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో మలయాళ చిత్రసీమలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌పై నోరుపారేసుకున్న జనసేన ఎమ్మెల్యే) -
సీనియర్ నటుడిపై నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు
మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్ హేమ కమిటీ ఒక నివేదికను రూపొందించింది. అందులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. మాలీవుడ్ పరిశ్రమలో ఉండే మహిళలు కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో మలయాళ నటి రేవతి సంపత్ సంచలన ఆరోపణలు చేసింది.మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ తనపై అత్యాచారం చేశాడంటూ సెన్సేషనల్ కామెంట్ నటి రేవతి సంపత్ చేసింది. ఆమె వ్యాఖ్యలతో మాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. అసోషియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (AMMA) నుంచి ఆయన తప్పుకున్నాడు. జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖను AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్‌కు అందజేశాడు.నటి రేవతి సంపత్ 2021లోనే తనను చెప్పుకోలేని విధంగా హింసించారంటూ.. ఏకంగా 14 మంది పేర్లు బయటపెట్టి ఆమె సంచలనంగా మారింది. ఆ లిస్ట్‌లో నటుడు సిద్ధిఖీ కూడా ఉన్నారు. సినిమాలపై ఆసక్తి ఉండటంతో నేను ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సోషల్‌మీడియా ద్వార సిద్ధిఖీ పరిచయం అయ్యాడు. ఆయన నటిస్తున్న సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నాకు ఆశ చూపించాడు. సుమారు ఏడేళ్ల క్రితం వచ్చిన సుఖమయిరిక్కట్టే చిత్రంలో ఆయన ప్రధాన పాత్రలో నటించారు. ఆ సమయంలో ప్రీమియర్ షోకు నన్ను కూడా ఆహ్వానించాడు. సినిమా పూర్తి అయిన తర్వాత తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు నన్ను తీసుకెళ్లి అక్కడ నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాపై అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగినందుకు నాపై దాడిచేశాడు. హోటల్ గదిలో బిక్కుబిక్కుమంటూ నరకం చూశాను. ఆ భయానక సంఘటన నుంచి నేను ఇప్పటికీ కోలుకోలేకున్నాను.' అని రేవతి సంపత్ చెప్పింది. సిద్ధిఖీ చాలా నీచమైన వ్యక్తి అంటూ తన స్నేహితులపై కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది.మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ 2019లోనే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే, అది ఇన్నేళ్ల తర్వాత బయటకు రావడంతో అక్కడి పరిశ్రమలో పెద్ద దుమారం రేగుతుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అందులో జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ అందరికీ న్యాయం చేస్తానని కామెంట్ చేసిన కొన్ని గంటల్లోనే రేవతి సంపత్ అతనిపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. -
అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!
ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురయ్యారట. ఈ మేరకు మలయాళ మీడియాలో వార్తలొస్తున్నాయి. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత, కండరాల నొప్పితో బాధపడుతున్నారని.. దీంతో కుటుంబ సభ్యులు ఈయన్ని ఆస్పత్రిలో చేర్పించారట. ఐదు రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారట.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)ఈ క్రమంలోనే మోహన్ లాల్ హెల్త్ బులెటిన్ అని ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇలా అస్వస్థత అని వార్తలు రావడంతో అభిమానులు ఏమైందోనని కంగారు పడుతున్నారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాలో కీలక పాత్ర చేసిన మోహన్ లాల్.. ఇప్పటి జనరేషన్ తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే.ప్రస్తుతం ఎల్ 2, బరోజ్ సినిమాలతో కాస్త బిజీ ఉన్న మోహన్ లాల్.. వీటి షూటింగ్ కోసం గుజరాత్ వెళ్లగా, అక్కడే అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. దీంతో తిరిగి ఊరికొచ్చేసి, ఆస్పత్రిలో జాయిన్ అయ్యారని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది ఆయన క్లారిటీ ఇస్తే తప్ప బయటకు రాదు.(ఇదీ చదవండి: టాలీవుడ్ ఆశలన్నీ నాని 'శనివారం' పైనే..) -
మోహన్ లాల్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'బరోజ్' విడుదల తేదీ ప్రకటన
ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. అయితే, తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న ఫాంటసీ చిత్రం ‘బరోజ్’. సుమారు నాలుగేళ్ల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ ను ఆపేశారు. కానీ, ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించే సమయానికి మోహన్ లాల్ అప్పటికే కమిట్ అయిన సినిమాల నుంచి ఒత్తిడి వచ్చింది దీంతో బరోజ్ షూటింగ్ పనులు చాలా నెమ్మదిగా సాగాయి.తాజాగా మోహన్ లాల్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా బరోజ్ గురించి అప్డేట్ ఇచ్చారు. 'బరోజ్' తన రహస్యాలను 3 అక్టోబర్ 2024న వెల్లడించడానికి వస్తున్నాడని విడుదల తేదీని ప్రకటించారు. అద్భుత సాహసం కోసం మీ క్యాలెండర్లో ఆ తేదీని నోట్ చేసుకోండి.' అంటూ మోహన్ లాల్ తెలిపారు. తాజాగా విడుదలైన పోస్టర్లో మోహన్ లాల్ గుండు, గుబురు గడ్డంతో ఉన్నారు. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్ కుట్టిచాతన్కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్ శివన్ పనిచేశారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. వాస్కోడిగామాకి చెందిన అపార సంపద (బంగారం,వజ్రాలు) బరోజ్ అనే ఒక భూతం 400 ఏళ్ళగా కాపాడుతూ వస్తుంది. ఆయనకు సంబంధించిన నిజమైన వారసులకు ఆ సంపదని అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్‌తో సినిమా ఉండనుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా 'బరోజ్' చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్నారు. ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాతగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 3న తెలుగు,హిందీ,తమిల్,కన్నడ,మలయాళంలో బరోజ్ సినిమా విడుదల కానుంది. -
వయనాడ్ పర్యటనలో మోహన్ లాల్, రవి.. ఆర్మీ రిటైర్డ్ అధికారి ఫిర్యాదు
కేరళలోని వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్‌తో పాటు రిటైర్డ్ మేజర్, నటుడు A. K. రవీంద్రన్ పాల్గొన్న విషయం తెలిసిందే. వయనాడ్ పర్యటన సందర్భంగా యూనిఫాం దుర్వినియోగం చేసినందుకు మేజర్ రవిపై మరో రిటైర్డ్ అధికారి ఫిర్యాదు చేశారు.విపత్తు బారిన పడిన వాయనాడ్ ప్రాంత పర్యటనలో ఆర్మీ యూనిఫాం దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సినీ దర్శకుడు, మేజర్ రవి ఎదుర్కొంటున్నారు. ఆర్మీ రిటైర్డ్ అధికారి అరుణ్ దాఖలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, రక్షణ మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సైన్యంలో పదవీ విరమణ పొందిన తర్వాత ఎవరూ కూడా మళ్లీ సైనిక యూనిఫామ్ ధరించడం నిషేధం. డిఫెన్స్ సర్వీస్ నిబంధనలను మేజర్ రవి ఉల్లంఘించారని ఆరుణ్ ఆరోపించారు. వాస్తవంగా రవీంద్రన్ ఇండియన్ ఆర్మీలో అత్యున్నత స్థానంలో పనిచేసి మేజర్ ర్యాంక్ వరకు చేరుకుని ఆపై రిటైర్డ్ అయ్యారు.అయితే, ఆర్మీ దుస్తులు ధరించి ఫోటోలు తీయడం ఆపై వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటి చర్యలకు మేజర్ రవి పాల్పడ్డారని అరుణ్ విమర్శించారు. ఇలాంటి పనులు చేయడం వల్ల సైనిక యూనిఫామ్ సమగ్రతను దెబ్బతినడంతో పాటు తీవ్రమైన భద్రతా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన నెటిజన్ల నుంచి కూడా విస్తృతమైన ఎదురుదెబ్బకు దారితీసింది, నెట్టింట కూడా మేజర్ రవి తీరును ఖండించారు.మేజర్ రవి, నటుడు మోహన్‌లాల్‌తో కలిసి వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో సందర్శించారు. విపత్తులో తీవ్రంగా దెబ్బతిన్న స్థానిక పాఠశాలను పునర్నిర్మించడానికి సహాయం చేస్తానని చెప్పి ఆ పని చేసినందుకు ఆయన్ను అందరూ అభినందించారు. కానీ, ఒక విషాదం-బాధిత ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడం వల్ల ఈ విమర్శలకు దారితీసింది. మేజర్ రవి సినిమా రంగంలో కూడా పనిచేశారు. దర్శకుడగా మాత్రమే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో మెప్పించారు. అలా ఆయనకు ఆర్మీ, సినిమా రంగాల్లో సత్తా చాటారు. -
లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో సహాయక చర్యల్లో మోహన్‌లాల్
వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 300 మందికి పైగా ఆచూకి లభించలేదు. ఈ ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో మోహన్ లాల్ పర్యటించారు. నష్టపోయిన వారికి తన వంతుగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు.మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 9 జూలై 2008న, అతను అధికారికంగా లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో టెరిటోరియల్ ఆర్మీకి అప్పటి ఆర్మీ చీఫ్ దీపక్ కపూర్ చేత చేర్చబడ్డారు. ఈ గౌరవం అందుకున్న తొలి నటుడు ఆయనే. 2012లో, అతనికి దక్షిణ కొరియాలోని కుక్కివాన్ నుంచి టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ గౌరవ బిరుదు లభించింది. ఈ బిరుదుతో సత్కరించిన తొలి దక్షిణ భారత నటుడిగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు.వయనాడ్ బాధితులకు సాయం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ముందుకొస్తున్నారు. మోహన్ లాల్ కేరళ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షలు విరాళంగా కూడా అందించారు. ఆపై ఇప్పుడు తానే బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
వయనాడ్ అప్డేట్స్: కర్నాటక ఆపన్న హస్తం
Updatesకేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఐదో రోజు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో గల్లంతైన వారిపై ఆచూకీ కోసి రెస్క్యూ బృందాలు ప్రధానంగా దృష్టిపెట్టాయి. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలు, జగిలాలను ఉపయోగించి మనుషుల జాడను గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజా గణాంకాలతో.. మృతుల సంఖ్య 358కి చేరుకుంది. ఇందులో 146 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 215 మృతదేహాలు వెలికి తీశామని, 206 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.Wayanad landslides: 215 bodies recovered, 206 people still missing, rescue ops in final stage, says Kerala CMRead @ANI Story | https://t.co/YFqTebrZCS#KeralaCM #WayanadLandslides #PinarayiVijayan pic.twitter.com/Rv27vnPr3C— ANI Digital (@ani_digital) August 3, 2024 వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కొండచరియలు విరిగిపడి సృష్టించిన విషాదం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేందుకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలని అన్నారు. 100 ఇళ్లులు నిర్మిస్తాం: కర్ణాటక సీఎంవయనాడ్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యఈ విషయం కేరళ సీఎం పినరయి విజయన్‌కు తెలిపినట్లు ఎక్స్‌లో పోస్ట్ In light of the tragic landslide in Wayanad, Karnataka stands in solidarity with Kerala. I have assured CM Shri @pinarayivijayan of our support and announced that Karnataka will construct 100 houses for the victims. Together, we will rebuild and restore hope.— Siddaramaiah (@siddaramaiah) August 3, 2024 కొండ చరియలు విరిగిపడటంతో గ్రామాల ఆనవాళ్లు లేకుండా పోయాయి. వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందల మంది బురద మట్టిలో కూరుకుపోయారు. విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు నేటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.సైన్యానికి సలాం వయనాడ్ విపత్తు నాటి నుంచి సహాయక చర్యల్లో భారత సైన్యం పోషిస్తున్న పాత్ర అమోఘం. తక్షణ వారధిల నిర్మాణం దగ్గరి నుంచి.. వరదల్లో చిక్కుకున్నవాళ్లను రక్షించడానికి దాకా.. అంతటా సాహసం ప్రదర్శిస్తోంది. తాజాగా.. ఓ కుటుంబాన్ని రక్షించడంపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. ‘‘వయనాడ్‌లో నెలకొన్న బీభత్సంలో అటవీ అధికారులు, రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రెస్క్యూ బృందం 8 గంటలపాటు శ్రమించి, ప్రాణాలకు తెగించి ఓ మారుమూల గిరిజన కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను కాపాడింది. ఈ విషాద సమయంలో సహాయక బృందాలు అందిస్తున్న తోడ్పాటు వారిలోని గొప్పతనాన్ని తెలియజేస్తోంది. మనం ఇలా ఐక్యంగా ఉంటూ ధైర్యంగా కష్టాలను ఎదుర్కొందాం.. పునర్నిర్మించుకుందాం’’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కల్పేట ఫారెస్ట్ ఆఫీసర్ కె.హాషిస్ నేతృత్వంలోని రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ గిరిజన కుటుంబాన్ని రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నా.. సహాయక బృందం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో ఉన్న లోయకు ఎదురుగా ఉన్న కొండపై ఓ గిరిజన కుటుంబం చిక్కుకొని ఉండడాన్ని బృందం గమనించింది. వారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాలుగున్నర గంటల పాటు శ్రమించి తాళ్ల సహాయంతో కొండపైకి చేరుకున్నారు. అక్కడ పనియా తెగకు చెందిన ఓ గిరిజన కుటుంబం గుహలో చిక్కుకొని ఉండగా వారిని రక్షించారు. కాగా వారు కొద్దిరోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు నీరసించి పోయి ఉన్నారని రెస్య్కూ అధికారి తెలిపారు. దీంతో తమ వద్ద ఉన్న ఆహారాన్ని వారికి తినిపించామన్నారు. తమతో రావాల్సిందిగా వారిని కోరగా ఆ కుటుంబం నిరాకరించిందని, సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఎంతో బతిమాలగా వారి తండ్రి ఒప్పుకున్నారని తెలిపారు. పిల్లలు ఇద్దరినీ తమ శరీరాలకు కట్టుకొని తాళ్ల సహాయంతో గిరిజన కుటుంబాన్ని కొండపై నుంచి సురక్షితంగా కిందకు తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అనంతరం వారిని అత్తమాల యాంటీపోచింగ్ కార్యాలయానికి తరలించినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం వారు అక్కడ సురక్షితంగా ఉన్నారన్నారు. రెస్క్యూ బృందం తమ ప్రాణాలకు తెగించి ఓ కుటుంబాన్ని కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. సహాయక బృందాన్ని కొనియాడారు. Kerala. pic.twitter.com/f4T4Lam45I— Comrade Mahabali (@mallucomrade) August 2, 2024 ముఖ్యమంత్రి పినరయ విజయన్, ఆయన భార్య టీ. కమలా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. లక్షా 33 వేల విరాళం ప్రకటించారు. ఆరు జోన్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్‌లో డీప్ సెర్చ్ రాడార్లను పంపాలని కేంద్రానికి కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో నార్తర్న్ కమాండ్ నుంచి ఒక జేవర్ రాడార్, ఢిల్లీ, తిరంగ మౌంటైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ నుంచి నాలుగు రీకో రాడార్లను ఇవాళ వయనాడ్‌కు ప్రత్యేక ఎయిర్‌ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించారు.వయనాడ్ ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు హీరో మోహన్‌లాల్ స్వయంగా ముందుకొచ్చారు. శనివారం ఆయన టెరిటోరియల్ ఆర్మీ బేస్ క్యాంపునకు చేరుకున్నారు. గతంలో ఆయనకు ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఇచ్చింది. టెరిటోరియల్ ఆర్మీలో కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్.. విపత్తు ప్రాంతాన్ని సందర్శించి సైనికులతో సమావేశమయ్యారు. వాళ్ల సేవల్ని కొనియాడారు. కోజికోడ్ నుంచి రోడ్ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అంతకు ముందు.. వయనాడ్ కొండచరియలు విరిగిన పడిన ప్రాంతాల్లో పునరావాసం కోసం రూ.3 కోట్లు విరాళం ఇచ్చారాయన. #WATCH | Actor and Honorary Lieutenant Colonel Mohanlal visited landslide-affected Punchiri Mattam village in Wayanad#Kerala pic.twitter.com/ckp2uAhyaE— ANI (@ANI) August 3, 2024 మలయాళ నటుడు మోహన్‌లాల్ వయనాడ్‌లోని కొండరియలు విరిగినపడిన ప్రాంతాన్ని సందర్శించారు. సహాయక, గాలింపు చర్యలు చేపట్టిన ఆర్మీ సైనికులతో పరిశీలించారు. ఆయనకు ఆర్మీ అధికారులు ప్రమాద తీవ్రతను వివరించారు. #WATCH | Kerala: Indian Army jawans construct a temporary bridge for the machinery to pass through, to facilitate search and rescue operation. Visuals from Punchirimattom, Wayanad. Search and rescue operation in landslide-affected areas in Wayanad, entered 5th day today. The… pic.twitter.com/FKrBiiI4qp— ANI (@ANI) August 3, 2024 ఇండియన్ ఆర్మీ జవాన్లు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగించే యంత్రాలు తీసుకువెళ్లడానికి తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఇంకా 300 మంది జాడ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.#WATCH | Kerala: Search and rescue operations in landslide-affected areas in Wayanad entered 5th day today. The death toll stands at 308.Drone visuals from Bailey Bridge, Chooralmala area of Wayanad. pic.twitter.com/OQ7GpKvwND— ANI (@ANI) August 3, 2024 దీంతో కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. అత్తమల అరాన్‌మల, ముండక్కై, పుంచిరిమట్టం, వెల్లరిమల, జీవీహెచ్ఎస్ఎస్ వెల్లరిమల, నదీతీరం ఇలా కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు.Wayanad landslides: Search operation enters Day 5, death toll at 308Read @ANI Story | https://t.co/94yPyDrseW#WayanadLandslides #Kerala #VeenaGeorge pic.twitter.com/c3PstYyb4z— ANI Digital (@ani_digital) August 3, 2024 -
ఓటీటీలో మలయాళ హిట్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
ఈ ఏడాదిలో మలయాళ చిత్ర పరిశ్రమ చాలా హిట్ సినిమాలతో కళకళలాడిపోతోంది. ఈ ఏడాదిలో వచ్చిన చాలా సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరాయి. చాలా సినిమాలు అక్కడి ప్రేక్షకులతో పాటు.. ఇతర భాషల సినీ ప్రేమికులనూ అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేమలు,మంజుమ్మెల్ బాయ్స్, భ్రమయుగం,ఆవేశం,ఆడుజీవితం ,అన్వేషిప్పిమ్ కండెతుమ్ వంటి చిత్రాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇవన్నీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.అయితే తాజాగా మరో హిట్ సినిమా తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలోకి రానుంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ నటించిన చిత్రం 'వర్షంగల్కు శేషం'. ఏప్రిల్ 11వ తేదీన రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ దక్కించుకుంది. సుమారు రెండేళ్ల క్రితం ప్రణవ్ మోహన్‌లాల్‌కు మొదటి హిట్ అందించిన డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ ఈ చిత్రం ద్వారా మరో విజయాన్ని అందుకున్నారు. జూన్ 7వ తేదీన సోనీ లివ్ ఓటీటీ వేదికగా 'వర్షంగల్కు శేషం' స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు తెలుగు ట్రైలర్‌ను కూడా సోని లివ్ విడుదల చేసింది.మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడలో విడుదల అవుతుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కేవలం రూ. 7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 80 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. 'వర్షంగల్కు శేషం' కథ మొత్తం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రధానంగా ఇద్దరు స్నేహితుల చుట్టూ జరిగే సంఘటనలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. వారిలో ఒకరు డైరెక్టర్ కావాలని ప్రయత్నిస్తే.. మరొకరు సంగీత దర్శకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఎక్కువగా ఎమోషనల్ సీన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా ఈ చిత్రం దగ్గరైంది. జూన్ 7 నుంచి సోనీ లివ్‌లో తెలుగులో అందుబాటులోకి రానున్న ఈ చిత్రాన్ని కుటుంబంతో పాటు చూసి ఎంజాయ్ చేయండి. -
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న మోహన్‌లాల్ ఇప్పటికే వందల చిత్రాల్లో నటించారు. తాజాగా మోహన్ లాల్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టడం విశేషం. స్టార్ నటుడిగా ఎదిగిన ఆయన తన అనుభవానంతా రంగరించి బరోస్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.బాలలను అలరించేలా ఫాంటసీ కథాంశంతో 3డీ ఫార్మెట్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్కోడిగామాకు చెందిన విలువైన వస్తువులను కాపాడే రక్షకుడు బరోస్ అనే వ్యక్తి ఇతివృత్తంగా ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతాన్ని అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరంలో నిర్వహించినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చిత్రాన్ని ఓనం పండుగ సందర్భంగా సెపె్టంబరు 12వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మోహన్‌లాల్ దర్శకత్వం వహిస్తున్న తొలి చిత్రం కావడంతో బరోస్ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో నటుడు గురు సోమసుందరం, నటి మీరాజాస్మిన్, ఆంథోని పెరంబావుర్, రబేల్ అమర్కో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, లిడియన్ సంగీతం అందిస్తున్నారు.#Barroz Releasing On September 12,2024 ( Onam Release)A Film By @Mohanlal 💥 pic.twitter.com/fJsh3OwDew— Akshay 𓃵 (@Akshayk_2255) May 6, 2024 -
అసలు ఆమెను ఎలా తీసుకున్నారు?.. బుల్లితెర నటిపై విమర్శలు
గతేడాది మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నేరు. మలయాళంలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ప్రియమణి లాయర్‌గా కనిపించారు. కోర్టు రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి హరిత జి నాయర్. మోహన్ లాల్ వద్ద జూనియర్ లాయర్ పాత్రలో మెప్పించింది. మొదట ఫాహద్ ఫాజిల్ నటించిన కార్బన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత రియాల్టీ షోలు, సీరియల్స్‌తో బిజీగా మారిపోయింది. హరిత నాయర్ ప్రస్తుతం శ్యామంబరం సీరియల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఆమె శ్యామాంబరం సీరియల్లో నల్లగా ఉండే అమ్మాయి పాత్రలో నటించింది. అయితే ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేయడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రలో అసలు హరితను ఎలా తీసుకున్నారంటూ నెటిజన్స్ విమర్శించారు. అయితే ఇలాంటి కామెంట్స్‌పై హరిత సైతం తనదైన శైలిలో స్పందించింది. క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ తెల్లగా ఉన్నారా? లేదా నల్లగా ఉన్నారా? అనేది ముఖ్యం కాదని హితవు పలికింది. కేవలం క్యారెక్టర్ యాక్టింగ్ ఎబిలిటీ మాత్రమే చూడాలని.. రంగును కాదని సూచించింది. తనపై వస్తున్న విమర్శలకు ఘాటుగానే బదులిచ్చింది బుల్లితెర భామ. కాగా.. మొదటి నర్సుగా కెరీర్ ప్రారంభించిన హరిత.. తక్కువ కాలంలోనే మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Zee Keralam (@zeekeralam) View this post on Instagram A post shared by Haritha.G Nair (@haritha.girigeeth) -
సూపర్ హిట్ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్!
మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్లో రీమేక్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్లో రీమేక్ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. ఈ చిత్రాన్ని మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి అంతర్జాతీయ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది. -
అఫీషియల్: ఓటీటీకి స్టార్ హీరో డిజాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటించిన తాజా చిత్రం మలైకోట్టై వాలిబన్. జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ తక్కువ వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి లిజో దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. రిలీజైన నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోను స్ట్రీమింగ్ చేయనున్నారు. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.25 కోట్లకు పైగా మాత్రమే వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రంలో మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. మోహన్ లాల్ కెరీర్లో మలయాళంలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే థియేటర్లలో ఈ మూవీ కేవలం మలయాళంలో మాత్రమే రిలీజైంది. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం ఓ ప్రాంత ప్రజలు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. An epic tale of a warrior overcoming every challenge thrown his way - Malaikottai Vaaliban streaming from 23rd Feb in Malayalam, Hindi, Tamil, Telugu and Kannada. https://t.co/zHnUR7TwM4 — Disney+ Hotstar (@DisneyPlusHS) February 19, 2024 -
స్టార్ హీరో లేటేస్ట్ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బిగ్ షాక్!
మలయాళ స్టార్ మోహన్‌లాల్ తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో కనిపించారు. అయితే ఇటీవల ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని షాకిచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వం వహించగా.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్గా నటించింది. దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద ఝలక్ ఇచ్చింది. కేవలం రూ.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. దీంతో మలయాళంలో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది మలైకోట్టై వాలిబన్. కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. -
'కన్నప్ప' విడుదల ఫిక్స్.. ఆ తేదీలో బిగ్‌ఫైట్
హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రానున్న చిత్రం 'కన్నప్ప'. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదలపై ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితమే న్యూజిలాండ్‌లో కీలకమైన ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొని చిత్ర యూనిట్ భారత్‌కు తిరిగొచ్చేసింది. దీంతో సినిమా విడుదల తేదీని టార్గెట్‌గా పెట్టుకుని ముందుకు వెళ్లాలని కన్నప్ప టీమ్ భావిస్తోందట. ఇందులో కీ రోల్లో నటిస్తున్న ప్రభాస్ కూడా అతి త్వరలో కన్నప్ప సెట్లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. కన్నప్ప చిత్రం షూటింగ్ విషయంలో వేగం పెరిగింది. అనుకున్న సమయంలోనే షెడ్యూల్స్ పూర్తి చేసి 2024లో చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ దసరా సమయంలో కన్నప్ప చిత్రాన్ని విడుదల చేస్తే ప్రేక్షకులకు మరింత రీచ్ అవుతుందని చిత్ర యూనిట్ అనుకుంటుందట. పాన్ ఇండియా రేంజ్లో విడుదల అవుతున్న కన్నప్ప కోసం అన్నీ భాషల్లోని స్టార్స్‌తో ప్రమోషన్స్ కార్యక్రామాలను కూడా సెట్ చేయాలనే ఆలోచనతో టీమ్ ఉందని టాక్. ఒకేరోజులో రామ్ చరణ్, తారక్ సినిమాలు ఈ దసరాకు జూనియర్ ఎన్టీఆర్ 'దేవర', రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్' చిత్రాలు కూడా విడుదల కానున్నాయని ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో 'కన్నప్ప' కూడా వస్తే సంక్రాంతి మాదిరి మళ్లీ థియేటర్స్ సమస్య రావచ్చనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఏప్రిల్ 5న 'దేవర' ప్రకటన ఉన్నప్పటికీ వాయిదా పడుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో దసరాకు తారక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ జరగడం ఖాయం అని చెప్పవచ్చు. కన్నప్పలో మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ ఇద్దరు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రభాస్, నయనతార పేర్లు ఇంకా ఫైనల్ కాలేదు. -
ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి మరో క్రేజీ బ్లాక్‌బస్టర్ వచ్చేసింది. 'సలార్'కి పోటీగా మలయాళంలో రిలీజైన ఈ మూవీ అద్భుతమైన హిట్‌గా నిలిచింది. కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్‌గా నిలిచిందనే టాక్ వినిపించింది. ఇకపోతే ఈ సినిమాని వెంకటేశ్ రీమేక్ చేస్తారనే వార్తలొచ్చాయి కానీ అలాంటిదేం లేకుండానే తెలుగు వెర్షన్ కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజైపోయింది. ఇంతకీ ఇదే సినిమా? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఆ కాంబో మళ్లీ మలయాళ ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ సినిమాలకు పెట్టింది పేరు. స్టార్ హీరోలు కూడా ఇమేజ్ చట్రంలో పడిపోకుండా అప్పుడప్పుడు స్టోరీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంటారు. అలా గతేడాది మోహన్‌లాల్ లాయర్ పాత్రలో 'నెరు' అనే సినిమా చేశారు. 'దృశ్యం' లాంటి థ్రిల్లర్ మూవీస్‌తోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో మనకు తెలిసిన ప్రియమణి కూడా ఓ లాయర్‌గా నటించడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) ఆ ఓటీటీలోనే ఇకపోతే మలయాళంలో మాత్రమే డిసెంబరు 21 ఈ సినిమా రిలీజైంది. నెలలోపే ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. సీరియస్‌గా సాగే కోర్టు రూమ్ డ్రామా చిత్రాలు ఇష్టపడితే మాత్రం దీన్ని అస్సలు మిస్సవొద్దు. 'నెరు' కథేంటి? కళ్లు కనిపించని ఓ అమ్మాయి.. మానభంగానికి గురవుతుంది. అయితే వ్యక్తిని గుర్తించలేనప్పటికీ.. మట్టితో అతడి పోలికలున్న ఓ బొమ్మని తయారు చేస్తుంది. దీనిబట్టి పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకుంటారు. ఆ తర్వాత కోర్టులో ఏం జరిగింది? బాధితురాలికి న్యాయం జరిగిందా? లేదా అనేది 'నెరు' స్టోరీ. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
అంతా శివోహం... అదిరిపోయిన 'కన్నప్ప' పోస్టర్
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటేడ్ చిత్రాల్లో 'కన్నప్ప' ఎప్పుడో చేరిపోయింది. మంచు విష్ణుకు 'కన్నప్ప' చిత్రం డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లోకి కథకు తగినట్లు దేశంలోని స్టార్ నటీనటులను మంచు విష్ణు ఎంపిక చేశారు. నేడు (నవంబర్ 23) మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా తాజాగా 'కన్నప్ప' చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఆయన షేర్ చేశారు. 'కన్నప్ప' పోస్టర్ చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని ఎవరైన కొనియాడాల్సిందే అనేలా రూపొందించారు. ఈ పోస్టర్లో మంచు విష్ణు కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో విష్ణు వేటగాడిలా గాల్లోకి ఎగురుతూ బాణాలు సందిస్తుంటే.. అతనివైపునకు మెరుపు వేగంతో కొన్ని వందల బాణాలు దూసుకొస్తున్నాయి. శివలింగం ఆకారంలో రెండు కొండల మధ్య ఆ జలపాతం చాలా బాగుంది. కన్నప్ప టైటిల్ ఆర్ట్‌కు కూడా మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఏదేమైన భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతన్న కన్నప్ప చిత్రం హిట్ కొట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. కన్నప్ప కోసం వివిధ పరిశ్రమలకి చెందిన సీనియర్ నటులు భాగం అవుతున్నారు. మలయాళం నుంచి మెహన్‌లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, కోలీవుడ్ నుంచి నయనతార, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్‌బాబు,శరత్‌కుమార్‌లు ఇందులో నటిస్తున్నారు. శివభక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. స్టార్ ప్లస్‌లో 'మహాభారతం' సిరీస్‌ని కూడా ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. Step into the world of 𝐊𝐚𝐧𝐧𝐚𝐩𝐩𝐚 where the journey of an atheist Warrior to becoming Lord Shiva’s ultimate devotee comes to life🏹@kannappamovie @24framesfactory @avaentofficial@ivishnumanchu @themohanbabu @Mohanlal @NimmaShivanna #Prabhas#Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/kRbebbZdbH — Vishnu Manchu (@iVishnuManchu) November 22, 2023 -
వృషభ రిలీజ్ డేట్ వచ్చేది అప్పుడే! ఆ సన్నివేశాలు హైలైట్!
మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జాతీయస్థాయి నటుడు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. తాజాగా ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం వృషభ: ది వారియర్స్ అరైస్. రోషన్ మేకా, షనాయా కపూర్, సహారా ఎస్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ తెలుగు ఫిలిమ్స్ ఏవీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై వరుణ్ మందుర్, సౌరవ్ మిశ్రా, ఏక్తా ఆర్ కపూర్, శోభాకపూర్, విశాల్ కుర్నానీ, జూసీ పరేక్ మేతా, అభిషేక్ వ్యాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమవగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్ర వివరాలను నిర్మాతలు తెలుపుతూ తండ్రి కొడుకుల మధ్య డ్రామా, ఎమోషన్, ప్రేమ, పగ, ప్రతీకారంతో కూడిన పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందన్నారు. చిత్రంలో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయన్నారు. ఇది 2024లో విడుదలయ్యే అత్యంత భారీ చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్ర విడుదల తేదీని నవరాత్రి సందర్భంగా వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా తమిళం, హిందీ తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చెప్పారు. చదవండి: మ్యాచ్ చూసేందుకు వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ -
పాన్ ఇండియాపై కన్నేసిన స్టార్ ప్రొడ్యూసర్
లైకా ప్రొడక్షన్స్ నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు ఇప్పటికే అడుగులు వేశారు. అతను రజనీకాంత్‌తో 2.0, విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 1 & 2 వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించారు. పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత, సుభాస్కరన్ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్ వంటి స్టార్లతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లను తెరకెక్కించేదుకు ప్లాన్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నుంచి త్వరలో వస్తున్న పాన్-ఇండియన్ సినిమా కమల్ హాసన్ ఇండియన్ 2. చిత్రీకరణ ఇప్పటికే దాదాపు పూర్తి అయింది. దీనికి ఎస్ శంకర్ డైరెక్ట్ చేశారు. మరోవైపు, రజనీకాంత్ నటించిన లాల్ సలామ్, తలైవర్ 170 కూడా అదే బ్యానర్ నుంచి వస్తున్నాయి. కోలీవుడ్‌లో భారీ విజయాలతో లైకా ప్రొడక్షన్స్‌కు మంచి గుర్తింపు ఉంది. దీంతో తాజాగా మాలీవుడ్‌లో తన ఫేట్‌ను పరీక్షించడానికి సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో ప్రభాస్ చెంపపై కొట్టిన యువతి.. వీడియో వైరల్) లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే లూసిఫర్-2 చిత్రాన్ని ప్రకటించింది. ఇందులో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. సుభాస్కరన్ త్వరలో బాలీవుడ్, టాలీవుడ్లో కూడా సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రణాళికలను కూడా ఆయన ప్రారంభించారట. మరో రెండు రోజుల్లో తెలుగు, హిందీ భాషల్లో కూడా సినిమాలు ప్రకటించే అవకాశం ఉంది. -
రజినీకాంత్ 'జైలర్'.. సగం బడ్జెట్ ఆయనకే ఇచ్చేశారుగా!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్ నటించిన చిత్రం జైలర్. ఆగస్టు 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి దాదాపు 225 కోట్ల రూపాయలతో రూపొందించిట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో నటీనటుల రెమ్యునరేషన్‌పై కూడా అంతేస్థాయిలో చర్చ నడుస్తోంది. రజినీకాంత్‌తో పాటు మోహన్ లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా పారితోషికంపై ఎంతన్న విషయమైన పెద్దఎత్తున కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. భారీ తారాగణం ఉండడంతో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి. (ఇది చదవండి: 'ఆలియా భట్ తండ్రి అసభ్య ప్రవర్తన'.. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఏమందంటే?) ఓ ప్రముఖ సంస్థ నివేదికల ప్రకారం.. రజనీకాంత్ తన పాత్ర కోసం రూ.110 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. సినిమా మొత్తం బడ్జెట్లో 48 శాతం పారితోషికమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇకపోతే మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ కూడా పెద్దమొత్తంలోనే తీసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్‌లాల్‌కు రూ.8 కోట్లు, శివరాజ్‌కుమార్‌కు రూ.4 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్‌కు రూ.4 కోట్లు, హీరోయిన్ తమన్నా భాటియాకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా నటించిన రమ్య కృష్ణ రూ. కోటి రూపాయలు చెల్లించినట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ కీలక పాత్రలో కనిపించారు. కాగా.. ఇప్పటికే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ చిత్రం రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. (ఇది చదవండి: జైలర్ మరో రికార్డ్.. సూపర్ హిట్ చిత్రాన్ని వెనక్కినెట్టి!) -
63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!
మోహన్ లాల్.. పేరుకే మలయాళ హీరో గానీ దక్షిణాది ప్రేక్షకులు అందరినీ తన సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్నాడు. తెలుగులోనూ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో నటించి మనవాళ్లకు బాగా దగ్గరైపోయాడు. ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరో వయసు ప్రస్తుతం 63 ఏళ్లు. అయితేనేం కుర్రాళ్లే భయపడిపోయేలా రిస్కులు చేస్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్లో!) మలయాళంలో స్టార్ హీరోగా బోలెడంత క్రేజ్ తెచ్చుకున్న మోహన్‌లాల్.. ప్రస్తుతం వాలిబన్, వృషభ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్'లోనూ ఓ పాత్ర చేశాడు. ఈ మూవీ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇలా మూవీస్ గురించి పక్కనబెడితే ప్రతిరోజూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ బాడీ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటుంటాడు. ఎప్పటికప్పుడు ఆ ఫొటోలు, వీడియోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం 100 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ మోహన్‌లాల్ కనిపించాడు. వేరే ఎవరో ఈ బరువు ఎత్తితే పెద్దగా మాట్లాడుకునేవాళ్లు కాదేమో. 63 ఏళ్ల వయసులో ఈ స్టార్ హీరో ఇలా చేయడంతో అందరూ షాకవుతున్నారు. ఓవైపు మెచ్చుకుంటూనే, మరోవైపు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) (ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?) -
'దృశ్యం 3' ఆ రెండు భాషల్లో ఒకేసారి.. నిజమెంత?
ప్రస్తుత జనరేషన్ కి థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి. థియేటర్, ఓటీటీ ఇలా ఎందులో దొరికితే అందులో తెగ చూసేస్తున్నారు. ఈ జానర్ లో 'దృశ్యం' ఫ్రాంచైజీ సరికొత్త బెంచ్ మార్క్స్ సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికే రెండు భాగాలు వచ్చాయి. ప్రేక్షకుల్ని ఓ రేంజులో ఎంటర్ టైన్ చేశాయి. ఇప్పుడు మూడో పార్ట్ గురించి క్రేజీ అప్డేట్ ఒకటి వైరల్ అవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'దృశ్యం'.. 2013లో థియేటర్లలోకి వచ్చింది. థ్రిల్లర్ జానర్ లో వండర్స్ క్రియేట్ చేసింది. దీన్నే తెలుగు, హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. తీసిన ప్రతిభాషలోనూ సూపర్ హిట్ అవడంతోపాటు అదిరిపోయే రేంజ్లో వసూళ్లు సాధించింది. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిటింగ్. (ఇదీ చదవండి: హీరోయిన్‌తో దృశ్యం 2 డైరెక్టర్ పెళ్లి.. పోస్ట్ వైరల్) తొలి రెండు పార్ట్స్ తీసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్.. మూడో భాగం కోసం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. మలయాళం, హిందీలో ఒకేసారి షూట్ చేయాలనుకున్నారని.. దీనివల్ల సినిమాలోని స్పాయిలర్స్ కి అస్సలు ఛాన్స్ ఉండదని ఆయన భావిస్తున్నట్లు ఓ వార్త బయటకొచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ వరకు చేరింది. దీంతో ఆయన దీనిపై స్పందించారు. 'బయట వినిపిస్తున్నవి ఏవి నిజం కాదు. దృశ్యం 3 పనులు ఇంకా మొదలుపెట్టలేదు. మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేస్తామనేది కూడా రూమర్ మాత్రమే' అని డైరెక్టర్ జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: 'బిచ్చగాడు 2' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. ఆ రోజు నుంచి స్ట్రీమింగ్) -
క్లైమాక్స్ ట్విస్ట్...!
-
కేరళ హైకోర్టులో మోహన్ లాల్‌కు చుక్కెదురు!
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్‌కు కోర్టులో చుక్కెదురైంది. కొంతకాలంగా ఆయనను ఏనుగు దంతాల కేసు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో పెరుంబవూరు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మోహన్ లాల్ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు తనపై వేసిన ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకోవాలన్న పిటిషన్‌ను కొట్టివేసిన పెరుంబవూరు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును కొట్టివేయాలని కోరుతూ నటుడు మోహన్‌లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. వివరాలు.. గతంలో ఐటీ శాఖ అధికారులు మోహన్ లాల్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ఏనుగు దంతాలను గుర్తించారు. దాంతో వన్యప్రాణుల చట్టం ప్రకారం మోహన్ లాల్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్రమంగా ఏనుగు దంతాలను ఇంట్లో అలంకరణకు పెట్టుకొని చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఆయనపై ఈ కేసు నమోదు చేశారు. అయితే తాను చట్టప్రకారమే అనుమతులు తీసుకుని ఏనుగు దంతాలను ఇంట్లో పెట్టుకున్నట్లు ఇప్పటికే మోహన్ లాల్ కోర్టుకు వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కేసులో తమ అభిప్రాయాన్ని వెల్లడిచింది. ఆయన చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఆయన ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలని చెప్పింది. ఆయన వాటిని చట్టప్రకారమే ఇంట్లో పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం విచారణలో వెల్లడించింది. అయితే ప్రభుత్వ వైఖరిని మేజిస్ట్రేట్ కోర్టు తప్పుబట్టింది. అదే ఓ సామన్యుడు ఏనుగు దంతాలను కోనుగులు చేసి ఉంటే అతడికీ ఇలాంటి మినహాయింపే ఇస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి వివరణ ఇవ్వాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టుకు వ్యతిరేకంగా మోహన్ లాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చదవండి: మరోసారి ఆ డైరెక్టర్‌కు అనుష్క గ్రీన్ సిగ్నల్? విశ్వనాథ్‌గారు నాపై అలిగారు, చాలా రోజులు మాట్లాడలేదు: జయసుధ -
జైసల్మేర్ టు మంగళూరు
మంగళూరుకు షిఫ్ట్ అయ్యారు జైలర్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొం దుతున్న సినిమా ‘జైలర్’. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, తమన్నా కీలకపా త్రలు పో షిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జరిగింది. ఈ షెడ్యూల్లో రజనీ, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్‌ల కాంబినేషన్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు ‘జైలర్’ షూటింగ్ మంగళూరులో జరుగుతోంది. రజనీ, శివరాజ్కుమార్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్‌ను చెన్నైలో ప్లా న్ చేశారట. -
పెళ్లిలో సందడి చేసిన సౌత్, బాలీవుడ్ హీరోలు
బాలీవుడ్ నటులు మరో పెళ్లి ఫంక్షన్లో సందడి చేశారు. ఇటీవల కియారా- అద్వానీ పెళ్లిలో బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్‌లో జరిగిన మరో వివాహా వేడుకలోనూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళ, మలయాళ, బాలీవుడ్ నటులంతా ఓకే వేదికపై మెరిశారు. రాజస్థాన్‌లో జరిగిన ప్రముఖ ఆసియానెట్ కె మాధవన్ కుమారుడి వివాహానికి కమల్ హాసన్,అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్, కరణ్ జోహార్ హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు దక్షిణాదితో పాటు బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సంప్రదాయ దుస్తులు ధరించిన స్టార్ హీరోలు సందడి చేశారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ కలిసి భాంగ్రా డ్యాన్స్ చేశారు. ఆ వీడియోనూ అక్షయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'మీతో చేసిన ఈ డ్యాన్స్‌ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. కె మాధవన్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా మేనేజింగ్ ప్రెసిడెంట్. రాజస్థాన్‌లో పలువురు ప్రముఖులు హాజరైన ఆయన పెద్ద కుమారుడి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. I’ll forever remember this dance with you @Mohanlal Sir. Absolutely memorable moment 😊🙏 pic.twitter.com/GzIwcBbQ5H — Akshay Kumar (@akshaykumar) February 10, 2023 -
చరణ్ - శంకర్ సినిమాలో మోహన్ లాల్
-
ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం మాన్స్టర్. మంచు లక్ష్మి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం అక్టోబర్ 21న విడుదలైంది. ఉదయ్ కృష్ణ కథ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకుంది మంచు లక్ష్మి. ఆమె మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను మంజు దుర్గ అనే పాత్రలో నటించాను. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు చెప్పిన క్యారెక్టర్ చెప్పినట్లు రూపొందిస్తారా లేదా అనే అనుమానం ఉండేది. ఎందుకంటే స్క్రిప్ట్ దశలో చెప్పిన క్యారెక్టర్ చివరకు సినిమాలో ఉండదు. లక్కీగా నా క్యారెక్టర్ వరకు ఎలాంటి సీన్స్ తీసేయలేదు. నేను చాలా ఎనర్జిటిక్‌గా సెట్స్‌కు వెళ్తే డల్‌గా ఉండాలి మీ క్యారెక్టర్ అని చెప్పేవారు. ఈ పాత్ర మూడ్ ను, లాంగ్వేజ్ ను అర్థం చేసుకునేందుకు కొంత టైమ్ పట్టింది. మలయాళంలో నటిస్తున్నప్పుడు భాషాపరంగా కొంత ఇబ్బందులు పడ్డాను. ఇలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నందుకు మోహన్‌లాల్‌కు హ్యాట్సాఫ్ చెప్పాలి. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఇలాంటి ఇలాంటి వివాదాస్పద సబ్జెక్ట్ మనకెందుకులే అనుకోకుండా ముందుకు వెళ్లారు. తెరపై ఎన్నో ప్రయోగాలు చేశారాయన. మీతో సంవత్సరానికి ఒక సినిమాలో అయినా నటించాలనుందని ఆయనతో చెప్పాను. నా దృష్టిలో ప్రేమకు లింగ, ప్రాంత, కుల, మత బేధాలు లేవు. ఎవరైనా ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ ఉండొచ్చు. ఫలానా వ్యక్తినే ప్రేమించాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ప్రస్తుతం నటిగానే కాకుండా టీవీ షోలు చేస్తున్నాను. ఇక్కడ నటించకుండా నాలా నేనుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నాపై ట్రోల్స్, మీమ్స్ లేవు.. కానీ వాటిని నేను ఎంజాయ్ చేస్తాను. ప్రస్తుతం లేచించి మహిళా లోకం, అగ్ని నక్షత్రం, గాంబ్లర్ సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో ముగినిపోయిన జంట విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే సింగర్ డేటింగ్ -
గాడ్‌ఫాదర్ హిట్.. కానీ ఆ చిత్రం కంటే వెనుకంజలో ఉందా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్‌ఫాదర్' థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్‌కు రీమేక్‌గా వచ్చిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈనెల 5న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌పై విడుదలైంది. మోహన్ రాజా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. మొదటి వారంలోనే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా రిలీజైన గాడ్ ఫాదర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల విషయంలో మాత్రం కాస్త వెనకబడినట్లే కనిపించింది. మలయాళంలో విడుదలైన లూసిఫర్‌తో పోల్చితే చాలా వ్యత్యాసం కనిపించింది. (చదవండి: గాడ్‌ఫాదర్ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే) కేవలం మలయాళంలో మాత్రమే విడుదలైన లూసిఫర్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.160 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అయితే మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ మూవీ అన్ని భాషల్లో చూసినా రూ.100 కోట్లు మాత్రమే దాటింది. అంటే లూసిఫర్‌తో పోలిస్తే కలెక్షన్ల పరంగా వెనుకంజలో ఉంది. గాడ్‌ఫాదర్ రిలీజైనప్పటి నుంచి మోహన్ లాల్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. దానికి కారణం సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న మెగాస్టార్ లూసిఫర్‌లో కొన్ని సీన్లు సరిచేస్తూ గాడ్ ఫాదర్ తీశామని మాట్లాడారు. అన్నట్లు గానే ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చినా కలెక్షన్లలో మాత్రం లూసిఫర్‌ను దాటలేకపోయింది. ఈ సినిమాలో సత్యదేవ్, స్టార్ హీరోయిన్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు. ఈ చిత్రాన్ని ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. -
మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం
స్టార్ హీరో మోహన్ లాల్‌కు గల్ఫ్ దేశాలు షాకిచ్చాయి. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మాన్స్టర్. మంచు లక్ష్మి కీ రోల్ పోషించిన ఈ మూవీ ఇటీవల అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ఆదిలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రంపై గల్ఫ్ దేశాల సన్సార్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో తమ దేశాల్లో మాన్స్టర్ను నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అయితే సినిమాలో లెస్బేనియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్జీబీటీక్యూ) కంటెంట్ ఉండడం వల్లే నిషేధం విధించినట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే దీంతో ఈ మూవీ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ సెన్సార్ బోర్డ్ ఫర్ ఈ ఎవాల్యుయేషన్కు సినిమా కాపీని అందించినట్టు తెలిసింది. ఒకవేళ బోర్డ్ నుంచి అనుమతి వస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదల అవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఈ వారం విడుదలయ్యే అవకాశాల్లేవని తెలుస్తోంది. ఈ సినిమాలో మోహన్ లాల్ లక్కీ సింగ్ పాత్రలో కనిపించనున్నారు. కథను ఉదయ్ కృష్ణ అందించగా, వ్యాసక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో లక్ష్మీ మంచు కూడా నటించింది. -
త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..?
ఒకే చిత్రంలో ఇద్దరు అగ్ర హీరోయిన్లు నటిస్తే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరే లెవల్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటి వార్త ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దక్షిణాదిలోనే అగ్ర కథానాయకిగా రాణిస్తున్న నటి నయనతార. లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్న ఈమె తాజాగా బాలీవుడ్‌లోకి రంగ ప్రవేశం చేశారు. షారూఖ్‌ఖాన్ జవాన్ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. అదే విధంగా తెలుగులో చిరంజీవి కథానాయకుడుగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో ఆయనకు సోదరిగా కీలకపాత్రను పోషించారు. ఈ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. కాగా ఈ లేడీ సూపర్‌స్టార్‌ను మరో స్టార్ హీరోయిన్ త్రిషతో కలిసి ఒక చిత్రంలో నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా నటించిన త్రిష మంచి ప్రశంసలను అందుకుంటున్నారు. 40 ఏళ్ల వయసు టచ్ చేస్తున్నా ఇప్పటికీ చెక్కుచెదరని అందాలతో అభిమానులను అలరిస్తున్న ఈమె ఇప్పటికీ కథానాయకిగానే నటిస్తున్నారు. కాగా తమిళ సినిమాలో అగ్ర కథానాయకిలుగా రాణిస్తున్న నయనతార, త్రిష ఇప్పటి వరకు ఒక చిత్రంలో కూడా కలిసి నటించలేదు. ఈ మధ్య అలాంటి సందర్భం వచ్చినా అది సెట్ కాలేదు. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రంలో నటి త్రిష కూడా నటించాల్సింది. అందుకు గాను త్రిషతో చర్చలు కూడా జరిగాయి. అయితే కొన్ని కారణాల వల్ల త్రిష ఆ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదు. ఆ తరువాత ఆ పాత్రలో సమంత నటించారు. కాగా ప్రస్తుతం త్రిష తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న రామ్ అనే చిత్రంలో మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తున్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెస్తున్నట్లు సమాచారం. కాగా ఇందులో మరో నాయకితో చర్చలు జరుగుతున్నట్లు టాక్. చిత్ర తొలి భాగం క్లైమాక్స్ సన్నివేశాలు నయనతార, త్రిష కలిసే సన్నివేశాలు చోటు చేసుకుంటాయని, రెండవ భాగంలో నయనతార పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని సమాచారం. అయితే ఇందులో నటించడానికి నయనతార అంగీకరిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. -
తెలుగు హీరోతో కలిసి నటించనున్న మోహన్‌లాల్
వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బాహుభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘వృషభ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకుడు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ చిత్ర కథనం ఉంటుంది. లవ్ అండ్ రివేంజ్ అంశాలు కూడా ఉంటాయట. ఈ మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో మోహన్‌లాల్ కొడుకు పాత్రలో ఓ తెలుగు హీరో నటిస్తారని టాక్. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. చదవండి: మేకోవర్ కోసం కష్టపడుతున్న భామలు.. దేనికైనా రెడీ -
ఓ కంక్లూజన్‌తో మోహన్ లాల్ 'దృశ్యం 3'.. ఆసక్తిగా ఫస్ట్ లుక్
Mohanlal Drishyam 3 First Look Poster Released: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రాలు దృశ్యం, దృశ్యం 2. మొదటగా వచ్చిన 'దృశ్యం' మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మాసీవ్ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో తెలుగు, తమిళంలో కూడా రీమేక్ కాగా అక్కడ కూడా మంచి విజయం సాధించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్, మీనా నటించిన విషయం తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్‌గా తెరకెక్కిన 'దృశ్యం 2' కూడా ఎంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్న కూతురును, కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ తండ్రి చేస్తున్న యుద్ధమే ఈ సిరీస్‌ల కథగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఈ సిరీస్‌లో మూడో చిత్రం రానుంది. ఈ రెండు పార్ట్‌లకు కొనసాగింపుగా 'దృశ్యం 3' రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'దృశ్యం 3: ది కంక్లూజన్' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో మోహన్ లాల్ సంకెళ్లతో ధీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా పోస్టర్‌పై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. కాగా మొదటి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన జీతూ జేసేఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. మరీ ఈ మూడో చిత్రంలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వేచి చూడాల్సేందే. అలాగే ఈ మూడో భాగంతో ఓ కంక్లూజన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. #Drishyam3 The Conclusion offical announcement soon#Mohanlal @Mohanlal pic.twitter.com/X8dVERlaTR — Shivani Singh (@lastshivani) August 13, 2022 #Drishyam3 George Kutty & Family are coming back! pic.twitter.com/VUoT6m0gLF — Christopher Kanagaraj (@Chrissuccess) August 13, 2022 -
11 మంది ఫ్రెండ్స్ సరదాగా ఆడిన ఆట ఒకరి ప్రాణం తీస్తే.. '12th మ్యాన్' రివ్యూ
టైటిల్: 12th మ్యాన్ (మలయాళం) నటీనటులు: మోహన్ లాల్, ఉన్ని ముకుందన్, అనుశ్రీ, అదితి రవి, రాహుల్ మాధవ్, లియోనా లిషాయ్ తదితరులు కథ: కెఆర్. కృష్ణ కుమార్ దర్శకుడు: జీతూ జోసేఫ్ సంగీతం: అనిల్ జాన్సన్ సినిమాటోగ్రఫీ: సతీష్ కురూప్ నిర్మాత: ఆంటోనీ పెరుంబవూరు విడుదల తేది: మే 20, 2022, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విలక్షణ నటుడు, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '12th మ్యాన్'. దృశ్యం, దృశ్యం 2 సినిమాల డైరెక్టర్ జీతూ జోసేఫ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-జీతూ జేసేఫ్ కాంబోలో ముచ్చటగా మూడోసారి వచ్చింది ఈ చిత్రం. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. అదేకాకుండా ఇదివరకు విడుదలైన సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచెలా ఉంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (మే 20) నేరుగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైన '12th మ్యాన్' (12th Man Movie) ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: 11 మంది స్నేహితులు తమ ఫ్రెండ్ సిద్ధార్థ్ (అను మోహన్) బ్యాచ్‌లర్ పార్టీకి వారి భార్యలతో కలిసి ఒక రిసార్ట్‌కు వెళ్తారు. ఈ 11 మందిలో ఇప్పుడు పెళ్లి చేసుకునే జంటతో (ఇద్దరు) పాటు నలుగురు దంపతులు (8 మంది), ఒక పెళ్లి అయి భర్తతో సెపరేట్ అయిన మహిళ ఉంటారు. వీరందరు కలిసి బ్యాచ్‌లర్ పార్టీ బాగా ఎంజాయ్ చేద్దామనుకుంటారు. పార్టీలో భాగంగా మొబైల్ ఫోన్స్‌తో ఒక గేమ్ ఆడతారు. ఆ గేమ్ కాస్తా వారిలోని రహస్యాలను బయటపెడుతుంది. దీంతో ఆ సముహాంలో ఒక అనుమానం, గందరగోళం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే ఆ 11 మందిలో మాథ్యూ (సైజు కురూప్) భార్య షైనీ (అనుశ్రీ) అనుమానస్పదంగా చనిపోతుంది. షైనీ ఎలా చనిపోయింది ? హత్యా ? ఆత్మహత్య ? వారికి ఎదురైన అనుమానం ఏంటీ ? ఆ 11 మందితో కలుస్తానన్న 12వ మనిషి చంద్రశేఖర్ (మోహన్ లాల్) ఎవరు ? అనేది తెలియాలంటే '12th మ్యాన్' మూవీ చూడాల్సిందే. విశ్లేషణ: ఇది ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. దృశ్యం సిరీస్‌తో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ జీతూ జోసేఫ్ మళ్లీ అదే తరహాలో ఈ సినిమాను తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్‌ను ఎలా సస్పెన్సింగ్‌గా చూపెట్టాలో బాగా తెలిసిన దర్శకుడు జీతూ. ఈ మూవీని ఆద్యంతం థ్రిల్లింగ్, సస్పెన్సింగ్‌గా చూపెట్టడంలో నూటికి నూరు శాతం విజయం సాధించారు. 11 మంది పాత్రల పరిచయంతో ప్రారంభమైన సినిమా తాగుబోతుగా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్‌తో ఆసక్తిగా మారుతుంది. బ్యాచ్‌లర్ పార్టీలో మొబైల్ ఫోన్స్ గేమ్ ఆడతారు. ఈ గేమ్‌లో బ్యాచ్‌లర్ పార్టీ ఇస్తున్న సిద్ధార్థ్‌కు వచ్చిన ఫోన్ కాల్‌తో తన రహస్యం ఒకటి బయటపడుతుంది. దీంతో ఆ ఫ్రెండ్స్ మధ్య ఒక గందరగోళం, అనుమానం ఏర్పడుతుంది. ఇంతలో వారి ఫ్రెండ్ భార్య షైనీ చనిపోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇక్కడ మోహన్ లాల్ గురించి ఒక విషయం రివీల్ అవుతుంది. అది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది తప్ప మూవీలో మరే ట్విస్ట్‌లు ఏం లేకపోయినా ఒక్కొక్కరు తమ హిడెన్ సీక్రెట్స్ (నిజాలను) బయటపెట్టడం ఆద్యంతం ఉత్కంఠంగా, ఆసక్తిరకంగా ఉంటుంది. సినిమా రన్ టైమ్ కొంచెం ఎక్కువగానే 2 గంటల 42 నిమిషాలు ఉంటుంది. షైనీది హత్య ? ఆత్మహత్య ? అనేది చివరి వరకు తేలేదాకా ఎంతో గ్రిప్పింగ్‌గా నారేట్ చేశారు. దృశ్యం, దృశ్యం 2 తరహాలో స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంది. సస్పెన్స్‌ను క్రియేట్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా కుదిరింది. ఎవరెలా చేశారంటే ? తాగుబోతుగా, మరొక రోల్లో మోహన్ లాల్ అదరగొట్టారు. ఆయన ఆక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేనేలేదు. మిగతా క్యారెక్టర్స్‌లో నటించిన వారంతా సెటిల్డ్ పెర్ఫామెన్స్ ఇచ్చారనే చెప్పవచ్చు. సినిమాకు కథ, కథనం పాత్రల నటన, బీజీఎం, సినిమాటోగ్రఫీ ప్రధాన బలం. సినిమా కథ అంతా ఒకే రోజు జరుగుతుంది. సినిమా ప్రారంభం నుంచే కథలో లీనమయ్యేలా తరెకెక్కించారు డైరెక్టర్ జీతూ. అప్పుడేల ఒక నిజం చెప్పడం.. అంతలోనే అది అబద్ధం అని తేలడం ఎంతో థ్రిల్లింగ్‌గా డైరెక్ట్ చేశారనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే 'దృశ్యం' సిరీస్‌లా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే '12th మ్యాన్' సినిమాను కచ్చితంగా ట్రై చేయాల్సిందే. -
మోహన్ లాల్‌కు ఈడీ నోటీసులు.. ఎందుకంటే ?
Mohanlal Questioned By Ed In Money Laundering Case With Monson Mavunkal: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు మోహన్ లాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మోహన్ లాల్‌కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్ ఇంటికి మోహన్ లాల్ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్ లాల్ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు. 'కేరళకు చెందిన మాన్సన్ మాన్కల్ కొన్నేళ్లుగా పురాతన కళాఖండాలు, అవశేషాలను సేకరించేవాడిగా నటిస్తూ వాటిని అమ్మి రూ. 10 కోట్ల వరకు మోసం చేశాడు. అతని దగ్గర టిప్పు సుల్తాన్ సింహాసనం, మోసెస్ సిబ్బంది, ఔరంగజేబు ఉంగరం, ఛత్రపతి శివాఝీ భగవద్గీత కాపీ, సెయింట్ ఆంటోనీ వేలిగోరు వంటి వస్తువులు ఉన్నాయని చెప్పాడం అబద్ధం.' అని కేరళ పోలీసులు తెలిపారు. కాగా కేరళలోని అలప్పుజా జిల్లాలో నకిలీ పురాతన వస్తువులు విక్రయిస్తున్నాడని 52 ఏళ్ల యూట్యూబర్‌ను కూడా కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4431454862.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ '12th మ్యాన్'.. నేరుగా ఓటీటీలోకి
12th Man: Jeethu Joseph Mohanlal Locked Thriller Trailer Released: క్రైమ్ థ్రిల్లర్ జానర్స్తో ప్రేక్షకులను కట్టిపడేసే చిత్రాలను తెరకెక్కించే మలయాళ దర్శకులలో జీతు జోసేఫ్ ముందుంటారు. ఆయన తెరకెక్కించిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంతటి హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన మరో క్రైమ్ థ్రిల్లర్‌ను రూపొందించారు. విలక్షణ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కింది '12th మ్యాన్' చిత్రం. (చదవండి: వావ్.. సినీ ప్రియులకు ఇక పండగే.. ఓటీటీలో ఏకంగా 40) ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మే 20 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటిస్తూ ట్రైలర్ విడుదల చేసింది. 11 మంది స్నేహితులు వెకేషన్‌కు వెళ్లినప్పుడు వారితో 12వ మనిషి కలుస్తాడు. ఆ 12వ మనిషి ఎవరు ? మిగతా 11 మందికి అతనికి ఉన్న సంబంధం ఏంటి ? అనే విషయాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే క్రైమ్‌తోపాటు, లాక్డ్ థ్రిల్లర్‌లా ఉంది. ఈ మూవీ కూడా దృశ్యం, దృశ్యం 2 సినిమాల్లానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన ఆహా, మేలో ఏకంగా 40+ మూవీస్! 12th Man Official Trailer Out Now!!! Watch Here👉 https://t.co/5oyPiQhpH3#12thMan streaming from May 20 on @DisneyPlusHS #12thManOnHotstar @Mohanlal @aashirvadcine @KurupSaiju @Iamunnimukundan @JeethuJosephDir @12thManMovie @sethusivanand @SshivadaOffcl @DisneyplusHSMal pic.twitter.com/tUxENWUIKz — DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) May 3, 2022 -
మోహన్ లాల్ ఉదారత.. ఆ విద్యార్థులకు 15 ఏళ్లపాటు ఉచిత విద్య
Mohan Lal Vintage Project Provide 20 Students 15 Years Free Education: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తూ ఉంటారు. సినిమాలతో అలరిస్తున్న ఈ కంప్లీట్ యాక్టర్ తన పెద్ద మనసుతో ఉదారత చాటుకున్నారు. ఏకంగా 20 మంది విద్యార్థులకు 15 ఏళ్ల పాటు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. గిరిజన తెగకు చెందిన 20 మంది స్టూడెంట్స్‌ను సెలెక్ట్ చేసుకుని 15 ఏళ్ల పాటు వారి చదువుకయ్యే ఖర్చులను భరించనున్నారు. ఈ విద్యకు అయ్యే ఖర్చును 'విశ్వశాంతి ఫౌండేషన్'కు చెందిన వింటేజ్ పతకం ద్వారా చెల్లించనున్నారు. అలాగే వారికి నచ్చిన కోర్సుల్లో చదివిస్తామని విశ్వశాంతి ఫౌండేషన్ ప్రకటించింది. మొదటి దశగా ఈ ఏడాది 20 మందిని ఎంపిక చేశామని మోహన్ లాల్ తెలిపారు. 'విశ్వశాంతి ఫౌండేషన్ చొరవతో 'వింటేజ్' ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రయత్నంలో మేము అట్టప్పాడికి చెందిన గిరిజన గ్రామాల్లో ఆరో తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులను స్పెషల్ క్యాంప్స్ ద్వారా సెలెక్ట్ చేశాం. వారి భవిష్యత్తును సురక్షితంగా ఉంచేందుకు వచ్చే 15 ఏళ్లు ఉత్తమ విద్య, వనరులు అందిస్తాం. ఈ ప్రాజెక్టులో మద్దతు ఇచ్చిన ఈవై గ్లోబల్ డెలివరీ సర్వీసెస్ కెరీర్స్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పిల్లలకు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సవినయంగా కోరుకుంటున్నాం.' అంటూ ఫేస్బుక్ పేజీలో మోహన్ లాల్ పేర్కొన్నారు. చదవండి: ఒకే ఫ్రేమ్‌లో మోహన్‌లాల్, మల్లిక.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ -
RC15: రామ్ చరణ్-శంకర్ ప్రాజెక్ట్‌కు నో చెప్పిన అగ్ర నటుడు
డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఇటివల సెట్స్‌పైకి వచ్చిన ఈ మూవీ 30 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. ఈ మూవీని RC15 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభించారు. ఇందులో చరణ్‌కు జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇదిలా ఉంటే RC15 సెట్స్‌పైకి వచ్చినప్పటి నుంచి ఈ మూవీకి సంబంధించి రోజుకో అప్డేట్ బయటకు వస్తోంది. చదవండి: వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్ తాజాగా మరో షాకింగ్ అప్డేట్ నెట్టంట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్ ప్రకారం RC15లో కీ రోల్ కోసం ఓ స్టార్ నటుడిని సంప్రదించగా ఆయన ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ నటుడు ఎవరో కాదు మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్. ఈ మూవీలో ప్రతికథానాయకుడి పాత్ర కోసం శంకర్ అండ్ టీం రీసెంట్గా ఆయనను సంప్రదించారట. ఈ పాత్ర కథ విన్న ఆయన శంకర్ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడని సినీవర్గాల నుంచి సమాచారం. చదవండి: బన్నీకి మెగాస్టార్ క్రేజీ విషెస్, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్ ఇందులో అవినీతికి పాల్పడే ఓ బడా రాజకీయ నాయకుడిగా విలన్ పాత్ర ఉండనుందని సమాచారం. ఈ రోల్ కోసమే ఆయనను అడగ్గా మోహన్ లాల్ ఈ పాత్రకు ఆసక్తి చూపలేదని ఫిలిం దూనియా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మూవీ టీం స్పందించే వరకు వేచి చూడాలి. కాగా ఇటీవల మోహన్ లాల్ నటించి బ్రో డాడీ చిత్రం ఓటీటీలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా RC15లో రామ్ చరణ్ ప్రభుత్వ అధికారిక కనిపించనున్న సంగతి తెలిసిందే. -
మరో రీమేక్‌పై మెగాస్టార్ కన్ను..మళ్లీ ఆ హీరో సినిమానే!
చిరంజీవి ఖాతాలో మరో మలయాళ రీమేక్ చేరనుందని టాక్. ఇప్పటికే చిరంజీవి మలయాళ ‘లూసిఫర్’ (2019)కి రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ చేస్తున్న విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో ‘లూసిఫర్’ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి పృథ్వీరాజ్ దర్శకుడు కూడా. ఇక మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కలిసి నటించిన మరో మలయాళ ఫిల్మ్ ‘బ్రో డాడీ’ (2022) తెలుగు రీమేక్‌లోనూ చిరంజీవి నటించనున్నారని సమాచారం. ‘బ్రో డాడీ’కి కూడా పృథ్వీరాజే దర్శకుడు కావడం విశేషం. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు వ్యూయర్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమా తెలుగులో రీమేక్ కానుందని, ఇందులో మోహన్‌లాల్ చేసిన పాత్రను తెలుగులో చిరంజీవి చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. రెండు సంపన్న కుటుంబాల మధ్య సాగే పంతాలు, పట్టింపుల నేపథ్యంలో ‘బ్రో డాడీ’ కథనం సాగుతుంది. ఇదిలా ఉంటే.. ‘గాడ్‌ఫాదర్’తో పాటు చిరంజీవి ప్రస్తుతం ‘బోళాశంకర్’ అనే చిత్రం చేస్తున్నారు. ఈ ‘బోళా శంకర్’ తమిళ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అని తెలిసిందే. మరి.. ‘బ్రో డాడీ’ రీమేక్‌కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? అసలు విషయం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
దృశ్యం సిరీస్ కాంబో రిపీట్.. నేరుగా ఓటీటీలో విడుదల ?
Mohanlal 12th Man Movie Will Release In OTT: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు. తాజాగా ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం '12th మ్యాన్'. మిస్టరీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు జీతూ జేసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. '12th మ్యాన్' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. త్వరలో ఈ విషయానికి సంబంధించిన ప్రకటనను అఫిషియల్‌గా అనౌన్స్ చేయనున్నారని ఆ వార్త సారాంశం. మార్చిలో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకూ వచ్చిన దృశ్యం, దృశ్యం 2 సినిమాలు ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబోలో మరో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. -
మహేష్ మూవీలో మోహన్ లాల్ ?
-
ఆస్కార్‌కు నామినేట్ అయిన జై భీమ్, మరక్కార్ చిత్రాలు
Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022: ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల రేసులో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం కాగా, మరోకటి మోహన్ లాల్ నటించిన 'మరక్కార్' చిత్రం. ఆస్కార్ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో రెండు ఇండియన్ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్ 'జై భీమ్' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రానికి టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇక మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి27న అమెరికాలో జరగనుంది. -
మరోసారి కలసి నటించిన మోహన్ లాల్ మీనా
-
హాట్ స్టార్ లో మోహన్ లాల్ సందడి
-
మోహన్ లాల్ కొత్త అవతారం.. గుండు, గుబురు గడ్డంతో అదిరిపోయిందిగా ఫస్ట్ లుక్
Mohan Lal Barroz Movie First Look Poster Released: ప్రముఖ నటుడు మోహన్ లాల్ తన విలక్షణ నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన మెగాఫోన్ పట్టుకొని దర్శకుడిగా మారారు. మోహన్‌లాల్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్న సినిమా 'బరోజ్'. ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మోహన్ లాల్. ఈ పోస్టర్లో మోహన్ లాల్ గుండు, గుబురు గడ్డం, మీసంతో బంగారు సింహాసనంపై దర్జాగా కూర్చున్నారు. మోహన్ లాల్ సరికొత్త లుక్ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ 'బరోజ్' అనే జీనీ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. మోహన్ లాల్ ఈ పోస్టర్‌ను ప్రకటిస్తూ 'మనముందు మరో సంవత్సరం ప్రకాశించనుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఏడాది మీకు అత్యంత విలువైన కాలంగా మారాలని ఆశిస్తున్నా. హ్యాపీ న్యూ ఇయర్. బరోజ్ ఫస్ట్ లుక్.' అని పోస్ట్ చేశాడు. ఈ బరోజ్ చిత్రం మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాను త్రీడీ విధానంలో చిత్రీకరిస్తున్నారు. ఇండియాలోనే మొదటి త్రీడీ చిత్రం మై డియర్ కుట్టిచాతన్కు దర్శకత్వం వహించిన జిజో పున్నూస్ కథను అందించారు. సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్ శివన్ చేయనున్నారు. వాస్కోడిగామా నిధిని కాపాడే జినీగా మోహన్ లాల్ నటిస్తున్నాడు. Here's a toast to another year that rises before us. Wishing all good fortunes and prosperity upon each one of you! May this year turn out to be one of the most treasured time frames of your life! #HappyNewYear #BarrozFirstLook pic.twitter.com/x3ZaawlMZ6 — Mohanlal (@Mohanlal) December 31, 2021 -
Keerthy Suresh: వెరైటీ చీరకట్టులో కీర్తిసురేష్ ఫోటోషూట్
Keerthy Suresh Latest Photo Shoot Goes Viral:ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా క్రేజ్ సందించుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడపుకున్న కీర్తి సురేష్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పడు తన లేటెస్ట్ అప్డేట్స్తో అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వెరైటీ చీరకట్టులో కీర్తి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే కీర్తి నటించిన మలయాళ చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’.నేడు(డిసెంబర్2)న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె తొలిసారిగా మోహన్‌లాల్‌తో కలిసి నటించింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. -
మోహన్ లాల్, మమ్ముట్టిలకు యూఏఈ అరుదైన గౌరవం
యుఏఈ గోల్డెన్ వీసాలకు మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్లు ఎంపికయ్యారు. యూఏఈ గోల్డెన్ వీసా ప్రకటించినట్లు స్వయంగా మోహలాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. యుఏఈ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటులకు గౌరవప్రదమైన గుర్తింపును ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సంజయ్ దత్‌లకు ఈ వీసాను ఇచ్చిన సంగతి తెలిసిందే. గోల్డెన్ వీసా, 2019 లో యుఏఈ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ వీసా ద్వారా అక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకోవచ్చు. అంతేగాక ఎలాంటి జాతీయ స్పాన్సర్స్ లేకుండానే 10 సంవత్సరాల పాటు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వీసా గడువు పూర్తి కాగానే ఆటోమెటిక్‌గా రెన్యూవల్ అవుతుంది. ఇప్పటికే ఈ వీసా మోహాన్ లాల్ అందుకోగానే త్వరలోనే మమ్ముట్టి యూఏఈలో తీసుకోనున్నారు. My grateful thanks to H E Mohamed Ali Al Shorafa Al Hammadi for bestowing upon me the Golden Visa for the UAE. Am indeed honoured. My gratitude also goes out to Mr @Yusuffali_MA for facilitating this.@AbuDhabiDED pic.twitter.com/Wo5Jd8AaJX — Mohanlal (@Mohanlal) August 23, 2021 -
‘మంచు’ వారి ఇంట్లో మోహన్‌లాల్ సందడి, ఫోటోలు వైరల్
డైలాగ్ కింగ్ మంచు మోహన్‌బాబుకు మలయాళ, తమిళ సీనియర్ నటులతో మంచి స్నేహం ఉంది. రజనీకాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి సీనియర్ హీరోలు ఇప్పటికి మోహన్‌బాబుతో టచ్‌లో ఉంటారు. షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే.. కచ్చితంగా మోహన్‌బాబుని కలిసి వెళ్తుంటారు. తాజాగా మలయాళీ ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. మంచువారి ఇంట్లో సందడి చేశాడు. మంచు కుటుంబంతో కలిసి మోహన్‌లాల్ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి. మోహన్‌లాల్ నటిస్తున్న ‘బ్రో డాడీ’మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఇందులో మోహన్ లాల్ సరసన మీనా నటిస్తోంది. వీరిద్దరినీ ఇటీవల మోహన్ బాబు తన ఇంటికి విందుకు ఆహ్వానించారు.మోహన్ బాబు సతీమణి నిర్మల, కుమార్తె మంచు లక్ష్మీ, కొడుకు కోడలు విష్ణు, విరోనికా వీళ్ళంతా కలసి మోహన్ లాల్ తో ఫోటోలు కూడా దిగారు. వీటిని మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
60 ఏళ్ల వయసులో నటుడి బాక్సింగ్ ప్రాక్టీస్
కథ నచ్చితే తన పాత్ర కోసం ఎంతైనా శ్రమిస్తారు మోహన్‌లాల్. తాజాగా ఆయనకు బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ స్క్రిప్ట్ ఒకటి నచ్చిందట. అంతే.. చేతికి గ్లౌజ్‌లు తొడిగి బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఈ ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇందులో మోహన్‌లాల్ బాక్సింగ్ ఛాంపియన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆరుపదుల వయసులో ఉన్నారు మోహన్‌లాల్. ఈ వయసులో ఓ స్పోర్ట్స్ ఫిల్మ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అది కూడా బాక్సింగ్ క్యారెక్టర్ చేయడానికి రెడీ కావడం అంటే గొప్ప విషయమే. -
‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్ సినిమాల్లో అత్యధిక రేటింగ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, మీనాలు లీడ్‌రోల్ వచ్చిన చిత్రం దృశ్యం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్ కాగా అక్కడ కూడా దృశ్యం సూపర్ హిట్ సాధించి బాక్సాఫీసుకు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో దర్శకుడు దీనికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అకర్షించింది. దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ మూవీని చూసి నివ్వెరబోయాడు. ఈ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్‌పై ఆయన ప్రశంసలు వర్షం కురిపించాడు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా ‘దృశ్యం 2’ రీమేక్ అవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి వార్తలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా దశ్యం అరుదైన రికార్టును సాధించింది. ఐఎండీబీ లెక్కల ప్రకారం ఈ ఏడాది అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా ‘దృశ్యం 2’ రికార్డు సృష్టించింది. అన్ని వయసు వర్గాల వారు, అంతర్జాతీయ ప్రేక్షకుల ఆధారంగా ఈ మూవీ అంత్యధిక గణాంకాలతో 8.8 రేటింగ్‌తో మిగతా చిత్రాలకంటే ముందంజలో ఉంది. కాగా ఈ చిత్రంలో మోహన్ లాల్, మీనా నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. -
ఆ సినిమాలో యువరాణిగా కీర్తి లుక్, ఫొటో వైరల్
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన మలయాళ తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించాడు. గతేడాది 2020 మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. 2022లో కూడా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో మరోసారి ఈ మూవీ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్ న్యూలుక్ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర కొనసాగనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తున్నట్లు ఉన్న తన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ యువరాణిగా కీర్తి అదిరిపోయిందంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరక్కల్ మూవీ విడుదలకు ముందే మూడు విభాగాల్లో(ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్) జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం. కాగా మరక్కర్.. ఓనమ్ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. -
Mohanlal: రైతుగా మారిపోయిన మలయాళ సూపర్ స్టార్
నటుడిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కానీ ఇప్పుడు అతడు నటనలో కాకుండా మరో పనిలో లీనమయ్యాడు. లాక్డౌన్లో తన ఇంటి వద్ద సేంద్రీయ పంటలు పండించాడు. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో ఆయన మొక్కలకు నీళ్లు పడుతూ, వాటి సంరక్షణ చూస్తూ రైతుగా మారిపోయాడు. సోరకాయలు, మిరపకాయలు, టమాటలు, వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు.. ఇలా చాలా రకాల కూరగాయలతో పాటు ఆకుకూరలను పండించినట్లు తెలుస్తోంది. వాటన్నింటినీ అతడే స్వహస్తాలతో తెంపుతుండటం విశేషం. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తన టీమ్‌తో కలిసి ఈ వీడియోను టీజర్ మాదిరిగా కట్ చేయించి రిలీజ్ చేశాడు మోహన్ లాల్. ఈ సందర్భంగా అందరూ బాల్కనీల్లో లేదా టెర్రస్ల మీద నచ్చిన కూరగాయలను పండించుకోవచ్చని సూచించాడు. View this post on Instagram A post shared by Mohanlal (@mohanlal) ఇదిలా వుంటే ఆయన నటించిన 'దృశ్యం 2' ఈ మధ్యే ఓటీటీలో విడుదలై అద్భుత స్పందన రాబట్టుకుంది. ఈ క్రమంలో 'ఆరాట్టు' అనే మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న 'మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ' చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 16వ శతాబ్దానికి చెందిన నేవల్ కమాండర్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చదవండి: మోహన్‌లాల్ కూతురిని ఆశీర్వదించిన బిగ్ బీ -
మరోసారి వెనక్కు తగ్గిన మోహన్‌లాల్
మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. 2020 మార్చి 26న విడుదలకు షెడ్యూల్ అయిన ఈ చిత్రం కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘మరక్కర్’ సినిమాను ఓనమ్ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మంగళవారం మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 16వ శతాబ్దానికి చెందిన నేవల్ కమాండర్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... తాజా జాతీయ అవార్డుల్లో ‘మరక్కర్’ సినిమా మూడు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్) అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. -
బిగ్‌బాస్: లైవ్‌లో రెమ్యూనరేషన్ బయట పెట్టిన కంటెస్టెంట్
ప్రస్తుతం మలయాళ బిగ్‌బాస్ షోలో మరింత ఆసక్తికరంగా మారింది. హౌజ్‌లోని కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు వివాస్పద వ్యాఖ్యలు చేసుకుంటు సన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక నిన్న ఆదివారం జరిగిన ఎపీసోడ్‌లో కంటెస్టెంట్స్ కంటెస్టెంట్స్ డింపుల్ భాల్, కిడిలమ్ ఫిరోజ్ మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశంగా మారింది. గత వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా హౌజ్‌లో ఫిరోజ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చివరకు అతడి తీరుపై హోస్ట్ మోహన్‌లాల్‌కు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టన్సీ టాస్క్‌లో డింపుల్ భాల్‌ను తొటి కంటెస్టెంట్ ఫిరోజ్ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అంగవైకల్యంతో బాధపడే స్పెషల్ చైల్డ్ అంటూ ఫీరోజ్ ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన వైకల్యాన్ని సాకుగా చూపి ఎమెషనల్‌గా అందరి సానుభూతి పొందాలని ఆమె చూస్తోందని, బిగ్‌బాస్ కూడా ఆమెకు తేలిక పాటి టాస్కులు ఇస్తున్నారంటూ ఫిరోజ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఫిరోజ్ తీరుపై హోస్ట్ మోహన్ లాల్ మండిపడ్డారు. హద్దు మీరి ప్రవర్తించావంటు అతడిపై ఫైర్ అయ్యారు. ఒకవేళ డింపుల్ అతడిని బయటకు పంపించాలనుకొంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ మోహన్ లాల్ పేర్కొన్నారు. దీంతో డింపుల్ మధ్యలో కలగచేసుకుని ‘అతడిని కొనసాగనివ్వండి. ఫీరోజ్‌ను క్షమిస్తున్నాను. నాకు మనశాంతి ముఖ్యం’ అంటూ వ్యాఖ్యానించింది. ఇంతలో మరో కంటెస్టెంట్ మణికుట్టన్ మధ్య కలగజేసుకుని ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. హోస్ట్ మోహన్‌లాల్‌తో మాట్లాడుతూ.. ఇంట్లోని పరిస్థితులు చూస్తుంటే తనకు ఆందోళనగా ఉందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. అయితే అలా కన్నీటీ పర్యంతరం అవుతూనే అతడు మధ్యలో నిబంధనలకు విరుద్ధంగా తన రెమ్యునరేషన్ బయటపెట్టడం అదరిని షాక్‌కు గురిచేసింది. బిగ్‌బాస్ ఇంటిలో ఒకరి జీవితంపై గానీ, వ్యక్తిగత అంశాలపై టార్గెట్ చేస్తే తానే బయటకు వెళ్లిపోతానని, ఒకవేళ తను మధ్య వెళ్లిపోతే తన 50 లక్షల రూపాయల కంటెస్టెంట్ రెమ్యునరేషన్‌ను తిరిగివ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. కావాలంటే తాను బయటకు వెళ్లి రూ. 50 లక్షల లోన్ తీసుకొని మరి నిర్వహకులకు జరిమానా చెల్లిస్తాను కానీ.. ఇంట్లో ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉండలేనంటూ మణికుట్టన్ చెప్పుకొచ్చాడు. దీంతో ప్రేక్షకులంతా డింపుల్-ఫిరోజ్‌ల వివాదం పక్కన పెట్టి మణికుట్టన్ రెమ్యునరేషన్ గురించే చర్చించుకుంటున్నారు. చదవండి: టాలీవుడ్లో విషాదం: కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి పవన్ కల్యాణ్ నాపై ఏకంగా కవిత్వం రాశారు: నటి -
మోహన్ లాల్ ఓ జిమ్‌లో కసరత్తులు....
-
మోహన్ లాల్ కసరత్తులు.. నెటిజన్లు ఫిదా
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా నటించిన చిత్రం దృశ్యం2 ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఆయన మరోసారి తన మార్క్ నటనతో ప్రేక్షకులు, విమర్శకుల మన్ననలు పొందారు. ఆయన ఎటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి సినిమాను మరో స్థాయికి తీసుకువెళతారు. 60 ఏళ్ల వయసులో ఉన్న ఆయన ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా ఆయన ఓ జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఎక్సర్సైజ్ చేస్తే శరీరంతో పాటు మానసికంగా చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాం’ అని కాప్షన్ జతచేశారు. ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ వయసులో కూడా మీరు జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ మాకు స్పూర్తిగా నిలుస్తున్నారు, సూపర్ సార్, మీరు నిజమైన సూపర్ స్టార్’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆయన ఇటీవల బెంగళూరులోని అమృత ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అంతేకాదు ఎలాంటి సందేహం లేకుండా అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగమైన కంపెనీలకు, భారత ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినిమాల విషయానికి వస్తే.. బరోజ్ సినిమాతో మోహన్‌లాల్ డైరక్టర్‌గా అవతారమెత్తారు. ప్రస్తుతం ఆయన బరోజ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: మోహన్‌లాల్ కూతురిని ఆశీర్వదించిన బిగ్ బీ -
తొలిడోసును తీసుకున్న మలయాళ సూపర్ స్టార్
బెంగళూరు: కోవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(60) బుధవారం ఉదయం బెంగళూరులోని అమృత ఆసుపత్రిలో తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్లో తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. టీకా తీసుకున్న చిత్రాలను షేర్ చేశారు. అంతేకాదు ఎలాంటి సందేహం లేకుండా అర్హులైన వారంతా టీకా తీసుకోవాలని కోరారు. ఈ సందర్బంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో భాగమైన కంపెనీలకు, భారత ప్రభుత్వానికి, వైద్య సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా మోహన్‌లాల్ తాజా చిత్రం దృశ్యం 2 గత నెలలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే .జార్జ్ కుట్టిగా నటించిన మోహన్ లాల్ నటనకు విమర్శకులు , ప్రేక్షకుల నుంచి మన్ననలను పొందారు. మరోవైపు బరోజ్ సినిమాతో మోహన్‌లాల్ డైరక్టర్‌గా అవతారమెత్తారు. ప్రస్తుతం ఆయన బరోజ్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ మొదటి వారంలో రిలీజ్‌కానుందని తెలుస్తోంది. Took the First Shot of Covid Vaccine from Amrita Hospital. I thank GOI ,companies which are producing the Vaccine & the Medical fraternity, including hospitals, for the assistance in d Vaccination Drive.@narendramodi @drharshvardhan @vijayanpinarayi #Shylajateacher @ICMRDELHI pic.twitter.com/bmkciwiTDQ — Mohanlal (@Mohanlal) March 10, 2021 -
మోహన్‌లాల్ కూతురిని ఆశీర్వదించిన బిగ్ బీ
నటుడిగా మోహన్‌లాల్ ప్రతిభ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది విస్మయ గురించి. మోహన్‌లాల్ కూతురైన విస్మయ థాయ్ మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన ప్రతిభ చూపించి ‘ఆహా!’ అనిపించింది. చక్కగా కవిత్వం రాస్తుంది. అంతే చక్కగా పెయింటింగ్స్ వేస్తుంది. తన కవిత్వం, బొమ్మలతో తాజాగా ‘గ్రేన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పేరుతో పుస్తకం తీసుకువచ్చింది. ఆమె సృజనాత్మక ప్రయాణం నిరంతరం కొనసాగాలని బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఆశీర్వదించారు. T 3823 - MohanLal , superstar pf Malayalam Cinema and one that I have immense admiration of , sends me a book, "Grains of Stardust", written & illustrated by his daughter Vismaya .. A most creative sensitive journey of poems and paintings .. Talent is hereditary ! My best wishes pic.twitter.com/KPmojUbxhk — Amitabh Bachchan (@SrBachchan) February 23, 2021 -
స్క్రీన్‌పై అలా నటించడానికి మీనా ఒప్పుకోలేదు
మోహన్‌లాల్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో వచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఇటీవలె ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ను తెరక్కించిన సంగతి తెలిసిందే. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. అయితే మోహన్‌లాల్‌కు జోడీగా నటించిన మీనాను మాత్రం నెటిజన్లు తెగ ట్రోల్స్ చేసేస్తున్నారు. ఈ చిత్రంలో మధ్య వయస్కురాలున్న గృహిణి పాత్రలో కనిపించిన మీనా.. అందుకు తగిన విధంగా లేదని, అతిగా మేకప్ వేసుకుందని విమర్శిస్తున్నారు. ఎమోషనల్,ఏడుపుగొట్టే సన్నివేశాల్లోనూ చెదరని జుట్టు, డార్క్ లిప్‌స్టిక్‌తో కనిపించిందని ఇది రియలిస్టిక్ లేదని పేర్కొంటున్నారు. అయితే నెటిజన్లు చేస్తున్న విమర్శలపై స్పందించిన దర్శకుడు జితూ..వారి అభిప్రాయాలతో తాను సైతం ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. డీ-గ్లామరస్ లుక్‌లో కనిపించేందుకు తాను సుముఖంగా లేనని, స్క్రీన్‌పై అలా నటించడం తనకి ఇష్టం లేదని మీనా చెప్పినట్లు పేర్కొన్నారు. దీంతో మీనా నిర్ణయంతో తాను ఏకీభవించాల్సి వచ్చిందని తెలిపారు. ఇక జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని, ఆల్రెడీ మూడో భాగం క్లైమాక్స్ రాసుకున్నానని డైరెక్టర్ జీతూ వెల్లడించారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. చదవండి : ఆ యాడ్స్‌లో ఉన్న చిన్నారి ‘బేబమ్మే’! టాలీవుడ్లో తీవ్ర విషాదం.. -
బిగ్‌బీకి మోహన్ లాల్ గిఫ్ట్.. తండ్రిగా గర్వించే సమయం
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఓ బహుమతిని పంపించారు. ఈ స్వయంగా బిగ్‌బీ ట్విటర్ వేదికగా ప్రకటించారు. కాగా ఇటీవల మోహన్ లాల్ కూతురు విస్మయ రాసిన ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ పుస్తకం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని మోహన్ లాల్ ఆయనకు పంపించారు. దీంతో బిగ్‌బీ ఆనందం వ్యక్తం చేస్తు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయన కూతురు విస్మయకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ మంగళవారం ట్వీట్ చేస్తూ.. ‘మోహన్ లాల్, సూపర్ స్టార్ ఆఫ్ మలయాళం. నేను ఎంతో అభిమానించే వ్యక్తి. ఆయన కూతురు విస్మయ రాసిన ‘గ్రెయిన్స్ ఆఫ్ స్టార్‌డస్ట్’ బుక్‌ను ఆయన నాకు పంపించారు. ఊహాజనితంగా రాసిన ఈ పుస్తకంలో, సృజనాత్మకతతో కూడిన కవితలు, పెయింటింగ్‌తో నిండి ఉంది. పూర్తి కవిత్వంతో ఉన్న ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది. అయినా ఈ ప్రతిభ వారసత్వంతోనే వస్తుంది. మై బెస్ట్ విషెస్ టూ విస్మయ’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక బిగ్‌బీ ట్వీట్‌కు మెహన్ లాల్ స్పందిస్తూ.. ‘ఓ తండ్రిగా ఇది గర్వించే సమయం. ఓ లెజెండరి సూపర్ స్టార్ నుంచి నా కూతురు ప్రశంసలు అందుకుందంటే సాధారణ విషయం కాదు. ఇదంతా ఓ మాయలా ఉంది. థ్యాంక్యూ బచ్చన్ సార్’ అంటూ సమాధానం ఇచ్చారు. కాగా ఆయన కూతురు విస్మయ రాసిన ఈ పుస్తకాన్ని పెంగిన్వి ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మోహన్ లాల్ ఫిబ్రవరి 14న విడుదల చేశారు. చదవండి : (‘భర్తడే’ బాష్ : మాల్దీవుల్లో హాట్ భామ) (రకుల్ సినిమా సెట్స్ మీద రాళ్లదాడి, పలువురికి గాయాలు) Words of appreciation coming from a legend is the best compliment and blessing Maya can get ! As for me this is the proudest moment as a father. Thank you @SrBachchan Sir. https://t.co/RdTtZmRGLr — Mohanlal (@Mohanlal) February 23, 2021 -
దృశ్యం 2: కుటుంబం గెలిచింది
శిక్ష అంటే ఏమిటి? నేరం చేసిన వారిని జైలులో బంధించి వారిని జీవితానికి దూరం చేసి బాధించడమేనా? న్యాయం అంటే ఏమిటి? తమకు జరిగిన అన్యాయానికి కొంతమందికి శిక్ష పడే వరకు వేటాడటమేనా? ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ గురించి వందల సంవత్సరాలుగా మనిషి తాత్త్వికత రకరకాలుగా ఉంది. తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అయితే ఆ శిక్ష మానసికమైనదా? భౌతికమైనదా? పశ్చాత్తాపంతో నిండినదా? ప్రాయశ్చిత్తం చేసుకునేదా? శిక్షను కోరుకునే చోట క్షమకు వీలు లేదా? శిక్ష–క్షమ సమానం కాదా? అయితే మనిషికి భావోద్వేగాలు ఉంటాయి. చట్టానికి ఉండవు. ∙∙ ‘నిజానికి ఆ ఇద్దరూ న్యాయం కోరుకుంటున్నారు. కాని ఇద్దరికీ న్యాయం చేయలేం’ అంటాడు ‘దృశ్యం2’లో ఒక పోలీసు ఉన్నతాధికారి. ‘మళ్లీ పోలీసులు ఎప్పుడొస్తారో అని ఆ కుటుంబం భయపడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అది శిక్ష కదా?’ అంటాడు మరో పోలీసు అధికారి. ఇది ఒక చిక్కుముడి కేసు. ప్రేక్షకులు కూడా న్యాయం చెప్పలేని కేసు. నిజానికి న్యాయం సాపేక్షమైనది. ఇటు నుంచి చూస్తే ఇటు న్యాయం అనిపిస్తుంది. అటు నుంచి చూస్తే అటు న్యాయమనిపిస్తుంది. ‘దృశ్యం’ సినిమాలో ఒక కుర్రాడి హత్య జరుగుతుంది. ఆ హత్యను చేసింది తల్లీకూతుళ్ల జంట. అతను తప్పు చేశాడు. ఆ తల్లీకూతుళ్లు బతిమిలాడారు. అతను వినలేదు. తకరారు జరిగింది. అనుకోకుండా అతడు చనిపోయాడు. అమాయకులైన తల్లీకూతుళ్లు అతని వల్ల పెద్ద విపత్తులో పడ్డారు. ఆ విపత్తు నుంచి కాపాడుకోవడంలో భాగంగా అతను చనిపోయాడు. క్రైమ్ అండ్ పనిష్మెంట్ జరిగిపోయింది. కాని చట్టం దానిని క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనుకోదు. పనిష్ చేయాల్సింది తల్లికూతుళ్లను అని భావిస్తుంది తన నియమాల ప్రకారం. ఆ కుర్రాడి తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తారు చట్టం నుంచి. అయితే ఆ చట్టానికి ఆ తల్లికూతుళ్లకు మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఆ ఇంటి యజమాని. కుటుంబ పెద్ద. అతనికి కుటుంబం ముఖ్యం. తన ఇంటి ఆడవాళ్లు జైలుకు వెళ్లకుండా చూసుకోవడం అతడి విధి. అంటే అతడు శిక్షను నిరాకరిస్తున్నాడు. తన కుటుంబానికి శిక్ష పడటం న్యాయ సమ్మతం కాదనుకుంటున్నాడు. అక్కడి నుంచే గేమ్ మొదలవుతుంది. ‘దృశ్యం’ రిలీజ్ అయ్యింది. అనేక భాషల్లో రీమేక్ అయ్యింది. ‘దృశ్యం’ ఒరిజినల్లో చేసిన మోహన్‌లాల్ తన కుటుంబాన్ని తెలివితో కాపాడుకున్నాడు. ఆ సినిమాలో హత్యకు గురైన కుర్రాడి డెడ్‌బాడీ దొరకదు. శవం లేకపోతే నేరం నిరూపణ కాదు. కనుక శిక్ష లేదు. కనుక వారు శిక్ష నుంచి బయటపడతారు. కథ ముగిసింది అనుకుంటాం. కాని నిజంగా ముగిసిందా? పోలీసులు నిజంగానే కేసు మూసేస్తారా? ఏం మూసేయరు. వాళ్లు ఆ కేసును పట్టుకునే ఉంటారు. ఆ కేసును ఛేదించాలనే చూస్తుంటారు. మోహన్‌లాల్ కుటుంబానికి శిక్ష పడేలా చేయడం వారి విధి. కాని నిజంగానే మోహన్‌లాల్ కుటుంబం శిక్ష పొందడం లేదా? వారు శిక్షను అనుభవిస్తున్నారు. కాకపోతే శిక్షగా అందరూ భావించే జైలులో కాదు. తమ జీవనంలో. పోలీసులు ఎప్పుడొస్తారో అని భయం. పెద్ద కూతురికి పీడకలలు. చిన్నకూతురికి ఆందోళన. ఇంటి యజమానికి ఎప్పుడూ పోలీసుల మీద నిఘా. ఆ డెడ్‌బాడీని ఎక్కడ దాచాడో అతడికి మాత్రమే తెలుసు. కాని ఆ బాడీ బయటపడితే? కేసు మొదటికొస్తే? అందరం జైలుకెళ్లాల్సిందే. ఆ మనోవేదనను ఆ కుటుంబం అనుభవిస్తూనే ఉంది. మరోవైపు ఆ చనిపోయిన కుర్రాడి తల్లిదండ్రులు ‘మా అబ్బాయి అస్తికలైనా ఇవ్వు. కర్మకాండలు జరుపుకుంటాం’ అని సెంటిమెంటల్‌గా అడుగుతూ ఉంటే అదొక వేదన. ఇదంతా శిక్ష కాదా? కాదు అంటుంది చట్టం. వారిని జైలులో వేసి బంధిస్తేనే అది శిక్ష అంటుంది. అలాంటి శిక్షకు ఆ ఇంటి పెద్ద సమ్మతంగా లేడు. ‘దృశ్యం 2’ తాజాగా మలయాళ భాషలో అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ‘దృశ్యం’కు సీక్వెల్ ఇది. అదే తారాగణం. అదే నేపథ్యం. అదే కొనసాగింది. తల్లీకూతుళ్లు కుర్రాణ్ణి హత్య చేసిన ఆరేళ్ల తర్వాత నుంచి కథ మొదలవుతుంది. ఆరేళ్ల తర్వాత ఆ కేసు గురించి మళ్లీ విచారణ మొదలవుతుంది. ఆ సమయానికి ఆ ఇంటి వాళ్లు కొంచెం ఆర్థికంగా బాగుపడి ఉన్నారు. పెద్దమ్మాయి పెళ్లికి రెడీ అయి ఉంది. రెండో అమ్మాయి కాలేజీకి వచ్చింది. కాని వారు మనశ్శాంతితో మాత్రం లేరు. ఊరు జరిగిన హత్యను మరిచిపోలేదు. పుకార్లను మానలేదు. ఆ కుర్రాడు కూతురి కోసం వచ్చాడని ఒకరంటే తల్లి కోసం వచ్చాడని ఒకరంటుంటారు. జనానికి కూడా వీళ్లిలా హాయిగా తిరిగడం నచ్చదు. బాధల్లో ఉండాలి. మరోవైపు పోలీసుల డేగ కళ్లు. ఏదో ఒక రోజు ఆ పోలీసులు శవాన్ని కనిపెడితే ఆ కుటుంబం పని సఫా అయిపోతుంది. కాని అలా సఫా కాకుండా ఉండటానికి ఆ కుటుంబ యజమాని అయిన మోహన్‌లాల్ సకల సరంజామాతో సిద్ధంగా ఉన్నాడని సినిమా చూశాక తెలుస్తుంది. దృశ్యంలో కుటుంబం గెలిచింది. దృశ్యం 2లో కూడా కుటుంబమే గెలిచింది. చట్టం వారికి శిక్ష వేయలేకపోయింది. కానీ వారు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. క్రూరమృగం అనుకుని పొదల్లో ఉన్న రుషిని చంపి శిక్ష అనుభవించిన వారు ఉన్నారు. జంట పక్షులలో ఒకదానిని చంపి ప్రాయశ్చిత్తం గా రుషిగా మారినవారూ ఉన్నారు. నేరం జరగడం, చేయడం మనిషి జీవనంలో అనూహ్యం గా ఉంది. పథకం ప్రకారమూ ఉంది. కాని ఒక్కసారి నేరం జరిగిపోయాక ఇరు పక్షాలు వల్లె వేసే ‘క్షమ’–‘శిక్ష’ అనే మాటలు విస్తారమైన చర్చకు పాత్రమవుతుంటాయి. క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న భార్య, అందుకు కారకుడేమోనని భర్తకు శిక్ష వేయించాలని చూసే పెద్దలు, పిల్లల కోసం తనకు శిక్ష పడకూడదని భావించే తండ్రి... ఎవరివైపు నుంచి చూస్తే వారిది ‘సరైన వాదనే’ అనిపిస్తూ ఉంటుంది. ఇటీవల రాహుల్ గాంధీ ‘నా తండ్రిని చంపిన వారిపై నాకు కోపం లేదు’ అన్నాడు. అది భావోద్వేగం. కాని చట్టానికి విధి ఉంటుంది. ఈ భావోద్వేగాలు, చట్టం కర్తవ్యాలు ఎప్పటికీ ఉంటాయి. నడుమ వాటిని చర్చకు పెట్టే ‘దృశ్యం’ వంటి సినిమాలు నాలుగు డబ్బులు చేసుకుంటూ ఉంటాయి. దర్శకుడు జీతూ జోసెఫ్‌కు తిండికి ఢోకా లేదు. డైరెక్టర్ రేపెప్పుడైనా ఫెయిల్ అయినా డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకొని బతికేయవచ్చు. అంత పకడ్బందీగా ఉందీ సినిమా. తెలుగు రీమేక్ కోసం ఎదురు చూడండి. దర్శకుడు జీతూ జోసెఫ్ – సాక్షి ఫ్యామిలీ -
"దృశ్యం 2" రీమేక్ షురూ
‘దృశ్యం’ సీక్వెల్ ‘దృశ్యం 2’ చిత్రానికి సిద్ధం అయ్యారు వెంకటేశ్. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ (2013). ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. మలయాళ ‘దృశ్యం’ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు వెంకటేశ్. సీక్వెల్లో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అది నిజమే. మలయాళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. -
దృశ్యం సీక్వెల్‌కి సై అన్న విక్టరీ
మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేశారు. తాజాగా మోహన్ లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా శుక్ర వారం నేరుగా అమేజాన్‌లో విడుదలయింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా తెలుగులో రీమేక్ కానుందని సమాచారం. మొదటి భాగంలో నటించిన వెంకటేశ్ ఈ సీక్వెల్లోనూ చేసేందుకు పచ్చజెండా ఊపారట. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారట.